ఢిల్లీ: సంచలనం సృష్టించిన ఎయిర్ ఇండియా ఉద్యోగి సూరజ్ మాన్ హత్య కేసులో ఎట్టకేలకు లేడీ డాన్ కాజల్ ఖత్రీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నోయిడాలో ఈ ఏడాది జనవరి 19న ఎయిర్ ఇండియా ఉద్యోగి సూరజ్ మాన్ కారులోనే హత్యకు గురైన సంగతి తెలిసిందే. బైక్‌పై వచ్చిన హంతకుల ముఠా కాల్పులు జరిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. 8 నెలల తర్వాత కీలక పురోగతి సాధించారు. ఈ హత్య వెనుక ఢిల్లీ లేడీ డాన్ కాజల్ ఖత్రీ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. గ్యాంగ్‌స్టర్ కపిల్ మాన్ ఆదేశాల మేరకే ఈ హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు.
బాధితుడు సూరజ్ మాన్.. గ్యాంగ్‌స్టర్ పర్వేష్ మాన్ సోదరుడు. కపిల్ మాన్.. పర్వేష్ మాన్ మధ్య ఎప్పటి నుంచో శత్రుత్వం ఉంది. తన తండ్రిని పర్వేష్ మాన్ హత్య చేశాడంటూ కపిల్ మాన్ పగ పెంచుకున్నాడు. దీంతో తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు పర్వేష్ మాన్ సోదరుడు సూరజ్ మాన్ హత్యకు ప్లాన్ వేశాడు.
ఇదీ చదవండి: చెప్పులు వేసుకుని రావద్దన్న డాక్టర్‌పై దాడి.. వీడియో వైరల్
అయితే, తన భార్య అయిన.. లేడీ డాన్ కాజల్ ఖత్రీ సాయంతో ప్రణాళిక అమలు చేశాడు. కాగా, కపిల్ మాన్, పర్వేష్ మాన్ ఇద్దరూ ఢిల్లీలోని మండోలి జైల్లోనే ఉన్నారు. కాజల్ ఖత్రీ తలపై రూ.25 వేలు పారితోషికం ఉందని ఢిల్లీ పోలీసు అధికారి సంజయ్ భాటియా వెల్లడించారు. నోయిడాలో హత్యకు గురైన సూరజ్ మాన్ కేసులో కాజల్‌ను అరెస్ట్ చేసి నోయిడా పోలీసులకు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment