ఆస్ట్రేలియా బ్యాంకు ఓ కొత్త డాలర్ నోటును ఆవిష్కరించింది. దీనిలో ప్రత్యేకత ఏముంది. సెంట్రల్ బ్యాంకులన్నాకా బ్యాంక్ నోటులు విడుదల చేస్తాయిగా అనుకుంటున్నారా! మరి అదేనండి, ఆ బ్యాంకు తయారుచేసిన కొత్త డాలర్ నోట్ డిజైన్ కలర్ ఫుల్ వాంతిని తలపిస్తుందని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ఆవిష్కరించిన ఆ నోటు, ఆస్ట్రేలియన్ డాలర్ బ్యాంకు నోట్లల్లో అతి చిన్నది. ఈ నోట్ ఆవిష్కరించినప్పటి నుంచి దానిపై ఎవరికి తోచిన రీతిలో వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకరు వికారంగా ఉంది అంటే, మరొకరు కలర్ ఫుల్ వాంతిలాగా ఉందంటున్నారు.
అయితే ఇప్పటినుంచి కొత్తగా విడుదలచేసే బ్యాంకు నోటులపైనా వివిధ జాతుల ఆస్ట్రేలియన్ వాట్టిల్, స్థానిక పక్షితో చిత్రీకరిస్తామని దేశ రిజర్వు బ్యాంకు గవర్నర్ గ్లెన్ స్టీవ్స్ తెలిపారు.దీన్ని పక్షి ప్రేమికులు నుంచి సోషల్ మీడియా యూజర్ల వరకూ అందరూ విమర్శిస్తున్నారు.
కొత్తగా ఆవిష్కరించిన ఐదు డాలర్ల నోట్కు పక్కల బ్లూఇస్ షేడ్స్, ప్రకాశవంతమైన నీలం,పసుపు, ఊదా, గులాబీ రంగుల కలగలుపుగా రూపొందించారు. ఆ దేశ రిజర్వు బ్యాంకు దీన్ని ఆవిష్కరించినప్పటి నుంచి కామెంట్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.’మా కొత్త ఐదు డాలర్ల నోట్ వాంతి లాగా కనిపిస్తుంది’ అని ట్విట్టర్లో పోస్టు చేస్తున్నారు.అయితే ఈ విమర్శలను ఓ ట్విట్టర్ యూజర్ అనువుగా చేసుకున్నాడు. ఎవరైతే ఈ నోట్ను అసహ్యహించుకుంటారో వారు తనకు ఆ నోట్లు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాడు.
కలర్ ఫుల్ వాంతిలా.. ఆస్ట్రేలియన్ కరెన్సీ నోటు
Published Wed, Apr 13 2016 1:37 PM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM
Advertisement