న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ట్రిపుల్ మర్డర్ కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు, దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్‌లో బుధవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. స్థానిక నెబ్‌సరాయి ప్రాంతంలో దంపతులు తమ కుమారుడు, కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు.
బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు వారి ఇంట్లోకి చొరబడి దంపతులు రాజేష్(55), కోమల్(47), వారి కుమార్తె కవిత(23)లపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశారు.మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఆయన కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
అయితే కొడుకు తన మార్నింగ్ వాక్ కోసం ఉదయం 5 గంటలకు ఇంటి నుండి బయలుదేరాడు. అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి.. తన తల్లిదండ్రులు, సోదరి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రి రాజేష్ ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యాడని తెలిపాడు.
డిసెంబర్ 4(నేడు) తమ తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం ఉందని.. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. తెల్లారితే వారితో సంతోషంగా జరుపుకుందామనుకునేలోపు ఈ దారుణం చోటుచేసుకుందని కుమారుడు కన్నీరుమున్నీరయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో ఎలాంటి వస్తువులు దొంగతనం జరగలేదని తెలిపారు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని.. దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment