![ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితుడి ఆత్మహత్య - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/51499228644_625x300.jpg.webp?itok=s06fZw3W)
ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితుడి ఆత్మహత్య
తాడిపత్రి: భార్య, ఇద్దరు కుమార్తెలను దారుణంగా హతమార్చిన కేసులో నిందితుడు రామసుబ్బారెడ్డి బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాడిపత్రి టీటీడీ కల్యాణ మండపం వద్ద అపస్మారక స్థితిలో ఉన్న రామసుబ్బారెడ్డిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు...అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాగా భార్య సులోచనమ్మ సహా ఇద్దరు కూతుళ్లు ప్రత్యూష, సాయి ప్రతిభలను నిన్న రామసుబ్బారెడ్డి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే.
హత్యల అనంతరం పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఓ వైపు భార్య, పిల్లలను అతికిరాతకంగా సుత్తితో హతమార్చడంతో పాటు, పోలీసులు తన కోసం వెతుకుతుండటంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
triple murder, ramasubbareddy, tadipatri, sulochana, family disputes, suicide, హత్యలు, రామసుబ్బారెడ్డి, తాడిపత్రి, సులోచన, కుటుంబకలహాలు,ఆత్మహత్య