పాఠశాలలో విద్యార్థులకు మంచి ప్రవర్తన నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు అమానుషంగా ప్రవర్తించింది. చిన్నారులకు చదువు చెప్పించి, వారిని ఉన్నత స్థాయికి చేర్చేందుకు తోడ్పడాల్సిన టీచరే హద్దుమీరి ప్రవర్తించింది. పుట్టిన రోజు నాడే ఓ విద్యార్థితో అతడి వాంతిని తినిపించింది. ఈ షాకింగ్ ఘటన చైనాలోని లయోనింగ్ ప్రావిన్స్‌లో సెప్టెంబర్ 15న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మలువాన్ కిండర్ గార్టెన్ పాఠశాలలో ఆరేళ్ల బాలుడు నర్సరీ చదువుతున్నారు. సెప్టెంబర్ 15న తన పుట్టిన రోజు కావడంతో కొత్త దుస్తులు ధరించి స్కూల్‌కు వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత.. టీచర్ అతడికి బలవంతంగా గుమ్మడికాయ ముక్కలు తినిపించారు. అప్పటికే బాలుడు ఎక్కువ తినడంతో వెంటనే వాంతులు చేసుకున్నాడు. దీంతో టీచర్ అతడిని వాంతిని తినాలని ఆదేశించింది.
ఇంటికి చేరుకున్న బాలుడు తనకు జరిగిన విషయాన్ని నానమ్మకు చెప్పాడు. దీంతో పిల్లాడి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం దృష్టికి ఈ ఘటనను తీసుకెళ్లారు. నర్సరీ టీచర్ ప్రవర్తనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, బాలుడికి బలవంతంగా తినిపించడంతోనే వాంతింగ్ చేసుకున్నట్లు నిర్ధారించారు. ఇక బాధిత బాలుడి తల్లిదండ్రులు పాఠశౄల యాజమాన్యం క్షమాపణలు కోరింది. అదే విధంగా సదరు టీచర్‌ను విధుల నుంచి బహిష్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment