ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఫరూక్, రామసుబ్బారెడ్డిలను నామినేట్ అయ్యారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఫరూక్, రామసుబ్బారెడ్డిలను నామినేట్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో గవర్నర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మండలి మాజీ చైర్మన్ చక్రపాణి, ఆర్.రెడ్డప్పరెడ్డిల పదవీకాలం ముగియడంతో.. వారి స్థానంలో ఫరూక్, సుబ్బారెడ్డిలు నామినేట్ అయ్యారు.