సాక్షి, వైఎస్సార్ : జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎంతో మంది నాయకులు ఉన్న మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు ఏక్ నిరంజన్ అయిన తనంటే భయమెందుకని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రశ్నించారు. వారికి ఓటమి భయం పుట్టుకొచ్చినందుకే తనను ప్రచారం చేసుకోనివ్వడం లేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో గడచిన మూడు ఎలక్షన్లు చూస్తే.. 2004, 2009, 2014లో కూడా అక్కడి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోలేదు. అక్కడి ప్రజలను మోటివేట్ చేయడానికి జమ్మలమడుగు డీఎస్‌పీ 2వ తేదీ ప్రచారం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి ఆదినారాయణరెడ్డి ఒత్తిళ్లకు లొంగి నన్ను హౌస్ అరెస్ట్ చేయడం దారుణం.
ఓటమి భయంతోనే నా ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు. మీరు నా సొంత ఊరిలో ప్రచారం చేసుకున్నారు నేను అడ్డుకున్నానా. మంత్రి ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల ఫ్యాక్షన్ వల్ల ఎన్నో అమాయక కుటుంబాలు నాశనం అయ్యాయి. ప్రజలకు సేవచేసే నాయకుల్లా మెలగాలి.. రౌడీలుగా మెలగడం మానుకోండి. అడ్డుకుంటే భయపడే వాడిని కాదు. రామసుబ్బారెడ్డి సొంత ఊరు గుర్లకుంటలో ప్రచారం చేస్తా. మీ ఇద్దరిదీ 30 ఏళ్ల రాజకీయ జీవితం. నా మూడేళ్ల రాజకీయ జీవితంతో భయపడడం ఏంటి. గత ఎలక్షన్లలో దేవగుడికి పోవాలన్న రామసుబ్బారెడ్డి, సీఎం రమేష్‌పై రాళ్లు విసిరిన ఆదినారాయణరెడ్డి ఇప్పుడు సిగ్గు లేకుండా ఫిఫ్టీ, ఫిఫ్టీ బాటలో నడుస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. రాబోయే ఎలక్షన్లలో ప్రజలు వీరికి తగిన గుణపాఠం చెబుతార’న్నారు.
Comments
Please login to add a commentAdd a comment