
బాలయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ హనీ రోజ్. ఈ కేరళ కుట్టి ముద్దుగుమ్మ మలయాళంలో '14 వయదిల్ బాయ్‌ఫ్రెండ్' అనే చిత్రం ద్వారా 2004లో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో మొదలు కనవే, సింగం పులి, మల్లు కట్టు, గాంధర్వన్ లాంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. గతేడాది బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది.
ఇటీవల డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అప్పుడప్పుడు ఈవెంట్లలో సందడి చేసే కేరళ భామ గతంలోనూ డిఫరెంట్ లుక్స్‌లో కనిపించింది. తాజాగా ఓ జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. డంబెల్‌తో కసరత్తులు చేస్తూ సందడి చేసింది. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. హనీ రోజ్ న్యూ లుక్ చూశారా అంటూ పోస్టులు పెడుతున్నారు. గతంలో ఇలాగే స్టన్నింగ్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు షాకిచ్చిన మలయాళీ భామ.. మరోసారి అదిరిపోయే ట్వీట్ ఇచ్చింది. ఈ సారి ఏకంగా జిమ్ డ్రెస్‌లో స్టేజీపై అదరగొట్టేసింది.
Clicks 📸 pic.twitter.com/n0o6Mofw94
— Honey Rose (@HoneyRoseNET) January 23, 2024
Any fitness tips? 😋 pic.twitter.com/vkRHgg2NUR
— Honey Rose (@HoneyRoseNET) January 23, 2024
💪🚶♀️ pic.twitter.com/uW9oEnyWA9
— Honey Rose (@HoneyRoseNET) January 22, 2024