Do You Know The Shirt Price Of Prabhas Wear In Unstoppable With NBK - Sakshi
Sakshi News home page

Prabhas : బాలయ్య షోలో ప్రభాస్‌ ధరించిన ఈ షర్ట్‌ ధరెంతో తెలుసా?

Published Tue, Dec 13 2022 12:44 PM | Last Updated on Tue, Dec 13 2022 2:50 PM

Do You Know The Shirt Price Of Prabhas Wear In Unstoppable With NBK - Sakshi

బాలయ్య హోస్ట్‌గా ఎన్‌బీకే విత్ అన్‌స్టాపబుల్ షో సీజన్‌-2 సక్సెస్‌ ఫుల్‌గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేశారు. తాజాగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ స్పెషల్‌ గెస్టుగా హాజరవడం ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. సాధారణంగా ప్రభాస్‌ తన సినిమా ఈవెంట్లకు తప్పా బయట ఎక్కడా అంతగా కనిపించరు. అలాంటిది బాలయ్య షోకు ప్రభాస్‌ రావడంతో ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు.

ఈ షోకు ప్రభాస్‌ తన స్నేహితుడు, హీరో గోపీచంద్‌తో కలిసి హాజరయ్యారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో ముఖ్యంగా ప్రభాస్‌ డ్రెస్సింగ్‌ స్టైల్‌ మరో హైలైట్‌గా నిలిచింది. ఎక్కువగా బ్లాక్‌ షర్ట్‌లో కనిపించే ప్రభాస్‌ ఎన్‌బీకే షోలో మాత్రం కలర్‌ఫుల్‌గా కనిపించారు. దీంతో ప్రభాస్‌ వేసుకున్న షర్ట్‌ ఏ బ్రాండ్‌? దాని ధరెంత అంటూ నెట్టింట తెగ సెర్చ్‌ చేస్తున్నారు.

వివరాల ప్రకారం.. ప్రభాస్‌ వేసుకున్న షర్ట్‌ `పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్' కంపెనీకి చెందినదట. దీని ధర సుమారు 115 పౌండ్స్‌ ఉంటుందట. అంటే అక్షరాలా ఇండియన్‌ కరెన్సీలో దాదాపు రూ.11,618/. ఏది ఏమైనా ప్రభాస్‌ ఈ షర్ట్‌లో మరింత యంగ్‌ లుక్‌లో కనిపిస్తున్నారని, ఈ ఎపిసోడ్‌ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామంటూ  నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement