విలన్‌ను కాస్తా కమెడియన్‌ను చేసేశారు! | Fahad Fazil Says He is Doing a Comedy Role In Vettaiyan | Sakshi
Sakshi News home page

Fahad Fazil: నన్ను కమెడియన్‌ను చేశారు.. పుష్ప విలన్‌

Published Thu, Apr 11 2024 12:32 PM | Last Updated on Thu, Apr 11 2024 1:52 PM

Fahad Fazil Says He is Doing a Comedy Role In Vettaiyan - Sakshi

మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ మాతృభాషలో హీరోగా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కోలీవుడ్‌, టాలీవుడ్‌లో మాత్రం విలన్‌గా నటిస్తున్న ఈయన ఇటీవల తెలుగులో పుష్ప చిత్రంలో పోలీస్‌ అధికారిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌, కీర్తీ సురేష్‌ జంటగా నటించిన మామన్నన్‌ చిత్రంలో విలనిజాన్ని పండించారు. అలాగే కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా నటించిన విక్రమ్‌ చిత్రంలోనూ కీలక పాత్రలో మెప్పించారు.

కమెడియన్‌ను చేసేశారు
తాజాగా రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న వేట్టైయాన్‌ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇందులో తన పాత్ర గురించి ఆయన మాట్లాడుతూ.. వేట్టైయాన్‌ చిత్రంలో దర్శకుడు జ్ఞానవేల్‌ తనను కమెడియన్‌గా మార్చారని చెప్పారు. కమల్‌ హాసన్‌ హీరోగా నటించిన విక్రమ్‌ మూవీలో తననే హీరోగా పలువురు భావించారని, అంత ప్రాముఖ్యత కలిగిన పాత్రల్లో నటించిన తనను వేట్టైయాన్‌ చిత్రంలో కమెడియన్‌గా చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.

అప్పుడే ఒప్పుకున్నా
రజనీకాంత్‌ చిత్రంలో కమెడియన్‌గానా? అని తాను ఆశ్చర్యపోయానని, అయితే అందులో తన పాత్ర గురించి దర్శకుడు వివరించగా ఆ పాత్రలో నటించడానికి అంగీకరించానని ఫహద్‌ ఫాజిల్‌ పేర్కొన్నారు. కాగా ఈ క్రేజీ చిత్రం అక్టోబర్‌ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

చదవండి: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నిశ్చితార్థం రోజే నటుడి దుర్మరణం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement