హీరోయిన్ కాయడు లోహర్ (Kayadu Lohar)కు వింత అనుభవం ఎదురైంది. డ్రాగన్ సినిమా (Dragon Movie) ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె తమిళ సరిగమప లిటిల్ ఛాంప్స్ సీజన్ 4కు హాజరైంది. అక్కడ పాటలు పాడే ఓ బుడ్డోడు హీరోయిన్‌ను హత్తుకుని ముద్దుల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో హీరోయిన్ పెదాలపైనా ముద్దు పెట్టేందుకు ప్రయత్నించగా ఆమె తల పక్కకు తిప్పుకుంది. ఇది చూసిన జడ్జి ఎస్పీ చరణ్ ఏమీ చేయలేక చిరునవ్వు చిందించాడు.
చెడిపోతున్నారు
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షో టీఆర్పీ కోసం పిల్లలతో ఇలాంటి పనులు చేయించడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో సోషల్ మీడియా వల్ల పిల్లలు చెడిపోతున్నారనడానికి ఇదే సాక్ష్యమంటున్నారు. తల్లిదండ్రులైనా పిల్లలు ఎలా నడుచుకోవాలనేది నేర్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పనులు చేసినప్పుడు నవ్వడానికి బదులు లాగి పెట్టి ఒక్కటిస్తే వారే దారికొస్తారని సలహా ఇస్తున్నారు.
తెలుగులోనూ యాక్ట్ చేసిన హీరోయిన్
తమిళంలో ప్రసారమవుతున్న సరిగమప లిటిల్ ఛాంప్స్ నాలుగో సీజన్‌కు సింగర్ శ్వేతా మోహన్‌తో పాటు, దివంగత గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ కాయడు లోహర్ విషయానికి వస్తే.. అస్సాం రాష్ట్రానికి చెందిన ఈ బ్యూటీ ముగిల్‌పేటె అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. పతనోపాతం నూట్టండుతో మలయాళంలో ప్రవేశించింది. అదే ఏడాది శ్రీవిష్ణు హీరోగా నటించిన అల్లూరి (2022) సినిమాతో తెలుగువారిని పలకరించింది. ప్రస్తుతం డ్రాగన్ సినిమా చేస్తోంది. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది.
🤦♂️🤦♂️🤦♂️
pic.twitter.com/KbZVlDlTU6— Christopher Kanagaraj (@Chrissuccess) January 18, 2025
చదవండి: సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా!
Comments
Please login to add a commentAdd a comment