
రెచ్చిపోయిన టీడీపీ నేత రామసుబ్బారెడ్డి
వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కడప : వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారంలోకి వచ్చామన్న అహంకారంతో టీడీపీ నేత రామసుబ్బారెడ్డి రెచ్చిపోయారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా రెండువేల మంది కార్యకర్తలతో ఆయన మున్సిపల్ కార్యాలయంలోకి దూసుకు వచ్చారు. దాంతో పోలీసులు వారిని పోలీసులు అడ్డుకున్నారు.
అయితే పోలీసులను కార్యకర్తలు ఏమాత్రం లెక్కచేయక చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత రామసుబ్బారెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అయితే నిబంధనలకు విరుద్దంగా కార్యకర్తలను కార్యాలయంలోకి అనుమతిచ్చేది లేదని పోలీసులు స్పష్టం చేశారు.