balayya
-
మహేష్ బాబు - రాజమౌళి టైటిల్ మీద కన్నేసిన బాలయ్య
-
బాలయ్య, మోక్షజ్ఞతో మల్టీ స్టారర్ కు హనుమాన్ డైరెక్టర్ రెడీ..
-
Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
ఉంటే సినిమా షూటింగులో.. అది లేదంటే హైదరాబాద్‌లో ఉంటారాయన. తనను నమ్మి గెలిపించిన ప్రజలు అప్పుడప్పుడూ ఆయనకు గుర్తొస్తుంటారు. అలా యాదికొచ్చినప్పుడల్లా ఈ ప్రాంతానికి చుట్టపుచూపుగా వస్తుంటారు. స్థానికుల అవస్థలు పట్టించుకోకుండా వెంటనే వెళ్లిపోతుంటారు. అయితే, నేడు ఎన్నికలు రావడంతో నియోజకవర్గంలో వాలిపోయారు. వెంటే కుటుంబ సభ్యులను తెచ్చుకున్నారు. ప్రచారం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న వారంతా లేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నా ఏమీ చేయకుండానే కాలక్షేపం చేసి.. నేడు మరోసారి గెలిపిస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ మళ్లీ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టేందుకు యత్నిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: పదేళ్లుగా హిందూపురం నియోజకవర్గానికి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నా ఎప్పుడూ పట్టుమని పదిరోజులు కూడా స్థానికంగా ఉన్న దాఖలాలు లేవు. ఓవైపు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ‘గడప గడపకూ’ అంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తుంటే.. బాలయ్య మాత్రం నిత్యం షూటింగులతో బిజీగా ఉండేవారు. అయితే, నేడు ఎన్నికలు రావడంతో ‘పురం’పై వాలిపోయారు. బాలకృష్ణతో పాటు ఆయన భార్య వసుంధర, కూతురు బ్రాహ్మణి ఇలా మొత్తం హిందూపురం చేరారు.పీఏలదే పెత్తనంబాలకృష్ణ లేకపోవడంతో ఆయన పీఏలే పెత్తనం చెలాయించేవారు. అధికారం మాటున యథేచ్ఛగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారు. తమ నాయకుడికే పట్టనప్పుడు తమకేం సంబంధం అన్నట్లు ప్రజలకు అంటీముట్టనట్లు వ్యవహరించేవారు. ఒక వైపు అప్పుడప్పుడు వచ్చి పోయే ఎమ్మెల్యే, మరో వైపు తమ వ్యాపకాల్లో మునిగితేలే ఆయన పీఏలు.. ఇలా ఎవరికి వారు బిజీబిజీగా ఉండే నేపథ్యంలో స్థానిక ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక విసిగి పోయారు.బావ బాటలో బామ్మర్ది..తన సొంత బావ చంద్రబాబు సీఎంగా ఉన్న 2014–19 మధ్య కాలంలో కూడా హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధికి ఒక్క పునాది రాయి కూడా బాలకృష్ణ వేయలేదు. కానీ, నేడు బావ కుటిల సూత్రాలు పాటించేందుకు సిద్ధమయ్యారు. 2014లో బాబు ముఖ్యమంత్రి అయ్యాక సంతలో పశువులను కొన్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయగా.. ఆయనను ఆదర్శంగా తీసుకున్న బాలయ్య నేడు ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు కౌన్సిలర్లు, ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీని కొనుగోలు చేశారు. ఒక్కొక్కరికి ఒక్కోరేటు నిర్ణయించి తమ వైపు తిప్పుకున్నారు.వ్యతిరేకతను గ్రహించి ప్రలోభాలు..గత పదేళ్లూ బాలకృష్ణ నిర్లక్ష్యపు తీరుతో విసిగిపోయిన స్థానికులు ఈ ఎన్నికల్లో మాత్రం తగిన గుణపాఠం చెప్పేందుకే సిద్ధమైనట్లు తెలిసింది. ఈ విషయాన్ని పసిగట్టిన బాలకృష్ణ ప్రలోభాలకు తెరలేపారు. అందులో భాగంగానే ఇప్పటికే వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను కొన్న ఆయన.. అంతటితో ఆగక ప్రజలకు చీరలు, డబ్బు పంచడం తదితర అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్టు సమాచారం.తామెందుకు ఎమ్మెల్యేలు కాకూడదు!బాలకృష్ణ వైఖరిపై అక్కడి ప్రజలే కాదు... టీడీపీ నాయకులు కూడా విసుగెత్తినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ నందమూరి కుటుంబాన్ని ఆదరించింది చాలు.. వారిని ఇలాగే గెలిపిస్తూ వెళితే తమకు అవకాశం రాదు అన్న ఆలోచనలో పడినట్లు సమాచారం. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ టీడీపీ నేతతో పాటు ఆ పార్టీకే చెందిన మరో ముఖ్యనాయకుడు కిందిస్థాయి కార్యకర్తల వద్ద ఈ విషయంపై చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారిని ఆదరిస్తున్నాం కదా అని అలుసైపోయాం, ఒక్కసారి ఓడిస్తే వాళ్లు వేరే నియోజకవర్గం చూసుకుంటారు అంటూ మాట్లాడుకున్నట్లు ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ నాయకుడు తెలిపాడు. -
పలుకుబడి కోసం.. పక్కా ప్లాన్ తో.. మర్డర్!
మహబూబ్‌నగర్: తనకు ఎదురు తిరగడమేగాక కులంలో తక్కువ చేసే విధంగా వ్యవహరిస్తున్న వ్యక్తిని కర్రతో చితకబాది అంతమొందించిన నిందితుడిని గురువారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసుకు సంబంధించిన వివరాలను సీఐ రమేశ్‌బాబు వెల్లడించారు. బాదేపల్లి పాతబజార్‌కు చెందిన మీనుగ బాలయ్య(30) నిందితుడు మీనుగ బాలస్వామి వరుసకు సోదరులు. అయితే బాలయ్య కొంతకాలంగా కోళ్లను దొంగిలించి అమ్ముకుని మద్యం తాగేవాడు. దీంతో కోళ్ల యజమానులు మీనుగ బాలస్వామికి ఫిర్యాదు చేయడంతో పలుమార్లు తమ్ముడిని మందలించాడు. అయినా దొంగతనం మానకపోవడంతోపాటు తన కోళ్లను సైతం దొంగిలించాడు. తన కోళ్లను ఎందుకు దొంగిలించావని, కోళ్ల దొంగతనం ఆపాలని హెచ్చరించగా ఎదురుతిరిగాడు. తనకు బాహాటంగా ఎదురుతిరగడంతో కులంలో పెద్దరికంగా వ్యవహరిస్తున్న తన పలుకుబడికి విలువ లేకుండా పోతుందని, బాలస్వామి బాలయ్యను అంతమొందిస్తే కులంలో తనకు అందరూ భయపడతారని భావించాడు. ఈ నెల 14న రాత్రి తన గుడిసె వద్దకు వచ్చిన బాలయ్యతో గొడవపడి కర్రతో తీవ్రంగా చితకబాదాడు. గాయపడిన బాలయ్య తన ఇంటికి వెళ్లి మరుసటిరోజు మృతిచెందాడు. బాలయ్యను తాను కొట్టిన విషయం ఎవరికీ చెప్పవద్దని అతని భార్య మీనుగ నాగలక్ష్మిని సైతం బెదిరించాడు. దీంతో నాగలక్ష్మి పోలీసులకు తన భర్త అనారోగ్యంతో మృతిచెందాడని తెలిపింది. అయితే డాక్టర్లు పోస్టుమార్టం సమయంలో తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడగా.. బాలయ్య భార్యతో ఫిర్యాదు తీసుకుని హత్య కేసుగా నమోదు చేశారు. తనపై హత్య కేసు నమోదైన విషయం తెలుసుకున్న నిందితుడు బాలస్వామి గురువారం మధ్యవర్తి ద్వారా నేరం ఒప్పుకొని పోలీసులకు లొంగిపోయాడు. కాగా నిందితుడు గతంలో నాగసాల వద్ద జరిగిన జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు వినియోగించిన కర్రను స్వాధీనపర్చుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్ఐలు చంద్రమోహన్, నాగరాజు పాల్గొన్నారు. -
అందులో నిజం లేదు, ఆ రూమర్స్ నన్నెంతో బాధపెట్టాయి : తమన్నా
మిల్క్ బ్యూటీ తమన్నా కొంతకాలంగా తరచుగా వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలె ఆమె బాలకృష్ణ సినిమాలో ఐటెంసాంగ్ చేస్తుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎన్బీకే 108' ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను సంప్రదించగా, కోటిన్నర డిమాండ్ చేసిందని, దీంతో తమన్నాను తప్పించినట్లు వార్తలు షికార్లు చేశాయి. తాజాగా ఈ రూమర్స్‌పై ఘాటుగానే స్పందించింది తమన్నా. 'అనిల్ రావిపూడితో కలిసి వర్క్ చేయడాన్ని నేను ఎంతో ఇష్టపడతాను. అలాగే బాలకృష్ణ సార్ అంటే కూడా నాకు ఎంతో గౌరవం ఉంది. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో నేను స్పెషల్ సాంగ్ చేస్తున్నాను అంటూ నా గురించి వార్తలు రాస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నా గురించి ఇలా రాయడం నన్నెంతో బాధించింది. చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'విరూపాక్ష' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసేముందు దయచేసి రీసెర్చ్ చేసి తెలుసుకోండి' అంటూ తమన్నా ట్వీట్ చేసింది. దీంతో ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. గతంలో అనిల్ రావిపూడితో కలిసి ఎఫ్2, ఎఫ్3, సరిలేరు నీకెవ్వరూ లాంటి సినిమాల్లో నటించింది తమన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. I have always enjoyed working with @AnilRavipudi sir. I have huge respect for both him and Nandamuri Balakrishna sir. So reading these baseless news articles about me and a song in their new film, is very upsetting. Please do your research before you make baseless allegations. — Tamannaah Bhatia (@tamannaahspeaks) May 20, 2023 -
బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్.. షూటింగ్ షురూ
హీరోయిన్ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరుమీదుంది. ఇప్పటికే కమల్‌హాసన్‌లో ఇండియన్-2 లో నటిస్తున్న కాజల్ ఇప్పుడు మరో బడా ప్రాజెక్ట్‌లో నటిస్తుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్గా కాజల్ నటించబోతోందని గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు వాటినే నిజం చేస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మూవీ టీం ఆమెకు వెల్కమ్ ఆన్‌బోర్డ్ అంటూ స్వాగతం పలికింది. బాలయ్యతో కాజల్ నటించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో కాజల్‌తో పాటు ధమాకా బ్యూటీ శ్రీలీల కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్లో ఇది 108వ చిత్రం కావడంతో ఇప్పటికే ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
తారకరత్న కోసం బాలయ్య ఎంతో చేశారు.. ఎమోషనల్ అయిన అలేఖ్య రెడ్డి
నందమూరి తారకరత్న మరణించి సుమారు నెల రోజులు కావొస్తుంది. ఇంకా ఆయన లేరన్న విషయాన్ని అభిమానులు, కుటుంసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తారకరత్న మరణంతో ఆయన బార్య అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుంది. తాజాగా బాలయ్య చేసిన సాయాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ''మేం కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయన. కష్టసుఖాల్లో మాకు రాయిలా కొండంత అండగా నిలబడిన వ్యక్తి. ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పుడు తండ్రిలా, నీ బెడ్ పక్కనే కూర్చొని నీకోసం పాట పాడినప్పుడు అమ్మలా,నువ్వు రియాక్ట్ అవుతామో అని, నిన్ను నవ్వించడం కోసం జోక్స్ వేస్తూ సరదాగా కనిపించి, ఎవరూ లేని సమయంలో నీకోసం కన్నీరు పెట్టుకున్నారు. చివరి క్షణం వరకు నీకోసం చాలా చేశారు. ఓబు(తారకరత్న ముద్దు పేరు)నువ్వు ఇంకొన్నాళ్లు ఉంటే బాగుండేది. నిన్ను చాలా మిస్ అవుతున్నాం'' అంటూ అలేఖ్యరెడ్డి ఎమోషనల్ అయ్యింది. పిల్లలతో బాలయ్య ఉన్న ఫోటోకు తారకరత్నను యాడ్ చేసి ఎవరో ఆ పిక్‌ను అలేఖ్య రెడ్డికి పంపగా, ఇది ఎంతో బాగుందంటూ అలేఖ్య పేర్కొంది. కాగా బాలయ్యకు తారకరత్న అంటే ఎంతో ఇష్టం. గుండెపోటుతో ఆసుపత్రికి తీసుకెళ్లిన దగ్గర్నుంచి అతని కట్టెకాలే వరకు ఆ కుటుంబానికి బాలయ్య పెద్దదిక్కులా నిలిచాడు. అంతేకాకుండా తారకతర్న-అలేఖ్యరెడ్డిల ప్రేమ వివాహానికి కుటుంబసభ్యులు అంగీకరించకపోయినా బాలయ్య వాళ్లకు తోడులా ఉండి భరోసా ఇచ్చినట్లు తారకరత్న గతంలో పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede) -
బాలయ్య పెట్టిన ముహూర్తానికే తారకరత్న అంత్యక్రియలు
►జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు ► మహాప్రస్థానంలో అంత్యక్రియలకు హాజరైన చంద్రబాబునాయుడు, విజయసాయిరెడ్డి, లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ► తారకరత్న వెంటే వైకుంఠ రథంలో మహాప్రస్థానానికి వచ్చిన బాలకృష్ణ, చంద్రబాబునాయుడు ► ఫిల్మ్ చాంబర్ నుంచి మహా ప్రస్థానానికి అంతిమ యాత్ర ► తండ్రి మోహన కృష్ణ చేతుల మీదుగా తారకరత్న అంతిమ సంస్కారాలు ► పాడె మోసిన బాలకృష్ణ, మిగతా కుటుంబసభ్యులు ► కన్నీరుమున్నీరవుతున్న నందమూరి కుటుంబసభ్యులు తారకరత్న మృతితో నందమూరి కుటుంబంతో పాటు ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులోనే తారకరత్న అకాల మరణం చెందడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అజాత శత్రువుగా, మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తిగా తారకరత్నకు పేరుంది. దీంతో ఆయన్ను కడసారి చూసేందుకు అభిమానులు తరలి వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకొని తారకరత్నకు నివాళులు అర్పించారు. బాలకృష్ణ నిర్ణయించిన ముహూర్తం మేరకు మధ్యాహ్నం 3.30గంటల తర్వాత తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఫిల్మ్ చాంబర్ నుంచి అంతిమ యాత్ర ప్రారంభమయ్యింది. మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. తారకరత్నకు ఆయన తండ్రి మోహన్ కృష్ణ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఓటీటీలోకి బాలయ్య 'వీరసింహారెడ్డి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా వీరసింహారెడ్డి ఓటీటీలో అలరించడానికి సిద్దమయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్ స్టార్ భారీగా ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23 నుంచి హాట్ స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో థియేటర్లలో వీరిసింహారెడ్డి మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేయొచ్చు. కాగా ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్,మురళి శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. Seema Simham vetaa shuru🦁💥#VeeraSimhaReddyOnHotstar premieres @ 6 PM on February 23 only on #DisneyPlusHotstar It’s time for #VSRHungamaOnHotstar! Ready na? pic.twitter.com/hfMMJ6jROX — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 12, 2023 -
కె. విశ్వనాథ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన బాలకృష్ణ
కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు కన్నుమూయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు.. భారతీయ సంస్కృతీ, సంప్రదాయలు మరీ ముఖ్యంగా మన తెలుగుదనాన్ని అణువణువున ప్రతిబింబించేలా ఆయన తీసిన అత్యద్భుత చిత్రాలు తెలుగు సినిమాకే గర్వ కారణము.. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చి ప్రతి తెలుగు వాడు గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది. కళా తపస్వి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.. - నందమూరి బాలకృష్ణ కాగా విశ్వనాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ఏకైక చిత్రం జననీ జన్మభూమి(1984). కానీ, ఆ చిత్రం ఆడలేదు. అయితే.. నరసింహానాయుడు, సీమ సింహం, లక్ష్మీ నరసింహా, పాండు రంగడు చిత్రాల్లో బాలకృష్ణ తండ్రి పాత్రలో అలరించారు కళాతపస్వి. -
ఆ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తున్నాయి : బాలయ్య
‘‘సంక్రాంతికి విందు భోజనంలాంటి సినిమా ‘వీరసింహారెడ్డి’. ప్రేక్షకులు, ఫ్యాన్స్.. ఇలా అందరి నుండి అద్భుతమైన ఆదరణ వస్తోంది’’ అన్నారు బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శ్రుతీహాసన్ జంటగా నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన వీర మాస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్లో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘అఖండ’లాంటి హిట్ తర్వాత అలాంటి మరో సినిమాని ప్రేక్షకులు ఆశిస్తారు. అందుకు తగ్గట్టే నా అభిమాని అయిన గోపీచంద్ ‘వీరసింహారెడ్డి’ని అద్భుతంగా తీశాడు. ఈ చిత్రంలో నాకు–వరలక్ష్మికి మధ్య వచ్చే అన్నా చెల్లెలి సన్నివేశాలు మహిళలనే కాదు మగవాళ్లనూ కంటతడి పెట్టిస్తున్నాయి’’ అన్నారు. ‘‘నా కెరీర్లో ఇది బ్లాక్ బస్టర్’’ అన్నారు గోపీచంద్. ‘‘మా సినిమా తొలి రోజే 50 కోట్ల గ్రాస్ దాటుతోంది. ఇది పెద్ద రికార్డ్. బాలకృష్ణగారి మైలురాయి చిత్రానికి మేం నిర్మాతలు కావడం హ్యాపీ’’ అన్నారు నిర్మాతలు. -
బాలయ్య బాబు కాదు.. బాలయ్య తాత : మంత్రి గుడివాడ అమర్నాథ్
-
వీరయ్య vs వీరసింహా.. ఒకేసారి తలపడుతున్న చిరు, బాలయ్య
-
వీరసింహరెడ్డి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతి నిరాకరణ వార్తల్లో నిజం లేదు
-
సంక్రాతి బరిలో రెండు పుంజులు.. రిస్క్ లో ప్రొడ్యూసర్లు
-
హైలైట్‌గా నిలిచిన ప్రభాస్-చరణ్ ఫోన్‌కాల్.. డార్లింగ్ పెళ్లిపై హింట్
బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-2 సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ఎపిసోడ్‌తో మరింత సూపర్ హిట్‌గా నిలిచింది షో. దేశవ్యాప్తంగా ఈ ఎపిసోడ్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ ఎపిసోడ్‌లోని పార్ట్-1 ఇప్పటికే స్ట్రీమింగ్ అయ్యింది. ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌గా నిలిచిన ఈ ఎపిసోడ్లో రామ్‌చరణ్‌కు ప్రభాస్ కాల్ చేయడం హైలైట్‌గా నిలిచింది. ఇదే క్రమంలో ప్రభాస్‌ని ఆటపట్టించిన రామ్ చరణ్ త్వరలోనే డార్లింగ్ మీ అందరికి గుడ్‌న్యూస్ చెబుతాడంటూ హింట్ ఇచ్చాడు. దీంతో అంతలోనే అందుకున్న బాలకృష్ణ.. ఆ అమ్మాయి చౌదరినా లేక శెట్టినా, లేక సనన్ హా? అంటూ ఇరికించే ప్రయత్నం చేయగా అది తాను చెప్పలేనని మీకే ఊహించుకోండంటూ క్లూ వదిలాడు. దీంతో ‘రేయ్.. ఏం మాట్లాడుతున్నావ్ డార్లింగ్’ నువ్వు నా ఫ్రెండువా ? శత్రువా ?అంటూ ప్రభాస్ ఫన్నీగా బదులిచ్చాడు. ఇక ఎప్పుడూ బయట కలిసి కనిపించని.. ప్రభాస్, చరణ్ మధ్య ఉన్న ఇంతలా బండింగ్ ఉందా? ఇద్దరూ బెస్ట్‌ఫ్రెండ్స్‌లా మాట్లాడుకుంటున్నారంటూ వారి మధ్య ఉన్న బాండింగ్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. Charan and prabhas phone call#RamCharan#Prabhas pic.twitter.com/RsOzTX1VqV — Ra_1 (@MahiCharan31) December 29, 2022 Mari intha close a #RamCharan and #Prabhas 😳 pic.twitter.com/OyBVV5HNew — Teja (@tejarebel10) December 29, 2022 -
కృతిసనన్‌తో డేటింగ్‌పై ప్రభాస్‌ను డైరెక్ట్‌గా అడిగేసిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకి ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చారు. కానీ ప్రభాస్ ఎపిసోడ్ మాత్రం నెవర్ బిఫోర్ అన్నట్లుంది. డార్లింగ్ ఫ్యాన్స్ దెబ్బకు ఏకంగా ఆహా యాప్ క్రాష్ అయ్యిందంటే కటౌట్ పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేసిన వెంటనే ఫ్యాన్స్ పెద్దసంఖ్యలో ఆహాలోకి ఎంట్రీ ఇవ్వడంతో సైట్ క్రాష్ అయింది. సమస్యను పరిష్కరించిన ఆహా టెక్కికల్ టీమ్ ఇప్పటికే ఎపిసోడ్‌ను లోడ్ చేసేసింది. ఇక ఎప్పటిలాగే షోను ఆద్యంతం రక్తికట్టించే బాలయ్య ప్రభాస్‌ను తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. హీరోయిన్ కృతిసనన్‌తో డేటింగ్‌పై ప్రభాస్‌ను డైరెక్ట్‌గా అడిగేశాడు బాలయ్య. దీనికి ప్రభాస్.. మేడమ్ ఆల్రెడీ చెప్పేసిందిగా. అలాంటిదేమీ లేదు. ఇది కేవలం పుకారు మాత్రమేనంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో మేడమ్ ఏంటి? అంత రొమాన్స్ ఏంటి? నేను కూడా నా భార్య(వసుంధర)ను మేడమ్ అనే పిలుస్తానంటూ ప్రభాస్‌ను రోస్ట్ చేశాడు. Kriti Sanon topic 😂😍#PrabhasOnAHApic.twitter.com/EFoly9GjJv — Prabhas Youth Icon✪ᴬᵈᶦᵖᵘʳᵘˢʰ🏹 (@REBELST99790410) December 29, 2022 Funny convo about #Prabhas - #KritiSanon rumours 🤣👌... pic.twitter.com/tl7Vhhpi7i — Nikhil Prabhas ™ (@rebelismm) December 29, 2022 -
టాలీవుడ్ హీరోపై మనసు పడిన రాశీఖన్నా
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 టాక్ షోకు రోజురోజుకూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తన మ్యానరిజం,చమత్కారంతో టీఆర్పీ రేటింగ్స్‌ను పరుగులు పెట్టిస్తున్నారు బాలయ్య. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షో సెకండ్ సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది. ఇప్పటికే 5 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కాగా, తాజాగా లేటెస్ట్ ప్రోమోను వదిలారు. అలనాటి హీరోయిన్స్ జయసుధ, జయప్రదలతో పాటు యంగ్ బ్యూటీ రాశీఖన్నాలు షోలో సందడి చేయనున్నారు. ఈ క్రమంలో నారీనారీ నడుమ మురారి అంటూ ముగ్గురు హీరోయిన్స్‌తో బాలయ్య అల్లరి ఏ విధంగా ఉంటుందో ప్రోమోలో చూపించారు. ఇక హీరోయిన్ రాఖీఖన్నా మనసులో చోటు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో గురించి కూడా బయటపెట్టేశారు. నువ్వు నటించిన హీరోల్లో నీ క్రష్ ఎవరు అని బాలయ్య అడగ్గా ఏమాత్రం తడుముకోకుండా విజయ్ దేవరకొండ అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
బాలయ్య ‘వీరసింహారెడ్డి’ నుంచి మరో అప్డేట్
బాలకృష్ణ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’. ఒక పాట మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ‘మా బావ మనోభావాల్..’ లిరికల్ వీడియోను ఈ నెల 24న రిలీజ్ చేయనున్నట్లు బుధవారం ప్రకటించి, ఈ పాటలోని పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ సాంగ్‌లో బాలకృష్ణ, చంద్రికా రవి స్టెప్పులు వేశారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: రిషి పంజాబీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి. -
బాలయ్య షోలో ప్రభాస్ ధరించిన ఈ షర్ట్ ధరెంతో తెలుసా?
బాలయ్య హోస్ట్‌గా ఎన్బీకే విత్ అన్‌స్టాపబుల్ షో సీజన్-2 సక్సెస్ ఫుల్‌గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేశారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పెషల్ గెస్టుగా హాజరవడం ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సాధారణంగా ప్రభాస్ తన సినిమా ఈవెంట్లకు తప్పా బయట ఎక్కడా అంతగా కనిపించరు. అలాంటిది బాలయ్య షోకు ప్రభాస్ రావడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ షోకు ప్రభాస్ తన స్నేహితుడు, హీరో గోపీచంద్‌తో కలిసి హాజరయ్యారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో ముఖ్యంగా ప్రభాస్ డ్రెస్సింగ్ స్టైల్ మరో హైలైట్‌గా నిలిచింది. ఎక్కువగా బ్లాక్ షర్ట్‌లో కనిపించే ప్రభాస్ ఎన్బీకే షోలో మాత్రం కలర్ఫుల్గా కనిపించారు. దీంతో ప్రభాస్ వేసుకున్న షర్ట్ ఏ బ్రాండ్? దాని ధరెంత అంటూ నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ప్రభాస్ వేసుకున్న షర్ట్ `పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్' కంపెనీకి చెందినదట. దీని ధర సుమారు 115 పౌండ్స్ ఉంటుందట. అంటే అక్షరాలా ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.11,618/. ఏది ఏమైనా ప్రభాస్ ఈ షర్ట్‌లో మరింత యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారని, ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
బాలయ్య 'వీరసింహారెడ్డి' నుంచి మరో అప్డేట్
ప్రేయసితో ఆడి పాడారు వీరసింహారెడ్డి. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. శ్రుతీహాసన్ హీరోయిన్. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘సుగుణ సుందరి..’ అనే పాటని ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించి, ఈ పాటలోని ఓ స్టిల్‌ను రిలీజ్ చేసింది. ‘‘ఈ చిత్రంలోని చివరి పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది. మరోవైపు ΄పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
NBK108 : అనిల్ రావిపూడితో బాలయ్య యాక్షన్ సినిమా ప్రారంభం
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో NBK108 అనే క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ముహూర్తం షాట్‌కు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్‌బోర్డ్ ఇవ్వగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తం షాట్‌కి లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. షూటింగ్ కూడా నేడు(గురువారం)ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో బాలయ్య ఇంతకుముందెప్పుడూ కనిపించని డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారట. శ్రీలీల ఇందులో కీలక పాత్రలో నటిస్తుంది. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. Here's a cherishing glimpse from our #NBK108 Opening Puja Ceremony🪔 Kickstarted the Shoot Today😎#NBK108Begins❤️🔥 Natasimham #NandamuriBalakrishna @AnilRavipudi @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna #CRamPrasad #Rajeevan #TammiRaju #VVenkat @Shine_Screens pic.twitter.com/RWhIjtCMzy — Shine Screens (@Shine_Screens) December 8, 2022 -
బాలయ్య సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన తెలుగమ్మాయి
హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాక్సీవాలా, తిమ్మరసు,‘ఎస్.ఆర్.కల్యాణమండపం’ వంటి సినిమాలతో ఆకట్టుకున్నా భారీ హిట్‌ను మాత్రం ఖాతాలో వేసుకోలేకపోయింది. అనంతపురానికి చెందిన ప్రియాంక తెలుగుమ్మాయి అయినప్పటికీ టాలీవుడ్లో వరుస అవకాశాలను దక్కించుకుంటుంది. తాజాగా ఆ భామ మరో క్రేజీ ఛాన్స్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తుంది. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రియాంక జవాల్కర్ నటించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు యంగ్ హీరోల పక్కనే నటించిన ప్రియాంకకు ‘NBK 108’ సినిమా కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. -
బాలయ్య సినిమాలు చూసి షాక్ అవుతున్న స్టార్ హీరోలు
-
వీరసింహారెడ్డి నుంచి 'జై బాలయ్య' సాంగ్ విడుదల..
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ జైబాలయ్య మాస్ ఆంథెమ్ సాంగ్‌ను విడుదల చేశారు. రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు అంటూ మొదలైన పాట బాలయ్య అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా కరీముల్లా పాడారు.ఇక పాటలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా కనిపించారు. వైట్ అండ్ వైట్ అవుట్‌ఫిట్‌లో మెడలో బంగారు చైన్, చేతికి వాచ్ పెట్టుకొని తనదైన స్టైల్లో డ్యాన్స్ చేయడం విశేషం. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో జరిగిన వాస్తవ అంశాల నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈసినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది. -
2023 లో బాక్సాఫీస్ ని షేక్ చెయ్యబోతున్న సినిమాలివే..
-
త్వరలోనే టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్న బాలయ్య చిన్నకూతురు!
నందమూరి బాలకృష్ణ ఓ వైపు సినిమాలు చేసుకుంటూనే మరోవైపు అన్‌స్టాపబుల్ షోతో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో టీఆర్పీ రేటింగులోనూ అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా బాలకృష్ణ చిన్నకూతురు తేజస్విని త్వరలోనే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే అన్‌స్టాపబుల్ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తేజస్విని.. బాలయ్య స్ట్రిప్ట్ వర్క్‌కి సంబంధించి కీలక వ్యవహారాలనూ కూడా చూసుకుంటుందట. అన్‌స్టాపబుల్ షో అంత పెద్ద హిట్ కావడం వెనుక ఆమె పాత్ర కూడా ఎంతో ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఆమె నిర్మాతగా టాలీవుడ్‌కు పరిచయం కానున్నట్లు సమాచారం. బాలయ్య హీరోగా నటించే ఓ సినిమాకు ఆమె నిర్మాత బాధ్యతలు స్వీకరించబోతున్నారట. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. మరి తేజస్విని నిర్మాతగా సక్సెస్ అవుతారా లేదా అన్నది చూడాలి. -
Unstoppable With NBK: హీరోయిన్‌కి ఫోన్ చేసి ఫ్లర్ట్ చేసిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ సీజన్-2 రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇటీవలె గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ షో సెకండ్ ఎపిసోడ్లో యంగ్ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్‌లు గెస్టులుగా వచ్చారు. కలిసి అన్‌స్టాపబుల్ వేదికపై బాలయ్య చేసిన రచ్చ మాములుగా లేదు. రావడం రావడంతోనే సిద్ధూ హెయిర్‌స్టైల్‌పై పంచ్ వేసిన బాలయ్య.. తలదువ్వకుండా పంపించారు హెయిర్ స్టైలిస్ట్ ఎక్కడా అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. దీనికి సిద్ధూ ఆన్సర్ ఇస్తూ.. 'ఇది మెస్సీ లుక్' అని చెప్పగా..'అలా నేను మెస్సీ లుక్‌తో కనిపించిన సినిమాలన్నీ మెస్సీ అయ్యాయమ్మా' అంటూ బాలయ్య సెటైర్ వేశారు. ఇక మీ ప్రజెంట్ క్రష్ ఎవరు అని బాలయ్యను అడగ్గా రష్మిక మందన్నా అని ఓపెన్‌గానే చెప్పేశారు. ఆ తర్వాత ఫ్లర్టింగ్ ఎలా చేయాలంటూ టిప్స్ అడిగి మరీ తెలుసుకున్న బాలయ్య ఓ హీరోయిన్‌కి కాల్ చేసి.. మీ వాయిస్ విని మీ ఫేస్ చందమామలా ఉంటదని నేను చెప్పగలను. నేనేమో చీకట్లో ఉంటాను. ఇద్దరం కలిస్తే పున్నమి రాత్రే అంటూ సరదాగా ఫ్టర్ట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. -
గన్ షాట్ : నాడు ఎన్టీఆర్ పై చెప్పులు వేయించింది ఎవరు ..?
-
అన్‌స్టాపబుల్ సీజన్–2 ఆ రేంజ్లో ఉంటుంది : బాలయ్య
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులో మంగళవారం రాత్రి సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. పెద్ద ఎత్తున నిర్వహించిన ఆహా ఓటీటీ అన్‌స్టాపబుల్ సీజన్–2 ఈవెంట్ లాంచింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కానూరు 100 అడుగుల రోడ్డులో ప్రత్యేంగా ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ఆయన అభిమానులతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఇంటింటి రామయ్య సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆహా ఓటీటీ ప్లాట్ఫారంలో అన్‌స్టాపబుల్ ఈవెంట్ సీజన్ వన్ను విజయవంతంగా నిర్వహించామని, ఇప్పుడు సీజన్–2 అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే విధంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. -
బాలయ్య 'అన్ స్టాపబుల్' సీజన్-2 నుంచి క్రేజీ అప్డేట్
నందమూరి నట సింహాం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్‌షో ‘అన్‌స్టాబుల్ విత్ ఎన్బీకే’. సెలబ్రిటీలతో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. తనదైన మ్యానరిజం, పంచ్ డైలాగ్స్‌తో షోను బాలయ్య విజయవంతం చేశాడు. ఇక ‘అన్‌స్టాపబుల్’ సెకండ్ సీజన్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే ఆహా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ షోకు సంబంధించి మరో సాలిడ్ అప్డేట్ వదిలారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ టీజర్‌ను రేపు(మంగళవారం)విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి బాలయ్య లుక్‌ను ఆహా విడుదల చేసింది.దులో బాలకృష్ణ క్యాప్ పెట్టుకుని, డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన టీజర్ రేపు సా. 6గంటలకు విజయవాడలో లాంచ్ చేయనున్నారు. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్-2.. 'దెబ్బకు థింకింగ్ మారిపోవాలా'
నందమూరి నట సింహాం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్‌షో ‘అన్‌స్టాబుల్ విత్ ఎన్బీకే’. ఆహాలో ప్రసారమైన ఈ టాక్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన మ్యానరిజం, పంచ్ డైలాగ్స్‌తో షోను బాలయ్య విజయవంతం చేశాడు. టీఆర్పీ రేటింగ్‌లోనూ రికార్డులు క్రియేట్ చేసిన ఈ షో రెండో సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ అవైటెడ్ మూమెంట్ ఇప్పుడు వచ్చేసింది. ఈ క్రమంలో తాజాగా ‘అన్‌స్టాపబుల్ సీజన్ 2’కు సంబంధించి ఆహా ఓ సాలిడ్ అప్డేట్ను వెల్లడించింది. అతి త్వరలోనే ‘అన్‌స్టాబుల్ విత్ ఎన్బీకే’ సీజన్-2ను ప్రారంభం అవుతుందని, దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అంటూ షోపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు. పండగ మొదలయ్యేది అప్పుడే అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో ఈ టాక్ షో దసరా నుంచి ప్రారంభం కానుందని తెలుస్తుంది. మరి ఈ సూపర్‌హిట్ షో సీజన్-2కి వచ్చే ఫస్ట్ గెస్ట్ ఎవరన్నది చూడాల్సి ఉంది. It's that time of the year and festival begins soon!🥳🎉 Debbaku thinking maarpiovala.#UnstoppableWithNBK2 athi thvaralo...🔥#nandamuribalakrishna@realmeIndia @tnldoublehorse #chandanabrothers @Fun88India #mansion_house pic.twitter.com/LQHw2MzAMP — ahavideoin (@ahavideoIN) September 16, 2022 -
NBK 107: బాలయ్యతో డైరెక్టర్ సెల్ఫీ.. ఫోటో వైరల్
నందమూరి బాలకృష్ణ అఖండతో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు. శృతిహాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ఓ స్పెషల్ ఫోటోను వదిలారు డైరెక్టర్ మలినేని. బాలయ్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 48 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ స్పెషల్ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా ఈసినిమాలో కోలీవుడ్ విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. #NBK107🔥🔥🔥🔥#48GloriousYearsOfNBK. #Godofmasses 🦁 @shrutihaasan @MythriOfficial pic.twitter.com/xyIcaj95dV — Gopichandh Malineni (@megopichand) August 30, 2022 -
సినీ నటుడు బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు
-
నటుడు నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన నటించిన 100వ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాకు పన్ను రాయితీ తీసుకొని కూడా టికెట్ రేట్లు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. పన్ను రాయితీ ప్రయోజనాలను ప్రేక్షకులకు బదలాయించలేదని వెల్లడించింది. దీంతో పన్ను రాయితీ పొందిన డబ్బు మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి రికవరీ చేయాల్సిందిగా పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. వై.చంద్ర చూడ్ ధర్మాసనం.. వివరణ ఇవ్వాల్సిందిగా సినీ నటుడు బాలకృష్ణ, సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. -
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. ఘనంగా ఏర్పాట్లు
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న నటుడు నందమూరి తారక రామారావు. తెలుగు భాషపై.. తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామరం. సినిమా రంగమైనా,రాజకీయ వేదిక అయినా అన్ని చోట్ల కోట్లాది మంది మనసులో నిలిచిపోయిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు.ఈ ఏడాది మే 28 నుంచి ఆయన శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆయన స్వగ్రామం నిమ్మకూరులో బాలకృష్ణ చేతుల మీదుగా ఈ వేడుకలు ఘనంగా ప్రారంభం కాన్నునాయి. దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్వర్గీయ తారక రామారావుశత జయంతి వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. -
Actor Balayya Death: సీనియర్ నటుడు బాలయ్య ఇకలేరు
-
ప్రముఖ సీనియర్ నటుడు మన్నవ బాలయ్య కన్నుమూత
-
ప్రముఖ సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నటుడు, దర్శక–నిర్మాత, రచయిత మన్నవ బాలయ్య (94) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. మూడొందలకు పైగా చిత్రాల్లో నటించిన బాలయ్య స్వస్థలం గుంటూరు జిల్లాలోని అమరావతి ప్రాంతంలోని వైకుంఠపురం. మన్నవ గురవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు 1930 ఏప్రిల్ 9న జని్మంచారు బాలయ్య. పదో తరగతి పాసయ్యాక ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం సంపాదించుకోడానికి మద్రాస్ వెళ్లారు బాలయ్య. అయితే ఇంగ్లీష్ మీడియం కాబట్టి తొలి ప్రయత్నంలోనే ఇంటర్ పాస్ కాలేకపోయారు. కానీ పట్టుదలగా చదవి, ఆ తర్వాత ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యారు. అనంతరం మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్ట భద్రులయ్యారు. ఉద్యోగం మానేసి.. ఇండస్ట్రీలోకి వచ్చి! కాలేజీ రోజుల్లో జరిగిన అంతరాష్ట్ర నాటక పోటీల్లో ఆచార్య ఆత్రేయ రాసిన ‘ప్రగతి’ నాటకంలో పారిశ్రామికవేత్త పాత్ర చేశారు బాలయ్య. నటుడిగా ప్రథమ బహుమతి లభించింది. బాలయ్య నటించిన నాటకాలకు తాపీ చాణక్య దర్శకత్వం వహించారు. ఇంజినీరింగ్ తర్వాత లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు బాలయ్య. ఆ తర్వాత అసిస్టెంట్ ఇంజినీర్‌గా మరో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలోనే తాను ‘ఎత్తుకు పై ఎత్తు’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నానని, ఇందులో నటించాలని బాలయ్యను ఒప్పించారు తాపీ చాణక్య. తొలి సినిమా తర్వాత బాలయ్య నటుడిగా వెనుతిరిగి చూసుకోలేదు. ‘పార్వతీ కల్యాణం’, ‘భాగ్యదేవత’, ‘కుంకుమరేఖ’, ‘మనోరమ’, ‘చివరకు మిగిలేది’, ‘ఇరుగు పొరుగు’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘పాండవ వనవాసం’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘అంకురం’, ‘యమలీల’, ‘అన్నమయ్య’, ‘మల్లీశ్వరి’, ‘మిత్రుడు’ వంటి పలు చిత్రాల్లో నటించారు. తొలి అడుగే హిట్... ప్రముఖ దర్శకుడు విఠలాచార్య ఓ సినిమాలో బాలయ్యకు ఓ పాత్ర ఇస్తానని, చివరి నిమిషంలో కుదరదన్నారట. దీంతో కాస్త నొచ్చుకున్నారట బాలయ్య. తనే సినిమాలు తీస్తే అనే ఆలోచనతో ‘అమృత ఫిలింస్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. చదువుకునే రోజుల్లో ‘తుఫాన్’ అనే పత్రికకు రాసిన ‘నలుపు – తెలుపు’ కథలో మార్పులు చేసి శోభన్‌బాబుతో ‘చెల్లెలి కాపురం’ (1971) సినిమాను నిర్మించారు. నిర్మాతగా తొలి సినిమాతోనే హిట్ అందుకున్నారు బాలయ్య. ఆ తర్వాత కృష్ణ హీరోగా ‘నేరము–శిక్ష’ (1973) నిర్మించారు. ఇంకా ‘అన్నదమ్ముల కథ’ (1975), ‘ఈనాటి బంధం ఏనాటిదో’ (1977), ‘ప్రేమ పగ’ (1978), ‘పసుపుతాడు’ (1986), ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ (1980) వంటి సినిమాలను నిర్మించారు బాలయ్య. నిర్మాత, రచయితగానే కాదు.. ‘ఊరికిచ్చిన మాట’ (1981), ‘నిజం చెబితే నేరమా? (1983)’, ‘పసుపుతాడు’ వంటి చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు బాలయ్య. అలాగే ‘చెల్లెలి కాపురం’, ‘నేరము శిక్ష’, ‘చుట్టాలున్నారు జాగ్రత్త’, ‘పసుపు తాడు’ చిత్రాలకు రచయితగానూ ప్రతిభ చూపారు బాలయ్య. ‘చెల్లెలికాపురం’ బంగారు నంది అవార్డును, ‘ఊరికిచి్చన మాట’ చిత్రం కాంస్య నంది అవార్డును సాధించాయి. ఇదే చిత్రానికి రచయితగా బాలయ్య బంగారు నంది అందుకున్నారు. నటుడిగా, దర్శక–నిర్మాతగా, రచయితగా బాలయ్య సినీ జీవితం విజయవంతంగా సాగింది. ఇక 1955లో కమలాదేవిని వివాహం చేసుకున్నారు బాలయ్య. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు తులసీరామ్ నటుడిగా కొనసాగుతున్నారు. కాగా పుట్టినరోజు నాడే బాలయ్య మరణించడం శోచనీయం. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయరంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. బాలయ్య అంత్యక్రియలు శనివారం ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో జరిగాయి. -
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో బాలయ్య
-
నాకో టైమింగ్ ఉంటుంది.. సితార తాట తీసేస్తది : మహేశ్ బాబు
Unstoppable With Mahesh Babu Grand Finale Promo: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో ఆహా ఓటీటీలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే 9ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టింది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు చివరి ఎపిసోడ్లో సందడి చేయనున్నారు. ఆయనతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి సైతం విచ్చేశారు. ఈ గ్రాండ్ ఎపిసోడ్ ఫిబ్రవరి 4న 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్లో బాలయ్య అన్‌స్టాపబుల్ షో ఫస్ట్ సీజన్‌కు ఎండ్ కాండ్ పడనుంది. గ్రాండ్ ఫినాలేలో బాలయ్య, మహేశ్‌ల మధ్య సాగిన సంభాషణ ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. 'ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో అతనే మహేశ్'.. అంటూ బాలయ్య తనదైన స్టయిల్లో మహేశ్‌ను ఆహ్వానించారు.ఇక తన కుమారుడు గౌతమ్ క్యాట్, సితార బ్రాట్ ..తాట తీసేస్తది అంటూ మహేశ్ నవ్వులు పూయించాడు.ఓ సారి కేబీఆర్ పార్కుకి వాకింగ్‌కి వెళ్తే పాము కనిపించిందని, అప్పటి నుంచి మళ్లీ అటువైపు వెళ్లలేదంటూ సీక్రెట్ రివీల్ చేశాడు.మొత్తంగా ఆహా అనిపించేలా ఈ గ్రాండ్ ఎపిసోడ్ ఉండనుంది స్పష్టమవుతుంది. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
చిరంజీవితో గొడవలు ఉన్నాయా? క్లారిటీ ఇచ్చిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ అటు హీరోగానే కాకుండా ఇటు హోస్టింగ్‌లోనూ అదరగొడుతున్నారు. బాలయ్య తొలిసారిగా హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తుంది. తనదైన స్టైల్లో బాలయ్య చేస్తున్న హోస్టింగ్‌కు నెటిజన్లే కాకుండా సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఈ షోకు మోహన్‌బాబు, నాని, బ్రహ్మానందం, రవితేజ, అనిల్ రావిపూడి, పుష్ప టీం, రానా సందడి చేశారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో తనపై వచ్చిన రూమర్స్‌పై బాలయ్య స్పందించారు. 'ఇవాల్టి ప్రపంచంలో ప్రతివాడు సోషల్ మీడియాలో ఏం అనాలనిపిస్తే అది అంటున్నాదు. పేరు లేని, లికేషన్ తెలియని అడ్రస్‌లతో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. బాలకృష్ణకి రవితేజకి పడదు.. చిరంజీవి, బాలకృష్ణ ఫోన్లో మాట్లాడుకోరు.. నా హీరో తోపు...నీ హీరో సోపు అంటూ పిచ్చిరాతలు రాస్తున్నారు. లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయిందీ .. దొరికితే దవడ పగిలిపోద్దీ'.. అంటూ ఫేక్ న్యూస్‌లు ప్రచారం చేస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే మనమీద వచ్చిన విమర్శలను ప్రేమించినప్పుడే కదా మనం అన్‌స్టాపబుల్ అవుతాం అంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. -
యాదాద్రిని దర్శించుకున్న హీరో బాలయ్య..
Balayya Along With Akhanda Movie Team Visits Yadadri Temple: అఖండ సినిమా విజయం దైవ సంకల్పమని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు బాలయ్య. తాజాగా ఆయన అఖండ టీంతో కలసి యాదాద్రిని దర్శించారు. డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన బాలయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా ఉందని కొనియాడారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అఫీషియల్: బిగ్‌బాస్-6 హోస్ట్ ఎవరో తెలిసిపోయింది
Bigg Boss 6 OTT Telugu Host: బిగ్‌బాస్ సీజన్-5 ముగిసింది. అయితే బిగ్‌బాస్ లవర్స్ కోసం అతి త్వరలోనే బిగ్‌బాస్ ఓటీటీ ప్రారంభం కానున్న సంగతి తెలిసింది. దీంతో సీజన్-6కి హోస్ట్‌గా ఎవరు చేయనున్నారనే దానిపై రకరకాల పేర్లు తెరమీదకి వచ్చాయి. అన్‌స్టాపబుల్ షోతో అదరగొడుతున్న బాలయ్య ఈ కొత్త సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా డిస్నీ+హాట్‌స్టార్ నిర్వహించిన ప్రెస్మీట్లో దీనిపై క్లారిటీ వచ్చేసింది. మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ ఓటీటీకి కూడా తానే హోస్టింగ్ చేయనున్నట్లు నాగార్జున స్వయంగా ప్రకటించాడు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్ తెలుగు.. ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా నెంబర్1 షో. వీకెండ్ ఎపిసోడ్‌కి సుమారు 5-6కోట్ల మంది లైవ్ చూశారు. దీన్ని బట్టి బిగ్‌బాస్ తెలుగు సీజన్‌కు ఎంతమంది అభిమానులున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్ట్స్ సీజన్ ఓటీటీ వేదికగా ప్రసారం కానుంది. 24 గంటల పాటు లైవ్ స్ట్రీమింగ్ ఉండనుంది. ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ నాకు. ఆ 24 గంటలు చూసి అనాలసిస్ చేసి వీకెండ్ ఎపిసోడ్లో కంటెస్టెంట్లతో ముచ్చటించాల్సి ఉంటుంది' అని వివరించారు. -
వైజాగ్‌లో అఖండ విజయోత్సవం
-
గూస్బంప్స్ తెప్పిస్తున్న 'అఖండ' టైటిల్ సాంగ్
Akhanda Title Song Released: బోయపాటి శ్రీను-బాలయ్య కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి అఖండ టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. శంకర్ మహదేవన్, సిద్ధార్థ్ మహదేవన్, శివమ్ మహదేవన్ ఆలపించిన ఈ సాంగ్ భారీ విజువల్స్‌తో గూస్బంప్స్ తెప్పిస్తుంది. పాట విడుదలైన కాసేపటికే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. సింహా’,‘లెజెండ్’వంటి బెగ్గెస్ట్ హిట్స్ తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. -
అదృశ్యమై ఉరికి వేలాడిన ఇద్దరు.. వివాహేతర సంబంధమే కారణమా?
పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో గురువారం అనుమానాస్పద స్థితిలో కుళ్లిపోయిన రెండు మృతదేహాలు వెలుగు చూశాయి. గ్రామానికి చెందిన మేకతొట్టి వజ్రమ్మ పాతబడిపోయిన తన ఇంటికి తాళం వేసి కొంతకాలంగా అదే గ్రామంలోని కూతురు ఇంట్లో ఉంటోంది. గురువారం ఉదయం ఆమె ఇంటికి వచ్చి తాళం తీసి లోపలికి వెళ్లే సరికి ఒక పురుషుడు, ఓ మహిళ మృత దేహాలు దూలానికి వేలాడుతూ కనిపించడంతో భయాందోళనతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చింది. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితికి చేరుకున్నాయి. స్థానికులు పరిశీలించి తమ గ్రామానికే చెందిన పచ్చినీళ్ల ధర్మయ్య (32), ఇంజిమళ్ల కృష్ణవేణి (25)గా గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న సత్తుపల్లి రూరల్ సీఐ టి.కరుణాకర్, వీ.ఎం.బంజర్ ఎస్సై తోట నాగరాజు గ్రామానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలేం జరిగి ఉంటుంది.. లంకపల్లికి చెందిన ధర్మయ్య, కృష్ణవేణి గ త నెల 26 నుంచి కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో కృష్ణవేణి భర్త బాలయ్య (30) అదేరోజు కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తర్వాత చికిత్స పొందుతూ 29న మృతి చెందాడు. కృష్ణవేణి, ధర్మయ్య మధ్య వివాహేతర సంబంధం ఉందని, ఆ అవమానంతోనే బాలయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ప్ర చారం జరుగుతోంది. కాగా, బుధవారం నుంచే ఆ ఇంట్లోంచి దుర్వాసన వస్తున్నా, చుట్టుప్రక్కల ఇళ్ల వారు విషయాన్ని గుర్తించలేకపోయారు. ఇదిలా ఉండగా, బాల య్య ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళ న చెందిన కృష్ణవేణి, ధర్మయ్య ఆత్మహత్య చేసుకున్నారా.. లేక వీరిద్దరిని హత్య చేశాక బాలయ్య ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నా రు. వజ్రమ్మ తన ఇంటికి తాళం వేసి వెళ్లి పోయిన విషయం తెలుసుకుని వెనుక తలుపు తీసుకుని ఇంట్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య, కృష్ణవేణి మృతితో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఇక ధర్మయ్య భార్య కూడా భర్త వివాహేతర సంబంధం తెలియడంతో పదిరోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. -
ఆదిత్య 369 టీంతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
-
ఇంతింతై...వటుడింతై!
బీఏ సుబ్బారావు దర్శక నిర్మాణంలో యస్వీరంగారావు, కాంతారావు, బాలయ్య... ముఖ్య పాత్రలు పోషించిన ఒక పౌరాణిక చిత్రంలోని సన్నివేశాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘మహాత్మా...తమ ఆగమనంతో ఈ యజ్ఞం సఫలమైంది. అపూర్వ మహిమా శోభితులైన తమ దర్శనభాగ్యంతో నా జన్మచరితార్థం అయింది’’ ఆనందడోలికల్లో ఊగిపోతూ అన్నాడు బలిచక్రవర్తి.‘‘తామెవ్వరు? నివాసస్థానం ఏది?’’ అని అడిగాడు బలిచక్రవర్తి తన ఎదురుగా ఉన్న వటుడిని.‘‘బలిరాజా! తానెవరో తెలసి తెలియజెప్పేవాడు పరమాత్ముడు ఒక్కడే. ఇక నివాసమందువా...ఈ విశాల విశ్వమంతయూ నా ఆవాసమే. సకల సజ్జన హృదయాలు నా సంచార స్థలాలు’’ మార్మికభాషలో తన గురించి చెప్పాడు వటుడు.‘‘వటుడా! బాలుడవైనా పరమార్థజ్ఞానపూర్వకమైన నీ సంభాషణతో నా హృదయంలో అమృతధారలు వర్షించినవి. నా వల్ల తమకు కాగల కార్యం ఏమిటి?’’ అని వినయంగా అడిగాడు బలిచక్రవర్తి.‘‘మహారాజా! బ్రహ్మచారులకు, తాపసులకు లోకకళ్యాణమే ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యసాధనకు నిన్ను యాచించడానికి వచ్చాను’’ అన్నాడు వటుడు.‘‘స్వామి! ఈ యాగదీక్షా సాక్షిగా ఆజ్ఞాపించండి...మీ కామితం ఏదైనా నెరవేరుస్తాను’’ ఆనందంగా అన్నాడు బలిచక్రవర్తి.‘‘నాయనా బలిచక్రవర్తి! తొందరపడకు... ఈ వటువు దేవతలకు బాసటగా వచ్చిన మహావిష్ణువే అని నా భావన’’ అంటూ బలిచక్రవర్తిని అప్రమత్తం చేయడానికి ప్రయత్నించారు ఆయన పక్కనే ఉన్న ఆచార్యులవారు. అయినప్పటికీ...‘‘ఆచార్యా! ఆ మహావిష్ణువు మన చెంతకు వచ్చి అర్థి అయి ప్రార్థిస్తే అంతకంటే మహాభాగ్యం ఉన్నదా’’ అన్నాడు బలిచక్రవర్తి.పరిస్థితిని గ్రహించిన వటువు...‘‘నా రాక మీ గురువర్యులకు కంటకప్రాయమైనట్లున్నది. నా వలన మీకే భేదాభిప్రాయాలు రాకుండా ఉండుగాక... అనుమతి అయినచో వెళ్లివస్తాను’’ అని అన్నాడో లేదో బలిచక్రవర్తి ఆందోళన పడ్డాడు.‘‘నా చెంతకు వచ్చి మీరు రిక్తహస్తాలతో పోవడం యాగసంకల్పానికే కళంకం! నాపై కరుణించి తమ ఈప్సితార్థం ఏమిటో సెలవియ్యండి’’ అని వటువును అడిగాడు.‘‘మహారాజా! ఏకాకి బ్రహ్మచారిని. నాకంటూ కావల్సింది ఏమీలేదు. నీకంత కోరిక ఉంటే మూడు అడుగుల నేల దానం ఇవ్వు’’ అని బలిచక్రవర్తిని కోరాడు వడుగు.‘‘మహాత్మా! ఇదేమి హాస్యం. దాత ఘనతనైనా గుర్తించవద్దా! మేరుపర్వతం దగ్గరకు వెళ్లి తృణఘనం కోరుకుంటారా?’’ ఆశ్చర్యపోయాడు బలిచక్రవర్తి.‘‘ముష్ఠి మూడు అడుగుల దానం అడిగి నన్ను చిన్నబుచ్చుతారా...మరేదైనా అడగండి. కాంచనాలా? సిరులా? చింతామణిపీఠమా? ఇంతెందుకు ఈ త్రిభువనాధిపత్యమే మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా’’ అని కూడా అన్నాడు. ‘‘చక్రవర్తి! యాచకులకు పేరాశ ఉండకూడదు. అదృష్టవంతులకు అణువు లభించినా అదే బ్రహ్మాండం అవుతుంది. నీకిష్టమైతే నా కోరిక తీర్చు’’ అని చల్లగా అడిగాడు వటుడు.‘‘ఇష్టమా! ఇంత చిన్నకోరిక కష్టమా!! ఆవశ్యం నెరవేర్చుతా’’ వటుడి కోరిక తీర్చడానికి సిద్ధపడ్డాడు బలిచక్రవర్తి.మళ్లీ రంగంలోకి దిగారు ఆచార్యులవారు.‘‘బలిచక్రవర్తీ...తొందరపడకు. ఇందులో ఏదో మోసం ఉన్నది. ఈనాడు నీవు కావించే ఈ దానం మన దానవవంశ వైభవానికి అగ్నిపరీక్ష అని మాత్రం గుర్తుంచుకో. ఇతడు దనుజకులాన్నే దగ్ధపటలం చేయడానికి వచ్చాడు. నా మాట విని ఇతడిని తిరస్కరించు. ఆత్మహాని కోరితెచ్చుకుంటావా నాయనా!’’’ అన్నారు ఆచార్యులవారు.‘‘గురుదేవా! ఈ రాజ్యవైభవములు, అధికార ప్రాభవములు దానధర్మముల కన్నా మిన్న కాదు. ఆత్మహాని అని ఆడిన మాట తప్పడం న్యాయమేనా’’ అంటూ వటుడు అడిగినవాటిని ఇవ్వడానికి సిద్ధమయ్యాడు బలిచక్రవర్తి.‘బ్రహ్మార్పణమస్తు’‘‘బలిచక్రవర్తి! ఇంకో అడుగు?’’ అడిగాడు వటుడు.‘‘ఇదిగో ప్రభు...నా శిరస్సు...దీనిపై మోపండి’’ అని తలవంచాడు బలిచక్రవర్తి. ‘‘శుక్రాచార్యులవారు! శిష్యబృందంతో ఆనందకోలాహలంగా ఉన్నారు, ఏదో విశేషం ఉండకపోదూ’’ అన్నాడు అప్పుడే అక్కడకు వచ్చిన నారదుడు. ‘‘ఉన్నది. ఈనాడు మా దానవజాతికి పర్వదినం. ఇంతకాలం తమకు ఎదురులేదని విర్రవీగిన ఆ దేవతల పతనానికి ఇది ప్రారంభోత్సవం నారదా’’ కసిగా అన్నారు శుక్రాచార్యులవారు.శుక్రాచార్యులవారి మాట విని ‘నారాయణ నారాయణ’ అన్నాడు నారదుడు.‘‘శివ శివా! మా ఆశ్రమప్రాంతంలో అన్యస్మరణ అపచారం నారదా! ఎన్నిసార్లు మందలించినా నీ పెడబుద్ధి మానవా’’ కోపంగా అన్నారు శుక్రాచార్యులు. ఆయన చేతుల్లో శిశువు కనిపిస్తుంది.‘‘నా బుద్ధికేంగానీ, ఈ బుద్ధి నీకెప్పటి నుంచి! పూజాపునస్కారాలు మాని సంసార ఝంజాటనంలో పడినట్లువు. పుత్రుడా. పుత్రికా?’’ శుక్రాచార్యుల వారి చేతుల్లో ఉన్న శిశువును చూస్తూ అడిగాడు నారదుడు.‘‘మాపై అనుగ్రహించి, మా కష్టాలను తొలగించడానికి మహేశ్వరుడు ఒసంగిన వరప్రసాదం ఈ చిరంజీవి. మహత్తర దానవ మహాసామ్రాజ్య పునరుద్ధరణకు అంకురార్పణ జరగబోతుంది. నారదా! సురపక్షపాతి విష్ణువుకుతంత్రాలకు త్వరలోనే తగిన శాస్తి లభిసుం్తది’’ కళ్లనిండా సంతోషంతో అన్నారు శుక్రాచార్యులు.‘‘అయితే మహేశ్వరుని శక్తితో మహావిష్ణువును సాధించడానికి ఈ ప్రయత్నమన్నమాట’’ అన్నాడు నారదుడు.‘‘అవును’’‘‘అంతా నీ వెర్రి. సిద్ధాంతచర్చల్లో శివకేశవుల వాదమే కాని ఆదిమూర్తులకు ఆ భేదమే లేదు. నామరూపాలు వేరైనా లోకపాలకులైన ఆ మహానుభావులు ఇద్దరూ ఒక్కటే. ఒకరు ఎక్కువ కాదు. మరొకరు తక్కువ కాదు.’’ అన్నాడు నారదుడు.‘‘చాలించు నారదా! ఆశ్రితపక్షపాతి అయిన ఆ దామోదరుడికి, భక్తజనసులభుడైన పరమేశ్వరుడికి సామ్యమా! నేను నమ్మిన మహాదేవుడు చతుర్దశ భువనాలకు ఆరాధ్యుడు. ఆ విష్ణువు, జిష్ణువు అతని పాదధూళికి సరిరారు’’ శుక్రాచార్యుల వారి గొంతులో నుంచి ఆగ్రహజ్వాలలు.‘‘ఈ విష్ణుద్వేషమే ఆది నుంచి మీ దానవ జాతిని అడుగంట చేసింది. అయిననూ నాకెందుకు. కైలాసనాథుడు చేసినా వైకుంఠవాసుడు చేసినా నాకు కావల్సింది లోకళ్యాణమే’’ అంటూ అక్కడి నుంచి వెళ్లాడు నారదుడు. -
వివేకానందుడి సూక్తులు.. బాలయ్య డైలాగులు
సాక్షి, చెన్నై : ఎక్కడా పొంతన లేని ఈ రెండింటి గురించి ప్రస్తావించింది ఎవరో కాదు కోలీవుడ్ కమెడియన్ వివేక్. బాయ్స్, అపరిచితుడు, శివాజీ తదితర చిత్రాలతో బాగా ఫేమస్ అయిన ఈ సీనియర్ నటుడికి ఈ రెండు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తాయంట. కాస్త దిగులుగా అనిపిస్తే చాలూ నేను రెండు పనులు చేస్తాను. ఒకటి స్వామి వివేకానందుడి సూక్తులు చదవటం.. రెండోది బాలయ్య స్టంట్లు, డైలాగులు చూసి రిలాక్స్ అవ్వటం తద్వారా తాను ఉత్తేజం అవుతానని వివేక్ రెండు రోజలు క్రితం తన ట్విట్టర్లో తెలియజేశారు. అయితే ‘‘ఆ కిందే సర్ ఇది చూశాక డిసైడ్ చేసుకోండి’’ అంటూ... బాలయ్య తన అభిమానని కొట్టిన వీడియోను ఓ వ్యక్తి షేర్ చేయటం విశేషం. When ever I feel low I do 2 things!1. read Swami Vivekananda 2: watch Balakrishna sir”s dialogues n stunts! Both energize me! — Vivekh actor (@Actor_Vivek) November 5, 2017 సుమారు 400కి పైగా చిత్రాల్లో నటించిన వివేక్ పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా. ప్రస్తుతం ఆయనకు అవకాశాలు చాలా తక్కువగా వస్తున్నాయి. తాజాగా కమెడియన్ సంతానం హీరోగా రూపొందిన సక్క పొడు పొడు రాజా(తెలుగు లౌక్యం రీమేక్) చిత్రంలో వివేక్ నటించారు. -
ఆ హీరోలకు అచ్చొచ్చిన ప్రాంతం ఇదే
► బాలకృష్ణ జన్మదిన వేడుకల్లో తారకరత్న కర్నూలు : నందమూరి కుటుంబ హీరోలకు కర్నూలు అచ్చొచ్చిన ప్రాంతమని, ఇక్కడ తమ ప్రతి సినిమా బాగా అడుతుందని నందమూరి తారకరత్న అన్నారు. నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలోని హోటల్ ప్రకాశ్ రిజెన్సీలో ఎన్బీకే మోక్షాజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమానికి అతిథిగా హాజరైన తారకరత్న మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీలో బాబాయ్ బాలకృష్ణది ప్రత్యేకశైలి అన్నారు. ప్రతీ సినిమాను కొత్త కోణంలో తీయడం ఆయనకే చెల్లుతుందన్నారు. తన అభిమాన హీరో బాలకృష్ణ అని, ఆయన జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆ సేవా సమితి సభ్యులు లతీఫ్, ఖాజామిన్నెల్ల, రమేష్‌రెడ్డి, మోతీలాల్, లక్ష్మీనారాయణ, చంద్ర, రమేష్, రామకృష్ణ, సలాం, బజారి తదితరులు పాల్గొన్నారు. -
బాలయ్య, క్రిష్‌లతో స్పెషల్ ఇంటర్వ్యూ
-
బాబాయ్,అబ్బాయ్ మధ్య ఎక్స్చేంజ్ ఆఫర్ ?
-
విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి
ఎర్రగొండపాళెం: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాళెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక ఇంటికి సెంట్రింగ్ పని చేస్తుండగా బాలయ్య(25) అనే కార్మికుడు కరెంట్‌షాక్‌తో శనివారం మధ్యాహ్నం మృతిచెందాడు. ఇంటి పైనుంచి వెళుతున విద్యుత్ వైర్లు తగలడంతో బాలయ్య అక్కడికడ్డడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. -
ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న డిక్టేటర్ మూవీ టీమ్
-
ఆటోజానీకి సవాల్ విసురుతున్న డిక్టేటర్..?
-
ముగ్గురు చైన్ స్నాచర్ల అరెస్ట్
తెనాలిరూరల్ :ఉన్నత విద్యను అభ్యసించినా, చెడు వ్యసనాల కారణంగా చోరులుగా మారిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ. 6.50 లక్షల విలువైన సొత్తును స్వాధీనపర్చుకున్నారు. ఆ వివరాలను సోమవారం తెనాలి టూ టౌన్ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ(క్రైం) ఎ. శోభామంజరి వెల్లడించారు. గుంటూరుకు చెందిన రాగిపాటి బాలు, జంగం జరియల్, భట్టిప్రోలు మండలం పల్లెకోనకు చెందిన గుంటూరు సురేష్ స్నేహితులు. పాత నేరస్తుడయిన బాలు అలియాస్ బాలయ్య ఆటో నడుపుతుండగా, జరియల్ ఇంజినీరింగ్ చదివాడు. సురేష్ లా విద్యార్థి. జరియల్ మరదలు చెన్నైలో చదువుకుంటోంది. ఆమెకు విలువైన బహుమతులు ఇవ్వాలని, అందుకు పెద్దమొత్తంలో నగదు అవసరమని స్నేహితులకు చెప్పాడు. దీనికితోడు ముగ్గురూ జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆలోచన చేశారు. టీవీ సీరియళ్లలో చూపినట్టు చైన్‌స్నాచింగ్ సులువైన మార్గమని బాలు చెప్పాడు. దీంతో నరసరావుపేట నవోదయ నగర్, అరండల్‌పేట, రేపల్లెలో, మంగళగిరిలోని గాంధీబజారు, మార్కెట్ వద్ద, తెనాలి నందులపేట, కొత్తపేటలలో మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాక్కుని వెళ్లారు. గుంటూరు నల్లపాడులోని ఎంబీటీఎస్ పాలిటెక్నిక్ కళాశాలలో 15 ఎల్సీడీ మానిటర్లు, రెండు సీపీయూలు, ఒక ప్రొజెక్టర్‌ను అపహరించుకెళ్లారు. వీటి మొత్తం విలువ రూ. 6.50 లక్షలు ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. నిందితులను సీఐలు కళ్యాణ్‌రాజు, బి. శ్రీనివాసరావు అరెస్ట్ చేశారని వివరించారు. సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. -
నయనాంజలి
-
'లెజెండ్' కొత్తగా మళ్లీ పుట్టాడు!
-
మెగాఫోన్ పట్టబోతున్న బాలయ్య?