యంగ్‌ హీరోతో హనీరోజ్‌ రొమాన్స్‌.. వైరల్‌ అవుతున్న న్యూస్‌ | Honey Rose Item Song In Gangs Of Godavari | Sakshi
Sakshi News home page

Honey Rose: యంగ్‌ హీరోతో హనీరోజ్‌.. వైరల్‌ అవుతున్న న్యూస్‌

Published Sun, Oct 15 2023 9:09 AM | Last Updated on Sun, Oct 15 2023 9:09 AM

Honey Rose Item Song In Gangs Of Godavari - Sakshi

బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాతో టాలీవుడ్‌లో క్రేజీ గుర్తింపు తెచ్చుకున్న హనీరోజ్‌ యూత్‌ గుండెళ్లో గ్లామర్‌ ముద్ర వేశారు. తన గ్లామర్‌తో కుర్రకారు మతిపోగొడుతోన్న ఈ మలయాళ బ్యూటీ తన సోషల్‌ మీడియా  ద్వారా టచ్‌లో ఉంటుంది. ‘వీరసింహారెడ్డి’ ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఆమెకు చాలా సినిమా అవకాశాలు వచ్చినా అవన్నీ అందాల ఆరబోతకు మాత్రమే పరిమితం కావడంతో చాలా వరకు రిజెక్ట్‌ చేసింది. తాజాగా పాన్ ఇండియా మూవీ ‘రాచెల్’లో హనీరోజ్‌నే  ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.

(ఇదీ చదవండి: పెళ్లికి ముందు కూడా నరకం చూశా.. రేణు దేశాయ్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌)

తాజాగా ఈ  బ్యూటీ ఐటమ్‌ సాంగ్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్ సేన్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఐటమ్‌ సాంగ్‌కు గ్రీన్‌ ఇచ్చినట్లు సమాచారం. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా ఉన్నారు. 

ఈ క్రేజీ కాంబినేషన్‌కు ఈ హాట్‌ బ్యూటీ జతకడితే సినిమాకు భారీ ప్రమోషన్‌ దక్కడం ఖాయం అని తెలుస్తోంది. పాటలో తన హాట్ హాట్ ఫిజిక్‌తో దుమ్ములేపడం గ్యారెంటీ అని పలువురు చెప్పుకొస్తున్నారు. ఈ పాట కోసం ఆమె ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆమెకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా అంత మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారట. ఈ విషయాన్ని 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మేకర్స్‌ అధికారికంగా తెలపాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement