Drunk Indigo Passenger Vomits Poops Inside Indigo Plane - Sakshi
Sakshi News home page

Viral: విమానంలో ప్రయాణికుడి రచ్చ.. ఫ్లోర్‌పైనే వాంతులు, మూత్ర విసర్జన.. ‘మహిళా సిబ్బందికి సెల్యూట్‌’

Published Thu, Mar 30 2023 2:48 PM | Last Updated on Thu, Mar 30 2023 3:38 PM

Drunk Indigo Passenger Vomits Poops Inside Indigo Plane - Sakshi

న్యూఢిల్లీ: విమానంలో ప్రయాణికులు అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విమానంలో కొందరు ప్రయాణికుల పిచ్చి చేష్టలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన పలు సంఘటనలు మరవక ముందే తాజాగా మరొకటి వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి గాల్లోని విమానంలో హంగామా సృష్టించాడు. 

గువాహతి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు వాంతులు చేసుకున్నాడు. అంతేగాక టాయిలెట్‌ బయటే మల వి'ర్జన చేశాడు. తాగిన మైకంలో సదరు వ్యక్తి  రెస్ట్‌రూమ్‌ నుంచి బయటకు వచ్చి ఫ్లోర్‌మీదే మూత్ర విసర్జన చేశాడు. ప్రయాణికుడు వ్యవహరించిన తీరుతో సీట్ల మధ్య నడిచే దారంతా అపరిశుభ్రంగా మారింది. తాగుబోతు ప్రవర్తనతో తోటి ప్రయాణికులందరూ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఈ ఘటన మార్చి 26న ఇండిగో విమానం 6E 762లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

అనంతరం విమానంలోని మహిళా సిబ్బంది వెంటనే స్పందించి అక్కడంతా శుభ్రం చేయాల్సి వచ్చింది. ప్రయాణికుడు చేసిన రచ్చను మహిళ క్లీన్‌ చేస్తున్న దృశ్యాలను తోటి ప్రయాణికుడు భాస్కర్‌ దేవ్‌ కొన్వర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఫ్లోర్‌ క్లీన్‌ చేసిన మహిశా సిబ్బందిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ‘ఏ పరిస్థితినైనా మహిళలు చక్కగా నిర్వహించగలరు. సెల్యూట్‌ గాళ్‌​ పవర్‌’ అంటూ కొనియాడుతున్నారు. మరోవైపు విమానంలో అనుచితంగా ప్రవర్తించిన అతడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement