కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధరలను ప్రభుత్వం పెంచింది. పెరిగిన రేట్లు జూన్ 22 ఉదయం 6 గంటలకు అమల్లోకి వచ్చాయి. సీఎన్‌జీ ధర కేజీకి ఒక్క రూపాయి పెరిగింది. ఈ పెరుగుదల తరువాత, ఇప్పుడు దేశ రాజధాని న్యూఢిల్లీలో సీఎన్‌జీ కేజీ ధర రూ .75.09 కు చేరింది.
ఈ పెరుగుదల ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంతో సహా ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌లోని అనేక నగరాల్లో సీఎన్‌జీ రిటైల్ ధరలను ప్రభావితం చేయనుంది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో సీఎన్‌జీ ధరలు ఒక్క రూపాయి పెరిగాయి. ఈ నగరాల్లో ఇప్పటి వరకు రూ.78.70 ఉన్న కేజీ సీఎన్‌జీ ధర ఇప్పుడు రూ.79.70కి చేరింది. ఇక ఎన్‌సీఆర్ పరిధిలోని గురుగ్రామ్‌లో సీఎన్‌జీ రేటులో ఎలాంటి మార్పు లేదు. దీంతోపాటు కర్నాల్, కైతాల్లలో కూడా సీఎన్‌జీ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
ఇతర నగరాల్లో ధరలు
హర్యానాలోని రేవారీ, మీరట్, ముజఫర్ నగర్, ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ, రాజస్థాన్ లోని అజ్మీర్, పాలి, రాజ్ సమంద్ లలో కూడా నేటి నుంచి సీఎన్ జీ ధరలు పెరిగాయి. రేవారీలో సీఎన్‌జీ ధరలు కేజీకి రూ .78.70 నుంచి రూ .79.70 కు పెరిగాయి. ఉత్తరప్రదేశ్ లోని మీరట్, ముజఫర్ నగర్, షామ్లీలో రూ.79.08 నుంచి రూ.80.08కి పెరిగింది. రాజస్థాన్ లోని అజ్మీర్, పాలి, రాజ్ సమంద్ లలో ఇప్పుడు సీఎన్‌జీ ధర ఒక రూపాయి పెరిగింది. ఇక్కడ రూ.81.94 ఉన్న కేజీ సీఎన్‌జీ ధర రూ.82.94కు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment