సాధారణంగా హీరోయిన్లు దాదాపు ఒకేలా కనిపిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం కట్టుబొట్టు మార్చి షాకిస్తుంటారు. అలా తెలుగులో ఓ సినిమా చేసిన యంగ్ బ్యూటీ కూడా సడన్ షాకిచ్చింది. మొత్తం వేషధారణ మార్చేసి కనిపించింది. ఈమెని చూసిన నెటిజన్స్, ప్రేక్షకులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈమెని గుర్తుపట్టారా? ఎవరో చెప్పేయమంటారా?
(ఇదీ చదవండి: పుట్టిన బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్)
పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు హనీరోజ్. హా అవును మీరు ఊహించింది కరెక్టే. గతేడాది సంక్రాంతికి రిలీజైన 'వీరసింహారెడ్డి' సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించింది ఈమెనే. ఈ మూవీతో ఈమెకు క్రేజ్ బాగానే వచ్చినప్పటికీ ఛాన్సులే సరిగా రాలేదు. తెలుగులో మరో మూవీ చేయట్లేదు. అదే టైంలో ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. ఈమె వయసు 32 ఏళ్లే అయినప్పటికీ రోజురోజుకీ బొద్దుగా మారిపోతోంది.
సినిమాలు ఛాన్సులు పెద్దగా రావట్లేదని షాప్, మాల్ ఓపెనింగ్స్ తదితర ఈవెంట్స్‌తో హనీరోజ్ ఫుల్ బిజీగా ఉంటోంది. తాజాగా ఊటీలో ఓ షాప్ ఓపెనింగ్‌కి వచ్చిన ఈ హాట్ బ్యూటీ.. డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో కనిపించింది. ఈ క్రమంలోనే హనీరోజ్ లేటెస్ట్ లుక్‌పై తెలుగు మీమర్స్ ఫన్నీ సెటైర్స్ వేస్తున్నారు. ఏదేమైనా హనీరోజ్ తాజాగా ఫొటోలు, వీడియోలు మాత్రం మంచి క్రేజీగా ఉన్నాయి.
(ఇదీ చదవండి: రిలీజ్ డేట్ గందరగోళం.. సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ)
#HoneyRose Recent Clicks 📸😍❤ pic.twitter.com/47YDg3bO7z
— Trend Soon (@trend_soon) January 6, 2024
Comments
Please login to add a commentAdd a comment