
ఢిల్లీకి ఆనుకునివున్న నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. అతివేగంతో వెళుతున్న కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్(టీఎస్‌ఐ)ను కారుతో బలంగా ఢికొట్టి, తీవ్రంగా గాయపరిచిన ఉదంతం వెలుగు చూసింది.
మీడియాకు అందిన వివరాల ప్రకారం ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్ జై ప్రకాష్ సింగ్ నోయిడాలోని రజనీగంధా కూడలిలో విధులు నిర్వహిస్తుండగా, అతనికి అనుమానాస్పద వాహనం గురించిన సమాచారం అందింది. వెంటనే ఆయన ఆ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా, అందులోని డ్రైవర్ కారును అత్యంత వేగంగా పోనిచ్చాడు.
వెంటనే జై ప్రకాష్ సింగ్ ఒక స్కూటీ లిఫ్ట్ తీసుకొని కారును వెంబడించి, అట్టా రెడ్ లైట్ దగ్గర ఓవర్‌టేక్ చేసి కారును ఆపడానికి ప్రయత్నించారు. అయితే ఇంతలో ఆ కారు డ్రైవర్ స్కూటీని ఢీకొట్టి, జై ప్రకాష్ సింగ్‌ను తీవ్రంగా గాయపరిచి, కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. టీఎస్‌ఐ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ వాహనాన్ని సీజ్ చేశారు. నిందితుని కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment