డబ్బుందన్న గర్వంతో ఎంతకైనా తెగిస్తారా? ఎంతని భరించాలి?: హనీరోజ్‌ | Honey Rose Fires at Businessman: If This Continues, Will Take Legal Action | Sakshi
Sakshi News home page

Honey Rose: నన్ను టార్గెట్‌ చేస్తూ దిగజారుడు కామెంట్స్‌.. ఇలాగే వేధిస్తే ఊరుకునేది లేదు!

Published Sun, Jan 5 2025 6:34 PM | Last Updated on Sun, Jan 5 2025 6:51 PM

Honey Rose Fires at Businessman: If This Continues, Will Take Legal Action

డబ్బుందన్న గర్వంతో ఎవరినైనా అవమానిస్తారా? దీనికి మన న్యాయవ్యవస్థలో ఆడవారికి ప్రత్యేక రక్షణ కల్పిస్తే బాగుండు అంటోంది హీరోయిన్‌ హనీ రోజ్‌ (Honey Rose). కొంతకాలంగా ఓ బిజినెస్‌మెన్‌ వేధిస్తున్నాడంటోంది బ్యూటీ. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. నా పేరు వాడితే చాలు ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందనుకుంటున్నాడో వ్యక్తి. ఎక్కడపడితే అక్కడ నన్ను మాటలతో వేధిస్తున్నాడు. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీ (Movie Industry)లో కొనసాగుతున్న నేను ఈ వేధింపుల్ని ఎందుకు సహించాలి? 

నన్నే టార్గెట్‌ చేస్తున్నాడు
నాతో పాటు చాలా మంది సెలబ్రిటీలు అతడి బిజినెస్‌కు సంబంధించిన ఈవెంట్లకు వెళ్తూ ఉండేవాళ్లం. కానీ అతడు తన ఇంటర్వ్యూలలో నన్నే టార్గెట్‌ చేస్తున్నాడు. ప్రతిసారీ నా పేరే వాడుకుంటున్నాడు. ఇలా ఒకరిగురించి ఇష్టారీతిన మాట్లాడమనేది సంస్కారమనిపించుకోదు. మొదట్లో అతడి మేనేజర్లు కలిసేవారు. తర్వాత ఇతడినీ కలిశాను. అప్పుడు ఎంతో మర్యాదగా మసులుకున్నాడు. కానీ ఓ పబ్లిక్‌ ఈవెంట్‌లో నన్ను డబుల్‌ మీనింగ్‌తో పిలిచాడు. 

(చదవండి: నా కాలేయం ఇచ్చి బతికించా.. చివరకు నా చేతుల్లోనే ప్రాణం..: ఏవీఎస్‌ కూతురు)

చులకన వ్యాఖ్యలు
ఒకసారి అతడి షాప్‌కు వెళ్లినప్పుడు కూడా మీడియా ముందు నాపై చులకన వ్యాఖ్యలు చేశాడు. అవి నన్నెంతో అసౌకర్యానికి గురి చేశాయి. అప్పుడు నేను మౌనంగానే ఉన్నాను. కానీ ఇంటికి వెళ్లాక ప్రోగ్రామ్‌ నిర్వాహకులకు కాల్‌ చేసి నాపై చీప్‌ కామెంట్లు చేస్తే సహించేది లేదని చెప్పాను. అప్పటినుంచి తన ప్రోగ్రామ్స్‌కు వెళ్లడమే మానేశాను. 

మళ్లీ అవే దిగజారుడు వ్యాఖ్యలు
అయితే నేను హాజరైన ఓ ప్రోగ్రామ్‌కు అతడు గెస్టుగా వచ్చాడు. అతడు వస్తున్నాడన్న విషయం నాకు తెలియదు. అక్కడికి వెళ్లాక నాతో డైరెక్ట్‌గా మాట్లాడలేదు కానీ అందరిముందు మళ్లీ నాపై చవకబారు వ్యాఖ్యలు చేశాడు. తర్వాత మరోసారి తన బిజినెస్‌ ప్రమోషన్స్‌లో పాల్గొనమని ఆఫర్‌ ఇచ్చాడు. నేను కుదరదన్నాను. అతడి మేనేజర్‌.. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నేను వారి ఆఫర్‌ను తిరస్కరించాను. 

(చదవండి: 'వాటితో ఎలాంటి ఉపయోగం లేదు'.. పూనమ్‌ ట్వీట్‌పై మా అసోసియేషన్)

ఇలాగే వేధిస్తే ఊరుకునేది లేదు
నేను కాకపోతే మరో సెలబ్రిటీని వెతుక్కుంటానన్నాడు. అలాంటప్పుడు నేను తప్పుకున్నా పెద్ద నష్టం లేదంటూ రాసుకొచ్చింది. హనీతో నువ్వు హోటల్స్‌లో ఉంటున్నావా? అంటూ కొందరు అతడిని పిచ్చి ప్రశ్నలు వేసినప్పుడు తనిచ్చే సమాధానాలు కూడా చెండాలంగా ఉంటున్నాయి. మౌనంగా ఉంటున్నానంటే అన్నింటికీ తలాడిస్తున్నట్లు కాదు. ఇంకా ఇలాగే వేధిస్తే పోలీసులను ఆశ్రయిస్తాను అని రాసుకొచ్చింది.

సినిమా
కాగా వీరసింహారెడ్డి చిత్రంతో హనీరోజ్‌ పేరు టాలీవుడ్‌ (Tollywood)లో మార్మోగిపోయింది. ఈ మలయాళ భామ 2008లో ఆలయం సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్‌ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. మలయాళంలోనే వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ చేతిలో ప్రస్తుతం రాచెల్‌ అనే ప్రాజెక్ట్‌ ఉంది. ఇందులో హనీ ఊరమాస్‌ లుక్‌లో కనిపించనుంది.

 

 

చదవండి: ప్రభాస్‌ 'కల్కి' సినిమా.. అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement