అదరగొట్టిన కమల్‌ హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్ ఫాజిల్‌.. | Vikram Trailer: Kamal Haasan Vijay Sethupathi Fahadh Faasil Gripping Action | Sakshi
Sakshi News home page

Vikram Trailer Out: ఒకరి విప్లవం మరొకరికి ఉగ్రవాదం.. అదిరిన 'విక్రమ్‌' ట్రైలర్‌

Published Sun, May 15 2022 9:05 PM | Last Updated on Sun, May 15 2022 9:08 PM

Vikram Trailer: Kamal Haasan Vijay Sethupathi Fahadh Faasil Gripping Action - Sakshi

Vikram Trailer: Kamal Haasan Vijay Sethupathi Fahadh Faasil Gripping Action: లోక నాయకుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్న తాజా చిత్రం విక్రమ్‌. లోకేష్‌ కనగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమల్‌ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో కమల్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం (మే 15) ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు అప్‌డేట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్‌డేట్‌ ప్రకారం ఆదివారం సాయంత్రం 'విక్రమ్' ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. 

కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్‌, విజయ్ సేతుపతి లుక్స్‌, యాక్టింగ్‌ కన్నుల పండుగగా ఉంది. ఎవరికీ వారి ప్రత్యేక నటనతో అదరగొట్టారు. యాక్షన్‌ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ హైలెట్‌గా నిలిచింది. ఖైదీ, మాస్టర్‌ సినిమాల డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజు దర్శకత్వం వహించడం, ముగ్గురు విలక్షణ నటులు కలిసి నటించడంతో ఇదివరకే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తుంటే ఆ అంచనాలు మరింత పెరిగేలా ఉన్నాయి. ఇదేకాకుండా ఈ సినిమాలో సూర్య అతిథిగా కనిపిస్తారని సమాచారం. ఇదే నిజమైతే సినీ ప్రియులకు మంచి విందు దొరికినట్టే. 

చదవండి: కమల్‌ హాసన్‌ నుంచి అది నేర్చుకున్నా: సాయిపల్లవి
కమల్ హాసన్ విలన్‌గా రజినీకాంత్‌ హీరోగా రాజమౌళి చిత్రం..?


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement