
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ జైబాలయ్య మాస్ ఆంథెమ్ సాంగ్‌ను విడుదల చేశారు.
రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు అంటూ మొదలైన పాట బాలయ్య అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా కరీముల్లా పాడారు.ఇక పాటలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా కనిపించారు. వైట్ అండ్ వైట్ అవుట్‌ఫిట్‌లో మెడలో బంగారు చైన్, చేతికి వాచ్ పెట్టుకొని తనదైన స్టైల్‌లో డ్యాన్స్ చేయడం విశేషం. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో జరిగిన వాస్తవ అంశాల నేపథ్యంలో మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈసినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment