సినిమాలు ఎందుకు చేయడం లేదు? లైమ్ లైట్‌కు దూరంగా ఉన్న చాలామంది హీరోయిన్లను ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారు. మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నామని పలువురూ బదులిస్తుంటారు. తన విషయంలో మాత్రం అది నిజం కాదని, తనకెవరూ ఆఫర్స్ ఇవ్వకపోవడం వల్లే సినిమాలకు దూరమవ్వాల్సి వచ్చిందంటోంది హీరోయిన్ అర్చన కవి (Archana Kavi). తమిళ, మలయాళ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన ఈమె తెలుగు(Tollywood)లో హీరోయిన్‌గా బ్యాక్‌బెంచ్ అని ఒకే ఒక్క మూవీ చేసింది. తొమ్మిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న ఈమె ఐడెంటిటీ అనే మలయాళ చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది.
బ్రేక్ ఇవ్వలేదు.. వచ్చింది!
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో అర్చన ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'నా అంతట నేనుగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకోలేదు. ఎవరూ నాకు అవకాశాలివ్వలేదు, అందుకే తొమ్మిదేళ్లలో ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. 2013లో నాకు పెళ్లయింది. తర్వాత విడాకులవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. నెమ్మదిగా దాన్నుంచి కోలుకున్నాక ఈ సినిమా ఆఫర్ రావడంతో చేసేశాను' అని అర్చన చెప్పుకొచ్చింది.
చదవండి: దిల్‌రూబా టీజర్: ప్రేమ గొప్పది.. కానీ అదిచ్చే బాధే భయంకరంగా ఉంటుంది!
Comments
Please login to add a commentAdd a comment