
కర్ణభేరి పగిలి ఎడమ చెవి పాడైన వైనం
టక్ చేయలేదన్న ఒకే ఒక్క కారణంతో పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయిన ఉపాధ్యాయుడు విద్యార్థిని చితకబాదిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఎడమ చెవిపై గట్టిగా కొట్టడంతో కర్ణభేరి పగిలింది. దాంతో ఆ చెవి శాశ్వతంగా వినికిడి సామర్థ్యం కోల్పోయింది. సీసీటీవీ ఫుటేజీతో ఈ ఘటన వెలుగులోకి రావడంతో టీచర్‌పై పిల్లాడి తల్లిదండ్రులు ఫిర్యాదుచేశారు.
నిర్లక్ష్యంగా సమాధానమిచి్చన టీచర్‌ను తల్లిదండ్రులు పోలీసుల ఎదుట చితక్కొట్టారు. కంప్యూటర్ సబ్జెక్ట్ బోధించే సందేశ్ బోసాలే సెప్టెంబర్ 27న ఆరో తరగతి గదిలో ఓ విద్యార్థి టక్ చేసుకోకపోవడం గమనించి కోపంతో కొట్టాడు. మెడ పట్టి క్లాసు నుంచి గెంటేశాడు. దెబ్బలకు బాలుని ముక్కు, ఎడమ చెవి నుంచి రక్తం కారింది. ఇంటికెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పాడు.
వెంటనే ఆస్పత్రికి తరలించగా ఎడమ చెవి కర్ణభేరి పగిలిందని వైద్యుడు చెప్పాడు. కుటుంబసభ్యులు స్కూలు యాజమాన్యాన్ని నిలదీసినా తమకు సంబంధం లేదన్నారు. దాంతో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన సలహాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి ఇరు వర్గాలను స్కూలుకు పిలిపించారు. అప్పటికే కోపంతో ఉన్న కుటుంబసభ్యులు, నవనిర్మాణ్ సేన కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే టీచర్‌ను చితకబాదారు.
महाराष्ट्र के पुणे में पहले टीचर ने छात्र को पीटा, फिर मनसे और छात्र के परिजनों ने टीचर को पीटा! केस दर्ज
छात्र का शर्ट इन नहीं था pic.twitter.com/NZ5fwgTX8R— Avinash Tiwari (@TaviJournalist) October 6, 2024