vomit
-
షాకింగ్: బర్త్ డే రోజు.. విద్యార్థితో బలవంతంగా వాంతిని తినిపించిన టీచర్
పాఠశాలలో విద్యార్థులకు మంచి ప్రవర్తన నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు అమానుషంగా ప్రవర్తించింది. చిన్నారులకు చదువు చెప్పించి, వారిని ఉన్నత స్థాయికి చేర్చేందుకు తోడ్పడాల్సిన టీచరే హద్దుమీరి ప్రవర్తించింది. పుట్టిన రోజు నాడే ఓ విద్యార్థితో అతడి వాంతిని తినిపించింది. ఈ షాకింగ్ ఘటన చైనాలోని లయోనింగ్ ప్రావిన్స్‌లో సెప్టెంబర్ 15న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మలువాన్ కిండర్ గార్టెన్ పాఠశాలలో ఆరేళ్ల బాలుడు నర్సరీ చదువుతున్నారు. సెప్టెంబర్ 15న తన పుట్టిన రోజు కావడంతో కొత్త దుస్తులు ధరించి స్కూల్‌కు వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత.. టీచర్ అతడికి బలవంతంగా గుమ్మడికాయ ముక్కలు తినిపించారు. అప్పటికే బాలుడు ఎక్కువ తినడంతో వెంటనే వాంతులు చేసుకున్నాడు. దీంతో టీచర్ అతడిని వాంతిని తినాలని ఆదేశించింది. ఇంటికి చేరుకున్న బాలుడు తనకు జరిగిన విషయాన్ని నానమ్మకు చెప్పాడు. దీంతో పిల్లాడి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం దృష్టికి ఈ ఘటనను తీసుకెళ్లారు. నర్సరీ టీచర్ ప్రవర్తనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, బాలుడికి బలవంతంగా తినిపించడంతోనే వాంతింగ్ చేసుకున్నట్లు నిర్ధారించారు. ఇక బాధిత బాలుడి తల్లిదండ్రులు పాఠశౄల యాజమాన్యం క్షమాపణలు కోరింది. అదే విధంగా సదరు టీచర్‌ను విధుల నుంచి బహిష్కరించింది. -
విమానంలో ప్రయాణికుడి రచ్చ.. ఫ్లోర్‌పైనే వాంతులు, మూత్ర విసర్జన
న్యూఢిల్లీ: విమానంలో ప్రయాణికులు అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విమానంలో కొందరు ప్రయాణికుల పిచ్చి చేష్టలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన పలు సంఘటనలు మరవక ముందే తాజాగా మరొకటి వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి గాల్లోని విమానంలో హంగామా సృష్టించాడు. గువాహతి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు వాంతులు చేసుకున్నాడు. అంతేగాక టాయిలెట్ బయటే మల వి'ర్జన చేశాడు. తాగిన మైకంలో సదరు వ్యక్తి రెస్ట్రూమ్ నుంచి బయటకు వచ్చి ఫ్లోర్‌మీదే మూత్ర విసర్జన చేశాడు. ప్రయాణికుడు వ్యవహరించిన తీరుతో సీట్ల మధ్య నడిచే దారంతా అపరిశుభ్రంగా మారింది. తాగుబోతు ప్రవర్తనతో తోటి ప్రయాణికులందరూ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఈ ఘటన మార్చి 26న ఇండిగో విమానం 6E 762లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతరం విమానంలోని మహిళా సిబ్బంది వెంటనే స్పందించి అక్కడంతా శుభ్రం చేయాల్సి వచ్చింది. ప్రయాణికుడు చేసిన రచ్చను మహిళ క్లీన్ చేస్తున్న దృశ్యాలను తోటి ప్రయాణికుడు భాస్కర్ దేవ్ కొన్వర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఫ్లోర్ క్లీన్ చేసిన మహిశా సిబ్బందిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ‘ఏ పరిస్థితినైనా మహిళలు చక్కగా నిర్వహించగలరు. సెల్యూట్ గాళ్ పవర్’ అంటూ కొనియాడుతున్నారు. మరోవైపు విమానంలో అనుచితంగా ప్రవర్తించిన అతడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Indigo 6E 762 : Guwahati to Delhi.Intoxicated passenger vomited on the aisle and defecated all around the toilet.Leading lady Shewta cleaned up all the mess and all the girls managed the situation exceptionally well.Salute girl power🙏#Indigo #girlpower #DGCA pic.twitter.com/iNelQs48Tc — Bhaskar Dev Konwar @BD (@bdkonwar) March 26, 2023 -
Whale Vomit: వాంతి విలువ రూ.28 కోట్లు!
తిరువనంతపురం: ఛీ.. ఏంటిది? నిజమేనా.. వాంతికి కోట్లు పలకడం ఏమిటని అవాక్కవుతున్నారా? ఏదైనా పడనిది.. పనికిరానిది తిన్నప్పుడు వాంతి రావడం సహజమే.. శరీరమే విసర్జించిన దాంట్లో విలువైనది ఏముంటుందబ్బా అని తెగ ఆలోచిస్తున్నారా? అంత బుర్రబద్దలు కొట్టుకోకండి.. ఎందుకంటే ఇది మనుషుల వాంతి కాదు.. ఓ భారీ తిమింగలానిది. కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని వంజిమ్లో కొందరు జాలర్లు తాజాగా సముద్రంలో చేపల వేటకు వెళ్లగా వారి వలకు ఏదో చిక్కింది. దీంతో సంబరపడ్డ వారు వలను లాగి చూడగా అందులో ఏకంగా 28.4 కిలోల బరువైన స్పర్మ్ వేల్ వాంతి కనిపించింది! అంతరించే దశలో ఉన్న ఈ జాతి తిమింగలాలకు చెందిన పదార్థాలను విక్రయించడాన్ని కేంద్రం వన్యప్రాణి పరిరక్షణ చట్టం కింద నిషేధించడంతో జాలర్లు పోలీసులకు అప్పగించారు. వారు దాన్ని అటవీ అధికారులకు ఇవ్వగా ఆ అధికారులు అది తిమింగలం వాంతా కాదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీకి తరలించారు.పర్ఫ్యూమ్ల తయారీలో ఉపయోగించే తిమింగలం వాంతి కిలో ధర అంతర్జాతీయ మార్కెట్లో రూ. కోటి వరకు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ లెక్కన జాలర్లకు దొరికిన తిమింగలం వాంతి విలువ రూ. 28 కోట్లకుపైనే ఉంటుందని లెక్కగట్టాయి. ఇదీ చదవండి: ఇదీ లక్కంటే.. అప్పులపాలై ఇల్లు అమ్మకానికి పెట్టగా రూ.కోటి లాటరీ -
ఖైరతాబాద్: తిమింగలం వాంతి పేరుతో మోసం..
సాక్షి, హైదరాబాద్: సుగంధ ద్రవ్యాల్లో వాడే అంబర్గ్రిస్(తిమింగళం వాంతి) పేరుతో మోసాలకు పాల్పడున్న ముఠాను ఖైరతాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంబర్గ్రిస్ పేరుతో నకిలీ పదార్థం అమ్మేందుకు యత్నించిన ఏడుగురు సభ్యుల గల ముఠాను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలక్ట్రానిక్స్‌లో అతికించేందుకు వాడే గమ్ లాంటి పదర్థాన్ని అంబర్‌గ్రిస్‌గా చూపుతూ ఈ గ్యాంగ్ మోసాలకు తెగబడుతుంది. ఖైరతాబాద్‌లోని ఎస్బీఐ వీధిలో ఓ గదిని కార్యాలయంగా మార్చుకుని వీరు మోసాలకు పాల్పడుతున్నారు. మొత్తం ఏడుగురు నిందితులను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీర్ అలీ, షేక్ అలీ, మహమ్మద్ ఆరిఫ్ మహమ్మద్ నజీర్, మోహన్‌లాల్ యాదవ్, మహమ్మద్ అజారుద్దీన్, మహమ్మద్ హుస్సానుద్దీన్లు గ్యాంగ్‌గా ఏర్పడి.. ఈ తరహా మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి నకిలీ సామగ్రిని స్వాధీనం చేసుకుని.. దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: కాలికి తగిలిన అదృష్టం.. ఏకంగా రూ.1.8 కోట్లు -
సుడి తిరిగింది.. కళేబరం కడుపున కోట్లు!
అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. అలాగే ఆలస్యం చేస్తే ఆ అదృష్టం అందకుండా పోవచ్చు కూడా. కానీ, యెమెన్‌లో కొందరు జాలర్లు అదృష్టాన్ని అమాంతం ఒడిసి పట్టుకున్నారు. రాత్రికి రాత్రే కోట్లు సంపాదించారు. ఆ దక్కిన దానితో ఊరును బాగుచేసేందుకు ఖర్చు చేస్తున్నారు కూడా. యెమెన్: చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన జాలర్ల గుంపుకి జాక్‌పాట్ తగిలింది. చనిపోయిన ఓ భారీ తిమింగలం కడుపు నుంచి విలువైన వస్తువును వెలికి తీశారు. దీంతో అది వాళ్ల తలరాతనే మార్చేసింది. అల్-ఖైసా గ్రామానికి చెందిన కొందరు జాలర్లకు గల్ఫ్ ఆడెన్ సమీపంలో చేపల వేటకు వెళ్లారు. ఆ టైంలో చచ్చిన భారీ తిమింగలం కళేబరం సముద్రంపైన తేలుతూ కనిపించింది. వెంటనే 35 మంది జాలర్లు.. ఆ కళేబరాన్ని అతికష్టం మీద ఒడ్డుకు లాక్కొచ్చారు. చివరికి దాన్ని చీల్చగా.. అత్యంత విలువైన అంబర్గ్రిస్ బయటపడింది. సముద్రపు బంగారం అంబర్గ్రిస్ అంటే తిమింగలం వాంతి. తిమింగలం జీర్ణించుకోలేని వాటిని కడుపులో ఘన పదార్థంగా మైనపు పదార్థం రూపంలో నిల్వ ఉంచుకుంటుంది. ఒక్కోసారి వాంతి రూపంలో వెలువడి నీళ్లలో తేలుతుంది. లేదంటే చనిపోయాక(వేటాడతారు కూడా) దాని కడుపు నుంచి బయటకు వస్తుంది. దీనిని సెంట్ల తయారీలో ఉపయోగిస్తారు. కాబట్టే భారీ డిమాండ్ ఉంటుంది. ఇక యెమెన్ జాలర్లకు స్పెర్మ్ వేల్ కడుపులో 127కేజీల బరువు అంబర్గ్రిస్ కనిపించింది. అది విలువైందని వాళ్లకు తెలుసు. కాబట్టి ఓ దుబాయ్ డీలర్ సాయంతో మార్కెట్లో దాన్ని అమ్మేశారు. అంబర్గ్రిస్ అమ్మేయాగా సుమారు రూ.10కోట్లు సొమ్ము వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ సొమ్మును ఆ 35 మంది పంచుకోవడంతోనే ఆపకుండా.. తమ కమ్యూనిటీలోని మరికొందరికి ఆర్థిక సాయం చేశారు. ఊరును బాగు చేసుకున్నారు కూడా. ఇక సువాసన వెదజల్లే అంబర్గ్రిస్కి చైనా, జపాన్, ఆఫ్రికా, అమెరికా, గల్ప్ దేశాల పముద్ర తీరాల్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఆ జనవరిలో థాయ్‌లాండ్‌లో 20 ఏళ్ల ఓ కుర్రాడికి అంబర్గ్రిస్ ముద్ద దొరకడంతో కోటీశ్వరుడు అయ్యాడు. చదవండి: పోర్న్ తీయాలనుకున్న ఆ స్టార్ దర్శకుడెవరు? -
కాలికి తగిలిన అదృష్టం.. ఏకంగా రూ.1.8 కోట్లు
బ్యాంకాక్: వాంటింగ్.. కక్కు వినగానే ముఖం అదోలా పెడతాం. ఆ దృశ్యం చూడాలన్న కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ కక్కుతో లక్కు కలిసొచ్చిన సంఘటన గురించి ఎప్పుడైనా విన్నారా. వాంతికి చేసుకుంటే.. అదృష్టం కలసిరావడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇది చదవండి. థాయ్‌లాండ్‌కు చెందిన సిరిపోర్న్ నియామ్రిన్(49) కొద్ది రోజుల క్రితం బీచ్‌లో నడుచుకుంటూ వెళ్తోంది. సడెన్‌గా ఆమె కాళ్లకు ఏదో తగిలింది. సముద్రపు జీవి అనుకుంటూ కిందకు వంగి చూసింది. నీచు వాసన వస్తుండటంతో చేపల జాతికి చెందిన జీవిగా భావించింది. ధైర్యం చేసి పట్టుకోగా చేతికి గట్టగా తగిలింది.. దాంతో ఇది ఏదో విలువైన వస్తువే అయి ఉంటుందని భావించి.. దాన్ని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లింది నియామ్రిన్. ఇంటికి పక్కల వారిని పిలిచి.. తాను తీసుకొచ్చిన వస్తువు/పదార్థం ఏంటో గుర్తించాల్సిందిగా కోరింది నియామ్రిన్. వారు దాన్ని నిశితంగా పరిశీలించి ఆశ్చర్యానికి గురయ్యారు. నియామ్రిన్ దరిద్రం తీరిపోయిందని.. త్వరలోనే ఆమె కోటీశ్వరురాలు కాబోతుందని తెలిపారు. వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక నియామ్రిన్ తడబడింది. ఆ తర్వాత వారు చెప్పిన విషయం విని ఆమెకు షాక్‌తో నోట మాట రాకుండా పోయింది. ఇంతకు నియామ్రిన్కు బీచ్‌లో దొరికిన వస్తువు ఏంటంటే తిమింగలం వాంటింగ్. కక్కిన తర్వాత అది ఇలా గట్టిగా మారిపోయింది. ఇక మార్కెట్లో తిమింగలం వాంతికి ఫుల్ డిమాండ్. భారీగా ధర పలుకుతుంది. ఇక నియామ్రిన్కు దొరికిన తిమింగలం వాంతి ముద్ద 12 ఇంచుల వెడల్పు, 24 ఇంచుల పొడవు ఉంది. దీని ధర సుమారు1.86 లక్షల పౌండ్లు. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారుగా 1.8 కోట్ల రూపాయలు. నియామ్రిన్ మాట్లాడుతూ ‘‘ఇది నిజంగా తిమింగలం వాంతేనా.. కాదా అనే విషయం గురించి చెప్పడానికి నిపుణులను ఆహ్వానించాను. ఇది నిజమైన తిమింగలం వాంతికే అంటే.. ఇక నా ఆర్థిక స్థితి ఎంతో మెరుగవుతుంది. దీన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో నా చుట్టు ఉన్న వారికి సాయం చేస్తాను. ఇది నాకు భారీగా డబ్బు ఇస్తుందని భావిస్తున్నాను. ప్రస్తుతం దీన్ని నా ఇంట్లోనే భద్రంగా దాచాను’’ అని తెలిపింది. స్పెర్మ్ తిమింగలాలు వ్యవస్థలో ఈ వాంతికి తయారవుతుంది. దీనికి ఇంత డిమాండ్ ఎందుకంటే.. పర్ఫ్యూమ్స్ తయారిలో వినియోగిస్తారు. ఇలా తయారు చేసిన పర్ఫ్యూమ్స్ ఎక్కువ సేపు సువాసన వెదజల్లుతాయి. చదవండి: షాకింగ్ వీడియో: ‘నువ్వు నిజంగా మూర్ఖుడివి’ -
వాంతి కోసం తల బయట పెడితే..
► చేయి తెగి పడింది తలకూ గాయాలు నూజివీడు : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న బాలిక కిటికీలో నుంచి వాంతి చేసుకుంటుండగా ఎదురుగా వస్తున్న లారీ తగిలి తీవ్రంగా గాయపడిన ఘటన బుధవారం వెంకట్రాదిపురంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం చౌడవరానికి చెందిన సజ్జా నాగసౌందర్య(12) వాళ్ల అమ్మతో కలిసి ఇటీవల బంధువుల ఇంటికి వచ్చారు. తిరిగి వారి గ్రామం వెళ్లేందుకు నూజివీడులో సత్తుపల్లి బస్సు ఎక్కారు. బస్సు వెంకటాద్రిపురం వెళ్లే సరికి బాలికకు వాంతులు అవుతుండటంతో బస్సులో వెనుకభాగంలోని సీట్లో కూర్చుని కుడివైపు కిటికీలోంచి తల పెట్టి వాంతి చేసుకుంటోంది. ఇంతలో హఠాత్తుగా లారీ దూసుకురావడంతో తగలడంతో బాలిక కుడి మోచేయి తెగి పడింది. తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బస్సును నిలిపివేసి 108 వాహనంలో బాలికను నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించి అక్కడ ప్రథమచికిత్స నిర్వహించారు. ఆ తరువాత తెగిపడిన చేతితోపాటు బాలికను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. పోలీసుల అదుపులో లారీ డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే లారీని ఆపకుండా వెళ్లిపోతున్న డ్రైవర్‌ను బస్సు డ్రైవర్ వెంబడించి నూజివీడు మండలం అన్నవరం వద్ద అడ్డుకున్నాడు. అనంతరం పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించారు. నందిగామ ప్రాంతానికి చెందిన లారీ మహారాష్ట్ర నుంచి ముదినేపల్లికి లోడుతో వెళ్తోంది. లారీడ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రూరల్ పోలీస్‌స్టేషన్ ఏఎస్ఐ శాగం రాధాకృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీని, బస్సును స్టేషన్‌కు తరలించారు. -
కలర్ ఫుల్ వాంతిలా.. ఆస్ట్రేలియన్ కరెన్సీ నోటు
ఆస్ట్రేలియా బ్యాంకు ఓ కొత్త డాలర్ నోటును ఆవిష్కరించింది. దీనిలో ప్రత్యేకత ఏముంది. సెంట్రల్ బ్యాంకులన్నాకా బ్యాంక్ నోటులు విడుదల చేస్తాయిగా అనుకుంటున్నారా! మరి అదేనండి, ఆ బ్యాంకు తయారుచేసిన కొత్త డాలర్ నోట్ డిజైన్ కలర్ ఫుల్ వాంతిని తలపిస్తుందని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ఆవిష్కరించిన ఆ నోటు, ఆస్ట్రేలియన్ డాలర్ బ్యాంకు నోట్లల్లో అతి చిన్నది. ఈ నోట్ ఆవిష్కరించినప్పటి నుంచి దానిపై ఎవరికి తోచిన రీతిలో వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకరు వికారంగా ఉంది అంటే, మరొకరు కలర్ ఫుల్ వాంతిలాగా ఉందంటున్నారు. అయితే ఇప్పటినుంచి కొత్తగా విడుదలచేసే బ్యాంకు నోటులపైనా వివిధ జాతుల ఆస్ట్రేలియన్ వాట్టిల్, స్థానిక పక్షితో చిత్రీకరిస్తామని దేశ రిజర్వు బ్యాంకు గవర్నర్ గ్లెన్ స్టీవ్స్ తెలిపారు.దీన్ని పక్షి ప్రేమికులు నుంచి సోషల్ మీడియా యూజర్ల వరకూ అందరూ విమర్శిస్తున్నారు. కొత్తగా ఆవిష్కరించిన ఐదు డాలర్ల నోట్‌కు పక్కల బ్లూఇస్ షేడ్స్, ప్రకాశవంతమైన నీలం,పసుపు, ఊదా, గులాబీ రంగుల కలగలుపుగా రూపొందించారు. ఆ దేశ రిజర్వు బ్యాంకు దీన్ని ఆవిష్కరించినప్పటి నుంచి కామెంట్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.’మా కొత్త ఐదు డాలర్ల నోట్ వాంతి లాగా కనిపిస్తుంది’ అని ట్విట్టర్లో పోస్టు చేస్తున్నారు.అయితే ఈ విమర్శలను ఓ ట్విట్టర్ యూజర్ అనువుగా చేసుకున్నాడు. ఎవరైతే ఈ నోట్‌ను అసహ్యహించుకుంటారో వారు తనకు ఆ నోట్లు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాడు. -
....చూస్తేనే వాంతి వస్తోంది!
సైబర్ సిక్నెస్... ఆధునిక యుగంలో ఓ కొత్త వ్యాధిగా మారింది. ముఖ్యంగా టెక్నాలజీని అధికంగా వాడేవాళ్ళలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాధితో బాధపడేవారు నీరస పడిపోవడంతో పాటు... ముఖ్యంగా ల్యాప్ టాప్ లు, ఫోన్లు వాడిన వెంటనే వీరిలో వాంతి లక్షణాలతో కూడిన అనారోగ్యం చోటు చేసుకోవడం కనిపిస్తోంది. ఇప్పుడు టెక్నాలజీని వాడుతున్న జనాభాలో 80 శాతం మందిని ఈ సైబర్ సిక్నెస్ వేధిస్తోంది. స్కైప్, ఫేస్ బుక్, ఈ మెయిల్ వంటి ఆధునిక టెక్నాలజీ పుణ్యమాని ఢెభ్భై ఏళ్ళ అమ్మమ్మలు, తాతలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంధుమిత్రులతో, స్నేహితులతో టచ్ లో ఉండగల్గుతున్నారు. ''మా కూతురు దుబాయ్ లో, మా అక్క ఫ్రాన్స్ లో, మా బంధువులు చాలా మంది ఆస్ట్రేలియాలో ఉన్నారు. వారందరినీ స్క్రీన్ లో చూసి మాట్లాడగల్గుతున్నాను. వాళ్ళెక్కడున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ చూడగల్గుతున్నాను'' అంటుంది ఆగ్నేయ వేల్స్ లోని మన్‌మౌత్ షైర్ దేశానికి చెందిన 76 ఏళ్ళ జూన్. ఆమె తన వారందరితో సంబంధ బాంధవ్యాలను పెంచుకునేందుకు టెక్నాలజీని పెద్ద ఆయుధంగా వాడుకుంటోంది. అంతేకాదు ఆమె ఒకప్పుడు ఐబీఎం లో కంప్యూటర్ ప్రోగ్రామర్ గా కూడా పనిచేసింది. అయితే ప్రస్తుతం జూన్ సైబర్ సిక్నెస్ తో బాధపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎనభై శాంతం మందిలో కనిపిస్తున్న ఈ వ్యాధి ఇప్పుడు జూన్ కూ సంక్రమించింది. కాసేపు టచ్ స్క్రీన్ ఫోన్లో మాట్లాడినా, కొద్ది సెకన్లు ల్యాప్ టాప్ ను చూసినా కడుపులో తిప్పడం, వాంతి వచ్చినట్టు అనిపించడం ఇప్పడు జూన్ ను వేధిస్తున్నాయి. ముఖ్యంగా వాంతి వచ్చినట్లు అనిపించడం, తలతిప్పడం, తలనొప్పి వంటివి సైబర్ సిక్నెస్ లక్షణాలు. స్క్రీన్ లో వచ్చే కదలికలకు మెదడు స్పందింస్తుంది. కానీ శరీరం పెద్దగా స్పందించదు. ఇటువంటి సందిగ్ధావస్థలో కడుపులో తిప్పడం, వాంతి వచ్చినట్లు అనిపించడం జరుగుతుంది. ఇటువంటి మార్పులు ఏ వయసులోనైనా వచ్చే అవకాశం ఉంది. తైవాన్ లోని కావ్ షూయింగ్ విశ్వవిద్యాలయం అధ్యయనకారులు ఏభైమందిపై చేసిన ప్రయోగంలో భాగంగా... కన్సోల్ గేమ్ ను 50 నిమిషాల పాటు ఆడమన్నారు. అలా అడిన వారందరూ ఆపిన వెంటనే నీరసంగా ఫీలయ్యారు. అందులో సగంకంటే ఎక్కువ మంది.. ముఖ్యంగా పిల్లల్లో 56 శాతంమంది కడుపులో తిప్పినట్లుగా ఉందన్నారు. అలాగే మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో చేపట్టిన మరో అధ్యయనంలో గేమ్ కన్సోల్ సిక్నెస్ పురుషుల్లో కంటే, మహిళల్లో ఎక్కువశాతం ఉంటుందని, ఇదికూడ సైబర్ సిక్నెస్ వంటిదేనని తేల్చారు. ఇటువంటి లక్షణాలవల్ల చాలామంది ఆన్ లైన్లో పేపర్ చదవడం, స్కైప్ లో మాట్లాడటం కూడ చేయలేకపోతున్నారు. అలాగే ల్యాప్ టాప్ లో స్క్రీన్ కదిపినా, ఫ్లాష్ చేసినా కూడ తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. టెక్నాలజీ ఇండస్ల్రీ ఇటువంటి సమస్యలను గత ముఫ్ఫై ఏళ్ళుగా ఎదుర్కొంటోందని.. కావెంట్రీ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ మొబిలిటీ అండ్ ట్రాన్స్ పో్ర్ట్ సీనియర్ లెక్చరర్ డాక్టర్ సైరియల్ డైల్స్ అంటున్నారు. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ వాడకంవల్ల మోషన్ సిక్నెస్ వస్తోందని, కొందరు అతి సున్నితత్వంవల్ల కూడ ఈ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. కంప్యూటర్ స్క్రీన్ చూడ్డం వల్ల వచ్చిన సమస్యతో కొందరు ఉద్యోగాలు కూడ చేయలేకపోతున్నారని సైరియల్ చెప్తున్నారు. అలాగే కొన్నాళ్ళక్రితం తాను తీవ్ర మైగ్రేన్ తో బాధపడ్డానని అది ఫోన్ వల్ల వస్తోందని గమనించానని, ఇప్పుడు గర్భంతో ఉన్న తనకు కనీసం కంప్యూటర్ స్క్రీన్ దూరంనుంచీ చూస్తే కూడా వాంతి వస్తోందని అంటోంది మరో మహిళ. ఇటువంటి లక్షణాలన్నీకనుగుడ్లు ఎక్కువగా తిప్పడంవల్ల మెదడు కదలికలకు భంగం కలుగుతుందని, దాని కారణంగానే కళ్ళు తిరిగినట్లుగా, వాంతి వచ్చినట్లుగా ఉంటుందని లండన్ కంటి ఆసుపత్రిలోని ఆప్తమాలజిస్ట్ బాబీ క్వెషి చెప్తున్నారు. ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి కళ్ళు మూసుకొని, స్క్రీన్ చూడటానికి బ్రేక్ ఇవ్వాలని, అంతేకాక కాస్త దూరం నుంచి చూసే అలవాటు చేసుకోవడంవల్ల కొంత శ్రమ తగ్గుతుందని ఆమె చెప్తున్నారు. వీలైంతవరకూ ఎక్కువ సమయం ఐపాడ్స్, ఫోన్లు చూడడం మానుకోగల్గితే సైబర్ సిక్నెస్ కు దూరంగా ఉండొచ్చని ఆమె సలహా ఇస్తున్నారు.