Veera Simha Reddy Movie
-
హనీ పాప అదిరిపోయే లుక్.. ఈసారి ట్రీట్ మామూలుగా లేదుగా!
బాలయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ హనీ రోజ్. ఈ కేరళ కుట్టి ముద్దుగుమ్మ మలయాళంలో '14 వయదిల్ బాయ్‌ఫ్రెండ్' అనే చిత్రం ద్వారా 2004లో హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో మొదలు కనవే, సింగం పులి, మల్లు కట్టు, గాంధర్వన్ లాంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. గతేడాది బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇటీవల డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అప్పుడప్పుడు ఈవెంట్లలో సందడి చేసే కేరళ భామ గతంలోనూ డిఫరెంట్ లుక్స్‌లో కనిపించింది. తాజాగా ఓ జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. డంబెల్‌తో కసరత్తులు చేస్తూ సందడి చేసింది. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. హనీ రోజ్ న్యూ లుక్ చూశారా అంటూ పోస్టులు పెడుతున్నారు. గతంలో ఇలాగే స్టన్నింగ్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు షాకిచ్చిన మలయాళీ భామ.. మరోసారి అదిరిపోయే ట్వీట్ ఇచ్చింది. ఈ సారి ఏకంగా జిమ్ డ్రెస్‌లో స్టేజీపై అదరగొట్టేసింది. Clicks 📸 pic.twitter.com/n0o6Mofw94 — Honey Rose (@HoneyRoseNET) January 23, 2024 Any fitness tips? 😋 pic.twitter.com/vkRHgg2NUR — Honey Rose (@HoneyRoseNET) January 23, 2024 💪🚶♀️ pic.twitter.com/uW9oEnyWA9 — Honey Rose (@HoneyRoseNET) January 22, 2024 -
ప్రముఖ హీరో మంచి మనసు... ఆరుగురు ఖైదీలు విడుదల
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రం ద్వారా కన్నడ హీరో దునియా విజయ్ టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో ముసలిమడుగు ప్రతాప్ రెడ్డిగా ఆయన విలన్ పాత్ర పోషించాడు. అక్కడ చిత్ర సీమలో ఆయనకు తనదైన స్టార్డమ్ ఉంది. దునియా విజయ్ కొద్దిరోజుల క్రితం తన స్వగ్రామం కుంబరనహళ్లిలో పర్యటించారు. తన స్వగ్రామంలో ఎంతో ఉత్సాహంగా ప్రతి వీధి వెంట ఆయన తిరిగాడు. తన చిన్ననాటి జ్ఞాపకాలను అక్కడ స్థానికులతో పంచుకున్నాడు. స్నేహితులు, బంధువులతో సరదాగా గడిపాడు. నేడు (జనవరి 20న) తన పుట్టినరోజును స్వగ్రామంలోనే జరుపుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉండగా కుంబరహళ్లిలో కొన్ని కారణాల వల్ల జైలుకు వెళ్లిన కొన్ని కుటుంబాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. తమ కుటుంబ సభ్యులను జైలు నుంచి విడుదల చేసేలా చూడాలని విజయ్‌ని వారు కోరారు. దీంతో ఆయన వెంటనే తన లాయర్లతో సంప్రదించి తన స్వగ్రామానికి చెందిన 6 మంది ఖైదీలను విడిపించారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న ఆరుగురు ఖైదీలను నటుడు విజయ్ స్వయంగా విడుదల చేపించారు. కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉండే వ్యక్తులు తమతో లేకుండా జీవించడం చాలా కష్టం. అలాంటి బాధ ఎవరికీ రాకూడదని విజయ్ చెప్పాడు. గతంలో ఒక సినిమా షూటింగ్ కోసం మైసూర్ జైలుకు దునియా విజయ్ వెళ్లాడు. అక్కడ పలువురు ఖైదీలతో మాట్లాడి వారి కష్టాలు, సంతోషాలను అడిగి తెలుసుకున్నారు. కొందరు వృద్ధ ఖైదీలు జరిమానా చెల్లిస్తే విడుదల చేసేందుకు అనుమతి ఉంది. కానీ వారి వద్ద చెల్లించేందుకు డబ్బు లేదు. ఈ విషయం తెలుసుకున్న విజయ డబ్బు సహాయం చేసి 62 మంది ఖైదీలను అక్కడి నుంచి విడుదల చేపించారు. ప్రస్తుతం వారి స్వస్థలం కుంబరనహళ్లిలోని 6 మంది ఒక కేసులో ఖైదీలుగా ఉన్న వారి పరిస్థితి కూడా అలాంటిదే. శిక్ష కాలం పూర్తి అయినా జరిమానా చెల్లించేందుకు వారి వద్ద డబ్బు లేదు. దీంతో వారు అదనపు శిక్షను అనుభవిస్తున్నారు. తన లాయర్ ద్వారా ఆ డబ్బును చెల్లించి తన స్వగ్రామానికి చెందిన ఆరుగురిని కస్టడీ నుంచి విడిపించారు. సలగ సినిమా ఘనవిజయం తర్వాత దునియా విజయ్ కన్నడ చిత్ర పరిశ్రమలో తనదైన స్టార్‌డమ్‌ని పెంచుకున్నాడు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ భీమ్ చిత్రంలో నటిస్తున్నాడు. నేడు (జనవరి 20న) దునియా విజయ్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో స్వగ్రామంలోనే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో తన కోసం ఎలాంటి ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టవద్దని అభిమానులను ఆయన అభ్యర్థించాడు. -
సంక్రాంతి మూవీస్.. ఆమె నటిస్తే హిట్ కొట్టడం గ్యారంటీనా?
ఈమె ఓ సినిమాలో నటించి.. అది సంక్రాంతికి రిలీజ్ అయితే హిట్ గ్యారంటీ! అబచ్చా.. ఈమె యాక్ట్ చేస్తే హిట్ కొట్టడం ఏంటి బాసూ.. సినిమాలో దమ్ముండాలి. జనాలకు అది నచ్చాలి కదా? అని మీరు అనుకోవచ్చు. కానీ గత మూడు-నాలుగేళ్లుగా చూసుకుంటే మాత్రం పండక్కి వచ్చే చిత్రాలకు ఈమె లక్కీ ఛార్మ్ అయిపోయినట్లు కనిపిస్తుంది. ఇంతకీ ఎవరీ బ్యూటీ? ఈమె అదృష్టం సంగతేంటి? పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు వరలక్ష్మి శరత్ కుమార్. సాధారణంగా అలాంటి పొట్టిపొట్టి బట్టల్లో అయితే కనిపించదు. ఎందుకంటే ఈమె హీరోయిన్ కాదు. ఒకప్పుడు హీరోయిన్గా చేసింది గానీ హిట్స్ పడలేదు. దీంతో రూట్ మార్చేసింది. తొలుత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసింది. అవి క్లిక్ అయ్యేసరికి ఇలాంటివే చేస్తూ వచ్చింది. అయితే ఈమెలోని అద్భుతమైన నటిని గుర్తిస్తున్న పలువురు డైరెక్టర్స్.. ఈమెకు డిఫరెంట్ రోల్స్ ఇస్తూ ప్రోత్సాహిస్తున్నారు. (ఇదీ చదవండి: క్లీంకార తొలి సంక్రాంతి సెలబ్రేషన్స్.. మెగా ఫ్యామిలీ అంతా అక్కడికి షిఫ్ట్) అలా తెలుగులోనూ గత నాలుగైదేళ్లలో వరలక్ష్మికి మంచి మంచి రోల్స్ పడ్డాయి. 2021 సంక్రాంతికి రవితేజ 'క్రాక్'లో విలన్ భార్యగా నటించింది. ప్రతినాయక ఛాయలున్న పాత్రలో అదరగొట్టేసింది. ఇక గతేడాది పండక్కి వచ్చిన 'వీరసింహారెడ్డి' చిత్రంలోనూ హీరోకి చెల్లెలి పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టేసింది. తాజాగా 'హను-మాన్'లోనూ హీరోకి అక్క పాత్రలో ఉన్నది కాసేపే అయినా కేక పుట్టించేసింది. అనుకోకుండా జరిగినా సరే 2021, 2023, 2024లో సంక్రాంతికి వచ్చి హిట్ అయిన సినిమాల్లో ఈమె నటించడంతో వరలక్ష్మిని... పండగ సినిమాల లక్కీ ఛార్మ్ అని అంటున్నారు. అయితే ఈమె ఉన్నంత మాత్రాన హిట్ అయిపోలేదు. సినిమాలో కంటెంట్‌కి తోడు వరలక్ష్మి యాక్టింగ్ కూడా కలిసొచ్చి ఇప్పుడు ఈమె.. టాలీవుడ్లో స్టార్ యాక్టర్ అయిపోయిందనొచ్చు. (ఇదీ చదవండి: ఆ జ్ఞాపకాల్లోనే మెగాడాటర్.. ముద్దులిచ్చేస్తున్న 'బిగ్‌బాస్ 7' బ్యూటీ!) -
లుక్ మార్చిన యంగ్ హీరోయిన్.. మరీ ఇలా అయిపోయిందేంటి?
సాధారణంగా హీరోయిన్లు దాదాపు ఒకేలా కనిపిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం కట్టుబొట్టు మార్చి షాకిస్తుంటారు. అలా తెలుగులో ఓ సినిమా చేసిన యంగ్ బ్యూటీ కూడా సడన్ షాకిచ్చింది. మొత్తం వేషధారణ మార్చేసి కనిపించింది. ఈమెని చూసిన నెటిజన్స్, ప్రేక్షకులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈమెని గుర్తుపట్టారా? ఎవరో చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: పుట్టిన బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్) పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు హనీరోజ్. హా అవును మీరు ఊహించింది కరెక్టే. గతేడాది సంక్రాంతికి రిలీజైన 'వీరసింహారెడ్డి' సినిమాలో ఓ హీరోయిన్గా నటించింది ఈమెనే. ఈ మూవీతో ఈమెకు క్రేజ్ బాగానే వచ్చినప్పటికీ ఛాన్సులే సరిగా రాలేదు. తెలుగులో మరో మూవీ చేయట్లేదు. అదే టైంలో ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. ఈమె వయసు 32 ఏళ్లే అయినప్పటికీ రోజురోజుకీ బొద్దుగా మారిపోతోంది. సినిమాలు ఛాన్సులు పెద్దగా రావట్లేదని షాప్, మాల్ ఓపెనింగ్స్ తదితర ఈవెంట్స్‌తో హనీరోజ్ ఫుల్ బిజీగా ఉంటోంది. తాజాగా ఊటీలో ఓ షాప్ ఓపెనింగ్‌కి వచ్చిన ఈ హాట్ బ్యూటీ.. డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో కనిపించింది. ఈ క్రమంలోనే హనీరోజ్ లేటెస్ట్ లుక్‌పై తెలుగు మీమర్స్ ఫన్నీ సెటైర్స్ వేస్తున్నారు. ఏదేమైనా హనీరోజ్ తాజాగా ఫొటోలు, వీడియోలు మాత్రం మంచి క్రేజీగా ఉన్నాయి. (ఇదీ చదవండి: రిలీజ్ డేట్ గందరగోళం.. సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ) #HoneyRose Recent Clicks 📸😍❤ pic.twitter.com/47YDg3bO7z — Trend Soon (@trend_soon) January 6, 2024 -
హీరోయిన్ హనీరోజ్ సాహసం.. అలాంటి ప్లేసులో ముద్దు!
హీరోయిన్ హనీరోజ్ పేరు చెప్పగానే కుర్రాళ్లు అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే ఆమె గ్లామర్, ఒంపుసొంపులు అలాంటివి మరి. 15 ఏళ్ల క్రితమే తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'వీరసింహారెడ్డి'తోనే గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా ఓ రిస్కీ పనిచేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. స్వతహాగా మలయాళీ అయిన హనీరోజ్.. కెరీర్ స్టార్టింగ్ లో 'ఆలయం' మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. 2014లో వరుణ్ సందేశ్ 'ఈ వర్షం సాక్షిగా' మూవీలోనూ హీరోయిన్ గా చేసింది. ఈ రెండుసార్లు లక్ కలిసిరాలేదు. ముచ్చటగా మూడోసారి తెలుగులో చేసిన సినిమాతో ఈమెకి హిట్ దక్కింది. ఇందులో అందాల ఆరబోతతో రెచ్చిపోయినప్పటికీ కొత్తగా సినిమాల్లో ఛాన్సులయితే రాలేదు. సినిమా కెరీర్ గురించి పక్కనబెడితే ప్రస్తుతం ఐర్లాండ్ టూర్ కి వెళ్లిన హనీరోజ్.. ఆ దేశంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన బ్లర్నే స్టోన్ (బ్లర్నే రాయి)ని రిస్క్ చేసి మరీ ముద్దుపెట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో భాగంగా చాలా ఎత్తులో పడుకుని.. తలని వెనక్కి వాల్చి మరీ ఆ రాయిని ముద్దాడింది. ఈ ఎక్స్ పీరియెన్స్ తనకు అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిందని హనీరోజ్ చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్.. ఇలా జరగడానికి కారణాలేంటి?) -
మొదటి రోజే అదరగొట్టిన దసరా.. కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం 'దసరా'. ఈ సినిమా శ్రీరామనవమి సందర్భంగా థియటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా తొలిరోజే కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ రెండు చిత్రాలను దాటేసి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'దసరా'కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దసరా విడుదలైన మొదటి రోజే సంక్రాంతి హిట్ సినిమాలను అధిగమించేసింది. ఈ ఏడాది రిలీజైన మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాకు నైజాంలో 6.21 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాగా.. బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి'కి రూ. 6.10 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ రెండు సినిమాలను దాటేసిన నాని 'దసరా' నైజాంలో ఫస్ట్ డే రూ. 6.78 కోట్ల వసూళ్లు రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు సుమారు రూ.25 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు సినిమా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో మొత్తం కలిపి రూ. 14.22 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు టాక్. నాని కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసిన సినిమాగా 'దసరా' రికార్డులకు ఎక్కింది. ఈ సినిమాకు తెలంగాణలో మంచి ఆదరణ లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు దాదాపు రూ.38 కోట్ల వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. -
వీరసింహారెడ్డి.. ఆ సీన్ పెట్టుంటే సినిమా ఆడేదే కాదు: పరుచూరి
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ను తెగ మెప్పించింది. ఓటీటీలోనూ అదరగొడుతున్న ఈ చిత్రంపై తాజాగా సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చాడు. 'వీరసింహారెడ్డి చూశాను. ఈ సినిమా చూస్తుంటే నాకు నందమూరి తారకరామారావుగారి చండశాసనులు మూవీ గుర్తొచ్చింది. ఎందుకంటే రెండు సినిమాల కథాబీజం ఒకటే. అన్నాచెల్లెళ్ల మధ్య వైరం, అన్నయ్య నాశనమైపోవాలని శపించడం వంటివి రెండింటిలోనూ ఉంటాయి. వీరసింహారెడ్డిలో తాను కోరుకున్నవాడిని చంపించేశాడన్న కోపంతో అన్నయ్య శత్రువులింట్లో ఒకరితో తాళి కట్టించుకుని వాళ్ల సాయంతో సొంత అన్నమీద పగ తీర్చుకోవాలనుకుంటుంది చెల్లెలు వరలక్ష్మి. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు ఇది బాగా సరిపోయింది. ఫస్టాఫ్ చూసినంతసేపు ఇది బోయపాటి శ్రీను సినిమా చూస్తున్నట్లే అనిపించింది. ఫస్టాఫ్ బంగారంలా ఉంది. కానీ సెకండాఫ్ బంగారం, వెండికి మధ్యలో ఉన్నట్లు అనిపించింది. ఒక భయంకరమైన పులి గాండ్రింపులు విన్నాక అది సడన్‌గా కామ్ అయిపోయి చెల్లెలిని చూసి తోకాడిస్తే చూడబుద్ధి కాదు. అయినా అన్నాచెల్లెల అనుబంధమే ఈ సినిమాను కాపాడింది, రూ.130 కోట్లు వసూలు చేయగలిగింది. కానీ ఇదే సినిమాను ఇంకా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఎలాగంటే.. పెద్ద బాలయ్య పాత్ర చనిపోయాక ఫ్లాష్‌బ్యాక్ చూపించారు. ఎప్పుడైతే ఆయన పాత్ర చనిపోయాడని ప్రేక్షకులకు తెలిసిపోయిందో అప్పుడే ఒక నిరాశ వచ్చేస్తుంది. సెకండాఫ్‌లో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అంత నిడివి అక్కర్లేదు. నవీన్ చంద్ర ఆత్మహత్య చేసుకున్నట్లు చూపించారు, కానీ అది నిజం కాదని నేను పసిగట్టాను. హీరో మూలంగా అతడు చనిపోయినట్లు ఉంటే మాత్రం సినిమా ఆడేదే కాదు. ఈ సినిమాలో ఉన్న ప్రాథమిక లోపం.. వీరసింహారెడ్డి పాత్రను ముగించి తర్వాత ఫ్లాష్‌బ్యాక్ చూపించడం. కొన ఊపిరితో ఉన్నప్పుడు చిన్న బాలయ్యకు ఫ్లాష్‌బ్యాక్ చెప్పి అతడు విలన్‌ను చంపేసి అత్త, తండ్రికి సమాధులు కట్టినట్లు చూపించి ఉంటే బాగుండేది. చిన్న బాలయ్య ఇష్టపడ్డ హీరోయిన్ తండ్రి కూడా విలన్లలో ఒకడని చూపించాడు, కానీ ఆ పాత్ర ఏమైందో చూపించలేదు. హీరోహీరోయిన్లకు పెళ్లైందా? లేదా? బెంగళూరు నుంచి వచ్చిన వాళ్లు ఏమయ్యారు? ఇలా కొన్నింటిని చూపించకుండానే సినిమా ముగించేశారు. దీంతో సడన్‌గా సినిమా ముగిసినట్లైంది. ఇలాంటి చిన్నచిన్న తప్పులన్నింటినీ జయించి సినిమా అన్ని కోట్లు రాబట్టడానికి బాలయ్య ఒక్కరే కారణం అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. -
మాస్ హీరోల దాడి.. అందాల భామలకు మళ్లీ కష్టాలే!
ఇటీవలకాలంలో హీరోయిన్స్ ...హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించుకున్నారు. అంతే కాదు హీరోలతో పాటు సమానంగా స్క్రీన్ స్పెస్ షేర్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఓల్డ్ ట్రెండ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. దీంతో హీరో సెంట్రిక్ సినిమాల హవా మొదలయింది. మాస్ హీరోల సినిమాల దాటికి వుమెన్ సెంట్రిక్ సినిమాలకి అనుకున్న రేంజ్ లో హైప్ రావటం లేదు.. దీంతో స్టార్ హీరోయిన్స్ సైతం ఇప్పుడు ప్రేక్షకుల అటెన్షన్ కోసం నానా తంటాలు పడుతున్నారు. హీరోల ఫైట్స్ అండ్ ఎలివేషన్స్ తో స్క్రీన్ నిండిపోవటంతో.. హీరోయిన్స్ పాటలకి..రెండు సీన్స్ కి పరిమితం అయిపోతున్నారు. గతంలో కమర్షియల్ సినిమాలకు ఒక ఫార్మూలా ఉండేది..ఆరు పాటలు...ఆరు ఫైట్స్...మధ్య లో హీరోయిన్ తో రెండు మూడు సీన్స్ ... ఇప్పుడు కమర్షియల్ మూవీస్ కి ఆదరణ పెరగటంతో...హీరోయిన్స్ స్క్రీన్ స్పెస్ కోసం నానా తంటాలు పడుతున్నారు. సంక్రాంతి కి రిలీజైన కమర్షియల్ మూవీస్ చూస్తే...ఈ విషయం క్లారిటీగా అర్ధమైపోతుంది. వాల్తేరు వీరయ్య...వీర సింహారెడ్డి..వారసుడు సినిమాల్లో హీరోయిన్స్ నామా మాత్రంగానే కనిపించారు. వాళ్ల పాత్రలకి ఎలాంటి ప్రాధాన్యత లేదనే చెప్పాలి. వాల్తేరు వీరయ్య లో శృతిహాసన్ రా ఏజెంట్ క్యారెక్టర్ చేసినా..పెద్దగా స్క్రీన్ స్పెస్ దక్కించుకోలేకపోయింది. ఇక వీర సింహారెడ్డిలో హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ పాటలకే పరిమితం అని చెప్పాలి. వారసుడులో నటించిన రష్మిక మందన్న పరిస్థితి కూడా అలానే అయింది. పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ములేపిన సినిమాలు కెజిఎఫ్ చాపర్ట్ వన్..కెజిఎఫ్ ఛాప్టర్ 2.. ఈరెండు సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది. కానీ స్క్రీన్ స్పెస్ తక్కువనే చెప్పాలి. కమర్షియల్ సినిమాలతో బజ్ క్రియేట్ చేయలేకపోతున్న హీరోయిన్స్ కి... లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా కలిసి రావటం లేదు. ఈ మధ్య యశోద మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది సమంత..అయితే ఈ సినిమా థియేటర్స్ లో ఉన్నప్పుడు సమంత పేరు ఇండస్ట్రీలో బాగానే వినిపించినా..ఆ తర్వాత ఎక్కడా సమంత పేరు వినబడలేదు. ఇక కమర్షియల్ సినిమాలనే నమ్ముకున్న కీర్తి సురేష్, రష్మిక మందన్న, పూజా హెగ్డే... లాంటి హీరోయిన్ల పేర్లు సినిమా ఎనౌన్స్మెంట్ ...మూవీ ఓపెనింగ్స్ లో తప్ప ఎక్కడ వినిపించటం లేదు. ఇక సినిమాలు సక్సెస్ అయితే హీరో దర్శకులు గురించి మాట్లాడుతున్నారు తప్ప... హీరోయిన్స్ గురించి ఎవరు పెద్దగా మాట్లాడటం లేదు. హీరో సెంట్రిక్ సినిమాలకు క్రేజ్ రావటంతో...ఈ అందాల భామలను ప్రేక్షకులు కూడా పట్టించుకోవటం లేదు. సో..మొత్తానికి కమర్షియల్ సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పై నల్లపూసల్లా మారిపోయిన హీరోయిన్స్ క్రేజ్ తగ్గిందనే మాట ..ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తుంది. -
ఈ వారం థియేటర్స్‌లో చిన్న చిత్రాలు..ఓటీటీలో బ్లాక్ బస్టర్స్
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న చిత్రాల హవా నడుస్తోంది. సంక్రాంతి పండగా కారణంగా జనవరిలో అన్ని పెద్ద చిత్రాలే విడుదలయ్యాయి. చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకడం కష్టంగా మారింది. దీంతో ఫిబ్రవరి నెలలో వరుసగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే వాటిలో రైటర్ పద్మభూషన్.. సార్, వినరో భాగ్యము విష్ణు కథ లాంటి సినిమాలు పాజిటివ్ టాక్ సంపాదించుకోగా.. పెద్ద చిత్రాలుగా వచ్చిన అమిగోస్, మైఖేల్ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడ్డాయి. ఇక ఈ నెల చివరి వారంలో థియేటర్స్ సందడి చేసేందుకు చిన్న చిత్రాలు రెడీ అయితే.. ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి పెద్ద చిత్రాలు రాబోతున్నాయి. మరి ఈ వారం ఓటీటీ, థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలపై ఓ లుక్కేద్దాం. మిస్టర్ కింగ్ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో నటుడు టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నాడు. దివంగత దర్శకురాలు విజయ నిర్మల మనవడు శరణ్ కుమార్ హీరోగా శశిధ్ చావలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ కింగ్’. యశ్విక నిష్కల, ఊర్వి సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కోససీమ థగ్స్ ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా తెరకెక్కించిన ఇంటెన్స్ యాక్షన్ తమిళ చిత్రం ‘థగ్స్’. హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సింహ, ఆర్కే సురేష్, మునిష్కాంత్, అనస్వర రంజన్ కీ రోల్స్ చేశారు. హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై జీయో స్టూడియోస్ భాగస్వామ్యంతో రియా షిబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. తెలుగులో ‘కోనసీమ థగ్స్’పేరుతో ఈ చిత్రం రిలీజ్ రాబోతుంది. డెడ్‌లైన్ అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం డెడ్ లైన్. బొమ్మారెడ్డి.వి.ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న పెద్ద చిత్రాలు వారసుడు తమిళస్టార్ విజయ్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన లేటెస్ట్ మూవీ వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో వారసుడు పేరుతో విడుదలై భారీ విజయం సాధించింది. ది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి రానుంది. వీరసింహారెడ్డి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. ఫిబ్రవరి 23నుంచి ప్రముఖ ఓటీటీ హాట్ స్టార్‌లో వీరసింహారెడ్డి స్ట్రీమింగ్ కానుంది. మైఖేల్ సందీప్ కిషన్ హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 3న విడుదలై బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో అనుకున్న సమయానికంటే ముందే ఓటీటీలోకి ఈ చిత్రం వచ్చేస్తుంది. ఫిబ్రవరి 24 నుంచి ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించగా, విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. దాదాపు రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి మెగాస్టార్ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ నెల 27 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీలోకి సంక్రాంతి బ్లాక్ బస్టర్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సంక్రాతి బరిలో నిలిచి సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రాలు ఓటీటీలోనూ అలరించనున్నాయి. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పటికే రెండు చిత్రాలు స్ట్రీమింగ్ అవుతుండగా.. మిగతా సినిమాలు వచ్చే వారం స్ట్రీమింగ్ కానున్నాయి. థియేటర్లలో చూడలేక మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి వాల్తేరు వీరయ్య స్ట్రీమింగ్ తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఓటీటీలో వీరసింహారెడ్డి నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23 నుంచి హాట్ స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కళ్యాణం కమనీయం యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. పేపర్ బాయ్ చిత్రంతో హీరోగా పరిచయం అయిన అతడు ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అతడు నటించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం’. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లోకి వచ్చింది. తాజాగా ఈ ఈ సినిమా ఫిబ్రవరి 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. తునివు తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ తునివు. జీ సినిమా సంస్థతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్లో తెగింపు పేరుతో విడుదలైంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కోలీవుడ్‌లో హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో అలరిస్తుంది. ఫిబ్రవరి 8 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. వచ్చేస్తున్న వారసుడు దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వారిసు(వారసుడు). వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు, తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. సంక్రాంతికి రిలీజైన వారసుడు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి రానుంది. -
అప్పుడే ఓటీటీకి వీర సింహారెడ్డి? స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే..!
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. బాలయ్యకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంకాంత్రి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇదిలా ఉంటే థియేటర్లో సందడి చేసిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో వీర సింహారెడ్డి ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. చదవండి: సీనియర్ నటి ఖుష్బుకు చేదు అనుభవం ఈ తాజా బజ్ ప్రకారం త్వరలోనే ఈమూవీ ఓటీటీకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను డిస్నిప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం డిస్నిప్లస్ హాట్‌స్టార్ మేకర్స్‌తో భారీ ధరకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వీర సింహారెడ్డి ఓటీటీ హక్కుల కోసం హాట్ స్టార్ భారీగానే డబ్బులు చెల్లించినట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21 నుంచి ఓటీటీలో అందుబాటులోకి తెచ్చేందుకు హాట్‌స్టార్ ప్లాన్ చేస్తోందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. చదవండి: వేణుకి రూ. 20 కోట్ల పైగా ఆస్తులు.. కానీ నేను అద్దే ఇంట్లో ఉంటున్నా: వేణు మాధవ్ తల్లి -
డైరెక్టర్ గోపిచంద్ మలినేనికి రజని ఫోన్, ఏమన్నారంటే..!
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరో తెరకెక్కిన చిత్రం ‘వీర సింహారెడ్డి’. సంక్రాంతి సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. రాయలసీమ నేపథ్యంలో యాక్షన్, ఫ్యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం బాలయ్య కెరీర్లో ఘన విజయం సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ వీర సింహారెడ్డి టీంను ప్రశంసించారు. చదవండి: పూజా హెగ్డే ఇంట పెళ్లి సందడి.. ఫొటోలు షేర్ చేసిన ‘బుట్టబొమ్మ’ అంతేకాదు డైరెక్టర్ గోపిచంద్ మలినేనికి ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారట తలైవా. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మురిసిపోయారు గోపిచంద్. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘‘ఇది నాకు అద్భుతమైన క్షణం. తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ సర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ‘వీర సింహారెడ్డి చిత్రాన్ని చూశాను. మూవీ మేకింగ్ నాకు బాగా నచ్చింది’ అని ఆయన నాతో చెప్పారు. చదవండి: కర్ణాటకలో సింగర్ కైలాశ్ ఖేర్‌పై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం మా చిత్రం గురించి ఆయన అన్న మాటలు, ఆయనకు కలిగిన భావోద్వేగం.. ఇంతకంటే నాకు ఈ ప్రపంచంలో విలువైనది ఇంకేదీ లేదనిపిస్తోంది. థ్యాంక్యూ రజని సర్’’ అని గోపించంద్ మలినేని ఆనందం వ్యక్తం చేశాడు. కాగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ మూవీలో బాలయ్య సరసన శృతి హాసన్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్, కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్స్‌గా నటించారు. జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. This is a surreal moment for me🤩🤗 Received a call from the Thalaivar, The Superstar @rajinikanth sir. He watched #VeeraSimhaReddy and loved the film. His Words of praise about my film and the emotion he felt are more than anything in this world to me. Thankyou Rajini sir🙏 — Gopichandh Malineni (@megopichand) January 29, 2023 -
హనీరోజ్‌ను గుర్తుపట్టారా? 15 ఏళ్ల క్రితమే తెలుగులో ఎంట్రీ..
సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి.. రెండూ హిట్టే. అయితే వీరసింహారెడ్డి కంటే కూడా వాల్తేరు వీరయ్య కలెక్షన్ల వసూళ్లలో ఎక్కువ జోరు చూపిస్తోంది. ఇకపోతే వీరసింహారెడ్డిలో నటించిన హనీరోజ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో తెలుగులో హనీరోజ్‌కు బోలెడంత పాపులారిటీ వచ్చింది. అసలు ఆమె ఎవరు? అని చాలామంది ఫ్యాన్స్ గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.. హనీరోజ్ 14వ ఏట నుంచే నటించడం మొదలుపెట్టింది. మలయాళంలో వచ్చిన బాయ్‌ఫ్రెండ్ తన మొదటి చిత్రం. ఆ తర్వాత ఏడాది ముత్యాల సుబ్బయ్య 50వ చిత్రం ఆలయంలో కథానాయికగా నటించింది. ఇందులో శివాజీ హీరోగా చేశాడు. త్రివేండ్రం లాడ్జ్ సినిమాతో మంచి బ్రేక్ లభించింది. ఆ సినిమా హిట్ అయిన తర్వాత తన పేరును ధ్వని నంబియార్ నుంచి హనీరోజ్‌గా మార్చుకుంది. అప్పటినుంచి వరుస పెట్టి మలయాళంలో సినిమాలు చేసుకుంటూ పోయిన హనీ మధ్యలో ఓసారి ఈ వర్షం సాక్షిగా చిత్రంలో ఓ పాత్రలో మెరిసింది. మొత్తానికి 'ఆలయం' సినిమాతో దాదాపు 15 ఏళ్ల కిందటే తెలుగు ప్రేక్షకులను పలకరించిన హనీరోజ్ ఇన్నాళ్లకు టాలీవుడ్లో గుర్తింపు దక్కించుకుంది. చదవండి: రమ్య నాకు తిండి కూడా పెట్టదు.. సుపారీ ఇచ్చి నన్ను చంపించే ప్రయత్నం: నరేశ్ ఎన్టీఆర్‌ను జమున కాలితో తన్నడంపై వివాదం -
అక్కినేని వివాదంపై స్పందించిన బాలయ్య
‘అక్కినేని తొక్కినేని’ వివాదంపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావుని కించపరిచే వ్యాఖ్యలు తాను చేయలేదన్నారు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో యాదృచ్చికంగా ఆ మాట వచ్చిందన్నారు. హిందూపురంలో జరిగిన ఆ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటివారు నాన్నగారు(ఎన్టీఆర్), అక్కినేని నాగేశ్వరరావు . నాన్నగారు నేర్పిన క్రమశిక్షణ నేర్చుకున్నాను. నాన్న పరమపదించిన అనంతరం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు కు ఇచ్చాం. బాబాయి(నాగేశ్వరరావు) పై ప్రేమ గుండెల్లో ఉంటుంది. బయట ఏం జరిగినా నేను పట్టించుకోను. ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు’ అని బాలకృష్ణ అన్నారు. కాగా, వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్లో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్ టైమ్‌లో నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో చెబుతూ.. ‘అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునే వాళ్ళం’ అని బాలకృష్ణ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదస్పదంగా మారాయి. -
బాలకృష్ణ క్షమాపణలు చెప్పాల్సిందే.. అక్కినేని ఫ్యాన్స్
నందమూరి బాలకృష్ణపై అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. తన అభిమాన హీరో, గొప్ప నటుడు స్వర్గీయ నాగేశ్వరరావుని కించపరిచేలా ‘అక్కినేని తొక్కినేని’అని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. బాలయ్య వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం జరిగిన వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో బాలయ్య ఈ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్ విషయాలను ప్రస్తావిస్తూ.. ‘అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునే వాళ్ళం’. అని బాలకృష్ణ అన్నారు. (చదవండి: బాలకృష్ణ ‘అక్కినేని తొక్కినేని’ వ్యాఖ్యలపై నాగచైతన్య, అఖిల్ ఫైర్) దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య వ్యాఖ్యలపై ఆల్ ఇండియా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్వేశ్వరరావు మండిపడ్డారు. ‘బాలయ్య స్టేజ్‌పై ఏం మాట్లాడుతాడో కూడా తెలియదు. మహానటుల గురించి జోక్‌గా మాట్లాడుకోవడం చాలా పెద్ద తప్పు. ఏన్నాఆర్ నాకు బాబాయ్ లాంటివాడు అని చెప్పుకునే బాలకృష్ణ.. ఆయన వర్థంతి రోజు(జనవరి 22).. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ పెట్టుకోవడం ఏంటి? అభిమానం ఉంటే ఒక్క నిమిషం మౌనం పాటించాలి. నాగార్జున ఎప్పుడైనా నందమూరి హీరోల గురించి మాట్లాడారా? బతికున్నంత కాలం నటించిన గొప్ప వ్యక్తి నాగేశ్వరరావు. అలాంటి వ్యక్తిని కించపరచడం అంటే తెలుగు ఇండస్ట్రీని అవమానించినట్లే. బాలకృష్ణ వెంటనే అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలి’ అని సర్వేశ్వరరావు డిమాండ్ చేశారు. కాగా, బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని మనవళ్లు హీరో నాగచైతన్య, నిఖిల్ స్పందించారు. ‘నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్ వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం’అని నాగచైతన్య, అఖిల్ ట్వీట్ చేశారు. -
ఆ సీన్ చూసి నన్ను చంపేస్తారేమోనని భయపడ్డా: వరలక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు
డేరింగ్ అండ్ బోల్డ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పోడా పోడీ అనే తమిళ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే వెండితెరపై తన బౌండరిలను చేరిపేసుకుని నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంది. ఈ నేపథ్యంలో డిగ్లామర్స్ రోల్స్‌కే కాదు విలన్ పాత్రలకు సైతం సై అంటుంది. అలా సినిమాల్లో లేడీ విలన్‌గా విజృంభిస్తోంది. ప్రస్తుతం వరలక్ష్మి తెలుగు, తమిళం, మలయాళంలో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. చదవండి: సావిత్రి గారి వల్లే నేను సక్సెస్ అయ్యాను: లలితా జువెల్లర్స్ ఎండీ ఇక రీసెంట్గా ఆమె తెలుగులో బాలకృష్ణ వీర సింహారెడ్డి చిత్రంలో నటించింది. ఇందులో సొంత అన్నయ్యను చంపే చెల్లెలిగా ప్రతినాయకి పాత్రలో మెప్పించింది. ఇందులో తన నటనకు ఆమె ప్రశంసలు అందుకుంటుంది. అయితే ఈ సినిమా తర్వాత తనని చంపేస్తారని మూవీ షూటింగ్ సమయంలో భయాందోళనకు గురయ్యానంది. తాజాగా జరిగిన వీర సింహారెడ్డి సక్సెస్ మీట్లో వరలక్ష్మి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ సినిమాలో బాలయ్యను పొడిచి చంపే సీన్ చేస్తున్నప్పుడు చాలా భయపడ్డాను. చదవండి: ‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు ఆ సీన్ చూశాక.. బాలయ్య అభిమానులు నాపై పగ పెంచుకుని చంపుతారేమో అని ఆందోళనకు గరయ్యా. షూటింగ్లో ఈ సీన్ చేసేటప్పుడు నేను భయంతో ఇబ్బంది పడ్డాను. అది చూసి బాలయ్య నాలో ధైర్యం నింపారు. ఈ సీన్ చేస్తున్నప్పుడు నేను భయపడుతుంటే ‘ఎందుకు భయం?’ అని అడిగారు. ఇది చూశాక మీ ఫ్యాన్స్ నెగిటివ్‌గా తీసుకుంటారేమో, నాపై విరుచుకుపడతారమో అని ఆయనతో అన్నాను. దీనికి బాలయ్య స్పందిస్తూ.. ‘నెగెటివ్‌గా ఏం తీసుకోరని.. పాజిటివ్‌గానే రిసీవ్ చేసుకుంటారు’ అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే మీరందరూ ఆ సీన్‌ని పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్నందకు ధన్యవాదాలు’’ అంటూ చెప్పుకొచ్చింది. -
వీర సింహారెడ్డి సక్సెస్ మీట్.. కొంటెగా చూస్తూ క్యూట్ స్మైల్‌తో ఫిదా చేస్తున్న హనీ రోజ్ (ఫొటోలు)
-
'వీర సింహారెడ్డి' విజయోత్సవం..(ఫొటోలు)
-
ట్రోల్స్‌పై స్పందించిన గోపీచంద్ మలినేని
తనపై వస్తున్న ట్రోల్స్‌పై డైరెక్టర్ మలినేని గోపిచంద్ స్పందించారు. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి. నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. అయితే ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో గోపిచంద్ మలినేని స్టేజ్ మాట్లాడుతూ శృతి హాసన్‌కు ఐ లవ్ యూ అని చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ రూమర్స్: బన్నీపై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు! ఆ తర్వాత స్టేజ్‌పై మాట్లాడిన శృతి తెలుగు ఇండస్ట్రీలో తనకు ఓ అన్నయ్య ఉన్నారంటూ గోపీచంద్ గురించి చెప్పింది. వీర సింహారెడ్డి సక్సెస్ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు గోపిచంద్ మలినేని. ఈ సందర్భంగా శృతి హాసన్‌కు ఐ లవ్ యూ చెప్పడం, ఆ తర్వాత ట్రోల్స్ రావడంపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. ‘శృతితో నాకు ఇది మూడో సినిమా. బలుపు, క్రాక్ తర్వాత వీరసింహారెడ్డి చేశాను. నాకు చాలా ఇష్టమైన హీరోయిన్ ఆమె. తను నాకు ఓ ఫ్యామిలీలో ఒక మనిషి లాగా. బ్రదర్ – సిస్టర్ లాంటి బాండింగ్ మాది. చదవండి: రెండు రోజుల్లో మనోజ్ నుంచి స్పెషల్ న్యూస్, ఆసక్తి పెంచుతున్న ట్వీట్! నా వైఫ్‌తో కూడా తను చాలా క్లోజ్. నా కొడుకు సాత్విక్ అంటే శృతికి చాలా ఇష్టం. వాడికి తరచూ చాక్లెట్స్, గిప్ట్స్ తీసుకువస్తుంది. అందుకే ఆమె స్టేజ్‌పై నాకు అన్నయ్య అని చెప్పంది. ఆ తర్వాత నేను మాట్లడినప్పుడు తను చెప్పిన దానికి నా కన్సన్ చూపించాను. ఈ నేపథ్యంలో ఐ లవ్ యూ అని చెప్పాను. కానీ దాన్ని సోషల్ మీడియాలో అబ్బాయి-అమ్మాయి లవ్‌గా మార్చి వైరల్ చేశారు. అవన్నీ చూసి బాగా నవ్వుకున్నాను’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గోపీచంద్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
వీరసింహారెడ్డి కలెక్షన్స్ ఎంతంటే?
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. బాలయ్యకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంకాంత్రి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం కావడంతో ‘వీరసింహారెడ్డి’పై అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానుల అంచనాలకు తగినట్లే విడుదలైన తొలిరోజు నుంచే మంచి వసూళ్లు వచ్చాయి. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.104 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. GOD OF MASSES has conquered the US Box Office 🔥🔥 VEERA MASS BLOCKBUSTER #VeeraSimhaReddy grosses $ 1M+ and is continuing its glorious run 💥 Natasimham #NandamuriBalakrishna @shrutihaasan @megopichand @varusarath5 @OfficialViji @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/eL6vwuMVO7 — Mythri Movie Makers (@MythriOfficial) January 16, 2023 -
పొరపాటును మన్నించండి.. బాలకృష్ణ బహిరంగ లేఖ
దేవబ్రాహ్మణులకు నందమూరి బాలకృష్ణ క్షమాపణలు చెప్పారు. పొరపాటును మన్నించండి అంటూ బహిరంగ లేఖ రాశారు. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేవ బ్రాహ్మణులకు గురువు దేవళ మహర్షి అని, వారి నాయకుడు రావణాసురుడు అని చరిత్రని వక్రీకరించేలా మాట్లాడారు. చరిత్ర పూర్తిగా తెలుసుకోకుండా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, వెంటనే క్షమాపణలు చెపి ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని దేవాంగుల కమ్యూనిటీ డిమాండ్ చేసింది. దీంతో బాలకృష్ణ వారికి క్షమాపణలు చెబుతూ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ‘దేవబ్రాహ్మణ సోదరసోదరీమణులకు మీ సోదరుడు నందమూరి బాలకృష్ణ మనఃపూర్వక మనవి. దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని నాకందిన సమాచారం తప్పు అని నాకు తెలియజేసిన దేవబ్రహ్మణ పెద్దలందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేనన్న మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను. నాకు ఎవరిని బాధ పెట్టాలన్న ఆలోచన లేదు, ఉండదని కూడా తెలుగు ప్రజలందరికి తెలుసు. దురదృష్టవశాత్తు ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే.. అంతేకానీ సాటి సోదరుల మనసు గాయపరచటం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏమంటుంది చెప్పండి. పైగా దేవాంగులలో కూడా నా అభిమానులు చాలా మంది ఉన్నారు. నా వాళ్లను నేను బాధపెట్టుకుంటానా? అర్థం చేసుకొని పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నాను’అని బాలకృష్ణ లేఖలో పేర్కొన్నారు. -
బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి
సాక్షి, అమరావతి: దేవాంగ కులాన్ని హేళన చేసి, కించపరిచేలా మాట్లాడటం సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తగదని ఏపీ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ పేర్కొంది. ఈ మేరకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ..దేవబ్రాహ్మణులకు గురువు దేవళ మహర్షి అని, వారికి నాయకుడు రావణాసురుడని చరిత్ర వక్రీకరించి మాట్లాడారని పేర్కొన్నారు. దేవాంగ కులాన్ని ఉద్దేశించి హేళనగా లకలకలకలక అని వికటాట్టహాసంతో నవ్వి సన్నివేశాన్ని వివరించడం దారుణమన్నారు. బాలకృష్ణ అసందర్భ ప్రేలాపనలతో దేవాంగుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దేవాంగుల కుల గురువు దేవళ మహర్షని, కులదైవం చౌడేశ్వరి మాతని, దేవాంగుల చరిత్ర బ్రహ్మాండ పురాణంలో రాయబడిందని, మనుచరిత్ర, ఇతిహాసాలతో ముడిపడిన దేవాంగుల జాతి ఖ్యాతి గురించి తెలియకుండా హేళన చేయడం బాలకృష్ణకు తగదని హితవు పలికారు. తక్షణమే తన మాటలను వెనక్కి తీసుకొని దేవాంగ సమాజానికి క్షమాపణ చెప్పాలని బాలకృష్ణను డిమాండ్ చేశారు. -
ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ‘వీరసింహారెడ్డి’ చేశా: గోపీచంద్
‘‘వీరసింహారెడ్డి’ చిత్రాన్ని ఒక అవకాశంగా కంటే ఒక బాధ్యతగా చూశాను. ‘అఖండ’ మూవీ హిట్, అన్ స్టాపబుల్ షోతో అందరికీ కనెక్ట్ అయ్యారు బాలకృష్ణగారు.. ఇప్పుడు అందరి హీరోల ఫ్యాన్స్ బాలయ్య బాబు అభిమానులే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశాను’’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. బాలకృష్ణ, శ్రుతీహాసన్ జంటగా నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని మాట్లాడుతూ– ‘‘బాలకృష్ణగారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ‘సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు’ చిత్రాల్లో ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. ‘వీరసింహారెడ్డి’లోనూ ఉంది. ఇందులో ఉన్న సిస్టర్ సెంటిమెంట్ కనెక్ట్ అయింది. ఫస్ట్ హాఫ్ అయ్యాక ఫ్యాన్స్ అందరూ ఇరగదీశారని కాంప్లిమెంట్ ఇచ్చారు. సెకండ్ హాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్ ఇంకా గొప్పగా కనెక్ట్ అయ్యింది.. దాంతో విజయంపై మా నమ్మకం నిజమైంది. ఈ చిత్రాన్ని ఫస్ట్ హాఫ్ బాలయ్యబాబు ఫ్యాన్ బాయ్‌గా, సెకండాఫ్ డైరెక్టర్‌గా చేశాను. రామ్–లక్ష్మణ్‌లు ఫైట్స్‌ని అద్భుతంగా డిజైన్ చేశారు. తమన్ మంచి సంగీతం ఇచ్చాడు. నా కెరీర్లో బెస్ట్ ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీ మేకర్స్.. వాళ్లతో సినిమాలు చేస్తూనే ఉంటాను’’ అన్నారు. -
Veera Simha Reddy : ‘వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
ఆ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తున్నాయి : బాలయ్య
‘‘సంక్రాంతికి విందు భోజనంలాంటి సినిమా ‘వీరసింహారెడ్డి’. ప్రేక్షకులు, ఫ్యాన్స్.. ఇలా అందరి నుండి అద్భుతమైన ఆదరణ వస్తోంది’’ అన్నారు బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శ్రుతీహాసన్ జంటగా నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన వీర మాస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్లో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘అఖండ’లాంటి హిట్ తర్వాత అలాంటి మరో సినిమాని ప్రేక్షకులు ఆశిస్తారు. అందుకు తగ్గట్టే నా అభిమాని అయిన గోపీచంద్ ‘వీరసింహారెడ్డి’ని అద్భుతంగా తీశాడు. ఈ చిత్రంలో నాకు–వరలక్ష్మికి మధ్య వచ్చే అన్నా చెల్లెలి సన్నివేశాలు మహిళలనే కాదు మగవాళ్లనూ కంటతడి పెట్టిస్తున్నాయి’’ అన్నారు. ‘‘నా కెరీర్లో ఇది బ్లాక్ బస్టర్’’ అన్నారు గోపీచంద్. ‘‘మా సినిమా తొలి రోజే 50 కోట్ల గ్రాస్ దాటుతోంది. ఇది పెద్ద రికార్డ్. బాలకృష్ణగారి మైలురాయి చిత్రానికి మేం నిర్మాతలు కావడం హ్యాపీ’’ అన్నారు నిర్మాతలు. -
బాలకృష్ణ వీర సింహారెడ్డి ఓటీటీ పార్ట్నర్ ఇదే? స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!
నందమూరి బాలకృష్ణ-శృతి హాసన్ జంటగా నటించి లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ అంచనాల మధ్య ఈ చిత్రం నేడు గురువారం (జనవరి 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదవండి: రాహుల్‌కు కంగ్రాట్స్ చెప్పిన అషురెడ్డి, మరోసారి తెరపైకి ఎఫైర్ రూమర్స్ ఇదిలా ఉంటే ఇక థియేటర్లో రిలీజ్ అయిన చిత్రాలు ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరసింహరెడ్డి డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. డిస్నిప్లస్ హాట్‌స్టార్ ఈ మూవీ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడనేది కూడా హాట్‌స్టార్ ప్రకటించాల్సి ఉంది. చదవండి: పుట్టబోయే బిడ్డ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన ఉపాసన, ట్వీట్ వైరల్ ఇక హిట్ సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీకి వస్తుండగా.. మరికొన్ని చిత్రాలు నాలుగు వారాలకే స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి వీరసింహారెడ్డి మాత్రం 6 నుంచి 8 వారాల తర్వాతే ఓటీటీకి రానుందని తెలుస్తోంది. కాగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. కన్నడ స్టార్ నటుడు దునియా విజయ్ విలన్ కాగా ఆయనకు భార్యగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. ప్రముఖ హనీరోజ్‌లు ముఖ్య పాత్రలో కనిపించింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. -
Veera Simha Reddy : కూకట్పల్లి భ్రమరాంబ థియేటర్లో బాలకృష్ణ అభిమానుల సందడి (ఫొటోలు)
-
అమెరికాలో వీరసింహారెడ్డి సినిమా నిలిపివేత
-
పూనకం వచ్చినట్లుగా పూజారి మాస్ డ్యాన్స్
-
Veera Simha Reddy: థియేటర్లో పూజారి మాస్ డ్యాన్స్, వీడియో వైరల్
నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. నేడు(జనవరి 12) బాలయ్య మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి సినిమా రిలీజైంది. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీని మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. తమన్ సంగీతం అందించాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చూసి ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఏడాది తర్వాత బాలయ్య స్క్రీన్‌పై కనిపించడంతో ఆనందం పట్టలేక థియేటర్ల ముందు రచ్చరచ్చ చేస్తున్నారు. ఇక సినిమాలో పాటలు వచ్చినప్పుడు అభిమానులు చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జై బాలయ్య, మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయే వంటి సాంగ్స్ వచ్చినప్పుడు ప్రేక్షకులు సీట్లలో నుంచి లేచి పేపర్లు విసురుతూ స్టెప్పులేస్తూ తెగ సందడి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఓ వీడియో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. థియేటర్లో సినిమా చూడటానికి వచ్చిన ఓ పూజారి జై బాలయ్య పాట రాగానే పూనకం వచ్చినట్లుగా స్టెప్పులేశాడు. అతడిని చూసి అక్కడున్నవారంతా ఎంకరేజ్ చేశారు. మొత్తానికి తమన్ తన మ్యూజిక్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాడు. మరోపక్క బాలయ్య భ్రమరాంబ థియేటర్లో సినిమా ఆస్వాదించిన వీడియో సైతం చక్కర్లు కొడుతోంది. చదవండి: వీరసింహారెడ్డి సినిమా రివ్యూ నాపై అభిమాని విషప్రయోగం చేశాడు: చిరంజీవి -
థియేటర్లో బాలయ్య ఫ్యాన్స్ రచ్చ
-
Veera Simha Reddy Review: వీరసింహారెడ్డి రివ్యూ
టైటిల్: వీరసింహారెడ్డి నటీనటులు: బాలకృష్ణ, శ్రుతిహాసన్, హనీరోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, నవీన్‌చంద్ర మురళీశర్మ,తదితరులు నిర్మాణ సంస్థ : మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై రవిశంకర్ దర్శకత్వం : గోపిచంద్ మలినేని సంగీతం: తమన్ సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: జనవరి 12, 2023 అఖండ’లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ‘వీరసింహారెడ్డి’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య గురువారం(జనవరి 12) విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. ‘వీరసింహారెడ్డి’ కథేంటంటే.. జై అలియాస్ జైసింహారెడ్డి(బాలకృష్ణ) తన తల్లి మీనాక్షి(హనీరోజ్)తో కలిసి ఇస్తాంబుల్‌లో ఉంటాడు. అతనికి అక్కడే తెలుగమ్మాయి ఈషా(శ్రుతీహాసన్)పరిచయం అవుతుంది. వీరద్దరు ప్రేమించుకుంటారు. ఈ విషయాన్ని ఈషా తన తండ్రి(మురళీ శర్మ)కి చెబుతుంది. పెళ్లి సంబంధం కుదుర్చుకోవడం కోసం జై తల్లిదండ్రులను ఇంటికి ఆహ్వానిస్తారు. అయితే అప్పటి వరకు తండ్రి లేడనుకున్న జైకి తల్లి ఓ నిజం చెబుతుంది. అతనికి తండ్రి ఉన్నాడని, పేరు వీరసింహారెడ్డి(బాలకృష్ణ) అని, రాయలసీమపై ప్రేమతో అక్కడి ప్రజలకు అండగా ఉన్నాడని చెబుతుంది. పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి ఇస్తాంబుల్ రావాల్సిందిగా వీరసింహారెడ్డికి కబురు పంపుతుంది. కొడుకు పెళ్లి కోసమై వీరసింహారెడ్డి ఇస్తాంబుల్ వస్తాడు. ఇదే అదునుగా భావించిన ప్రతాప్‌రెడ్డి(దునియా విజయ్), వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతి(వరలక్ష్మీ శరత్ కుమార్) అతన్ని చంపడానికి ప్లాన్ వేస్తారు. సొంత చెల్లెలే వీరసింహారెడ్డిని చంపాలని ఎందుకు పగ పట్టింది? ప్రతాప్‌రెడ్డికి వీరసింహారెడ్డికి మధ్య ఉన్న వైరం ఏంటి? మీనాక్షి, వీరసింహారెడ్డిలు దూరంగా ఉండడానికి గల కారణం ఏంటి? తండ్రి ప్లాష్‌బ్యాక్ తెలిసిన తర్వాత జైసింహారెడ్డి ఏం చేశాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఫ్యాక్షన్ సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తేమి కాదు. అందులో బాలయ్యకు మరీనూ. వీరసింహారెడ్డి కూడా ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే. ఇందుతో కొత్త విషయం ఏంటంటే.. ఫ్యాక్షన్ స్టోరీకి సిస్టర్ సెంటిమెంట్‌ని జోడించడం. అయితే తెరపై అనుకున్నంతగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. పుట్టి పెరిగిన ఊరి కోసం ఓ వ్యక్తి కత్తి పట్టడం.. అతన్ని ప్రజలు దేవుడిగా ఆరాధించండం.. అదేసమయంలో మరో గ్యాంగ్ అతన్ని చంపడానికి ప్రయత్నించడం.. ఓ ఫ్లాష్‌బ్యాక్.. ఇదే వీరసింహారెడ్డి కథ. అయితే అతన్ని చంపే గ్యాంగ్‌లో చెల్లెలు కూడా ఉండడంతో కథపై కాస్త ఆసక్తి కలుగుతుంది. కానీ తెరపై వచ్చే సన్నివేశాలు మాత్రం ఆ ఆసక్తిని తగ్గిస్తాయి. ఫస్టాఫ్‌లో కథ ఏమీ ఉండడు. ప్రతిసారి విలన్ గ్యాంగ్ వీరసింహారెడ్డిపై దాడికి ప్రయత్నించడం.. చివరకు అతని చేతిలో తన్నులు తిని బయటకు రావడం..ఇలాగే సాగుతుంది. మధ్య మధ్యలో ఒకటిరెండు డైలాగ్స్. దర్శకుడు హీరోయిజం మీద పెట్టిన దృష్టి కథపై పెట్టలేదనిపిస్తుంది. అయితే ఫస్టాఫ్‌లో వచ్చే ఫైట్ సీన్స్ అలరిస్తాయి. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో యాక్షన్ కంటే సిస్టర్ సెంటిమెంట్ మీదే ఎక్కువ దృష్టిపెట్టారు. బాలకృష్ణ, వరలక్ష్మీ షరత్ కుమార్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వీరసింహారెడ్డిపై చెల్లెలు ఎందుకు పగ పెంచుకుంది? శేఖర్(నవీన్‌చంద్ర) ఎవరు? మీనాక్షి, వీరసింహారెడ్డి ఎందుకు దూరంగా ఉన్నారనేది సెకండాఫ్‌లో చూపించారు. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. విపరీతమైన హింసకు తావిచ్చేరనే అభిప్రాయం సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. పోరాట ఘట్టాలు, డైలాగ్స్‌తోనే సినిమాను లాక్కొచ్చాడు దర్శకుడు. అయితే నందమూరి అభిమానులకు మాత్రం ఈ చిత్రం శాటిస్ఫై చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. మరోసారి బాలకృష్ణ తనదైన నటనతో విజృంభించాడు. గ్రామ పెద్ద వీరసింహారెడ్డిగా, అతని కొడుకు జైసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రలో కనిపించిన బాలయ్య.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. శ్రుతీహాసన్ పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ రోల్ తనది. అయితే పాటల్లో మాత్రం బాలయ్యతో హుషారుగా స్టెప్పులేసి అలరించింది. మీనాక్షి పాత్రకి హనీరోజ్ న్యాయం చేసింది. వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతిగా వరలక్ష్మీ శరత్ కుమార్ తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే డబ్బింగ్ ఆమెతో కాకుండా మరొకరితో చెప్పిస్తే బాగుండేదేమో. ప్రతాప్‌రెడ్డిగా దునియా విజయ్ విలనిజాన్ని బానే పండించాడు. బ్రహ్మానందం, అలీ పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి. లాల్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రావు, మురళీ శర్మ, అజయ్ ఘోష్ తదితరుతు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. తమన్ నేపథ్య సంగీతం బాగుంది. రామ్ లక్ష్మణ్ పోరాట ఘట్టాలు సినిమాకు ప్లస్. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువల సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
థియేటర్లో బాలయ్య ఫ్యాన్స్ రచ్చ.. గెంటేసిన యాజమాన్యం
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంకాంత్రి కానుకగ ప్రపంచవ్యాప్తంగా నేడు(జనవరి 12) థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ హంగామా చేశారు. (ఇది చదవండి: ‘వీరసింహారెడ్డి’ మూవీ ట్విటర్ రివ్యూ) థియేటర్లో రచ్చ రచ్చ చేశారు. సినిమా ప్రదర్శనలో ఉండగానే కాగితాలు చించి విసిరేస్తూ హంగామా సృష్టించారు. దీంతో బాలయ్య అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన యాజమాన్యం ప్రేక్షకులను బయటకు పంపించివేసింది. గతంలో తెలుగు సినిమాలను చాలా ప్రదర్శించామని.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని యాజమాన్యం వెల్లడించింది. మరో థియేటర్లో జై బాలయ్య అని అరవొద్దంటూ యాజమాన్యం తెలిపింది. -
‘వీరసింహారెడ్డి’ మూవీ ట్విటర్ రివ్యూ
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంకాంత్రి కానుకగా నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం కావడంతో ‘వీరసింహారెడ్డి’పై హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ చూడాలని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చించుకుంటున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. వీరసింహారెడ్డిపై ట్విటర్లో అటు పాజిటివ్..ఇటు నెగెటివ్ రెండు రకాల కామెంట్లు కనిపిస్తున్నాయి. ఫస్టాఫ్ రొటీన్‌గా, సెకండాఫ్ యావరేజ్‌గా ఉందని, బాలయ్య మాస్ మిస్ అయిందని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే..వీర సింహారెడ్డి మూవీతో మరోసారి బాలయ్య బాబు మాస్ జాతర షురూ అయిందని కొందరు చెబుతున్నారు. నందమూరి అభిమానులు కోరుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. తమన్ నేపథ్య సంగీతం చాలా బాగుందని చెబుతున్నారు. Review - #VeeraSimhaReddy 1st half routine rotta 2nd half " average '' Balayya masss miss ayyam 🤣🤭 Duniya Vijay 🤝🙌💥@shrutihaasan Okayish 2 Songs 💥✨️💃🕺 B🔥G🔥M 👌❤️🔥 @MusicThaman 1.5-2/5 [Min] pic.twitter.com/mBwpkQ39F5 — chowVIEW (@chow_view) January 12, 2023 #VeeraSimhaaReddy #VeeraSimhaReddy Senseless first half and Senior Bala's character is disappointing. Imagine the second half now.. 😭😭 — That Scooby doo villain (@smile_fakeit) January 12, 2023 Excellent 1st half Elevations Emotions Pelli scene fight Pulicherala mailu rayi fight Minster ki warning 🔥🔥🔥#VeeraSimhaaReddy https://t.co/gzwiaLBB3i — Nari Kakarla 🇮🇳 | #RC15™ (@RamCharanCult27) January 12, 2023 పస్టాఫ్ బాగుంది. ఎలివేషన్స్, ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి. పెళ్లి సీన్ ఫైట్, పులిచర్ల మైలు రాయి ఫైట్ సీన్‌తో పాటు మంత్రికి బాలయ్య ఇచ్చే వార్నింగ్ సన్నివేశం అదిరిపోయాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 2nd half drag ekkuva and climax vachesariki completely dead.. bel avg/flop #VeeraSimhaaReddy .. pandaga moodu rojulu tarvatha emi undadhu — King Of Andhra (@AnudeepUsa) January 12, 2023 First Half Reports : ఊహించిందే జరిగింది .... ⭐️మాస్ జాతర ... ⭐️నందమూరి నటసింహం గర్జన .... ⭐️ BGM ⭐️ Thundering Action Blocks #VeeraSimhaReddy #VeeraSimhaReddyOnJan12th #VeeraSimhaaReddy #NBK #Balayya #GodOfMassesNBK ☀️#CinemaYePrapancham 🔔 pic.twitter.com/3ZEdxF7M8G — Cinema Ye Prapancham (@cinema_ye) January 12, 2023 First Half : High Voltage First Half Ee character Chala Powerful Chala Rojulu Tarvata బ్రహ్మనందం Ni Big Screen Meeda Chusa First Lo 20mins Koncham Forced Ga Chusa Oka Vakeel Saab Oka Akhanda Oka VeeraSimha Reddy Chala Baga Kottadu #VeeraSimhaaReddy#VeeraSimhaReddy pic.twitter.com/OEc5I3TWrN — Sadhik⚡ (@CharanismSadhik) January 12, 2023 Block buster 1st half 🔥🔥🔥 Muthi meeda bochu molichina pratodu magadu kadura bacha..... Waiting for second half #VeeraSimhaReddy #VeeraSimhaaReddy https://t.co/qZsxWNCODJ — Nandamuri Dhoni (@m416kishore) January 12, 2023 complete 1st off OMG 👌💥 Movie లో ఈ గెటప్ సూపర్ 🔥🔥@MusicThaman Anna BGR ke Theatre🔥🥵💥 @shrutihaasan Suguna Sundari Dance 👌🔥 @varusarath5 in interval 🔥🔥🔥👌 #Balakrishna action sequences🔥dialogues Delivery 🔥 @MythriOfficial#VeeraSimhaaReddy#VeeraSimhaReddyOnJan12th pic.twitter.com/4QSw7x3ITR — N.Ashok Gowda (@07Ashok_gowda) January 12, 2023 2nd half drag ekkuva and climax vachesariki completely dead.. bel avg/flop #VeeraSimhaaReddy .. pandaga moodu rojulu tarvatha emi undadhu — King Of Andhra (@AnudeepUsa) January 12, 2023 -
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి టికెట్ ధరల పెంపునకు అనుమతి
బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సీజన్ మొదలుకానుంది. టాలీవుడ్ బడా హీరోలు పోటీకి దిగుతుండటంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ఈనెల 12న విడుదల అవుతుండగా, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య 13న సంక్రాంతి బరిలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మేకర్స్‌కు తీపికబురు అందించింది. ఈ రెండు సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. టికెట్‌పై వీరసింహారెడ్డి చిత్రానికి 20 రూపాయలు, వాల్తేరు వీరయ్య చిత్రానికి 25 రూపాయలను పెంచుకునేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనిపై జీఎస్టీ పెంపు అదనంగా ఉండనుంది.పెంచిన ధరలు రిలీజ్ డేట్ నుంచి పదిరోజుల పాటు ఉండనున్నాయి. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మేకర్స్‌తో పాటు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సంక్రాంతి బరిలో పోటీ పడిన చిరంజీవి- బాలయ్య సినిమాలు (ఫొటోలు)
-
‘అఖండ’ లాగే వీర సింహారెడ్డికి కూడా స్పీకర్లు పగులుతాయి: తమన్
‘‘పోటీ అనేది సినిమాల్లోనే కాదు.. ప్రతి చోటా ఉంటుంది. పోటీ ఉన్నప్పుడే మంచి కంటెంట్ వస్తుంది. ఆరోగ్యకరమైన సోటీ మంచిదే. అన్ని సినిమాలూ గొప్పగా ఆడాలి.. అందరూ బాగుండాలి’’ అని సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ అన్నారు. బాలకష్ణ, శ్రుతీహాన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా రేపు (గురువారం) రిలీజవుతోంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన తమన్ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన చిత్ర విశేషాలు. ⇔ బాలకృష్ణగారితో నేను చేసిన ‘అఖండ’ సినిమాతో ‘వీరసింహారెడ్డి’కి పోలికే లేదు. ఇది కల్ట్ మూవీ. ఎమోషనల్, సిస్టర్ సెంటిమెంట్, బాలకృష్ణగారి మాస్.. ఇలా అన్ని అంశాలతో అదిరిపోతుంది. ⇔ దర్శకుడు మంచి సినిమా తీస్తేనే నేను మంచి మ్యూజిక్ ఇవ్వగలను. ఒక సినిమాకి పునాది దర్శకుడే. బాలకృష్ణగారి అభిమానిగా గోపీచంద్ చాలా గొప్పగా తీశారు.. దాని వల్లే నాకూ మంచి మ్యూజిక్, నేపథ్య సంగీతం ఇచ్చే అవకాశం వచ్చింది. సినిమా ఏం కోరుకుంటుందో అది ఇవ్వడమే మన పని. ఇందులో ‘జై బాలయ్య, సుగుణ సుందరి, మాస్ మొగుడు..’ వంటి పాటలన్నీ చక్కగా కుదిరాయి. మాస్ సినిమాలో కూడా కథ నుండే ట్యూన్ పుడుతుంది. ⇔ ‘అఖండ’లో మ్యూజిక్‌కి స్పీకర్లు పగిలిపోయాయి. ‘వీరసింహారెడ్డి’లోనూ స్పీకర్లు పగులుతాయి జాగ్రత్త అని ముందే చెప్పాను. బాలకృష్ణగారిని చూస్తేనే ఎక్కువ వాయించేయాలనిపిస్తుంది (నవ్వుతూ). చాలా రోజుల తర్వాత సెకండ్ హాఫ్‌లో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లతో అదరగొట్టే సినిమా ఇది. పాప్ కార్న్ తినే టైమ్ కూడా ఉండదు.. సినిమాని చూస్తూనే ఉంటారు. ⇔ ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిరంజీవిగారి ‘వాల్తేరు వీరయ్య’, బాలకష్ణగారి ‘వీరసింహారెడ్డి’ రెండూ గొప్పగా ఆడాలని కోరుకుంటున్నాను. -
మా ఇల్లే పాన్ ఇండియా
శ్రుతీహాసన్ ఏదీ ప్లాన్ చేయరు. సినిమాలంటే ఆమెకు చాలా ఇష్టం. అయితే ఇన్నేళ్లు ఉండాలని ΄్లాన్ చేయలేదు. సినిమాకి దూరం కాకూడదనుకుంటారు. అంతే.. ఇక బాబీ దర్శకత్వంలో చిరంజీవితో చేసిన ‘వాల్తేరు వీరయ్య’, గోపీచంద్ దర్శకత్వంలో బాలకృష్ణతో చేసిన ‘వీరసింహారెడ్డి’తో ఈ సంక్రాంతికి డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారామె. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ‘వీరసింహారెడ్డి’ ఈ 12న, 13న ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ కానున్నాయి. ఈ సందర్భంగా శ్రుతి చెప్పిన విశేషాలు.. రెండు చిత్రాలతో మీతో మీరే పోటీ పడటం ఎలా ఉంది? నిజానికి ఇది ఊహించలేదు. తొమ్మిదేళ్ల క్రితం నా రెండు సినిమాలు ఒకేసారి రిలీజయ్యాయి. అయితే పండగప్పుడు కాదు. ఫెస్టివల్ టైమ్‌లో రెండు పెద్ద చిత్రా లతో.. ఇద్దరు లెజెండరీ (చిరంజీవి, బాలకృష్ణ) హీరోల సినిమాలతో రావడం ఆశీర్వాదం అనుకుంటున్నా. రెండు సినిమాలూ హిట్టవ్వాలనే ఓ టెన్షన్ ఉంటుంది కదా... టెన్షన్ అనేది సెట్లో పని చేస్తున్నప్పుడు మాత్రమే. ఎక్స్ప్రెషన్ సరిగ్గా వచ్చిందా? లేదా డైలాగ్ బాగా చెప్పానా? లేదా అనే టెన్షన్ ఉంటుంది. సెట్ నుంచి బయటికొచ్చేస్తే టెన్షన్ ఉండదు. ఎందుకంటే మిగతాదంతా ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. ‘వాల్తేరు..’, ‘వీరసింహా...’లలో ఏ సినిమాలో మీ పాత్ర బాగుంటుందనే పోలిక రావడం సహజం.. నిజమే. అయితే రెండు సినిమాల కథలు, ΄ాత్రలు, ట్రీట్మెంట్ భిన్నంగా ఉంటాయి. నా ΄ాత్రలు డిఫరెంట్‌గా, సవాల్‌గా ఉంటాయి. ‘వీరసింహా..’లో నా ΄ాత్ర కామెడీగా ఉంటుంది. కామెడీ చేయడం కష్టం. ‘వాల్తేరు...’లో నా ΄ాత్రని బాగా రాశారు. చిరంజీవి, బాలకృష్ణలతో డ్యాన్స్ చేయడం... నైస్ ఎక్స్పీరియన్స్. ‘వీరసింహారెడ్డి’లోని ‘సుగుణసుందరి...’ స్టెప్ బాగా రీచ్ అయ్యింది. అలాగే ‘వాల్తేరు వీరయ్య’లోని ‘శ్రీదేవి... చిరంజీవి’ పాట కూడా అద్భుతంగా వచ్చింది. ఒక పాట మంచి ఎండ (సుగుణ సుందరి)లో.. మరో పాట (నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరు) విపరీతమైన చలిలో చేసిన అనుభవం గురించి? ఇండియన్స్‌కి ఎండ సమస్య కాదు. కానీ చలి తట్టుకోవడం కష్టం. పైగా పల్చటి చీరలో మైనస్ 11 డిగ్రీల చలిలో చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో హీరోయి న్లకే సమస్య. హీరోలు ఫుల్‌గా కవర్ చేసుకునే వీలు ఉంటుంది... యూనిట్ అంతా నాలుగైదు లేయర్ల కోట్స్ వేసుకుంటే మేం చలిలో డ్యాన్స్ చేశాం (నవ్వుతూ). సార్ (చిరంజీవి) కూడా పెద్దగా కవర్ చేసుకోలేదు. ఒక కోట్.. అంతే. ‘వీరసింహారెడ్డి’ వేడుకలో ΄పాల్గొన్న మీరు ‘వాల్తేరు వీర య్య’ వేడుకలో ΄పాల్గొనలేదు.. కారణం? ఆరోగ్యం బాగాలేదు. పూర్తిగా రికవర్ కాకపోవడంతో వేడుకకు వెళ్లలేకపోయా. ఐయామ్ సో సారీ. ఆ మధ్య మీకు తెలుగులో గ్యాప్ వచ్చింది... ఇప్పుడు ఇద్దరు సీనియర్ హీరోలతో, యంగ్ హీరో ప్రభాస్‌తో ‘సలార్’.. వరుసగా సినిమాలు చేయడం ఎలా ఉంది? మా ఇంట్లో మా అమ్మానాన్నని చూసి సినిమా అనేది ఫ్యామిలీ అనిపించింది. ఇక ఇండస్ట్రీ, ఆడియన్స్ పరంగా తెలుగు నాకు రియల్ ఫ్యామిలీ అంటాను. ఎందుకంటే సౌత్‌లో నేను పరిచయం అయింది తెలుగు సినిమాల ద్వారానే. ఒక కొత్త ప్రాంతంలో నాకు మంచి ఆహ్వానం దక్కింది. ప్రేక్షకులు నన్ను అంగీకరించారు. హిట్ ఇచ్చారు. ‘క్రాక్’ తర్వాత మళ్లీ తెలుగులో వరుసగా సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. సంక్రాంతి ఎలా జరుపుకుంటారు ? ‘సంక్రాంతి’ అనే పదం నేను తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాతే నా లైఫ్‌లోకి వచ్చింది. మాకు తమిళ్లో ‘పొంగల్’ అంటాం. పండగ రోజు ΄పొంగలి వండుతాను. పూజ చేస్తాను. ఫ్యామిలీతో గడుపుతాను. గోపీచంద్ మలినేని మిమ్మల్ని లక్కీ హీరోయిన్ అంటారు. లక్‌ని మీరు నమ్ముతారా? లేదు.. హార్డ్ వర్క్‌ని, దేవుడిని నమ్ముతాను. ఒకవేళ ఎవరైనా నన్ను లక్కీ అంటే వాళ్లకు థ్యాంక్స్ చెబుతాను. అయితే నేను లక్, అన్లక్ని నమ్మను. ఎందుకంటే ఒకప్పుడు నన్ను ‘అన్‌లక్కీ’ అన్నారు. ఆ తర్వాత ‘లక్కీ’ అన్నారు. వేరేవాళ్లు నన్ను అలా అనడం ఆశీర్వాదంలా భావిస్తున్నాను. -
‘అన్‌స్టాపబుల్ 2’ లో ‘వీరసింహారెడ్డి’ టీం సందడి
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో రెండో సీజన్ దూసుకెళ్తోంది. ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షోలో టాలీవుడ్ సెలబ్రిటీలను బాలయ్య తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇటీవలే ఈ షోకి ప్రభాస్, గోపీచంద్ గెస్ట్లుగా వచ్చి అలరించిన విషయం తెలిసిందే. ఇక సంక్రాంతి సందర్భంగా ఈ టాక్ షోలో వీరసింహారెడ్డి టీం సందడి చేయబోతుంది. ఈ విషయాన్ని ఆహా టీమ్ ట్వీటర్ ద్వారా తెలియజేస్తూ.. ‘వీరసింహారెడ్డి టీమ్ అన్‌స్టాపబుల్‌లో అడుగుపెడితే.. వీరలెవెల్ మాస్ పండుగ లోడింగ్.. ఫిక్స్ అయిపోండి, సంక్రాంతి పండగ రీసౌండ్ రావాల్సిందే!’ అని రాసుకొచ్చింది. అంతేకాదు బాలకృష్ణ, వరలక్ష్మి, గోపీచంద్ మలినేని, హనీ రోజ్‌తో పాటు మైత్రీ సంస్థ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ చిత్రాలను కూడా షేర్ చేశారు. ఇవి బాలయ్య హోస్ట్ చేసిన ఎపిసోడ్‌కు హాజరైన చిత్రాలే కావడం విశేషం. ఈ స్పెషల్ ఎపిసోడ్ సంక్రాంతి స్పెషల్ కానుకగా జనవరి 13 స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న షో కామెడీ ఎక్స్చేంజ్ 6వ ఎపిసోడ్ కూడా జనవరి 13న రిలీజ్‌కానుంది. Veera simha Reddy team unstoppable lo adugu pedthe.....Veera level mass pandaga loading🔥🔥. Fix ayipondi, Sankranti pandaga resound raavalsindhe! #VeeraShimaReddy #UnstoppableWithNBKS2 #NBKOnAHA #NandamuriBalakrishna pic.twitter.com/Hzf68Twmp2 — ahavideoin (@ahavideoIN) January 10, 2023 -
బ్లాక్ బస్టర్.. రాసిపెట్టుకోండి
‘‘వీరసింహా రెడ్డి’కి తమన్ అత్యద్భుతమైన పాటలు ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఇందులో అన్ని పాటలు రామజోగయ్య శాస్త్రిగారు రాశారు. ‘మాస్ మొగుడు..’ చివర్లో తీసిన పాట. అప్పుడు మా కెమెరామేన్ రిషి పంజాబీ డిఐ వర్క్‌లో వుండటం వలన నా ‘క్రాక్’ సినిమా కెమెరామేన్ జీకే విష్ణు ఈ పాటని చేశారు. బాలయ్యబాబుని చాలా కలర్ఫుల్గా చూపించారు’’ అన్నారు గోపీచంద్ మలినేని. నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రుతీహాసన్ హీరోయిన్గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. సోమవారం ఈ చిత్రంలోని ‘మాస్ మొగుడు..’ పాట ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తమన్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, మనో, రమ్య బెహరా ఆలపించారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్ మలినేని మాట్లాడుతూ– ‘‘ఇటీవల ఒంగోలులో జరిగిన వేడుకలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌కి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. సినిమాలో మామూలుగా ఉండదు. ‘వీరసింహా రెడ్డి’ ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్... రాసిపెట్టుకోండి’’ అన్నారు. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ– ‘‘నేను బాల కృష్ణగారికి అభిమానిని. ఈ చిత్రానికి సింగిల్ కార్డ్ రాసే చాన్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేనికి, మైత్రీ మూవీ మేకర్స్‌కి కృతజ్ఞతలు. అన్ని పాటలూ అద్భుతంగా ఉంటాయి. బాలకృష్ణగారి మార్క్ ఫైర్ బ్రాండ్ సినిమా ఇది’’ అన్నారు. -
వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్: పచ్చ బ్యాచ్.. పరువుపాయే..!
అది సినిమా ఫంక్షన్ అని మరిచారు..ఎప్పటిలాగే పచ్చ బ్యాచ్ చీప్ ట్రిక్స్‌కు తెరతీసింది. వేదిక పేరుతో టీడీపీ రచ్చ..రచ్చ చేసింది. ఇక ఎల్లో మీడియా అసత్య కథనాలను వండి వార్చేసింది. ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ ఊదరగొట్టింది. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా జరిగిన ఈ హైడ్రామాను రక్తి కట్టించబోయిన ఈ బ్యాచ్ బోర్లాపడింది. హీరో, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ, దర్శకుడు మలినేని గోపీచంద్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సాక్షిప్రతినిధి, ఒంగోలు: మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను సినిమా బృందం ఒంగోలు నగరంలో నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత వేదికను రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఏబీఎం గ్రౌండ్లో జరుపుకోవాలని నిర్వాహకులు తలంచారు. అందుకోసం ఏర్పాట్లు చేసుకునే ప్రయత్నంలో బందోబస్తు, సభ అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఎంతమంది అభిమానులు, ప్రజలు వస్తారని పోలీసులు నిర్వాహకులను అడిగారు. 35 వేల మందికి పైగా పాసులు ఇవ్వాలని భావిస్తున్నామని చెప్పారు. దీంతో పోలీస్ అధికారులు ఈ గ్రౌండ్ కేవలం 15 వేల మందికి మాత్రమే సరిపోతుందని, ఇంకెక్కడైనా విశాలమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలని సూచించారు. దీంతో వారు ఉత్తర బైపాస్‌లోని ఒక విశాలమైన ప్రాంతాన్ని ఎంచుకొని అనుమతుల కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇది ఒకపక్క జరుగుతుంటే మరో పక్క ఎల్లో గ్యాంగ్ అసత్య ప్రచారానికి పూనుకుంది. ఏబీఎం గ్రౌండ్లో నిర్వహించుకునేందుకు ఇచ్చిన అనుమతులను పోలీసులు రద్దు చేశారంటూ నానా రభస చేసింది. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒక అడుగు ముందుకేసి దీన్ని రాజకీయంగా వాడుకోవటానికి, తనకు అనుకూలంగా మలుచుకోవటానికి సిద్ధమైపోయారు. వెంటనే విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి తమ హీరో సినిమా ఫంక్షన్‌కు అన్యాయం జరిగిపోతోందంటూ తనదైన శైలిలో నానా యాగీ చేశాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చే జనాలకు ఏబీఎం గ్రౌండ్ సరిపోదని నిర్వాహకులకు పోలీస్ అధికారులు సూచించారే తప్ప వ్యతిరేకించలేదన్న సంగతి కూడా పూర్తిగా వినకుండానే రాజకీయ కోణాన్ని ఆవిష్కరించారు. దీనిని ఆసరాగా తీసుకుని ఎల్లో మీడియా రెచ్చిపోయింది. కావాలనే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను అటు పోలీసులు, ఇటు వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అడ్డుకుంటున్నాడని జోరుగా ప్రచారం కూడా చేసింది. ఎలాగైనా రాజకీయంగా వాడుకోవాలని చూసిన దామచర్ల చివరకు విఫలమయ్యాడు. దీంతో జనాల్లో కొద్దో గొప్పో ఉన్న పరువును కూడా పోగొట్టుకున్నాడు. ఇదిలా ఉంటే శుక్రవారం రాత్రి ఒంగోలు నగరంలో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రశాంతంగా ముగిసింది. కార్యక్రమం విజయవంతంగా సాగిందని ఫంక్షన్ వేదికగా సినిమా డైరెక్టర్ మలినేని గోపీచంద్ ప్రకటించారు. నా కల సాకారం కావడానికి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ విజయవంతానికి మా బాలినేని వాసన్నే కారణమని స్వయంగా వేదిక సాక్షిగా ప్రశంసించారు. దీంతో అసలు వాస్తవం ఏమిటో ప్రజలకు కుండబద్దలు కొట్టినట్లు అర్థమైంది. హీరో బాలకృష్ణ కూడా పోలీసులు బాగా సహకరించారని స్వయంగా ప్రశంసించారు. అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అటు బాలకృష్ణ కానీ, ఇటు సినిమా డైరెక్టర్ గోపీచంద్ కానీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల పేరును కూడా ప్రస్తావించలేదు. దీంతో ప్రతిదాన్నీ రాజకీయం చేయాలనుకునే దామచర్ల పరువు నిలువునా పోయినట్లయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దామచర్లను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. -
Pongal Fight: పదిసార్లు పోటీపడ్డారు.. 11వ సారి విజయమెవరిదో?
చిరంజీవి-బాలయ్యల మధ్య సినిమాల పోరు ఈ నాటిది కాదు. దశాబ్దాలుగా అది కొనసాగుతూనే ఉంది. ప్రత్యేకించి సంక్రాంతి పండగ సందర్భంగా ఇద్దరి సినిమాలూ పోటీ పడటం కూడా ఇపుడే మొదలు కాలేదు. మూడున్నర దశాబ్ధాలుగా ఇద్దరి సినిమాలు కొదమ సింహాల్లా తలపడుతూనే ఉన్నాయి. ఈ ప్రస్థానంలో ఇద్దరికీ బ్లాక్ బస్టర్లున్నాయి. ఇద్దరికీ కొన్ని డిజాస్టర్లూ ఉన్నాయి. అయితే ఆరోగ్యకరమైన పోటీ మాత్రం సాగుతూనే ఉంది. యుద్ధం సినిమాల మధ్యనే తప్ప నటుల మధ్య కాదు. అయితే 75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతి పండగ సమయంలో హోరా హోరీ తలపడే రెండు సినిమాలను ఒకే నిర్మాణ సంస్థ నిర్మించడం మాత్రం ఇదే మొదటి సారి. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు రెండింటినీ కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే నిర్మించడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండక్కి పెద్ద ప్రాధాన్యతే ఉంది. రైతుల పంటలు చేతికొచ్చే సమయం కాబట్టి రైతుల దగ్గర నాలుగు డబ్బులు ఆడతాయి. సకల వ్యాపారాలూ కళకళలాడుతూ ఉంటాయి. అందులో సినిమా వ్యాపారానికి ఇది అసలు సిసలు సీజన్ అనే చెప్పాలి. అందుకే అగ్రనటులు తమ ప్రతిష్ఠాత్మక సినిమాలను సంక్రాంతి సందర్భంగానే విడుదల చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. నందమూరి బాలయ్య, చిరంజీవి ఇద్దరూ కూడా ఊర మాస్ హీరోలు. ఈ ఇద్దరి సినిమాలు విడుదలైతే మాస్ జనాల్లో పూనకాలు వచ్చేస్తాయి. థియేటర్లు కళకళలాడిపోతాయి. అందులోనూ సంక్రాంతి సీజన్లో ఈ ఇద్దరి సినిమాలూ విడుదలైతే మాత్రం అటు అభిమానులకూ ఇటు ఫ్యాన్స్‌కూ సంక్రాంతిని మించిన పెద్ద పండగే అవుతుంది. ► 1987 సంక్రాంతిలో బాలయ్య- చిరంజీవిల సినిమాలు మొదటిసారి తలపడ్డాయి. జనవరి 9న చిరంజీవి- కోదండ రామిరెడ్డి కాంబినేషన్లో రూపొందిన 'దొంగ మొగుడు' విడుదలైంది. మొదటి రోజు మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అయిదు రోజుల తర్వాత జనవరి 14న బాలయ్య కోదండరామిరెడ్డిల కాంబినేషన్లో రూపొందిన 'భార్గవ రాముడు' సినిమా విడుదలైంది. ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకున్నా దొంగమొగుడు సినిమాకి కొంచెం ఎక్కువ ఎడ్జ్ ఉందని సినీ రంగ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ► ఆ మరుసటి ఏడాది అంటే 1988లో జనవరి 14న చిరంజీవి కె.రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందిన 'మంచి దొంగ' విడుదలైంది. ఆ మర్నాడే జనవరి 15న బాలయ్య ముత్యాల సుబ్బయ్యల సినిమా 'ఇన్ స్పెక్టర్ ప్రతాప్' విడుదల అయ్యింది. వీటిలో మంచి దొంగ ఏవరేజ్ హిట్ కాగా ఇన్ స్పెక్టర్ ప్రతాప్ హిట్ టాక్ తెచ్చుకుంది. ► 1989 సంక్రాంతి బరిలో జనవరి 14న చిరంజీవి నటించిన 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' సినిమా విడుదలైంది. రిలీజ్ రోజునే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. మరుసటి రోజున జనవరి 15న బాలయ్య నటించిన భలేదొంగ సినిమా విడుదలైంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. కలెక్షన్ల వర్షం కురిసింది. ► ఆ తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఇద్దరి సినిమాలూ సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యాయి. ముందుగా 1997 జనవరి 4న 'హిట్లర్' సినిమా రిలీజ్ అయ్యింది. బ్లాక్ బస్టర్ కాకపోయినా హిట్ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆరు రోజుల తర్వాత 1997 జనవరి 10న బాలయ్య సినిమా 'పెద్దన్నయ్య' విడులైంది.ఈ సినిమా కూడా హిట్ టాక్‌తో దూసుకుపోయింది. ► మరో రెండేళ్ల తర్వాత 1999లో జనవరి 13న బాలయ్య నటించిన 'సమరసింహారెడ్డి' సినిమా బ్లాక్ బస్టర్ గా మెరిసింది. దీనికి ఇంచుమించు రెండు వారాలకు ముందే జనవరి 1న చిరంజీవి నటించిన 'స్నేహం కోసం' రిలీజ్ అయ్య ఏవరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ► రెండు వేల సంవత్సరంలో జనవరి 7న చిరంజీవి సినిమా 'అన్నయ్య' విడుదలైంది. జస్ట్ ఓకే టాక్ తెచ్చుకుంది. వారం తర్వాత జనవరి 14న బాలయ్య నటించిన 'వంశోద్ధారకుడు' రిలీజ్ అయ్యింది. ఇది ఫ్లాప్ అయ్యింది. ► 2001 జనవరి 11న బాలయ్య సినిమా 'నరసింహనాయుడు' విడుదలై భారీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదే రోజున చిరంజీవి నటించిన 'మృగరాజు' విడుదలైంది. ఇది చిరంజీవి కెరీర్లోనే డిజాస్టర్ గా నిలిచింది. ► మళ్లీ మూడేళ్ల తర్వాత బాలయ్య, చిరంజీవి సంక్రాంతి బరిలో పోటీ పడ్డారు. 2004 జనవరి 14న బాలయ్య నటించిన 'లక్ష్మీ నరసింహ' విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఆ మర్నాడు జనవరి 15న చిరంజీవి నటించిన 'అంజి' సినిమా విడుదలై అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ► 2004 తర్వాత మళ్లీ ఇద్దరూ 2017 సంక్రాంతిలో తలపడ్డారు. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావడంతో ఇంచుమించు తొమ్మిదేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు. ► 2017లో చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌ను సంక్రాంతి సీజన్లోనే ప్రారంభించారు. 2017 జనవరి 11న చిరంజీవి వినాయక్‌ల కాంబినేషన్లో చిరంజీవి 150వ సినిమాగా విడుదలైన 'ఖైదీ నంబర్ 150' సూపర్ హిట్ అయ్యింది. జనవరి 12న బాలయ్య నటించిన చారిత్రక సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' విడుదలై పెద్ద హిట్ కొట్టింది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ సంక్రాంతి సీజన్లో కలబడలేదు. ఆరేళ్ల తర్వాత ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెండితెరను అలరించనున్నారు. ఇక బాలయ్య మాంచి మాస్ క్యారెక్టర్ తో వీర సింహారెడ్డిగా కనపడనున్నారు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పోరులో ఎవరు పెద్ద వీరుడిగా అవతరిస్తారన్నది తేలాల్సి ఉంది. చదవండి: బాక్సులు బద్ధలైపోతాయని రవితేజ వార్నింగ్.. వాల్తేరు వీరయ్య ట్రైలర్ చూశారా? -
వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ హైలైట్స్
-
చిరు Vs బాలయ్య.. ఇద్దరూ ఇరగదీస్తారా? బాక్సాఫీస్ కింగ్ ఎవరు?
సంక్రాంతి వస్తోందంటే సంగ్రామం వస్తోందనే అర్ధం. అది అలాంటిలాంటి సంగ్రామం కాదు. మహా సంగ్రామం.. దశాబ్ధాలుగా తెలుగునాట సంక్రాంతి పండగ వేదికగా అగ్రనటులు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణల మధ్య పెద్ద యుద్ధం జరుగుతూ వస్తోంది. ఈ సంక్రాంతికీ ఈ ఇద్దరూ తమ సత్తా చాటుకోడానికి సిద్ధంగా ఉన్నారు. వాల్తేరు వీరయ్యగా చిరంజీవి, వీర సింహారెడ్డిగా బాలయ్యలు తొడలు గొట్టి మరీ యుద్ధానికి సై అంటున్నారు. ఆ నటులే కాదు వారి అభిమానుల మధ్య కూడా అలాంటి యుద్ధ వాతావరణమే నెలకొంది. ఇది ప్రొఫెషనల్ ఫైట్. ఈ ఫైట్‌లో సత్తా చాటిన వారే వీరుడు. ఈ సంక్రాంతి వీరుడెవ్వరనేది కొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరిగింది. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.88 కోట్లు కాగా వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.73 కోట్లు. ఈ విషయంలో మెగాస్టారే కాస్త ముందున్నాడు. ఈ ఇద్దరు అగ్ర హీరోల ప్రీవియస్ సినిమాల ప్రభావం కూడా ఈ రెండు చిత్రాలపై ఉంటుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. చిరు నటించిన ఆచార్య ఫ్లాప్‌గా మిగిలింది. తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్‌కు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం నిరాశపరిచాయి. బాలయ్య విషయానికి వస్తే.. అఖండ విజయంతో మాంచి ఊపు మీదున్నాడు. మరోవైపు అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ సక్సెస్ వైబ్స్ కూడా బాలయ్యకు కలసి వచ్చే అంశాలే అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ ఇద్దరు హీరోలు ప్రమోషన్ విషయంలో తెగ్గేదే లే.. అంటూ దూసుకెళుతున్నారు. దాంతో రెండు సినిమాలపై అంచనాలు ఓ రేంజ్లో పెరిగిపోతున్నాయి. రెండు సినిమాల ట్రైలర్లు, టీజర్లు, పాటలు.. సినీ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అటు సోషల్ మీడియాలో ఇటు యూట్యూబ్‌లో సంచలనంగా మారాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి.. ఈ రెండు చిత్రాలనూ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తెరకెక్కించింది. సొంత డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్టార్ట్ చేసి ఈ రెండు సినిమాలనూ రిలీజ్ చేస్తున్నారు. రెండు సినిమాల్లోనూ హీరోయిన్ శ్రుతీహాసనే. ఇప్పటికే ఈ భారీ చిత్రాల బుకింగ్ మేళా మొదలైంది. అమెరికా, యూకేతో పాటు ఇతర ఓవర్సీస్ ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ స్టార్ట్ అయ్యాయి. ముందుగా జనవరి 12న వీరసింహారెడ్డి వస్తున్నాడు. వీరసింహా రెడ్డి గర్జనలతో థియేటర్లు దద్దరిల్లబోతున్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి ఈనెల 13న బాస్ బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాడు. వాల్తేరు వీరయ్యలో ఎక్స్ ట్రా మాస్ ఎలిమెంట్ ఉంది. అదే మాస్ మహారాజ్ రవితేజ. మెగాస్టార్‌కు తోడు ఓ ఇంపార్టెంట్ రోల్లో మాస్ రాజా కనిపించబోతున్నాడు. మొత్తానికి పొంగల్ పోటీకి రంగం సిద్ధమైంది. హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్య చిరు, బాలయ్య సినిమాలు రాబోతున్నాయి. మరి ఈ ఇద్దరు అగ్ర హీరోల్లో ఎవరు విజయపతాకం ఎగురవేస్తారు.. ? ఒక్కరే విన్నర్ గా నిలుస్తారా.. ? లేక ఇద్దరూ ఇరగదీస్తారా.. ? ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ వసూళ్లలో ఎవరు ముందుంటారు.. ? ఓవరాల్ రన్ లో బాక్సాఫీస్ కింగ్ ఎవరు.. ? అతి త్వరలోనే ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు దొరకబోతున్నాయి. చదవండి: మాస్ డైలాగులతో దద్దరిల్లిపోయిన వాల్తేరు వీరయ్య ట్రైలర్ -
బాలయ్య బాబు కాదు.. బాలయ్య తాత.. 60 ఏళ్లు దాటాయి ఎవరొస్తారు చూడటానికి..?
సాక్షి, విశాఖపట్నం: హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణపై ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. బాలయ్య బాబు కాదు.. బాలయ్య తాత అంటూ ఆయనను చూడటానికి ఎవరు వస్తారని అన్నారు. ఒంగోలులో జరిగిన బాలయ్య ఫంక్షన్‌కు అనుకున్నంత జనం రాలేదు అంటున్నారు. బాలయ్యకు 60 ఏళ్లు దాటాయని.. బాలయ్య తాతను చూడటానికి ఎవరొస్తారని వ్యాఖ్యానించారు. ఆయన సభకు జనం రాకపోతే మాకు సంబంధం ఏంటి అని ప్రశ్నించారు. బాలయ్య ఇంకా సమరసింహారెడ్డి అనుకుంటేఎలా ఇప్పుడు వీరసింహారెడ్డి అంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వం ఇచ్చిన జీఓలకు రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం ఉండదని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే జీఓలు ఏవైనా సామాన్యుడి నుంచి ప్రతి ఒక్కరికి వర్తిస్తాయని ఈ విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. చదవండి: (చంద్రబాబును సీఎంను చేయాలన్నదే వీళ్లకు ముఖ్యం: అమర్నాథ్) -
బాలయ్య బాబు కాదు.. బాలయ్య తాత : మంత్రి గుడివాడ అమర్నాథ్
-
చరిత్ర అంటే ఏంటో తెలుసా బాలయ్య..?
చరిత్ర అంటే అర్థం తెలియని వారు చరిత్ర గురించి మాట్లాడుతున్నారు. వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ షోలో బాలయ్య మాటలు చరిత్రను వక్రీకరించేలా..? చరిత్ర అంటే 1982 నుంచే ప్రారంభం అయింది అనేలా ఉన్నాయి. అజ్ఞానులు మాత్రమే ఇలా మాట్లాడతారు. "పాఠ్య పుస్తకాల నుంచి చరిత్రను తీసేయాలి" అన్నారు చంద్రబాబు. అప్పుడు ఆయన అవగాహన లేక అన్నారని అనుకున్నాను. కానీ ఆయన మాటలు వెనుక పెద్ద కుట్రే దాగి ఉంది. ఆయన ఆలోచనల వెనుక అతి పెద్ద కుట్ర నక్కి ఉంది. కొన్నేళ్లుగా చంద్రబాబు మాటలను, బాలకృష్ణ ప్రసంగాలను, ఎల్లో మీడియా రాతలను, చర్చలను చూసినట్లైతే విషయం స్పష్టంగా బోధ పడుతుంది. "చరిత్ర అంటే నిజాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయడం.. చరిత్ర అంటే గత కాలం నుంచి పాఠాలు నేర్చుకోవడం.. చరిత్ర అంటే గతం నుంచి భవిష్యత్తుకు నిచ్చెనలు వేయడం.. చరిత్ర అంటే భవిష్యత్తుకు నిప్పులాంటి నిజాలతో కూడిన బంగారు బాట వేయడం". కానీ.. చరిత్ర అంటే నందమూరి చరిత్రే అన్నట్లు బాలకృష్ణ మాట్లాడటం హాస్యాస్పదంగా, జుగుప్సాకరంగా ఉంది. భారత దేశంలో 5 వేల ఏళ్ల క్రితమే హరప్పా, మొహంజోదారో నాగరికతలు పురుడు పోసుకున్నాయి. ఈ నాగరికతలు ఈజిప్ట్, రోమ్ చరిత్ర కంటే ప్రాచీనమైనవి. కానీ.. ఈజిప్ట్, రోమ్ కంటే అడ్వాన్స్డ్ నాగరికత హరప్పా, మొహంజోదారో నాగరికతలు. శ్రీకృష్ణుడు 8 వేల ఏళ్ల క్రితమే భరత ఖండంపై నడియాడాడు అని, ద్వారకా అవశేషాలు అరేబియా సముద్రంలో సజీవంగా ఉన్నాయని నాసానే ధ్రువీకరించింది. చరిత్ర అంటే ఇది. అంతకంటే ముందే.. రాముడు అయోధ్యను పాలించాడని చరిత్ర చెబుతుంది. ఇక.. మన తెలుగు నేలకు వచ్చే సరికి శాతవాహనులు, కాకతీయులు, రెడ్డి రాజ్యం, గొల్కొండ నవాబులు, నిజాం నవాబులు, పోలీస్ చర్యతో హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేయడం ఇది చరిత్ర. మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవడం.. కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం.. తెలుగు వాళ్లందరూ కలిసి ఉండాలని తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం ఇదీ చరిత్ర. ఈ చరిత్రలో నందమూరి , నారా వంశాలు ఎక్కడున్నాయి బాలయ్య..?. నందమూరి తారక రామరావు రూ.116 కూలీ తీసుకుని సినిమాల్లో నటించారు. టిఫెన్ సరిపోవడంలేదని ప్రొడక్షన్ మేనేజర్లతో గొడవ పడి ఒక వడ ఎక్కువ వేయించుకునేవాడు ఎన్టీఆర్. సెట్లో నచ్చిన వస్తువులు, నచ్చిన డ్రెస్‌లు తీసుకెళ్లి ఇంట్లో దాచుకునేవాడు. సహజకవి, దర్శక, నిర్మాత మల్లెమాల ఆత్మ కథ చదివితే ఎన్టీఆర్ బుద్ది ఏంటో నేటి తరానికి తెలుస్తుంది. బాలయ్య.. మీ సోదరి భువనేశ్వరి పెళ్లి ఖర్చులు ఎవరూ పెట్టుకున్నారో తెలుసా..? 1970ల్లో హైదరాబాద్ శివారుల్లో నిమ్మతోటకు మొక్కలు తెచ్చి ఇచ్చింది ఎవరో తెలుసా..? దర్శక, నిర్మాత మల్లెమాల. ఆయనకు ఎన్టీఆర్ ఒక్క పైసా కూడా తిరిగి ఇవ్వలేదు. ఇదీ మీ చరిత్ర బాలయ్య. మీ ఇంట్లో కాల్పుల కేసు ఓ సారి గుర్తు తెచ్చుకో బాలయ్య. చరిత్ర అంటే అదీ. మీ ఇంట్లో కాల్పులు నిజమైన చరిత్ర. బెల్లకొండను ఎందుకు కాల్చావో నిజం చెప్పు బాలయ్య..? మీ ఇంట్లో వాచ్మెన్ ఎలా చనిపోయాడో నిజం చెప్పు బాలయ్య..? కాల్పుల కేసులు అప్పటి సీఎం వైఎస్ఆర్ కాపాడారు అని, మీ వంశ పరువును కాపాడారని పబ్లిక్ మీటింగ్‌ల్లో ఎందుకు చెప్పవు బాలయ్య..? నీకు మెంటల్ పర్టిఫికెట్ ఉందని, ఆ సర్టిఫికెట్ కోర్టులో సబ్మిట్ చేసి కాల్పుల కేసు నుంచి బయటపడ్డానని ఎందుకు చెప్పవు బాలయ్య..? బెల్లంకొండ- నీకు మధ్య సినీ, రాజకీయ పెద్దలు రాజీ కుదిర్చారని ఎందుకు మాట్లాడవు బాలయ్య..? వైఎస్ఆర్ మంచి మనసుతో వ్యవహరించకపోతే ఈ రోజున నీ పరిస్థితి ఏంటీ బాలయ్య..? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ధైర్యం నీకుందా బాలయ్య..? 1953 నుంచి 1956 వరకు 1956 నుంచి 1983 వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ పాలించింది. ఢిల్లీ నుంచి పెత్తనంపై తెలుగు ప్రజలు అప్పటికే కడుపు మండి ఉన్నారు. ఇష్టమొచ్చినట్లు ముఖ్యమంత్రులను మార్చడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో 1983లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ సమర్ధ నాయకుడే అయితే.. నాదెండ్ల భాస్కర్ రావు ఎందుకు తిరుగుబాటు చేశారు..? ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రులు ఎందుకు తిరుగుబాటు చేశారు..? 1989లో ఎన్టీఆర్ ఘోరంగా ఎందుకు ఓడిపోయారు..? యుగ పురుషుడు, చరిత్ర సృష్టించిన వాడైతే ఎన్టీఆర్ ఓడిపోకూడదు కదా..? ఎన్టీఆర్‌ను 1989లో ప్రజలు ఎందుకు తిరస్కరించారు..? ఈ ప్రశ్నలకు బాలయ్య సమాధానం చెప్పాలి. ఎన్టీఆర్ దైవ సమానుడైతే.. నందమూరి వంశం గొప్పదైతే... ఎన్టీఆర్ ఎందుకు వెన్నుపోటుకు గురయ్యారు..? నారా వంశం.. నందమూరి వంశానికి వెన్నుపోటు పొడుస్తుంటే.. వెన్నుపోటు బావ వైపు ఉన్న నందమూరి వంశీకుల తొడలు కొట్టేది..? చరిత్ర పుస్తకాల్లో ఎన్టీఆర్ నాయకుడే కాదు అని రాస్తారు. నందమూరి వంశం బావకు బానిస వంశం అని భవిష్యత్తు తరాలు చర్చించుకుంటాయి. ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు వరకూ పొత్తులు లేకుండా, అలయన్స్ లేకుండా ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర మీకుందా..? ఈ ప్రశ్నలకు బాలయ్య సమాధానం చెప్పాలి. అన్‌స్టాపబుల్ షోను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. బాలయ్య - బాబు రాజకీయ పతివ్రతలమని వారికి వారే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. వెన్నుపోటు కాదు ప్రజాస్వామ్యం కోసం తిరుగుబాటు అని చెప్పుకుంటున్నారు. నాదెండ్ల భాస్కర రావు తిరుగుబాటు చేస్తే వెన్నుపోటు, చంద్రబాబు వెన్నుపొటు పొడిస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమమా..? ఇదేనా మీరు చెప్పే చరిత్ర..? ఇదేనా బాలయ్య నీవు మాట్లాడే చరిత్ర..? ఇదేనా బాలయ్య నీవు సృష్టించిన చరిత్ర..? ఎన్టీఆర్- చంద్రబాబు - బాలయ్య ఒక తానులో ముక్కలే. వైఎస్ఆర్ స్వతహాగా డాక్టర్. పేదల డాక్టర్‌గా, రూపాయి డాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. సీఎంగా 108,104, ఆరోగ్య శ్రీ లాంటి విప్లవాత్మక పథకాలు చేపట్టి లక్షల మంది ప్రాణాలు కాపాడి వారి గుండెల్లో నిలిచి పోయారు. ఎన్టీఆర్ వైద్య రంగానికి ఏ సేవలు చేశారు...? బాలయ్య సమాధానం చెప్పాలి..? ఎన్టీఆర్ వర్శిటీకి వైఎస్ఆర్ పేరు పెడితే తప్పేంటో బాలయ్య చెప్పాలి..? ఆ ఒక్క సంతకం మూడున్నరేళ్లలో లక్షల కోట్లు ప్రజలకిచ్చింది. ఆ ఒక్క సంతకం గ్రామ స్వరాజ్యం దిశగా ఆంధ్రప్రదేశ్‌ను అడుగులు వేయిస్తుంది. ఆ ఒక్క సంతకం..దేశంలోనే ఏపీ తల ఎత్తుకుని తిరిగేలా చేస్తుంది. ఎన్టీఆర్, చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు..? మా రక్తం, మా కులం, మా వంశం అని తొడగొట్టడమే కానీ..మీరు పేద ప్రజలకు చేసింది ఏమైనా ఉందా..? తెలుగు దేశం పార్టీ పుట్టిన తరువాతనే ఫ్యాక్షన్ పురుడు పోసుకుంది. వేలాది మంది మీ అధికార దాహంలో తలలు తెగి పడ్డారు. వేలాది మహిళల పుస్తెలు తెగిపడ్డాయి. ఈ పాపం నందమూరి వంశానిది కాదా..? ఈ చరిత్ర గురించి నీవు ఎందుకు మాట్లాడవు బాలయ్య..? వంగవీటి రంగా హత్య గురించి ఎందుకు మాట్లాడవు..? చివరకు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి వైఎస్ జగన్ సీఎం అయిన తరువాతనే బిల్లులు చెల్లించారు. దీని గురించి పబ్లిక్ మీటింగ్‌ల్లో ఎందుకు మాట్లాడవు బాలయ్య..? చరిత్ర గురించి నీవు మాట్లాడటం కాదు బాలయ్య.. చరిత్ర గురించి ప్రజలు మాట్లాడాలి. చరిత్రను మేధావులు, విద్యావేత్తలు, ప్రజలు సర్టిపై చేయాలి. నీ నోట్లోంచే వచ్చింది చరిత్ర అంటే సమాజం ఒప్పుకోదు, హర్షించదు. బాలయ్య నీ చరిత్ర ఏంటో తెలుసా..? వెన్నుపోటు చరిత్ర, ఆడవాళ్ల పట్ల అవమానీయంగా మాట్లాడే చరిత్ర, ఇతర కులాలను నీచంగా చూసే చరిత్ర, మీది కాల్పుల చరిత్ర. ఈ చరిత్ర గురించి మాట్లాడు... కూతురు వయసున్న అమ్మాయిల నడుము గిల్లి, బుగ్గలు గిల్లీ..డాన్స్‌లు వేసే నీకు చరిత్ర గురించి ఏం తెలుస్తుంది బాలయ్య..?!. అది బాలయ్య మీ చరిత్ర.. మీ నందమూరి చరిత్ర. - వెంకటేశ్వర్ పెద్దిరెడ్డి, రాజకీయ, సామాజిక విశ్లేషకులు -
ఒంగోలులో 'వీరసింహారెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నాది ఫ్యాక్షన్ కాదు.. సీమపై ఎఫెక్షన్.. వీరసింహారెడ్డి ట్రైలర్ అవుట్
అఖండ విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. ఇందులో శృతిహాసన్ కథానాయికగా నటించింది. బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేసింది. ఇవాళ ఒంగోలులో జరగుతున్న ప్రీరిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. 'సీమలో ఏ ఒక్కడు కత్తి పట్టకూడదని నేనే కత్తి పట్టా.. పరపతి కోసమో.. పెత్తనం కోసమో కాదు' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తే రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షన్ ఫైట్స్ అభిమానులను అలరించనున్నాయి. 'పుట్టింది పులిచర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్' అనే డైలాగ్ హైలెట్‌గా నిలవనుంది. ట్రైలర్ చూస్తే సీమ నేపథ్యంలోనే సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది ఈ చిత్రం. -
వీరయ్య vs వీరసింహా.. ఒకేసారి తలపడుతున్న చిరు, బాలయ్య
-
బాలకృష్ణ సినిమాలు చూస్తూ పెరిగాను..ఆయనది గొప్ప వ్యక్తిత్వం
‘‘బాలకృష్ణగారి సినిమాలు చూస్తూ పెరిగాను.. అలాంటిది ఆయనతో కలసి నటించడం మాటల్లో చెప్పలేని అనుభూతి. తొలిసారి ఆయన్ని సెట్లో చూసినప్పుడు నన్ను నేను నమ్మలేకపోయాను.. ఆయనది గొప్ప వ్యక్తిత్వం’’ అని నటుడు దునియా విజయ్ అన్నారు. బాలకృష్ణ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రంలో మెయిన్ విలన్ పాత్ర పోషించిన కన్నడ నటుడు దునియా విజయ్ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్‌గారు బ్రిలియంట్ డైరెక్టర్. ‘వీరసింహారెడ్డి’ లో నా పాత్ర (ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి) గురించి చెప్పినప్పుడే చాలా థ్రిల్ అనిపించింది. చాలా మొరటుగా ఉండే నా పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఇంత మంచి పాత్రలో బాలకృష్ణగారి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన ఎనర్జీ సూపర్.. పనిపట్ల అంకితభావం గొప్పగా ఉంటుంది. ‘వీరసింహారెడ్డి’ ఆయన అభిమానులకు, ప్రేక్షకులకు గ్రేట్ ఎమోషనల్ జర్నీ. ఒక నటుడిగా అన్ని పాత్రలూ చేయాలని ఉంటుంది. ఈ సినిమా తర్వాత కూడా మంచి పాత్రలు వస్తే విలన్‌గా చేయడానికి సిద్ధమే. నటన, దర్శకత్వం వేర్వేరు. నటుడిగా చేస్తున్నప్పుడు నా దృష్టి కేవలం నటనపైనే ఉంటుంది. దర్శకునిగా చేస్తున్నప్పుడు నా నుండి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో దానిపైనే ఫోకస్ ఉంటుంది. ప్రస్తుతం కన్నడలో ‘భీమ’ అనే చిత్రంలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాను. తెలుగులోనూ కొన్ని చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
సంక్రాంతి సంబరం... బాక్సాఫీస్ సమరం
ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా సంక్రాంతి సమరానికి బాక్సాఫీస్ ముస్తాబవుతోంది. థియేటర్ అనే గ్రౌండ్లో ప్రేక్షకులే సాక్షిగా బాక్సాఫీస్ బరిలో కలెక్షన్స్ పందేనికి కత్తులు కట్టిన కోడి పుంజుల్లా రెడీ అయ్యారు నలుగురు స్టార్ హీరోలు. వీరితో పాటు యంగ్ హీరో కూడా వస్తున్నాడు. పండగ సందర్భంగా సినిమాలు రావడం సినీ ప్రేమికులకు సంబరం... బాక్సాఫీస్‌కి వసూళ్ల సమరం. ఇక.. ఈ సంక్రాంతి పండక్కి వస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. సంక్రాంతి ఈ నెల 13న ఆరంభమవుతుంది. కానీ సినిమా సంక్రాంతి మాత్రం రెండు రోజులు ముందుగానే అంటే జనవరి 11న స్టార్ట్ అవుతుంది. తమిళ హీరోలు విజయ్ నటించిన ‘వారసుడు’ (తమిళంలో ‘వారిసు’), అజిత్ ‘తునివు’ (తెలుగులో ‘తెగింపు’) చిత్రాలు జనవరి 11నే విడుదల కానున్నాయి. విజయ్, రష్మికా మందన్నా జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వారసుడు’. ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మించారు. ఓ సంపన్న ఉమ్మడి కుటుంబంలో చోటు చేసుకునే వివిధ సంఘటనల సమాహారంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇక ‘నేర్కొండ పార్వై’ (హిందీ ‘పింక్’ తమిళ రీమేక్), ‘వలిమై’ చిత్రాల తర్వాత హీరో అజిత్, దర్శకుడు హెచ్. వినోద్, నిర్మాత బోనీ కపూర్ల కాంబినేషన్లో తెరకెక్కిన మూడో చిత్రం ‘తెగింపు’ (తమిళంలో ‘తునివు’). ఈ యాక్షన్ ఫిల్మ్ కథాంశం బ్యాంకు రాబరీ నేపథ్యంలో ఉంటుంది. బ్యాంకును హైజాక్ చేసిన ఓ వ్యక్తి, ఆ బ్యాంకు కస్టమర్లను హోస్టేజ్‌గా చేసి తన లక్ష్యాలు నెరవేరేలా ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేస్తాడు. ‘తెగింపు’ ప్రధానాంశం ఇదే అని తెలుస్తోంది. కాగా జనవరి 12న ‘వీరసింహా రెడ్డి’గా వస్తున్నారు బాలకృష్ణ. ‘అఖండ’ వంటి హిట్ తర్వాత బాలకృష్ణ, ‘క్రాక్’ వంటి హిట్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన ఈ ‘వీరసింహారెడ్డి’లో శ్రుతీహాసన్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. మరోవైపు ‘వాల్తేరు వీరయ్య’గా జనవరి 13న వస్తున్నారు చిరంజీవి. ఆయన టైటిల్ రోల్లో నటించి, హీరో రవితేజ ఓ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు కొల్లి బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకుడు. శ్రుతీహాసన్ నాయిక. శ్రీకాకుళంలో నివాసం ఉండే వాల్తేరు వీరయ్య (చిరంజీవి)కు, మరో ఏరియాలో ఉండే పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సాగర్ (రవితేజ)లకు మధ్య ఉన్న అనుబంధం, పగ అంశాలతో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం. ఈ చిత్రాన్ని కూడా నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్లే నిర్మించారు. ఇక ప్రతి సంక్రాంతికి పెద్ద స్టార్స్ మధ్య చిన్న హీరోల సినిమాలూ రిలీజ్ అవుతాయి. ఈ సంక్రాంతికి ఈ జాబితాలో నిలిచిన మూవీ ‘కళ్యాణం కమనీయం’. సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఆళ్ల అనిల్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది. శివ (సంతోష్), శ్రుతి (ప్రియా) ప్రేమ బంధం నుంచి వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. అయితే శివకు జాబ్ లేకపోవడం వారి మధ్య ఎలాంటి మనస్పర్థలకు దారి తీసింది అనేది చిత్రం ప్రధానాంశం. మరి.. ఈ సంక్రాంతి బరిలో ఏ సినిమాకు ప్రేక్షకులు ‘సంక్రాంతి హిట్’ ట్యాగ్ ఇస్తారో చూడాలి. -
బాలయ్య వీరసింహారెడ్డి ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్
అఖండ విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. రేపు ఒంగోలులో జరగబోయే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో రాత్రి 8.17 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. వీరసింహుడి ఉగ్రరూపం చూడాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందేనంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ఇక వీరసింహారెడ్డి సినిమా విషయానికి వస్తే ఇందులో శృతిహాసన్ కథానాయికగా నటించింది. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. వీరసింహుడి ఉగ్రరూపం 🔥#VeeraSimhaReddyTrailer on 6th Jan at 8:17 PM 🔥#VeeraSimhaReddyOnJan12th#VeeraSimhaReddyNatasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @OfficialViji @MusicThaman @RishiPunjabi5 @SonyMusicSouth @shreyasgroup pic.twitter.com/mZShvqH6Iv— Mythri Movie Makers (@MythriOfficial) January 5, 2023 చదవండి: లాభాలు తెచ్చే సత్తా లేదు కానీ కోట్ల పారితోషికం కావాలి -
వీరసింహరెడ్డి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతి నిరాకరణ వార్తల్లో నిజం లేదు
-
వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్పుపై స్పందించిన అడిషనల్ ఎస్పీ
సాక్షి, ఒంగోలు (ప్రకాశం జిల్లా): బాలకృష్ణ చిత్రం వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్పుపై వస్తున్న వార్తలపై అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు. ఈవెంట్‌కి పోలీసులు మొదట అనుమతి ఇచ్చి తర్వాత అనుమతి నిరాకరించారంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. మొదట ఏబీమ్ స్కూల్ ఆవరణలో వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నిర్వహకులు సన్నాహాలు చేసుకున్నారని.. ఆ విషయం మేం తెలుసుకొని నిర్వాహకులతో మాట్లాడి.. అక్కడ ఈవెంట్ చేస్తే పార్కింగ్‌కి, ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుందని నచ్చ చెప్పామన్నారు. పక్కనే రైల్వే స్టేషన్, ఆసుపత్రులు ఉనందున్న ప్రజల రాకపోకలకు ఇబ్బందవుతుందని సూచించామని అడిషనల్ ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్రదేశంలో ఈవెంట్ జరుపుకోమని సూచించామని, దానికి నిర్వాహకులు కూడా సమ్మతించి.. ఈవెంట్ ప్లేస్ మార్చుకున్నారన్నారు. మొదట మేము అనుమతి ఇచ్చి ఆ తర్వాత వెనక్కి తీసుకున్నామన్న వార్తలలో వాస్తవం లేదని ఆయన తెలిపారు. రేపు ఒంగోలు-గుంటూరు రోడ్డు అర్జున్ ఇన్ఫ్రాలో జరిగే వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వారు అడిగిన దాని కన్నా ఎక్కువే భద్రత ఇస్తున్నామని అడిషనల్ ఎస్పీ చెప్పారు. ట్రాఫిక్‌ను కూడా డైవర్ట్ చేస్తున్నామని, ఇటువంటి ఇబ్బంది లేకుండా హీరో బాలకృష్ణ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌కి సహకరిస్తున్నామని అడిషనల్ ఎస్పీ తెలిపారు. చదవండి: సూసైడ్ చేసుకునేవాడినంటూ బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.. ఆయన లేకపోతే.. -
అదే గేయ రచయిత గొప్పదనం: రామజోగయ్య శాస్త్రి
‘మంచి కవిత్వం రాసే ప్రతిభ ఉన్నంత మాత్రాన సినిమా పాటలు రాయలేం. ఇక్కడ ట్యూన్ కి రాయడం ప్రధానం. అలాగే కొన్ని సార్లు ట్యూన్ లేకుండా కూడా రాయాలి. దర్శకుడు విజన్ కి తగట్టు అడుగులు వేయడంలోనే గేయ రచయిత గొప్పదనం ఉంటుంది. ఎంతగొప్పగా రాసినా సింపుల్ గా రాయడం ఇక్కడ ప్రధానం. బాగా చదవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఓర్పు, పట్టుదల సహనం ఉండాలి. ఇదే యువ గేయ రచయితలకు నేను ఇచ్చే సలహా’ అని ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. తాజాగా ఆయన బాలయ్య 'వీరసింహారెడ్డి'లో అన్ని పాటలకు, చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లోని 'నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ' పాటకు సాహిత్యం అందించారు. ఈ రెండు చిత్రాలు సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సందర్భంగా తాజాగా రామజోగయ్య శాస్త్రీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 'నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ' గురించి చెప్పండి ? ఈ లిరిక్స్ లో సౌండింగ్ సరదా అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ తో చెప్పాను. దాని చుట్టూ ఒక కాన్సెప్ట్ అనుకొని ఒక ట్యూన్ ఇచ్చారు. పాట చాలా అద్భుతంగా వచ్చింది. సంక్రాంతి సినిమాలన్నిటికీ లిరిక్స్ రాశారు కదా.. ఈ సంక్రాంతి మీదే అనిపిస్తోంది ? అనుకుంటే జరగదు. అలా కుదిరిందంతే. చాలా పాటలు రాస్తూనే ఉంటారు కదా.. ఎక్కడైనా రైటర్స్ బ్లాక్ ఉంటుందా ? అలా ఏమీ ఉండదు. ఇన్నాళ్ళ అనుభవంతో టెక్నిక్, అలవాటు ప్రకారం కంటెంట్ ఇవ్వడం జరిగిపోతుంది. అయితే గొప్ప పాట రావాలి, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ కావాలంటే మాత్రం కొంత సమయం పడుతుంది. 'వీరసింహారెడ్డి', వాల్తేరు వీరయ్యలో అలా నెక్స్ట్ లెవల్ కంటెంట్ అనుకునే పాటలు ఏంటి? 'వీరసింహారెడ్డి', వాల్తేరు వీరయ్యలో అన్ని పాటలు నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి. ఏ పాటకు ఆ పాటే ప్రత్యేకంగా ఉంటుంది. పెద్ద సినిమాలకి వచ్చేసరికి కావాల్సిన సమయం ఇస్తారు. పైగా అఖండ సినిమాకి రాయలేదు. ఆ పట్టుదల ఉంటుంది. క్రాక్ తర్వాత గోపీచంద్ తో మళ్ళీ కలసి చేస్తున్నాను. 'వీరసింహారెడ్డి సింగిల్ కార్డ్ రాశాను. మొదటి నుంచి కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత బలంగా రాసే అవకాశం ఉంటుంది. తమన్ తో కలసి అన్ని పాటలు అద్భుతంగా చేశాం. విడుదలైన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. నాలుగో పాట కూడా అంతకు మించి ఉంటుంది. సింగిల్ కార్డ్ రాస్తున్నపుడు మీ పై ఒత్తిడి ఉంటుందా ? సింగిల్ కార్డ్ అయినా.. ఒక్క పాట అయినా.. దర్శకుడి కల కోసమే గేయ రచయిత పని చేస్తాడు. దర్శకుడు విజన్ కి తగట్టు అడుగులు వేయడంలోనే గేయ రచయిత గొప్పదనం ఉంటుంది. అయితే సింగిల్ కార్డ్ రాయడంలో ఒక సౌలభ్యం ఉంటుంది. పాటలన్నీ ఒకరే రాస్తారు కాబట్టి ఏ పాటలో ఎలాంటి మాట వాడాం, ఏ భావం చెప్పాం.. ఫ్లో సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆరు పాటలు ఆరుగురు రాస్తే మాత్రం.. ఈ కోర్డినేషన్ పని దర్శకుడు చూసుకోవాల్సివస్తుంది. పెద్ద హీరోల సినిమాలకి రాస్తున్నపుడు అభిమానుల అంచనాలు అందుకోవడం సవాల్ గా ఉంటుందా ? ప్రతి పాటకు సవాల్ ఉంటుందండీ. ఉదాహరణకు ఒక ప్రేమ పాటే రాస్తున్నాం అనుకోండి. మనమే ఇప్పటికే బోలెడు ప్రేమ పాటలు రాసుంటాం. ఈ పాటలో ఏం కొత్తగా చెప్పాలనే ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. బాలయ్య గారికి ఇదివరకే కొన్ని పాటలు రాశాం. ఈ సారి ఏం కొత్తగా చెప్పాలనే ఒత్తిడి, సవాల్ ఉంటుంది. మా బావ మనోభావాలు ఐడియా ఎవరిది ? మా బావ మనోభావాలు ఐడియా నాదే. ఒకసారి తమన్ తో చెబితే దాచి పెట్టమని చెప్పాడు. తర్వాత దర్శకుడు గోపీచంద్ కి చెప్పడం, పాట చేయడం జరిగింది. మనోభావాలు అందరూ సమకాలీనంగా వాడే మాటే. మాస్ మొగుడు పాట గురించి ? మాస్ మొగుడు పాట మంచి ఊపుతో ఉంటుంది. క్లైమాక్స్ కి తగ్గట్టుగా ఉంటుంది. 'వీరసింహారెడ్డి', వాల్తేరు వీరయ్య సినిమాలు ఎలా ఉండబోతున్నాయి ? 'వీరసింహారెడ్డి', వాల్తేరు వీరయ్య రెండూ సినిమాలు ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ తో పాటు మంచి మ్యూజికల్ ట్రీట్ ఇస్తాయి. ఈ రెండు చిత్రాలు బూమ్ బద్దలు రికార్డ్ లు సృష్టిస్తాయి. బాలకృష్ణ, చిరంజీవి గారి పాటలు రాస్తున్నపుడు ప్రత్యేకంగా ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు ? బాలకృష్ణ, చిరంజీవి గారి ఇమేజ్ పాట రాయడానికి ఒక ఊతమిస్తుంది. కొన్ని మాటలు వాళ్ళ ఇమేజ్ కే రాయగలం. చిరంజీవి గారికి రాసిన పాట విని చాలా బావుందని అన్నారు. అలాగే మనోభావాలు పాట షూటింగ్ జరిగినప్పుడు సెట్ కి వెళ్లాను. బాలకృష్ణ గారు కూడా బావుందని అభినందించారు. మనోభావాలు పాట విజువల్ గా కూడా చాలా కిక్ ఇచ్చింది. ట్యూన్ కి లిరిక్స్ రాస్తారా ? లిరిక్స్ కి ట్యూన్ చేస్తారా ? సంగీత దర్శకుడికి, లిరిక్ రైటర్ కి కేంద్ర బిందువు దర్శకుడు. ఆయన కథ, సందర్భం, విజన్ కి తగ్గట్టు పని చేయాల్సి ఉంటుంది. ఎక్కవ సమయాల్లో ట్యూన్కే లిరిక్స్ రాస్తాను. యువ గేయ రచయితలకు మీరు ఇచ్చే సలహా ? మనలో ఆసక్తి, పాటకు రాసే లక్షణం ఉందో లేదో చూసుకోవాలి. కొందరు చాలా మంచి కవిత్వం రాసే ప్రతిభ కలిగిఉంటారు. కానీ ఇక్కడ ట్యూన్ కి రాయడం ప్రధానం. ఎంతగొప్పగా రాసినా సింపుల్ గా రాయడం ఇక్కడ ప్రధానం. బాగా చదవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఓర్పు, పట్టుదల సహనం ఉండాలి -
పొంగల్ పోటీలో చిరు, బాలయ్య.. ఇద్దరిది ఒకే స్టోరీ!
సంక్రాంతి పోటీలో చాలా సార్లే ప్రత్యర్తులుగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి,నందమూరి బాలకృష్ణ. ఒకసారి మెగా హీరో పై చేయి సాధిస్తే, మరోసారి నందమూరి కథానాయకుడు విజయం సాధించాడు. ఈ సంక్రాంతికి కూడా మరోసారి పోరుకు సై అంటున్నారు. ఒకరు బ్రదర్ తో పోటీ పడే కథతో వస్తుంటే,మరొకరు..ఫాదర్‌తో తలపడే స్టోరీని ఎంచుకున్నారు.ఇలా ఈ ఇద్దరు స్టార్లు...పగ నేపథ్యంతో రంగంలోకి దిగతున్నారు. వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ చిరంజీవి..ప్రమోషన్ల జోరు చూపిస్తుంటే.నందమూరి నట సింహాం కూడా..పబ్లిసిటికి ముస్తాబు అయ్యాడు.ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. అలాగే..ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది. వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి స్పెషల్ పాటలతో కూడా ఆకట్టుకోబోతున్నారు వాల్తేరు వీరయ్యలో రవితేజ కూడా నటిస్తున్న మ్యాటర్ తెలిసిందే. వీరసింహా రెడ్డిలో బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు రివేంజ్ స్టోరీలతో తెరకెక్కాయని సమాచారం. వాల్తేరు వీరయ్య లో చిరంజీవి, రవితేజ ప్రత్యర్థులుగా కనిపించబోతున్నట్టు సమాచారం. ఇక వీరసింహా రెడ్డిలో బాలయ్యకు ఆయన కొడుకుకు మధ్య సాగే రివేంజ్‌ను చూపించబోతున్నారట. జనవరి 12 న వీరసింహా రెడ్డి రిలీజ్ అవుతుంటే, జనవరి 13 న వాల్తేరు వీరయ్య రంగంలోకి దిగుతున్నాడు. మరి ఈ పొంగల్ పోటీలు ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. -
‘వీరసింహారెడ్డి’ విజువల్ ఫీస్ట్.. చాలా చోట్ల గూస్ బంప్స్ వస్తాయి
‘వీరసింహారెడ్డి లార్జర్ దెన్ లైఫ్ మూవీ. యాక్షన్, ఎమోషన్స్, విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ప్రేక్షకులకు సినిమా విజువల్ ఫీస్ట్ లా ఉంటుంది. సినిమా చూస్తున్నపుడు చాలా చోట్ల గూస్ బంప్స్ వస్తాయి’అని సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ అన్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంకాంత్రి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► 'వీరసింహారెడ్డి' కోసం ఏడాది పాటు షూట్ చేశాం. దాదాపు అన్ని బుతువుల్లో షూటింగ్ జరిగింది. సిరిసిల్లల్లో షూట్ చేస్తునపుడు తీవ్రమైన వేడి ఉండేది. అలాగే టర్కీ , ఇస్తాంబుల్‌లో కూడా షూటింగ్ చేశాం. అక్కడ కూడా చాలా వేడి ఉంటుంది. ఈ సినిమాలో రగ్గడ్ నెస్ కావాలి. దాని కోసం టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసి దాన్ని ఎచీవ్ చేశాం. ►బాలకృష్ణ గారితో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. టెక్నిషియన్స్ ని చాల గొప్పగా అర్ధం చేసుకుంటారు. చాలా గౌరవిస్తారు. బాలయ్య గారికి ప్రతి డిపార్ట్మెంట్ పై గొప్ప అవగాహన ఉంటుంది. చాలా ఫ్రీడమ్ ఇస్తూ టెక్నిషియన్ కి మంచి కంఫర్ట్ జోన్ లో ఉంచుతారు. ►గోపీచంద్ మలినేని యంగ్ అండ్ డైనమిక్ వండర్ ఫుల్ డైరెక్టర్. తనకి చాలా మంచి భవిష్యత్ ఉంటుంది. ఆలోచనలు పంచుకోవడం పట్ల చాలా ఓపెన్ గా ఉంటారు. తనతో పని చేయడం మంచి అనుభూతి. తన గత చిత్రం క్రాక్ చూశాను. నిజానికి మేము కలసి ప్రాజెక్ట్ చేయాల్సింది. వేర్వేరు ప్రాజెక్ట్స్ ఉండటం వలన కుదరలేదు. ఇప్పుడు తనతో కలసి పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది. ► రవి , నవీన్ అద్భుతమైన నిర్మాతలు. వారి సపోర్ట్ మర్చిపోలేను. వారికి సినిమా పట్ల గొప్ప ప్యాషన్ ఉంది. సినిమాని చాలా చక్కగా అర్ధం చేసుకుంటారు. సినిమాకి ఏం కావాలంటే అది సమకూరుస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ తో మళ్ళీ మళ్ళీ కలసి పని చేయాలని ఉంది ► గతంలో సరైనోడు, జయ జానకి నాయక లాంటి మాస్ ఎంటర్ టైనర్స్ చేశాను. ఇలాంటి ఎంటర్ టైనర్స్ చేయడం చాలా ఎంజాయ్ చేస్తాను. -
'డబ్బుల కోసం వాళ్లతో నటిస్తావా'? ట్రోలింగ్‌పై శ్రుతి కౌంటర్
అగ్ర కథానాయకుడు కమలహాసన్ వారసురాలిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శృతిహాసన్. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడికి వ్యతిరేకంగా శృతిహాసన్ నట జీవితం సాగుతోందని చెప్పక తప్పదు. కోలీవుడ్‌లో విజయ్, సూర్య, విశాల్, విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలతో నటించినా ఇక్కడ పెద్దగా విజయాలను అందుకోలేకపోయారు. విశాల్ సరసన నటించిన పూజ చిత్రం కమర్షియల్‌గా విజయాన్ని సాధించింది. శృతిహాసన్ తమిళంలో చివరిగా నటించిన చిత్రం లాభం. అది నిరాశ పరిచింది. ఆ తరువాత తమిళ తెరపై కనిపించలేదు. ఇక తెలుగులో మహేష్ బాబు, రవితేజా వంటి స్టార్ హీరోలతో నటించి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం అక్కడ మూడు చిత్రాల్లో నటిస్తుండగా, అందులో ఒకటి చిరంజీవికి జంటగా నటించిన వాల్తేరు వీరయ్య కాగా మరొకటి బాలకృష్ణకు జంటగా నటించిన వీర సింహారెడ్డి చిత్రం. మూడోది ప్రభాస్‌తో సలార్ చిత్రం. విశేషం ఏమిటంటే చిరంజీవి, బాలకృష్ణతో నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు సంక్రాంతి బరిలో ఢీ కొనబోతున్నాయి. అసలు విషయం ఏమిటంటే శృతిహాసన్ దాదాపు తన తండ్రి వయసు కలిగిన సీనియర్ నటుల సరసన నటించడంపైనే నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. శృతిహాసన్ తనకంటే రెట్టింపు వయసు ఉన్న సీనియర్ నటులతో నటించడానికి కారణం అవకాశాలు లేవనా, డబ్బు కోసమా? అంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. వీటికి శృతిహాసన్ స్ట్రాంగ్‌గానే బదులిచ్చారు. ఆమె తన ట్విట్టర్లో ట్రోలింగ్లపై స్పందిస్తూ సినిమా రంగంలో వయసు అన్నది నంబర్ మాత్రమేనన్నారు. ప్రతిభ, సత్తా ఉంటే మరణించే వరకూ నటించవచ్చన్నారు. దీన్ని ఇంతకు ముందు పలువురు హీరోలు తమ వయసులో సగం వయసు గల హీరోయిన్లతో నటించి నిరూపించారని.. తానేమీ ఇందుకు అతీతం కాదని పేర్కొన్నారు. -
చిరు 'వాల్తేరు వీరయ్య', 'బాలయ్య వీరసింహారెడ్డి' స్పెషల్ పోస్టర్లు చూశారా?
నూతన సంవత్సరం (2023) వచ్చింది. కొత్త పోస్టర్లను తెచ్చింది.. సినీ లవర్స్‌కి ఆనందాన్ని ఇచ్చింది... ఇక ఆ కొత్త అప్డేట్స్పై ఓ లుక్కేద్దాం.... చిరంజీవి హీరోగా బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో హీరో రవితేజ కీలక పాత్ర చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మింన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 13న విడుదలకానుంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రం నుంచి చిరంజీవి కొత్త పోస్టర్ని విడుదల చేసింది యూనిట్. అదేవిధంగా బాలకృష్ణ, శ్రుతీహాసన్ జంటగా నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ మూవీ నుంచి బాలకృష్ణ, శ్రుతీహాసన్ లేటెస్ట్ పోస్టర్ని యూనిట్ రిలీజ్ చేసింది. ఈ మూవీలోని ‘మాస్ మొగుడు..’ అంటూ సాగే పాటని ఈ నెల 3న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. కాగా నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కస్టడీ’. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్. మే 12న ఈ సినిమా విడుదల కానుంది. అలాగే హీరో అఖిల్ నటింన మూవీ ‘ఏజెంట్’. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో సాక్షీ వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్, సురేందర్ 2 బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలకావాల్సి ఉంది.. అయితే వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంటూ కొత్త పోస్టర్ని విడుదల చేసింది. అదేవిధంగా ‘బింబిసార’ వంటి హిట్ చిత్రం తర్వాత కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమీగోస్’. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఫిబ్రవరి 10న రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంటూ కల్యాణ్ రామ్ పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. కాగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం యానిమల్’. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. టీ సీరీస్, భద్రకాళీ పిక్చర్స్‌పై భషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినివ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. వీటితో ΄ాటు మరికొన్ని సినిమాల కొత్త పోస్టర్స్, కొత్త అప్డేట్స్ని ఇచ్చాయి చిత్రవర్గాలు. -
వీరసింహారెడ్డిలో ఆ సీన్ చూస్తే కంటతడి పెట్టాల్సిందే
ఫైట్ కి కాన్సెప్ట్ ఉండాల్సిందే. లేకపోతే ఫైట్ కి పరిపూర్ణత రాదు. ఫైట్ అనేది ఎప్పటినుంచో ఉన్నప్పటికీ ప్రేక్షకుడికి బోర్ కొట్టదు. ఒక ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్, క్యారెక్టరైజేషన్, కొత్తదనం ని యాడ్ చేసి ఒక కాన్సెప్ట్ గా ఫైట్ ని కంపోజ్ చేయడం వలనే థియేటర్ లో ప్రేక్షకులు విజల్స్, చప్పట్లు కొట్టిమరీ ఎంజాయ్ చేస్తారు’అని యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ అన్నారు. ఈ సోదర ద్వయం తాజాగా చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. ఈ రెండు చిత్రాలు సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సందర్భంగా తాజాగా రామ్ లక్ష్మణ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►చిరంజీవి గారి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ గారి 'వీరసింహారెడ్డి' రెండు భిన్నమైన కథలు. దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని రెండు భిన్నమైన క్యారెక్టరైజేషన్స్, బాడీ లాంగ్వేజ్ రాసుకున్నారు. రెండు డిఫరెంట్ గా ఉండడం వలన క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు యాక్షన్ కంపోజ్ చేయడం జరిగింది. ►ఫైట్‌కి కాన్సెప్ట్ ఉండాల్సిందే. క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ ప్రకారం కూడా యాక్షన్ డిజైన్ చేయాలి. వీరసింహారెడ్డిలో బాలయ్య బాబు చైర్ లో కూర్చుని ఉంటారు. ఎదురుగా రౌడీలు వస్తుంటారు. బాలయ్య బాబు క్యారెక్టరైజేషన్ ప్రకారం.. ఈ రౌడీలని కూడా నిల్చునికొట్టాలా ? అనే ఆలోచన వచ్చింది. దీంతో బాలయ్య బాబు చైర్ లో కూర్చునే ఒక పవర్ ఫుల్ ఫైట్ ని కంపోజ్ చేశాం. చైర్ లో కూర్చునే ఫైట్ చేయొచ్చు అనే మూడ్ చాలా అద్భుతంగా క్రియేట్ అయ్యింది. అది బాలయ్య బాబు గారి క్యారెక్టరైజేషన్ లో వున్న మ్యాజిక్. ►వాల్తేరు వీరయ్యలో ఇంటర్వెల్ సీక్వెన్స్ చేశాం. లుంగీ కట్టుకొని, శ్రీకాకుళం యాస మాట్లాడుతూ అందరితో సరదాగా కలిసిపోయే చిరంజీవి .. ఇంటర్వెల్ లో సడన్ గా రెండు గన్స్ పట్టుకొని స్టయిలీష్ గా కనిపిస్తారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చింది. అలాగే వాల్తేరు వీరయ్యలో చిరంజీవి- శ్రుతి హాసన్ మధ్య ఒక సరదా ఫైట్ కూడా కంపోజ్ చేశాం. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ►వాల్తేరు వీరయ్య ఇంటర్వెల్ ఎపిసోడ్ చేయడానికి మాకు 15 రోజులు పట్టింది. కంటెంట్ డిమాండ్ చేసినప్పుడు ఎన్ని రోజులైన అనుకున్నది సాధించే వరకూ పని చేయాల్సిందే. ఈ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పాలి. సినిమాని ఎంతగానో ప్రేమిస్తారు. ఖర్చు గురించి వెనకాడరు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాలని నిర్మిస్తారు. ► వీరసింహా రెడ్డిలో ఎమోషనల్ ఇంటర్వెల్ బ్యాంగ్ చూస్తే ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టాల్సిందే. మేము స్పాట్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నాం. అలాగే వాల్తేరు వీరయ్యలో చిరంజీవి, రవితేజ గారి మధ్య ఒక ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఇదీ కన్నీళ్లు తెప్పిస్తుంది. -
‘వీరసింహారెడ్డి’ న్యూ ఇయర్ సర్ప్రైజ్ .. ఆ వీడియో చూశారా?
నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'వీరసింహారెడ్డి'. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఒక పాట మినహా దాదాపు షూటింగ్ పూర్తయింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. న్యూ ఇయర్ కానుకగా బాలయ్య ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. మేకింగ్ వీడియో చూస్తే బాలయ్య యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. సీన్స్ చూస్తే రాయలసీమలో ఎక్కువగా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. బాలయ్య మాస్ యాక్షన్ సరిపోయేలా ఫైట్స్ తెరకెక్కించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో సందడి చేయనుంది. -
అభిప్రాయభేదాలు ఉంటే మంచిదే!
‘‘డైలాగ్ రైటర్‌గా నాకు ప్రతి కొత్త సినిమా ఓ సవాలే. హీరో ప్రాత్ర, సన్నివేశం, హీరో ఇమేజ్ను బ్యాలెన్స్ చేస్తూ డైలాగ్స్ రాయాలి. కేవలం స్టార్ ఇమేజ్ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని డైలాగ్స్ రాయడం అనేది కరెక్ట్ కాదని నా భావన. నేను అలా రాయను’’ అన్నారు రచయిత సాయిమాధవ్ బుర్రా. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్ర సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా చెప్పిన విశేషాలు. ► బాలకృష్ణగారితో నేను చేసిన నాలుగో సినిమా ‘వీరసింహారెడ్డి’. అలాగే ‘క్రాక్’ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో నేను చేసిన రెండో సినిమా కూడా ఇదే. ఈ సినిమా కథా చర్చల సమయం నుంచే నేను ఈ ప్రాజెక్ట్‌తో అసోసియేట్ అయ్యాను. ఈ సినిమాలో ఓ కొత్త ప్రాయింట్ ఉంది. ఒక పక్కా కమర్షియల్ సినిమాకు ఇలాంటి ఓ కొత్త పాయింట్ కలవడం అనేది చాలా అరుదు. ఎమోషన్, యాక్షన్, ఫ్యామిలీ.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా, బాలకృష్ణగారి నుంచి కోరుకునే అన్ని అంశాలతో ‘వీరసింహారెడ్డి’ రూపొందింది. ► కథా చర్చల్లో భాగంగా అభిప్రాభేదాలు ఉండొచ్చు. అవి ఉన్నప్పుడే పని కరెక్ట్‌గా జరుగుతున్నట్లు అర్థం. అన్నీ కూడా సినిమా అవుట్‌పుట్ బాగా రావడం కోసమే. ఒకసారి కథను ఓకే చేశాక బాలకృష్ణగారు అందులో ఇన్వాల్వ్ అవ్వరు. సందర్భానుసారంగా కొన్ని డైలాగ్స్ ఇంప్రొవైజేషన్స్ ఉండొచ్చు. ఇవన్నీ సినిమా జర్నీలో భాగం. కన్విన్స్ చేయడం, కన్విన్స్ అవ్వడం.. ఈ రెండు లక్షణాలు ఉన్న గొప్ప దర్శకుడు గోపీచంద్ మలినేనిగారు. మైత్రీ మూవీ మేకర్స్ వంటి నిర్మాతల వల్ల ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ► కొంతమంది రచయితలు ఇండస్ట్రీకి దర్శకులు కావాలని వచ్చి, రైటర్స్‌గా మొదలై, ఫైనల్‌గా దర్శకుడిగా గమ్యస్థానాన్ని చేరుకుంటారు. నేను రచయితను కావాలనే ఇండస్ట్రీకి వచ్చాను. రైటర్‌గా రాణిస్తున్నాను. ప్రస్తుతానికైతే డైరెక్షన్ ఆలోచన లేదు. ► 2017 సంక్రాంతికి చిరంజీవిగారి ‘ఖైదీ నంబర్ 150’, బాలకృష్ణగారి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలకూ నేను పని చేశాను. రెండూ విజయం సాధించాయి. ఇప్పుడు మళ్లీ చిరంజీవిగారి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణగారి ‘వీరసింహా రెడ్డి’ చిత్రాలు సంక్రాంతికి విడుదలవుతున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’కు నేను చేయక΄ోయినా అదీ నా సినిమాగానే భావిస్తాను. ఎందుకంటే చిరంజీవిగారికి నేనంటే అభిమానం. దర్శకుడు బాబీ నా మిత్రుడు. ఈ రెండు చిత్రాలూ సక్సెస్ అవ్వాలి. ► ప్రస్తుతం ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, హీరో రామ్‌చరణ్–దర్శకుడు శంకర్ కాంబినేషన్ సినిమా, అర్జున్ దర్శకత్వంలోని సినిమా, నిర్మాత కేఎస్ రామారావు సినిమాలు చేస్తున్నాను. -
బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
చిరు, బాలయ్యలో ఉన్న కామన్ క్వాలిటీ అదే: శేఖర్ మాస్టర్
‘‘చిరంజీవి, బాలకృష్ణగార్లలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటి అంటే వారి అంకితభావం, సమయపాలన. ఏ డ్యాన్స్ మూమెంట్‌ని అయినా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసేంతవరకూ రిలాక్స్ అవ్వరు’’ అన్నారు నృత్యదర్శకుడు వీజే శేఖర్. చిరంజీవీ టైటిల్ రోల్లో, రవితేజ ప్రధాన పాత్రలో బాబీ దర్శకత్వంలో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు సంక్రాంతి సందర్భంగా వరుసగా జనవరి 13, జనవరి 12న రిలీజ్ కానున్నాయి. ఈ రెండు చిత్రాలను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ‘వాల్తేరు వీరయ్య’లోని అన్ని పాటలకు, ‘వీరసింహారెడ్డి’లోని రెండు పాటలకు (సుగుణసుందరి, మా భావ మనోభావాల్) కొరియోగ్రఫీ చేశారు శేఖర్. ఈ సందర్భంగా సోమవారం విలేకర్ల సమావేశంలో శేఖర్ మాట్లాడుతూ– ‘‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ ఒకేసారి సంక్రాంతి సమయంలోనే రిలీజ్ అవుతాయనుకోలేదు. కాబట్టి ఈ సినిమాల్లోని పాటలకు నృత్యరీతులు సమకూర్చేప్పుడు పెద్దగా ఆందోళనపడలేదు. కానీ ఇప్పుడు రెండు చిత్రాలూ సంక్రాంతికే వస్తుండటంతో ఒకవైపు ఆందోళనగా మరోవైపు సంతోషంగా ఉంది. ఈ సంక్రాంతి నాకు పెద్ద పండగ అని చెప్పగలను. ఇక సోషల్ మీడియాలో కొన్ని మూమెంట్స్ రీల్స్ రూపంలో వైరల్ అవుతుంటాయి. ఈ మూమెంట్స్ బాగుంటే వీటి తాలూకు పాటలను, కంటెంట్‌ను బట్టి సినిమాను ఆడియన్స్ హిట్ చేస్తున్నారు. సో.. సిగ్నేచర్ స్టెప్స్ ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేలా అనిపిస్తోంది. నా కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా నేను సిగ్నేచర్ స్టెప్స్‌ను ఫాలో అవుతూ వస్తున్నాను. అలాగే సీనియర్లకు కొన్నిసార్లు మూమెంట్స్‌ని బట్టి రెండు, మూడు ఆప్షన్లు రెడీ చేసుకుంటుంటాం. ఇక దర్శకత్వ ఆలోచన ఉంది కానీ ఎప్పుడో కచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతం మహేశ్‌బాబు–త్రివిక్రమ్‌గార్ల కాంబినేషన్ సినిమా, రవితేజగారి ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు చేస్తున్నాను’’ అని అన్నారు. -
‘మా బావ మనోభావాలు..’సాంగ్ వచ్చేసింది.. బాలయ్య స్టెప్పులు అదుర్స్
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ని నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి స్పెషల్ సాంగ్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'మా బావ మనోభావాలు' అంటూ సాగే ఈ పాట..మాస్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించేలా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. థియేటర్స్‌లో ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఈ పాటను కంపోజ్ చేశాడు. హీరోయిన్లు హానీ రోజ్, చంద్రికా రవిలతో బాలయ్య వేసే స్టెప్పులు అదిరిపోయాయి. ఈ పాటకి రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. సాహితీ చాగంటి, యామిని, రేణు కుమార్ చక్కగా ఆలపించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కాబోతుంది. -
దూకుడు పెంచిన చిరు, బాలయ్య...
-
'వీర సింహారెడ్డి' వైఫ్ హనీరోజ్ బ్యూటిఫుల్ ఫోటోలు
-
బాలయ్య 'వీరసింహారెడ్డి'.. ఆ సాంగ్ చూసేయండి..!
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘సుగుణ సుందరి..’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను ఇవాళ విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఆ వీడియో లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయని చిత్రయూనిట్ ప్రకటించింది. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నారు. -
ఒక్క పాటతో పూర్తి
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘‘వీరసింహారెడ్డి’ ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తమన్ సంగీతం అందించిన ఫస్ట్ సింగిల్ ‘జై బాలయ్య..’ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. 2023 జనవరి 12న సంక్రాంతికి మా సినిమాని విడుదల చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రిషి పంజాబీ, సీఈవో: చిరంజీవి (చెర్రీ), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి, లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రమణ్యం కేవీవీ. -
వీరసింహారెడ్డి వచ్చేది ఆ రోజే!
సంక్రాంతి బరిలో దిగేందుకు పెద్ద సినిమాలు సై అంటున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య, దళపతి విజయ్ వారిసు సంక్రాంతికి వస్తుండగా తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా రేసులో నిలబడ్డాడు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వీర సింహారెడ్డి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రుతిహాసన్ కథానాయిక. దునియా విజయ్, వరలక్క్క్ష్మి శరత్‌కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. చదవండి: మట్టి కుస్తీ.. అలాంటి అమ్మాయి భార్యగా రావాలనుకుంటాడు -
టాలీవుడ్లో మాస్ జాతర.. పూనకాలు తెప్పిస్తారట!
టికెట్లు బాగా తెగాలంటే మాస్ ప్రేక్షకులు రావాలి. అందుకే ఏడాదికి రెండొందల సినిమాలు వస్తే.. వాటిలో తొంభై శాతం మాస్ సినిమాలే ఉంటాయి. ఆ మాస్ బొమ్మ (సినిమా) బాగుంటే ఇక మాస్ ప్రేక్షకులకు పండగ... వసూళ్లతో బాక్సాఫీస్‌కి పండగ. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న ‘మాస్ బొమ్మ’లపై ఓ లుక్కేద్దాం... మాస్ పాత్రలకు పెట్టింది పేరు చిరంజీవి. తెరపై ఆయన మాస్ డైలాగులు, డ్యాన్స్‌లు చూస్తే థియేటర్లో మెగా అభిమానులు, ప్రేక్షకులు విజిల్స్‌తో రెచ్చిపోతారు. తాజాగా చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం అలాంటి ఫుల్ మాస్ కిక్ ఇవ్వనుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్స్, టీజర్, ‘బాస్ పార్టీ..’ పాట ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. మరోవైపు ‘వీరసింహారెడ్డి’ అంటూ బాలకృష్ణ పక్కా మాస్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చేలా ఉన్నాయి. ఈ సినిమాలోని ‘జై బాలయ్య..’ అంటూ అదిరిపోయే మాస్ సాంగ్‌ని శుక్రవారం రిలీజ్ చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలుస్తోంది. కాగా అటు ‘వాల్తేరు వీరయ్య’, ఇటు ‘వీరసింహారెడ్డి’ చిత్రాల్లో శ్రుతీహాసనే కథానాయిక కావడం విశేషం. ఇకపోతే.. హీరో రవితేజకి మాస్ మహారాజా అనే ట్యాగ్‌లైన్ ఉంది. ఆయన సినిమాలో కచ్చితంగా మాస్ యాంగిల్ కనిపిస్తుంది. అలాంటి రవితేజ మరోసారి ‘ధమాకా’ చిత్రంతో మాస్ లుక్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. ఈ చిత్రం నుంచి ‘డు డు..’ అనే పాటని శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ సినిమా డిసెంబరు 23న విడుదలవుతోంది. కాగా వరుస పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో పవర్ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు ప్రభాస్. ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల కానుంది. అలాగే పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ అంటూ మాస్‌గా రానున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధీ అగర్వాల్ హీరోయిన్. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ మాస్ లుక్‌లోనూ కనిపించనున్నారు. అదేవిధంగా ‘పుష్ప’ చిత్రంలో ఊర మాస్ లుక్‌లో కనిపించి సగటు సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేశారు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబరు 17న విడుదలై పాన్ ఇండియా స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప 2’ రానుంది. తొలి భాగంలో ఊర మాస్‌గా కనిపించిన అల్లు అర్జున్ ద్వితీయ భాగంలో అంతకు మించి కనిపిస్తారని ఊహించవచ్చు. అదేవిధంగా ఎన్టీఆర్‌కి మాస్ పాత్రలు కొత్తేమీ కాదు. ఇప్పటికే ఆ పాత్రల్లో ప్రేక్షకులను అలరించిన ఆయన మరోసారి మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ఎన్టీర్ హీరోగా రూపొందుతున్న 30వ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. అలాగే ఆయన హీరోగా తెరకెక్కనున్న 31వ చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్టర్. ఈ రెండు సినిమాల్లో ఎనీ్టఆర్ మాస్ లుక్‌లో సందడి చేయనున్నారు. ఇకపోతే తన సహజమైన నటనతో నేచురల్ స్టార్ అనే టాగ్ని సొంతం చేసుకున్న నాని కెరీర్లో తొలిసారి పూర్తి స్థాయి మాస్ పాత్రలో నటిస్తున్న సినిమా ‘దసరా’. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం ఊరమాస్ బ్లాక్ లుక్‌లోకి మారిపోయారు నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 30న విడుదల కానుంది. ఇక తన కెరీర్లో అక్కినేని నాగచైతన్య ఇప్పటికే మాస్ పాత్రలు చేసినా ప్రేక్షకులు లవర్‌బాయ్‌గా, పక్కింటి కుర్రాడిలా చూస్తారు. తాజాగా ఆయన నటిస్తున్న తెలుగు–తమిళ చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు డైరెక్టర్. కాగా ఈ నెల 23న నాగచైతన్య బర్త్ డే సందర్భంగా ‘కస్టడీ’ టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ లుక్ చూస్తే ఇప్పటి వరకు చేయని ఫుల్ మాస్ క్యారెక్టర్ని నాగచైతన్య చేస్తున్నారని స్పష్టం అవుతోంది. మరోవైపు అక్కినేని అఖిల్ కూడా మాస్ లుక్‌తో రానున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమా కోసం పక్కా మాస్‌లుక్‌కి మారిపోయారు అఖిల్. తన పాత్ర కోసం ఫిజిక్‌ని సిక్స్‌ప్యాక్‌కి మార్చుకున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ హీరోలే కాదు.. ఇంకా పలువురు హీరోలు మాస్ లుక్‌లో మమమ్మాస్ అంటూ తెరపై సందడి చేయనున్నారు. -
హర్టయిన శాస్త్రిగారు, కానీ దానికోసం కాదట!
నందమూరి నటసింహం ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. తాజాగా ఈ సినిమా నుంచి మాస్ ఆంథెమ్ సాంగ్ జై బాలయ్య రిలీజైంది. రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి పేరు అంటూ సాగే ఈ పాట ఒసేయ్ రాములమ్మ సాంగ్‌ను గుర్తు చేస్తోందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ పాటకు సంగీతం అందించిన తమన్‌ను కాపీ క్యాట్ అంటూ ఆడేసుకుంటున్నారు. కాపీ పాటకు లిరిక్స్ అందించావటూ రామజోగయ్య శాస్త్రిపై కూడా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో రామజోగయ్య శాస్త్రి ఓ ట్వీట్ చేశాడు. ప్రతిపాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను. దయచేసి నన్ను గౌరవంగా చూడగలిగినవారు మాత్రమే నాతో ప్రయాణించగలరు. అన్నట్టూ.. జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్థం నా పేరును సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రిగా మార్చుకున్నాను. ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు. ఇబ్బందిగా అనిపిస్తే ఇటు రాకండి అని రాసుకొచ్చాడు. అలా పాట రిలీజ్ అయిందో లేదో ఇలా ట్రోలింగ్ జరగడంతో రామజోగయ్య శాస్త్రి హర్ట్ అయ్యాడని పలువురూ భావించారు. దీంతో తన ట్వీట్‌కు వివరణ ఇచ్చుకున్నాడీ రచయిత. వేరే విషయం మీద ఆ ట్వీట్ చేశానని, ట్రోలింగ్ లేదు, ఏమీ లేదని స్పష్టం చేశాడు. అభిమానులందరూ నేనంటే చాలా ఇష్టపడతారని, ముఖ్యంగా జై బాలయ్య పాట పట్ల సాహిత్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారని క్లారిటీ ఇచ్చాడు. ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను...దయచేసినన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు.. అన్నట్టు...జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరు ను సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి గా మార్చుకున్నాను..ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు.. ఉంటే ఇటు రాకండి🙏 — RamajogaiahSastry (@ramjowrites) November 25, 2022 చదవండి: నా కోడలు బంగారం అంటున్న నయనతార అత్త -
వీరసింహారెడ్డి నుంచి 'జై బాలయ్య' సాంగ్ విడుదల..
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ జైబాలయ్య మాస్ ఆంథెమ్ సాంగ్‌ను విడుదల చేశారు. రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు అంటూ మొదలైన పాట బాలయ్య అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా కరీముల్లా పాడారు.ఇక పాటలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా కనిపించారు. వైట్ అండ్ వైట్ అవుట్‌ఫిట్‌లో మెడలో బంగారు చైన్, చేతికి వాచ్ పెట్టుకొని తనదైన స్టైల్లో డ్యాన్స్ చేయడం విశేషం. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో జరిగిన వాస్తవ అంశాల నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈసినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది. -
వీరసింహారెడ్డి లేటెస్ట్ అప్ డేట్.. ఫస్ట్ సింగిల్ ఆరోజే...!
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజా క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. (చదవండి: యాక్షన్ మోడ్‌లో బాలయ్య.. ‘వీరసింహారెడ్డి’లో ఇదే కీలక సన్నివేశం) ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పాటను ఈనె 25న ఉదయ 10.29 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. దీంతో బాలయ్య మాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. A MASS ANTHEM for the GOD OF MASSES 🔥#VeeraSimhaReddy first single #JaiBalayya on November 25th at 10.29 AM ❤️🔥#NandamuriBalakrishna @megopichand @shrutihaasan @OfficialViji @varusarath5 @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/nYGn2dVRTv — Mythri Movie Makers (@MythriOfficial) November 23, 2022 -
అనంతపురంలో వీరసింహారెడ్డి
అనంతపురంకు షిఫ్ట్ అయ్యారు వీరసింహారెడ్డి. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూ΄÷ందుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ బుధవారం అనంతపురంలో ప్రారంభం కానుంది. అనంతపురంలోని పెన్నా అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ఉరవకొండ, పెనుగొండ ఫోర్ట్ లొకేషన్స్‌లో చిత్రీకరణను ΄్లాన్ చేశారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ చిత్రా నికి సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: చందు రావిపాటి.