ramasubbareddy
-
హామీల అమలెప్పుడు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచీ గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం మినహా ఎన్నికల ముందు సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారన్న ప్రణాళికను కూడా కనీసం బడ్జెట్ ప్రస్తావించలేకపోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తప్పు పట్టారు. మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు అధ్యక్షతన శాసనమండలిలో 2024–25 బడ్జెట్‌పై బుధవారం చర్చ మొదలైంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ చర్చను ప్రారంభిస్తూ.. హామీలు మెండు–చేసేది సున్నా అన్నట్టుగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చే హామీలను నిలబెట్టుకునే అలవాటు టీడీపీ లేదని.. ఈసారి ఎన్నికల్లో జనసేన, బీజేపీ ఉండటంతో గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత ఆ పార్టీలు తీసుకుంటాయని ప్రజలు భావించారన్నారు. కానీ.. మొత్తంగా కూటమి పార్టీలు హామీలతో ప్రజలను నమ్మించి ద్రోహం చేశాయన్నారు.వైఎస్సార్సీపీ ప్రజలకిచ్చిన హామీలకు ఏటా సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి అమలు చేసిందని.. కూటమి ప్రభుత్వం ఏ నెలలో ఏ హామీ అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల కోసం ఒక్క రూపాయి బడ్జెట్లో కేటాయించలేదన్నారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఎప్పటిలోగా పోలవరం పూర్తి ఏస్తారో బడ్జెట్లో చెప్పలేదన్నారు.ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదువైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పకుండా బడ్జెట్‌ను దాటవేసిందన్నారు. కనీసం ఏ పథకం ఎప్పుడు ఇస్తారో అనే ప్రణాళిక కూడా బడ్జెట్లో చెప్పలేదన్నారు. గత ప్రభుత్వ దుర్మార్గమైన పాలన అంటూ బడ్జెట్లో మొదటిలోనే మొదలుపెట్టారని, ప్రజలకిచ్చిన హామీలను అప్పటి ప్రభుత్వం చేసిందని, హామీలు అమలు చేయడం దుష్పరిపాలన అవుతుందా అని ప్రశ్నించారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇస్తామన్న రూ.15 వేల కోట్లు అప్పుగానా లేకా గ్రాంటా అన్నది బడ్టెట్ పేర్కొనలేదన్నారు. దీనికి మంత్రి నాదెండ్ల మనోహర్ బదులిస్తూ.. కేంద్రం రుణంగా తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్‌గా అందజేస్తుందన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలపై టీడీపీ ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, పంచుమర్తి అను«రాధ మాట్లాడారు. -
రౌడీలుగా మెలగడం మానుకోండి..
-
‘ఏక్ నిరంజన్‌ని.. నాతో మీకు భయమేంటి?’
సాక్షి, వైఎస్సార్ : జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎంతో మంది నాయకులు ఉన్న మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు ఏక్ నిరంజన్ అయిన తనంటే భయమెందుకని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రశ్నించారు. వారికి ఓటమి భయం పుట్టుకొచ్చినందుకే తనను ప్రచారం చేసుకోనివ్వడం లేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో గడచిన మూడు ఎలక్షన్లు చూస్తే.. 2004, 2009, 2014లో కూడా అక్కడి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోలేదు. అక్కడి ప్రజలను మోటివేట్ చేయడానికి జమ్మలమడుగు డీఎస్పీ 2వ తేదీ ప్రచారం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి ఆదినారాయణరెడ్డి ఒత్తిళ్లకు లొంగి నన్ను హౌస్ అరెస్ట్ చేయడం దారుణం. ఓటమి భయంతోనే నా ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు. మీరు నా సొంత ఊరిలో ప్రచారం చేసుకున్నారు నేను అడ్డుకున్నానా. మంత్రి ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల ఫ్యాక్షన్ వల్ల ఎన్నో అమాయక కుటుంబాలు నాశనం అయ్యాయి. ప్రజలకు సేవచేసే నాయకుల్లా మెలగాలి.. రౌడీలుగా మెలగడం మానుకోండి. అడ్డుకుంటే భయపడే వాడిని కాదు. రామసుబ్బారెడ్డి సొంత ఊరు గుర్లకుంటలో ప్రచారం చేస్తా. మీ ఇద్దరిదీ 30 ఏళ్ల రాజకీయ జీవితం. నా మూడేళ్ల రాజకీయ జీవితంతో భయపడడం ఏంటి. గత ఎలక్షన్లలో దేవగుడికి పోవాలన్న రామసుబ్బారెడ్డి, సీఎం రమేష్‌పై రాళ్లు విసిరిన ఆదినారాయణరెడ్డి ఇప్పుడు సిగ్గు లేకుండా ఫిఫ్టీ, ఫిఫ్టీ బాటలో నడుస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. రాబోయే ఎలక్షన్లలో ప్రజలు వీరికి తగిన గుణపాఠం చెబుతార’న్నారు. -
తెరపడని టీడీపీ జమ్మలమడుగు పంచాయితీ
-
తేలని జమ్మలమడుగు పంచాయితీ
సాక్షి, విజయవాడ: టీడీపీ జమ్మలమడుగు పంచాయితీ సద్దుమణగడం లేదు. ఏకంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఈ వ్యవహారానికి తెరపడలేదు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ తమకే కేటాయించాలంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలను పిలిచి చంద్రబాబు మాట్లాడారు. ఒకరిరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎంపీగా పోటీ చేయాలని రాజీ ఫార్ములాను చంద్రబాబు సూచించారు. అయితే, ఈ మేరకు రాజీపడటానికి ఆదినారాయణరెడ్డిగానీ, రామసుబ్బారెడ్డిగానీ అంగీకరించలేదు. చంద్రబాబు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఇద్దరు నేతలు ఆయన మాటను వినిపించుకోలేదని తెలుస్తోంది. జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి మొగ్గు చూపుతున్నారు. జమ్మలమడుగు టికెట్ వదులుకుంటే కడప ఎంపీగా పోటీచేసే అవకాశం ఇస్తానని, కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోతే.. ఎమ్మెల్సీ పదవీ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు ఎంత నచ్చజెప్పినా కడప నుంచి పోటీచేసేందుకు ఇద్దరు నేతలూ ముందుకు రాలేదు. -
టీడీపీలో వర్గపోరు, సీఎం రమేష్ ఆఫీస్‌పై దాడి
సాక్షి, కడప : జిల్లాలో టీడీపీ వర్గపోరు రచ్చకెక్కింది. ఓ కాంట్రాక్ట్ విషయంలో టీడీపీ వర్గాలు బాహాబాహీకి దిగాయి. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వివరాల్లోకి వెళితే...గండికోట రిజర్వాయర్ పరిధిలో కొండాపురంలో పునరావాస కాలనీ పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లకు పిలిచింది. ఈ టెండర్ల విషయంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గీయులు సిండికేట్ అయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సీఎం రమేష్... ఆ టెండర్ల ప్రక్రియను నిలిపివేశారు. దీంతో మంత్రి ఆది, రామసుబ్బారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... సీఎం రమేష్ కార్యాలయంపై దాడి చేసి కంపూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అంతేకాకుండా సమీపంలో సీఎం రమేష్ చేస్తున్న రోడ్ల పనులను కూడా బలవంతంగా నిలిపివేయించారు. పనులు కొనసాగిస్తే వాహనాలను తగులబెడతామని హెచ్చరికలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక స్థానికంగా ఉన్న తమకు కాకుండా సీఎం రమేష్‌కు కాంట్రాక్ట్ పనులు అప్పగించడంపై స్థానిక టీడీపీ నేతలు చాలాకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉప్పు,నిప్పుగా ఉండే మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి టెండర్ల విషయంలో సిండికేట్‌గా మారటం గమనార్హం. -
సీఎం రమేష్ ఆఫీస్‌పై దాడి
-
ఎమ్మెల్సీలుగా రామసుబ్బారెడ్డి, ఫరూక్
సాక్షి, అమరావతి: గవర్నర్ కోటాలో ఏపీ శాసనమండలి సభ్యులు(ఎమ్మెల్సీలు)గా నియమితులైన రామసుబ్బారెడ్డి(వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు), ఎన్ఎండీ ఫరూక్(కర్నూలు జిల్లా నంద్యాల)లతో మండలి ఇన్చార్జి చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం బుధవారం ప్రమాణం చేయించారు. అనంతరం ఫరూక్ మీడియాతో మాట్లాడుతూ.. నంద్యాలలో టీడీపీ గెలుపు కోసం ముఖ్యమంత్రి ప్రతిరోజూ సమీక్ష నిర్వహిస్తున్నారని.. మంత్రులు, ఎమ్మెల్యేలు నంద్యాలలోనే ఉండి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి కళా వెంకట్రావు, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరే..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఫరూక్, రామసుబ్బారెడ్డిలను నామినేట్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో గవర్నర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మండలి మాజీ చైర్మన్ చక్రపాణి, ఆర్.రెడ్డప్పరెడ్డిల పదవీకాలం ముగియడంతో.. వారి స్థానంలో ఫరూక్, సుబ్బారెడ్డిలు నామినేట్ అయ్యారు. -
గవర్నర్ కోటాలో రామసుబ్బారెడ్డి, ఫరూక్
ఏపీ ఎమ్మెల్సీలుగా నియామకం సాక్షి, అమరావతి: గవర్నర్ కోటాలో ఏపీ శాసనమండలి సభ్యులుగా పి.రామసుబ్బా రెడ్డి, ఎన్.ఎం.డి.ఫరూక్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన ఎ.చక్రపాణి, ఆర్.రెడ్డెప్పరెడ్డిల పదవీ కాలం ఈ ఏడాది మే 27వ తేదీతో ముగిసింది. వారి స్థానంలో అధికార పార్టీ సూచన మేరకు వీరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేశారు. -
లక్ష్మీ ప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం
అమరావతి : తండ్రి ఉన్మాద చర్యతో కుటుంబాన్ని కోల్పోయిన లక్ష్మీ ప్రసన్న మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసింది. అనాధగా మారిన ఆమెకు గ్రూప్-2 ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. లక్ష్మీ ప్రసన్న మంగళవారం వెలగపూడి సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రిని కలిసింది. ఆమె విద్యార్హతలు అడగ్గా ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమెస్ట్రీ అని చెప్పడంతో లక్ష్మీప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వాలని సీఎం.. అధికారులను ఆదేశించారు. అధైర్యపడకుండా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ఆమెకు సూచించిన ముఖ్యమంత్రి ప్రభుత్వపరంగానే కాకుండా వ్యక్తిగతంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉద్యోగంతో సరిపుచ్చుకోకుండా ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ఆరు నెలలకు ఓసారి వచ్చి తనను కలవాలని లక్ష్మీప్రసన్నకు సూచించారు. కాగా అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన లక్ష్మీప్రసన్న తండ్రి రామసుబ్బారెడ్డి ఈ నెల 4వ తేదీన (మంగళవారం) భార్య, ఇద్దరు కుమార్తెలు దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటనలో భార్య సులోచన(45), కుమార్తె ప్రత్యూష(20) అక్కడికక్కడే మృతి చెందారు. మరో కుమార్తె ప్రతిభ(22) తీవ్ర గాయాలతో తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే రామసుబ్బారెడ్డి మరో కుమార్తె లక్ష్మీ ప్రసన్న ఆ సమయంలో ఇంటి దగ్గర లేకపోవడంతో ప్రాణాలతో బయటపడింది. ఇప్పటికే లక్ష్మీ ప్రసన్నకు ముఖ్యమంత్రి రూ.20 లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. -
ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితుడి ఆత్మహత్య
తాడిపత్రి: భార్య, ఇద్దరు కుమార్తెలను దారుణంగా హతమార్చిన కేసులో నిందితుడు రామసుబ్బారెడ్డి బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాడిపత్రి టీటీడీ కల్యాణ మండపం వద్ద అపస్మారక స్థితిలో ఉన్న రామసుబ్బారెడ్డిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు...అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాగా భార్య సులోచనమ్మ సహా ఇద్దరు కూతుళ్లు ప్రత్యూష, సాయి ప్రతిభలను నిన్న రామసుబ్బారెడ్డి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. హత్యల అనంతరం పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఓ వైపు భార్య, పిల్లలను అతికిరాతకంగా సుత్తితో హతమార్చడంతో పాటు, పోలీసులు తన కోసం వెతుకుతుండటంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. triple murder, ramasubbareddy, tadipatri, sulochana, family disputes, suicide, హత్యలు, రామసుబ్బారెడ్డి, తాడిపత్రి, సులోచన, కుటుంబకలహాలు,ఆత్మహత్య -
ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితుడి ఆత్మహత్య
-
అనంతపురం జిల్లాలో దారుణ హత్యలు
-
అనంతపురం జిల్లాలో దారుణ హత్యలు
అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యతో పాటు రక్తం పంచుకు పుట్టిన బిడ్డలను కూడా దారుణంగా హతామర్చాడో వ్యక్తి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే... స్థానిక కృష్ణాపురం 40 అడుగుల రోడ్డులో రామసుబ్బారెడ్డి ... భార్య, ఇద్దరు కుమార్తెలు మంగళవారం తెల్లవారుజామున దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటనలో భార్య సులోచన(45), కుమార్తె ప్రత్యూష(20) అక్కడికక్కడే మృతి చెందారు. మరో కుమార్తె ప్రతిభ(22) తీవ్ర గాయాలతో తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ కలహాలతోనే రామసుబ్బారెడ్డి.... భార్య, పిల్లలను సుత్తితో కొట్టి హతమార్చాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబుతో రామసుబ్బారెడ్డి భేటీ
-
చంద్రబాబుతో రామసుబ్బారెడ్డి భేటీ
అమరావతి: టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాజీమంత్రి రామసుబ్బారెడ్డి శనివారమిక్కడ భేటీ అయ్యారు. కాగా గత కొంతకాలంగా రామసుబ్బారెడ్డి ...చంద్రబాబుపై అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. వైఎస్ఆర్ సీపీ నుంచి గెలిచి అనంతరం పార్టీ ఫిరాయించిన ఆదినారాయణరెడ్డిని టీడీపీలో తీసుకోవడంతో పాటు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంపై రామసుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. దీంతో ఆయన ఇటీవల విశాఖలో జరిగిన టీడీపీ మహానాడుకు సైతం గైర్హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలో రామసుబ్బారెడ్డి సమావేశంపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సీఎం రమేశ్‌పై టీడీపీ కార్యకర్తల దాడి
-
సీఎం రమేశ్‌పై టీడీపీ కార్యకర్తల దాడి
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లాలో అధికార పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై అసంతృప్తి రాజుకుంది. మొదట్నుంచీ ఆదినారాయణరెడ్డి రాకను టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డి వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఆయనకు మంత్రిపదవి దక్కడాన్ని జమ్మలమడుగులోని టీడీపీ కార్యకర్తలు, రామసుబ్బారెడ్డి అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం రమేశ్ లాబీయింగ్ వల్లే ఆ యనకు పదవి దక్కిందని వీరు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జమ్మలమడుగులో శుక్రవారం సాయంత్రం రామసుబ్బారెడ్డి పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమం కొనసాగుతుండగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అక్కడికి చేరుకున్నారు. ఆయనను చూసిన టీడీపీ కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొందరు ఆగ్రహంతో కుర్చీలను సీఎం రమేశ్‌పై విసిరేశారు. ఆయన వైపు దూసుకెళ్లారు. సీఎం రమేశ్ చుట్టూ గన్మెన్లు రక్షణ వలయంగా నిలిచారు. గాలిలో లేచిన కుర్చీలు గన్మెన్లకు తగిలాయి. మాజీమంత్రి పి.శివారెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మ ఓవైపు, మాజీమంత్రి రామసుబ్బారెడ్డి కార్యకర్తలను శాంతింపజేశారు. -
'ఫిరాయింపు'పై టీడీపీలో కుమ్ములాట: ఎంపీపై దాడి
జమ్మలమడుగు: ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టిన వ్యవహారంలో టీడీపీలో చెలరేగిన నిరసన జ్వాలలు తారాస్థాయికి చేరుకున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశం వేదికగా తమ్ముళ్లు కుమ్ములాడుకున్నారు. అక్కడే ఉన్న ఎంపీ(రాజ్యసభ) సీఎం రమేశ్‌పైకి కొందరు కుర్చీలు విసిరేశారు. దీంతో సమావేశ ప్రాంగణం అరుపులు, కేకలతో దద్దరిల్లింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తొలి నుంచీ టీడీపీనే నమ్ముకుని పార్టీ ఉన్నతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన తమకు పదవులు ఇవ్వకుండా నిన్నమొన్న చేరినవారికి మంత్రి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. ఇంకాస్త రెట్టిస్తూ.. ఆదినారాయణరెడ్డికి.. ఎంపీ సీఎం రమేశ్ తొత్తుగా వ్యవహరిస్తున్నాడని, ఆదికి మంత్రి పదవి దక్కడంలో రమేశ్ ముఖ్యపాత్ర పోషించాడని రామసుబ్బారెడ్డి విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో రామసుబ్బారెడ్డి వర్గీయులు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. 'సీఎం రమేశ్.. గో బ్యాగ్..' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆవేశం పట్టలేని కార్యకర్తలు ఒక దశలో సీఎం రమేశ్ వైపునకు కుర్చీలు విసిరేశారు. 'పార్టీని నమ్ముకున్న మాకు తగిన శాస్తి జరిగింది.. పార్టీ ఫిరాయించినవాళ్లకు మంత్రి పదువులు దక్కాయి..'అని రామసుబ్బారెడ్డి వర్గీయులు వాపోయారు. ఒక్క వైఎస్సార్ జిల్లాలోనేకాక ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన అన్ని జిల్లాల్లోనూ టీడీపీలో ఇదే పరిస్థితి నెలకొంది. అంతేకాదు, మంత్రిపదవులు దక్కినవారి వ్యతిరేకులు ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నారు. ఇటీవలే గుంటూరు మండలం లో అంబేడ్కర్ స్మృతి వనం పరిశీలనకు వెళ్లిన మంత్రి నక్కా ఆనందబాబుకు చేదు అనుభవం ఎదురైంది. తుళ్లూరు మండలం శాకమూరులో అంబేడ్కర్ స్మృతి వనం భూమి పూజకు ఏర్పాట్ల పరిశీలనకు వెళ్లిన మంత్రి నక్కా ఆనంద్ బాబు కాన్వాయ్ ను శ్రవణ్ కుమార్ వర్గీయులు అడ్డుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా పర్యటనకు రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశం’లో ‘ఆది’ చిచ్చు! -
'ఫిరాయింపు'పై టీడీపీలో కుమ్ములాట
-
టీడీపీలో విస్త'రణం' ప్రకంపనలు
అమరావతి: ఆశావహుల మధ్య ఏపీ మంత్రివర్గ విస్త‘రణం' ముమ్మరమైంది. పదవులపై నేతల అసంతృప్తులు, అలకలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో వైఎస్ఆర్ జిల్లా పదవులు పంచాయితీ మరికాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. వైఎస్ఆర్ జిల్లా నుంచి ఆదినారాయణరెడ్డి...పదవి రేసులో ఉన్నారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే జిల్లా టీడీపీ నేతలు రామసుబ్బారెడ్డి, మేడ మల్లికార్జునరెడ్డి ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. దీంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. మేడ మల్లికార్జునరెడ్డి, లింగారెడ్డి, రామసుబ్బారెడ్డి, సీఎం రమేష్‌లతో ఆయన భేటీ అయ్యారు. రామసుబ్బారెడ్డకి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు బుజ్గించేందుకు యత్నించారు. అయితే తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి అవసరం లేదని, ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇస్తే తాను పార్టీలో ఉండేది లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ... ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయన్నారు. అయితే దీనిపై జిల్లా నేతలకు ఎలాంటి సమాచారం లేదన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారికి అవకాశం ఇవ్వాలని రామసుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం బలపడేవిధంగా నిర్ణయాలు జరగాలన్నారు. ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవిపై రామసుబ్బారెడ్డిని విలేకరులు ప్రశ్నించగా, దీనిపై సీఎం పిలిచి అడిగినప్పుడు తన నిర్ణయం చెబుతానని ఆయన అన్నారు. ఆర్టీసీ చైర్మన్ పదవి వద్దని తాను గతంలోనే సీఎంకు చెప్పానని ఆయన పేర్కొన్నారు. ఆదినారాయణరెడ్డి పార్టీలో చేరుతున్న సమయంలో కూడా తమ నిర్ణయం చెప్పామని, అయితే సీఎం అన్ని తాను చూసుకుంటానన్నారని తెలిపారు. తమ గౌరవంతో పాటు కార్యకర్తలు ఇబ్బందిపడకుండా చూడాలని ఆరోజే ముఖ్యమంత్రికి చెప్పామన్నారు. మరోవైపు జిల్లా నేత మేడా మల్లికార్జున రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆయన ఇవాళ సీఎంను కలిసి కేబినెట్లో తనకు స్థానం కల్పించాలని కోరారు. భేటీ అనంతరం మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ...మంత్రి పదవి ఇవ్వాలని సీఎంను కోరారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిరాయింపుదారులకు అవకాశం ఇస్తే ఊరుకునేది లేదని ఆయన అన్నారు. పార్టీ టికెట్‌పై గెలిచినవారికే మంత్రి పదవి ఇవ్వాలన్నారు. ఇక మంత్రివర్గ కూర్పుపై ఇవాళ రాత్రికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
ఆశావహుల మధ్య మంత్రి వర్గ విస్త‘రణం'
-
పీఎస్‌లో తన్నుకున్న 'తమ్ముళ్లు'
కడప: వైఎస్ఆర్ జిల్లాలో తెలుగుతమ్ముళ్ల మధ్య వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. జిల్లాలోని తాళ్ల ప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్‌లో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. నీరు - చెట్టు కాంట్రాక్ట్ విషయంలో రెండు వర్గాలు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయులు 10 మంది గాయపడ్డారు. దీంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి... వైద్య చికిత్స అందిస్తున్నారు. -
ఆయన వస్తే నా దారి నాదే: రామసుబ్బారెడ్డి
విజయవాడ: తెలుగుదేశం పార్టీలో ఆదినారాయణరెడ్డి చేరికను టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీలో ఆదినారాయణరెడ్డి చేరితే తన దారి తాను చూసుకుంటానని ఆయన సోమవారమిక్కడ స్పష్టం చేశారు. ఆయన కారణంగా తన కుటుంబ సభ్యులను కోల్పోయానని, అలాంటి వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. తానే కాదని, నియోజకవర్గంలోని కార్యకర్తలు కూడా ఆదినారాయణరెడ్డి చేరికపై అభ్యంతరాలు ఉన్నాయన్నారు. జమ్మలమడుగులో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలు,నష్టపోయిన వారికి ఆ బాధ తెలుస్తుందన్నారు. ఆదినారాయణ రెడ్డి చేరిక తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మీరే చూస్తారని రామసుబ్బారెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధ్యక్షుడి మాటను గౌరవిస్తున్నామని, అయితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చెప్పలేనని,కార్యకర్తల అబిప్రాయాలను కూడా ముఖ్యమంత్రి నేరుగా వినాలని ఆయన అన్నారు. అయితే చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకం కాదని, పార్టీకి జరిగే నష్టం గురించి వివరించామన్నారు. -
చంద్రబాబును కలిసిన రామసుబ్బారెడ్డి
విజయవాడ : పార్టీకి నష్టం జరగకుండా ఉండేలా వలసలు వస్తే... తనకెలాంటి ఇబ్బంది లేదని వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డి అన్నారు. ఆయన శనివారం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు నాయుడును కలిశారు. అనంతరం రామసుబ్బారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి తాను ఉన్నానని, చంద్రబాబుకు జిల్లాలోని వాస్తవ పరిస్థితులను వివరించినట్లు చెప్పారు. కాగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో...రామసుబ్బారెడ్డి....బాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
భారం.. దారుణం
కడప అగ్రికల్చర్ : మూలిగే నక్కపై తాటి కాయ పడిందన్న చందంగా ప్రభుత్వాలు రైతులపై మోయలేని భారం మోపుతున్నాయి. కంపెనీలకు మేలు చేస్తూ రైతు నడ్డి విరుస్తున్నాయి. సరైన సమయంలో వర్షం పడక ఖరీఫ్‌లో ప్రధాన పంటలు సాగు కాలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు కొంత మంది రైతులు చిరు ధాన్యాల పంటలు వేసుకున్నారు. మరికొందరు రబీ సాగుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎరువుల ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించడంతో ఇదే అవకాశంగా ఆయా కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పదిహేను శాతం పెంచేశారు. 50 కిలోల డీఏపీ బస్తా ధర రూ.1270 నుంచి రూ.1302కు చేరింది. కాంప్లెక్స్ ఎరువులు బస్తాపై అదనంగా రూ.32 నుంచి 63 రూపాయలకు పెంచారు. అన్ని ఎరువులపై సరాసరి రూ.15 నుంచి రూ.70 వరకు పెరిగాయి. ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకుగాను డీఏపీ 30 వేల మెట్రిక్ టన్నులు, కాంపెక్స్ ఎరువులు 62 వేల మెట్రిక్ టన్నులు తెప్పించారు. ఖరీఫ్, రబీ సీజన్లకుగాను రైతులు డీఏపీ ఎరువులకు రూ.72 కోట్లు, కాంప్లెక్స్ ఎరువుపై రూ.124 కోట్లు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన పెరిగిన ఎరువుల ధర జిల్లా మొత్తంగా రైతులపై రూ.9.2 కోట్లు పడనుంది. ఎరువులు, క్రిమి సంహారక మందుల ధరలు పెరుగుతున్నా తమ పంటకు మద్దతు ధర మాత్రం పెరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర పెంచాలి ఏటా ఎరువుల ధరలు పెరుగుతున్నా పండించిన పంటకు మాత్రం ధరలు పెరగడం లేదు. రైతులను నట్టేట ముంచుతూ ఎరువుల కంపెనీలకు మేలు చేస్తారా.. ప్రభుత్వాలకు తగదిది. ఎరువుల కంపెనీలకు భయపడి రైతులకు ఇక్కట్లు కల్పించడం భావ్యం కాదు. - జయకుమార్‌రెడ్డి, రైతు, చింతకొమ్మదిన్నె ఎరువుల ధరలు పెరగకుండా చూడాలి ప్రతిసారీ ఎరువుల ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు. రైతులకు మేలు చేయకుండా కంపెనీలతో కుమ్మక్కై మోసం చేయడం దారుణం. ధరలు పెంచకుండా ప్రభుత్వమే కంపెనీలకు సబ్సిడీ పెంచితే సరిపోతుంది కదా? - ఇమామ్ సాహెబ్, రైతు, ఐఎస్ కొట్టాల, వేముల మండలం. ఆందోళన చేస్తాం ఎరువుల ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఏటా ఎరువుల ధరలతోపాటు పంటకు మద్దతు ధరలు కూడా పెంచాలి. ఎరువుల ధరలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. - రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం -
ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తల హత్య
అనంతపురం జిల్లా: రాయలసీమలో ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలను దారుణంగా హతమార్చారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామం ఎస్సీ కాలనీలో సోమవారం ఈ హత్యలు జరిగాయి. ఎద్దుల దూలం లాగుడు పోటీలు జరుగుతుండగా వివిధ గ్రామాలకు చెందిన వారు అక్కడ చేరారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీకి చెందిన రామసుబ్బారెడ్డి, లాలెప్పలను గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో హతమార్చి పరారయ్యారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు జరిగింది. పాత కక్షలే ఈ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతులిద్దరూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. (గుంతకల్లు) -
రెచ్చిపోయిన టీడీపీ నేత రామసుబ్బారెడ్డి
-
రెచ్చిపోయిన టీడీపీ నేత రామసుబ్బారెడ్డి
కడప : వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారంలోకి వచ్చామన్న అహంకారంతో టీడీపీ నేత రామసుబ్బారెడ్డి రెచ్చిపోయారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా రెండువేల మంది కార్యకర్తలతో ఆయన మున్సిపల్ కార్యాలయంలోకి దూసుకు వచ్చారు. దాంతో పోలీసులు వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులను కార్యకర్తలు ఏమాత్రం లెక్కచేయక చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత రామసుబ్బారెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అయితే నిబంధనలకు విరుద్దంగా కార్యకర్తలను కార్యాలయంలోకి అనుమతిచ్చేది లేదని పోలీసులు స్పష్టం చేశారు.