మరికొన్ని గంటల్లో 'పుష్ప 2' సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. హైప్ అయితే గట్టిగానే ఉంది. మరోవైపు టికెట్ రేట్ల గురించి కాస్తంత విమర్శలు వచ్చాయి గానీ ఆ ప్రభావం, బుకింగ్స్‌పై మాత్రం కనిపించట్లేదు. తొలి భాగం తీసేటప్పుడు ఓ తెలుగు సినిమాగానే రిలీజ్ చేశారు. కానీ తర్వాత తర్వాత నార్త్‌లోనూ దుమ్మురేపింది. దీంతో అంచనాలు, బడ్జెట్, మూవీ స్కేల్ అమాంతం పెరిగిపోయాయి. దీనికి తోడు నటీనటులు పారితోషికాలు కూడా గట్టిగానే ఉన్నాయండోయ్. ఇంతకీ ఎవరెవరు ఎంత తీసుకున్నారు?
'పుష్ప' తొలి పార్ట్ రిలీజ్ ముందు వరకు బన్నీ అంటే తెలుగు రాష్ట్రాలు, మహా అయితే కేరళ వరకు తెలుసేమో! కానీ ఇది సృష్టించిన ప్రభంజనం దెబ్బకు ఉత్తరాదిలోనూ బన్నీ పేరు గట్టిగానే వినిపించింది. ఆ తర్వాత 'పుష్ప' మూవీకిగానూ జాతీయ అవార్డ్.. ఇలా రేంజ్ పెరుగుతూనే పోయింది. దీంతో సీక్వెల్ విషయంలో రెమ్యునరేషన్ బదులు లాభాల్లో షేర్ తీసుకోవాలని బన్నీ నిర్ణయం తీసుకున్నాడు. కట్ చేస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లు దాటేసింది. అలా రూ.270-80 కోట్ల మొత్తం బన్నీ పారితోషికంగా అందుకున్నాడట.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్ 'ప్లానెట్ స్టార్'.. ఆర్జీవీ ట్వీట్ వైరల్)
బన్నీ తర్వాత డైరెక్టర్ సుకుమార్‌ది హయ్యస్ట్. తొలి పార్ట్ కోసం కేవలం దర్శకుడిగా పనిచేసిన ఇతడు.. సీక్వెల్‌కి వచ్చేసరికి తన సుకుమార్ రైటింగ్స్ సంస్థతో నిర్మాణంలోనూ భాగమయ్యాడు. అలా డైరెక్టర్ కమ్ నిర్మాతగా రూ.100 కోట్ల పైనే రెమ్యునరేషన్ అందుకున్నాడని తెలుస్తోంది. మిగిలిన నటీనటుల విషయానికొస్తే హీరోయిన్ రష్మికకు రూ.10 కోట్లు, ఫహాద్ ఫాజిల్‌కి రూ.8 కోట్లు, ఐటమ్ సాంగ్ చేసిన శ్రీలీలకు రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారట. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కి రూ.5 కోట్లు పైనే పారితోషికం ఇచ్చారట.
వీళ్లు కాకుండా సినిమాలోని ఇతర కీలక పాత్రలు చేసిన జగపతిబాబు, రావు రమేశ్, సునీల్, అనసూయ, అజయ్ తదితరులకు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ లెక్కన చూసుకుంటే రూ.600 కోట్ల మేర మూవీకి బడ్జెట్ అయిందని అంటున్నారు. కానీ ఇందులో సగం బడ్జెట్, పారితోషికాలకే సరిపోయాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే అంతమంది స్టార్స్ పనిచేశారు మరి!
(ఇదీ చదవండి: 'పుష్ప 2'పై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment