
చంద్రబాబుతో రామసుబ్బారెడ్డి భేటీ
టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాజీమంత్రి రామసుబ్బారెడ్డి శనివారమిక్కడ భేటీ అయ్యారు.
అమరావతి: టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాజీమంత్రి రామసుబ్బారెడ్డి శనివారమిక్కడ భేటీ అయ్యారు. కాగా గత కొంతకాలంగా రామసుబ్బారెడ్డి ...చంద్రబాబుపై అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. వైఎస్‌ఆర్ సీపీ నుంచి గెలిచి అనంతరం పార్టీ ఫిరాయించిన ఆదినారాయణరెడ్డిని టీడీపీలో తీసుకోవడంతో పాటు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంపై రామసుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. దీంతో ఆయన ఇటీవల విశాఖలో జరిగిన టీడీపీ మహానాడుకు సైతం గైర్హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలో రామసుబ్బారెడ్డి సమావేశంపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.