Actor Fahadh Faasil Shares Crazy Update About Allu Arjun Pushpa 2 Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Pushpa 2: The Rule: 'పుష్ప-2లో నా పాత్ర వేరే లెవెల్'.. క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన నటుడు!

Published Sun, Jul 2 2023 9:36 PM | Last Updated on Mon, Jul 3 2023 11:47 AM

Pushpa 2 Actor Fahadh Faasil Shares Crazy Update about Movie - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రం కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా ఉన్ బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రమిది. పుష్ప పార్ట్-1 బ్లాక్ బస్టర్‌గా  కావడంతో ఈ మూవీపై సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎర్రచందన స్మగ్లింగ్ నేపథ్యంతో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఎస్పీగా భన్వ‌ర్‌ సింగ్ షెకావ‌త్‌గా కనిపించిన ఫహాద్ ఫాజిల్ నటన మరింత ఆసక్తిగా ఉండనుందని తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ను ఫహాద్ అభిమానులతో పంచుకున్నారు. 

(ఇది చదవండి: 'మన జీవితంలో అప్పుడే మధురమైన క్షణాలు'.. కల్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్!)

ఫహాద్ మాట్లాడుతూ..' పుష్ప-2 లో నా పాత్ర పార్ట్-1 కంటే  కాస్తా ఎక్కువగానే ఉంటుంది. హీరోకు, నాకు మధ్య చాలా యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయి. పార్ట్‌ -2లో మొత్తం ఎక్కువగా ఫైట్స్ ఉండనున్నాయి.' అని అన్నారు. ఇది విన్న బన్నీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సీక్వెల్‌లో భన్వ‌ర్‌ సింగ్ షెకావ‌త్‌ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయినట్లు సమాచారం. కాగా..పుష్ప-2లో టాలీవుడ్ నటుడు జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పుష్ప-2లో కూడా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బన్నీ సరసన నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. 

(ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement