‘వీరసింహారెడ్డి లార్జర్ దెన్ లైఫ్ మూవీ. యాక్షన్, ఎమోషన్స్, విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ప్రేక్షకులకు సినిమా విజువల్ ఫీస్ట్ లా ఉంటుంది. సినిమా చూస్తున్నపుడు చాలా చోట్ల గూస్ బంప్స్ వస్తాయి’అని సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ అన్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంకాంత్రి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
► 'వీరసింహారెడ్డి' కోసం ఏడాది పాటు షూట్ చేశాం. దాదాపు అన్ని బుతువుల్లో షూటింగ్ జరిగింది. సిరిసిల్లల్లో షూట్ చేస్తునపుడు తీవ్రమైన వేడి ఉండేది. అలాగే టర్కీ , ఇస్తాంబుల్‌లో కూడా షూటింగ్ చేశాం. అక్కడ కూడా చాలా వేడి ఉంటుంది. ఈ సినిమాలో రగ్గడ్ నెస్ కావాలి. దాని కోసం టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసి దాన్ని ఎచీవ్ చేశాం.
►బాలకృష్ణ గారితో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. టెక్నిషియన్స్ ని చాల గొప్పగా అర్ధం చేసుకుంటారు. చాలా గౌరవిస్తారు. బాలయ్య గారికి ప్రతి డిపార్ట్మెంట్ పై గొప్ప అవగాహన ఉంటుంది. చాలా ఫ్రీడమ్ ఇస్తూ టెక్నిషియన్ కి మంచి కంఫర్ట్ జోన్ లో ఉంచుతారు.
►గోపీచంద్ మలినేని యంగ్ అండ్ డైనమిక్ వండర్ ఫుల్ డైరెక్టర్. తనకి చాలా మంచి భవిష్యత్ ఉంటుంది. ఆలోచనలు పంచుకోవడం పట్ల చాలా ఓపెన్ గా ఉంటారు. తనతో పని చేయడం మంచి అనుభూతి. తన గత చిత్రం క్రాక్ చూశాను. నిజానికి మేము కలసి ప్రాజెక్ట్ చేయాల్సింది. వేర్వేరు ప్రాజెక్ట్స్ ఉండటం వలన కుదరలేదు. ఇప్పుడు తనతో కలసి పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది.
► రవి , నవీన్ అద్భుతమైన నిర్మాతలు. వారి సపోర్ట్ మర్చిపోలేను. వారికి సినిమా పట్ల గొప్ప ప్యాషన్ ఉంది. సినిమాని చాలా చక్కగా అర్ధం చేసుకుంటారు. సినిమాకి ఏం కావాలంటే అది సమకూరుస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ తో మళ్ళీ మళ్ళీ కలసి పని చేయాలని ఉంది
► గతంలో సరైనోడు, జయ జానకి నాయక లాంటి మాస్ ఎంటర్ టైనర్స్ చేశాను. ఇలాంటి ఎంటర్ టైనర్స్ చేయడం చాలా ఎంజాయ్ చేస్తాను.
Comments
Please login to add a commentAdd a comment