రామజోగయ్యశాస్త్రి, నవీన్ యెర్నేని, గోపీచంద్ మలినేని, వై. రవిశంకర్
‘‘వీరసింహా రెడ్డి’కి తమన్ అత్యద్భుతమైన పాటలు ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇందులో అన్ని పాటలు రామజోగయ్య శాస్త్రిగారు రాశారు. ‘మాస్ మొగుడు..’ చివర్లో తీసిన పాట. అప్పుడు మా కెమెరామేన్ రిషి పంజాబీ డిఐ వర్క్‌లో వుండటం వలన నా ‘క్రాక్’ సినిమా కెమెరామేన్ జీకే విష్ణు ఈ పాటని చేశారు. బాలయ్యబాబుని చాలా కలర్‌ఫుల్‌గా చూపించారు’’ అన్నారు గోపీచంద్ మలినేని.
నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రుతీహాసన్ హీరోయిన్‌గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. సోమవారం ఈ చిత్రంలోని ‘మాస్ మొగుడు..’ పాట ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తమన్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, మనో, రమ్య బెహరా ఆలపించారు.
ఈ కార్యక్రమంలో గోపీచంద్ మలినేని మాట్లాడుతూ– ‘‘ఇటీవల ఒంగోలులో జరిగిన వేడుకలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. సినిమాలో మామూలుగా ఉండదు. ‘వీరసింహా రెడ్డి’ ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్... రాసిపెట్టుకోండి’’ అన్నారు. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ– ‘‘నేను బాల కృష్ణగారికి అభిమానిని. ఈ చిత్రానికి సింగిల్ కార్డ్ రాసే చాన్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేనికి, మైత్రీ మూవీ మేకర్స్‌కి కృతజ్ఞతలు. అన్ని పాటలూ అద్భుతంగా ఉంటాయి. బాలకృష్ణగారి మార్క్ ఫైర్ బ్రాండ్ సినిమా ఇది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment