ఫహద్‌ ఫాజిల్‌, నజ్రియాల ట్రాన్స్‌ తమిళ్‌ ట్రైలర్‌ రిలీజ్‌ | Fahadh Faasil, Nazriya Nilai Marandhavan Trailer Launch Event In Chennai | Sakshi
Sakshi News home page

Fahadh Faasil - Nazriya: మలయాళ స్టార్‌ దంపతులు హీరోహీరోయిన్లుగా, డైరెక్టర్‌ విలన్‌గా 'నిలై మరందవన్‌'

Published Mon, Apr 18 2022 12:02 PM | Last Updated on Mon, Apr 18 2022 12:07 PM

Fahadh Faasil, Nazriya Nilai Marandhavan Trailer Launch Event In Chennai - Sakshi

సబ్బుల యాడ్‌ తరహాలో కొందరు మతాన్ని ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత హెచ్‌.రాజా అన్నారు. ఫహద్‌ ఫాజిల్, ఆయన భార్య నజ్రియా జంటగా నటించిన మళయాళ చిత్రం ట్రాన్స్‌. దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ విలన్‌గా నటించిన ఈ చిత్రాన్ని అన్వర్‌ రషీద్‌ తెరకెక్కించారు. అక్కడ మంచి విజయాన్ని సాధించిన దీన్ని ధర్మ విజువల్‌ క్రియేషన్స్‌ సంస్థ అధినేత తమిళంలో నిలై మరందవన్‌ అనే పేరుతో అనువదిస్తున్నారు.

త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చెన్నైలో నిర్వహించారు. ఇందులో బీజేపీ నాయకుడు హెచ్‌.రాజా, కల్యాణరామన్, అశ్వథ్థామన్, హిందూ మక్కల్‌ కట్చి అధ్యక్షుడు అర్జున్‌ సంపత్‌ తదితరు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్‌.రాజా మాట్లాడుతూ తమిళ ప్రజలను ఒక స్థాయికి తీసుకురావడానికే ఈ చిత్రాన్ని నిర్మించినట్లు భావించవచ్చునన్నారు. వివేకానంద చెప్పినట్లుగా మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తూనే ఉండాలనే పరిస్థితి నెలకొందన్నారు.

చదవండి: హీరోల కోసమే వందల కోట్లు ఖర్చు, అందుకే తమిళ సినిమా నశిస్తోందంటూ నిర్మాత ఆవేదన

కేజీఎఫ్‌ 2 దూకుడుకు దద్దరిల్లుతున్న బాక్సాఫీస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement