NBK Unstoppable Season 2: Vishwak Sen And Siddhu Jonnalagadda Episode 2 Promo - Sakshi
Sakshi News home page

Unstoppable With NBK: విశ్వక్ సేన్, డిజే టిల్లుతో రచ్చ రచ్చ.. బాలయ్యతో మామూలుగా ఉండదుగా

Published Sun, Oct 16 2022 1:29 PM | Last Updated on Sun, Oct 16 2022 3:26 PM

Unstoppable With NBK Season 2 Promo Released - Sakshi

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ సీజన్-2 రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇటీవలె గ్రాండ్‌గా లాంచ్‌ అయిన ఈ షో సెకండ్‌ ఎపిసోడ్‌లో యంగ్‌ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్‌లు గెస్టులుగా వచ్చారు. కలిసి అన్‏స్టాపబుల్ వేదికపై బాలయ్య చేసిన రచ్చ మాములుగా లేదు. రావడం రావడంతోనే సిద్ధూ హెయిర్‌స్టైల్‌పై పంచ్‌ వేసిన బాలయ్య.. తలదువ్వకుండా పంపించారు హెయిర్ స్టైలిస్ట్ ఎక్కడా అంటూ ఫన్నీగా రియాక్ట్‌ అయ్యారు.

దీనికి సిద్ధూ ఆన్సర్‌ ఇస్తూ.. 'ఇది మెస్సీ లుక్‌' అని చెప్పగా..'అలా నేను మెస్సీ లుక్‌తో కనిపించిన సినిమాలన్నీ మెస్సీ అయ్యాయమ్మా' అంటూ బాలయ్య సెటైర్‌ వేశారు. ఇక మీ ప్రజెంట్‌ క్రష్‌ ఎవరు అని బాలయ్యను అడగ్గా రష్మిక మందన్నా అని ఓపెన్‌గానే చెప్పేశారు.

ఆ తర్వాత ఫ్లర్టింగ్ ఎలా చేయాలంటూ టిప్స్ అడిగి మరీ తెలుసుకున్న బాలయ్య ఓ హీరోయిన్‌కి కాల్‌ చేసి..  మీ వాయిస్ విని మీ ఫేస్ చందమామలా ఉంటదని నేను చెప్పగలను. నేనేమో చీకట్లో ఉంటాను. ఇద్దరం కలిస్తే పున్నమి రాత్రే  అంటూ సరదాగా ఫ్టర్ట్‌ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement