Triple Murder
-
కిరాతకం: కుటుంబం గొంతు కోశారు!
సాక్షి, ముంబై: ఔరంగాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై నిద్రిస్తుండగానే దుండగులు కిరాతకంగా దాడిచేశారు. ఈ దాడిలో భార్య, భర్తలతోపాటు వారి తొమ్మిదేళ్ల కూతురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వారి ఆరేళ్ల కుమారుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. మృతులను రాజు నివారే (శంభాజి) (35), అశ్వినీ నివారే, సాయలి నివారే (9)లుగా గుర్తించారు. గొంతు కోయడంతో ముగ్గురు మృతిచెందినట్లు తెలిసింది. ఈ ఘటన జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేకేత్తించింది. పైఠన్ తాకాలూ పాత కావసన్ గ్రామంలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. నిద్రలోనే.. పైఠన్ సమీపంలోని కవసన్ గ్రామంలో రాజు నివారే, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు నివసిస్తున్నారు. నివారే కుటుంబీకుల సన్నిహిత బంధువల పెళ్లి ఉండటంతో శుక్రవారం పెళ్లికి వెళ్లారు. అనంతరం ఇంటికి వచ్చి ఆలస్యంగా పడుకున్నారని తెలిసింది. పడుకున్న నివారే కుటుంబం సభ్యులపై శనివారం వేకువజామున గుర్తు తెలియని దుండగులు ఇంట్లో చొరబడి పదునైన ఆయుధాలతో దాడులు చేశారు. అత్యంత పాశవికంగా కుటుంబసభ్యుల గొంతు కోసి పరారయ్యారు. చదవండి: (రైతు ఇంట్లో ఐటీ దాడులు.. అపార సంపద) ఉదయం తలుపులు తీసి ఉండటం చూసి ఇరుగుపొరుగు వారు లోపలికి వెళ్లి చూడగా నివారే కుటుంబం రక్తం మడుగులో కన్పించింది. రాజు నివారేతోపాటు ఆయన భార్య అశ్వినీ, కూతురు సాయలీలు అప్పటికే మృతి చెందారు. మరోవైపు రాజు నివారే కుమారుడు సోహమ్(6) తీవ్ర గాయాలతో కనిపించాడు. సోహమ్‌ను ఘాటిలోని ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. జిల్లా డిప్యూటీ సూపరిండెంట్, గోరక్ష్ భామరేలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వ్యక్తిగత కక్షలతోనే దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
మంజు ప్రాణం తీసిన అనుమానం..
భోపాల్ : అనుమానం ముగ్గురి నిండు ప్రాణాలను బలితీసుకుంది. మంజు అనే మహిళకు పలువురితో వివాహాతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమెతో పాటు ఏడాదిన్నర చిన్నారి, మరో వ్యక్తిని దారుణంగా హతమార్చారు. ముగ్గురి చేతులు,కాళ్లు కట్టేసి నోటికి టేప్ వేసి ఉన్న మృతదేహాలను గుర్తించారు. వ్యక్తి మృత దేహాన్ని గ్యాస్ స్టవ్‌పై పడేశారు. కాలిన మృతదేహాలతో పాటు హత్యకు పాల్పడిన వ్యక్తి గోడపై ఓ సందేశం రాశాడు. మంజు కోసం నా సోదరుడు ఉరిపోసుకున్నాడు. ఆమెకు పలువురు వ్యక్తులతో సంబంధాలున్నాయి అందుకే ఆమెను చంపాను..ఆమె కుటుంబంలో ప్రతి ఒక్కరినీ చంపేస్తా అని అందులో రాసి ఉంది. మధ్యప్రదేశ్‌లోని భిలాయ్‌లో ఈ జరిగిన ఘటన కలకలం రేపింది. మూడు హత్యలకు కారకుడిగా భావిస్తున్న మంజు భర్త రవిని ఒడిషాలోని రూర్కెలాలో పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య జరిగిన రాత్రి మంజు తల్లితండ్రులకు ఫోన్ కాల్ వచ్చిందని..అందులో మీ కుమార్తె, అల్లుడు మంటల్లో కాలిపోతున్నారని మీరు వాళ్లను కాపాడుకోవచ్చని అవతలి వ్యక్తి చెప్పాడని బాధితురాలి తల్లితండ్రులు తెలిపారు. ఆ నెంబర్‌కు తాము తిరిగి కాల్ చేయగా స్విచాఫ్ అవడంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి రాగా కాలిపోయి గుర్తుపట్టలేని రీతిలో ఉన్న మృతదేహాలు కనిపించాయి. మహిళతో పాటు ఆమె ప్రియుడిగా భావిస్తున్న వ్యక్తి సజీవ దహనం కాగా, పొగను పీల్చడంతో చిన్నారి మరణించినట్టు పోలీసులు గుర్తించారు. మంజు కాల్ రికార్డుల ఆధారంగా పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. చదవండి : ఆస్తి కోసం అక్కమొగుడే.. -
రాజధానిలో ట్రిపుల్ మర్డర్ కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఆదివారం వసంత్ ఎన్‌క్లేవ్‌లోని వసంత్ అపార్ట్మెంట్లో వృద్ధ దంపతులతో పాటు పనిమనిషి విగతజీవులుగా పడిఉండటాన్ని కనుగొన్నారు. మృతులను విష్ణు మాధుర్, శశి మాధుర్, ఖుష్బూ నుతియల్‌గా గుర్తించారు. మృతులను దుండగులు గొంతుకోసి పాశవికంగా హత్య చేశారు. బాధితులకు పరిచయం ఉన్న వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన ఇంట్లో చోరీ జరిగిన ఆనవాళ్లు లేకపోవడం గమనార్హం. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రాధమిక విచారణ ప్రకారం ఇది తెలిసిన వారి పనేనని అనుమానిస్తున్నామని డీసీపీ దేవేంద్ర ఆర్య వెల్లడించారు. విష్ణు మాధుర్, శశి మాధుర్‌లు ప్రభుత్వ ఉద్యోగలుగా పదవీవిరమణ చేశారని పోలీసులు తెలిపారు. -
‘అపర్ణ వేరే వ్యక్తితో చనువుగా ఉంటుందనే హత్య చేశా’
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని చందానగర్‌లో ట్రిపుల్ మర్డర్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు మధు సోమవారం చందానగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మూడు హత్యలను తానే చేసినట్లు అతడు అంగీకరించాడు. పోలీసుల విచారణలో అతడు పలు విషయాలు వెల్లడించాడు. ‘ అపర్ణతో పదేళ్లుగా సహజీవనం చేస్తున్నాను. అయితే ఆమె వేరే వ్యక్తితో చనువుగా ఉంటుంది. దాన్ని సహించలేకే హత్య చేశారు. ముందుగా కార్తికేయ, అపర్ణ తల్లి విజయమ్మను గొంతు నులిమి చంపాను. ఆ తర్వాత అపర్ణను గోడకేసి కొట్టి చంపాను.’ అని తెలిపాడు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన అపర్ణ .. కూకట్‌పల్లికి చెందిన మధుతో కలిసి చందానగర్‌లో నివాసం ఉంటోంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. ప్రముఖ ఎలక్ర్టానిక్ కంపెనీలో అపర్ణ సేల్స్ ఉమెన్‌గా పనిచేస్తుండగా.. ఆమెతో పాటు తల్లి విజయలక్ష్మి కూడా ఉంటోంది. రెండు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడం.. ఇంటి నుంచి వాసన రావాడాన్ని సోమవారం ఉదయం గమనించిన వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళాలు పగులగొట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బలమైన గాయాలతో.. రక్తపు మడుగులో అపర్ణ కిచెన్‌లో.. ఆమె తల్లి, కుమార్తె ఒక గదిలో హత్యకు గురయ్యారు. అయితే మధు ఇది వరకే జరిగిన పెళ్లిని దాచిపెట్టి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని ఇటీవల అపర్ణకు, భర్త మధుకు మధ్య గొడవలు జరిగాయని తెలుస్తోంది. దీంతో ఇరువురు చందానగర్ పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మధు.. అపర్ణను, కుమార్తెను సరిగా చూసుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే మధు మొదటి భార్య కుటుంబం, అపర్ణను బెదిరించినట్టు కూడా చెబుతున్నారు. తన భర్తను మోసం చేసి రెండో పెళ్లి చేసుకుందని అపర్ణపై, మొదటి భార్య కుటుంబ సభ్యులు ద్వేషం పెంచుకున్నట్టు తెలుస్తోంది. -
లక్ష్మీ ప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం
అమరావతి : తండ్రి ఉన్మాద చర్యతో కుటుంబాన్ని కోల్పోయిన లక్ష్మీ ప్రసన్న మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసింది. అనాధగా మారిన ఆమెకు గ్రూప్-2 ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. లక్ష్మీ ప్రసన్న మంగళవారం వెలగపూడి సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రిని కలిసింది. ఆమె విద్యార్హతలు అడగ్గా ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమెస్ట్రీ అని చెప్పడంతో లక్ష్మీప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వాలని సీఎం.. అధికారులను ఆదేశించారు. అధైర్యపడకుండా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ఆమెకు సూచించిన ముఖ్యమంత్రి ప్రభుత్వపరంగానే కాకుండా వ్యక్తిగతంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉద్యోగంతో సరిపుచ్చుకోకుండా ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ఆరు నెలలకు ఓసారి వచ్చి తనను కలవాలని లక్ష్మీప్రసన్నకు సూచించారు. కాగా అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన లక్ష్మీప్రసన్న తండ్రి రామసుబ్బారెడ్డి ఈ నెల 4వ తేదీన (మంగళవారం) భార్య, ఇద్దరు కుమార్తెలు దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటనలో భార్య సులోచన(45), కుమార్తె ప్రత్యూష(20) అక్కడికక్కడే మృతి చెందారు. మరో కుమార్తె ప్రతిభ(22) తీవ్ర గాయాలతో తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే రామసుబ్బారెడ్డి మరో కుమార్తె లక్ష్మీ ప్రసన్న ఆ సమయంలో ఇంటి దగ్గర లేకపోవడంతో ప్రాణాలతో బయటపడింది. ఇప్పటికే లక్ష్మీ ప్రసన్నకు ముఖ్యమంత్రి రూ.20 లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. -
ఆశయాన్ని బతికిస్తా
ఇప్పుడు మా కుటుంబంలో నేనొక్కతినే.. మా వాళ్లంతా దేవుని దగ్గరికి వెళ్లారు. మేము ముగ్గురం ఆడ పిల్లలమే.. మగ పిల్లల్లానే పెంచింది మమ్మల్ని. ఉన్నత స్థానంలో చూడాలని తపించింది. కష్టానికి తగ్గట్లే బాగా చదువుతున్నాం. విధి కన్నుకుట్టింది. అమ్మ.. నాన్న.. ఇద్దరు చెల్లెలను దూరం చేసింది. ఇప్పటికీ అంతా కలగానే ఉంది. ఈ లోకం వీడాలనుకున్నా. అమ్మ గుర్తొచ్చింది. ఆమె కల ఆత్మస్థైర్యం నింపింది. ఇప్పుడు నా ముందున్నది ఆ లక్ష్యం ఒక్కటే. నాన్న కూడా మా ఉన్నతికి ఎంతో తపించారు. వాళ్ల ఆశయాన్ని బతికిస్తా. - ఉబికివచ్చే కన్నీళ్లతో తాడిపత్రి ప్రసన్న చెప్పిన మాటలివి. తాడిపత్రి టౌన్ : పట్టణంలోని కృష్ణాపురం 3వ రోడ్డులో ఉంటున్న సులోచనమ్మ, ఇద్దరు కూతుళ్లు ప్రత్యూష, సాయి ప్రతిభ మంగళవారం దారుణ హత్యకు గురి కాగా.. సులోచనమ్మ భర్త రామసుబ్బారెడ్డి బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కుటుంబంలో పెద్ద కుమార్తె ప్రసన్న మాత్రమే ఇప్పుడు ఒంటరిగా మిగిలింది. ఈమె తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంఎస్సీ చదువుతోంది. కుటుంబ సభ్యులంతా మరణించడంతో ప్రసన్న బిక్కుబిక్కుమంటోంది. బుధవారం విలేకరులు ఆమెను కదిలించే ప్రయత్నం చేయగా కన్నీటి పర్యంతమయింది. ఆ రోజు ఏమి జరిగిందో ఇలా చెప్పింది. ‘‘మంగళవారం ఉదయం 7.30 గంటలకు యూనివర్సిటీకి బంధువులు ఫోన్ చేశారు. అమ్మకు ఆరోగ్యం బాగోలేదన్నారు. ఏమయిందోనని ఆందోళన పడ్డా. 10.30 గంటల సమయంలో తాడిపత్రి పోలీసుల నుండి అమ్మా,చెల్లెళ్లు హత్యకు గురైనట్లు ఫోన్ వచ్చింది. బోరున ఏడ్చేశా. తిరుపతి పోలీసుల సహకారంతో సాయంత్రానికి తాడిపత్రి చేరుకున్నా. విగతజీవులుగా పడి ఉన్న అమ్మా చల్లెళ్లను చూసి తట్టుకోలేకపోయాను. నాన్నే కారణమని బంధువులు చెప్పడంతో విపరీతమైన కోపం వచ్చింది. బుధవారం నాన్న నుంచి రెండు సార్లు ఫోన్ వచ్చింది. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారు. పుట్లూరు రోడ్లులోని కంపచెట్ల మధ్య పడి ఉన్నానన్నారు. అంతే ఫోన్ కట్ అయింది. మళ్లీ నేను ఫోన్ చేస్తే మాట్లాడలేదు. పోలీసులకు చెప్పా. ఆ తర్వాత అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో నాన్న చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఎంతయినా నాన్న కదా. చూడాలనిపిస్తోంది. తప్పకుండా వెళ్తా. మా ఉన్నతికి అమ్మానాన్న ఎంతో తపించారు. వాళ్ల ఆశయాన్ని బతికిస్తా. -
ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితుడి ఆత్మహత్య
తాడిపత్రి: భార్య, ఇద్దరు కుమార్తెలను దారుణంగా హతమార్చిన కేసులో నిందితుడు రామసుబ్బారెడ్డి బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాడిపత్రి టీటీడీ కల్యాణ మండపం వద్ద అపస్మారక స్థితిలో ఉన్న రామసుబ్బారెడ్డిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు...అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాగా భార్య సులోచనమ్మ సహా ఇద్దరు కూతుళ్లు ప్రత్యూష, సాయి ప్రతిభలను నిన్న రామసుబ్బారెడ్డి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. హత్యల అనంతరం పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఓ వైపు భార్య, పిల్లలను అతికిరాతకంగా సుత్తితో హతమార్చడంతో పాటు, పోలీసులు తన కోసం వెతుకుతుండటంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. triple murder, ramasubbareddy, tadipatri, sulochana, family disputes, suicide, హత్యలు, రామసుబ్బారెడ్డి, తాడిపత్రి, సులోచన, కుటుంబకలహాలు,ఆత్మహత్య -
అనంతపురం జిల్లాలో దారుణ హత్యలు
అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యతో పాటు రక్తం పంచుకు పుట్టిన బిడ్డలను కూడా దారుణంగా హతామర్చాడో వ్యక్తి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే... స్థానిక కృష్ణాపురం 40 అడుగుల రోడ్డులో రామసుబ్బారెడ్డి ... భార్య, ఇద్దరు కుమార్తెలు మంగళవారం తెల్లవారుజామున దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటనలో భార్య సులోచన(45), కుమార్తె ప్రత్యూష(20) అక్కడికక్కడే మృతి చెందారు. మరో కుమార్తె ప్రతిభ(22) తీవ్ర గాయాలతో తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ కలహాలతోనే రామసుబ్బారెడ్డి.... భార్య, పిల్లలను సుత్తితో కొట్టి హతమార్చాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రకాశం జిల్లాలో ముగ్గురి దారుణ హత్య
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో మంగళవారం దారుణం జరిగింది. పాతకక్షల నేపథ్యంలో ముగ్గురిని హతమార్చిన సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే పర్చూరు మండలం చెన్నుబొట్ల గ్రామానికి చెందిన కీర్తిపాటి రత్తయ్య కుటుంబానికి అదే గ్రామానికి చెందిన బోసు, శ్యాంసన్‌కు పాత కక్షలు ఉన్నాయి. గతంలో రత్తయ్య కొడుకుని బోసు శ్యాంసన్ కత్తితో పొడిచారు. దీంతో వారి కుటుంబాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గు మంటుంది. ఈ నేపథ్యంలో మేనత్త, మేనమామ, మేనల్లుడిపై ఇద్దరు అన్నదమ్ములు కత్తులతో తెగబడ్డారు. ముగ్గురిని వెంటాడి నడిరోడ్డుపై నరికి చంపారు. కాగా నిందితులు బోస్, శ్యామ్ సన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులు రత్తయ్య, సుశీల, బాబు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చెన్నబొట్లలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ ప్రేమ్ కాజల్ సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్యాభర్తల గొడవ.. పిల్లల హత్య
-
భార్యాభర్తల గొడవ.. పిల్లల హత్య
కోల్‌కతా(పశ్చిమబెంగాల్): భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ టీనేజ్‌లో ఉన్న వారి ఇద్దరు పిల్లల హత్యకు దారితీసింది. ఈ గొడవలో భార్య కూడా మృతి చెందగా భర్త కొనఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణ ఘటన శనివారం ఉదయం దక్షిణ కోల్‌కతాలోని పామ్ అవెన్యూ సమీపంలో చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురి హత్యలు స్థానికంగా కలకలం రేపాయి. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం నీల్ ఫాన్సెకా (49) తన భార్య జెస్సికా, టీనేజ్ లో ఉన్న తమ ముగ్గురు పిల్లలతో కలిసి ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేసి సరదాగా గడిపి తిరిగి ఇంటికి వెళ్లారు. అయితే వారి మధ్య ఏ విషయంలో విబేధాలు ఎందుకు తలెత్తాయోగానీ భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాగా శనివారం ఉదయం భర్త నీల్ స్నానం చేసి గదిలోకి వచ్చేసరికి జెస్సికా తమ కవల పిల్లలైన తారెన్, జాషువాల గొంతులు కోసింది. బెడ్‌పై కుమారులిద్దరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న దృశ్యాన్ని చూసిన నీల్ వెంటనే మరో పదునైన ఆయుధంతో భార్యపై విరుచుకుపడ్డాడు. ఈ హోరాహోరీలో భార్య మృతిచెందగా భర్త తీవ్రగాయాలపాలై అచేతనస్థితిలో పడిపోయాడు. 8వ తరగతి చదువుతున్న ఆ కవల సోదరులు కూడా మృతిచెందారు. తల్లి, కుమారుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, నీల్ ను ఆస్పత్రికి తరలించారు. కాగా వీరి కుమార్తె సమంత తన గదిలోనే నిద్రపోతుండటంతో ఆమెకు వీరి అరుపులేమీ వినిపించలేదని పోలీసులకు తెలిపింది. నీల్ కుటుంబం ఎంతకీ ఫోన్ తీయడంలేదంటూ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం వారి ఇంటికి వెళ్లడంతో హత్యల సంగతి వెలుగుచూసింది. నీల్ వాంగూల్మం తీసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.