సాధారణంగా సిసీ సెలెబ్రెటీలకు ఖరీదైన డ్రెస్సులు..కొత్త కొత్త వాచీలు, షూలు ధరించడం అలవాటు. కొంతమంది బడా హీరోహీరోయిన్లు అయితే.. కోట్లు విలువ చేసే వాచీలను సైతం ధరిస్తుంటారు. ఇక డ్రెస్సుల గురించి చెప్పనక్కర్లేదు. ట్రెండ్ ఫాలో అవుతూ షా ఖరీదైన దుస్తులను వాడుతుంటారు. ఒక్కసారి ధరించిన డ్రెస్‌ని కొన్ని వారాల వరకు ధరించరు. కొంతమంది అయితే రోజుకో డ్రెస్ మారుస్తుంటారు.
కానీ మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ మాత్రం ఓ షర్ట్‌ని ఎనిమిది ఏళ్లుగా వాడుతున్నాడు. 2016లో కొన్న ఆ షర్ట్‌ని ఇప్పటికే ధరిస్తున్నారు. తాజాగా డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి దిగిన ఫోటోలో సైతం చెర్రీ ఆ షర్ట్‌తోనే కనిపించాడు. దీంతో ప్రస్తుతం చెర్రీ షర్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
(చదవండి: వాళ్లు హర్ట్ అయ్యారు.. హీరోయిన్ నయనతార భర్తకు నోటీసులు!)
2016లో ‘ధృవ’ సినిమాలో చరణ్ ఆ షర్ట్‌తో కనిపించాడు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలో..ప్రమోషన్స్ సమయంలోనూ అదే షర్ట్ ధరించి కనిపించారు. అలాగే లాక్ డౌన్ సమయంలోనూ అదే షర్ట్ చాలా సార్లు ధరించి కనిపించారు. 2016 నుంచి 2024 వరకు ఏ ఏ సందర్భంలో చరణ్ ఆ షర్ట్‌ని ధరించారో తెలుపుతూ ఓ ఫోటోని క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. చరణ్ సింప్లిసిటీ చూసి మెగా ఫ్యాన్స్‌తో పాటు మిగతా నెటిజన్స్ కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా ఈ ఏడాదిలో విడుదలయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment