చంద్రబాబును కలిసిన రామసుబ్బారెడ్డి
విజయవాడ : పార్టీకి నష్టం జరగకుండా ఉండేలా వలసలు వస్తే... తనకెలాంటి ఇబ్బంది లేదని వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డి అన్నారు. ఆయన శనివారం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు నాయుడును కలిశారు.
అనంతరం రామసుబ్బారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి తాను ఉన్నానని, చంద్రబాబుకు జిల్లాలోని వాస్తవ పరిస్థితులను వివరించినట్లు చెప్పారు. కాగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో...రామసుబ్బారెడ్డి....బాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.