
న్యూఢిల్లీ: దేశ రాజధాని రీజియన్‌లో మరో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రెడీ అయ్యింది. నోయిడాలో రూపొందుతున్న విమానాశ్రయంలో.. సోమవారం తొలిసారిగా విమాన ల్యాండింగ్, టేకాఫ్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. దీంతో.. వచ్చే ఏడాది నుంచి ఈ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రానుంది.
ఇండిగోకు విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిబ్బందితో మాత్రమే నోయిడా ఎయిర్‌పోర్టుకు బయలు దేరింది. అవసరమైన భద్రతా తనిఖీల తర్వాత రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఇప్పటికే ఢిల్లీ రీజియన్‌లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఉండగా.. ఇప్పుడు నోయిడా ఎయిర్‌పోర్ట్ రెండవ ప్రధాన విమానాశ్రయంగా మారనుంది,
నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని జెవార్‌లో ఉంది. అధునాతన హంగులు, సదుపాయాలతో రెడీ అవుతున్న ఈ ఎయిర్‌పోర్టు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
#WATCH | Uttar Pradesh: Noida International Airport Limited (NIAL) conducts the first flight validation test for Noida International Airport ahead of the airport’s commercial opening in April 2025. pic.twitter.com/C3axT4mZeH
— ANI (@ANI) December 9, 2024