Fahad Fazil
-
టాలీవుడ్ దర్శక-నిర్మాతలపై కన్నేసిన పర భాష హీరోలు!
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం టాలీవుడ్ ముందు వరుసలో ఉంది. స్టార్ హీరోల తెలుగు సినిమాలు పాన్ ఇండియా మూవీస్‌గా ఇతర భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. కథాబలం ఉన్న సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఇలా ఇతర భాషల హీరోల సినిమాలు కూడా టాలీవుడ్లో విడుదలై, మంచి సినిమాలు సూపర్‌హిట్స్‌గా నిలుస్తున్నాయి. దీంతో కొందరు హీరోలు తెలుగు నిర్మాణ సంస్థలు, తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా క్షేమంగా రండి లాభంగా వెళ్లండి అంటూ ఆదరిస్తున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం...ఆకాశంలో ఒక తార!‘మహానటి, సీతారామం’, ఇటీవల ‘లక్కీభాస్కర్’ చిత్రాలతో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తెలుగులో దుల్కర్ చేసిన ఈ మూడు సినిమాలు సూపర్‌హిట్స్ కావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. దీంతో తెలుగులో సినిమాలు చేయడానికి మరింత ఆసక్తి చూపిస్తున్నారు దుల్కర్ సల్మాన్ . ప్రస్తుతం ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నారాయన. పవన్ సాధినేని ఈ సినిమాకు దర్శకుడు. గీతా ఆర్ట్స్, స్వప్నా సినిమాస్, లైట్ బాక్స్ మీడియా పతాకాలపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. అలాగే ‘కాంత’ అనే పీరియాడికల్ ఫిల్మ్‌లోనూ దుల్కర్ హీరోగా నటిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని మరో లీడ్ రోల్ చేస్తున్నారు. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ అట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జాను సంగీతం అందిస్తున్నారు. కాగా దుల్కర్ తెలుగు నిర్మాతలతో సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయన సినిమాలు ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.రాజమౌళి సమర్పణలో...అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న బన్వర్సింగ్ షెకావత్ పాత్రలో తెలుగు ఆడియన్స్‌ను మెప్పించారు మలయాళ హీరో ఫాహద్‌ఫాజిల్. ప్రస్తుతం ‘పుష్ప: ది రైజ్’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమాలోనూ ఫాహద్ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. అయితే ఫాహద్ హీరోగా ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్, ఆక్సిజన్ ’ అనే రెండు తెలుగు సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, కార్తికేయ ఈ రెండు సినిమాలను నిర్మిస్తున్నారు. ‘ఆక్సిజన్ ’ సినిమాతో సిద్ధార్థ్ నాదెళ్ల, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాతో శశాంక్ ఏలేటి దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ ఏడాది మార్చిలో ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్, ఆక్సిజన్’ సినిమాల ఫస్ట్‌లుక్స్‌ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఆ తర్వాత ఈ సినిమాల గురించి మరో అప్డేట్ రావాల్సి ఉంది.జై హనుమాన్‘కాంతార’ సినిమాతో కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి పేరు జాతీయస్థాయిలో మార్మోగిపోయింది. ప్రస్తుతం ‘కాంతార’ సినిమా ప్రీక్వెల్ ‘కాంతార: ఛాప్టర్ 1’తో బిజీగా ఉన్నారు రిషబ్‌శెట్టి. అయితే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాకుండానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే జై హనుమాన్.ఈ ఏడాది సంక్రాంతి ఫెస్టివల్‌కు విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘హను–మాన్ ’ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్ ’ రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో రిషబ్‌శెట్టి మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయు)లో భాగంగా ‘జై హను మాన్ ’ అనే తెలుగు సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు రిషబ్. ప్రశాంత్ వర్మ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రానా మరో లీడ్ రోల్ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ‘జై హనుమాన్’ సినిమాను నిర్మిస్తున్నారు.యాక్షన్ ‘జాట్’బాలీవుడ్‌లోని సీనియర్ హీరోల్లో ఒకరైన సన్నీ డియోల్ తెలుగులో సినిమా చేస్తున్నారు. ‘జాట్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ మొదలైంది. పీటర్ హెయిన్స్, అన్ల అరసు, రామ్–లక్ష్మణ్, వెంకట్.. ఇలా నలుగురు యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఈ సినిమాకు అసోసియేట్ కావడం చూస్తే యాక్షన్ సీక్వెన్స్‌లు నెక్ట్స్ లెవల్లో ఉండబోతున్నాయని ఊహించవచ్చు. రణ్‌దీప్ హుడా, వినీత్‌కుమార్, సయామీ ఖేర్, రెజీనా ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ ‘జాట్’ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. హిందీలో ‘గదర్ 2’ వంటి బ్లాక్‌బస్టర్ కొట్టిన వెంటనే సన్నీడియోల్ తెలుగులో ‘జాట్’ చేయడానికి అంగీకరించడం విశేషం. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ‘జాట్’ కాకుండా హిందీలో ‘బోర్డర్ 2, లాహోర్ 1947’ సినిమాలతో బిజీగా ఉన్నారు సన్నీడియోల్. ‘జాట్’ విజయం సాధిస్తే ఆయన తదుపరి సినిమాలైన ‘బోర్డర్ 2, లాహోర్ 1947’ చిత్రాలు కూడా తెలుగులో రిలీజ్ అవుతాయని ఊహించవచ్చు.కంగువాహీరో సూర్య తెలుగులోనూ పాపులర్. ఆయన తమిళ చిత్రాలు ఎప్పటికప్పుడు తెలుగులో అనువాదం అవుతుంటాయి. వీలైనప్పుడు నేరుగా తెలుగు సినిమాల్లోనూ సూర్య నటిస్తారు. తాజాగా సూర్య నటించిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షనల్ ఫిల్మ్ ‘కంగువా’. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్స్ , యూవీ క్రియేషన్స్ పతాకాలపై తమిళ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా, తెలుగు నిర్మాతలు వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో ‘కంగువ, ఫ్రాన్సిస్’ అనే రెండు భిన్నమైన రోల్స్‌లో సూర్య నటించారు. దిశా పటానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో యోగిబాబు, బాబీడియోల్ ఇతర పాత్రలు చేశారు. ఈ నెల 14న ‘కంగువా’ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త. అలాగే గీతాఆర్ట్స్ సంస్థలో సూర్య ‘గజిని 2’ సినిమా చేస్తారని, అలాగే బోయ΄ాటి శ్రీను దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.కుబేరధనుష్కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన తమిళ సినిమాలు తెలుగులో అనువాదమై ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటున్నాయి. అయితే ధనుష్ తెలుగు, తమిళం భాషల్లో నటించిన ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళంలో ‘వాతి’). వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ‘సార్’ చిత్రం వందకోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో వెంటనే తెలుగు నిర్మాతలతో మరో సినిమా చేసేందుకు ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే ‘కుబేర’. శేఖర్‌కమ్ముల దర్శ కత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాలో నాగార్జున మరో లీడ్ రోల్లో నటిస్తుండగా, రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ నెల 15న ‘కుబేర’ సినిమా టీజర్ విడుదల కానుంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ‘కుబేర’ సినిమా రిలీజ్ కానుంది. ఈ తరహాలో మరికొంతమంది ఇతర భాషల హీరోలు టాలీవుడ్ దర్శక– నిర్మాతలతో సినిమాలు చేస్తున్నారు. ఇంకొందరు ఆసక్తి చూపిస్తూ, కథలు వింటున్నారు. -
పుష్ప నటుడి థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ చూశారా?
పుష్ప నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సైకలాజికల్ థ్రిల్లర్ బౌగెన్‌విల్లా. ఈ సినిమాకు అమల్ నీరద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కుంచాకో బోబన్, జ్యోతిర్మయి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది.కాగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ పుష్ప మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పుష్ప సీక్వెల్ పార్ట్-2 లోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
వారం రోజులు అక్కర్లేదు!
‘‘ఖైదు చెయ్ ఖైదు చెయ్... నేరస్తుణ్ణి ఖైదు చెయ్... ఖైదు చెయ్ ఖైదు చెయ్... నేరస్తుణ్ణి ఖైదు చెయ్’’ అంటూ మొదలవుతుంది ‘వేట్టయాన్: ద హంటర్’ సినిమా తెలుగు ట్రైలర్. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వేట్టయాన్’. అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘వేట్టయాన్’ ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ‘ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు. కానీ పోరంబోకులకు బాగా భద్రత ఉంది’, ‘నేరస్తుణ్ణి వెంటనే పట్టుకోవాలి. అందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోండి’, ‘ఒక వారంలో ఎన్కౌంటర్ జరిగిపోవాలి’ (రావు రమేశ్), ‘అక్కర్లేదు సార్... వారం రోజులు అక్కర్లేదు... మూడే రోజుల్లో డిపార్ట్మెంట్కు మంచి పేరు వస్తుంది’ (రజనీకాంత్), ‘కాలం విలువ తెలిసిన మనిషి మాత్రమే ఏదైనా సాధించగలడు’ (రానా), ‘న్యాయం అన్యాయం అయినప్పుడు న్యాయంతోనే సరిచేయాలి. అంతేకానీ... ఇంకో అన్యాయంతో కాదు’ (అమితాబ్ బచ్చన్), ‘నన్ను ఏ పోస్ట్‌లోకి తిప్పికొట్టినా నేను మాత్రం పోలీస్వాడినే సార్... నా నుంచి వాడిని కాపాడటం ఎవ్వరి వల్ల కాదు (రజనీకాంత్)’ అన్న డైలాగ్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయి. -
ట్రెండింగ్‌లో బాలయ్య... 20 ఏళ్ల రూల్కి బ్రేక్!
ఆవేశం సినిమా తెలుగు రీమేక్‌లో బాలకృష్ణ నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. ఫహద్ ఫాజిల్ నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. బాలయ్య కోసమే ఆ హక్కులను కొలుగోలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేసి ఓ ప్రముఖ దర్శకుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నాడట. వాస్తవానికి బాలయ్య రీమేకులకు దూరంగా ఉంటాడు. దాదాపు 20 ఏళ్ల కింద తమిళ బ్లాక్ బస్టర్ ‘సామి’ తెలుగు రీమేక్ ‘లక్ష్మీనరసింహా’లో బాలయ్య హీరోగా నటించాడు. ఆ తర్వాత కొత్త కథలతోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ రీమేక్ చేయాలని బాలయ్య డిసైడ్ అయ్యాడట. ఆవేశం సినిమా బాగా నచ్చడంతో బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది.ఈ చిత్రంలో ఫహద్ ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు. సినిమా విజయానికి ప్రధాన కారణం ఆయన నటనే. రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరు ఆ పాత్ర గురించే మాట్లాడుకున్నారు. అందులో పహద్ని తప్ప మరో హీరోని ఊహించుకోలేమని చెప్పారు. రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందంటే.. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం థియేటర్స్‌లో మాత్రమే కాదు..ఓటీటీ(అమెజాన్ ప్రైమ్)లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్‌లో బాలయ్య నటిస్తున్నారని ప్రచారం జరగడంతో ఆయన పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. కొంతమంది అభిమానులైతే ఏకంగా ఆవేశం సినిమా పాటకి బాలయ్య విజువల్స్ జోడించి.. ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి ఇదే కనుక నిజమైతే.. బాలయ్య తన 20 ఏళ్ల రూల్కి బ్రేక్ ఇచ్చినట్లే అవుతుంది. -
తెలుగులో విజయ్ సేతుపతి ‘సూపర్ డీలక్స్ ’.. రీలీజ్ ఎప్పడంటే..?
వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ట్రాన్స్‌జెండర్‌గా నటించిన చిత్రం ‘సూపర్ డీలక్స్’. సమంత కథానాయకగా నటించగా ఫాహద్ ఫాజిల్ ఓ కీ రోల్లో నటించారు. త్యాగరాజన్ కుమార రాజా దర్శత్వంలో రూపొందిన ఈ తమిళ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో ఈ నెల 9న థియేటర్లలో విడుదల కానుంది. సీఎల్ఎన్ మీడియా తెలుగులో విడుదల చేయనుంది. ‘‘సూపర్ డీలక్స్’ని నాలుగు వందల థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నాం. నాలుగు విభిన్న కథలను జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని తెలుగులో విడుదల చేస్తున్న సీఎల్ఎన్ మీడియా పేర్కొంది. -
కేరళ కోసం విరాళాలు ప్రకటించిన స్టార్స్.. ఎవరెవరు ఎంత..?
కేరళలో భారీ వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఎక్కడ చూసిన నీటితో నిండిపోయిన నగరాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వయనాడ్ ప్రాంతంలో భారీ వర్షం వల్ల చాలామంది ఆశ్రయం కూడా కోల్పోయారు. యాన్ని ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటికే 200 మందికి పైగానే విగతజీవులుగా మారితే.. మరికొంత మంది ఆచూకీ లేకుండా పోయింది. ఇప్పటికీ అనేకమంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. ఈ విపత్తులో కేరళను ఆదుకునేందుకు తమ వంతుగా సాయం చేసేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు.సౌత్ ఇండియా స్టార్ హీరో మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ సాయం చేసేందకు ముందుకొచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆర్థిక సహాయం కోసం మమ్ముట్టి రూ.20 లక్షలు, దుల్కర్ సల్మాన్ రూ. 15 లక్షలు కేరళ మంత్రి పి రాజీవ్‌కు అందజేశారు. ఇదే సమయంలో ఫహాద్ ఫాజిల్- నజ్రియా దంపతులు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళం అందించారు. ఈ విషయాన్ని స్వయంగా ఫహద్ ఫాజిల్ తన నిర్మాణ సంస్థ ఫహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్ లెటర్ ప్యాడ్‌పై ముఖ్యమంత్రికి రాసిన లేఖను షేర్ చేస్తూ తెలియజేశాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రూ. 10 లక్షలు ప్రకటించారు. అయితే, ఇప్పటికే సూర్య, జ్యోతిక, కార్తీ రూ. 50 లక్షలు అందించగా.. విక్రమ్ రూ. 20 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళ కోసం అండగా నిలబడుతున్న స్టార్ హీరోలను నెటిజన్లు అభినందిస్తున్నారు. -
మాలీవుడ్ స్టార్ ఫాహద్.. డేట్స్ ఇవ్వడం లేదా?
-
రజినీకాంత్ ని లెక్కచేయని ఫహాద్ ఫాజిల్
-
Viji Venkatesh: కన్నీటి భాష తెలిసిన నటి ఈమె
కన్నీళ్ల భాష తెలిసిన విజీ వెంకటేష్ కళారంగంలోకి అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా క్యాన్సర్‌పై అవగాహన సదస్సులు నిర్వహించడం నుంచి క్యాన్సర్ బాధితులకు అండగా నిలవడం వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన విజీ వెంకటేష్‌లో నటిగా మరో కోణం పరిచయం అయింది. ఆమెకు నటనలో ఓనమాలు తెలియవు. అయితే ‘తెలియదు’ అనే మాట దగ్గర ఆమె ఎప్పుడూ ఆగిపోలేదు. మలయాళం మాట్లాడడం నేర్చుకుంది. సాధన చేసి నటనలో శభాష్ అనిపించుకుంది. ‘బలమైన సినీ మాధ్యమం ద్వారా ఎన్నో సందేశాలను ప్రజలకు చేరువ చేయవచ్చు’ అంటుంది విజీ వెంకటేష్...71 ఏళ్ల వయసులో మలయాళ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన విజీ వెంకటేష్ మన దేశంలో క్యాన్సర్ పేషెంట్ల కోసం మూడు దశాబ్దాలకు పైగా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆమె స్వచ్ఛంద సంస్థ ‘ది మాక్స్ ఫౌండేషన్’కు ఇండియా, సౌత్ ఏషియా హెడ్‌గా ఉన్నారు.దిల్లీలో పుట్టి పెరిగిన విజీకి సామాజిక స్పృహకు సంబంధించిన విషయాలపై స్కూల్‌రోజుల్లో నుంచే ఆసక్తిగా ఉండేది. ఆ ఆసక్తికి అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. వివాహం తరువాత దిల్లీ నుంచి బాంబేకు వచ్చింది. ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లుగా అనిపించింది. తన ఆసక్తులకు తగిన వాతావరణం ఇక్కడ కనిపించింది. ఆంగ్లంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.‘ది మాక్స్ ఫౌండేషన్’ ద్వారా ఉద్యోగ, సేవాప్రస్థానాన్ని ప్రారంభించింది. ‘క్యాన్సర్ పేషెంట్ల గురించి పనిచేయాలనుకోవడానికి కారణం ఏమిటి? అని చాలామంది నన్ను అడుగుతుంటారు. అయితే కాన్సర్పై పోరాటానికి, అవగాహన కలిగించడానికి క్యాన్సర్ పేషెంట్ కానక్కర్లేదు. వారి కష్టాలు మనకు తెలిసుంటే చాలు. ముంబైలో సంస్థలు, వ్యాపారవేత్తల నుంచి క్యాన్సర్ బాధితులకు అవసరమైన నిధుల సేకరణ ్రపారంభిండం ద్వారా నా ప్రస్థానం మొదలైంది’ అంటుంది విజీ.నిధుల సేకరణ మాత్రమే కాదు పేద క్యాన్సర్ పేషెంట్ల ఇంటికి వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకునేది. ధైర్యం చెప్పేది. వీరిలో చాలామందికి పొగాకు నమిలే అలవాటు ఉన్నట్లు గ్రహించింది. ఉద్యోగ ప్రయాణం మొదలైన కొత్తలో బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీకి వెళ్లి క్యాన్సర్‌కు సంబంధించిన ఎన్నో పుస్తకాలను చదివి కొత్త విషయాలను తెలుసుకునేది. అంతేకాదు టాటా మెమోరియల్ హాస్పిటల్‌లోని ఆంకాలజీ డిపార్ట్మెంట్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుంది.ఫ్యాక్టరీలకు వెళ్లి పొగాకు నమలడం ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యల గురించి కార్మికుల కోసం అవగాహన సదస్సులు నిర్వహించేది. ఈ సమావేశాలు పొగాకు నమిలే అలవాటు ఉన్న చాలామందిలో మార్పు తీసుకువచ్చి ప్రమాదం బారిన పడకుండా చూశాయి. అవగాహన సదస్సులతో పాటు పేదల కోసం ఎన్నో చోట్ల క్యాన్సర్‌కు సంబంధించి ఎర్లీ డిటెక్షన్ క్యాంపులు నిర్వహించింది. ఈ క్యాంప్‌లు ఎంతోమందిని కాపాడాయి.ఫహద్ ఫాజిల్‌తో విజీ వెంకటేష్అసలు సినిమాల్లో నటించే అవకాశం విజీ వెంకటేష్‌కు ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే... సోషల్ మీడియాలో ఆమె చురుగ్గా ఉంటుంది. మలయాళ డైరెక్టర్ అఖిల్ సత్యన్, అతని టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో విజీ వెంకటేష్ ఫొటోను చూశారు. తమ సినిమా ‘పచ్చుం అబ్బుతావిలక్కుమ్’కు ‘ఉమ్మచ్చి’ క్యారెక్టర్‌కు సరిగ్గా సరిపోయే మహిళ అనుకున్నారు. వెంటనే విజీ వెంకటేష్‌ను సంప్రదించారు.‘నేను ఫుల్–టైమ్ జాబ్ చేస్తున్నాను. నాకు మలయాళం పెద్దగా రాదు’ అని చెప్పింది. ‘ఈ వయసులో నటన ఏమిటి’ అని కూడా అన్నది. అయితే డైరెక్టర్ పట్టువదలని విక్రమార్కుడు అయ్యాడు. ‘రోల్’ గురించి మరింత వివరంగా చర్చించాడు. అతడి ఆసక్తి, వృత్తిపట్ల అంకిత భావం నచ్చడంతో విజీకి ‘ఓకే’ అనక తప్పలేదు. ఇక అప్పటినుంచి మలయాళం స్పీకింగ్ స్కిల్స్‌పై దృష్టి పెట్టింది. నటనలో మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో విజీ తల్లి పాత్ర పోషించింది. స్వతంత్ర వ్యక్తిత్వం, పోరాడే ధీరత్వం ఉన్న మహిళ పాత్ర అది. నిజానికి ఈ పాత్రకి సంబంధించిన లక్షణాలు ఆమెలో సహజంగా ఉన్నవే.ఈ సినిమా నుంచి మరికొన్ని సినిమాల నుంచి ఆఫర్లు వచ్చాయి. ‘వీర’ లాంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు జయరాజ్ చిత్రం కోసం సైన్ చేసింది. కాటుక, ముక్కు పుడక... ఇలా విజీ వెంకటేష్‌కు తనదైన సిగ్నేచర్ స్టైల్ ఉంది. తన మొదటి సినిమా కోసం ఆ స్టైల్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. అయితే కొత్త లుక్‌లో కూడా సహజంగా, అందంగా ఉంది విజీ వెంకటేష్. -
ఓటీటీలో ఆవేశం.. ఆ సీన్‌పై చర్చ!
ఫహద్ ఫాజిల్.. అప్పుడే హీరోగా చేస్తాడు.. అంతలోనే విలన్‌గా నటిస్తాడు. ప్రాధాన్యతను బట్టి ఏ పాత్రలో అయినా దూరేస్తాడు. ఇటీవల అతడు హీరోగా నటించిన మలయాళ మూవీ ఆవేశం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.ఓటీటీలో ఆవేశంబాక్సాఫీస్ దగ్గర హిట్టందుకున్న మూవీ ఓటీటీలోకి రావడంతో సినీప్రియులు ఆత్రుతగా ఆవేశం సినిమా చూసేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సినిమాలోని ఓ సీన్‌ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. హిందీ భాషను కావాలని పక్కన పడేశారని కామెంట్లు చేస్తున్నారు.ఫైట్ సీన్లో వార్నింగ్ఇంతకీ ఏమైందంటే.. ఓ ఫైట్ సీన్లో రంగ(ఫహద్ ఫాజిల్) తన కాలేజీలోని సీనియర్లు అజు, బిబి, షాంతన్కు వార్నింగ్ ఇస్తుంటాడు. మలయాళం, కన్నడ భాషల్లో వార్నింగ్ ఇస్తాడు. హిందీలో కూడా ఇద్దామనుకునేసరికి హిందీలో అవసరం లేదులే అంటూ రంగ రైట్ హ్యాండ్ అంబాన్ (సాజిన్ గోపు) అతడిని వారిస్తాడు. హిందీ అక్కర్లేదా?అందరికీ చెప్పింది అర్థమైందిగా.. ఇక వెళ్లిపోండి అని ఆదేశిస్తాడు. హిందీలో అవసరం లేదా? అని హీరో అడిగితే అంబాన్ వద్దని బదులిస్తాడు. ఇది చూసిన కొందరు అధికార భాష హిందీని గౌరవించాలి కదా అని అభిప్రాయపడగా.. అయినా ప్రాంతీయ భాషా చిత్రంలో హిందీ అవసరం ఏముందిలే అని మరికొందరు లైట్ తీసుకుంటున్నారు.చదవండి: ఓ మంచి దెయ్యం టీజర్ చూశారా? -
కట్టప్పతో స్టార్ హీరో.. ఈ మధ్యే రూ.150 కోట్ల హిట్ మూవీతో..!
నటుడు సత్యరాజ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో బోలెడన్ని సినిమాలు చేశాడు. మొదట్లో విలన్‌గా, తర్వాత హీరోగా.. అనంతరం సహాయక నటుడిగా మెప్పించాడు. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో క్లిక్కయ్యాడు. ఈ మధ్య ఇతడు సింగపూర్ సెలూన్ మూవీలో మెరిశాడు. ఫోటో వైరల్తాజాగా ఈ నటుడు యుక్తవయసులో ఉన్నప్పటి ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. ఇందులో సత్యరాజ్ ఓ బుడ్డోడితోపాటు కెమెరావైపు నవ్వులు చిందిస్తున్నాడు. ఈ బుడ్డోడు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ యాక్టర్. ఇతడి తండ్రి కూడా నటుడే! ఆయనతో కలిసి సత్యరాజ్ రెండు సినిమాలు కూడా చేశాడు. ఇంతకీ ఈ చిన్నోడెవరో గుర్తుపట్టారా? తెలుగులో విపరీతమైన పాపులారిటీఅతడే మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్. పుష్ప సినిమాతో తెలుగులో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న ఇతడు ఈ మధ్యే ఆవేశం అనే సినిమాతో మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా రాబట్టింది. 1980లో అతడు సత్యరాజ్‌తో దిగిన ఫోటోను ఓటీటీ ప్లాట్‌ఫామ్ ముబి ఇండియా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. Sathyaraj and Fahadh Faasil in the 1980s. pic.twitter.com/H9DidxzScV— MUBI India (@mubiindia) May 7, 2024చదవండి: నాన్నతో కోపంలో అన్నా.. అదే నిజమైంది: బన్నీ -
సినిమాయే జీవితం కాదు.. నన్ను లైట్ తీస్కోండి: పుష్ప విలన్
ఫహద్ ఫాజిల్.. తెలుగు, మలయాళ, కన్నడ ప్రేక్షకులకు సుపరిచితుడే! సొంత (మలయాళ) ఇండస్ట్రీలో హీరోగా నటించే ఈయన ఇతర భాషా చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్లు, విలనిజం పాత్రలు పోషిస్తుంటాడు. ఇటీవల ఈయన ప్రధాన పాత్రలో నటించిన మలయాళ మూవీ 'ఆవేశం' రూ.100 కోట్ల క్లబ్బులో చేరింది.సినిమానే జీవితం కాదుఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఫహద్ ఫాజిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా చూస్తున్నంతసేపే తనను పట్టించుకోవాలే తప్ప తర్వాత తన గురించి ఆలోచించొద్దన్నాడు. అలాగే సినిమాయే జీవితం కాదని ఉపదేశించాడు. అతడు ఇంకా మాట్లాడుతూ.. 'నేను ఏదీ అనుకున్న సమయానికి మొదలుపెట్టను.. పూర్తి చేయను. నేను చేసే సినిమాలు కూడా ముందుగా ప్లాన్ చేసుకున్నవి కాదు. ఎగ్జయిట్‌గా అనిపిస్తే వెంటనే చేసేస్తానంతే! ప్రేక్షకులు సినిమా చూసి ఆనందించేందుకు నా వంతు నేను కృషి చేస్తాను.నా గురించి ఆలోచించొద్దువాళ్లు సినిమా చూస్తున్నంత సేపు ఎంటర్టైన్ అవ్వాలి.. అంతేకానీ తర్వాత నేనేం చేస్తున్నాను? నా లైఫ్ ఎలా ఉంది? అని నాగురించి ఆలోచించకూడదు. థియేటర్ లోపల ఉన్నప్పుడు మాత్రమే ఆలోచించండి.. అక్కడి నుంచి బయటకు వచ్చేశాక నన్ను సీరియస్‌గా తీసుకోకండి. ఖాళీ సమయాల్లోనో లేదా తినేటప్పుడో నటీనటుల గురించి వారి పర్ఫామెన్స్ గురించి జనాలు మాట్లాడుకోవడం నాకస్సలు ఇష్టం ఉండదు.ఇంట్లో ఎందుకు చర్చ?కావాలంటే సినిమా చూసి ఇంటికి తిరిగెళ్లే సమయంలో దాని గురించి డిస్కషన్ చేయండి.. అంతే కానీ ఇంట్లో కూడా దాని గురించే ఎందుకు చర్చ? సినిమాను కూడా ఓ హద్దులో ఉంచాలి. కేవలం మూవీస్ చూడటమే కాకుండా జీవితంలో చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయని గుర్తుంచుకోండి' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఫహద్.. పుష్ప 2 సినిమాతో పాటు వేటయ్య, మారీషన్ సినిమాలు చేస్తున్నాడు.చదవండి: మూడో పెళ్లి గురించి ప్రశ్న.. స్టార్ హీరో ఆన్సరిదే..! -
విలన్‌ను కాస్తా కమెడియన్‌ను చేసేశారు!
మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ మాతృభాషలో హీరోగా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్లో మాత్రం విలన్‌గా నటిస్తున్న ఈయన ఇటీవల తెలుగులో పుష్ప చిత్రంలో పోలీస్ అధికారిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే తమిళంలో ఉదయనిధి స్టాలిన్, కీర్తీ సురేష్ జంటగా నటించిన మామన్నన్ చిత్రంలో విలనిజాన్ని పండించారు. అలాగే కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన విక్రమ్ చిత్రంలోనూ కీలక పాత్రలో మెప్పించారు. కమెడియన్‌ను చేసేశారు తాజాగా రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వేట్టైయాన్ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇందులో తన పాత్ర గురించి ఆయన మాట్లాడుతూ.. వేట్టైయాన్ చిత్రంలో దర్శకుడు జ్ఞానవేల్ తనను కమెడియన్‌గా మార్చారని చెప్పారు. కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ మూవీలో తననే హీరోగా పలువురు భావించారని, అంత ప్రాముఖ్యత కలిగిన పాత్రల్లో నటించిన తనను వేట్టైయాన్ చిత్రంలో కమెడియన్‌గా చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అప్పుడే ఒప్పుకున్నా రజనీకాంత్ చిత్రంలో కమెడియన్గానా? అని తాను ఆశ్చర్యపోయానని, అయితే అందులో తన పాత్ర గురించి దర్శకుడు వివరించగా ఆ పాత్రలో నటించడానికి అంగీకరించానని ఫహద్ ఫాజిల్ పేర్కొన్నారు. కాగా ఈ క్రేజీ చిత్రం అక్టోబర్ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. చదవండి: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నిశ్చితార్థం రోజే నటుడి దుర్మరణం! -
షెకావత్ సర్ న్యూ లుక్.. 'పుష్ప'పై ప్రతీకారంతో!
పుష్పరాజ్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాడు బన్వర్సింగ్ షెకావత్. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. ఈ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్,పోలీసాఫీసర్ భన్వర్‌సింగ్ షెకావత్పాత్రలో ఫాహద్ ఫాజిల్ నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రంలోని మలి భాగం ‘పుష్ప: ది రూల్’ సెట్స్‌పై ఉంది. ఇందులో కూడా అల్లు అర్జున్, ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్లోపాల్గొన్నారు ఫాహద్ ఫాజిల్. కాగా ఆగస్టు 8 (మంగళవారం) ఫాహద్ ఫాజిల్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘పుష్ప: ది రూల్’ సినిమాలోని ఫాహద్ కొత్తపోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘ప్రతీకారంతో భన్వర్‌సింగ్ షెకావత్ సార్ బిగ్ స్క్రీన్స్‌పై వచ్చేందుకు రెడీ అవుతున్నారు’ అనే క్యాప్షన్‌తో చిత్ర యూనిట్ ఫాహద్ కొత్తపోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 10న హైదరాబాద్‌లోప్రారంభం కానుందని, హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మికా మందన్నా షూటింగ్లోపాల్గొంటారని తెలిసింది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. -
నాయకుడుతో...
ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫాహద్ ఫాజిల్, కీర్తీ సురేష్ లీడ్ రోల్స్‌లో నటించిన తమిళ చిత్రం ‘మామన్నన్’. ‘పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్’ లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన మారి సెల్వరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా ఏషియన్ మల్టీప్లెక్స్– సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ‘‘పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
ఓటీటీలోకి రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ
ఫహాద్ ఫాజిల్ పేరుకే మలయాళ నటుడు గానీ డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు ప్రేక్షకులకు గత కొన్నేళ్ల నుంచి బాగా పరిచయమే. అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రంలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఫహాద్ ఫాజిల్ నటించిన 'ధూమమ్' సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీగా ఉంది. మలయాళంతో పాటు కన్నడలో జూన్ 23న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి; రూ. 20 కోట్లతో ఇల్లు కొన్న హీరోయిన్.. ఆయన బహుమతే కదా అంటూ..) 'కేజీఎఫ్, కాంతార,సలార్' లాంటి అద్భుతమైన సినిమాలు నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ వారే ధూమమ్‌ను నిర్మించారు. దీన్ని తెలుగులో కూడా విడుదల చేయాల్సింది కానీ ఎందుకో వెనక్కి తగ్గి.. కేవలం మలయాళ, కన్నడ భాషలకే పరిమితం చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. జులై 21 నుంచి ధూమమ్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఈ సినిమాలో అపర్ణా బాల మురళి హీరోయిన్గా మెప్పించింది. ఓటీటీలో మాత్రం తెలుగు వెర్షన్లో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: Nayanthara: నయనతార ఆశలన్నీ 75 పైనే!) 'ధూమం' కథేంటి? సిగరెట్ కంపెనీలో పనిచేసే అవినాష్(ఫహాద్ ఫాజిల్) జీవితం, జీతం బాగానే ఉంటుంది. కానీ ఈ ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. తమ సంస్థ వల్ల చిన్నపిల్లలు కూడా పొగాకు బారిన పడుతుండటమే దీనికి కారణం. సరిగ్గా ఈ టైంలోనే అవినాష్, అతడి భార్య ఓ ప్రమాదంలో పడతారు. వీళ్ల బాడీలకు టైమ్ బాంబ్ ఫిక్స్ చేస్తారు. అది పేలకూడదంటే సిగరెట్స్ తాగుతూ తక్కువ సమయంలో కోటి రూపాయలు పోగు చేయాలి. ఈ గండం నుంచి వీళ్లు ఎలా బయటపడ్డారు అనేదే 'ధూమం' స్టోరీ. -
విచిత్ర పరిస్థితుల్లో ఫాహద్ ఫాజిల్
-
'సలార్' నిర్మాతలకు షాకిచ్చిన ఆ సినిమా రిజల్ట్!
'కేజీఎఫ్', 'కాంతార' లాంటి అద్భుతమైన సినిమాలు నిర్మించి, వందల కోట్ల లాభాలు అర్జించిన హోంబలే ఫిల్మ్స్ కు షాక్ తగిలింది. అది కూడా ఓ చిన్న మూవీ వల్ల. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఎందుకంటే మరో మూడు నెలల్లో 'సలార్' రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇలాంటి టైంలో తాము నిర్మించిన ఓ చిత్రానికి ఫ్లాప్ టాక్ రావడం అవాక్కయ్యేలా చేసింది. ఫహాద్ ఫాజిల్ పేరుకే మలయాళ నటుడు గానీ డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు ప్రేక్షకులకు గత కొన్నేళ్ల నుంచి బాగా పరిచయమే. అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రంలో పోలీస్ గా నటించి ఆకట్టుకున్నాడు. ఈ మధ్యే 'ధూమం' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. దీన్ని తెలుగులో కూడా విడుదల చేయాల్సింది కానీ ఎందుకో వెనక్కి తగ్గి.. కేవలం మలయాళ, కన్నడ భాషలకే పరిమితం చేశారు. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. వీడియో రిలీజ్ చేసిన నటి సురేఖావాణి) కన్నడలో లూసియా, యూటర్న్ లాంటి డిఫరెంట్ చిత్రాలతో హిట్స్ కొట్టిన పవన్ కుమార్ దీనికి దర్శకుడు కావడంతో విడుదలకు ముందే ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా జనాల్ని పెద్దగా ఎంటర్టైన్ చేయలేకపోతోంది. రెండు రోజుల్లో రూ.2.5 కోట్లు మాత్రమే వసూళ్లు వచ్చినట్లు టాక్. స్టోరీ పరంగానూ పొరపాట్లు జరగడంతో బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా రూ.8 కోట్ల బడ్జెట్ మాత్రమే పెట్టినప్పటికీ.. నెగిటివ్ టాక్ రావడం నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ని అయోమయానికి గురిచేసింది. 'ధూమం' కథేంటి? సిగరెట్ కంపెనీలో పనిచేసే అవినాష్(ఫహాద్ ఫాజిల్) జీవితం, జీతం బాగానే ఉంటుంది. కానీ ఈ ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. తమ సంస్థ వల్ల చిన్నపిల్లలు కూడా పొగాకు బారిన పడుతుండటమే దీనికి కారణం. సరిగ్గా ఈ టైంలోనే అవినాష్, అతడి భార్య ఓ ప్రమాదంలో పడతారు. వీళ్ల బాడీలకు టైమ్ బాంబ్ ఫిక్స్ చేస్తారు. అది పేలకూడదంటే సిగరెట్స్ తాగుతూ తక్కువ సమయంలో కోటి రూపాయలు పోగు చేయాలి. ఈ గండం నుంచి వీళ్లు ఎలా బయటపడ్డారు అనేదే 'ధూమం' స్టోరీ. (ఇదీ చదవండి: మహేశ్ సినిమా క్లైమాక్స్ బయటపెట్టిన రాజమౌళి తండ్రి) -
టాలీలో మాలీ హవా
‘ప్రతిభకి భాషతో సంబంధం లేదు’ అనే మాట చిత్ర పరిశ్రమలో తరచుగా వినిపిస్తుంటుంది. టాలెంటెడ్ ఆర్టిస్ట్‌లు ఏ భాషలో ఉన్నా తెలుగు పరిశ్రమ సాదర స్వాగతం పలుకుతుంది. ప్రస్తుతం తెలుగులో సెట్స్‌పై ఉన్న పలు చిత్రాల్లో జయరామ్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఫాహద్ ఫాజిల్, దేవ్ మోహన్, జోజూ జార్జ్, సుదేష్ నాయర్.. వంటి పలువురు మలయాళ నటులు కీలక పాత్రలతో హవా సాగిస్తున్నారు. ఈ మాలీవుడ్ నటులు చేస్తున్న తెలుగు చిత్రాలపై ఓ లుక్కేద్దాం. బిజీ బిజీగా... ‘భాగమతి.. అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ధమాకా... ఇలా వరుసగా తెలుగు సినిమాలు చేశారు మలయాళ సీనియర్ నటుడు జయరామ్. నెగటివ్, పాజిటివ్ క్యారెక్టర్స్‌తో తెలుగులో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శ కత్వం వహిస్తున్న ‘గేమ్ ఛేంజర్’తో పాటు మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో జయరామ్ కీలక పాత్ర చేస్తున్నారు. అదిరే ఎంట్రీ మలయాళం స్టార్ హీరోల్లో ఒకరైన ఫాహద్ ఫాజిల్ ‘పార్టీ లేదా పుష్పా..’ అంటూ తెలుగులోకి అడుగుపెట్టారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో అదిరే ఎంట్రీ ఇచ్చారు ఫాహద్. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంలోనూ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటిస్తున్నారు ఫాహద్ ఫాజిల్. ‘పుష్ప’ మొదటి భాగంలో ఆయన పాత్ర నిడివి తక్కువగానే ఉన్నా రెండో భాగంలో మాత్రం పూర్తి స్థాయిలో ఉంటుందని టాక్. పదమూడేళ్ల తర్వాత... మాలీవుడ్‌లో ఓ వైపు స్టార్ హీరోగా దూసుకెళుతూ మరోవైపు డైరెక్టర్‌గా (లూసిఫర్, బ్రో డాడీ) ప్రతిభ చూపిస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. కాగా మన్మోహన్ చల్లా దర్శకత్వం వహించిన ‘పోలీస్ పోలీస్’ (2010) చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చారు పృథ్వీరాజ్. ఆ చిత్రంలో ఓ హీరోగా నటించిన ఆయన పదమూడేళ్ల గ్యాప్ తర్వాత మరో తెలుగు చిత్రంలో (‘సలార్’) నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ విలన్‌గా నటిస్తుండగా ఆయన తనయుని పాత్రలో పృథ్వీరాజ్ నటిస్తున్నారట. పృథ్వీ పాత్ర నెగటివ్ టచ్‌తో ఉంటుందని టాక్. సెప్టెంబర్ 28న ‘సలార్’ విడుదల కానుంది. ‘శాకుంతలం’తో వచ్చి... గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘శాకుంతలం’తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు దేవ్ మోహన్. మలయాళంలో నటించింది కొన్ని సినిమాలే అయినా తొలి తెలుగు చిత్రంలోనే సమంత వంటి స్టార్ హీరోయిన్‌కి జోడీగా నటించే అవకాశం అందుకున్నారు దేవ్ మోహన్. ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా నటించి, మెప్పించారు దేవ్. ఇలా ‘శాకుంతలం’తో తెలుగుకి వచ్చి, రెండో తెలుగు సినిమా ‘రెయిన్బో’లోనూ మరో స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నాకి జోడీగా నటించే చాన్స్ అందుకున్నారు దేవ్. శాంతరూబన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. జోజు.. సుదేష్ కూడా... మలయాళంలో నటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జోజూ జార్జ్ ‘ఆది కేశవ’ సినిమాతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు. వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో విలన్‌గా నటిస్తున్నారు జోజూ. అలాగే నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ద్వారా సుదేష్ నాయర్ తెలుగుకి ఎంట్రీ ఇస్తున్నారని టాక్. ఈ చిత్రంలో ఆయన స్టైలిష్ విలన్ పాత్రలో కనిపిస్తారట. వీళ్లే కాదు.. మరికొందరు మలయాళ నటులు కూడా తెలుగు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
పుష్ప యూనివర్స్ పార్ట్ 3 కి లైన్ క్లియర్!
-
విలన్‌గా మారుతున్న స్టార్ హీరోలు.. కొత్త కండీషన్ అప్లై
టాలీవుడ్లో ఒకప్పుడు విలన్ అంటే.. గళ్ళ పంచె, పెద్ద పెద్ద మీసాలు, బుగ్గ మీద ఒకటి రెండు కత్తి గాట్లు, భారీ శరీరంతో గంభీరంగా ఉండేవారు. వారి పాత్రకి అంతగా రెస్పెక్ట్ కూడా ఉండేది కాదు. కానీ ఇప్పటి విలన్స్ మాత్రం హీరోకి సమానంగా రెస్పెక్ట్ కోరుకుంటున్నారు. ‘సర్’ అని పివాల్సిందేనని పట్టుబడుతున్నారు. గతేడాది రిలీజైన బ్లాక్ బస్టర్ పుష్పలో ఫస్టాఫ్ మొత్తం ఎదురులేకుండా ఎదుగుతూ వెళ్తుంటాడు పుష్పరాజ్.కానీ విలన్ భన్వర్ సింగ్ షేకావత్(ఫహద్ ఫాజిల్) ఎంట్రీ ఇచ్చిన తర్వాత పుష్ప స్పీడ్ తగ్గతుంది. పుష్పకు, భన్వర్ కు మధ్య కేవలం ‘సర్’ అనే పాయింట్ పైనే అసలు వైరం మొదలవుతుంది. ఒక్కటి తగ్గుతోంది పుష్పా అంటూ భన్వర్.. ఇది సర్ నా బ్రాండ్ అంటూ పుష్ప చెప్పే డైలాగ్స్.. వీరిద్దరి వైరాన్ని సీక్వెల్ వరకు తీసుకెళ్లాయి. ముఖ్యంగా భన్వర్ సింగ్ షెకావత్ తనని సర్ అని పిలవాల్సిందే అని పట్టుబట్టే సీన్,ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఒక ఇటీవల విడుదలై సూపర్ సక్సెస్‌తో దూసుకెళ్తున్న కమల్ హాసన్ ‘విక్రమ్’లో విలన్‌ది కూడా సేమ్ ప్రాబ్లమ్. ఈ చిత్రం క్లైమాక్స్‌లో విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు తమిళ స్టార్ హీరో సూర్య. రోలెక్స్ క్యారెక్టర్ లో సూర్య విలనీజం ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెంటింగ్ టాపిక్.పుష్ప మాదిరే విక్రమ్‌లో కూడా విలన్ రెస్పెక్ట్ కోరుకున్నాడు.తన మనుషులే తనని పేరు పెట్టి పిలవడం జీర్ణించుకోలేకపోతాడు.రోలెక్స్ సర్ అని పిలవాల్సిందే అని పట్టుబడతాడు.ఈ సీన్ కూడా సినిమాకే హైలైట్ గా నిలిచింది. మొత్తంగా విలన్ గా మారుతున్న హీరోలు కొత్త కండీషన్ పెడుతున్నారు. హీరోల చేతిలో తన్నులు తిన్నా సరే రెస్పెక్ట్ మాత్రం తగ్గేదేలేదంటున్నారు.సర్ అని పిలవకపోతే సీక్వెల్ వరకు ఆ వైరం కొనసాగుతుందని చెప్పుకొస్తున్నారు. -
‘విక్రమ్’.. 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు కమల్ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్
Kamal Haasan Gifts New Bikes to 13 Assistant Directors: విక్రమ్ మూవీ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు హీరో కమల్ హాసన్. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో కమల్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో ప్రస్తుతం విక్రమ్ టీం, కమల్ హాసన్ మూవీ సక్సెస్‌ను ఆస్వాధిస్తున్నారు. విక్రమ్ మూవీ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో కమల్ హాసన్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్‌కు మంగళవారం ఖరీదైన లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు కోటీకి పైగా విలువ చేసే లెక్సాస్ లగ్జరీ కారును గిఫ్ట్గాఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. చదవండి: ‘విక్రమ్’ భారీ విజయం, దర్శకుడికి కమల్ లెక్సాస్ లగ్జరీ కారు బహుమతి అలాగే విక్రమ్ మూవీకి పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇచ్చాడు కమల్ హాసన్. ఈ సినిమాకు పని చేసిన 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు అపాచీ ఆర్టీఆర్ 160 (Apache RTR 160)బైక్‌లను బహుమతిగా ఇచ్చాడు. ఈ ఒక్కో బైక్ ధర సుమారుగా రూ. 1.45 లక్షలు ఉంటుందని సమాచారం. కాగా విక్రమ్ మూవీ కోసం వీరు చాలా హర్డ్ వర్క్ చేశారని, వారి శ్రమ ఫలితమే మూవీ బాగా వచ్చిందని కమల్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా అసిస్టెంట్ డైరెక్టర్లకు కమల్ బైక్ కీ అందిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. చదవండి: సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్‌ని: బాలీవుడ్ డైరెక్టర్ విడుదలైన నాలుగు రోజుల్లో ఈ మూవీ దాదాపు రూ. 200 కోట్లు వసూళ్లు చేసింది. ఇక వీకెండ్స్‌లో (జూన్ 3 నుంచి 5 వరకు) అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో విక్రమ్ మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో 'విక్రమ్: హిట్ లిస్ట్' పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ విడుదల చేశారు. ఇందులో కమల్ 67 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీగా యాక్షన్ సీన్స్ చేయడం విశేషం. https://t.co/zrQRWQN1Ta pic.twitter.com/dSi5jTXkVc — Ramesh Bala (@rameshlaus) June 7, 2022 -
విక్రమ్: కమల్ హాసన్ పారితోషికం ఎంతో తెలుసా?
తమిళ స్టార్ కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా విక్రమ్. హీరో సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగులో విక్రమ్: హిట్ లిస్ట్ పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ రిలీజ్ చేస్తున్నారు. జూన్ 3న తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ విడుదల కానుంది. ఈ క్రమంలో ఇందులో నటీనటులకు ఎంతమేర పారితోషికం ఇచ్చారన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం మేరకు సినిమా బడ్జెట్ రూ.120 కోట్ల పైనే ఉండగా చిత్రబృందం రెమ్యునరేషన్ కూడా ఆ రేంజ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ రూ.50 కోట్ల మేర తీసుకుంటే డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దాదాపు రూ.8 కోట్లు అందుకున్నట్లు సమాచారం. విజయ్ సేతుపతికి రూ.10 కోట్లు, ఫహద్ ఫాజిల్‌కు రూ.4 కోట్ల మేర పారితోషికం సర్దినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించిన అనిరుధ్ రవిచందర్‌కు సైతం రూ. 4 కోట్లు ముట్టజెప్పారట. కాగా కమల్ హాసన్ 2018 ఆగస్టులో విశ్వరూపం 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత విక్రమ్‌తో థియేటర్లలో సందడి చేయనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చదవండి 👇 రూ.కోటి ఆఫర్ చేసినా పాడని కేకే! ఎవరీ కేకే, ఆయనకంటే మేమే బాగా పాడతామన్న సింగర్.. నెట్టింట ట్రోలింగ్ -
పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఈ 'దొంగాట' చూడాల్సిందే..
టైటిల్: దొంగాట నటీనటులు: ఫాహద్ ఫాజిల్, సూరజ్ వెంజరమూడ్, నిమిషా సజయన్, అలెన్సియర్ లే లోపెజ్ తదితరులు నిర్మాతలు: సందీప్ సేనన్, అనీష్ ఎం థామస్ కథ: సజీవ్ పజూర్ దర్శకత్వం: దిలీష్ పోతన్ సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి సంగీతం: బిజిబాల్ విడుదల తేది: మే 06, 2022 (ఆహా) చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుల్లో మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ ఒకరు. కరోనా సమయంలో ఆడియెన్స్ ఓటీటీలకు అలవాటు కావడంతో ఒక్కసారిగా ఫాహద్ పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. విభిన్నమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. పాత్ర బలంగా ఉంటే ఎలాంటి సినిమా అయినా చేసేందుకు వెనుకాడరు. 'పుష్ప: ది రైజ్' సినిమాలో భన్వర్ సింగ్ షేకవాత్ అనే పోలీసు పాత్రలో ఎంతలా ఆకట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎంటర్టైన్ చేస్తున్న ఫాహద్ ఫాజిల్ నటించిన మలయాళ చిత్రం 'తొండిముత్యాలుం దృక్సాక్షియుం'. 2017లో విడుదల మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని తాజాగా తెలుగులో 'దొంగాట' పేరుతో 'ఆహా' ఓటీటీలో విడుదల చేశారు. ఫహద్ ఫాజిల్, సూరజ్ వెంజరమూడ్, నిమిషా సజయన్ కీలకపాత్రల్లో నటించారు. మూడు జాతీయ పురస్కారాలను అందుకున్న ఈ 'దొంగాట' ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: ఒక మిస్అండర్స్టాండింగ్ కారణంగా దగ్గరైన ప్రసాద్ (సూరజ్ వెంజరమూడ్), శ్రీజ (నిమిషా సజయన్) ప్రేమించి గుడిలో పెళ్లి చేసుకుంటారు. తర్వాత వేరే కాపురం పెడతారు. వ్యవసాయం పండించడానికని నీళ్ల కోసం బోర్ వేసేందుకు శ్రీజ దగ్గర ఉన్న తాళి తాకట్టు పెట్టేందుకు బస్సులో వెళ్తారు. బస్సులో ప్రయాణించేటప్పుడు శ్రీజ మెడలోని బంగారు గొలుసును (తాళి) ప్రసాద్ (ఫాహద్ ఫాజిల్) అనే దొంగ కొట్టేస్తాడు. అది గమనించిన శ్రీజ.. ప్రసాద్‌ను పట్టుకుని నిలదీస్తే తాను దొంగలించలేదని బుకాయిస్తాడు. దీంతో బస్సులోని వారి సహాయంతో ప్రసాద్‌ను (ఫాహద్ ఫాజిల్) పోలీస్‌లకు అప్పగిస్తారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ప్రసాద్-శ్రీజ దంపతులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. గొలుసు కొట్టేసిన ప్రసాద్ అనే దొంగ నేరం ఒప్పుకున్నాడా ? ఆ తాళి శ్రీజ-ప్రసాద్‌లకు చేరిందా ? ఇలాంటి కేసుల్లో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు? అనే అంశాలతో తెరకెక్కిందే ఈ 'దొంగాట'. విశ్లేషణ: ఇద్దరు దంపతులు, ఒక దొంగ, చిన్న కేసు, పోలీసులు అనే చిన్న కథను చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ దిలీష్ పోతన్. ఒక దొంగతనాన్ని పోలీసులు ఎలా చేధిస్తారో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఫాహద్ ఫాజిల్ బంగారు తాళిని దొంగతనం చేయడంతోనే అసలు కథ ప్రారంభవుతుంది. తర్వాత వచ్చే సీన్లు, దొంగలు, సాక్షులు, సామాన్యులతో పోలీసులు వ్యవహరించే తీరు బాగా అలరిస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా తమకు ఎలాంటి సమస్య రాకుండా పోలీసుల ప్రవర్తనా శైలీ ఆలోచింపజేసేలా ఉంటుంది. అమాయకంగా ఉంటూ చివరివరకు నేరాన్ని ఒప్పుకోని దొంగల తీరు, తమకు నష్టం కలిగినా ఇంకొకరికి అన్యాయం జరగకూడదనే భావించే మధ్యతరగతి వ్యక్తుల ఆలోచనలను చాలా బాగా చూపించారు. అక్కడక్కడా సినిమా కొంచెం సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే ? దొంగలు పారిపోతే పోలీసులు వెతికే తీరు, పై అధికారులకు సమాధానం ఇచ్చేటప్పుడు వారికి కలిగే భయం, దొంగతనం చేసిన కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉండే దొంగల ప్రవర్తన వంటి అంశాలను నటీనటులు వారి నటనతో చాలా చక్కగా చూపించారు. దొంగ పాత్రలో ఫాహద్ ఫాజిల్ అద్భుతంగా నటించాడు. 'చివరివరకు బయటపడకూడదు అనేదే తన స్టైల్' అని చెబుతూ అమాయకపు చూపులు, పోలీసులతో మాట్లాడే వైఖరీ, ఎవరు లేనప్పుడు అసలైన దొంగలా ప్రవర్తించే ఫాహద్ నటన ఆకట్టుకునేలా ఉంది. మధ్యతరగతి వ్యక్తుల్లా సూరజ్, నిమిషా కూడా చాలా చక్కగా ఒదిగిపోయి నటించారు. మిగతా పోలీసు పాత్రలు సైతం వారి నటనతో మెప్పించారు. పోలీసు వ్యవస్థలోని లొసుగులు, మధ్యతరగతి వ్యక్తుల ఆలోచనా ధోరణి, సమస్యలు ఎదురైనప్పుడు వారు రాజీపడే విధానాన్ని చూపించి దర్శకుడు దిలీప్ పోతన్ మంచి మార్కులు కొట్టేశారనే చెప్పవచ్చు. అయితే ఫాహద్ ఫాజిల్ దొంగగా మారడానికి కారణాలు, తర్వాత మంచివాడిలా మారేందుకు ప్రేరేపించిన కారణాలు అంతగా చూపించలేకపోయాడు. సజీవ్ పజూర్ అందించిన కథ, శ్యామ్ పుష్కరణ్ డైలాగ్‌లు ఓకే అనిపించాయి. రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ, బిజిబాల్ సంగీతం పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో నటనకు గానూ ఫాహద్ ఫాజిల్‌కు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌గా సజీవ్ పజూర్ కూడాల జాతీయ అవార్డును అందుకున్నారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డును సైతం అందుకుంది ఈ మూవీ. ఫైనల్‌గా ఏంటంటే కాస్త నెమ్మదిగా సాగిన ఈ 'దొంగాట' ఓసారి చూడాల్సిందే. -
'పుష్ప' సినిమా కోసం అనసూయ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Anasuya Bharadwaj remuneration for Pushpa:రంగస్థలంలో రంగమత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న యాంకర్ అనసూయ .. బడా సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇటీవలె పుష్ప సినిమాలో నటించి మరోసారి మెప్పించింది. 'దాక్షాయని' పాత్రలో మంగళం శ్రీను భార్యగా కనిపించింది. అయితే ఈ చిత్రంలో అనసూయ పాత్ర నిడివి తక్కువగా ఉందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో నటించేందుకు అనసూయ తీసుకున్న పారితోషికంపై ఎంతన్న దానిపై చర్చ మొదలైంది. ఈ సినిమాలో నటించేందుకు ఒక్కరోజుకే అనసూయ రూ. 1-1.5లక్షల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. మొత్తంగా పదిరోజులకు పైగానే కాల్షిట్లు ఇచ్చినట్లు సమాచారం. దీంతో పుష్ప చిత్రానికి గాను దాదాపు రూ.12 లక్షల వరకు అందుకుందట. ఇక పుష్ప ఫస్ట్ పార్ట్‌లో అనసూయ రోల్ తక్కువగానే ఉన్నా సెకండ్ పార్ట్‌లో మాత్రం అనసూయ రోల్ కీలకంగా మారనుందని తెలుస్తుంది. ఫాహద్ ఫాజిల్‌తో కలిసి బన్నీపై పగ తీర్చుకునేలా అనసూయ క్యారెక్టర్ ఉండనుందని సమాచారం.