shirt
-
టక్ చేయలేదని చితక్కొట్టిన టీచర్
టక్ చేయలేదన్న ఒకే ఒక్క కారణంతో పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయిన ఉపాధ్యాయుడు విద్యార్థిని చితకబాదిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఎడమ చెవిపై గట్టిగా కొట్టడంతో కర్ణభేరి పగిలింది. దాంతో ఆ చెవి శాశ్వతంగా వినికిడి సామర్థ్యం కోల్పోయింది. సీసీటీవీ ఫుటేజీతో ఈ ఘటన వెలుగులోకి రావడంతో టీచర్‌పై పిల్లాడి తల్లిదండ్రులు ఫిర్యాదుచేశారు. నిర్లక్ష్యంగా సమాధానమిచి్చన టీచర్‌ను తల్లిదండ్రులు పోలీసుల ఎదుట చితక్కొట్టారు. కంప్యూటర్ సబ్జెక్ట్ బోధించే సందేశ్ బోసాలే సెప్టెంబర్ 27న ఆరో తరగతి గదిలో ఓ విద్యార్థి టక్ చేసుకోకపోవడం గమనించి కోపంతో కొట్టాడు. మెడ పట్టి క్లాసు నుంచి గెంటేశాడు. దెబ్బలకు బాలుని ముక్కు, ఎడమ చెవి నుంచి రక్తం కారింది. ఇంటికెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా ఎడమ చెవి కర్ణభేరి పగిలిందని వైద్యుడు చెప్పాడు. కుటుంబసభ్యులు స్కూలు యాజమాన్యాన్ని నిలదీసినా తమకు సంబంధం లేదన్నారు. దాంతో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన సలహాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి ఇరు వర్గాలను స్కూలుకు పిలిపించారు. అప్పటికే కోపంతో ఉన్న కుటుంబసభ్యులు, నవనిర్మాణ్ సేన కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే టీచర్‌ను చితకబాదారు. महाराष्ट्र के पुणे में पहले टीचर ने छात्र को पीटा, फिर मनसे और छात्र के परिजनों ने टीचर को पीटा! केस दर्ज छात्र का शर्ट इन नहीं था pic.twitter.com/NZ5fwgTX8R— Avinash Tiwari (@TaviJournalist) October 6, 2024 -
బాంబే షర్ట్ కంపెనీలో సందడి చేసిన బిగ్‌బాస్ ఫేమ్ (ఫొటోలు)
-
వేడి వేడి ప్రెషర్ కుకర్ ఉండగా... ఐరన్ బాక్స్ దండగా
‘లిమిటెడ్ రీసోర్స్ నుంచే కొత్త ఐడియాలు జనించునోయి’ అని మరోసారి చెప్పడానికి ఈ వైరల్ వీడియో క్లిప్ సాక్ష్యం. కోల్‌కతాకు చెందిన మౌమితా చక్రవర్తి వేడి వేడి ప్రెషర్ కుక్కర్‌ను ఉపయోగించి షర్ట్‌ను ఐరన్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ట్విట్టర్లో రీపోస్ట్ చేసిన ఈ వీడియో రెండు లక్షల యాభై వేల వ్యూస్‌ను దాటింది. -
ఈ షర్ట్ చాలా కాస్ట్లీ గురూ!
అత్యంత ఖరీదైన చొక్కా అంటే మహా అయితే రూ. 500 నుంచి మొదలై వెయ్యి రూపాయల పైన ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మంచి బ్రాండెడ్ షర్ట్ అయితే ఐదు వేల నుంచి పదివేలు వరకు ఉండొచ్చు. లక్షల్లో పలికే షర్ట్ గురించి విన్నారా. అంత ఖరీదైన షర్ట్ ఎవరైన కొంటారా? ధరిస్తారా అని సందేహించొద్దు. ఎందుకుంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చొక్కాగా నిలిచిన దాన్ని ఓ వ్యక్తి సొంతం చేసుకుని ధరిస్తున్నాడు కూడా. ఎవరా వ్యక్తి? ఏంటతని బ్యాగ్రౌండ్ చూద్దామా! మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు పంకజ్ పరాఖ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చొక్కాను సొంతం చేసుకుని ధరిస్తున్నాడు. ఆ షర్ట్‌ని సొంతం చేసుకోవడంతో పంకజ్ 2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుని వార్తల్లో కూడా నిలిచాడు. దీని ధర ఏంకంగా రూ.98,35,099. అతని స్నేహితులు అతనిని ఆప్యాయంగా 'ది మ్యాన్ విత్ ది గోల్డెన్ షర్ట్' అని పిలుస్తారు. ఇవిగాక పరాఖ్ దగ్గర చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. అందులో ఈ బంగారు చొక్కా కూడా ఒకటి. 4.10 కేజీల బంగారు చొక్కా ధర ఇప్పుడు రూ.1.30 కోట్లు. దీంతోపాటు బంగారు గడియారం, అనేక బంగారు గొలుసులు, పెద్ద బంగారు ఉంగరాలు, బంగారు మొబైల్ కవర్ అండ్ బంగారు ఫ్రేమ్డ్ గ్లాసెస్ ఉన్నాయి. అలాగే పది కిలోల బంగారు దుస్తులు, లైసెన్స్ రివాల్వర్‌తో అతని నడక అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఖరీదైన వస్తువులన్నింటిని సంరక్షించేందుకు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను కూడా నియమించాడు పంకజ్. ఈ మేరకు పంకజ్ మాట్లాడుతూ.. ఈ షర్ట్‌ని తాను సొంతం చేసుకోవడంతో యావత్ ప్రపంచానికి నా పేరు తెలిసిపోవడమే గాక మంచి పేరు రావడం తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ఇక పంకజ్ ఎనిమిదవ తరగతితోనే పాఠశాల చదువుకి స్వస్తి పలికి తన కుటుంబ చేస్తున్న వస్త్ర వ్యాపారాన్ని చూసుకునేవాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే పంకజ్ స్వతంగా వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు. ఆ మంచి వ్యాపారవేత్తగా నిలదొక్కుకోవడంతే రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. ఆ తరువాత ఏడాదికే అతను ముంబైకి 260 కి.మీ దూరంలో ఉన్న యోలా పట్టణంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్ అయ్యాడు. అయితే తనకు ఈ బంగారు చొక్కా ధరించడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నాడు పంకజ్. దీన్ని షర్ట్‌ని ఈజీగానే కడగొచ్చట. ఇక పంకజ్కి దాృతృత్వం కూడా ఎక్కువ. అందుకు సంబంధించిన కార్యక్రమాన్నింటిలోనే పాలుపంచుకుంటాడు. (చదవండి: రష్యా డాన్స్ ఇంత అందంగా ఉంటుందా?) -
ఎనిమిదేళ్లుగా ఒకే షర్ట్ వాడుతున్న రామ్ చరణ్.. పిక్ వైరల్!
సాధారణంగా సిసీ సెలెబ్రెటీలకు ఖరీదైన డ్రెస్సులు..కొత్త కొత్త వాచీలు, షూలు ధరించడం అలవాటు. కొంతమంది బడా హీరోహీరోయిన్లు అయితే.. కోట్లు విలువ చేసే వాచీలను సైతం ధరిస్తుంటారు. ఇక డ్రెస్సుల గురించి చెప్పనక్కర్లేదు. ట్రెండ్ ఫాలో అవుతూ షా ఖరీదైన దుస్తులను వాడుతుంటారు. ఒక్కసారి ధరించిన డ్రెస్‌ని కొన్ని వారాల వరకు ధరించరు. కొంతమంది అయితే రోజుకో డ్రెస్ మారుస్తుంటారు. కానీ మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ మాత్రం ఓ షర్ట్‌ని ఎనిమిది ఏళ్లుగా వాడుతున్నాడు. 2016లో కొన్న ఆ షర్ట్‌ని ఇప్పటికే ధరిస్తున్నారు. తాజాగా డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి దిగిన ఫోటోలో సైతం చెర్రీ ఆ షర్ట్‌తోనే కనిపించాడు. దీంతో ప్రస్తుతం చెర్రీ షర్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. (చదవండి: వాళ్లు హర్ట్ అయ్యారు.. హీరోయిన్ నయనతార భర్తకు నోటీసులు!) 2016లో ‘ధృవ’ సినిమాలో చరణ్ ఆ షర్ట్‌తో కనిపించాడు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలో..ప్రమోషన్స్ సమయంలోనూ అదే షర్ట్ ధరించి కనిపించారు. అలాగే లాక్ డౌన్ సమయంలోనూ అదే షర్ట్ చాలా సార్లు ధరించి కనిపించారు. 2016 నుంచి 2024 వరకు ఏ ఏ సందర్భంలో చరణ్ ఆ షర్ట్‌ని ధరించారో తెలుపుతూ ఓ ఫోటోని క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. చరణ్ సింప్లిసిటీ చూసి మెగా ఫ్యాన్స్‌తో పాటు మిగతా నెటిజన్స్ కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా ఈ ఏడాదిలో విడుదలయ్యే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by fasak.boss (@fasakboss) -
హాట్‌టాపిక్‌గా మారిన మహేశ్ బాబు టీషర్ట్.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న మహేశ్ తాజాగా యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మహేశ్ బాబు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. సింపుల్ టీ షర్ట్‌లో క్లాసీ లుక్స్‌తో కనిపించాడు. దీంతో మహేశ్ ధరించిన టీ షర్ట్ ధర ఎంత ఉంటుందబ్బా అంటూ నెటిజన్లు గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారు.సాధారణంగా సెలబ్రిటీలు వేసుకున్న దుస్తులు, వస్తువుల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో ఎక్కువగా ఉంటుంది. అలా మహేశ్ బాబు యానిమల్ ఈవెంట్‌కు ధరించిన టీషర్ట్ ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇది 'గివెంచి' బ్రాండ్‌కు సంబంధించినది.చూడటానికి సింపుల్‌గా ఉన్నా దీని ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఈ టీషర్ట్ ధర వందల్లో కాదు సుమారు రూ. 47వేలు మరి. ఈ విషయం తెలిసి.. సింపుల్ టీషర్ట్ ఏకంగా ఇంత కాస్ట్లీనా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. -
బిగ్‌బాస్: వామ్మో... నాగార్జున షర్ట్ ధర అన్ని లక్షలా?
తెలుగు ఇండస్ట్రీలో మన్మథుడు ఎవరనగానే నాగార్జున అని టపీమని చెప్పేస్తారు. 64 ఏళ్ల వయసులోనూ యంగ్‌గా కనిపిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటినిస్తున్నాడు కింగ్. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిగ్‌బాస్ షోకి హోస్టింగ్ చేస్తున్నాడు. వీకెండ్లో హౌస్‌మేట్స్‌కు క్లాసులు పీకుతూ తర్వాత వారితో గేమ్స్ ఆడిస్తూ ఉంటాడు. శని, ఆదివారాల్లో స్పెషల్‌గా డిజైన్ చేసిన డ్రెస్సుల్లో దర్శనమిస్తుంటాడు నాగ్. కొన్ని చిత్రవిచిత్రంగా ఉన్నా నాగ్‌కు మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతుంటాయి. అలా మొన్నటి శనివారం.. రంగులతో పెయింట్ వేసినట్లుగా ఉన్న షర్ట్ ధరించాడు. వాలెంటినో బ్రాండ్‌కు చెందిన ఈ షర్ట్ ధర ఏకంగా రూ.1,03,019గా ఉంది. ఆదివారం రోజు ఆయన వైట్ స్వెట్‌షర్ట్ ధరించాడు. లూయిస్ వ్యూటన్కు చెందిన దీని ధర ఏకంగా రూ.1,82,016 అని తెలుస్తోంది. ఆరోజు ఆయన వేసుకున్న షూ ధర కూడా లక్ష పై చిలుకే ఉండటం గమనార్హం. ఎంతైనా స్టార్ హీరో కదా.. ఆమాత్రం మెయింటెన్ చేయాల్సిందే అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం నాగ్ 'నా సామిరంగా' సినిమా చేస్తున్నాడు. చదవండి: మహేశ్‌బాబు సినిమా 10 సార్లు చూసి ఎంపీనయ్యా.. మల్లారెడ్డి స్పీచ్ వైరల్ -
XL, XXLలను వినే ఉంటారు.. X ఏమి సూచిస్తుంది?
ఎవరైనా షర్ట్ లేదా టీ-షర్ట్‌ను కొనుగోలు చేయడానికి వస్త్ర దుకాణానికి వెళ్లినప్పుడు షర్టు నాణ్యత, రంగుతో పాటు కావాల్సిన సైజును ఎన్నుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి మన సైజుకు సరిపడే షర్ట్ అందుబాటులో ఉండదు. అటువంటప్పుడు ఆ సైజు షర్ట్ కోసం మరో దుకాణానికి వెళ్లాల్సి వస్తుంది. అయితే షర్ట్‌పై సైజులకు సంబంధించి XL లేదా XXL అని రాసివుండటాన్ని మీరు గమనించే ఉంటారు. దీనిలో X అనేది ఏమి సూచిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా XL(ఎక్స్ట్రా లార్జ్) సైజు షర్టు ఛాతీ కొలత 42 నుంచి 44 అంగుళాలు ఉంటుంది. నడుము పరిమాణం 36 నుంచి 38 అంగుళాలు ఉంటుంది. ఇకముందు మీరు షర్ట్ కొనడానికి వెళ్లినపుడు మీ కావలసిన సైజు ఎంతనేది తెలియనప్పుడు మీ ఛాతీ, నడుము సైజును కొలవండి. అప్పుడు మీకు కావాలసిన షర్టు సైజు ఎంతో తెలుస్తుంది. ఇక XXL విషయానికొస్తే ఇది ఎక్స్ట్రా లార్జ్ కన్నా పెద్ద సైజు కలిగినది. ఈ సైజు షర్ట్ లేదా టీ- షర్ట్ ఛాతీ కొలత 44 నుంచి 46 అంగుళాలు ఉంటుంది. నడుము పరిమాణం 38 నుంచి 40 అంగుళాల మధ్య ఉంటుంది. ఈ పరిమాణం కొద్దిగా లావుగా ఉన్నవారికి సరిపోతుంది. ఎవరైనా తమ శరీర బరువు పెరిగినప్పుడు XXL సైజు దుస్తులు వేసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా చదవండి: ‘రాధాస్వామి’ గురువు ఎవరు? సత్సంగిలు ఏమి చేస్తుంటారు? -
మహేశ్ బాబు ధరించిన ఈ చొక్కా రేటు ఎంతో తెలుసా?
స్టార్ హీరోహీరోయిన్ల సినిమాలే కాదు వారి పర్సనల్ విషయాలపై కూడా చాలామంది ఆసక్తి కనబరుస్తారు. తమ అభిమాన హీరో ఏ రంగు దుస్తులను ఇష్టపడతాడు? ఏ బ్రాండ్ కారు అంటే ఇష్టం? వాళ్ల ఆహారపు అలవాట్లు ఏంటి? తదితర విషయాలు తెలుసుకోని, ఫ్యాన్స్ కూడా అవి ట్రై చేస్తారు. ముఖ్యంగా దుస్తుల విషయంలో మాత్రం ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరోహీరోయిన్లనే ఫాలో అవుతారు. సినిమాల్లో గానీ, బయట ఏదైన ఈవెంట్లో గానీ తమ హీరో కొత్త డ్రెస్‌తో కనిపిస్తే చాలు.. వెంటనే అది ఏ బ్రాండ్? కాస్ట్ ఎంత? ఎక్కడ లభిస్తుంది? తదితర వివరాలన్నీ గూగుల్ సెర్చ్ చేసి మరీ తెలుసుకుంటారు. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ ధరించిన షర్ట్ ధరపై నెట్టింట భారీ చర్చ జరుగుతోంది. సింపుల్ లుక్కే కానీ.. వెరీ కాస్ట్లీ రీసెంట్గా మహేశ్‌బాబు ఓ మొబైల్ కంపెనీ నిర్వహించిన ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ఎప్పటిలాగే చాలా సింపుల్‌గా, బ్లాక్ కలర్ చెక్ షర్ట్ లో మహేశ్ ఎంట్రీ ఇచ్చారు. అందరి దృష్టి మహేశ్ బాబు ధరించిన షర్ట్‌పై పడింది. చూడడానికి చాలా సింపుల్‌గా ఉన్నా..దాని ధర మాత్రం చాలా ఎక్కువ. ఇంటర్నేషనల్ కంపెనీకి చెందిన ఆ షర్ట్ ధర రూ. 18 వేలు. సెలబ్రెటీలు ఈ రేంజ్ దుస్తులు ధరించడం కామనే..కానీ సగటు వ్యక్తికి మాత్రం అది షాకింగ్ రేటే. అందుకే ఆ షర్ట్ ధర ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. ‘మహేశ్ బాబు సంపాదన కోట్లలో ఉంటుందని కాబట్టి అది ఆయనకు చాలా తక్కువ ధరే..కానీ సామాన్యులకు మాత్రం ఒక నెల జీతం’ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా మహేశ్ షర్ట్‌పై చర్చ మహేశ్ బాబు డ్రెస్‌పై చర్చ జరగడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా అనేక సార్లు మహేశ్ ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. భరత్ అనే నేను చిత్రంలో మహేశ్ బాబు ధరించిన వైట్ షర్ట్ అప్పట్లో బాగా వైరల్ అయింది. అలాగే మహర్షి చిత్రంలో కాలేజీ ఎపిసోడ్లో మహేశ్ వేసుకున్న షర్ట్‌పై కూడా ఓ రేంజ్లో చర్చ జరిగింది. పోకిరి, అతిథి సినిమాల్లోని డ్రెస్సులు అదే పేరుతో మార్కెట్లోకి కూడా వచ్చాయి. అప్పట్లో చాలా మంది యువత ఆ డ్రెస్సులను ధరించారు. సంక్రాంతికి ‘గుంటూరు కారం’ మహేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కబోతున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Mahesh Babu™ 🔔 (@mahesh_babu__fans) -
'గుంటూరు కారం' పోస్టర్.. మహేశ్ వేసుకున్న షర్ట్ ధరెంతో తెలుసా?
సూపర్‌స్టార్ మహేశ్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా గుంటూరు కారం. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో శ్రీలీల,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. క్రేజీ లుక్‌లో మహేశ్ బాబు అందులో మహేశ్ మాస్ లుక్‌లో దర్శనమిచ్చారు. లుంగీ, షర్ట్ ధరించి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని బీడీ కాలుస్తూ క్రేజీ లుక్‌లో కనిపించారు. ఈ పోస్టర్ రిలీజ్ అయిన కాసేపటికే నెట్టింట వైరల్‌గా మారింది. ఇక పోస్టర్లో మహేశ్ బాబు వేసుకున్న షర్ట్ ఫ్యాన్స్‌ను బాగా అట్రాక్ట్ చేసింది. ఇది ఏ బ్రాండ్? దీని ధరెంత అంటూ నెట్టింట సెర్చ్ చేశారు. సాధారణంగానే సెలబ్రిటీలు వాడిన కాస్ట్యూమ్స్, వాచెస్, షూస్ వంటి వస్తువులను ట్రై చేయాలని అభిమానులు ఆరాటపడుతుంటారు. మహేశ్ రేంజ్‌కి ఆ మాత్రం ఉండాలిగా.. ఈ క్రమంలో మహేశ్ వేసుకున్న క్యాజువల్ షర్ట్ గురించి గూగుల్ చేయగా వారికి దిమ్మతిరిగే బొమ్మ కనిపించింది. ఎందుకంటే గుంటూరు కారం లేటెస్ట్ పోస్టర్లో మహేశ్ వేసుకున్న షర్ట్ ధర అక్షరాల రూ.74,509. ఫ్యాషన్ ఫార్‌ఫెచ్ R13కు చెందిన బ్లీచ్ వాష్ ప్లాయిడ్ లాంగ్ స్లీవ్ షర్ట్‌లో మహేశ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. అయితే ఇంత సింపుల్ షర్ట్ అంత కాస్ట్లీనా అని కొందరు షాక్ అవుతుంటే, మహేశ్ రేంజ్‌కి ఆ మాత్రం ఉండాలిగా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. #HBDSuperstarMahesh 🥳💥#GunturKaaram pic.twitter.com/2mf80iWpgQ — Haarika & Hassine Creations (@haarikahassine) August 8, 2023 -
ప్రపంచంలో అత్యంత సంపన్నుడు.. మరీ ఇంత చవక షర్ట్ ఏంటి?
అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరు జెఫ్ బెజోస్. ఇటీవల కాలిఫోర్నియాలో జరిగిన కోచెల్లా మ్యూజిక్ ఫెస్టవల్కు ఆయన గర్ల్‌ఫ్రెండ్ లారెన్ శాంచెజ్‌తోపాటు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆయన ధరించిన షర్ట్ చర్చనీయాశంగా మారింది. ఇదీ చదవండి: Bank Holidays in May 2023: మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్! సెలవులు ఏయే రోజుల్లో అంటే.. ఏప్రిల్ 21 రాత్రి జరిగిన రాపర్ బాడ్ బన్నీ సంగీత కార్యక్రమానికి బెజోస్ హాజరైనట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఇందులో బెజోస్ బ్లూ కలర్ బటర్‌ఫ్లై ప్రింట్ ఉన్న షర్ట్‌ను ధరించారు. ఈ వీడియోలో బెజోస్ ధరించిన దుస్తుల వివరాలను నెటిజన్లు తవ్వితీశారు. అమెజాన్‌లో బెజోస్ ధరించిన షర్ట్ ధర 12 డాలర్లు (సుమారు రూ.980) కంటే తక్కువని తెలుసుకుని షాక్ అయ్యారు. అత్యంత సంపన్నుడు మరీ ఇంత చవకైన చొక్కా ధరించాడేంటని ఆశ్చర్యపోతున్నారు. ఇదీ చదవండి: మాకు కన్నీళ్లు.. వాళ్లకు కోట్ల కొద్దీ బోనస్‌లా? జుకర్‌బర్గ్‌ను నిలదీసిన ఉద్యోగులు బెజోస్ ధరించిన షర్ట్ ధర తక్కువే అని కొందరు వాదిస్తుంటే.. మరికొందరు మాత్రం బెజోస్ ధరించింది డిజైనర్ షర్ట్ అని, అమెజాన్‌లో ఉన్న తక్కువ ధరకు ఉన్న ఆ షర్ట్లు ఖరీదైన డిజైనర్ బ్రాండ్‌కు డూప్లికేట్ అని పేర్కొంటున్నారు. Kendall Jenner, Kris Jenner and Jeff Bezos during the second weekend of the Coachella Valley Music & Arts Festival. pic.twitter.com/OaX7ZjgkJz — @21metgala (@21metgala) April 22, 2023 Absolutely love that Bezos went to Coachella and did the same thing I would do - wore a $15 Hawaiian shirt from Amazon.https://t.co/CcQIDK2uGV pic.twitter.com/x8zGzWs5S9 — Sheel Mohnot (@pitdesi) April 24, 2023 -
బాలయ్య షోలో ప్రభాస్ ధరించిన ఈ షర్ట్ ధరెంతో తెలుసా?
బాలయ్య హోస్ట్‌గా ఎన్బీకే విత్ అన్‌స్టాపబుల్ షో సీజన్-2 సక్సెస్ ఫుల్‌గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేశారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పెషల్ గెస్టుగా హాజరవడం ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సాధారణంగా ప్రభాస్ తన సినిమా ఈవెంట్లకు తప్పా బయట ఎక్కడా అంతగా కనిపించరు. అలాంటిది బాలయ్య షోకు ప్రభాస్ రావడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ షోకు ప్రభాస్ తన స్నేహితుడు, హీరో గోపీచంద్‌తో కలిసి హాజరయ్యారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో ముఖ్యంగా ప్రభాస్ డ్రెస్సింగ్ స్టైల్ మరో హైలైట్‌గా నిలిచింది. ఎక్కువగా బ్లాక్ షర్ట్‌లో కనిపించే ప్రభాస్ ఎన్బీకే షోలో మాత్రం కలర్ఫుల్గా కనిపించారు. దీంతో ప్రభాస్ వేసుకున్న షర్ట్ ఏ బ్రాండ్? దాని ధరెంత అంటూ నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ప్రభాస్ వేసుకున్న షర్ట్ `పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్' కంపెనీకి చెందినదట. దీని ధర సుమారు 115 పౌండ్స్ ఉంటుందట. అంటే అక్షరాలా ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.11,618/. ఏది ఏమైనా ప్రభాస్ ఈ షర్ట్‌లో మరింత యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారని, ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
పుష్ప మూవీ: బన్నీకి స్పెషల్ గిఫ్ట్ పంపించిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ మధ్య మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరిలో ఎవరి సినిమాలు విడుదలైన ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు. బన్నీ, విజయ్‌ల ఫ్రెండ్షిప్ బహుమతులు ఇచ్చిపుచ్చుకునేంతగా పెరిగింది. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా నేడు(డిసెంబర్17) రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినిమా బ్లాక్బాస్టర్ హిట్ అవ్వాలని అల్లు అర్జున్‌కు విజయ్ సర్ప్రైజ్ గిఫ్ట్‌ని పంపించాడు. చదవండి: Pushpa Review : ‘పుష్ప’ మూవీ ఎలా ఉందంటే.. ? తన రౌడీ క్లబ్ క్లాతింగ్ నుంచి కస్టమైజ్డ్ చేయించిన బ్లాక్ కలర్ స్వెట్‌షర్ట్‌ను బన్నీకి బహుమతిగా అందించాడు. ‘రౌడీ లవ్స్ అల్లు అర్జున్’ అని ప్రత్యేకంగా ప్రింట్ చేయించి ఇచ్చాడు. ఇదే షర్ట్‌ను అల్లు అర్జున్ పుష్ప సినిమా విడుదలైన సందర్భంగా తన కుటుంబంతో కలిసి థియేటర్‌కు వెళ్లే సమయంలో వేసుకున్నాడు. విజయ్ పంపించిన షర్ట్‌తోపాటు, ఆల్ ద బెస్ట్ చెబుతూ రాసిన చిన్న లెటర్‌ను అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశాడు. థ్యాంక్యూ సో మచ్ బ్రదర్.. అంటూ పేర్కొన్నాడు. చవండి: Pushpa Special Song: ఐటెం సాంగ్స్ అన్ని నాకు డివోషనల్ పాటలే, దేవిశ్రీ షాకింగ్ కామెంట్స్ కాగా సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమా ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదలైంది. రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం కొండల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్పను రూపొందించారు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం అనన్య పాండేతో కలిసి లైగర్ సినిమా చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది. చదవండి: Ranbir Kapoor-Alia Bhatt: పెళ్లిపై స్పందించిన రణ్‌బీర్-అలియా భట్ -
భర్త తనకు నచ్చినట్లు షర్ట్ కుట్టించుకోలేదని.. భార్య ఆత్మహత్య
జైపూర్: భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్న చిన్న వివాదాలే ఒక్కోసారి భారీ నష్టాన్ని కలిగిస్తాయి. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. భర్త తనకు నచ్చినట్లు షర్ట్ కుట్టించుకోలేదని మనస్తాపానికి గురైన భార్య.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ వివరాలు.. ఈ సంఘటన రాజస్తాన్, ఆర్కే పురం స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన అంజలి సుమన్ అనే మహిళకు రాజస్తాన్‌కు చెందిన శుభం అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు బాగానే ఉండేవారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం దంపతులిద్దరికి ఓ షర్ట్ విషయంలో గొడవ జరగింది. భర్త తనకు నచ్చినట్లు షర్ట్ కుట్టించుకోలేదని అతడితో గొడవపడింది అంజలి. (చదవండి: వివాహితతో ప్రేమ.. యువకుడిని దారుణంగా కొట్టి ) చిన్నగా ప్రారంభం అయిన వివాదం కాస్త ముదరడంతో ఆగ్రహించిన శుభం.. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత అంజలి భర్తకు ఫోన్ చేసింది. ఇంటికి తిరిగి వచ్చాక మాట్లాడదాం అని చెప్పాడు. అరగంట తర్వాత అతడి మొబైల్‌కు ఓ కాల్ వచ్చింది. విషయం ఏంటంటే అంజలి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంత చిన్న విషయానికే అంజలి ఏకంగా ప్రాణాలు తీసుకోవడం ఆమె కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేస్తోంది. చదవండి: అవని ఆనందం ఆకాశమంత... -
హంతకుడిని పట్టించిన గుండీ
ఔరంగాబాద్: చిన్న ఆధారమూ క్రిమినల్ కేసులో ఎంత కీలకంగా మారుతోందో చెప్పే ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఔరంగాబాద్‌లో బికన్ నిలోబ జాదవ్‌ను ఏడు నెలల క్రితం కొందరు హత్య చేశారు. ఘటనా స్థలంలో పోలీసులకు గుండీ మాత్రమే దొరికింది. గుండీ మీద రోప్లాస్ట్ స్టిచ్ అనే అక్షరాలు ఉండటంతో పోలీసులు ఆయా విక్రేతల నుంచి ఎవరెవరు చొక్కాలు కొనుగోలు చేశారో పరిశీలించారు. దాదాపు 10 వేల మంది వారి నుంచి చొక్కాలను కొనగా అందులో 246 మందికి నేరచరిత్ర ఉంది. అందులో హత్యకు నాలుగు రోజుల ముందు రగాడే అనే వ్యక్తి కత్తులను కొనుగోలు చేశాడు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో మిగిలిన వారి పేర్లు కూడా బయటకు వచ్చాయి. అజయ్ రగాడే, చేతన్ గైక్వాడ్, సందీప్ గైక్వాడ్‌లు ఈ హత్య చేసినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. -
ఎయిర్పోర్ట్ లుక్ : కరీనా షర్ట్ ధర ఎంతంటే..
ముంబై : బాలీవుడ్ భామల ఎయిర్పోర్ట్ ఎంట్రీ ఓ గ్రాండ్ ఈవెంట్‌లా మారింది. ఫ్యాషన్ ఐకాన్లుగా మెరుస్తూ ఫోటోలకు వారిచ్చే ఫోజులు రొటీన్‌గా మారాయి. ట్రెండీ దుస్తులు, ఆర్నమెంట్స్‌తో ఎయిర్‌పోర్ట్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో వారు ఆకట్టుకుంటున్నారు. తాజాగా దుబాయ్ టూర్ ముగించుకుని ముంబై చేరుకున్న కరీనా కపూర్ స్టైలిష్ లుక్‌తో సందడి చేశారు. మెటాలిక్ జిప్స్తో కూడిన తెలుపు రంగు స్వీట్ షర్ట్, బ్లూజీన్స్‌తో కనిపించిన కరీనా బ్రౌన్ హ్యాండ్ బ్యాగ్ ధరించారు. కేవలం ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో మేకప్ లేకుండా సింపుల్ లుక్స్‌తోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. కరీనా ఎయిర్పోర్ట్ లుక్‌లో ఆమె ధరించిన రూ లక్షా 11వేల విలువైన టీ షర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
చొక్కాల తయారీలో నూతన పరిజ్ఞానం
మంగళగిరి (తాడేపల్లి రూరల్): హాయ్లాండ్లో ఆదివారం 25వ ఫ్యాబ్రిక్ డిస్ప్లే సెలబ్రేషన్స్ జరిగాయి. ఇందులో చొక్కాల రూపకల్పన, తయారీలలో హూబర్ట్‌ఓజ్ సంస్థ నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నూతన విధానాన్ని కనుగొన్నట్లు హుబర్ట్ ఓజ్ డైరెక్టర్లు నిఖేష్‌లోధా, హఫీజ్‌రేషమ్‌వాలా తెలిపారు. ఫ్యాబ్రిక్ డిస్ప్లే సెలబ్రేషన్స్‌లో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త మనోజ్గిల్వానీ, డి.వి.సత్యనారాయణ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్కెట్లోకి విడుదల చేశారు. తొలి కియోస్క్‌ను విజయవాడకు చెందిన గోపాల్ టెక్స్టైల్స్ అధినేత కె.వి.కె.కిషోర్ ప్రారంభించారు. తొండెపు మహేష్, మురళీ, సురేష్, 13 జిల్లాల టెక్స్టైల్స్ ఏజెంట్స్, వస్త్రవ్యాపారులు పాల్గొన్నారు. -
టీ షర్ట్‌పై అసభ్య రాతలు.. తీవ్ర దుమారం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌పై వచ్చిన విమర్శలు ఎన్నో. వేర్పాటువాది, స్త్రీల పట్ల గౌరవం లేని వ్యక్తి అని ట్రంప్‌తో పాటు ఆయన సపోర్టర్స్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే.. అనూహ్యంగా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాడు. ట్రంప్ విజయాన్ని జీర్ణించుకోలేని వర్గం ఫలితాల అనంతరం ఆందోళనలు సైతం నిర్వహించింది. కాగా.. ఇప్పుడు ట్రంప్ సపోర్టర్స్ టైం నడుస్తోంది. ట్రంప్ వ్యతిరేకులపై వారు తీవ్ర స్థాయి విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ట్రంప్ మద్దతుదారులకు క్రిస్మస్ గిఫ్ట్‌గా సింగర్ కిడ్ రాక్ ఇటీవల కొత్త టీ షర్ట్ డిజైన్లను విడుదల చేశాడు. తన వెబ్సైట్ ద్వారా అమ్మకానికి ఉంచిన ఈ టీ షర్ట్‌లపై ఉన్న రాతలు.. ట్రంప్ వ్యతిరేకులపై అభ్యంతరకర రీతిలో దాడి చేస్తున్నాయి. దీంతో ట్రంప్ అభిమానుల్లో వీటికి యమా క్రేజ్ ఏర్పడింది. వీటిలో ఒక టీషర్ట్‌పై 'గాడ్, గన్స్, ట్రంప్' అని రాసి ఉండగా.. మరో దానిలో ఎన్నికల్లో డెమోక్రాట్లకు మద్దతు పలికిన ప్రాంతాలను కించపరిచేలా, ముస్లింలకు అనుకూలం అని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు ఉన్నాయి. మూడో దానిలో మాత్రం.. డొనాల్డ్ ట్రంప్ స్పెల్లింగ్‌లోని మొదటి అక్షరాన్ని ఉద్దేశపూర్వకంగానే వదిలేసి.. అది ట్రంప్ హేటర్స్ నోట్లో ఉందంటూ అసభ్యకరంగా ఉంది. ఒక్కో టీ షర్ట్ ధర 25 డాలర్లుగా నిర్ణయించినా.. విపరీతమైన డిమాండ్ ఉందని మురిసిపోతున్నాడు కిడ్ రాక్. ఈ టీ షర్ట్ లపై ట్రంప్ వ్యతిరేకుల నుంచే కాకుండా..డెమోక్రాట్లు ఆధిక్యం సాధించిన ప్రాంతంలో ఉన్న ట్రంప్ సపోర్టర్స్ నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇరు వర్గాలు ఇక 'అసహనం' వదిలేయాలని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. -
డెనిమ్.. డైనమిక్
న్యూలుక్ చలికాలాన వెచ్చగా ఉంటుంది. వేసవిలో కంఫర్ట్ ఉంటుంది. ఏకాలమైనా స్టైలిష్‌గా ఉంటుంది. యూత్ ఇష్టపడే డెనిమ్ గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటోంది. డెనిమ్, కార్గో ప్యాంట్లు, షర్ట్లు చాలా కాలం మన్నుతాయి. అందుకే వాటి వినియోగం కూడా ఎక్కువ. కొన్నాళ్లయ్యాక బోర్ కొట్టడమో, పిల్లల ప్యాంట్లు అయితే బిగుతు అవడమో జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు వాటిని ఏం చేస్తారు? ఇక్కడిచ్చిన విధంగా మార్చేయండి. డెనిమ్‌ను ధరించి డైనమిక్ లుక్‌తో కట్టిపడేయండి. షర్ట్ టాప్ డెనిమ్ షర్ట్‌ను ఛాతీ పై భాగానికి కట్ చేయాలి. అయితే, మధ్య బటన్స్ ఉన్న లైన్‌ను అలాగే ఉంచేయాలి. అలాగే, చేతుల భాగాన్ని కత్తిరించాలి. కింది భాగాన్ని పూర్తి కాంట్రాస్ట్ క్లాత్‌ని కొలత ప్రకారం తీసుకొని, జత చేయాలి. ఆకట్టుకునే వెరైటీ టాప్ రెడీ! దీన్ని డెనిమ్ ప్యాంట్స్ మీదకు ధరించవచ్చు. కత్తిరించు.. అతికించు ప్యాంట్ పై భాగం (కటిభాగం) వరకు కత్తిరించాలి. కింద షిఫాన్ లేదా కాటన్ క్లాత్ తీసుకోవాలి. అది ప్లెయిన్ అయినా, ప్రింట్లు ఉన్నది అయినా నచ్చిన కలర్‌కాంబినేషన్ సరిచూసుకోవాలి. కింది భాగం క్లాత్ కొలత ప్రకారం కత్తిరించి, కుచ్చులు పెట్టి, ప్యాంట్ పై భాగానికి జత చేయాలి. ప్యాంట్ స్కర్ట్ రెడీ. పిల్లల ప్యాంట్లు.. పొట్టి స్కర్ట్లు పొట్టివైతే పిరుదుల కింది భాగం వరకు ప్యాంట్‌ను కత్తిరించి, రెండు-మూడు రకాల క్లాత్‌లను విడి విడిగా కుచ్చులు పెట్టి జత చేయాలి. పిల్లలకు నచ్చే స్కర్ట్ సిద్ధం. దీనికి పై భాగాన్ని అతికించి గౌన్లా కూడా రూపొందించవచ్చు. డెనిమ్ లెహెంగా ప్యాంటు పొడవును సరి చూసుకొని కాంట్రాస్ట్ కలర్ కాటన్ క్లాత్స్తో ప్యాచ్ వర్క్ చేసి, మధ్య భాగాన జత చేయాలి. దీంతో ఇలా ఆకట్టుకునే లాంగ్లెహంగా రూపు దిద్దుకుంటుంది. -
అంతరంగాన్ని తాకే ధ్వని తరంగం!
శ్రీకృష్ణుడి బృందావనాన్ని అంధులు చూడవచ్చని అంటారు! అక్కడ మూగవారు మాట్లాడగలరనీ అంటారు. ఇది ఎంత వరకు నిజమో మనకు తెలియదుగానీ.. ఈ సైన్స్ ప్రపంచంలో మాత్రం వైకల్యమున్న వారికి దాదాపుగా అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలైతే కుప్పలు తెప్పలుగా జరుగుతున్నాయి. పక్కన ఫొటోలోని వారు తొడుక్కున్న షర్ట్ కూడా అలాంటిదే. వినికిడి శక్తి తక్కువ ఉన్నవారికీ, లేనివారికీ సంగీతపు మధురిమను అందిస్తుంది ఈ హైటెక్ షర్ట్. జర్మనీలోని క్యూట్ సర్క్యూట్ అనే టెక్నాలజీ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. ఇదే సంస్థ రెండేళ్ల క్రితం అవసరానికి తగ్గట్టుగా డిజైన్‌ను మార్చగల, ట్వీట్లు చేయగల హైటెక్ షర్ట్‌ను తయారు చేసింది. బధిరులకు ఉపయోగపడే షర్ట్‌పై కొన్ని కీలకమైన ప్రదేశాల్లో దాదాపు 16 యాక్చుయేటర్స్ ఏర్పాటు చేయడం, సంగీతానికి తగ్గట్టుగా అవి కొన్ని ప్రకంపనలు సృష్టించడం ఈ షర్ట్ ప్రత్యేకత. ఉదాహరణకు ఆర్కెస్ట్రా నడిచే స్టేజీపై పదుల సంఖ్యలో ఏర్పాటు చేసిన మైక్రోఫోన్లు అక్కడి శబ్దాలను గ్రహిస్తే... ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ వాటిని డిజిటల్ రూపంలోకి మారుస్తుంది. ఈ సమాచారం వైర్లెస్ పద్ధతిలో షర్ట్‌కు చేరుతుంది. డ్రమ్ముల శబ్దం తాలూకూ ప్రకంపనలు పొట్ట భాగంలోవస్తే... వయోలిన్వి చేతుల మీద వస్తాయన్నమాట. శబ్దం తాలూకూ తీవ్రతకు అనుగుణంగా ఉండే ఈ కంపనాలను బధిరులు ‘ఫీల్’ కావచ్చునని తద్వారా సంగీతాన్నీ ఆస్వాదించవచ్చునని అంటున్నారు ఈ షర్ట్‌ను అభివృద్ధి చేసిన ఆర్కెస్ట్రా సభ్యులు. ఇప్పటికే దీన్ని కొంతమంది బధిరులు వాడి ఆ అనుభూతిని పొందారు కూడా. జర్మనీలోని జంగ్జే సింఫోనికర్ ఆర్కెస్ట్రా వీటిని ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి పెట్టేసింది. ఇంతకీ దీని పేరేమిటో తెలుసా? సౌండ్ షర్ట్! -
'టక్కు'టమారం
పరమ స్టైలిష్‌గా కనిపించడానికి ప్రత్యేకంగా చొక్కాను ప్యాంటులోకి దోపే ట్రెండును టక్కు అంటారన్నది తెలిసిందే. ఈ టక్కుటమార విద్యను ప్రధానంగా అమ్మాయిలను ఆకర్షించడం కోసమే అంటారు అనుభవజ్ఞులు. అందుకే టక్కరులు ప్రదర్శించే ఫ్యాషను కాబట్టి దీనికి టక్కు అని పేరొచ్చిందని వ్యుత్పత్తిని బట్టి భాషావేత్తలు చెబుతుంటారు. టక్కులు పెక్కురకాలు. హృదయటక్కు. మీడియం టక్కు. లోబ్యాక్ టక్కు. బెల్‌బాటమ్స్ టైమ్‌లో గుండెకు ఇంచుమించు దగ్గరగా ఉండేది టక్కు. దీన్ని హృదయటక్కు అని పిలుచుకునేవారు. సాధన మీద ధ్యానం మూలాధారం నుంచి పైకి ప్రవహించినట్లే... ఏ సాధనా లేకుండానే టక్కు కిందికి జారింది. హృదయ టక్కు కొన్నాళ్లకు పొట్ట చేరి... ఇప్పుడు క్రమంగా నడుముకు జారింది. నడుము టక్కు లేదా లోబ్యాక్ టక్కు అన్నది ప్యాంటు నడుము కిందికి చాలా లోతుల్లోకి జారిపోతూ ఎక్కడో పాతాళంలో వేసినట్టుంది. అంతకంటే మరి కిందికి జారనివ్వవద్దని ఫ్యాషనేతరులు ఫ్యాషన్ ప్రియులను కోరుతున్నారు. బిక్కుబిక్కుమంటూ లో-వెయిస్టు టక్కరులను కోరుతున్నారు. అంతకు ముందు స్కూలు యూనీఫామ్ రూపంలో వేసే టక్కు కంటే టీనేజీలోకి వచ్చాక ఈ వయసులో టక్కుకు ఉండే ప్రాధాన్యం వేరు. ఆ దృష్టి వేరు. అందుకే ఇలాంటి బీటరులైన (బీటు కొట్టేవారైన) టక్కిస్టులు ప్రదర్శించే ట్రిక్కుటమార ఫ్యాషను కాబట్టి దీన్ని అనుసరించే వారిని టక్కరి అని పిలవవచ్చా అనేది ఒక హేతుబద్ధమైన సందేహం. నిజజీవితంలో అలాంటివారిని మనం ఎప్పుడూ చూడం గానీ... పాత సినిమాల్లో లెక్కలు చూసే గుమస్తాలు... ఒకనాటి మూవీలలోని ప్లీడర్లు చక్కగా పంచెకట్టుకుని మరీ టక్కువేసి... ఆ పంచె మీద బెల్టు కట్టేవారు. అంతకు ముందు అలవాటు లేకుండా కొత్తగా టక్కు మొదలు పెట్టినవారు కాస్త ఇబ్బంది ఇబ్బందిగా కదుల్తుంటారు. అస్తమానం టక్కు సర్దుకుంటుంటారు. ఇక టక్కుకు పునాదిలాంటి పొట్ట మరీ లోతుకుపోయినా కష్టమే. ముందుకు పొడుచుకువచ్చినా కష్టమే. కాబట్టి టక్కు అందరూ అనుకుంటున్నంత వీజీ కాదని విజ్ఞులు గ్రహించాలి. అయినా మితిమీరి మెక్కడం టక్కుకు చేటు తీసుకొస్తుందని ఫ్యాషనేతరులూ తెలుసుకోవాలి. వివాహానికి ముందు వేసిన టక్కును పెళ్లి తర్వాత కూడా కొనసాగించక తప్పదు. ఎందుకంటే ఇంతి లేని ఇల్లు... ఇన్‌షర్టు లేని డ్రస్సు చూడటానికి అంత బాగుండవని సామెత. కొందరు ఎప్పుడూ టక్కుతోనే కనిపిస్తారు. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్లుగా వీళ్లసలు టక్కుతోనే పుట్టారేమోనని డౌటొచ్చేలా ఉంటారు. వీళ్లను టక్కు లేకుండా గుర్తుపట్టలేం. వాళ్లు కూడా మనం గుర్తు పట్టేందుకు వీలుగా మన సౌలభ్యం కోసమే టక్ చేస్తారు. వీళ్లను నిత్యటక్కరులని అనుకోవచ్చు. టక్కు నాగరకతకు సూచన. కానీ మేధావులకు టక్కు నుంచి మినహాయింపు ఉంటుంది. వాళ్లు మాత్రం టక్కు వేయరు. ఈ టక్కు నిరసనకారులు కేవలం జీన్స్ మాత్రం తొడిగి దానిపై పొడవుగా, కాస్తంత ముతగ్గా ఉండే లాల్చీ వేస్తారు. లాల్చీ ముతకదనం అతడి మేధావి తనానికి అనులోమానుపాతంగా ఉంటుంది. అనగా... లాల్చి ఎంత ముతకదైతే అంత మేధావి అన్నమాట. ఇప్పుడంటే ఒకింత తగ్గిందిగానీ... గతంలో ఒక చేతి సంచీ కూడా ఈ అవతారానికి తోడయ్యేది. వీళ్లు టక్కును ఆహార్యపరంగా నిరసిస్తారు. టక్కు వేసిన వారి కంటే ఇలాంటి వారిని ‘టక్కు’న గుర్తుపట్టవచ్చు. టక్ టక్ మని తలుపు కొట్టి మాత్రమే లోపలికి ప్రవేశించాలన్నది జంటిల్మేన్ రూల్. కాబట్టి టక్ వేసుకోవడం కూడా జంటిల్మేన్ రూల్స్‌లో ఒకటిగా మారింది. టక్కుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్యాంటులోపలికి దోపుతాం కాబట్టి... అలా లోపలికి పోయే షర్టు భాగంలో ఎక్కడైనా రంధ్రం ఉన్నా, ఒకట్రెండు చిరుగులు ఉన్నా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. షర్టు కింది అంచు కుట్లు ఊడిపోయినా ఆ చొక్కాను ఉపయోగంలోకి తేవచ్చు. ఇది టక్కుకు ఉన్న సౌలభ్యం. కాకపోతే మనమైనా... ఇతరులైనా టక్కు పీకేయకుండా జాగ్రత్త పడాలి. అయితే టక్కుకు కొన్ని పరిమితులున్నాయి. కొన్ని జనరల్ రూల్స్ ఉన్నాయి. బనియన్‌కు టక్కు తప్పదు. లుంగీ మీద టక్కు నప్పదు. టక్కుకు షూ ఉండటం మేలు. చెప్పులైనా పర్లేదు. మనలో మన మాట చెప్పుల మీద టక్కు అంత ప్రభావపూర్వకంగా ఉండదు. అందుకే కొందరు షూ లేకపోవడం అనే కారణంగా టక్కు వేసుకోరు. ఇక టీ షర్టుకు, మామూలు ప్యాంటుకు టక్కు ఎంతమాత్రమూ కుదరదు. బెల్టుకూ ఇంచుమించూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇవన్నీ ఎవరూ రాయని జనరల్ రూల్స్. కానీ ఎవరికి వారు అర్థం చేసుకొని అందరూ పాటిస్తూ ఉంటారు. ఏది ఏమైనా టక్కు అంటే బంగారపు ఉంగరంలో పొదిగిన వజ్రంలాంటి ప్రెషియస్ స్టోన్ లాంటిది. వజ్రసంకల్పంతో టక్కు వేసేవారు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదీ... పడిశెం పట్టే ముక్కు ఉన్నంత కాలం ఫ్యాషన్‌లో టక్కు ఉంటుంది. - యాసీన్ -
గిన్నిస్ 'మ్యాన్ విత్ ద గోల్డెన్ షర్ట్'..!
నాసిక్‌ః అతడో వ్యాపారి, రాజకీయనాయకుడుగా పేరొందిన వ్యక్తి. అయితే అతడ్ని స్నేహితులు మాత్రం ద మ్యాన్ విత్ ద గోల్డెన్ షర్ట్ అని పిలుస్తున్నారు. ఆ సార్థక నామం వెనుక కథా కమామీషూ ఏమిటంటే... మహరాష్ట్ర నాసిక్ కు చెందిన పంకజ్ పరాఖ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించాడు. 47 ఏళ్ళ పరాఖ్ 2014 ఆగస్టు 1న 98,35,099 రూపాయల అత్యంత ఖరీదైన బంగారు షర్టును ధరించి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందాడు. నిజంగా తనకీ గౌరవం లభించడం నమ్మలేకపోతున్నానని, తనకు ఇటువంటి గుర్తింపు రావడంకన్నా.. తమ మారుమూల గ్రామం పేరు.. ప్రపంచవ్యాప్తమవ్వడం ఎంతో సంతోషంగా ఉందని పరాఖ్ చెప్తున్నాడు. పాఠశాల డ్రాపవుట్ అయిన పరాఖ్... గార్మెట్ ఫ్యాబ్రికేషన్ వ్యాపారవేత్తగానూ, కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే కాక, ముంబైకి 260 కిలోమీటర్ల దూరంలోని నాసిక్ జిల్లా యెవోలా పట్టణానికి డిప్యూటీ మేయర్ కూడ. అయితే అన్ని ప్రత్యేకతలున్న పరాఖ్.. 4.10 కిలోలు.. అంటే ప్రస్తుతం 1.30 కోట్ల రూపాయల ఖరీదుచేసే షర్లుతోపాటు, బంగారు వాచ్, గొలుసులు, ఉంగరాలు, మొబైల్ కవర్, కళ్ళద్దాలకు బంగారు ఫ్రేమ్ వంటి ఇతర వస్తువులతో కలసి సుమారు 10 కేజీల బంగారు వస్తువులను ధరించి, ఓ లైసెన్స్డ్ రివాల్వర్ చేత పట్టుకొని, ఇద్దరు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులతోపాటు యెవోలా వీధుల్లో మిరుమిట్లు గొలుపుతూ కనిపించి, అప్పట్లో అందర్నీ ప్రత్యేకంగా ఆకట్టుకోవడమే కాక.. ఏకంగా ప్రపంచ వ్యాప్త గుర్తింపును కూడ పొందాడు. రెండేళ్ళ క్రితం తన 45వ పుట్టిన రోజు సందర్భంలో... ప్రత్యేకంగా ఆ గోల్డెన్ షర్టును కుట్టించుకున్నానని, తనకు పాఠశాల వయసునుంచే బంగారం అంటే ఎంతో ఇష్టమని, అదే ఇష్టం ఏళ్ళు గడిచే కొద్దీ పాషన్ గా మారిందని పరాఖ్ చెప్తున్నాడు. నాసిక్ కు 85 కిలోమీటర్ల దూరంలోని బాఫ్నా జ్యువెలర్స్ వారు డిజైన్ చేసిన ఆ షర్టుకు, ముంబైలోని శాంతి జ్యువెలర్స్ వారు ముత్యాల హంగులద్దారని పరాఖ్ తెలిపాడు. 18 నుంచి 22 క్యారెట్ల బంగారంతో ఆషర్టు రూపొందించేందుకు సుమారు 20 మంది కళాకారులు, 3,200 గంటలు వెచ్చించారని, షర్టు... లోపలి భాగంలో మెత్తని క్లాత్ వేసి కుట్టడంతో ఎటువంటి ఇబ్బందీ లేకుండా ధరించేందుకు కూడ ఎంతో వీలుగా ఉంటుందని పరాఖ్ తెలిపాడు. అంతేకాక షర్టు ఉతికేందుకు, రిపేర్ చేసుకునేందుకు కూడ వీలుగా ఉండటంతోపాటు తనకు ఈ అరుదైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన షర్టుకు లైఫ్ టైం గ్యారంటీ ఉందని ఫరాఖ్ వెల్లడించాడు. 30 సంవత్సరాల క్రితం పేదరికం అనుభవించిన పరాఖ్ ఎనిమిదో తరగతి తర్వాత స్కూలుకు స్వస్తి చెప్పి, యెవోలాలో తల్లిదండ్రులు కొనసాగిస్తున్న చిన్నపాటి గార్మెట్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. వ్యాపారాభివృద్ధిలో ఒక్కో అడుగు ముందుకేస్తూనే రాజకీయాల్లోనూ ప్రవేశించి, 1982 లో మొదటిసారి మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యాడు. 25 ఏళ్ళక్రితం తన పెళ్ళిలో వధువు కన్నా ఎక్కువ బంగారం ధరించడంతో అందరూ తనను వింతగా చూశారని ఈ సందర్శంలో పరాఖ్ గుర్తు చేసుకున్నాడు. తన ఇష్టమే ఇప్పుడు ఇంతటి గౌరవాన్ని తెచ్చిపెడుతుందని ఊహించలేదని, ఇప్పటికీ బంగారంపై అదే ఇష్టం ఉన్న తాను... పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు వెళ్ళినపుడు సుమారు మూడున్నర కేజీల బరువుండే బంగారు ఆభరణాలను ధరించి వెడతానని, తన భార్య మాత్రం 50 గ్రాములకు మించి ఆభరణాలు ధరించదని చెప్తున్నాడు. మానవత్వానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చే పరాఖ్... సామాజిక సేవ, విద్యా సంబంధిత కార్యక్రమాల్లో అధికంగా పాల్గొంటుంటాడు. మొత్తం ఖర్చును తానే వెచ్చించి, గత ఏడేళ్ళలో రాజస్థాన్ ఉదయపూర్ లోని ప్రముఖ నారాయణ్ సేవా సంస్థాన్ ఆస్పత్రిలో సుమారు 150 పోలియో ఆపరేషన్లను చేయించాడు. ప్రతి సంవత్సరం ఓ వారం పాటు తన సమయాన్ని వెచ్చించి, ప్రత్యేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని, పేద రోగులకు ఆర్థిక సహాయం, ఆహారం, మందులు అందించి.. పరాఖ్ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు.