హీరోయిన్ హనీరోజ్ సాహసం.. అలాంటి ప్లేసులో ముద్దు! | Actress Honey Rose Risky Stunt Blarney stone | Sakshi
Sakshi News home page

Honey Rose: రిస్క్ చేసి మరీ అలా ముద్దుపెట్టిన హనీరోజ్!

Published Sat, Jun 17 2023 3:52 PM | Last Updated on Sat, Jun 17 2023 4:10 PM

Actress Honey Rose Risky Stunt Blarney stone - Sakshi

హీరోయిన్ హనీరోజ్ పేరు చెప్పగానే కుర్రాళ్లు అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే ఆమె గ్లామర్, ఒంపుసొంపులు అలాంటివి మరి. 15 ఏళ్ల క్రితమే తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'వీరసింహారెడ్డి'తోనే గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా ఓ రిస్కీ పనిచేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.  

స్వతహాగా మలయాళీ అయిన హనీరోజ్.. కెరీర్ స్టార్టింగ్ లో 'ఆలయం' మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. 2014లో వరుణ్ సందేశ్ 'ఈ వర్షం సాక్షిగా' మూవీలోనూ హీరోయిన్ గా చేసింది. ఈ రెండుసార్లు లక్ కలిసిరాలేదు. ముచ్చటగా మూడోసారి తెలుగులో చేసిన సినిమాతో ఈమెకి హిట్ దక్కింది. ఇందులో అందాల ఆరబోతతో రెచ్చిపోయినప్పటికీ కొత్తగా సినిమాల్లో ఛాన్సులయితే రాలేదు.

సినిమా కెరీర్ గురించి పక్కనబెడితే ప్రస్తుతం ఐర్లాండ్ టూర్ కి వెళ్లిన హనీరోజ్.. ఆ దేశంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన బ్లర‍్నే స్టోన్ (బ్లర్నే రాయి)ని రిస్క్ చేసి మరీ ముద్దుపెట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో భాగంగా చాలా ఎత్తులో పడుకుని.. తలని వెనక్కి వాల్చి మరీ ఆ రాయిని ముద్దాడింది. ఈ ఎక్స్ పీరియెన్స్ తనకు అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిందని హనీరోజ్ చెప్పుకొచ్చింది. 

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్.. ఇలా జరగడానికి కారణాలేంటి?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement