Colourful
-
దేశమంతటా క్రిస్మస్ వెలుగులు.. చర్చిలు శోభాయమానం!
దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోని చర్చిల్లో ఆకర్షణీయమైన అలంకరణలు చేశారు. కోల్‌కతాలోని చర్చిలు రంగురంగుల దీపాలతో కళకళలాడాయి. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లను మరింతగా పెంచారు. క్రిస్మస్తో పాటు రానున్న న్యూ ఇయర్ సందర్భంగా పర్యాటక ప్రదేశాల్లో జనం రద్దీ మరింతగా పెరిగింది. #WATCH | Kerala: Streets of Thiruvananthapuram all decked up with decorative lights on #Christmaseve pic.twitter.com/kn8jam5yqj — ANI (@ANI) December 24, 2023 క్రిస్మస్కు ముందుగానే హిమాచల్‌లోని పర్యాటక ప్రదేశాలకు పర్యాటకుల రాక మొదలయ్యింది. పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడంతో సోలాంగ్‌లో దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వందలాది వాహనాలు జామ్‌లో చిక్కుకున్నాయి. ఆదివారం రాత్రి 10.30 గంటల వరకు జామ్ కొనసాగింది. #WATCH | Tamil Nadu: Lighting and decorations at different churches in Ooty on #Christmas Eve. pic.twitter.com/WmM4zsfEDU — ANI (@ANI) December 24, 2023 కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్.. క్రిస్మస్ ఈవ్ వేడుకలతో సందడి చేస్తోంది. భారీ సంఖ్యలో జనం రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. ప్రత్యేక సామూహిక ప్రార్థనలకు చర్చిలు దీపాలతో ముస్తాబయ్యాయి. పార్క్ స్ట్రీట్‌తో పాటు, హరీష్ ముఖర్జీ రోడ్‌తో సహా కోల్‌కతాలోని ఇతర ప్రదేశాలలో క్రిస్మస్ పండుగ సందర్భంగా భారీ అలంకరణలు కనిపించాయి. సెయింట్ పాల్స్ కేథడ్రల్ చర్చితో పాటు పలు చర్చిలను రంగురంగుల లైట్లతో అలంకరించారు. Uttar Pradesh: Historic Roman Catholic Church in Meerut's Sardhana decked up ahead of Christmas Read @ANI Story | https://t.co/ZTzFuB3dqQ#UttarPradesh #Christmas #RomanCatholicChurch pic.twitter.com/S8hvA0Uch6 — ANI Digital (@ani_digital) December 24, 2023 ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రాత్మక రోమన్ క్యాథలిక్ చర్చ్ క్రిస్మస్ కోసం ప్రత్యేకంగా అలంకరించారు. ఈ చారిత్రాత్మకమైన చర్చిని బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ అని పిలుస్తారు. ఈ చర్చి ఉత్తర భారతదేశంలో అతిపెద్దది. యూరోపియన్ సైనికుడు వాల్టర్ రెయిన్హార్డ్ సోంబ్రేను వివాహం చేసుకున్న 14 ఏళ్ల ముస్లిం బాలిక బేగం సమ్రు ఈ చర్చిని నిర్మించారని చెబుతుంటారు. #WATCH | J&K: A church in Jammu lit up colourful lights and decorated on #ChristmasEve pic.twitter.com/6QAaKDt4Kr — ANI (@ANI) December 24, 2023 జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని చర్చిలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు. చర్చిల్లో క్రిస్మస్ పాటలు వినిపిస్తున్నాయి. మిజోరంలోని అన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ శోభ కనిపిస్తోంది. క్రిస్మస్.. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చేసుకునే పండుగ. ప్రతీయేటా ఈ పండుగను డిసెంబర్ 25న జరుపుకుంటారు. ఇది కూడా చదవండి: చుక్కలు చూపించిన పప్పులు, కూరగాయలు! #WATCH | Sacred Heart Cathedral Catholic Church in Delhi lit up and decorated on #Christmas Eve. pic.twitter.com/6ijcMysVEA — ANI (@ANI) December 24, 2023 -
సౌభాగ్య ప్రదం..వరలక్ష్మీ వ్రతం
సర్వశుభాలను,సకల ఐశ్వర్యాలను ప్రసాదించే శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణమాసంలో ముత్తయిదువులంతా భక్తి ప్రపత్తులతో ఆచరిస్తారు. శ్రావణపౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ పూజ. ఈ సందర్భంగా నోము నోచేందుకు మహిళలంతా సిద్ధమయ్యారు. మార్కెట్లన్నీ శ్రావణ కళతో సందడిగా మారాయి. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పూజా సామగ్రీ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏడాదికి ఒకసారి వరాలిచ్చే శ్రావణ లక్ష్మి కోసం ధర ఎక్కువైనా పూజలాచరించడం ఆనవాయితీగానే మారింది. డాబాగార్డెన్స్/ఎంవీపీకాలనీ/సీతంపేట : హైందవ సంప్రదాయంలో ఓ ప్రత్యేకతను సంతరించుకున్న పుణ్య దినాల్లో వరలక్ష్మీవ్రతం ఒకటి. తమ కుటుంబం ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కలకాలం ఏ లోటూ లేకుండా ఆధ్యంతం జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. శ్రావణ శోభతో పూర్ణామార్కెట్ కిటకిటలాడింది. ఆషాఢ మాసంలో బోసిపోయిన వ్యాపారాలు శ్రావణ మాసంతో ఊపందుకున్న నేపథ్యంలో గురువారం పూర్ణామార్కెట్, ఏవీఎన్ కాలేజ్ డౌన్‌రోడ్డు, కురుపాం మార్కెట్ ప్రాంతాలు జనంతో కిక్కిరిశాయి. వరలక్ష్మి వ్రతం పూజకు అవసరమైన సామగ్రి ధరలు ఆకాశాన్నంటాయి. వరలక్ష్మి వ్రతంలో ఉపయోగించే ఇతర సామగ్రి ధరల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మకాలు జోరుగా సాగాయి. పూర్ణామార్కెట్ రోడ్డు క్లోజ్.. కొనుగోలు దారులు పెద్ద ఎత్తున రావడంతో పూర్ణామార్కెట్ నుంచి దుర్గాలమ్మ గుడికి వెళ్లే రోడ్డును మూసివేశారు. ద్విచక్ర వాహనాలు వెళ్లకుండా పోలీసులు స్టాపర్లు ఏర్పాటు చేశారు. టర్నర్ చౌల్ట్రీ నుంచి టౌన్‌కొత్తరోడ్డు, కురుపాం మార్కెట్ వరకు రోడ్డు కిరువైపులా తోపుడు బండ్ల వర్తకుల వ్యాపారాలు బాగా సాగాయి. పోటెత్తిన పందుంపుల్లల సందు.. వరలక్ష్మి వ్రతం సందర్భంగా పూర్ణామార్కెట్ పందుంపుల్లల సందు కొనుగోలుదార్లతో పోటెత్తింది. వరలక్ష్మి అమ్మవారికి కొత్త చీర, జాకెట్టు కొనుగోలు చేసేందుకు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మార్కెట్ పరిసర ప్రాంతాలన్నీ మహిళలతో కిటకిటలాడాయి. మార్కెట్లు కిటకిట.. శ్రావణమాసం రెండో శుక్రవారం (వరలక్ష్మీవ్రతం) కావడంతో బట్టల దుకాణాలు కిక్కిరిశాయి. వస్త్ర వ్యాపారులు దేశంలోని పలు నగరాలు, పట్టణాల నుంచి లేటెస్ట్ వెరైటీలు అందుబాటులో ఉంచడంతో పండగ సదర్భంగా ప్రత్యేక రాయితీలు ఇవ్వడంతో షారూమ్లు కళకళలాడాయి. జగదాంబ జంక్షన్, కురుపాం మార్కెట్లోని బంగారం దుకాణాలు కళకళలాడాయి. వరలక్ష్మి వ్రతానికి ముఖ్యమని మహిళలు భావించే లక్ష్మీకాసులు, జాతిరాళ్ల ఆభరణాలు, పచ్చలు, కెంపులు అతివలను ఆకట్టుకునే రీతిలో అందుబాటులోకి తేవడంతో ఆయా దుకాణాల్లో సందడి నెలకొంది. వరలక్ష్మి వ్రతం రోజు కొంత బంగారమైనా ధరించాలన్న నమ్మకంతో యువతులు, మహిళలు బంగారం దుకాణాలకు క్యూ కట్టారు. ఇవేకాక ఫుట్‌వేర్, ఫర్నిచర్ దుకాణాలు పండగ సందడితో నిండుగా కనిపించాయి. శ్రావణ సందడితో ఎంవీపీ రైతుబజార్ కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళల తాకిడి ఎక్కువగా కనిపించింది. పువ్వుల దుకాణాల వద్ద మహిళలు బారులు తీరారు. నరసింహనగర్ రైతుబజారు, రామటాకీస్, సీతంపేట, అక్కయ్యపాలెం బజార్లు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. ధరలు పెరిగిపోతున్నాయి శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఒకవైపు పండుగలు, మరొక వైపు పెళ్లిళ్లు. దీంతో పువ్వులు, పండ్లు ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. రెండో శుక్రవారం మరీ ఎక్కువగా ఉంటున్నాయి. 5 రకాలపండ్లు, 5రకాల పువ్వులు, 5రకాల పిండివంటలు, చీర , జాకెట్టు, లక్ష్మీరూపుతో పూజ చేస్తే సుమారు ఏడెనిమిది వేలు ఖర్చు అవుతోంది. ఇలా ధరలు పెరుగుతూపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి. – బి. శ్రీఅనిత, అక్కయ్యపాలెం -
జిల్లాలో పుష్కర శోభ
ఘాట్లు, పుష్కర నగర్ల వద్ద ఏర్పాట్లు పూర్తి విద్యుత్ కాంతులతో వెలుగొందుతున్న నగరం ఆకట్టుకున్న శోభా యాత్ర నేటి ఉదయం నుంచే పుణ్య స్నానాలు సాక్షి, అమరావతి : జిల్లా పుష్కర శోభ సంతరించుకొంది. శుక్రవారం ఉదయం నుంచి ఘాట్లలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక అధికారులు ఘాట్లను, తుది ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని ఘాట్లలో మూడు షిప్టుల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ప్రత్యేకాధికారులు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే అన్ని ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లు, ఫైర్, శానిటేషన్, విద్యుత్, నీటిపారుదల, ఆర్‌డబ్ల్యూస్, మెడికల్ సిబ్బందిని సిద్ధం చేసి ఉంచారు. పుష్కరనగర్ల నుంచి ఘాట్ల వరకు ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. అన్ని ఘాట్లు, పుష్కర నగర్ల వద్ద పటిష్ట బందోబస్తును గురువారం రాత్రి నుంచే సిద్ధం చేసి ఉంచారు. గుంటూరు జిల్లాలో నదితీరం వెంబడి ఘాట్ పరిసర ప్రాంతాలు కొత్త కాంతులతో వెలుగొందుతున్నాయి. ఘాట్ల వద్దకు శుక్రవారం ఉదయం నుంచి కృష్ణా జలాలు పుష్కలంగా చేరుతాయని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజి వద్ద కృష్ణమ్మకు అడ్డుకట్ట వేయడంతో కింది ప్రాంతంలో ఉన్న ఘాట్లకు నీటి సమస్య తలత్తే అవకాశం ఉంది. ట్రాఫిక్‌ను పోలీసులు ఎక్కడికక్కడ క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు, పుష్కరనగర్‌లో పార్కింగ్ ప్రదేశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నారు. పుష్కర నగర్లలో భక్తులకు ఉచిత అన్న ప్రసాదం శుక్రవారం ఉదయం నుంచే అందేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆ మూడు ఘాట్లపైనే ఫోకస్... జిల్లాలో అమరావతి, సీతానగరం, పెనుమూడి ఘాట్లపైనే దృష్టి పెట్టారు. కలెక్టర్ కాంతిలాల్ దండే ఘాట్లను పలుమార్లు పరిశీలించి అక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ ఘాట్ల ఏర్పాట్లపై ఆరాతీసినట్లు సమాచారం. సీఎం అమరావతి ఘాట్‌ను సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఎక్కువ శాతం భక్తులు ఈ ఘాట్లలో స్నానాలు చేసేందుకు వస్తారని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. దీనికితోడు తాళ్ళాయపాలెం ఘాట్‌కు భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుదని అంచనా వేస్తున్నారు. అలాగే నాగార్జున సాగర్‌వైపు కృష్ణవేణి ఘాట్‌కు భక్తుల తాకిడి ఉంటుందని అ«ధికారులు పేర్కొన్నారు. కళాకారులతో శోభా యాత్ర... జిల్లాలో పుష్కరాల సన్నాహకాలలో భాగంగా గుంటూరు నగరంలో గురువారం శోభా యాత్ర నిర్వహించారు. జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా విభిన్న వేషదారణలతో వందలాదిమంది కళాకారులు శోభాయాత్రలో పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద శోభాయాత్ర ప్రారంభమైంది. మంగళ, డప్పు వాయిద్యాలతో కళాకారులు సందడి చేశారు. చెక్కభజన, విద్యార్థుల సాంస ్కతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. నగరంలో విద్యుత్ కాంతులకు తోడు కళాకారుల ప్రదర్శనలు పుష్కర శోభను తెచ్చాయి. -
కలర్ ఫుల్ వాంతిలా.. ఆస్ట్రేలియన్ కరెన్సీ నోటు
ఆస్ట్రేలియా బ్యాంకు ఓ కొత్త డాలర్ నోటును ఆవిష్కరించింది. దీనిలో ప్రత్యేకత ఏముంది. సెంట్రల్ బ్యాంకులన్నాకా బ్యాంక్ నోటులు విడుదల చేస్తాయిగా అనుకుంటున్నారా! మరి అదేనండి, ఆ బ్యాంకు తయారుచేసిన కొత్త డాలర్ నోట్ డిజైన్ కలర్ ఫుల్ వాంతిని తలపిస్తుందని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ఆవిష్కరించిన ఆ నోటు, ఆస్ట్రేలియన్ డాలర్ బ్యాంకు నోట్లల్లో అతి చిన్నది. ఈ నోట్ ఆవిష్కరించినప్పటి నుంచి దానిపై ఎవరికి తోచిన రీతిలో వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకరు వికారంగా ఉంది అంటే, మరొకరు కలర్ ఫుల్ వాంతిలాగా ఉందంటున్నారు. అయితే ఇప్పటినుంచి కొత్తగా విడుదలచేసే బ్యాంకు నోటులపైనా వివిధ జాతుల ఆస్ట్రేలియన్ వాట్టిల్, స్థానిక పక్షితో చిత్రీకరిస్తామని దేశ రిజర్వు బ్యాంకు గవర్నర్ గ్లెన్ స్టీవ్స్ తెలిపారు.దీన్ని పక్షి ప్రేమికులు నుంచి సోషల్ మీడియా యూజర్ల వరకూ అందరూ విమర్శిస్తున్నారు. కొత్తగా ఆవిష్కరించిన ఐదు డాలర్ల నోట్‌కు పక్కల బ్లూఇస్ షేడ్స్, ప్రకాశవంతమైన నీలం,పసుపు, ఊదా, గులాబీ రంగుల కలగలుపుగా రూపొందించారు. ఆ దేశ రిజర్వు బ్యాంకు దీన్ని ఆవిష్కరించినప్పటి నుంచి కామెంట్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.’మా కొత్త ఐదు డాలర్ల నోట్ వాంతి లాగా కనిపిస్తుంది’ అని ట్విట్టర్లో పోస్టు చేస్తున్నారు.అయితే ఈ విమర్శలను ఓ ట్విట్టర్ యూజర్ అనువుగా చేసుకున్నాడు. ఎవరైతే ఈ నోట్‌ను అసహ్యహించుకుంటారో వారు తనకు ఆ నోట్లు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాడు.