కట్టప్పతో స్టార్‌ హీరో.. ఈ మధ్యే రూ.150 కోట్ల హిట్‌ మూవీతో..! | Viral: Hero childhood pic with Sathyaraj from the 1980s | Sakshi
Sakshi News home page

వైరల్‌ ఫోటో: కట్టప్పతో ఉన్న ఈ హీరోను గుర్తుపట్టారా?

Published Wed, May 8 2024 1:08 PM | Last Updated on Wed, May 8 2024 1:24 PM

Viral: Hero childhood pic with Sathyaraj from the 1980s

నటుడు సత్యరాజ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో బోలెడన్ని సినిమాలు చేశాడు. మొదట్లో విలన్‌గా, తర్వాత హీరోగా.. అనంతరం సహాయక నటుడిగా మెప్పించాడు. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో పాన్‌  ఇండియా స్థాయిలో క్లిక్కయ్యాడు. ఈ మధ్య ఇతడు సింగపూర్‌ సెలూన్‌ మూవీలో మెరిశాడు. 

ఫోటో వైరల్‌
తాజాగా ఈ నటుడు యుక్తవయసులో ఉన్నప్పటి ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. ఇందులో సత్యరాజ్‌ ఓ బుడ్డోడితోపాటు కెమెరావైపు నవ్వులు చిందిస్తున్నాడు. ఈ బుడ్డోడు సౌత్‌ ఇండస్ట్రీలో ఫేమస్‌ యాక్టర్‌. ఇతడి తండ్రి కూడా నటుడే! ఆయనతో కలిసి సత్యరాజ్‌ రెండు సినిమాలు కూడా చేశాడు. ఇంతకీ ఈ చిన్నోడెవరో గుర్తుపట్టారా? 

తెలుగులో విపరీతమైన పాపులారిటీ
అతడే మలయాళ స్టార్‌ ఫహద్‌ ఫాజిల్‌. పుష్ప సినిమాతో తెలుగులో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న ఇతడు ఈ మధ్యే ఆవేశం అనే సినిమాతో మలయాళంలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.150 కోట్లకు పైగా రాబట్టింది. 1980లో అతడు సత్యరాజ్‌తో దిగిన ఫోటోను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ముబి ఇండియా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది.

 

చదవండి: నాన్నతో కోపంలో అన్నా.. అదే నిజమైంది: బన్నీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement