Legislative Council
-
ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. రాజకీయాలకు దూరంగా ఉండాలి
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయాలు జొప్పించకుండా, శాసన మండలిలో ఆయా వర్గాలకే ప్రాతినిధ్యాన్ని విడిచిపెట్టాలని మండలి చైర్మన్ మోషేన్‌రాజు అభిప్రాయపడ్డారు. పీడీఎఫ్ సభ్యుల పదవీ విరమణ వల్ల విద్యార్థులు, యువత, ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల సమస్యలను ప్రస్తావించడంలో సభ మూగబోతుందేమోనని ఆయన పేర్కొన్నారు. మంగళవారం శాసన మండలిలో పదవీ విరమణ పొందుతున్న ఏడుగురు ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, వెంకటేశ్వర్లు, రఘువర్మ(పీడీఎఫ్), యనమల రామకృష్ణుడు, పి.అశోక్‌బాబు, డి.రామారావు, బీటీ నాయుడు(టీడీపీ)లకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అభ్యర్థులను పోటీలో నిలపడంతో ఆయా వర్గాల ప్రాతినిధ్యాన్ని, వారి గొంతుకను అడ్డుకుంటున్నామా? అనే భావన కలుగుతోందన్నారు. పీడీఎఫ్ సభ్యులు లక్ష్మణరావు, వెంకటేశ్వర్లు, రఘువర్మ సభలో బడుగు బలహీన వర్గాల సమస్యలను ప్రస్తావించేటప్పుడు సంతోషంగా ఉండేదన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం గల యనమల రామకృష్ణుడు తాను నమ్మిన పార్టీ అభివృద్ధికి ఎనలేని సేవలందించారని ప్రశంసించారు. బీటీ నాయుడు మరోసారి ఎన్నికవడం అభినందనీయమన్నారు. ఇకపై ఎమ్మెల్సీలు ఎవరైనా పదవీ విరమణ పొందితే సభా సంప్రదాయం ప్రకారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తామని చైర్మన్ ప్రకటించారు.సభలో యనమల ఉంటే బాగుండేది: బొత్ససభలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలపైనే పోరాటం తప్ప సొంత అజెండాలు ఉండవని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా సభలో యనమల రామకృష్ణుడు కూడా ఉండి ఉంటే బాగుండేదని బొత్స అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అలాంటి సీనియర్ రాజకీయ నాయకుల మాటలు, అనుభవం సభ్యులకు అవసరమన్నారు. చైర్మన్ స్పందిస్తూ... తాను ఫోన్ చేసినప్పటి కీ అనారోగ్యం కారణంగా యనమల రాలేకపోతున్నట్టు చెప్పారన్నారు. బొత్స మాట్లాడుతూ యనమల ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా, స్పీకర్‌గా, ఆర్థిక మంత్రిగా ఎంతో విలువైన సేవలు అందించారని కొనియాడారు. స్పీకర్‌గా యనమల తీసుకొచి్చన సంస్కరణలను ఇప్పటికీ కొనసాగిస్తున్నామని తెలిపారు. పీడీఎఫ్ సభ్యులు సమాజంలోని రుగ్మతలను సభలో ప్రస్తావిస్తూ, వాటి పరిష్కారం కోసం ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ శాసన వ్యవస్థలో లైవ్ స్ట్రీమింగ్ అనేది యనమల స్పీకర్‌గా ఉన్నప్పుడు తీసుకొచి్చన సంస్కరణల్లో భాగంగా వచ్చిందన్నారు. -
వెరిఫికేషన్ పేరిట లక్షలాది పింఛన్ల తొలగింపు
సాక్షి, అమరావతి : పది నెలల కూటమి పాలనలో కొత్తగా ఒక్క సామాజిక భద్రతా పింఛన్ కూడా మంజూరు చేయకపోగా, ఏకంగా లక్షల మంది ఫించన్లను తొలగించారని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. అభాగ్యులకు పింఛన్లు తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేసింది. సామాజిక భద్రతా పింఛన్లపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్న గురువారం మండలిలో చర్చకు వచ్చిoది. ఈ సందర్భంగా సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 2024 జూన్ నాటికి రాష్ట్రంలో 65,18,496 మంది పింఛన్ లబ్దిదారులుండగా, ఈ ఏడాది ఫిబ్రవరికి ఆ సంఖ్య 63,59,907కు తగ్గిందని.. గత ఏడాది జూన్ నుంచి 14,967 పింఛన్లు మాత్రమే తొలగించామన్నారు. మంత్రి సమాధానం పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏకంగా 1.58 లక్షల పింఛన్లు తగ్గడం కళ్లెదుటే కనిపిస్తుంటే కేవలం 14 వేలే తొలగించామని మంత్రి చెప్పడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. వెరిఫికేషన్ పేరిట ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్న వారి పింఛన్లు తొలగించడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ వారికి ఎలాంటి మేలు చేయొద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెబుతుండటంతో ఇష్టానుసారం పింఛన్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. మరో ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మాట్లాడుతూ.. కూటమికి ఓటు వేయలేదన్న కక్షతో గ్రామాల్లో పింఛన్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చామన్నారు. 2019 నాటికి 53,85,776 పింఛన్ లబి్ధదారులు ఉంటే, 2024 నాటికి 65,18,496కు పెరిగినట్టు వివరించారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. గతంలో పింఛన్ అర్హతకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఉండేదని, ఇప్పుడు దాన్ని 13–స్టెప్ వెరిఫికేషన్‌గా మార్చారన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి జోక్యం చేసుకుంటూ 13–స్టెప్ వెరిఫికేషన్ లేదన్నారు. దీంతో పింఛన్ వెరిఫికేషన్ కోసం ప్రభుత్వం రూపొందించిన 13 అంశాలను మొండితోక అరుణ్‌కుమార్ సభలో చదివి వినిపించారు. సదరం సరి్టఫికెట్‌కు 15 రోజుల గడువు పెట్టారని, అయితే స్లాట్ దొరకడానికే నెలలు పడుతోందన్నారు. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి మంజూరు చేస్తారని అడిగారు. కార్యాచరణ రూపొందిస్తున్నామని, త్వరలో దరఖాస్తుల స్వీకరిస్తామని మంత్రి కొండపల్లి తెలిపారు. ‘ఆడ బిడ్డ నిధి’ అంతేనా? ‘ఆడ బిడ్డ నిధి’ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని వైఎస్సార్సీపీ మహిళా ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, టి.కల్పలత ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ పథకం అమలుపై నిర్దిష్ట కాల పరిమితిపై స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో వారు మాట్లాడుతూ.. ఆడబిడ్డలకు తమ ప్రభుత్వం రాగానే నెలకు రూ.1500 ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఒక ఇంట్లో ఎంత మంది మహిళలలుంటే అంతమందికీ వర్తింపజేస్తామని ప్రచారం చేశారన్నారు. పది నెలలైనా పథకం ఊసే లేదని, కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని, ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని నిలదీశారు. దీనిపై మంత్రి శ్రీనివాస్ స్పందిస్తూ మరికొంత సమయం పడుతుందంటూ సమాధానం దాటవేశారు. -
మాది స్కీమ్.. మీది స్కామ్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశ పెడితే, వాటిని స్కాములుగా చిత్రీకరించేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోందని శాసన మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు మండిపడ్డారు. స్కాములన్నీ చేసింది టీడీపీ ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. ధైర్యం ఉంటే 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై వేసిన సిట్ నివేదికలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గురువారం శాసనన మండలిలో ‘2019–24 మధ్య జరిగిన కుంభకోణాలు’పై లఘు చర్చ జరిగింది. టీడీపీ సభ్యురాలు అనురాధ చర్చను ప్రారంభిస్తూ గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో విపక్ష సభ్యులు అడ్డుపడి.. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే విచారణ చేసి, మాట్లాడాలని అనడంతో ఆమె నీళ్లు నమిలారు. విశాఖలో విజయసాయిరెడ్డి బినామీ పేర్లతో భూములు కొన్నారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూములను ఆక్రమించారంటూ ఆమె విమర్శలకు దిగారు. సభలో లేని వ్యక్తుల పేర్లు ఎలా ప్రస్తావిస్తారంటూ వైఎస్సార్సీపీ సభ్యులు అరుణ్‌కుమార్, రమేష్‌యాదవ్ మండిపడ్డారు. అవి ఆక్రమించిన భూమలు కాదని స్థానిక కలెక్టర్లు నివేదిక కూడా ఇచ్చారని స్పష్టం చేశారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది.. వైఎస్సార్సీపీ సభ్యుడు కుంభా రవిబాబు మాట్లాడుతూ.. కుంభకోణాలపై టీడీపీ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని అన్నారు. ఆనాడు ఓటుకు కోట్లు కుంభకోణంలో చిక్కుకుని రాత్రికి రాత్రే సర్దుకుని విజయవాడకు వచ్చేశారని చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అప్పటి నుంచి ఏపీలో స్కాములపర్వం మొదలెట్టి, రాష్ట్రాన్ని అవినీతిలో నంబర్ 1గా నిలబెట్టారని మండిపడ్డారు. రాజధాని పేరుతో అంతర్జాతీయ స్థాయిలో రియల్ ఎస్టేట్ స్కామ్ చేశారని దుయ్యబట్టారు. నైపుణ్యాభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దోచేసిన కేసులో చంద్రబాబును న్యాయస్థానం జైల్లో పెట్టిందన్నారు. విచారణకు సహకరించకుండా ఆయన పీఏను దేశాలు దాటించేశారని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రకటనకంటే ముందే టీడీపీ నాయకులు బినామీ పేర్లతో దళితులు, నిరుపేదల అసైన్డ్ భూములను చౌకగా కొట్టేశారన్నారు.హెరిటేజ్ పేరిట కూడా 14 ఎకరాలు కొన్నారన్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీనే చెప్పారని అన్నారు. రూ.150 కోట్లు కూడా ఖర్చవ్వని తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలకు రూ.1,115 కోట్లు వెచ్చి0చారంటే ఎంత అవినీతి జరిగిందో స్పష్టమవుతోందని అన్నారు. 23 సీట్లకు ఎందుకు పడిపోయింది? రాజధానిలో అవినీతికి పాల్పడకపోతే 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకు ఎందుకు పడిపోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ప్రశ్ని0చారు. పోర్టులు, స్కిల్ కాలేజీలు, వర్సిటీల నిర్మాణం, భారీగా కంపెనీలను తేవడం స్కాములు ఎలా అవుతాయని అన్నారు. 2019–24 మధ్య కుంభకోణాలపై చర్చకు నోటిసిస్తే పాతవన్నీ తోడటం సరికాదంటూ మంత్రి అచ్చెన్నాయుడు అడ్డుపడ్డారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్చిట్ ఇచ్చేసినట్టు చెప్పుకొచ్చారు. దీనిపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. అధికారపక్ష సభ్యులు పేపర్ల కథనాలు చూపించి కుంభకోణాలు అంటున్నారని, ఒక్క దానిపైనైనా రుజువులు చూపారా అని నిలదీశారు. విశాఖ భూములపై సిట్ నివేదిక బయటపెట్టండిటీడీపీ ప్రభుత్వం 2016లో విశాఖ భూములపై వేసిన సిట్ నివేదికను బయట పెట్టాలని బొత్స డిమాండ్ చేశారు. అందులోని వ్యక్తులు ఎవరైనా రాజకీయాలకు అతీతంగా శిక్షించాలని అన్నారు. అందులో విలువైన దసపల్లా భూములున్నాయని, ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని అధికారపక్షాన్ని నిలదీశారు. గత ప్రభుత్వాధినేత భూ బకాసురుడిగా మారి అనుయాయులతో కలిపి దోపిడీ చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అనడంతో బొత్స తీవ్రంగా స్పందించారు. ఇలాంటి దుష్ట సంప్రదాయాన్ని ప్రదర్శిస్తున్న సభలో ఉండలేం అంటూ వాకౌట్ చేశారు. ఆధారాల్లేకుండా బురదజల్లుడా? మండలిలో ఇవాళ జరిగిన ప్రశ్నోత్తరాల్లోగానీ, స్వల్పకాలిక చర్చలోగానీ ప్రభుత్వం నుంచి నిర్దిష్ట సమాధానాలు రాలేదని బొత్స చెప్పారు. మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ మీద, తమ నాయకుడి మీద ఆధారాల్లేకుండా ఆరోపణలు చేసినందునే సభ నుంచి వాకౌట్ చేశామన్నారు. మేము భారత్‌లో అడుగుపెట్టిన తర్వాత బీహార్‌లో వ్యాపారం చేయాలంటే దుర్భర పరిస్థితులు ఉంటాయని వినిపించింది. అన్ని విమానాశ్రయాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ 1 అని చూశాం. కానీ, ఐదేళ్లలో మాకు బీహార్ చక్కటి ప్రణాళిక, సుపరిపాలనతో దూసుకెళ్తుండగా, ఏపీ పూర్తి అయోమయంగా, అవగాహన లేకుండా ఉంది. ఏపీలో అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా మాకు వచ్చిన రాజధాని డిజైన్ ప్రతిపాదనలను విరమించుకుని బయటకు వెళ్లిపోయాం.. –జపాన్ ఆర్కిటెక్చర్ సంస్థ సీఈవో వారి మేగజైన్లో ఏప్రిల్ 2017 సంచికలో రాసిన వ్యాసంలో చెప్పిన ఈ వివరాలను మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుడు కుంభా రవిబాబు ప్రస్తావించారు. -
ఎస్సీ కమిషన్ నివేదిక నోటిఫై అయ్యాకే డీఎస్సీ
సాక్షి, అమరావతి: ‘ఎస్సీ వర్గీకరణపై వచ్చిన నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అది హౌస్‌లో చర్చకు వస్తుందని అనుకుంటున్నాం. ఆ తర్వాత కేబినెట్ ఆమోదంతో ఎస్సీ కమిషన్‌కు పంపించి ఆ మేరకు నోటిఫికేషన్ విడుదలయ్యాక డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం’ అని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. డీఎస్సీకి కట్టుబడి ఉన్నామని, ఈ సంవత్సరమే ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. బుధవారం శాసన మండలిలో ‘విద్యా రంగంలో సంస్కరణల’పై నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం విద్యార్థులకు ట్యాబ్స్ ఇవ్వడం ద్వారా రూ.1,300 కోట్లు వృథా చేసిందని విమర్శించారు. ‘తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు ట్యాబ్స్ ఇవ్వడం సరికాదని నాతో చెప్పారు. మళ్లీ మీరు ట్యాబ్స్ ఇవ్వకండన్నారు. నాకు తొమ్మిది సంవత్సరాల అబ్బాయి దేవాన్‡్ష ఉన్నాడు. తనకు ఫోన్ ఇవ్వం. ఐప్యాడ్ లేదు.వారానికి రెండు గంటలు ఒక సినిమా చూడొచ్చు. కానీ, టెక్నాలజీ యుగంలో హోం వర్క్, రీసెర్చ్ ఆన్లైన్ చేయాలంటే డెస్‌్కటాప్ (కంప్యూటర్)ని అది కూడా సూపర్వైజ్ చేసి∙యాక్సెస్ ఇస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు. సీబీఎస్సీ మోడల్ ఎగ్జామ్ విధానంపై చాలా ప్రిపరేషన్ అవసరమని, అది పూర్తి అయిన తర్వాతే కొనసాగించేందుకు వాయిదా వేశామన్నారు. స్థానికంగా విద్యార్థులు ఇంగ్లిష్ లో వెనుకబడితే గత ప్రభుత్వం టొఫెల్‌తో ఇబ్బంది పెట్టిందన్నారు. ఉపాధ్యాయులకు యాప్‌ల భారం తగ్గిస్తామని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను దశల వారీగా విడుదల చేస్తామని చెప్పారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై ఉపాధ్యాయులకు సెలవుల్లోనే శిక్షణ తరగతులు పెడతామని, వర్సిటీలకు ఉమ్మడి చట్టం తీసుకురావడంతో పాటు డీప్‌టెక్ వర్సిటీని నెలకొల్పుతామని చెప్పారు. అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీని డిజిటల్ వర్సిటీగా మారుస్తామన్నారు. పంచాయతీరాజ్ శాఖను నిర్వహించడం ఎంతో సులువని, అయితే తాను కఠినమైన విద్యా శాఖను తీసుకున్నానని తెలిపారు. -
శాసన మండలిలో పెద్దఎత్తున YSRCP సభ్యుల నినాదాలు
-
మండలి: మేం అనుసరించిన విధానాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది: బొత్స
మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు తీవ్ర నిరాశను కలిగించాయి : వరుదు కళ్యాణి👉పెట్టుబడి సాయం 20 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు👉ఇప్పుడు కేంద్రం సాయంతో కలిపి 20 వేలు ఇస్తామంటున్నారు👉మండలి సాక్షిగా రైతుకి వెన్నుపోటు పొడిచారు👉ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసింది👉అన్నమో రామచంద్రా అనే పరిస్థితికి రైతును తీసుకొచ్చారు👉జగన్ మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయం పండుగలా సాగింది👉కూటమి పాలనలో సాగు విస్తీర్ణం తగ్గిపోయిందిఅచ్చెన్నాయుడు మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు : బొత్స👉2016లో రుణమాఫీకి బాండ్ ఇచ్చారు👉రుణమాఫీ చేయకుండా 2019 వరకూ ఏం చేశారు👉మిర్చి ఒక్క టన్నైనా 11,700 రూపాయలకి కొన్నారా👉గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలని కోరుతున్నాం60% శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారు: బొత్స👉గత ప్రభుత్వంలో రైతులను సకాలంలో ఆదుకున్నాం👉విపత్తు వస్తే సీజన్ ముగిసేలోపు పరిహారం అందించాం👉విత్తనాలు...ఎరువులు రైతుల వద్దకే తీసుకెళ్లి అందించాం👉మా ప్రభుత్వంలో అనుసరించిన వ్యవసాయ విధానాలను నీతిఆయోగ్ కూడా ప్రశంసించింది👉మేం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేశాం👉వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేనాటికి సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ చెల్లించాల్సిన బకాయిలు 5286 కోట్లు👉వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకుంటే రైతుల పేరుతో డబ్బులు తీసుకున్నారనడం కరెక్ట్ కాదు👉ఇలా మాట్లాడటం రైతులను అవమానపరచడమేమంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ అభ్యంతరం👉తప్పు జరిగితే విచారణ జరిపించుకోవడం ఆయా ప్రభుత్వాల విధానం👉తాడేపల్లి ప్యాలెస్‌లో రికార్డులు తగలబెట్టేశారనడం సరికాదు👉రికార్డుల నుంచి మంత్రి వ్యాఖ్యలు తొలగించాలి👉ఆధారాలుంటే రుజువుచేయండి👉బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదు👉తగలబెట్టినట్లు ఆధారాలుంటే కేసు ఫైల్స్‌లో ఎంక్వైరీ బైండింగ్స్‌లో చేర్చుకోండిబుడమేరు వరద సాయంపై మండలిలో చర్చ👉వరద బాధితుల్లో అనేకమందికి ఇంకా పరిహారం అందలేదు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్👉వరద సహాయం విషయంలో ప్రభుత్వం విఫలమైంది👉ఆపరేషన్ బుడమేరు అన్నారు.. ఇప్పటివరకు ఏం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి👉బుడమేరు గేట్లను ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రుహుల్లా👉వరదల తర్వాత బుడమేరును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు👉ఇప్పటికీ అనేకమంది బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు👉ఒక ఇంటికి పరిహారం ఇచ్చి 10 ఇళ్లకు ఇచ్చినట్లు రాసుకున్నారు👉అందరికీ సాయం అందిందని చెప్పడం పచ్చి అబద్ధం👉కూటమి ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు: బొత్స సత్యనారాయణ👉వైఎస్ జగన్ ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించాం👉నేనే అందుకు బాధ్యత తీసుకున్నా👉కూటమి సర్కార్ సాయం అందించడంలో విఫలమైంది👉ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు👉అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించాంఏపీ శాసనమండలిలో ఉచిత ఇసుకపై వాడివేడిగా చర్చ 👉కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక ధర పెరిగింది: బొత్స సత్యనారాయణ👉విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇసుక ధర తగ్గలేదు👉ప్రభుత్వం చెప్పినట్లు ఇసుక ఇవ్వడం లేదు👉గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఎంతకిస్తున్నారో వెరిఫై చేయాలి👉కూటమి నేతలు చెప్పే లెక్కలు తప్పుగా ఉన్నాయి.👉కూటమి నేతలు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు👉ఉచిత ఇసుక, ఇసుక అక్రమ అమ్మకాలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల స్టాక్‌ను కొత్త ప్రభుత్వానికి అప్పగించిందని.. దానిలో ఎంత స్టాక్ రికార్డెడ్‌గా జమ చేశారు?. ఎంత ఆదాయం వచ్చిందని ప్రశ్నించారు. రీచ్‌లలో ట్రాక్టర్ల నుంచి లారీల్లోకి ఇసుక వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొత్తం మెషినరీల ద్వారానే ఇసుకను తీసి లారీలకు లోడు చేస్తున్నారు. రాత్రి, పగలూ తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది’’ అని తోట త్రిమూర్తులు మండిపడ్డారు.👉‘‘ఒక్కొక్క లారీకి సుమారు 11 నుంచి 12 వేల వరకు వసూలు చేస్తున్నారు. గత ప్రభుత్వం అప్పగించిన ఇసుకకు, చెబుతున్న లెక్కలకు తేడాలు ఉన్నాయి. మెషినరీల ద్వారా ఇసుకను మొత్తం తోడేస్తున్నారు. గత 2016లో తెచ్చిన పాలసీనే ఇప్పుడు కూడా ఉంది. పేద ప్రజలకు ఇసుక అందే పరిస్థితి లేదని తోట త్రిమూర్తులు ధ్వజమెత్తారు.👉శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో లారీ ఇసుక ఎంతకు దొరికేది?.. ఈ రోజు ఎంతకు దొరుకుతుందంటూ కూటమి సర్కార్‌ని నిలదీశారు. ఉచిత ఇసుక అంటే టన్నుకు కనీసం 400 రూపాయలు తగ్గాలి. సామాన్యులకు ఉచిత ఇసుక అందే పరిస్థితి లేదని మండిపడ్డారు. -
రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు
సాక్షి, అమరావతి: అన్నదాతల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం దేశంలో ఏదన్నా ఉందంటే అది చంద్రబాబు ప్రభుత్వమేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తూర్పారబట్టారు. పంటలు పండక, పండినవాటికి మద్దతు ధర లేక అన్నదాతలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో అమలైన ఉచిత పంటల బీమాను ఎత్తేసి, ఎకరానికి రూ.650 చొప్పున బీమా భారం మోపారని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ పథకం అమలుపై పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, తోట త్రిమూర్తులు, వై.శివరామిరెడ్డి అడిగిన ప్రశ్న బుధవారం శాసన మండలిలో చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి చర్చ నడిచింది. 2014–19 మధ్య రుణమాఫీ హామీ ఎందుకు అమలు చేయలేదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల గురించి మాట్లాడడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. రైతుల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వ వైఖరికి నిరసనగా అన్నదాత సుఖీభవ ప్రశ్నపై చర్చలో పాల్గొనబోమని, వైఎస్సార్సీపీ వాకౌట్ చేస్తోందని ప్రకటించి, ఎమ్మెల్సీలతో కలిసి సభ నుంచి వెళ్లిపోయారు.అంతకుముందు సభ్యులు అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తూ.. ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ కింద రూ.20 వేలు చొప్పున ఆరి్థక సాయం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సొంత పొలం ఉన్న రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని, ఇందులో పీఎం కిసాన్ కింద రూ.6 వేలు కేంద్రం వాటా అని వివరించారు. పీఎం కిసాన్ లబ్దిదారులు 42.04 లక్షల మంది ఉన్నారని, వీరికి 2024–25లో రూ.2,553.45 కోట్ల చొప్పున కేంద్రం చెల్లించిందని వెల్లడించారు. అన్నదాత సుఖీభవకు రూ.9,400 కోట్లు కేటాయించామన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అమలు చేశారని, ఐదేళ్లలో రూ.33,640 కోట్లను రైతులకు ఇచ్చారని వివరించారు. ఉచిత పంటల బీమాలో ఏ రైతు బీమా పరిధిలోకి వస్తున్నారో, రావడం లేదో తెలియడం లేదన్నారు. అందుకే ప్రైవేట్ కంపెనీని ఎంపిక చేసి, రైతుల ద్వారా ప్రీమియం కట్టించే విధానం తెచ్చామన్నారు. సమాధానాలు మాని.. రాజకీయ విమర్శలా?గత ఐదేళ్లు వ్యవసాయ శాఖకు పూర్తిగా తాళాలు బిగించారని అచ్చెన్నాయుడు విమర్శించగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు అడిగిన ప్రశ్నపై సమాధానం చెప్పకుండా రాజకీయ విమర్శలకు దిగుతారా? అని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు కొడవలి కూడా ఇచ్చిన దాఖలాల్లేవన్నారు. ప్రతిపక్ష నేత బొత్స స్పందిస్తూ.. రైతు కుటుంబం నుంచి వచ్చి, వారి కష్టాలు తెలిసిన అచ్చెన్నాయుడు మాట్లాడుతున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు.ఏ విషయం చర్చకు వచ్చినా అధికార పార్టీ నేతలు ఆవు కథ చెబుతున్నారని, బీఏసీలో రైతుల సమస్యల మీద చర్చించాలని వైఎస్సార్సీపీ కోరిందని, అది తమ పార్టీ అంకితభావం అని వివరించారు. తమ ప్రభుత్వంలో రైతులకు జరిగిన మేలుకు నీతి ఆయోగ్ నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆర్బీకే వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. వీటిని వక్రీకరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. మంత్రికి తెలియకపోతే అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. మంత్రులు సభలో ఒక మాట చెప్పి, బయట మరోటి చెబుతున్నారని రైతులకు ఎవరు ఏం చేశారో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, చర్చ పెట్టాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో రైతు భరోసా అందుకున్న 53 లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఇస్తామని మంత్రి కమిట్ అయ్యారన్నారు. అర్హులైన అందరికీ పథకం ఫలాలు అందాలన్నదే తమ కోరికగా తెలిపారు. అప్పుడలా.. ఇప్పుడిలానా..?ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచే రూ.20 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడేమో పీఎం కిసాన్తో కలిపి రూ.20 వేలు అంటున్నారు. పీఎం కిసాన్ 42.04 లక్షల మందికే ఇచ్చారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మాట్లాడుతూ.. పంటలకు మద్దతు ధర దక్కే పరిస్థితి లేదన్నారు. ‘వరికి రూ.2300 ఉంటే రూ.1500 కూడా దక్కడం లేదు. కంది కర్ణాటకలో రూ.8,500కు కొంటే ఇక్కడేమో రూ.5,500 మాత్రమే. రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అని మండిపడ్డారు. మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకుని, ధాన్యం కొనుగోలు మీద ప్రత్యేకంగా చర్చకు రావాలన్నారు. రైతుల కష్టాలపై మాట్లాడుతుంటే వినే ఓపిక కూడా ప్రభుత్వానికి లేదా? అని శివరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై మోపిన బీమా భారాన్ని ప్రభుత్వమే చెల్లించాలని తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 80 % మంది కౌలు రైతులే ఉన్నారని వారికీ అన్నదాత సుఖీభవ అందిస్తారా? లేదా? అని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రశి్నంచారు. -
మండలిలో బొత్స ప్రశ్నలకు చేతులెత్తేసిన లోకేష్
-
ఇవిగో ఆధారాలు.. విచారణకు ఆదేశించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల మూకుమ్మడి రాజీనామాలపై శాసన మండలి మరోసారి అట్టుడుకింది. వీసీల రాజీనామాలపై విచారణకు మండలిలో వైఎస్సార్సీపీ డిమాండ్ చేయడంతో ఆధారాలిస్తే విచారణ జరిపిస్తామని ఇటీవల విద్యా శాఖ మంత్రి లోకేశ్ చెప్పారు. బెదిరింపులు, మౌఖిక ఆదేశాలతోనే వీసీలు రాజీనామా చేశారని వైఎస్సార్సీపీ మంగళవారం సభలో ఆధారాలు సమర్పించి.. ‘ఇవిగో ఆధారాలు.. చిత్తుశుద్ధి, ధైర్యం ఉంటే నిష్పాక్షిక విచారణకు ఆదేశించాలి’ అని డిమాండ్ చేయడంతో అధికారపక్షం కంగుతింది. మండలిలో ప్రశ్నోత్తరాల అనంతరం ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ‘వీసీలను ఉన్నత విద్యా మండలి నుంచి బెదిరించి రాజీనామా చేయమని చెప్పారనడానికి ఆధారాలిస్తున్నాం. వీసీల కార్యాలయాలకు వెళ్లి ఎలా దౌర్జన్యం చేశారో వీడియోలు కూడా ఇస్తున్నాం. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే.. వారు తప్పు చేయలేదని అనుకుంటే విచారణకు ఆదేశించాలి. కథలు చెప్పి తప్పించుకొనే ప్రయత్నం చేయొద్దు’ అని సూటిగా డిమాండ్ చేశారు. దీనికి మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. బెదిరించి, భయపెట్టి రాజీనామాలు చేయించినట్టు ఎక్కడా వీసీల రాజీనామా పత్రాల్లో లేదని చెప్పారు. ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలపై తాము ప్రవేశపెడుతున్న ప్రివిలేజ్ మోషన్‌ను స్వీకరించాలని మండలి చైర్మన్‌ను కోరారు. గత ప్రభుత్వంలోనూ వీసీలు రాజీనామా చేశారంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. తాము ఉన్నత విద్యావంతులను వీసీలుగా నియమించామని, అంతర్జాతీయ వర్సిటీల నుంచి కూడా ఏపీ వర్సిటీల్లో వీసీల పోస్టులకు క్యూ కడుతున్నారంటూ గొప్పలు చెప్పుకొన్నారు. గత ప్రభుత్వంలో విద్యాశాఖను ఏటీఎంగా వాడుకున్నారని లోకేశ్ అనడంతో బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఉన్నత విద్యా మండలి అధికారుల నుంచి మౌఖిక ఆదేశాలతోనే వీసీలు రాజీనామాలు చేసినట్టు తామూ చెప్పామని, అందుకే విచారణ అడుగుతున్నామని బొత్స అన్నారు. దేశ చరిత్రలో ఇలాంటిది జరగలేదని చెప్పారు. వారు చెబుతున్నట్టుగానే 2014 నుంచి వీసీల రాజీమాలపై విచారణ చేయాలని బొత్స డిమాండ్ చేశారు.మీ నియామకాల్లో తప్పులతోనే రాజీనామా!2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం వీసీల నియామకాల్లో తప్పులు చేసిందని, వాటిని కోర్టులు తప్పుపట్టాయని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. 2019 జూలై 15న కోర్టు ఆదేశాలివ్వడంతో కొందరు వీసీలు రాజీనామా చేశారని, మరికొందరు చేయలేదని వివరించారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం లేదన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక గవర్నర్ నియమించిన వీసీలను రాజీనామా చేయమని చెప్పే హక్కును ఉన్నత విద్యా మండలి అధికారులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. 4 రోజుల్లోనే 17 మంది వీసీలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తే ఎందుకు విచారణ చేయలేకపోతున్నారని నిలదీశారు.లోకేశ్ నోటి దురుసు!వీసీల రాజీనామాలపై ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి లోకేశ్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. వ్యక్తిగత విమర్శలు, సభలో లేని మాజీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలకు దిగారు. ‘సాక్షి’లో వచ్చిన వార్తల ఆధారంగా ఎలా విచారణ చేస్తామని బుకాయించారు. ఇంగ్లిష్ రాని వారిని వీసీలుగా నియమించారని హేళన చేశారు. చివరికి మంత్రి లోకేశ్ సమాధానం చెప్పకుండానే చైర్మన్ సభను బుధవారానికి వాయిదా వేశారు.విచారణపై ప్రభుత్వం తోకముడిచింది: బొత్స రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల బలవంతపు రాజీనామాలపై విచారణ జరిపిస్తామని సవాల్ చేసిన ప్రభుత్వం.. మండలిలో తాము ఆధారాలు చూపగానే తోక ముడిచిందని బొత్స సత్యనారాయణ చెప్పారు. సభ వాయిదా అనంతరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలతో కలిసి ఆయన అసెంబ్లీ బయట మాట్లాడుతూ.. ఆధారాలు చూపిస్తే విచారణకు సిద్ధమంటూ సవాల్ చేసిన విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఇప్పుడెందుకు వెనక్కి వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ నియమించిన వీసీలను రాజీనామా చేయాలని ఉన్నత విద్యా శాఖ మండలి చైర్మన్, కార్యదర్శులు ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించారు. తాము సభలో సమర్పించిన ఆధారాలకు సమాధానం చెప్పలేక లోకేశ్ దబాయింపులు, బుకాయింపులు, దూషణలకు తెగబడ్డాని చెప్పారు. న్యాయ విచారణపై ఎందుకంత భయమని అన్నారు. వీసీలతో బలవంతంగా రాజీనామాలు చేయించడం మొత్తం విద్యా వ్యవస్థకే కళంకమని చెప్పారు. -
తల్లికి వందనంపై మళ్లీ కూటమి సర్కారు అబద్ధాలు
-
శాసన మండలి నుంచి వాకౌట్ చేసిన YSRCP ఎమ్మెల్సీలు
-
అవి సీఎం పదవిలో ఉన్న వారు మాట్లాడే మాటలేనా?
సాక్షి, అమరావతి: రెండ్రోజుల క్రితం సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు పర్యటనలో మాట్లాడిన మాటలు సోమవారం శాసనమండలిలో తీవ్ర చర్చకు దారితీశాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చూస్తే వ్యవస్థలే సిగ్గుపడాలి అంటూ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘వైఎస్సార్సీపీ కార్యకర్తలకు చిన్న పనిచేసి పెట్టినా ఊరుకునేది లేదు. అది అధికారులైన సరే ప్రజాప్రతినిధులైన సరే. వైఎస్సార్సీపీ వాళ్లకు ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఏ ఉపకారమూ చెయ్యొద్దు.వాళ్లకు ఉపకారం చేస్తే పాముకు పాలుపోసినట్లే..’ అంటూ చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘మండలి’లో సోమవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలను తిప్పికొడుతున్న సమయంలో చంద్రబాబు వ్యాఖ్యలపై బొత్స ఘాటుగా స్పందించారు. ‘మా ప్రభుత్వంలో మా సీఎం ఎప్పుడు మా పార్టీ వాడికే సహాయం చేయమని ఎప్పుడూ చెప్పలేదు. కానీ, ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చూస్తే ఈ వ్యవస్థ సిగ్గుపడాలి.లబ్ధిదారులకు పార్టీలు అంటగడతారా? అర్హులందరికీ ప్రతి పథకం దక్కేలా చూడాల్సిన బాధ్యత గలవారు.. రాజ్యాంగబద్ధంగా, రాగద్వేషాలకు, పార్టీలకతీతంగా, కార్యక్రమాలు చేస్తామని చెప్పాల్సిన వారు మాట్లాడే మాటలేనా ఇవి? పార్టీ మీటింగ్‌లో సీఎం మాటలు వైరల్ అవుతుంటే ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇవ్వాల్సిన అవసరంలేదా. మంత్రిని (అచ్చెన్నాయుడ్ని ఉద్దేశించి) కోరుతున్నా.. లబ్ధిదారుల విషయంలో రాజకీయాలు ఉండకూడదని చెప్పండి. ఇదేమన్నా మన సొంత ఆస్థా? ప్రజల డబ్బు, వారి మద్దతుతో ప్రభుత్వాలను నడుపుతున్నాం. సీఎం ఆ మాటలు ఎలా మాట్లాడతారు? గత ఐదేళ్లూ రాగద్వేషాలకు అతీతంగా, పార్టీలతో సంబంధంలేకుండా, అర్హులందరికీ సాయం చేశాం.అంతేగానీ.. పార్టీల గురించి ఆలోచించలేదు’ అంటూ బొత్స మాట్లాడారు. బొత్స వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. తమ ప్రభుత్వానికి పేదలే ప్రాతిపదిక అని చెప్పారు. అర్హులెవరికైనా పథకాలు అందకపోతే, అది తమ దృష్టికి తీసుకొస్తే వారికీ ఇస్తామన్నారు. బొత్స మళ్లీ జోక్యం చేసుకుంటూ.. మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన మాటలు వారి మాటలా? లేక పార్టీ తరఫున లేదా సీఎం తరఫున మాట్లాడుతున్నారా స్పష్టం చేయాలన్నారు.దీనిపై అచ్చెన్నాయుడు మళ్లీ వివరణ ఇస్తూ.. తాను చెప్పింది అచ్చెన్నాయుడుగా కాదు.. టీడీపీ తరఫున కాదు.. ఎన్డీయే ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నా అని చెప్పగా బొత్స మళ్లీ స్పందిస్తూ.. అయితే, సీఎం మాటలు అబద్ధమా అని ప్రశ్నించారు. ఇంతలో మండలి చైర్మన్ మరో మంత్రి పార్థసారథికి అవకాశం ఇవ్వడంతో ఈ అంశానికి అక్కడితో బ్రేక్ పడింది. అనంతరం.. మీడియా పాయింట్ వద్ద కూడా బొత్స మాట్లాడారు.అమరావతిపై ఒక విధానం లేదుఅమరావతి రాజధాని విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఒక విధానమంటూ లేదని, 2014–19 మధ్య ఇదే టీడీపీ హయాంలో రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లకు పైగా అవుతుందని చెప్పి కేవలం రూ.6వేల కోట్లే ఖర్చుచేసిందని.. పైగా అవి తాత్కాలిక భవనాలని చెప్పారని, ఇప్పుడు శాశ్వత భవనాలంటూ టెండర్లు పిలిచారని శాసనమండలిలో వైఎస్సార్సీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సోమవారం ‘మండలి’లో టీడీపీ విప్ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో బొత్స మంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని స్మశానం అన్నారంటూ విమర్శించారు. దీనిపై బొత్స స్పందిస్తూ.. తాను మంత్రిగా ఉన్నప్పుడు రాజధానిని చూడటానికి రావాలని కొందరు కోరడంతో.. అమరావతి నిర్మాణానికి నాటి టీడీపీ ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చవుతుందని చెప్పి కేవలం రూ.6వేల కోట్లతో భవనాలు కట్టారని, అంతకుమించి అక్కడ చూడడానికి ఏం అభివృద్ధి జరిగిందని మాత్రమే అన్నానని బదులిచ్చారు.వాస్తవానికి.. అమరావతిలో కట్టింది తాత్కాలిక భవనాలేనని అప్పటి టీడీపీ ప్రభుత్వమే స్వయంగా ప్రకటించిందని, పైగా దానికి కూడా ఏకంగా అడుగుకి ఏకంగా రూ.10,500 వెచ్చించారన్నారు. ఇప్పుడు మళ్లీ శాశ్వత భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచారని, ఇది చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు తంతు కాదు కదా అని బొత్స ఎద్దేవా చేశారు. అవి తాత్కాలికమని చెప్పలేదుమంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని.. ఇవి తాత్కాలిక భవనాలు అని తామెక్కడా చెప్పలేదని, కొత్తగా శాశ్వత భవనాలు కట్టేవరకు వీటిని వాడుకుంటామని మాత్రమే చెప్పామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అమరావతిని వదిలేశారని, విశాఖ రుషికొండ నిర్మాణాల్లో ఎంతో దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. రుషికొండ కాంట్రాక్టర్‌కు వేరే పనులకు సంబంధించిన బిల్లులు ఇచ్చామన్నారు.ఈ వ్యాఖ్యలపై బొత్స స్పందిస్తూ.. అప్పట్లో మూడు రాజధానులనేది తమ ప్రభుత్వ విధానంగా తీసుకున్నామని.. శాసన రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పామన్నారు. వాస్తవాలను మరుగుపరిచి మంత్రి అచ్చెన్న మాట్లాడుతున్నారని విమర్శించారు. రుషికొండలో నిర్మించిన భవనాలు ఎవరివని.. ప్రభుత్వానికి ఆ భవనాలను వాడుకోవడం చేతగాక విమర్శలు ఎందుకని బొత్స ప్రశ్నించారు.రుషికొండలో టూరిజానికి చెందిన పాత భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించామని, అందులో అవినీతి, అక్రమాలు అంటూ గగ్గోలు పెట్టిన ఇప్పుడా కాంట్రాక్టర్‌కు బిల్లులు ఎలా చెల్లించారని కూడా ఆయన నిలదీశారు. ఇదే విషయం వారి గెజిట్ వచ్చిందని.. అంటే రుషికొండ నిర్మాణాలు సక్రమమే కదా అని అన్నారు. ఏ విచారణకైనా తాము సిద్ధమని, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతామని బొత్స ఘాటుగా బదులిచ్చారు. -
రెడ్ బుక్ రాజ్యాంగంతో మీడియాపై ఆంక్షలు
-
రెడ్ బుక్ రాజ్యాంగంతో మీడియాపై ఆంక్షలు
-
అట్టుడికిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి... వీసీల రాజీనామా.. ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు.. 4 లక్షల ఉపాధి అవకాశాలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ సభ్యులు
-
రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల ఉపాధి అవకాశాలా?
సాక్షి, అమరావతి: ‘టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారా..? ఎక్కడో చూపించండి..!’ అని వైఎస్సార్సీపీ సభ్యులు శాసనమండలిలో నిలదీశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో చర్చ సందర్భంగా మండలిలో మంగళవారం ఈ అంశంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య కొద్దిసేపు వాడివేడిగా చర్చ జరిగింది. చివరికి సమాధానం చెప్పలేక మంత్రులు నీళ్లు నమలాల్సి వచ్చింది. నాలుగు ఉద్యోగాలూ కల్పించలేదుఏకంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం తొమ్మిది నెలలుగా ఒక్క ఉద్యోగం కాదు కదా.. కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగంలో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావనే లేదన్నారు. గవర్నర్ ప్రసంగంలో నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పించారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. ఏ శాఖలో.. ఏ కంపెనీలో.. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగు లక్షలు కాదు.. నలుగురికి కూడా ఉద్యోగాలివ్వలేదని మండిపడ్డారు.ఈ సమయంలో మంత్రి నారా లోకేశ్ జోక్యం చేసుకుంటూ.. ‘రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం. 4 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పామే కానీ.. కల్పించినట్లుగా ఎక్కడా చెప్పలేదు’ అని ఇంగ్లీషు వెర్షన్లో ఉన్న గవర్నర్ ప్రసంగాన్ని చదివి బుకాయించబోయారు. తెలుగులో గవర్నర్ ప్రసంగాన్ని చదవాలని సభ్యులు పట్టుబట్టడంతో.. ‘ఇంగ్లీషులో చదువుతున్నా కదా’ అంటూ ఆంగ్లంలో ఉన్న ప్రసంగం పాఠాన్ని మరోసారి చదివి వినిపించారు. పొరపాటును లోకేశ్ ఒప్పుకోవాలన్న బొత్స శాసన మండలిలో వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని తెలుగు ప్రసంగ పాఠంలో ఉన్న అంశాలను చదివి వినిపించారు. ‘4 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించబడింది’ అని అందులో స్పష్టంగా ఉందన్నారు. తెలుగులో తర్జుమా చేయడంలో పొరపాటు జరిగి ఉంటుందని, అదే విషయాన్ని హుందాగా అంగీకరించి సరిచేస్తామని చెబితే సరిపోతుంది కదా! అని హితవు పలికారు. నాడు రాష్ట్ర ప్రయోజనాలు కనిపించలేదా? టీడీపీ, జనసేన ఎంపీలపై ఆధారపడి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతున్నందున ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోతున్నారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. తాము బేషరతుగానే మద్దతు ఇస్తున్నట్లు లోకేశ్ చెప్పారు. ‘2014లో మీకు రాష్ట్ర ప్రయోజనాలు కనిపించలేదా? అప్పుడు ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ ఎందుకు తీసుకున్నారు?’ అని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశి్నంచారు. దీనికి మంత్రులు సమాధానం దాట వేశారు. ఏఐ... తెలుగులో ఉంటుందా? వైఎస్సార్సీపీ హయాంలో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశపెట్టి మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా చేసిందని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు పేర్కొన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం తెలుగు, ఇంగ్లీషు మీడియంలలో దేన్ని అనుసరిస్తుందో చెప్పలేకపోతోందన్నారు. సీఎం చంద్రబాబు తరచూ చెప్పే ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ తెలుగులో ఉంటాయా? అని ప్రశ్నించారు. తెలుగును అవమానిస్తున్నారని మంత్రులు అనిత, సవిత అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. తానేమీ తప్పుగా మాట్లాడలేదని, ఇంగ్లీషు మీడియం విషయంలో ప్రభుత్వ వైఖరిని గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించలేదని తూమాటి పేర్కొన్నారు.ఉచిత గ్యాస్ అంటూ 9 నెలల్లో ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టగా ఐదు కాలేజీలను ప్రారంభించడంతోపాటు మరో కాలేజీకి అనుమతి సాధించామన్నారు. మిగిలిన కళాశాలలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటాయా? ప్రైవేట్‌కు అప్పగిస్తారా? అనేది చెప్పడం లేదన్నారు. ఐదేళ్లలో 30 వేల మంది మహిళలు మిస్సింగ్ అని ఆరోపణలు చేశారని, 700 మంది మాత్రమే మిస్సింగ్ అని ఆనాడే డీజీపీ స్థాయి అధికారులు తేలి్చనా పదేపదే అవే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.నాడు తొలి ఆర్నెలల్లోనే 1.25 లక్షల ఉద్యోగాలు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలల్లోనే ఏకంగా 1.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీ అంటూ ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజల జీవితాలు తలకిందులయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టడం.. రూ.లక్ష కోట్లకుపైగా అప్పులు చేయడం.. బెల్టు షాపులతో మద్యం ఏరులై పారించడం.. మెగా డీఎస్సీ ఇవ్వకపోవడం.. 83 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొట్టడం.. ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపడం.. పోలవరం ఎత్తు తగ్గించడం సుపరిపాలనా? అని నిలదీశారు.జనవరి 1వ తేదీన ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైందన్నారు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ అని చెప్పి పీఆర్సీ చైర్మన్‌ను బెదిరించి వెళ్లగొట్టారన్నారు. అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.5 వేలు కాదు.. రూ.10 వేలు ఇస్తామని చివరికి వారిని రోడ్డు పాలు చేశారని మండిపడ్డారు. గత 8 నెలల్లో ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. 2023లో వలంటీర్లను రెన్యువల్ చేయకపోవడం వల్లే జీతాలు ఇవ్వలేకపోయామని, కొనసాగించలేకపోయామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. -
వరుదు కల్యాణి మాస్ ర్యాగింగ్!
-
శాసన మండలి నుంచి వాకౌట్ చేసిన YSRCP
-
ఏపీలో సీఎం సంతకానికి కూడా విలువ లేదా : బొత్స
-
కర్నూలులోనే హైకోర్టు.. వైఎస్సార్సీపీ డిమాండ్
సాక్షి, కర్నూలు: కర్నూలులోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటుకు మంత్రి ఫరూక్ తీర్మానం ప్రవేశం పెట్టారు. ఈ సందర్భంగా హైకోర్టు ఏర్పాటుపై శాసన మండలిలో చర్చ జరిగింది.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మాట్లాడుతూ, శ్రీబాగ్ ఒప్పందంలో ఏముందో మంత్రి భరత్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కర్నూలులో హైకోర్టు బెంచ్ కాకుండా హైకోర్టు ఏర్పాటు చేయాలని.. గతంలో బీజేపీ కూడా డిక్లరేషన్ చేసిందని ఆయన గుర్తు చేశారు.హైకోర్టును కర్నూలులో పెట్టాలని బీజేపీ రాయలసీమ డిక్లరేషన్‌లో పెట్టిందని.. ఇప్పుడు హైకోర్టు కాకుండా హైకోర్టు బెంచ్ పెట్టడం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ, కర్నూలులో న్యాయ రాజధాని రాకుండా గతంలో కూటమి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. కర్నూల్లో హైకోర్టు పెట్టాలని బీజేపీ గతంలో డిక్లరేషన్ చేసిందన్నారు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావించిందని ఆయన తెలిపారు. -
రుషికొండ భవనాలకు అన్ని అనుమతులున్నాయి : మంత్రి దుర్గేశ్
-
Botsa Satya Narayana: కావాలని బురద చల్లే ప్రయత్నం చేయొద్దు
-
క్షమించండి.. చైర్మన్ ను వేడుకున్న వంగలపూడి అనిత
-
ఏపీలో దిశా చట్టం ఉందా లేదా?
-
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గరంగరం.. మంత్రి వైఖరికి నిరసనగా వాకౌట్ చేసిన వైఎస్సార్సీపీ సభ్యులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మండలిలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యావసర ధరలపై వైఎస్సార్సీపీ శాసనమండలిలో వాయిదా తీర్మానం కోరింది. శుక్రవారం ఉదయం మండలి సమావేశాలు ప్రారంభమవగానే ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, మంగమ్మ, కల్పలతలు నిత్యావసర ధరలపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు మండలి చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు. పలువురు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు తమ స్థానాల వద్ద నిలబడి ఈ అంశంపై చర్చ జరపాలని మండలి చైర్మన్‌ను కోరగా, ప్రస్తుతం ఈ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన నేపథ్యంలో ఇదే అంశంపై చర్చను కోరితే అనుమతి ఇస్తానంటూ హామీ ఇచ్చారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు, రఘువర్మలు ఏపీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీల ఏర్పాటు కోరుతూ మరో వాయిదా తీర్మానం కోరగా, చైర్మన్ తిరస్కరించారు. -
ఏపీ శాసనమండలిలో YSRCP నేతలు Vs TDP నేతలు
/telugu-news/andhra-pradesh/liveblog/ap-assembly-budget-session-2024-day-4-telugu-updates-2255588
-
AP Assembly Session: పేద ప్రజల కలలు నీరు కార్చిన కూటమి సర్కార్
సూపర్ సిక్స్ హామీల పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలపై శాసనమండలిలో వైఎస్సార్సీ ఎమ్మెల్సీలు నిలదీశారు. లెక్కలతో సహా అన్ని శాఖలపై.. -
బడ్జెట్‌పై చర్చ పక్కదారి
సాక్షి, అమరావతి: శాసన మండలిలో గురువారం బడ్జెట్‌పై జరిగిన చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. తాము మాట్లాడుతుంటే మంత్రులు పదేపదే అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. శాసన మండలి మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, వరుదు కళ్యాణి, బొమ్మి ఇజ్రాయెల్, సిపాయి సుబ్రమణ్యం, పీవీవీ సూర్యనారాయణరాజు, వంకా రవీంద్రనాథ్ మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. మంత్రులందరూ అడ్డుకున్నారు..మండలిలో బడ్జెట్‌పై మాట్లాడుతుంటే వాస్తవాలు భరించలేని అధికారపక్ష నేతలు అడుగడుగునా మమ్మల్ని అడ్డుకున్నారు. టారిఫ్ పెంచబోతున్నారా అని ఎనర్జీ మీద ప్రశ్నోత్తరం ఇచ్చాం? కానీ, దానిపై చర్చ జరగలేదు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఒక్కో యూనిట్‌కు రూ.1.50 పైసలు పెంచుతున్నారు.ప్రజలపై భారం వేయకుండా ప్రభుత్వమే దీనిని భరించాలి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటూ నెట్టుకొచ్చి ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ అంటున్నారు. బడ్జెట్‌పై వరుదు కళ్యాణి మాట్లాడుతుంటే లోకేశ్ చర్చను తప్పుదారి పట్టించారు. సోషల్ మీడియాలో పోస్టులపై చర్చ కోరితే అడ్డుకున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియకూడదనే టీడీపీ ఎమ్మెల్సీలు ఇలా వ్యవహరిస్తున్నారు. – తోట త్రిమూర్తులుప్రజలను ప్రభుత్వం మోసం చేసింది..ప్రశ్నిస్తే గొంతును నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. బడ్జెట్లో జరిగిన తప్పులను లేవనెత్తడం ప్రతిపక్షంగా మా బాధ్యత. మా సభ్యులు మాట్లాడుతుంటే మంత్రులు పదేపదే అడ్డుతగులుతున్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలుచేయాలంటే రూ.74 వేల కోట్లకు పైగా అవసరమవుతాయి. కానీ, అందుకు తగిన విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. ఈ బడ్జెట్‌తో ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. మూడు సిలిండర్లు ఇస్తామని ఒక్కటే ఇచ్చారు.. మరో 2 సిలిండర్ల మాటేంటి? రైతులకు పెట్టుబడి సాయం ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎప్పుడిస్తారో చెప్పలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలూ ఇవ్వడంలేదు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పోర్టులు కట్టడం చీకటి పాలన అవుతుందా? అరకొర బడ్జెట్ కేటాయించి సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలుచేస్తారు? మేం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. – వరుదు కళ్యాణిఈరోజు మండలి చూస్తే బాధేసింది..ఈరోజు మండలిలో జరిగిన పరిస్థితులను చూస్తే బాధేసింది. విజయనగరం జిల్లాలో అతిసార వ్యాప్తి, మరణాలపై ప్రశ్నోత్తరం ఇచ్చాం. జిల్లాలో డయేరియా వ్యాప్తి వాస్తవమేనా అంటే వైద్య మంత్రి లేదన్నారు. మొత్తం 14 మరణాలు సంభవిస్తే డిప్యూటీసీఎం పవన్ 10 మంది చనిపోయారని.. చంద్రబాబు 8 మంది చనిపోయారన్నారు. నిన్న మంత్రి సభలో నలుగురు చనిపోయారంటున్నారు. సభ్యుల ఆవేదన చూస్తే ముచ్చటేస్తోందని మంత్రి వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం బాధాకరం. –పీవీవీ సూర్యనారాయణ రాజుబాబు పాలనంతా తిరోగమనమే..సభలో ఎవరైనా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు అడ్డుకోవడం కరెక్ట్ కాదు. మా నాయకుడు సభ నుంచి పారిపోలేదు. వైఎస్సార్సీపీ ప్రతిపక్షంగా ఉంది కాబట్టే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడుగుతున్నారు. గత ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పుచేసిందన్నారు. కానీ, బడ్జెట్లో రూ.6 లక్షల కోట్లు మాత్రమే చూపించారు.. ఇది మోసం కాదా? బాబు పాలనంతా తిరోగమనమే. వైఎస్సార్సీపీ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. – బొమ్మి ఇజ్రాయెల్ విపక్షాల గొంతు నొక్కుతున్నారు..మండలిలో ప్రస్తుతం మేం మెజార్టీ సభ్యులం. అయినా కూడా సభా పద్ధతులు పాటించకుండా టీడీపీ మంత్రులు గందరగోళం సృష్టిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. ఆస్పత్రులకు వెంటనే బకాయిలు చెల్లించకపోతే పేద ప్రజలు ఇబ్బందులు పడతారు. సూపర్ సిక్స్‌లో ప్రతీ రైతుకు రూ.20 వేలు ఆర్థిక సాయం ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అంటే 11 వేల కోట్లు.. కానీ, కేటాయించింది వెయ్యి కోట్లే. ఇది మోసం కాదా? ఇక ఉచిత బస్సు ఏమైంది? – సిపాయి సుబ్రహ్మణ్యంసమయం కూడా ఇవ్వలేదు..నాకు కేటాయించిన సమయం ఇవ్వకుండానే సభను రేపటికి వాయిదా వేశారు. ప్రతిపక్ష సభ్యులపై దాడిచేసే ప్రయత్నం చేశారు. ఎంతో విలువైన 4 గంటలు వృథా అయిపోయాయి. మాలాంటి కొత్త ఎమ్మెల్సీలకు మాట్లాడే అవకాశం రావట్లేదు. కనీసం రేపైనా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. చంద్రబాబు నిత్యం మోసం, దగా చేస్తూ అబద్ధాలు చెబుతున్నారు. – వంకా రవీంద్రనాథ్ -
కూటమి బడ్జెట్ మోసాలను ప్రశ్నిస్తే అడ్డుకుంటారా?: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
సాక్షి, తాడేపల్లి: మండలిలో మాట్లాడుతుంటే మంత్రులు పదేపదే అడ్డు తగులుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ఏపీ శాసన మండలి మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ 3 సిలిండర్లు ఇస్తామని ఈ ఏడాది 2 సిలిండర్లకు ఎగనామం పెట్టారని ధ్వజమెత్తారు. రూ.5,387 కోట్లు ఇస్తే తల్లికి వందనం ఎలా అమలు చేస్తారు? అని ప్రశ్నించారు.కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది: వరుదు కల్యాణిప్రశ్నిస్తే గొంతును నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. రైతులకు పెట్టుబడి సాయం ఇప్పటివరకు ఇవ్వలేదు. రైతులకు కేటాయించిన రూ.వెయ్యి కోట్లు ఎప్పుడిస్తారో చెప్పలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా జగన్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం విధ్వంసమంటారా?. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పోర్టులు కట్టడం చీకటి పాలన అవుతుందా?. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను మంత్రులు దెబ్బతీయాలని చూస్తున్నారు.బడ్జెట్‌పై చర్చ పక్కదారి: తోట త్రిమూర్తులుబడ్జెట్పై చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. పవర్ సెక్టార్‌పై చర్చ జరగకుండా చేశారు. పలు సమావేశాల్లో కరెంట్ ఛార్జీలు పెంచనని చంద్రబాబు చెప్పారు. ఒక్క రూపాయి ఛార్జీ పెంచనని చెప్పి ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు. తమ మోసాన్ని ప్రజలకు తెలియకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ సందర్భం లేని చర్చను తెరపైకి తెచ్చారు. బడ్జెట్ పై వరుదు కళ్యాణి మాట్లాడుతుంటే మా తల్లిని అవమానించారంటూ లోకేష్ చర్చను తప్పుదారి పట్టించారు. గతంలో ఎప్పుడూ లేని పరిస్థితులను సభలో చూస్తున్నాం. సోషల్ మీడియై పోస్టులపై చర్చకు కోరితే అడ్డుకున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియకూడదనే టీడీపీ ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్నారు. సూపర్ సిక్స్‌లు అమలు చేయకుండా కూటమి నేతలు ప్రజలను మోసం చేస్తున్నారు.ఇదీ చదవండి: బడ్జెట్‌పై వరుదు కల్యాణి ప్రశ్నలు.. పదేపదే అడ్డుకున్న టీడీపీ మంత్రులు -
బడ్జెట్‌పై వరుదు కల్యాణి ప్రశ్నలు.. పదేపదే అడ్డుకున్న టీడీపీ మంత్రులు
సాక్షి, అమరావతి: ఏపీ శాసన మండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీగా మారింది. మండలిలో బడ్జెట్‌పై వైఎస్సార్సీపీ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ సభ్యుల ఎదురుదాడికి దిగారు. సంబంధం లేని అంశాల్ని ప్రస్తావిస్తూ సభలో గందరగోళం సృష్టించారు. బడ్జెట్‌పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నలు కురిపించారు. 3 సిలిండర్లు ఇస్తామని ఈ ఏడాది 2 సిలిండర్లకు ఎగనామం పెట్టారని మండిపడ్డారు. రూ. 5,387 కోట్లు ఇస్తే తల్లికి వందనం ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.అయితే వరుదు కల్యాణి ప్రసంగిస్తుండగా హోంమంత్రి అనిత అడ్డుతగిలారు. వరుదు కల్యాణి మాట్లాడుతుండగా మంత్రులు అనిత, సవిత, బాల వీరంజనేయులు ఆటంకం కలిగించారు. ఎమ్మెల్సీ కల్యాణిని సభలో మాట్లాడకుండా అడుగడుగునా టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు.మంత్రుల తీరుపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు మాట్లాడుతుండగా మంత్రులే అభ్యంతరం తెలపడం ఏంటని ఆగ్రహించించారు.వైస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గతంలో తమ తల్లిని తిట్టారంటూ లోకేష్ గగ్గోలు పెట్టగా.. సంబంధం లేని సబ్జెక్ట్‌ను ఎందుకు తీసుకొచ్చారని బొత్స ప్రశ్నించారు. సభలో ఇటువంటి సాంప్రదాయం సరికాదంటూ ఆయన సూచించారు. దీంతో గందరగోళం నడుమ సభను చైర్మన్ రేపటికి(శుక్రవారం) వాయిదా వేశారు. -
ఏపీ శాసన మండలిలో YSRCP ఎమ్మెల్సీల నిరసన
-
హామీల అమలెప్పుడు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచీ గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం మినహా ఎన్నికల ముందు సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారన్న ప్రణాళికను కూడా కనీసం బడ్జెట్ ప్రస్తావించలేకపోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తప్పు పట్టారు. మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు అధ్యక్షతన శాసనమండలిలో 2024–25 బడ్జెట్‌పై బుధవారం చర్చ మొదలైంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ చర్చను ప్రారంభిస్తూ.. హామీలు మెండు–చేసేది సున్నా అన్నట్టుగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చే హామీలను నిలబెట్టుకునే అలవాటు టీడీపీ లేదని.. ఈసారి ఎన్నికల్లో జనసేన, బీజేపీ ఉండటంతో గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత ఆ పార్టీలు తీసుకుంటాయని ప్రజలు భావించారన్నారు. కానీ.. మొత్తంగా కూటమి పార్టీలు హామీలతో ప్రజలను నమ్మించి ద్రోహం చేశాయన్నారు.వైఎస్సార్సీపీ ప్రజలకిచ్చిన హామీలకు ఏటా సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి అమలు చేసిందని.. కూటమి ప్రభుత్వం ఏ నెలలో ఏ హామీ అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల కోసం ఒక్క రూపాయి బడ్జెట్లో కేటాయించలేదన్నారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఎప్పటిలోగా పోలవరం పూర్తి ఏస్తారో బడ్జెట్లో చెప్పలేదన్నారు.ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదువైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పకుండా బడ్జెట్‌ను దాటవేసిందన్నారు. కనీసం ఏ పథకం ఎప్పుడు ఇస్తారో అనే ప్రణాళిక కూడా బడ్జెట్లో చెప్పలేదన్నారు. గత ప్రభుత్వ దుర్మార్గమైన పాలన అంటూ బడ్జెట్లో మొదటిలోనే మొదలుపెట్టారని, ప్రజలకిచ్చిన హామీలను అప్పటి ప్రభుత్వం చేసిందని, హామీలు అమలు చేయడం దుష్పరిపాలన అవుతుందా అని ప్రశ్నించారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇస్తామన్న రూ.15 వేల కోట్లు అప్పుగానా లేకా గ్రాంటా అన్నది బడ్టెట్ పేర్కొనలేదన్నారు. దీనికి మంత్రి నాదెండ్ల మనోహర్ బదులిస్తూ.. కేంద్రం రుణంగా తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్‌గా అందజేస్తుందన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలపై టీడీపీ ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, పంచుమర్తి అను«రాధ మాట్లాడారు. -
ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేతగా బొత్స సత్యనారాయణ
సాక్షి, గుంటూరు: విశాఖ జిల్లా స్థానిక సంస్ధల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శాసనమండలి ప్రతిపక్షనేతగా ఎంపిక చేసినట్లు పార్టీ కేంద్రకార్యాలయం ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బొత్సకు ఆయన అభినందలు తెలిపారు.విశాఖ జిల్లాలో జరిగిన స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. జడ్పీటీసీలు, ఎంపీటీసీల సహా స్థానిక సంస్థల సభ్యులందరూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు నాయకత్వంపై విధేయత, విశ్వాసంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి బొత్సను గెలిపించారన్నారు. ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ గతిలేక అభ్యర్థులను కూడా పెట్టలేకపోయిందన్నారు.ప్రస్తుతం పార్టీ కార్యాలయ బాధ్యతలతో పాటు శాసనమండలిలో ప్రతిపక్షనేతగా బాధ్యతలు నిర్వహిస్తున్న తాను.. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో శాసనమండలి ప్రతిపక్షనేతగా బొత్స సత్యనారాయణను నియమించాలని అధ్యక్షుడు ముందు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ విషయంలో మరలా తనను ఆలోచించుకోమని చెప్పినప్పటికీ.. సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణనే నియమించాలని కోరామన్నారు. ఈ నేపథ్యంలో తమ అభ్యర్ధనను పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆమోదించారని అప్పిరెడ్డి తెలిపారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి తాను వైఎస్ జగన్ వెంటే ఉంటూ.. క్రమశిక్షణ కల్గిన కార్యకర్తల్లాగే పని చేశాన్నారు. తాను గుంటూరు మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా వైఎస్ జగన్ వలనే నియమితుడయ్యానన్నారు. ఎమ్మెల్సీ పదవి కూడా ఆయన వలనే వచ్చిందన్నారు. అలాంటి అవకాశాలు వస్తూనే ఉంటాయని.. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పని చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటానని ఆయన స్పష్టం చేశారు. -
తెలంగాణ అసెంబ్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-
నేడు వార్షిక బడ్జెట్‌పై చర్చ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు శాసనమండలి, శాసనసభలో వార్షిక బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది.శాసన సభ ప్రారంభమైన వెంటనే నేరుగా బడ్జెట్ ప్రతిపాదనలపై కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులు ప్రసంగిస్తారు. అనంతరం బడ్జెట్‌పై జరిగిన చర్చకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమా ధానం ఇస్తారు. శాసనమండలిలోనూ బడ్జెట్‌పై జరిగే చర్చకు భట్టి సమాధానం ఇస్తారు. -
శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా లేళ్ల అప్పిరెడ్డి
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని నియమించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా సూర్యదేవర ప్రసన్నకుమార్ పేరిట సోమవారం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మరోవైపు శాసనసభలో తమను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదివరకే స్పీకర్‌కు లేఖ రాశారు. అయితే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. -
బేషరతుగా.. వస్తారా?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు జరగాల్సిన నేపథ్యంలో.. శాసన మండలి వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనా.. మండలిలో బీఆర్ఎస్కే మెజారిటీ ఉంది. అసెంబ్లీ ఆమోదించి, పంపిన బిల్లుల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశమూ ఆ పార్టీకి ఉంది. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతు న్నారని.. 11 మంది ఇప్పటికే టీపీసీసీ నేతలతో టచ్‌లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లోకి బేషరతుగా వస్తేనే చేర్చుకుంటామని ‘ముఖ్య’ నేత షరతు పెడుతున్నారని అంటున్నారు. దీనితో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని, కాంగ్రెస్‌లోకి వెళ్దామా, బీఆర్ఎస్లోనే కొనసాగుదామా అన్న విషయంలో ఏమీ తేల్చుకోలేకపోతున్నారని చెబుతున్నారు. మండలి బలం బీఆర్ఎస్దే తెలంగాణ ఏర్పాటైన మొదట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, శాసన మండలిలో ఎక్కువ మంది కాంగ్రెస్ సభ్యులు ఉండేవారు. మండలిలో రెండేళ్లకోసారి కొన్ని స్థానాలకు ఎన్నికలు జరుగుతూ.. ఎమ్మెల్సీల పదవీకాలం కొనసాగుతూ ఉండటమే దీనికి కారణం. అదే తరహాలో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా మండలిలో బీఆర్ఎస్ బలం ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్కు 26 మంది ఎమ్మెల్సీలు ఉండగా, కాంగ్రెస్‌కు ఆరుగురు, ఎంఐఎంకు ఇద్దరు, బీజేపీకి ఒకరు, ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నారు. శాసనసభా సాంప్రదాయాల ప్రకారం అసెంబ్లీలో ఆమోదం పొందిన ప్రతి బిల్లు శాసనమండలికి వస్తుంది. దానిపై మండలి చర్చించి, ఆమోదం పొందాల్సి ఉంటుంది. బిల్లును ఒకసారి తిప్పిపంపేందుకూ అవకాశం ఉంటుంది. ఈ లెక్కన ఇకముందు కీలక బిల్లులు మండలికి వచ్చినప్పుడు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్కు చాన్స్ ఉంటుంది. ఇటీవల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపే తీర్మానం విషయంలోనూ మండలిలో అధికార పార్టీకి ఇబ్బందులు ఏర్పడటం గమనార్హం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను చేర్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి కూడా అవసరమేననే చర్చ జరుగుతోంది. ఇందుకుతగ్గట్టుగానే. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించిన కాంట్రాక్టు బిల్లులు, జిల్లా రాజకీయాల్లో తమకు కావాల్సిన పదవులు, రాష్ట్రస్థాయిలో గుర్తింపు, ఇతర అవసరాల ప్రాతిపదికన 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇప్పటికే కాంగ్రెస్‌తో టచ్‌లోకి వచ్చినట్టు గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. కానీ పార్టీ అవసరం ఎలా ఉన్నా ముందే షరతులు పెడుతూ వచ్చే వారిని తీసుకునేది లేదని రాష్ట్ర కాంగ్రెస్ ‘ముఖ్య’ నేత చెప్తున్నారని అంటున్నాయి. దీంతో బీఆర్ఎస్లోనే ఉండి ఎలాగొలా నెట్టుకురావాలా? అధికార పార్టీలోకి వెళ్లి ‘పనులు’ చక్కబెట్టుకోవాలా అన్నదానిపై కొందరు ఎమ్మెల్సీలు తర్జనభర్జన పడుతున్నట్టు చర్చ జరుగుతోంది. మండలి చైర్మన్‌పై ఆసక్తికర చర్చ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యవహారం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. నల్లగొండ జిల్లా రాజకీయాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కుమారుడు అమిత్‌రెడ్డికి బీఆర్ఎస్ లోక్‌సభ టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారని.. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికలకు ముందే అమిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారని అంటున్నారు. దీంతో త్వరలో జరిగే అసెంబ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాల్లో.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెడుతుందనే చర్చ కూడా మొదలైంది. కానీ బీఆర్ఎస్ వర్గాలు ఈ విషయంలో గుంభనంగా ఉన్నాయి. సుఖేందర్‌రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్లోనే ఉన్న నేపథ్యంలో ఏం చేసినా రాజకీయంగా ఇబ్బంది రాకుండా ఉండాలన్న ధోరణిలో గులాబీ పెద్దలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఉన్నట్టుండి మండలి చైర్మన్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ అవిశ్వాసం నోటీసు ఇస్తే ఏం చేయాలన్న దానిపై కాంగ్రెస్ కూడా సిద్ధమవుతున్నట్టు తెలిసింది. దీంతో ఏం జరుగుతోందో అన్న అంశంపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
ఆగిన ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా కింద కొత్తగా శాసనమండలి సభ్యులుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ ఆమెర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. ఈ విషయంలో యథాతథస్థితి కొనసాగించాలని (స్టేటస్కో) ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం మంగళవారం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని, ఆ రోజు పూర్తిస్థాయిలో వాదనలు వింటామని స్పష్టం చేసింది.గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను సిఫారసు చేస్తూ అప్పటి ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపింది. అయితే 2023 సెప్టెంబర్ 19న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాటిని తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం తనకున్న విస్తృత అధికారాల మేరకు ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లుగా గవర్నర్ ప్రకటించడాన్ని వారు సవాల్ చేశారు.ఈ పిటిషన్లపై గత వారం విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. పిటిషన్ల విచారణార్హతతో పాటు వాటిలోని వాస్తవాలు, సాంకేతిక అంశాలను పరిశీలిస్తామని చెప్పింది. ఈ పిటిషన్లపై విచారణ ముగిసే వరకు కొత్తగా గవర్నర్ కోటాలో ఎవరినీ నియమించకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేయగా తోసిపుచ్చింది. అలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వడం చట్టపరంగా సాధ్యం కాదని స్పష్టం చేసింది. ‘పెద్దమనుషుల ఒప్పందం’ (జెంటిల్మెన్ అగ్రిమెంట్) మాదిరి అందరూ హుందాతనం పాటించాలని సూచించింది. కొత్త నియామకాలపై స్టే ఇవ్వండి తాజాగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఫ్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ ఆమెర్ అలీ ఖాన్‌లను నియమిస్తూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ తమిళిసై ఈ నెల 25న ఉత్తర్వులు వెలువరించారు. దీంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఇందుకు సంబంధించిన జీవో నంబర్ 12ను సవాల్ చేస్తూ హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)లు దాఖలు చేశారు. కొత్త నియామకాలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే కోదండరాం, అమేర్ అలీఖాన్‌లను ప్రధాన పిటిషన్లో ఇంప్లీడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ ఐఏలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. దాసోజు తరఫున సీనియర్ న్యాయవాది అదిత్యా సోదీ వాదనలు వినిపించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశం హైకోర్టులో విచారణ దశలో ఉండగా కొత్త వారిని నియమించడం సరికాదని ఆయన అన్నారు. ఈ నెల 17న మీడియాకు విడుదల చేసిన నోట్లో.. కోర్టు ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త నియామకాలు చేపట్టబోమని గవర్నర్ పేర్కొన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.ఇది న్యాయస్థానం సూచించిన ‘పెద్దమనుషుల ఒప్పందం’ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం సిఫారసు చేసిందని, వాటిని పరిశీలించిన తర్వాతే గవర్నర్ ఆమోదించారని తెలిపారు. వీరి నియామకం చట్టప్రకారమే జరిగిందని, స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీజే ధర్మాసనం దీనిపై స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ లేక వీలు పడకపోవడంతో.. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కోదండరాం, ఆమెర్ అలీఖాన్‌లు బుధవారం ప్రమాణ స్వీకారం చేసేందుకు వీల్లేకుండా పోయింది. వాస్తవానికి వీరు ప్రమాణ స్వీకారం చేసేందుకు సోమవారం (29న) నాడే శాసనమండలికి వెళ్లారు. కానీ వారు వెళ్లే సమయానికి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన చాంబర్లో లేరు. దీంతో ఆయన రాక కోసం వారు కౌన్సిల్ హాల్లోనే చాలాసేపు ఎదురు చూశారు. అయినా చైర్మన్ రాకపోవడంతో వెనుదిరిగారు. అయితే ఆరోగ్యం బాగోలేనందున చైర్మన్ మండలికి రాలేకపోయారని, ఈ నెల 31న ప్రమాణ స్వీకారానికి రావాలని వారిద్దరికీ కౌన్సిల్ నుంచి సమాచారం అందింది. ఈ మేరకు వారు సిద్ధమవుతున్న సమయంలో స్టేటస్కో విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా నేడు బల్మూరి, మహేశ్‌కుమార్‌ల ప్రమాణం శాసనసభ్యుల కోటాలో ఇటీవల శాసనమండలికి ఎన్నికైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 3.30కు శాసనమండలి చైర్మన్ చాంబర్లో బల్మూరి వెంకట్, మహేశ్‌కుమార్ గౌడ్లు మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగా హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని కోదండరాం, ఆమెర్ అలీఖాన్‌లు నిర్ణయించుకున్నారు. -
ఎమ్మెల్సీలు చెరొకటి.. 29న పోలింగ్
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా స్థానాల్లో ఒకటి అధికార కాంగ్రెస్ పార్టీకి, మరో స్థానం బీఆర్ఎస్కు దక్కనుంది. రెండు స్థానాలకు రెండు పార్టీల తరఫున ఇద్దరు అభ్యర్థులే నామినేషన్ వేసే పక్షంలో ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డిలు.. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వాస్తవానికి వారి పదవీకాలం 2027 నవంబర్ 30 వరకు ఉంది. అయితే వారి రాజీనామా అనివార్యం కావడంతో మండలిలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. కాంగ్రెస్ టికెట్ మైనారిటీ వర్గానికేనా? ఈ రెండు స్థానాల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఆయా పార్టీల అగ్ర నాయకులు పలువురికి ఎమ్మెల్సీ హామీలిచ్చారు. ఇప్పుడు అదే వారికి తలనొప్పిగా మారనుంది. కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఒక్క మైనారిటీ కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడంతో ఆ వర్గానికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సామాజిక సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం కూడా మైనారిటీల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. అయితే రాష్ట్రంలో పార్టీ ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో తమ అసెంబ్లీ స్థానాలను త్యాగం చేసిన పలువురు నేతలు కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దీనిపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ స్థానం ఆశిస్తున్న వారిలో ఇటీవల ఎన్నికల్లో ఓటమి చెందిన షబ్బీర్ అలీ, ఫిరోజ్‌ఖాన్, అజారుద్దీన్, అలీ మస్కతి, అద్దంకి దయాకర్, అందెశ్రీ, సంపత్, మధుయాష్కీ గౌడ్లు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్నికల పొత్తులో భాగంగా సీపీఐకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఒకే స్థానం లభించే అవకాశమున్నందున సీపీఐకి కేటాయించే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. ఎవరి త్యాగానికి ఫలితం దక్కుతుందో? బీఆర్ఎస్ విషయానికొస్తే..అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీ నుంచి తప్పించిన పలువురు నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని అధినేత కేసీఆర్ స్వయంగా హామీ ఇచ్చారు. స్టేషన్ఘనపూర్ స్థానాన్ని కడియం శ్రీహరి కోసం త్యాగం చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, జనగాం స్థానాన్ని పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోసం వదులుకున్న ముత్తిరెడ్డి యాదగిరి, నర్సాపూర్ స్థానాన్ని సునీతా లక్ష్మారెడ్డి కోసం త్యాగం చేసిన మదన్‌రెడ్డి, కామారెడ్డిలో పార్టీ అధినేత కేసీఆర్ కోసం త్యాగం చేసిన గంపా గోవర్దన్ ఎమ్మెల్సీ స్థానం ఆశిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే అధినేత ఎవరివైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. 119 మంది సభ్యులున్న రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ 65 (సీపీఐ 1 కలిపి), బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం ఏడుగురు ఎమ్మెల్యేల బలం కలిగి ఉన్నాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 29న పోలింగ్ – షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్ – ఈ నెల 11న వెలువడనున్న నోటిఫికేషన్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డిల రాజీనామాతో శాసనమండలిలో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది. 18న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా, 19న నామినేషన్లను పరిశీలిస్తారు. 22న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. -
ఏపీ మండలిలో ప్రభుత్వ విప్ ల నియామకం
-
ఏపీ అసెంబ్లీ బుధవారానికి వాయిదా
Live Updates: Time:3:20PM ►ఏపీ అసెంబ్లీ రేపటికి(బుధవారం) వాయిదా పడింది Time: 3:00PM అసెంబ్లీలో ఫైబర్ నెట్ స్కామ్‌పై చర్చ ►చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లో రూ. 114 కోట్లు కొట్టేశారు: మంత్రి గుడివాడ అమర్నాథ్ ►స్కిల్ స్కామ్‌లో రూ. 331 కోట్లు అక్రమాలు జరిగాయి ►ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని సీమెన్స్ సంస్థ తెలిపింది. ►సీమెన్స్ ఉచితంగా అందించే కోర్సులను ఒప్పించి తెచ్చామని చంద్రబాబు బిల్డప్ ఇచ్చారు ►సీమెన్స్ నుంచి ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి పెట్టుబడి రాలేదు. ►చంద్రబాబు అనుకూల వ్యక్తులకే ఫైబర్‌నెట్ టెండర్ కట్టబెట్టారు ►షెల్ కంపెనీల ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ►హెరిటేజ్‌లో పనిచేసేవారే టెరాసాఫ్ట్‌లో డైరెక్టర్లుగా పనిచేశారు ►2016లోనే చంద్రబాబు అవినీతిని ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ ఎండగట్టారు Time: 02:20PM ► శాసన మండలి రేపటికి వాయిదా Time: 02:00PM ►చంద్రబాబు స్కిల్ స్కామ్ మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్‌గా మారింది: ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ►లోకేష్ విదేశాల్లోచదివి స్కాంలపై స్పెషలైజేషన్ చేశాడు ►ఫేక్ ఎంవోయూలు ఎలా చేయాలో లోకేష్ బాగా నేర్చుకున్నాడు ►ఏ విధంగా స్కిల్ స్కామ్ చేశారనేది అందరికీ తెలుసు ► పక్కా ప్లానింగ్‌తోనే స్కిల్ స్కామ్ జరిగింది. ► స్కిల్ స్కామ్‌కు కథ, స్క్రీన్‌పై, దర్శకత్వం చంద్రబాబే ► చంద్రాబు కనుసన్నల్లోనేస్కిల్ స్కాం జరిగింది Time: 01:30PM శాసనమండలి ► రాష్ట్రంలో యూనివర్సిటీల్లో 3,282 పోస్టులు ఖాళీగా ఉన్నాయి: మంత్రి బొత్స సత్యనారాయణ ► దేశంలోని 100 టాప్ విశ్వవిద్యాలయాల్లో ఏపీలోని విద్యాలయాలు కూడా చోటు పొందేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారు ► మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఉండాలని సీఎం సూచించారు. ► పాఠశాలలో ఇచ్చే విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌లలో విద్యకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉండేలా చర్యలుచేపడతాం. ► రాష్ట్రంలో 46 వేల స్కూళ్లు నాడు-నేడు కింద అభివృద్ధి చేయడం జరిగింది. ► ప్రస్తుతం మన బడి నాడు-నేడు రెండో దశ పనులు జరుగుతున్నాయి. ► సింగిల్ టీచర్ ఉన్న స్కూల్లో సైతం మన బడి నాడు-నేడు అమలు జరుగుతోంది. ► బైజూస్ 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా కంటెంట్ ఇస్తామని కోరితే సీఎం అంగీకరించారు. ►బైజూస్‌కు ప్రభుత్వం ఒక రూపాయి కూడా చెల్లించలేదు ► టెండర్ల ప్రకారమే పారదర్శకంగా ట్యాబ్లుకొనుగోలు జరిగింది. ► బైజూస్ కంటెంట్ అంశంలో కొన్ని పత్రికలు అవాస్తవాలను రాస్తున్నాయి Time: 12:40PM బీసీ జనగణనపై అసెంబ్లీలో చర్చ ►దేశంలో ఎంతమంది ఉన్నారనేది తెలుసుకోవడం అవసరం ►కులాల వారీగా జనగణన జరగడం లేదు ►సముచిత నిర్ణయాలు తీసుకునేందుకు జనగణన చేయాల్సిందే. ►సామాజిక న్యాయం చేయాలంటే కులాల వారీగా జనగణన అవసరం ► ఏపీ అసెంబ్లీకి విరామం శాసనమండలిలో చర్చ ►గతంలో కంటే ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం పెరిగింది: మంత్రి అంబటి రాంబాబు ►ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు రూ.55కోట్లు అవసరం ఉంది ►నిధుల కోసం కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ప్రయత్నిస్తున్నాం ►వరదల కారణంగా డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడంతో పనులు నిలిచిపోయాయి ►పనులు ఆగిపోవడంతో కేంద్రం నుంచి నిధులు ఆగిపోయాయి. ►జగనన్న గోరుముద్ద అద్భుతమైన పథకం ►పిల్లలకు మంచి పౌష్టికాహారం అందిస్తున్నాం ►ఇంటర్ వరకూ జగనన్న గోరుముద్ద కొనసాగించాలని కోరుతున్నాం ►ఇప్పటి వరకూ రూ. 6,600 కోట్లకు పైగా నిధులను ఖర్చు చేశాం ►ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్ర ప్రజలందరికీ సంజీవిని: మంత్రి విడుదల రజిని ►ఆరోగ్యశ్రీలో గతంలో కంటే ఎక్కువ సేవలు అందుబాటులోకి తెచ్చాం ►విద్యా, వైద్య రంగాలకు సీఎం జగన్ పెద్దపీట: ఎమ్మెల్యే గోపిరెడ్డి ►ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు పెంచడం ఎంతో మందికి లబ్ధి ►పేదవారికి ఉపయోగపడేలా సంస్కరణలు తీసుకొచ్చారు Time: 11:00AM ►విద్య, వైద్య రంగాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ►సీఎం జగన్ విద్య, వైద్య రంగాలకే ప్రాధాన్యతనిచ్చారు. ►పేదవారికి ఉపయోగపడేలా సంస్కరణలు తీసుకొచ్చారు ►ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు పెంచడం ఎంతోమందికి లబ్ది జరిగింది ►రోజుకు సగటున 5 వేలకు పైగా పేషెంట్లు ఆరోగ్య శ్రీ సేవలు Time: 10:30AM ►దేవాలయాల సంక్షేమంపై సీఎం జగన్ దృష్టిపెట్టారు: మంత్రి కొట్టు సత్యనారాయణ ►అర్చకులకు అండగా నిలిచిన నాయకుడు సీఎం జగన్ ►గత ప్రభుత్వం దేవాలయ వ్యవస్థను ఆదాయంగానే చూసింది ►ధూపదీపనైవేద్యాల స్కీమ్‌కు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నాం. Time: 10:13AM ప్రారంభమైన మండలి సమావేశం ►రాష్ట్ర సమగ్ర శిక్ష, కస్తూరిబా విద్యాలయాలలోని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యోగ భద్రతపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన పిడిఎఫ్ సభ్యులు ►వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మండలి చైర్మన్ Time: 10:06AM ►అసెంబ్లీకి చేరుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి Time: 10:02AM AP రైతులకు శుభవార్త ►వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల ప్రకటన ►వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల ప్రకటన పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి,కాకాణి గోవర్ధన్ రెడ్డి ►రైతులకు ఇక పై పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించదన్న బెంగలేదు ►సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ►సీజన్ ప్రారంభానికి ముందే మద్దతు ధరలు ప్రకటించారు ►రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలన్నదే సీఎం ఆలోచన ►తొలిసారిగా 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం ►ప్రతీ రైతు భరోసా కేంద్రాన్ని ఒక వ్యాపారకేంద్రంగా మార్చాం ►దళారుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాల్లోనే CM APP ద్వారా పంటలను కొనుగోలు చేస్తున్నాం ►ఈ-క్రాప్ లో నమోదు చేసుకున్న రైతులు మంచి ధరలకు పంటలను అమ్ముకోగలుగుతున్నారు ►ప్రతీ రైతు భరోసా కేంద్రాల్లో ఈ మద్దతు ధరల ప్రకటన పోస్టర్లను ప్రదర్శిస్తాం :::మంత్రి,కాకాణి గోవర్ధన్ రెడ్డి Time: 09:57AM ►ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల స్కీమ్ కోసం బడ్జెట్ కేటాయించాం ►దేవాలయ వ్యవస్థను పారదర్శకంగా నడుపుతున్నాం ►ఇంకా కొన్ని దేవాలయాలను ధూపదీప నైవేద్యాల స్కీమ్ చేర్చాలి ►అర్చకులకు ప్రభుత్వం అండగా నిలవడం అభినందనీయం :::మల్లాది దేవాలయాల అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చ గత ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించింది చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు జగన్ ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంది Time: 09:55AM సమగ్ర సర్వేలో సాంకేతికత కూడా కీలకం: మంత్రి ధర్మాన ►సమగ్ర సర్వేలో సాంకేతికత కూడా కీలకంగా వ్యవహరిస్తోంది ►ఫోర్జరీలకు అవకాశం లేకుండా పోయింది ►సంస్కరణల అమలులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం ►ప్రతీ పథకం ప్రజలకు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యం Time: 09:40AM ►జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఎంతో మేలు జరిగింది ►గతంలో ఒక్కో సర్టిఫికెట్ కోసం ఒక్కో ఆఫీస్ తిరగాల్సి వచ్చేది. ►ఇప్పుడు జగనన్న సురక్షతో ఒకే చోట అన్ని సర్టిఫికెట్లు అందిస్తున్నాం ►గడపడగడపకూ ప్రభుత్వ సేవలను తీసుకెళ్లాం: ఎమ్మెల్యే కిలారు రోశయ్య ►కులం, మతం పార్టీ భేదం లేకుండా పారదర్శకంగా ప్రజలకుసంక్షేమ పథకాలను అందిస్తున్నాం ►ప్రతీ పథకంలోనూ పారదర్శకతకే ప్రాధాన్యం ఇచ్చాం ►సచివాలయ వ్యవస్థతో దేశానికే ఆదర్శంగా నిలిచాం ►సచివాలయ భవన నిర్మాణాలకు ప్ర తిపక్షాలు అడ్డుపడుతున్నాయి: రామచంద్రారెడ్డి ►సచివాలయ సిబ్బంది స్పౌజ్ బదిలీ కేసులను సానుభూతితో పరిశీలించాలి. ►సచివాలయ వ్యవస్థతో గ్రామాల రూపురేఖలు మారాయి: బూడి ముత్యాల నాయుడు ►సచివాలయ వ్యవస్థతో ప్రభుత్వ సేవలు అన్నీ ప్రజల వద్దకే అందిస్తున్నాం ►సచివాలయాల్లో ఎప్పటికప్పుడు ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం ► అర్హతే ప్రామాణికంగా పథకాలు అందిస్తున్నాం Time: 09: 20AM ►పేదలకు డీబీటీ ద్వారా ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నాం ►ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ అమలు చేశారు ►అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయి ►ప్రతీ పథకంలోనూ పారదర్శకతకే ప్రాధాన్యం ఇచ్చారు. ►సచివాలయ వ్యవస్థతో దేశానికే ఆదర్శంగా నిలిచాం ►సచివాలయాల ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తాం ►అసెంబ్లీలో కొనసాగుతున్న క్వశ్చన్ అవర్ సాక్షి, అమరావతి: నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటలకు మొదలైన అసెంబ్లీలో ఫైబర్ గ్రిడ్ కుంభకోణం పై చర్చించనున్నారు. అనంతరం వ్యవసాయ రంగంపై చర్చ జరగనుంది. ఇక శాసనమండలిలో స్కిల్ డెవెలప్మెంట్ స్కామ్‌పై సభ్యులు చర్చించనున్నారు. విద్యారంగంపైనా చర్చ జరగనుంది. -
జగన్ పాలన రైతాంగానికి స్వర్ణయుగం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన రాష్ట్ర రైతాంగానికి స్వర్ణ యుగమని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం పురోగతి–రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు’పై శాసన మండలిలో శుక్రవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో పలువురు ఎమ్మెల్సీలు మాట్లాడిన అనంతరం మంత్రి గోవర్ధన్ బదులిచ్చారు. వ్యవసాయం దండగ అని చంద్రబాబు అంటే.. కాదు పండగ అని నిరూపించిన ఘనత మహానేత వైఎస్సార్‌దని, తర్వాత ఈ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని చెప్పారు. ఇచ్చిన హామీకి కట్టుబడి వైఎస్సార్ రైతులకు పూర్తిగా రుణమాఫీ చేశారన్నారు. అదే హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రుణమాఫీకి కోతలు వేసి రైతులను దగా చేశారని తెలిపారు. ఉచిత విద్యుత్తు ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవడానికే పనికొస్తుందని వెటకారం చేసిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. వైఎస్సార్ అందించిన ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తూ సీఎం వైఎస్ జగన్ వ్యవసాయానికి మరింత శక్తినిచ్చేలా 9 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నారని వివరించారు. సీఎం జగన్ ప్రభుత్వం రైతులకు, కౌలు రైతులకు కూడా అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని చెప్పారు. కోవిడ్ సంక్షోభ సమయంలో అమెరికా, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం చేతులెత్తేస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలను, రైతులను ఆదుకొని సీఎం జగన్ పెద్ద మనస్సు చాటుకున్నారని గుర్తు చేశారు. వ్యవసాయంలో ఈ క్రాప్ బుకింగ్, రైతు భరోసా కేంద్రాలు, ప్రకృతి వ్యవసాయం, బీమా వంటి కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. ఆర్బీకేలు అనేక జాతీయ అవార్డులతోపాటు ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయని తెలిపారు. వ్యవ సాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశుసంవర్థక, డెయిరీ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, వైఎస్సార్ జలకళ, ఉచిత విద్యుత్ వంటి చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని మంత్రి వివరించారు. -
టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బొత్స ఆగ్రహం
-
మండలిలోనూ మితిమీరిన టీడీపీ
సాక్షి, అమరావతి: శాసన మండలిలోనూ తెలుగుదేశం పార్టీ సభ్యులు చైర్మన్ పోడియం పైకి ఎక్కి మితిమీరి వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, టీడీపీ ఎమ్మెల్సీలు ఉద్దేశపూర్వకంగా పోడియం పైకి వచ్చి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. గురువారం శాసన మండలిలో చంద్రబాబు అరెస్టు వ్యవహరంపై చర్చకు పట్టుపడుతూ టీడీపీ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. సీపీఎస్‌పై చర్చ కోరుతూ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మరో వాయిదా తీర్మానం ఇచ్చారు. సభ ప్రారంభం కాగానే ఈ రెండు వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు మండలి చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు మొదలెట్టారు. పోడియంపైకి రావడం మంచిది కాదని, సభ్యులు తమ స్థానాల్లో కూర్చొవాలని చైర్మన్ చెప్పారు. అయినా పరిస్థితి సానుకూలంగా లేకపోవడంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా.. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమవుతుండగా, చైర్మన్ రాకముందే టీడీపీ ఎమ్మెల్సీలు పోడియం పైన చేరారు. చైర్మన్ లోపలికి వస్తూనే, పోడియంపైన టీడీపీ సభ్యులను చూసి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటీవలే కొత్తగా ఎన్నికై తొలిసారి సమావేశాలకు హాజరవుతున్న టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ కూడా పోడియంపైన ఉండడం చూసి.. ‘శ్రీకాంత్ గారూ మీరు కొత్తగా వచ్చారు. సభ మొదలు కాకమునుపే మీరు పోడియం పైకి రావడం సభా మర్యాద కాదు. కిందకు దిగండి’ అని సూచించారు. అయినా టీడీపీ ఎమ్మెల్సీలు పోడియంౖపెనే ఉన్నారు. దీంతో చైర్మన్ తన సీటులో కూర్చోకుండా.. టీడీపీ ఎమ్మెల్సీలను ఉద్దేశించి ‘సభ మొదలుకాక మునుపే పోడియంపైకి వచ్చి కూర్చుంటే ఎలా? లేకపోతే ఇక్కడ (తాను కూర్చునే సీటును చూపిస్తూ) కూర్చొండి వచ్చి’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు తమకు ఉండే ప్రివిలేజీ మేరకు వారు చెప్పదలుచుకున్నది సభలో చెప్పవచ్చు గానీ, ఇలా ప్రవర్తించడం మర్యాద అనిపించుకోదన్నారు. ఇది పెద్దల సభ అని, మర్యాద పాటించి సభ గౌరవాన్ని నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇలానే ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు. అప్పటికీ టీడీపీ ఎమ్మెల్సీలు వెళ్లకపోవడంతో ‘మీకు కావాల్సింది కూడా∙అదేనా..’ అని చైర్మన్ అన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ సాబ్జీ స్పెషల్ మెన్షన్ వినిపించే సమయంలోనూ టీడీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేస్తుండడంతో మంత్రి జోగి రమేష్ జోక్యం చేసుకుని చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే, టీడీపీ ఎమ్మెల్సీలే మండలి ప్రతిష్టను, చైర్మన్ స్థానాన్ని అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. టీడీపీ వర్సెస్ వైఎస్సార్సీపీ చైర్మన్ ఎంత చెప్పినా వినకుండా టీడీపీ ఎమ్మెల్సీలు పోడియంపైనే ఉండి నినాదాలు చేశారు. ఇందుకు ప్రతిగా అధికార వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పలువురు తమ స్థానాల వద్ద నిల్చొని ‘అవినీతి పరుడు చంద్రబాబు డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో మండలి చైర్మన్ మోషేన్‌రాజు రెండోసారి సభను వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరోసారి వాయిదా వేశారు. నాలుగో విడత సభ ప్రారంభమయ్యాక కూడ టీడీపీ ఎమ్మెల్సీల తీరులో మార్పు లేకపోవడంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు మండలి చైర్మన్ ప్రకటించారు. -
Telangana: అసెంబ్లీ 3 రోజులే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాలు మూడు రోజుల పాటు కొనసాగి ఆదివారం ముగియనున్నాయి. శాసనసభ, శాసనమండలి బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మూడు రోజులకు సంబంధించిన ఎజెండాను కూడా ఖరారు చేశారు. దీని ప్రకారం.. 10 ప్రభుత్వ బిల్లులపై చర్చించి ఆమో దించడంతో పాటు 3 అంశాలకు సంబంధించి స్వల్పకాలిక చర్చ కూడా జరుగుతుంది. శని, ఆది వారాల్లో ప్రభుత్వ బిల్లులపై చర్చించి ఆమోదించిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడనుంది. సాయన్న మృతికి సంతాపం.. వాయిదా శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11.30కు ప్రారంభమయ్యాయి. దివంగత ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాపం ప్రకటించిన తర్వాత సభ వాయిదా పడింది. అనంతరం స్పీకర్ పోచారం అధ్యక్షతన ఆయన చాంబర్లో బీఏసీ భేటీ జరిగింది. డిప్యూటీ స్పీకర్ పద్మా రావుతో పాటు మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ పాల్గొన్నారు. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. సభ్యులు కోరినన్ని రోజులు సభ నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని భట్టి, వరదలపై స్వల్పకాలిక చర్చ జరపాలని అక్బరుద్దీన్ ప్రతిపాదించారు. చివరకు మూడురోజుల పాటు సభ నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. వరదలు, విద్య, వైద్యంపై స్వల్పకాలిక చర్చ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశంలో తొలుత ప్రశ్నోత్తరాలను చేపడతారు. అనంతరం రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలు, విద్య, వైద్య రంగం బలోపేతానికి ప్రభుత్వం చర్యలు– ఫలితాలు అనే అంశాలపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. వివిధ అంశాలపై మొత్తం 10 బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శనివారం కూడా ఏదేని ఒక అంశంపై స్వల్పకాలిక చర్చతో పాటు బిల్లులపై చర్చ జరుగుతుంది. ఇక శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ భేటీలో డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, చీఫ్ విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు, ఎంఐఎం సభ్యులు అఫెందీ, మీర్జా రహమత్ బేగ్ పాల్గొన్నారు. శాసనసభలో ప్రవేశ పెట్టే బిల్లులకు అనుగుణంగా ఎజెండాను రూపొందించారు. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు ఇలా.. ప్రశ్నోత్తరాల్లో భాగంగా శుక్రవారం శాసనసభలో ఐటీ ఎగుమతులు, రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు, చార్మినార్ పాదచారుల రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు, ఆరోగ్య లక్ష్మి పథకం, జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్‌ఆర్‌డీపీపై మంత్రులు సమాధానాలు ఇస్తారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, బీసీ కులవృత్తులకు ఆర్థిక సాయం, గొర్రెల సంఖ్య పెరుగుదల, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లు, జాతీయ విద్యా సంస్థల్లో బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లింపు అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. శాసనమండలిలో హరితహారం, కొత్త మెడికల్ కాలేజీల మంజూరు, పంటల బీమా పథకం, పల్లె ప్రగతి, ఆసరా పింఛన్లు, హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ కోతలపై ప్రశ్నలు ఉంటాయి. వ్యవసాయ రంగం అభివృద్ధి, గురుకులాలకు భవనాలు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, బీరప్ప ఆలయాలకు సాయం అంశాలపై కూడా ప్రశ్నోత్తరాలు ఉంటాయి. -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీపై ఆశావహుల నజర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలిలో రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండటంతో బీఆర్ఎస్ నేతల్లో ఆశలు మొదలయ్యా యి. ఇప్పటికే పలువురు ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఇతర పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గవర్నర్ కోటాలో శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న డి.రాజేశ్వర్‌రావు, ఫారూఖ్ హుస్సేన్‌ల ఆరేళ్ల పదవీ కాలం ఈ ఏడాది మే 27న ముగియనుంది. ఈ స్థానాల్లో సభ్యుల పేర్లను గవర్నర్‌కు ప్రతిపాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 9న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను సిఫార్సు చేస్తారనే సంకేతాలు వెలువడినా చివరి నిమిషంలో వాయిదా పడినట్టు తెలిసింది. మళ్లీ అవకాశం కోసం.. పదవీకాలం పూర్తి చేసుకోనున్న డి.రాజేశ్వర్‌రావు, ఫారూఖ్ హుస్సేన్ ఇద్దరూ మైనారిటీ వర్గానికి చెందిన నేతలే కావడంతో.. మళ్లీ అదే కేటగిరీకి చెందిన వారికి పదవులు దక్కుతాయనే ప్రచారం బీఆర్ఎస్లో జరుగుతోంది. డి.రాజేశ్వర్‌రావు రెండుసార్లు కాంగ్రెస్ నుంచి, ఒకసారి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. ఫారూఖ్ హుస్సేన్ కూడా ఒకసారి కాంగ్రెస్, మరోసారి బీఆర్ఎస్ నుంచి శాసనమండలిలో అడుగుపెట్టారు. మరోసారి గవర్నర్ కోటాలో ఎంపికయ్యేందుకు ఈ ఇద్దరూ ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. రెండింటిలో ఒక మహిళకు చాన్స్ శాసనమండలిలో 40మంది సభ్యులు ఉండగా అందులో ముగ్గురే మహిళలు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన సత్యవతి రాథోడ్ మంత్రిగా పనిచేస్తుండగా, స్థానిక సంస్థల కోటాలో కల్వకుంట్ల కవిత, పట్టభద్రుల కోటాలో సురభి వాణీదేవి ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటాలో నామి నేట్ చేసే ఇద్దరిలో ఒక మహిళకు చాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మైనారిటీ వర్గానికి చెందిన మహిళను గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలనే యోచనలో ఉన్న కేసీఆర్ అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇంతకుముందు గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి పేరును ప్రభుత్వం సిఫార్సు చేసినా గవర్నర్ తమిళిసై ఆమోదించలేదు. దీనితో ఈసారి గవర్నర్ కోటా అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, విద్యావేత్త, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఘంటా చక్రపాణి పేర్లు కూడా కేసీఆర్ పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ఏప్రిల్ రెండోవారంలో కేబినెట్ సమావేశం నిర్వహించి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం ఖరారు చేయనున్నట్టు సమాచారం. నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే కోటాలో ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు శుక్రవారం ఉదయం 9.30కు శాసనమండలి చైర్మన్ చాంబర్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మె ల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఉన్న కుర్మయ్యగారి నవీన్‌కుమార్, వి.గంగాధర్‌గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి ఆరేళ్ల పదవీకాలం గురువారంతో పూర్తయింది. వీరిలో కుర్మయ్యగారి నవీన్‌కుమార్ రెండోసారి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికకాగా.. మిగతా రెండు స్థానాల్లో కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి ఎంపికయ్యారు. -
ఉద్యోగులకు బకాయిలు లేవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగుల రెగ్యులర్ జీతభత్యాలు, బకాయిలు, ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్, ఆరోగ్య బీమా, ఏపీజీఎల్ఐ రుణాలు, కంప్యూటర్, హౌస్ బిల్డింగ్, కారు, బైక్, విద్య, పండుగ అడ్వాన్సులు, ప్రయాణ భత్యం, తదితరాలకు సంబంధించి ఎలాంటి బకాయిలు లేవని ఆరి్థక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శనివారం శాసనమండలి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ప్రకటించారు. తాను ఈ ప్రకటన చేస్తున్న సమయానికి పింఛనుదారులకు సైతం పెన్షన్ బకాయిలు, ఏపీజీఎల్ఐ తుది చెల్లింపులు, జీఐఎస్, వైద్య ఖర్చుల చెల్లింపులు, ఆర్జిత సెలవులు నగదుగా మార్చుకోవడం, పారితో ష కాలు, పింఛన్ల మార్పిడికి సంబంధించి ఎలాంటి బకాయిలు పెండింగ్‌లో లేవని వెల్లడించారు. అయితే ఉద్యోగులకు సాధారణ భవిష్య నిధి, డీఏ, సరెండర్ లీవు బకాయిలు కొంత మేర మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అలాగే పింఛనుదారుల కరువు భత్యం బకాయిలు కొంత మేర చెల్లించాల్సి ఉందని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అనేక ఉద్యోగ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ప్రసుత్త ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ మొత్తం సొంత ఆదాయం రూ.98,900 కోట్లు ఉందన్నారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛనుదారుల చెల్లింపులకే దాదాపు రూ.80 వేల కోట్లు ఖర్చవుతోందని వివరించారు. రాష్ట్ర ప్రజలందరి సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యత అని.. ఇందులోనే ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కూడా కలిసి ఉందన్నారు. 33.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మార్చి 15 నాటికి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ద్వారా 33,68,398.72 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యాన్ని సేకరించామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఇందుకు గాను 6,03,490 మంది రైతులకు రూ.6,834.87 కోట్లు చెల్లించామని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులు వేగవంతం గుంటూరు జిల్లా అమరావతిలో గత ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం పనులు నిధులు లేక జరగలేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం విజయవాడ స్వరాజ్ మైదానంలో రూ.268.46 కోట్లతో 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. దీనికి సంబంధించి కొన్ని పనులు పూర్తికాగా మరికొన్ని పురోగతిలో ఉన్నాయని చెప్పారు. కాగా, ఎస్సీ సబ్ ప్లాన్ కింద 2022–23లో రూ.18,518.29 కేటాయించగా, ఫిబ్రవరి నాటికి రూ.13,112.36 కోట్లు ఖర్చు చేశామన్నారు. గత ప్రభుత్వంలో యాడ్స్ ఖర్చు రూ.449 కోట్లు గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో పత్రికల్లో ప్రకటనల కోసం రూ.449 కోట్లు ఖర్చు పెట్టిందని సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.128.38 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కొన్ని ఏజెన్సీల ద్వారా ప్రకటనలు ఇచ్చేవారని.. 15 శాతం కమీషన్లు ఇస్తేనే ఏజెన్సీలు పత్రికలకు ప్రకటనలు ఇచ్చేవన్నారు. తమ ప్రభుత్వం ఆ వృథాను అరికట్టి నేరుగా మంత్రిత్వ శాఖ ద్వారానే ప్రకటనలు ఇస్తోందని తెలిపారు. 31,594 ఎకరాల వక్ఫ్ భూముల ఆక్రమణ రాష్ట్రంలో 65,783.83 ఎకరాల మేర వక్ఫ్ భూములు ఉన్నాయని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. అందులో 31,594.20 ఎకరాలు గతంలో వివిధ ప్రభుత్వాల సమయంలో ఆక్రమణల పాలయ్యాయనని చెప్పారు. ఇలా కబ్జాలో ఉన్న వక్ఫ్ భూముల స్వా«దీనానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. 580.32 ఎకరాలను ఇప్పటివరకు స్వా«దీనం చేసుకున్నామని వివరించారు. రహదారుల నిర్మాణం, మరమ్మతులకు రూ.3,824.75 కోట్లు రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, మరమ్మతులకు రూ.3,824.75 కోట్లు వ్యయం చేశామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. రెండో దశ కింద రూ.1,816.50 కోట్లు కేటాయించామన్నారు. కాగా, ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్‌లో జరిగిన కుంభకోణంపై 2021లో సీఐడీ కేసు నమోదు చేసిందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ కూడా చేసిందని సభ్యుల అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడును స్వాగతించిన మండలి రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడాన్ని శాసనమండలి స్వాగతించింది. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో జరిగిన చర్చ సందర్భంగా పీడీఎఫ్ సభ్యులతో పాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వ విధానాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ 2023–24లో విద్యకు రూ.30 వేల కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో 60.6శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారన్నారు. నాడు–నేడు కింద 56,572 పాఠశాలలను సుమారు రూ.16వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా 25,552 అదనపు గదులను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో సగటున ఏటా 72 లక్షల మంది విద్యార్థులు పాఠశాలల్లో చదువుతున్నారన్నారు. 2018–19లో ప్రభుత్వ పాఠశాలల్లో 36 లక్షల మంది విద్యార్థులు ఉంటే.. అది నాడు–నేడు తర్వాత 43 లక్షలు దాటిందని గుర్తు చేశారు. -
ఏపీ అసెంబ్లీ ఆదివారానికి వాయిదా..
Live Updates Time: 03:00PM ► ఏపీ అసెంబ్లీ ఆదివారానికి వాయిదా పడింది. ►సీఎం వైఎస్ జగన్ యూత్ ఐకాన్: మంత్రి రోజా ►జీఐఎస్ ద్వారా జగనన్న బ్రాండ్ ఏంటో తెలిసింది. ►పరిశ్రమల ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు. ►రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ పట్ల పారిశ్రామికవేత్తలు విశ్వాసంతో ఉన్నారు. ►టీడీపీ నేతల గోబెల్స్ ప్రచారాన్ని.. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌తో తిప్పి కొట్టాం. ►దిగ్గజ పారిశ్రామికవేత్తలంగా ఒకే వేదికపైకి రావడం ఎన్నడూ లేదు. ►జె అంటే జగన్. జె అంటే జోష్ అని పారిశ్రామికవేత్తలే చెప్పారు. ►జీఐఎస్‌తో సీఎం జగన్ ట్రెండ్ సెట్టర్ అని మరోసారి రుజువు చేశారు. ►రాష్ట్రంలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ►ఇంధన రంగంలో భారీగా పెట్టుబడులు ►పరిశ్రమల ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి Time: 02:30PM ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఐదోరోజు తాజాగా విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా.. జీఐస్ ద్వారా రూ. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఏపీకి వచ్చాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అసెంబ్లీలో వెల్లడించారు. పాతికే దేశాల నుంచి ప్రతినిధులు జీఐఎస్‌కు వచ్చారు. ఏపీ ప్రభుత్వ విధానాలపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించారు. అనేక రంగాల్లో ఎంవోయూలు కుదుర్చుకున్నాం అని ఆయన వెల్లడించారు. రికార్డు వ్యవధిలో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా ఆరు లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. యువతకు ఉపాధి కల్పించే రంగాలపై ప్రధాన దృష్టి సారించినట్లు తెలిపారాయన. ఇక.. అగ్ర పారిశ్రామికవేత్తలు వస్తే.. ప్రతిపక్షం ఓర్వలేకపోతోంది. అంబానీ, అదానీ ఏపీకి వస్తే టీడీపీ బాధేంటో అర్థం కావట్లేదు. ఏపీకి పెట్టుబడులు రావడం టీడీపీకి ఇష్టం లేదు. సీఎం జగన్ బ్రాండ్ చూసి ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రంలోని పాలనపై పారిశ్రామికవేత్తలకు విశ్వాసం ఉంది అని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. Time: 02:00PM ►దేశంలోనే మొట్టమొదటిసారిగా మైనారిటీలకు కూడా సబ్ ప్లాన్ తీసుకువచ్చిన ప్రభుత్వం వైఎస్సార్సీపీనే అని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. మైనారిటీ సబ్ ప్లాన్ కింద రూ.4,203 కోట్లు ఇవాళ బడ్జెట్లో కేటాయించామని, గతంలో ఏ ప్రభుత్వం మైనారిటీలకు ఈ స్థాయిలో నిధులు కేటాయించలేదని చెప్పారు. ►సంక్షేమ శాఖ పద్దులపై జరిగిన చర్చలో మంత్రి అంజాద్‌బాషా మాట్లాడారు. చంద్రబాబు హయాంలోనే మైనారిటీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం నడిచిందని మంత్రి గుర్తు చేశారు. మైనారిటీలకు ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. 2019 ఎన్నికలకు మూడు నెలల ముందు ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చి మమ అనిపించారని తెలిపారు. మైనారిటీ ఓట్ల కోసమే ఆ రోజు చంద్రబాబు మూడు నెలల మంత్రి పదవి ఇచ్చి మభ్యపెట్టాలని చూశారని మండిపడ్డారు. Time: 12:30PM ►నవరత్నాల పథకాల యాడ్స్‌పై శాసనమండలిలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ క్లారిటీ ఇచ్చారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నవరత్నాల పథకాలు అమలు అవుతున్నాయన్నారు. ►పథకాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలియజేయడానికి యాడ్స్ ఇస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో యాడ్స్ ఇచ్చే వ్యవహారంలో ఎక్కడ వివక్షత లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 128 కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చామని తెలిపారు. ►‘గత తెలుగుదేశం ప్రభుత్వం యాడ్స్ కోసం 449 కోట్లు ఖర్చు చేసింది. యాడ్స్ ఇచ్చే వ్యవహారంలో పారదర్శకత లేదు. ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్లకి యాడ్స్ ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన పేపర్లకు కూడా యాడ్స్ ఇచ్చారు’ అని తెలిపారు. Time: 12:00PM ►ఆర్ అండ్ బీ శాఖ డిమాండ్స్ చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ►రోడ్లను నిర్లక్ష్యం చేసిన చేసిన ఘనత చంద్రబాబుదే. ►కేంద్రం ఇచ్చిన నిధుల్ని కూడా బాబు ఖర్చుచేయలేకపోయారు. ►కేంద్రమిచ్చిన నిధుల కన్నా ఎక్కువ ఖర్చు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిది. ►రోడ్ల నిర్వహణపై ఎల్లో మీడియా అసత్య కథనాలు Time: 11:10AM శాసనమండలి ►24వ తేదీలోపు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై స్పందిస్తారు: మంత్రి అంబటి రాంబాబు. ►రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై చర్చించేందుకు సీఎం ఢిల్లీ వెళ్లారు. ►సభకు అంతరాయం కలిగించే విధంగా టీడీపీ ఎమ్మెల్సీలు చేయడం సిగ్గుచేటు ►చంద్రబాబు డైరెక్షన్లోనే టీడీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు. Time: 11:00AM ►ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అధికారిక పర్యటనే: మంత్రి బొత్స సత్యనారాయణ ►ఇప్పటికిప్పుడు ఢిల్లీ పర్యటనపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి అనటం దారుణం. ►సమాధానం చెప్పకపోతే మేము బాయ్‌కాట్ చేస్తామని చెప్పడం సమంజసం కాదు. ►ముందుగానే ప్రిపేర్ అయి వచ్చి బాయ్‌కట్ చేస్తామని చెప్తున్నారు. Time: 10:10AM ►ప్రతిపక్షానిది బాధ్యతా రాహిత్యం.. నాది బాధ్యత: స్పీకర్ తమ్మినేని ►సభను సజావుగా నడిపించాల్సిన బాధ్యత నాపై ఉంది. ►చరిత్రలో కళంకితుడిగా ఉండాలనుకోవట్లేదు. ►సభా నాయకుడు నాకు గొప్ప బాధ్యత అప్పగించారు. ►ఆ బాధ్యతల మేరకే సహనంగా ఉంటున్నా. Time: 09:50AM ►సభా కార్యకలాపాలను పదేపదే అడ్డుకున్న టీడీపీ. ►స్పీకర్‌పై పేపర్లు చింపి విసిరేసిన టీడీపీ సభ్యులు. ►అసెంబ్లీ నుంచి ఒకరోజు పాటు టీడీపీ సభ్యుల సస్పెండ్. ► ఉద్దానం ప్రాంత ప్రజలకు, భావితరాలకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఉద్దానం ప్రజలకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలనే తపన, చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి సీఎం జగన్ పనిచేస్తున్నారని, రూ.742 కోట్ల వ్యయంతో 100 కిలోమీటర్ల తాగునీటి పైపులైన్ నిర్మిస్తున్నామన్నారు. ►జూన్‌లో పైపులైన్ నిర్మాణ పనులు పూర్తవుతాయని, ఆ ప్రాంతానికి సురక్షితమైన తాగునీరు అందుతుందని చెప్పారు. ఉద్దానం ప్రాంత ప్రజలకు ఇబ్బందిలేకుండా రానున్న కాలంలో పలాస డయాలసిస్ యూనిట్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని రూ.50 కోట్లతో నిర్మించనున్నామన్నారు. ఆ ఆస్పత్రిలో 151 మంది మెడికల్ స్టాఫ్‌ను అందుబాటులో ఉంచి ఉద్దానం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించబోతున్నామని చెప్పారు. Time: 09:30AM ►సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించారని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. విభజన వల్ల పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చించారని తెలిపారు. పోలవరం నిధులపై ప్రధానితో సీఎం చర్చించారని పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు గత ఢిల్లీ పర్యటనలపై చర్చిద్దామా? టీడీపీ హయాంలో పోలవరంలో జరిగిన తప్పులపై చర్చిద్దామా?. చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు, పెట్టిన బకాయిలపై చర్చిద్దామా?’’ అంటూ మంత్రి బుగ్గన సవాల్ విసిరారు. Time: 09:15AM ►అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ► సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలంటూ నిరసన ►టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి, అమరావతి: అయిదో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అనంతరం గ్లోబల్ ఇన్వెస్టెమెంట్ సమ్మిట్, యువత స్కిల్ డెవలప్మెంట్ శిక్షణపై చర్చ జరగనుంది. అటు శాసనమండలిలో ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్‌పై చర్చ జరగనుంది. -
YSRCP MLC Candidates: మరో బీసీ విప్లవం..
సాక్షి, అమరావతి: శాసన మండలిలో 18 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 14 మందిని అభ్యర్థులుగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. మిగిలిన నాలుగు స్థానాలను నాలుగు ఓసీ సామాజిక వర్గాలకు కేటాయించారు. పట్టభద్రులు, టీచర్ల విభాగం ఎన్నికలను మినహాయిస్తే శాసన మండలికి స్థానిక సంస్థల కోటాలో 9, ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవుతున్న 7 స్థానాలకు ఎన్నికలతో పాటు గవర్నర్ కోటాలో రెండు స్థానాలను ప్రతిపాదించనున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సీఎం జగన్ ఆవిష్కరించిన సామాజిక మహావిప్లవంలో దీన్ని మేలి మలుపుగా సామాజికవేత్తలు అభివర్ణిస్తున్నారు. 44కు పెరగనున్న అధికార పార్టీ బలం.. తాజాగా నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు వరకు శాసనమండలిలో వైఎస్సార్సీపీ బలం 31 ఉంది. వీరిలో పదవీ కాలం ముగుస్తున్న ఐదుగురు సభ్యులను మినహాయిస్తే 26 మంది ఉంటారు. అందులో బీసీలు 8, ఎస్సీలు 4, మైనార్టీలు నలుగురు కాగా ఓసీలు పది మంది ఉన్నారు. స్థానిక సంస్థల్లోనూ, శాసనసభలోనూ వైఎస్సార్సీపీకి తిరుగులేని బలం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 16తోపాటు గవర్నర్ కోటాలో రెండు కలిపి మొత్తం 18 స్థానాలు వైఎస్సార్సీపీకే దక్కుతాయి. అప్పుడు మండలిలో అధికార పార్టీ బలం 44కు చేరుతుంది. అందులో బీసీలు 19, ఎస్సీలు 6, ఎస్టీ ఒకరు, మైనార్టీలు నలుగురు ఉంటారు. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సభ్యుల సంఖ్య 30 (68.18 శాతం)కి చేరుకుంటుంది. ఓసీ సభ్యుల సంఖ్య 14 (31.82 శాతం) అవుతుంది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనూ శాసన మండలిలో ఈ స్థాయిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఏనాడూ ప్రాతినిథ్యం కల్పించిన దాఖలాలు లేవని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. దేశంలో సామాజిక న్యాయం నినాదంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు సైతం సీఎం వైఎస్ జగన్ స్థాయిలో రాజ్యాధికారంలో ఆయా వర్గాలకు వాటా ఇచ్చిన దాఖలాలు లేవని ప్రశంసిస్తున్నారు. టీడీపీ హయాంలో 2014–19 మధ్య శాసనమండలిలో ఆ పార్టీకి 48 మంది సభ్యులు ఉండగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 18 మంది (37.5%)కి మాత్రమే చంద్రబాబు అవకాశం కల్పించారని గుర్తు చేస్తున్నారు. నాడు చంద్రబాబు సామాజిక అన్యాయానికి పాల్పడగా సీఎం జగన్ ఆయా వర్గాల సాధికారత కోసం నిబద్ధతతో అడుగులు వేస్తున్నారని సామాజిక వేత్తలు, రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. తొలి అడుగే బలంగా.. 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్‌సభ స్థానాల్లో (88 శాతం) వైఎస్సార్సీపీ ఘనవిజయం సొంతం చేసుకుంది. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ జూన్ 8న ఏర్పాటైన మంత్రివర్గం నుంచే సామాజిక న్యాయ సాధన కోసం తొలి అడుగే బలంగా వేసి సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. 25 మందితో ఏర్పాటైన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 మందికి (56 శాతం) స్థానం కల్పించి రెవెన్యూ, జలవనరులు, మున్సిపల్, విద్య తదితర కీలక శాఖలు అప్పగించారు. రాజ్యాధికారంలో సింహభాగం వాటా కల్పించారు. ► దేశ చరిత్రలో తొలిసారిగా ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించారు. ► ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించగా అందులో నలుగురికి (80 శాతం) బడుగు, బలహీన వర్గాల నుంచే అవకాశం కల్పించారు. ► శాసనసభ స్పీకర్‌గా బీసీ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్, శాసనమండలి ఛైర్మన్‌గా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు, మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంకు అవకాశం ఇచ్చారు. సామాజిక మహావిప్లవానికి నాంది.. ► 2022 ఏప్రిల్ 11న పునర్ వ్యవస్థీకరణ ద్వారా 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో సామాజిక న్యాయం చేయడంలో సీఎం జగన్ మరో అడుగు ముందుకేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మందికి (70 శాతం) మంత్రివర్గంలో స్థానం కల్పించి సామాజిక మహావిప్లవానికి నాంది పలికారు. ► టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో బీసీ వర్గానికి చెందిన ఒక్కరికి కూడా రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే అందులో నలుగురు బీసీలను (50 శాతం) సీఎం జగన్ రాజ్యసభకు పంపి చిత్తశుద్ధి చాటుకున్నారు. ► రాజ్యాధికారం, పరిపాలనలో సింహభాగం వాటా ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయం చేయడం అంటే ఇదీ అని దేశానికి సీఎం జగన్ చాటిచె ప్పారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. ‘స్థానిక’ సాధికారత.. ► స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ ఉత్తర్వులు జారీ చేస్తే చంద్రబాబు వాటికి వ్యతిరేకంగా టీడీపీ నేతలతో హైకోర్టులో కేసులు వేయించారు. దీంతో బీసీలకు రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గాయి. అయితే టీడీపీ కుట్రలు చేసిన రిజర్వేషన్లను తగ్గించినా పార్టీ పరంగా 34 శాతం కంటే ఎక్కువ ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఆ మేరకు స్థానిక సంస్థలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి సింహభాగం పదవులు ఇచ్చారు. ► రాష్ట్రంలో 648 మండలాలకు ఎన్నికలు జరిగితే 637 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఇందులో 237 మండల పరిషత్ అధ్యక్ష పదవులను బీసీలకు (38 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి ఎంపీపీ పదవుల్లో 67 శాతం ఇచ్చారు. ► 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో బీసీలకు 6 (46 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 9 జడ్పీ ఛైర్మన్ పదవులు (69 శాతం) ఇచ్చారు. ► 14 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించగా మేయర్ పదవుల్లో బీసీలకు ఏకంగా 9 పదవులు (64 శాతం) సీఎం జగన్ ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకొంటే 14 కార్పొరేషన్ మేయర్ పదవులకుగానూ 12 పదవులు (86 శాతం) ఇచ్చారు. ► 87 మున్సిపాల్టీలలో ఎన్నికలు జరిగగా 84 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఇందులో 44 మున్సిపల్ ఛైర్మన్ పదవులను బీసీలకు (53 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు కలిపి 58 మున్సిపల్ ఛైర్మన్ పదవులు (69 శాతం) ఇచ్చారు. చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు.. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు సీఎం జగన్ పదవులు ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఆ వర్గాలకు రిజర్వేషన్ చేస్తూ చట్టం చేయడం దేశంలో ఇదే మొదటిసారి. ► 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకు నియామకాలు చేపట్టగా బీసీలకు 76 పదవులు (39 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కలిపి 117 పదవులు (60 శాతం) ఇచ్చారు. ► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్ పదవులలో 53 పదవులు (39 శాతం) బీసీలకే ఇచ్చారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలిపితే 137 పదవుల్లో 79 పదవులు(58 శాతం) ఆయా వర్గాలకే ఇచ్చారు. 137 ప్రభుత్వ కార్పొరేషన్ పదవులకు సంబంధించి 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవులు ఉండగా 201 పదవులు బీసీలకు (41 శాతం) ఇచ్చారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలిపితే 484 పదవుల్లో 280 పదవులు (58 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. ► బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఆయా వర్గాల వారినే ఛైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్లలో 684 డైరెక్టర్ పదవులు ఉంటే అవన్నీ ఆ వర్గాలకే ఇచ్చారు. ఆలయ బోర్టులు, ఆలయ ఛైర్మన్ పదవుల్లో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. దాదాపు 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503 సగభాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికే ఇచ్చారు. ‘సాధికార’ బాటలో.. గత 44 నెలలుగా వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.1,92,958.90 కోట్లను డీబీటీతో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఖాతాల్లోకే రూ.1,43,178.78 కోట్లు (74.20 శాతం) జమ చేశారు. నాన్ డీబీటీ కింద చేకూర్చిన ప్రయోజనాలు వీటికి అదనం. తద్వారా ఆ వర్గాల్లో పేదరిక నిర్మూలనకు, ఆర్థిక సాధికారతకు బాటలు వేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధన, నాడు–నేడు ద్వారా ఆధునికకీరణ, అమ్మ ఒడి, విద్యాదీవెన తదితర పథకాల ద్వారా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ విద్యా సాధికారతకు కృషి చేస్తున్నారు. మహిళలకు వైఎస్సార్ చేయూత, ఆసరా ద్వారా ఆర్థికంగానూ, పదవుల్లో దాదాపు సగ భాగం వాటా ఇవ్వడం ద్వారా మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నారు. ఆర్థిక, రాజకీయ, విద్య, మహిళా సాధికారత ద్వారా ఆయా వర్గాలు సంపూర్ణ సామాజిక సాధికారత సాధించే దిశగా అధికారం చేపట్టినప్పటి నుంచి సీఎం జగన్ నిబద్ధతతో అడుగులు వేస్తున్నారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలు: బీఆర్ఎస్ దూరం
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ వచ్చిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్).. త్వరలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ సీట్ల ఎన్నికలకు మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఇందులో ఒకటి హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాకు చెందినదికాగా.. మరొకటి ‘మహబూబ్‌నగర్– రంగారెడ్డి– హైదరాబాద్’ ఉపాధ్యాయ (టీచర్స్) నియోజకవర్గానికి సంబంధించినది. ఇందులో స్థానిక కోటాలో బీఆర్ఎస్కు బలం ఎక్కువగా ఉన్నా.. ఈ ఎమ్మెల్సీ సీటును ఎంఐఎంకు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఎప్పటిలాగే నేరుగా పోటీ చేయకుండా.. కలిసివచ్చే ఉపాధ్యాయ సంఘం అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం మారుతున్న అభ్యర్థులు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. నామినేషన్ల స్వీకరణ షురూ.. ప్రస్తుతం ‘మహబూబ్‌నగర్– రంగారెడ్డి– హైదరాబాద్’ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీగా ఉన్న కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పదవీకాలం ఈ ఏడాది మార్చి 29న ముగియనుంది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న అమీనుల్ హసన్ జాఫ్రీ (ఎంఐఎం) పదవీకాలం మే 1న పూర్తవుతోంది. త్వరలో ఈ రెండు సీట్లు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటికి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా మొదలైంది. ఈ నెల 23 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. వచ్చే నెల 13న పోలింగ్ నిర్వహించి.. 16న ఓట్ల లెక్కింపు జరుపుతారు. రాష్ట్ర శాసనమండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా.. అందులో బీఆర్ఎస్ వారే 36 మంది కావడం, మిత్రపక్షం ఎంఐఎంకు ఇద్దరు సభ్యులు ఉండటం గమనార్హం. ఇక కాంగ్రెస్ నుంచి ఒకరు, మరొకరు ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ ఉన్నారు. బీఆర్ఎస్కే బలం.. అయినా దూరం.. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో మొత్తం 127 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 8 మంది సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గుడిమల్కాపూర్ బీజేపీ కార్పొరేటర్ దేవర కరుణాకర్ ఈ ఏడాది జనవరిలో మరణించారు. దీనితో ప్రస్తుతం ఓటర్ల సంఖ్యను 118గా ఎన్నికల సంఘం నిర్ధారించింది. ఇందులో 83 మంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లుకాగా.. మిగతా 35 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు. ఈ ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో వివిధ పార్టీలకు చెందిన ఐదుగురు రాజ్యసభ, ఇద్దరు లోక్‌సభ సభ్యులు, 12 మంది ఎమ్మెల్సీలు, 16 మంది ఎమ్మెల్యేలకు (నామినేటెడ్ ఎమ్మెల్యేను కూడా కలుపుకొని).. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు హక్కు ఉంది. అయితే ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారడం, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డి.వెంకటేశ్, అడిక్‌మెట్ కార్పొరేటర్ సునీత ప్రకాశ్‌గౌడ్ ఇద్దరూ బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరడం నేపథ్యంలో ఆయా పారీ్టల వాస్తవ బలాబలాలపై లెక్కలు వేస్తున్నారు. ఓటర్ల జాబితా ప్రకారం కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీíÙయో సభ్యులు కలిపి బీజేపీ 33 ఓట్ల బలం ఉంది. అదే బీఆర్ఎస్, ఎంఐఎం పారీ్టలకు కలిపి 83 మంది ఓటర్లు సమకూరనున్నారు. ఇందులో సంఖ్యాపరంగా బీఆర్ఎస్కు ఎక్కువ ఓట్లున్నా పోటీకి దూరంగా ఉండి.. గతంలో మాదిరిగా ఎంఐఎంకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య జరిగిన భేటీలో దీనిపై అంగీకారం కుదిరినట్టు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న ఎంఐఎం నేత అమీనుల్ హసన్ జాఫ్రీ.. 2017లో జరిగిన ఎన్నికలో బీఆర్ఎస్ మద్దతుతోనే శాసనమండలిలో అడుగు పెట్టారు. ‘టీచర్ ఎమ్మెల్సీ’పై సస్పెన్స్ ‘మహబూబ్‌నగర్– రంగారెడ్డి– హైదరాబాద్’ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి సుమారు 30 వేల మంది ఓటర్లుగా నమోదయ్యారు. బీఆర్ఎస్ గతంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేరుగా అభ్యర్థులను బరిలోకి దింపకపోయినా.. భావసారూప్య ఉపాధ్యాయ సంఘాల తరఫున పోటీ చేస్తున్న నేతలకు మద్దతు ప్రకటించింది. 2017లో జరిగిన ఎన్నికలో పీఆరీ్టయూ (టీఎస్) తరఫున పోటీచేసిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డికి బీఆర్ఎస్ మద్దతు ఇచి్చంది. ఇప్పటికే వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేసిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి ప్రస్తుతం పీఆరీ్టయూ (తెలంగాణ) తరఫున పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. గుర్రం చెన్నకేశవరెడ్డి పీఆర్టీయూ (టీఎస్) నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇక గత ఎన్నికలో పీఆరీ్టయూ (తెలంగాణ) తరఫున పోటీ చేసిన హర్షవర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ కూడా విద్యాసంస్థల అధినేత ఏవీఎన్ రెడ్డిని బరిలోకి దింపింది. దీనితో ‘మహబూబ్‌నగర్– రంగారెడ్డి– హైదరాబాద్’ ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఉత్కంఠగా మారింది. సుమారు 18 మంది అభ్యర్థులు బరిలోకి ఉండనున్నట్టు అంచనా కాగా.. అధికార బీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేరుగా తమ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో.. బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని ఉపాధ్యాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పీఆరీ్టయూ (టీఎస్), పీఆరీ్టయూ (తెలంగాణ) తరఫున పోటీచేసే అభ్యర్థుల్లో బీఆర్ఎస్ ఎవరివైపు మొగ్గుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది. 9 కొత్త జిల్లాల పరిధిలో జరుగుతున్న ఈ ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిశాక.. బీఆర్ఎస్ మద్దతుపై స్పష్టత రానున్నట్టు చెప్తున్నారు. -
‘మండలి’ డిప్యూటీ చైర్మన్‌గా బండా ప్రకాశ్!
సాక్షి, హైదరాబాద్: సుమారు ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్న శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ వెలువడనుండగా, 11వ తేదీన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన తదితరాలు పూర్తి చేస్తారు. 12న ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభమైన అనంతరం డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసి బాధ్యతలు అప్పగిస్తారు. కాగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్ ఎన్నిక దాదాపు ఖాయమైంది. ఆయన పేరును బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. దీంతో ఈ నెల 11న శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు బండా ప్రకాశ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరించిన నేతి విద్యాసాగర్ 2021 జూన్ 3న ఎమ్మెల్సీగా తన పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. అప్పటి నుంచి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరగకపోవడంతో సుమారు ఏడాదిన్నరగా ఖాళీగా ఉంది. ఇదిలా ఉంటే 2018 మార్చిలో బీఆర్ఎస్ తరపున రాజ్యసభకు ఎన్నికైన బండా ప్రకాశ్ ఎంపీగా ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేయకుండానే 2021 నవంబర్‌లో ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎన్నికయ్యారు. అనంతరం 2021 డిసెంబర్ మొదటి వారంలో బండా ప్రకాశ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్‌తో పాటు ప్రభుత్వ చీఫ్‌విప్, మరో రెండు విప్ పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ ఒక్కరే ప్రస్తుతం మండలిలో ప్రభుత్వ విప్‌గా వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ముగిశాక మండలి చీఫ్ విప్, విప్ పదవుల భర్తీ జరుగుతుందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. -
మండలిలో ఏడు ఖాళీలు.
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మే నెలలోగా శాసనమండలిలో ఏడుగురు సభ్యులు రిటైర్‌కానున్నారు. ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు, గవర్నర్ కోటాలో ఇద్దరు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల కోటాలో ఒక్కో సభ్యుడు చొప్పున తమ ఆరేళ్ల పదవీ కాలపరిమితిని పూర్తి చేసుకోనున్నారు. వివిధ కోటాల్లో ఖాళీ అవుతున్న స్థానాల్లో అవకాశం కోసం పలువురు ఔత్సాహికులు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టిలో పడేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. వచ్చే ఏడాది చివరలో శాసనసభకు ఎన్నికలు జరగనుండగా.. ఆ లోపే మండలిలో ఏడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన కె.నవీన్‌కుమార్, వి.గంగాధర్‌గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డిల పదవీ కాలపరిమితి మార్చి 29న ముగియనుంది. గవర్నర్ కోటాలో నామినేట్ అయిన ఫారూఖ్ హుస్సేన్, డి.రాజేశ్వర్‌రావు, హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ మహ్మద్ అమీనుల్ జాఫ్రీలు మే 27న రిటైర్‌అవుతారు. జనార్ధన్‌రెడ్డి ‘హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్‌నగర్’ఉపాధ్యాయ కోటా స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి కావడంతో ప్రస్తుతం బీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న జనార్ధన్‌రెడ్డి మరోమారు బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. స్థానిక కోటాలో ఎంఐఎం బీఆర్ఎస్తో అవగాహనలో భాగంగా గతంలో హైదరాబాద్ నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎంఐఎం నుంచి అమీనుల్ జాఫ్రీ ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలోనూ ఈ స్థానాన్ని ఎంఐఎంకు అప్పగించడమా లేక పార్టీ అభ్యర్థిని బరిలోకి దించడమా అనే అంశంపై చర్చ జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మెజారిటీ సభ్యులున్న ఎంఐఎంకే తిరిగి అప్పగించే అవకాశ మున్నట్లు సమాచారం. గవర్నర్ కోటాలో మైనారిటీ వర్గానికి చెందిన రాజేశ్వర్, ఫారూక్ హుస్సేన్ పదవీ విరమణ చేయనుండగా, ఈ ఇద్దరిలో ఒకరికి మళ్లీ కేసీఆర్ అవకాశమిచ్చే సూచనలు ఉన్నాయి. కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే కోటాలో నవీన్‌కుమార్‌కు రెండో పర్యాయం దక్కనుండగా వి.గంగాధర్ గౌడ్ స్థానంలో కొత్తవారిని అదృష్టం వరించే అవకాశముంది. గతంలో బీజేపీలోకి వెళ్లి సొంతగూటికి తిరిగి వచ్చిన మండలి మాజీ చైర్మన్ వి.స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశముంది. రెడ్డి సామాజికవర్గం నుంచి కూడా ఒకరికి కేసీఆర్ అవకాశమిస్తారని సమాచారం. -
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: వికేంద్రీకరణపై స్పల్ప కాలిక చర్చ
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్ ►అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిధ్వజమెత్తారు. కట్టని రాజధాని గురించి కట్టలేని గ్రాఫిక్స్ గురించి వెయ్యి రోజులుగా కృత్రిమ ఉద్యమాలు నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి అభివృద్ధి కోసం ఈ ఉద్యమాలు అని సీఎం జగన్ ప్రశ్నించారు. ► ‘టీడీపీ సొంత అభివృద్ధి కోసమే ఈ ఉద్యమాలు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కంటే కట్టని, కట్టలేని అమరావతి చంద్రబాబుకు గొప్పది. అమరావతి రాజధాని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసం కాదు.. కేవలం పెత్తందారుల సొంత అభివృద్ధి కోసమే. ►నవరత్నాల ద్వారా రూ.లక్షా 65వేల కోట్లు డీబీటీ ద్వారా లబ్దిదారులకు అందించాం. అవినీతికి తావులేకుండా నేరుగా అకౌంట్లలో వేశాం. చంద్రబాబు హయాంలో రైతుభరోసా ఎందుకు లేదు?. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు ఇవ్వలేదు?. 21 లక్షల ఇళ్లు ఎందుకు నిర్మించలేదు?. ►బాబు హయాంలోనూ, ఇప్పుడు ఒకే బడ్జెట్ ఉంది.. మరి ఆ నిధులన్నీ ఏమయ్యాయి?. చంద్రబాబు హయాంలో ఇన్ని పథకాలు ఎందుకివ్వలేదు?. ఆనాడు దోచుకో పంచుకో తినుకో అన్నట్లు సాగింది. ►బినామీ భూములు ప్రాంతమే రాజధానిగా ఉండాలనేదే పెత్తందారీల మనస్తత్వం. పచ్చళ్లు అమ్మినా మా వారి పచ్చళ్లే అమ్మాలనేది పెత్తందారీ మనస్తత్వం. చిట్‌ఫండ్ వ్యాపారమైనా మా వాళ్లే వ్యాపారం చేయాలనేది పెత్తందారీల మనస్తత్వం’ అని సీఎం జగన్ విమర్శించారు. ►మా వాడైతే ఆర్బీఐ నిబంధలను ఉల్లంఘించి చిట్‌ఫండ్ వ్యాపారం చేయొచ్చనేది వారి మనస్తత్వం. మా నారాయణ, మా చైతన్య ఉండాలనేది పెత్తందారీల మనస్తత్వం. ప్రతిపక్ష పార్టీలో కూడా నా మనుషులే ఉండాలనేది పెత్తందారీల మనస్తత్వం. వీళ్లంతా ఈ మధ్య ఒకటే రాజధాని అమరావతి అని డిజైన్ చేశారు’ అని సీఎం జగన్ ►ఏపీకి అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని కురసాల కన్నబాబు అన్నారు. టీడీపీ స్వప్రయోజనాల కోసమే రాజధానిగా అమరావతి ఉందన్నారు. విజన్ అని చెప్పుకునే చంద్రబాబు ప్లానింగ్ ఏంటో అర్థం కాలేదన్నారు. పాదయాత్ర పేరుతో హడావుడీ చేస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వమే కాకుండా నిర్మాత కూడా చంద్రబాబేనని విమర్శించారు. ►వికేంద్రీకరణపై అసెంబ్లీలో కన్నబాబు మాట్లాడుతూ.. ‘అభివృద్ధి వికేంద్రీకరణ అవమసరమని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. రాజధాని కోసం కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని నియమిస్తే.. చంద్రబాబు నారాయణ కమిటీని నియమించారు. నారాయణ కమిటీ తుళ్లూరులో రాజధాని ఎంపిక చేసింది. దానికి అమరావతి అని పేరు పెట్టారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ చుట్టూ భూములు కొనిపించినట్టే.. తమ వాళ్లతో అమరావతిలోనూ చంద్రబాబు భూములు కొనిపించారు. రూ. లక్ష కోట్లతో రాజధాని అభివృద్ధి కష్టమనే.. సీఎం జగన్ వికేంద్రీకరణకు మొగ్గు చూపారు.’ అని కన్నాబాబు తెలిపారు. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సీట్లలో కూర్చోవాలని స్పీకర్ ఆదేశించినా ఆందోళన కొనసాగించారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను టీడీపీ సభ్యులు ఏకవచనంతో సంబోధించగా.. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టీడీపీ సభ్యులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ►పయ్యావుల కేశవ్ కుమారుడు భూమలు కొన్నది వాస్తవం కాదా అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఎప్పుడెప్పుడు భూములు కొన్నారో తమ దగ్గర వివరాలు ఉన్నాయన్నారు. రాజధానిపై ఇష్టానుసారం మాట మార్చింది టీడీపీనే అని విమర్శించారు. ► కొందరి చేతుల్లోనే అమరావతి భూములు ఉన్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. వికేంద్రీకరణపై అసెంబ్లీలో స్పల్ప కాలిక చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమరావతిలోనివి తాత్కాలిక నిర్మాణాలు అని తెలిపారు. 30 వేల ఎకరాల భూమిలో కొంతమంది చేతుల్లోనే 10 వేల ఎకరాలు ఉన్నాయని అన్నారు. టీడీపీ అంటేనే టెంపరరీ డెవలప్మెంట్ పార్టీ అని, అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ►16 వేల గ్రామాల్లో సచివాలయాలు పెట్టిన వ్యక్తి సీఎం జగన్. గ్రామ సచివాలయాలతో లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి. పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లాగా.. 26 జిల్లాలు ఏర్పాటు చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్ పాలన.మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలంటే పరిపాలన వికేంద్రకరణ జరగాలని సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒక కులానికో, మతానికో వ్యతిరేకంగా వికేంద్రీకరణ చేయడం లేదు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ. సీఎం జగన్‌పై బురద జల్లడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. వాళ్లకు రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశం లేదు. 40 ఆలయాలు కూల్చిన దుర్మార్గుడు చంద్రబాబు. ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుతున్నారు. తన స్వార్థం కోసం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవద్దు: కొడాలి నాని ► సచివాలయ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసిన ఘనత సీఎం జగన్‌దే. గ్రామ సచివాలయాలతో ప్రజలకు పాలన చేరువైంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన మరింత దగ్గరైంది. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకే సచివాలయ వ్యవస్థ. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేశాము. అన్నమయ్య పేరుతో జిల్లా ఏర్పాటు చేయడం గొప్ప ఆలోచన: భూమన కరుణాకర్ రెడ్డి ► వికేంద్రీకరణపై అసెంబ్లీలో స్పల్ప కాలిక చర్చ ►చంద్రబాబు డైరెక్షన్లో వీరాంజనేయులు పనిచేస్తున్నారు. అసెంబ్లీలో సభా హక్కులను ఉల్లంఘిస్తున్నారు. దళితులను కించపరచడం టీడీపీకి అలవాటే: సుధాకర్‌బాబు ►అసెంబ్లీలో నేను తప్పుగా ఏమీ మాట్లాడలేదు. బాల వీరాంజనేయులు బాధ్యతారహితంగా మాట్లాడారు: మేరుగ నాగార్జున ►మా సభ్యులను కావాలనే రెచ్చగొడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు.మేరుగ నాగార్జునను రెచ్చగొట్టాలని ప్రయత్నించి నీతులు చెబుతున్నారు. అలాంటి వ్యవహారాన్ని అంగీకరించొద్దు- అంబటి ►టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం ►సభలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టీకరణ ► ఉద్యోగాలపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. ఇంటికో ఉద్యోగమని చంద్రబాబు మోసం చేశారు. 1.30 లక్షల మందికి సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలు కల్పించాం. 2.80 లక్షల మందికి వాలంటీర్లుగా అవకాశం ఇచ్చాం. లోకం పూర్తిగా తెలియన వ్యక్తి లోకేష్.. దొడ్డిదారిన మంత్రి అయ్యారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో టీడీపీ విఫలం: వేణుగోపాలకృష్ణ ►తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ► ముగిసిన బీఏసీ సమావేశం.. ఐదురోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ► స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం ఈ సమావేశంలో సీఎం జగన్మోహన్రెడ్డితో పాటు సభ్యులు బుగ్గన, పెద్దిరెడ్డి, జోగి రమేస్, ప్రసాద్‌రాజు, శ్రీకాంత్‌రెడ్డిలు పాల్గొన్నారు. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. దివంగత నేతలకు ఏపీ అసెంబ్లీ సంతాపం ► ఈ మధ్యకాలంలో కన్నుమూసిన నేతలకు.. ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది. మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పులపర్తి నారాయణమూర్తి, జేఆర్ పుష్పరాజ్, నల్లమిల్లి మూలారెడ్డి మృతి పట్ల సభ్యులు సంతాపం ప్రకటించారు. సభను అడ్డుకోవాలని టీడీపీ చూస్తోంది. ఏదో విధంగా గొడవ చేయాలని టీడీపీ సభ్యుల యత్నం. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ సభ్యుల ఆందోళన: అంబటి రాంబాబు ►నిరుద్యోగ భృతితో మోసం చేసింది చంద్రబాబు. ఎస్సీలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు. స్టడీ సర్కిళ్లను వైఎస్సార్ అభివృద్ధి చేశారు: మేరుగ నాగార్జున ►దళిత వ్యతిరేకి చంద్రబాబు. గత ప్రభుత్వం ఎస్సీలకు చేసేందేమీ లేదు. పేదలకు చంద్రబాబు ఏనాడు మేలు చేయలేదు: జోగారావు ► టీడీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారు. టీడీపీ సభ్యులకు చర్చించే దమ్ము లేదు. చంద్రబాబు ఆదేశాలతోనే సభను అడ్డుకుంటున్నారు. త్వరలో జరగబోయేది టీడీపీ శవయాత్రే : జోగి రమేష్ ► టీడీపీకి నైతిక హక్కు లేదు. ప్రజా సమస్యలపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు ఎలా ఉన్నారో.. వాళ్ల నాయకులు కూడా అలానే ఉన్నారు: సుధాకర్‌బాబు ► 2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాం. సభా సమయం వృథా చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. అసెంబ్లీ పెట్టాలని టీడీపీ నేతలు సవాల్ చేశారు. అసెంబ్లీ పెడితే చంద్రబాబు మళ్లీ డుమ్మాకొట్టారు. సభ్యులేమో ఇప్పుడు అడ్డుకోవాలని చూస్తున్నారు: గడికోట శ్రీకాంత్‌రెడ్డి టీడీపీ సభ్యుల తీరు సరికాదు: బుగ్గన ► ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన నిమిషాల వ్యవధిలోనే.. ప్రతిపక్ష టీడీపీ సభను అడ్డుకునే యత్నం చేసింది. వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టి గోల చేశారు టీడీపీ సభ్యులు. సభను అడ్డుకునేందుకు ఆ పార్టీ సభ్యులు తీవ్రంగా యత్నించారు. ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామని స్పీకర్ తమ్మినేని హామీ ఇచ్చినా.. వాళ్లు ఊరుకోలేదు. ఈ క్రమంలో.. మంత్రి బుగ్గన స్పందించారు. టీడీపీ సభ్యుల తీరు సరిగా లేదన్నారు. ప్రశ్నోత్తరాలు జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని, సభను అడ్డుకోవడానికే వాళ్లు వచ్చినట్లు ఉందని మండిపడ్డారు. ► ప్రశ్నోత్తరాలతో మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ► ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు. ► గురువారం నుంచి జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, శాసన సభ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్ని శాఖల కార్యదర్శులను కోరారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా పెరిగిపోయిన నేపథ్యంలో యావత్ ప్రజల దృష్టి ఈ సమావేశాలపై ఉంటుందనే విషయాన్ని అధికారులు అందరూ గుర్తించాలని చెప్పారు. ఇందుకోసం బుధవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ హాల్లో పలు శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులతో వారు వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. ► సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సరైన సమాధానాలను అందిస్తూ వారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అటువంటి సత్సంప్రదాయం కొనసాగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. గత సమావేశాల్లో గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలలో కొన్నింటికి ఇంకా సమాధానాలు అందజేయాల్సి ఉందని, వాటిని ఈ సమావేశాల్లో అందజేయాలని చెప్పారు. ► సభ్యులు అడిగిన ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు అందజేసేందుకు ప్రతి శాఖ ఒక లైజనింగ్ అధికారిని నియమించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేల మెడికల్ బిల్లుల చెల్లింపుపై ఆరి్థక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న మాజీ ప్రజా ప్రతినిధులకు వారు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఔషధాలను అందజేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ► ప్రశాంత వాతావరణంలో సమావేశాలు కొనసాగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌లు.. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఈ నెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంటుంది. చదవండి: ‘మనసానమః’ దర్శకుడికి సీఎం జగన్ ప్రశంసలు -
ఈ నెల 12కు వాయిదాపడ్డ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసన మండలి సమావేశాలు మంగళవారం ఉదయం 11.30 ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇటీవలి కాలంలో దివంగతులైన మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం (తుంగతుర్తి), పరిపాటి జనార్దన్‌రెడ్డి (కమలాపూర్)కి సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. మండలిలోనూ మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్‌రెడ్డికి సంతాపం ప్రకటించారు. సంతాప తీర్మానాల అనంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 12కు వాయిదా పడ్డాయి. బీఏసీ సమావేశం సభ వాయిదా అనంతరం స్పీకర్ చాంబర్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్వహించారు. సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండా, సభ నిర్వహణ తేదీలను ఖరారు చేశారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఈ నెల 12, 13 వ తేదీన రెండు రోజుల పాటు సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇదిలాఉండగా.. ఈ నెల 7న కశ్మీర్ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’యాత్రను ప్రారంభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. -
AP: శాసన మండలిలో ఇద్దరు విప్ల నియామకం
సాక్షి, అమరావతి: శాసన మండలిలో ఇద్దరు విప్‌లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. శాసన మండలిలో ప్రభుత్వ విప్‌లుగా ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను నియమిస్తూ సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులిచ్చారు. ఈ నియామకాలు వెంటనే అమల్లోకి వచ్చాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా పనిచేస్తా: జంగా కృష్ణమూర్తి దాచేపల్లి: శాసన మండలిలో ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా పని చేస్తానని మండలిలో ప్రభుత్వ విప్‌గా నియమితులైన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చెప్పారు. గామాలపాడు సచివాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసన మండలిలో ప్రభుత్వ విప్‌గా తనను నియమించటంపై కృతజ్ఞతలు తెలిపారు. తనపై బాధ్యత మరింతగా పెరిగిందని చెప్పారు. (క్లిక్: గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3,000 కోట్లు) తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా డొక్కా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యుడు డొక్కా మాణిక్య వరప్రసాదరావును తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. (క్లిక్: గుంటూరులో బీజేపీకి బిగ్ షాక్) -
ప్రతిపక్ష పదవి మాకే కావాలి.. ఎన్సీపీ, కాంగ్రెస్‌పై శివసేన ఒత్తిడి
సాక్షి, ముంబై: రాష్ట్ర విధాన పరిషత్‌లో ప్రతిపక్ష నేత పదవి కావాలని శివసేన డిమాండ్ చేస్తోంది. అందుకు మహా వికాస్ ఆఘాడిలో శివసేన మిత్రపక్షాలైన కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) లపై ఒత్తిడి చేయనున్నట్లు విధాన పరిషత్‌తో శివసేనకు చెందిన నూతన సభ్యుడు సచిన్ అహిర్ వెల్లడించారు. ఇటీవల శివసేన నేత ఏక్నాథ్ శిందే 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయడంతో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మహావికాస్ ఆఘాడి ప్రతిపక్షానికే పరిమితమైంది. ఆ తరువాత విధాన మండలి (అసెంబ్లీ)లో ప్రతిపక్ష పదవి నేతగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీంతో విధాన్ పరిషత్‌లో ప్రతిపక్ష నేత పదవి తమకే దక్కాలని శివసేన డిమాండ్ చేస్తోంది. విధాన పరిషత్‌లో కాంగ్రెస్, ఎన్సీపీతో పోలిస్తే శివసేనకు సంఖ్యా బలం ఎక్కువ ఉంది. దీంతో ప్రతిపక్ష నేత పదవి కోసం పట్టుబట్టేందుకు శివసేనకు వాతావరణం అనుకూలంగా ఉంది. ఇరు పార్టీల కంటే శివసేనకు 13 మంది ఎమ్మెల్సీల సంఖ్యా బలం ఎక్కువ ఉంది. దీంతో ఈనెల చివరి వారంలో జరిగే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత పదవి తమకే కావాలని డిమాండ్ చేయనున్నట్లు అహిర్ పేర్కొన్నారు. చదవండి: పన్నీర్ సెల్వానికి భారీ షాక్.. పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీర్మానం 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏక్నాథ్ శిందే, ఆయన మద్దతుదారులు ఎన్ని కుయుక్తులు పన్నినా విల్లు, బాణం (ధనుశ్య, బాణ్) గుర్తు అసలైన శివసేన వద్ద అంటే సుమారు 55 ఏళ్ల కిందట హిందు హృదయ్ సమ్రాట్ దివంగత బాల్ ఠాక్రే స్ధాపించిన శివసేన వద్ద, ఆయన వారసులైన ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే వద్దే శాశ్వతంగా ఉంటుందని అహిర్ స్పష్టం చేశారు. శిందే తిరుగుబాటుతో పార్టీలో నెలకొన్న గందరగోళంవల్ల అనేక మంది శివసైనికుల ఆత్మస్ధైర్యం దెబ్బతింది. దీంతో అదే దూకుడు, ఉత్సాహం, ఊపుతో, మానసికంగా బలపడి శివసేన కొత్త పుంతలతో మళ్లీ ప్రజల ముందుకు వస్తుందని సచిన్ అహిర్ ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: వివాదాస్పద వీడియో.. బీజేపీ మహిళా నేత అరెస్ట్ -
శాసనమండలి చీఫ్ విప్‌గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చీఫ్ విప్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: (గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి) -
యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. తాజాగా శాసనమండలి ఎన్నికల్లో సైతం తనదైన ముద్ర వేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత యూపీ శాసనమండలి ఎన్నికల్లోనూ బీజేపీ తిరుగులేని ఆధిక్యత కనబరిచింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో మాత్రం బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. స్వతంత్ర అభ్యర్థి అన్నపూర్ణ సింగ్.. సమీప బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోని లోకల్ అథారిటీ ఏరియాలోని 36 స్థానాల్లో 33 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ భారీ విజయంతో యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ సొంతమైంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీపై బీజేపీ స్పష్టమైన అధిక్యతను సంపాదించింది. ఈ ఎన్నికల్లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందారు. 36 యూపీ ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటికే 9 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. 27 శాసనమండలి స్థానాల్లో మొత్తం 95 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ భారీ గెలుపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విటర్లో స్పందించారు. ‘నేడు.. యూపీ శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ భారి విజయం సాధించింది. ఈ భారీ విజయం.. జాతీయవాదం, అభివృద్ధి, సుపరిపాలన గల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో యూపీ ప్రజలు ఉన్నారని మరోసారి స్పష్టమైంది’ అని యోగి పేర్కొన్నారు. आज उत्तर प्रदेश के स्थानीय प्राधिकारी विधान परिषद चुनावों में भाजपा की प्रचण्ड विजय ने पुनः स्पष्ट कर दिया है कि आदरणीय प्रधानमंत्री जी के कुशल मार्गदर्शन एवं नेतृत्व में प्रदेश की जनता राष्ट्रवाद, विकास एवं सुशासन के साथ है। — Yogi Adityanath (@myogiadityanath) April 12, 2022 -
టీడీపీ సభ్యుల ఓవరాక్షన్.. మండలి చైర్మన్‌పై ప్లకార్డులు విసిరి..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ సభ్యుల తీరు మారడం లేదు. 12వ రోజు సమావేశాల్లో భాగంగా శాసన మండలిలోనూ టీడీపీ సభ్యులు ఓవరాక్షన్ చేశారు. మండలిలో సభా కార్యకలాపాలను ఆటంకపరిచారు. విజిల్స్ వేస్తూ, చిడతలు వాయిస్తూ టీడీపీ మండలి సభ్యులు దిగజారి ప్రవర్థించారు. ఈ సందర్భంగా వారి తీరుపై చైర్మన్ మోషెన్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సభలో ఇలాంటివి చేయడం మంచిది కాదు. సభకు చిడతలు, విజిల్స్ ఎందుకు తెచ్చారు. సభలో చిడతలు వాయించడం ఏంటి..?. సభా గౌరవాన్ని కాపాడే బాధ్యత మీ మీద లేదా?. భజన చేయడం మంచి పద్ధతి కాదు. వెల్‌లోకి వచ్చి మాట్లాడే హక్కు మీకు లేదు. మీ సీట్లలో మీరు కూర్చొని మాట్లాడండి. టీడీపీ సభ్యులు కావాలనే గొడవ చేస్తున్నారు.. సభా సమయాన్ని వృద్దా చేయొద్దని మొదటి రోజు నుంచి చెబుతున్నా’ అని అన్నారు. వారు ఎంతకూ తీరు మార్చుకోకపోవడంతో టీడీపీ సభ్యులను ఈ ఒక్కరోజు చైర్మన్ సస్పెండ్ చేశారు. దీంతో టీడీపీ సభ్యుడు దీపక్ రెడ్డి పోడియం పైకి ఎక్కడానికి దూసుకెళ్లారు. దీంతో ఆయనను మార్షల్స్ అడ్డుకున్నారు. సస్పెండ్ చేస్తే ఈ దౌర్జన్యం ఏంటి అని చైర్మన్ మోషెన్ రాజు టీడీపీ సభ్యులను ప్రశ్నించారు. ఈ క్రమంలో మోషెన్ రాజుపై ప్లకార్డులు విసిరి టీడీపీ సభ్యులు బయటకు వెళ్లారు. సస్పెండైన వారిలో అర్జునుడు, అశోక్ బాబు, దీపక్ రెడ్డి, ప్రభాకర్, రామ్మోహన్, రామారావు, రవీంద్రనాథ్ ఉన్నారు. ఇది చదవండి: ఆర్ఆర్ఆర్ సినిమా భయం.. థియేటర్లో ఇనుప కంచెలు -
సస్పెండ్.. ప్లీజ్!
సాక్షి, అమరావతి: ‘సస్పెండ్ కావాలనుకోవద్దు.. సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి..’ అని పదేపదే విపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీలపై శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు ఒక రోజు పాటు సస్పెన్షన్ విధించారు. శాసన మండలి బుధవారం ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు ప్లకార్డులతో వెల్‌లో నిలుచుని నినాదాలతో సభను అడ్డుకున్నారు. టీడీపీ సభ్యులు బిల్లుల ప్రతులను చించివేశారు. ఒకదశలో పోడియం పైకి ఎక్కి చైర్మన్ కుర్చీని చుట్టుముట్టారు. వారం రోజులుగా సంయమనం పాటించినా ఫలితం లేకపోవడంతో చర్యలు తీసుకుంటున్నట్లు చైర్మన్ ప్రకటించారు. తమను మాట్లాడేందుకు అనుమతించాలని లేదంటే సస్పెండ్ చేయాలని టీడీపీ సభ్యుడు అశోక్‌బాబు డిమాండ్ చేయడంపై శాసన మండలి చైర్మన్ విస్మయం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేయించుకోవటానికే సభకు వచ్చారా? అని ప్రశ్నించారు. వారం రోజులుగా ఒకే అంశంపై పట్టుబట్టి సభను అడ్డుకోవడం సరి కాదన్నారు. విపక్షం సహకరిస్తే ప్రభుత్వం వివరణ ఇస్తుందని పదేపదే విజ్ఞప్తి చేశారు. వ్యవసాయంపై చర్చ జరగకుండా.. ప్రశ్నోత్తరాలు, ప్రత్యేక ప్రస్తావన సమయాల్లో గందరగోళం సృష్టించిన టీడీపీ సభ్యులు చివరకు వ్యవసాయ రంగంపై స్వల్పకాలిక చర్చను సైతం అడ్డుకున్నారు. కీలకమైన వ్యవసాయ రంగంపై చర్చను సైతం అడ్డుకుంటూ టీడీపీ సభ్యులు దిగజారి వ్యవహరిస్తున్నారని మంత్రి కె.కన్నబాబు విమర్శించారు. ప్రజా సమస్యలు విపక్షానికి పట్టవని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఏడు రోజులుగా గోవిందా.. గోవిందా అంటూ సభా సమయాన్ని టీడీపీ సభ్యులు వృథా చేశారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని సభ్యులు తుమాటి మాధవరావు, రవివర్మ సూచించారు. ఆరుగురిపై ఒకరోజు సస్పెన్షన్ సభా నిబంధనల ఉల్లంఘన, బిజినెస్ రూల్స్ అతిక్రమణపై టీడీపీ సభ్యులు బచ్చుల అర్జునుడు, పరుచూరి అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, అంగర రామ్మోహనరావు, దువ్వారపు రామారావు, ఎం.రవీంద్రనాథ్‌లను ఒక రోజు సస్పెండ్ చేస్తున్నట్టు మండలి చైర్మన్ ప్రకటించారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. -
‘సీపీఎస్’పై త్వరలోనే నిర్ణయం
సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)పై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోనుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మంగళవారం శాసన మండలిలో తెలిపారు. సీపీఎస్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని, లేదా ఎప్పటిలోగా రద్దు చేస్తారో చెప్పాలని పీడీఎఫ్, బీజేపీ ఎమ్మెల్సీలు అడిగిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషేన్‌రాజు తిరస్కరించారు. దీంతో వారు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. వెంటనే బుగ్గన స్పందించి సమాధానమిచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రుల బృందం సీపీఎస్‌పై అధ్యయనం చేసిందని, దానిని అధికారుల కమిటీ కూడా పరిశీలించిందని, కోవిడ్, ఆర్థిక ఇబ్బందులతో జాప్యం జరిగిందని వివరించారు. సీఎం జగన్ ప్రతీవారం సీపీఎస్‌పై సమీక్ష నిర్వహిస్తున్నారని, దానర్ధం దానిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశమేనని బుగ్గన తెలిపారు. మంత్రి వివరణపై సంతృప్తి చెందని పీడీఎఫ్, బీజేపీ సభ్యులు మళ్లీ ఆందోళనకు దిగారు. వారికి టీడీపీ సభ్యులు కూడా జతకలిశారు. కాసేపు సీపీఎస్ రద్దు చేయాలని.. మరికాసేపు కల్తీసారా మరణాలపై చర్చకు అనుమతించాలని నినాదాలు చేస్తూ సభకు అడ్డుపడ్డారు. అదే సమయంలో ఓ సభ్యుడు ఈల వేయగా.. లోకేష్ తదితరులు చప్పట్లు కొడుతూ గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. రాద్ధాంతం మధ్యే ప్రశ్నోత్తరాలు ఇక సభ్యుల రాద్ధాంతం మధ్యే మండలి చైర్మన్ మోషేన్‌రాజు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించారు. సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు బదులిచ్చారు. -
ఏపీ మండలి: మైనారిటీ ఎమ్మెల్సీ రుహుల్లాను అవమానించిన లోకేష్
సాక్షి, అమరావతి: ఏపీ శాసన మండలిలో మైనారిటీ ఎమ్మెల్సీ రుహుల్లాను నారా లోకేష్ అవమానించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ రుహుల్లా ప్రమాణాన్ని టీడీపీ అడ్డుకుంది. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకార ప్రసంగం వినపడకుండా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. మైనారిటీ ఎమ్మెల్సీని ప్రమాణం చేయనివ్వాలని వైఎస్సార్సీపీ కోరగా, అయితే ఏంటి.. మైనారిటీ ఎమ్మెల్సీ అని మాకు తెలుసులే అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. మైనారిటీ సభ్యుడిని అవమానించిన లోకేష్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చదవండి: ఏపీ అసెంబ్లీ: టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ సీరియస్ శాసన మండలిలో టీడీపీకి మంత్రి అనిల్ సవాల్ మండలిలో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు గొడవకు దిగారు. ఛైర్మన్ వారిస్తున్నా వారు పట్టించుకోలేదు. పొత్తులు లేకుండా టీడీపీ ఎన్నికలకు వెళ్లగలదా? ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించగలరా అంటూ మంత్రి అనిల్ సవాల్ విసిరారు. 2024లో మేం ఒంటరిగా బరిలోకి దిగుతున్నామని.. ఒంటరిగా పోటీ చేసే దమ్ము టీడీపీకి ఉందా అంటూ మంత్రి అనిల్ ప్రశ్నించారు. -
‘నవరత్నాల’తో విప్లవాత్మక మార్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ మేలుచేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తోందని, కరోనా కష్టకాలంలోను ఆ బాట వీడలేదని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టంచేశారు. బడ్జెట్‌పై శాసనమండలిలో గురువారం జరిగిన చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నవరత్నాలతో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు వచ్చిందని, వీటి అమలుతో ఏపీలో పేదరికం తగ్గుతోందన్నారు. తమ ప్రభుత్వం వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని, అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తాజాగా చేపట్టిన జిల్లాల విభజన ప్రక్రియ కూడా పూర్తవుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఓటర్లకు డబ్బులు పంచేందుకు, అనేక పథకాలకు చేసిన అప్పులను, చెల్లించని బిల్లులను తమ ప్రభుత్వం ఇప్పుడు తీరుస్తోందని గుర్తుచేశారు. వాస్తవాలను మభ్యపెట్టే విషయంలో చంద్రబాబుకున్న తెలివితేటలు తమకు లేవన్నారు. ఉక్రెయిన్‌లో బాంబులు ఎక్కడెక్కడ పడ్డాయో గూగుల్ మ్యాప్‌లో కమాండర్ పట్టాభితో కనిపెట్టగలిగే తెలివితేటలు చంద్రబాబు సొంతమని బుగ్గన ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు మరింత మేలు ఇక మండలిలో వైఎస్సార్సీపీ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉద్యోగ వయో పరిమితి పెంపు, పెండింగ్ కరువు భత్యాలు ఒకేసారి చెల్లింపు వంటి అనేక సానుకూల నిర్ణయాలు తీసుకుందని, రానున్న కాలంలో వారికి మరింత మేలు చేయనుందన్నారు. ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పండుల రవీంద్రనాథ్‌బాబు, సి.రామచంద్రయ్య, మెట్టు గోవిందరరెడ్డి, రమేష్, రవిరాజు, కత్తి నరసింహారెడ్డి, షేక్ షాబ్జీలు కూడా బడ్జెట్‌పై మాట్లాడారు. -
బాల్య వివాహాలకు అడ్డుకట్ట
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో బాల్య వివాహాలను ప్రభుత్వం అరికడుతోందని, ఒక్క అనంతపురం జిల్లాలోనే గత మూడేళ్లలో 1,508 బాల్య వివాçహాలను అడ్డుకుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత శాసన మండలిలో చెప్పారు. అనంతపురం జిల్లాలో బాల్య వివాహాలపై ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఎన్జీవోల సహాయంతో అనంతపురం జిల్లాలో 2019 ప్రారంభంలో 396, 2019 చివరలో 337, 2020లో 357, 2021లో 418 బాల్య వివాçహాలను అడ్డుకున్నట్లు తెలిపారు. బాల్య వివాహల నియంత్రణకు వైఎస్సార్ కిశోరి వికాసం కార్యక్రమం ద్వారా అనంతపురం జిల్లాలోని అన్ని పాఠశాలలు, జానియర్ కాలేజీల్లో అవగాహన తరగతులు నిర్వహించినట్టు తెలిపారు. సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శు (మహిళా పోలీసు)ల సేవలను కూడా ఉపయోగించుకుంటున్నట్టు తెలిపారు. కొత్తగా 17 స్టేడియాలు రాష్ట్రంలో కొత్తగా 17 స్టేడియాల అభివృద్ధికి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో తెలిపారు. కొన్ని పూర్తిగా ప్రభుత్వ నిధులతో, మరికొన్ని పీపీపీ విధానంలో, ఇంకొన్ని ఖేల్ ఇండియా పథకంలో చేపడుతున్నట్టు వివరించారు. 1.53 లక్షల క్వింటాళ్ల బియ్యం స్వాధీనం ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేసి 2019 నుంచి ఇప్పటి వరకు 1.53 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు మంత్రి కొడాలి నాని శాసన మండలిలో చెప్పారు. -
పెద్దల సభకూ గౌరవమివ్వరా!!
సాక్షి, అమరావతి : పెద్దల సభగా పిలిచే శాసన మండలి గౌరవాన్ని తగ్గిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలపై చైర్మన్ మోషేన్‌రాజు మండిపడ్డారు. గురువారం ఉదయం సభ ప్రారంభం నుంచి సభ ముగిసే వరకు టీడీపీ ఎమ్మెల్సీలందరూ పోడియం వద్ద నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కల్తీ సారా పేరిట అబద్ధాన్ని నిజం చేయడానికి విఫలయత్నం చేశారు. ఎన్నిసార్లు వారి సీట్లలోకి వెళ్లాలని విజ్ఞప్తి చేసిన వారు వినకపోవడంతో చైర్మన్ ఒకింత ఆగ్రహంతో.. ‘మీ చేతుల్లో ప్లకార్డులను టీవీ కెమోరాల్లో కనిపించాలని పదే పదే తిప్పుతున్నారు. మీరు చేస్తుంది ప్రజల కోసమా.. ప్రచారం కోసమా అని తెలిసిపోతోంది’ అని అన్నారు. అంతకు ముందు సభలో మాట్లాడే సభ్యులకు, చైర్మన్ సీటుకు మధ్య ప్లకార్డులతో అడ్డంగా వచ్చారు. ఇది సరైన పద్ధతి కాదని, చెప్పదల్చుకున్నది సీట్ల వద్దకు వెళ్లి మాట్లాడాలని చైర్మన్ సూచించారు. నాలుగు నిమిషాల్లో పరిష్కారమయ్యే అంశంపై నాలుగు రోజులుగా రాద్ధాంతం చేయడం తగదని అన్నారు. మీరు సింగిల్ అజెండాతో వచ్చినట్టు ఉందని, మీ బాధ్యత విస్మరిస్తున్నారని, గౌరవాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. అయినా టీడీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్దే నిలబడ్డారు. చంద్రబాబు ఇగో సంతోష పెట్టడం కోసమే సభలో టీడీపీ సభ్యుల తీరును మంత్రులు ఎండగట్టారు. చంద్రబాబు ఇగోను సంతోషం పెట్టడం కోసమే సభను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. పెద్దల సభ అన్న గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ పెట్టిన మద్య నిషేధాన్ని ఆ తర్వాత చంద్రబాబే ఎత్తేశారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆ మహానుభావుడి చావుకు కారణమై, ఆయన ఆశయాలకు తూట్లు పొడిచి, ఇప్పుడు అదే మద్య నిషేధం గురించి మాట్లాడే అర్హత వారికి ఎక్కడిదని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మద్యం అమ్మకాలపై అధికారులకు టార్గెట్లు పెట్టి, పూర్తి చేయని వారిపై చర్యలు తీసుకున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు గుర్తు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలందరి చేతులు నొప్పి పుట్టేలా ప్లకార్డులు పట్టిస్తున్నారని, కానీ, లోకేష్ మాత్రం పట్టుకోలేదని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై ఎన్ని గంటలైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అబద్ధాలపై సమయం వృథా చేయొద్దని అన్నారు. చర్చకు తామెప్పుడూ భయపడలేదన్నారు. పారిపోవడం, శోకాలు పెట్టడం, దాక్కోవడం చంద్రబాబుకే చెల్లిందని ఎద్దేవా చేశారు. దావూద్ ఇబ్రహీంలా చంద్రబాబు ఎక్కడో ఉండి డైరెక్షన్ ఇచ్చి సభలో రచ్చ చేయిస్తున్నారని చెప్పారు. మొదట 18 మరణాలన్నారు.. ఇప్పుడు 42కు పెంచారు కల్తీ సారాపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, మూడు రోజుల్లో రకరకాల సంఖ్యలు చెప్పారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తప్పుపట్టారు. ‘మూడు రోజుల క్రితం 18 మంది కల్తీ సారాతో మరణించారని అసెంబ్లీలో చెప్పారు. మండలికి వచ్చే సరికి 26 అన్నారు. మళ్లీ అసెంబ్లీలో 28 అన్నారు, ఇçప్పుడు 42 అంటున్నారు. మూడు రోజుల్లో మరణాల సంఖ్య ఇంతగా ఎలా మారుతుంది’ అని ప్రశ్నించారు. దీంతోనే వారు చెప్పేది అబద్ధమని తేలిపోతోందని తెలిపారు. అల్లరి చేయడమే టీడీపీ ఎమ్మెల్సీల ఉద్దేశమని, వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య చైర్మన్‌ను కోరారు. దళిత సమస్యలపై చర్చ జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుపడుతున్నారని డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. మద్యనిషేధానికి తూట్లు పొడిచింది బాబే: మంత్రి కొడాలి నాని మద్య నిషేధంపై టీడీపీ సభ్యులు నినాదాలు చేయడంపై మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తీవ్రంగా స్పందించారు. ఎన్టీ రామారావు తెచ్చిన మద్య నిషేధానికి తూట్లు పొడిచింది చంద్రబాబు అని, సిగ్గూ శరం లేకుండా ఇప్పుడు మద్య నిషేధంపై చర్చ పేరుతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. నిన్నటి వరకు పసుపు ప్లకార్డులతో వచ్చిన వీళ్లు ఈరోజు జనసేన రంగుల ప్లకార్డులతో వచ్చారని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టు, బీజేపీ సభ్యులకు మాట్లాడే అవకాశం లేకుండా వారి హక్కులను కూడా హరిస్తున్నారని, వారిపై చైర్మన్ చర్య తీసుకోవాలని నాని కోరారు. -
ఏప్రిల్ నాటికి ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నీ క్లియర్
సాక్షి, అమరావతి: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులన్నింటినీ ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనమండలిలో బుధవారం ప్రకటించారు. గ్రాట్యుటీ, జీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, ఇతర పింఛను ప్రయోజనాలకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి బకాయిలు లేవని, నిర్ధిష్ట సమయంలోనే వాటి చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రావిడెంట్ ఫండ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లింపులలో కొంత జాప్యం చోటు చేసుకుంటుందని చెప్పారు. కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణమని, ఏప్రిల్ తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితే ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఎగుమతుల్లో పురోభివృద్ధి ఎగుమతుల విషయంలో మన రాష్ట్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకినట్టు మంత్రి బుగ్గన శాసనమండలిలో తెలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,04,829 కోట్లు, 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.1,24,745 కోట్లు, 2021 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 7 నెలల కాలంలో రూ.1,69,404 కోట్లు విలువైన ఎగుమతులు రాష్ట్రం నుంచి జరిగాయని వివరించారు. -
మండలి చైర్మన్‌గా గుత్తా నామినేషన్
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి చైర్మన్ పదవికి మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి అసెంబ్లీ సెక్రటేరియట్లో నామినేషన్ పత్రాలు సమర్పించారు. గుత్తా వెంట మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్, గొంగిడి సునీత, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. నామినేషన్ పత్రాలు సమర్పించాక గుత్తా మాట్లాడుతూ.. రెండోసారి మండలి చైర్మన్‌గా అవకాశమిచ్చిన టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మండలి చైర్మన్‌గా తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన అన్ని పార్టీల నేతలకు కృతజ్ఞతలు చెప్పారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నేడు నోటిఫికేషన్? మండలి చైర్మన్ పదవికి గుత్తా ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సోమవారం జరిగే మండలి భేటీలో లాంఛనంగా ప్రకటించనున్నారు. తర్వాత గుత్తాకు కొత్త చైర్మన్‌గా ప్రొటెమ్ చైర్మన్ సయ్యద్ అమీనుల్ జాఫ్రీ బాధ్యతలు అప్పగిస్తారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కొత్త చైర్మన్ సోమవారం షెడ్యూలు, నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. సోమవారం సాయంత్రం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేసి మంగళవారం జరిగే మండలి భేటీలో కొత్త డిప్యూటీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. -
మండలి చైర్మన్‌గా గుత్తా నామినేషన్!
సాక్షి హైదరాబాద్: టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటాలో శాసనమండలికి ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డి వరుసగా రెండో పర్యాయం శాసనమండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. దీంతో ఆదివారం ఉదయం 10.30 గంటలకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. సుఖేందర్‌రెడ్డి తరపున పలువురు ఎమ్మెల్సీలు నామినేషన్ సెట్లు దాఖలు చేయనుండగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితోపాటు ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కూడా సంతకాలు చేసినట్లు సమాచారం. దీంతో మండలి నూతన చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎన్నిక లాంఛనం కానుంది. కాగా మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండా ప్రకాశ్ ముదిరాజ్ పేరును కూడా సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే డిప్యూటీ చైర్మన్ ఎన్నిక షెడ్యూల్ వెలువడిన తర్వాతే బండా ప్రకాశ్ పేరును ప్రకటించే అవకాశముంది. ఖాళీగా ఉన్న చీఫ్విప్తోపాటు, మూడు విప్ల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. రేపు ఎన్నిక: శాసనమండలి చైర్మన్ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌తోపాటు నోటిఫికేషన్‌ను అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు శనివారం విడుదల చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ వివరాలను మండలి సభ్యులందరికీ పంపించారు. తాజా షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో ఈ నెల 13వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఇది సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది. ఈ నెల 14న ఉదయం 11 గంటలకు శాసన మండలి సమావేశంలో కొత్త చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. 40 మంది సభ్యులున్న మండలిలో ఎంఐఎంకు ఉన్న ఇద్దరు సభ్యులతో కలుపుకుని టీఆర్ఎస్కు 38 మంది సభ్యుల మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ తరపున నామినేషన్ దాఖలు చేసే సభ్యుడు మండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. కొత్తగా ఎన్నికయ్యే చైర్మన్ సోమవారమే బాధ్యతలు స్వీకరిస్తారు. మండలి డిప్యూటీ చైర్మన్ పదవి కూడా ఖాళీగా ఉండటంతో కొత్త చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కోసం షెడ్యూల్, నోటిఫికేషన్ ప్రకటిస్తారు. ఈ నెల 15న డిప్యూటీ చైర్మన్ ఎన్నిక షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. -
పింఛన్ అర్హత వయసు తగ్గింపుతో..10.60 లక్షల మందికి లబ్ధి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధాప్య పింఛన్ అర్హత వయసు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించామని, దీంతో 10,60,208 మంది లబ్ధిపొందారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 2019–20లో 7.58 లక్షలు, 2020–21లో 6.15 లక్షలు, 2021–22లో 5.01 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇచ్చామన్నారు. ఇలా గడిచిన మూడేళ్లలో 18.74 లక్షల పింఛన్లను పెంచామన్నారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 61 లక్షలమందికిపైగా లబ్ధిపొందుతున్నట్టు వెల్లడించారు. అర్హత ఉండీ దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో పింఛన్ మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. చేనేతలకు బాబు శూన్యహస్తం: మంత్రి అప్పలరాజు ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సాయం చేయడానికి చంద్రబాబుకు చేతులు రాలేదని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. గురువారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. 2014కు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పరిహారం చెల్లిస్తే, 2014–19 మధ్య కాలంలో ఆత్మహత్య చేసుకున్న 82 చేనేతల కుటుంబాలకు ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వమే పరిహారం చెల్లించిందన్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా ఏటా రూ.24 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని, 2019–20లో 81,783 మందికి, 2020–21లో 78,211 మందికి, 2021–22లో 80,031 మందికి కలిపి మొత్తం రూ. 576.86 కోట్ల ఆర్థిక సహాయం చేసినట్టు వివరించారు. చేనేతలకు నూలు కొనుగోళ్లలో 40 శాతం మేర సబ్సిడీ చెల్లిస్తున్నామన్నారు. ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు పరిహారాన్ని రూ.1.50 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచాలన్నది సీఎం ఆలోచనని చెప్పారు. విప్లవాత్మక సంస్కరణలు నాడు గంగను భగీరథుడు భువికి తీసుకొచ్చినట్టు.. నేడు సీఎం జగన్ ఎక్కడా లేని విధంగా విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు. – పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే అసమానతలు రూపుమాపుతున్నారు అంబేడ్కర్ ఆకాంక్షలకు అనుగుణంగా పేదలకు విద్యనందించి, సీఎం అసమానతలను రూపుమాపేందుకు కృషి చేస్తున్నారు. – మేరుగ నాగార్జున, వేమూరు ఎమ్మెల్యే స్థానిక భాషలకు ప్రోత్సాహం బాగా వెనుకబడిన మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా ఈరోజు నాణ్యమైన విద్య అందుతోంది. గిరిజన ప్రాంతాల్లోని స్థానిక భాషలను కూడా ప్రోత్సహించాలి. – కె.భాగ్యలక్ష్మి,ఎమ్మెల్యే అందరూ బడికెళుతున్నారు ఏపీలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, పథకాలతో పిల్లలు ఎవ్వరూ బెంగళూరులో పనికి వెళ్లడంలేదు. సొంతూళ్లలో చక్కగా బడికి వెళ్తున్నారు. – బియ్యపు మధుసూదన రెడ్డి, ఎమ్మెల్యే -
పారిశ్రామిక కృషీవలుడు
సాక్షి, అమరావతి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి బాటలు వేసిన గొప్ప నాయకుడని, తుది శ్వాస వరకు పరిశ్రమలను రప్పించేందుకు కృషి చేశారని ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. వివాదరహితుడు, అజాత శత్రువు, మర్యాదస్తుడైన గౌతమ్‌రెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటన్నారు. ప్రతి సమస్యపై క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న తర్వాతే మాట్లాడేవారని, ఏ ఒక్కర్నీ ఆయన విమర్శించిన దాఖలాలు లేవన్నారు. గౌతమ్‌రెడ్డి మృతికి సంతాపంగా మంగళవారం శాసన మండలిలో మంత్రి బుగ్గన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా చైర్మన్‌తో సహా పలువురు సభ్యులు ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. మేకపాటి కుటుంబం అభ్యర్థన మేరకు ఆత్మకూరు నియోజకవర్గంలోని విద్యా సంస్థలను వ్యవసాయ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్ది గౌతమ్‌రెడ్డి పేరుపెట్టాలని సభ్యులు కోరారు. ఆయనకు కోపం తెలియదు: మండలి చైర్మన్ గౌతమ్‌రెడ్డితో తనకు వ్యక్తిగత అనుబంధం ఉందని, ఆయన ఉన్నత విలువలు కలిగిన గొప్ప వ్యక్తి అని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు చెప్పారు. గౌతమ్‌రెడ్డిలో ఏనాడూ చిరునవ్వు మినహా కోపం చూడలేదని, ఎవరినీ నొప్పించేవారు కాదని గుర్తు చేసుకున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదించేలా చొరవ చూపారన్నారు. పెట్టుబడులకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి వ్యక్తి అని కొనియాడారు. గౌతమ్‌రెడ్డి ఉభయసభల్లో ఎంతో మర్యాదస్తుడని, ప్రతీ ఒక్కర్ని ఆప్యాయంగా పలకరించేవారని డిప్యూటీ చైర్పర్సన్ జకియాఖానం పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సీఎం జగన్ తపన దివంగత గౌతమ్‌రెడ్డిలో నిత్యం కనిపించేదని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తికి దేవుడు పరిపూర్ణమైన జీవితాన్నివ్వకపోవడం బాధాకరమని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీటిపర్యంతమైన ఎమ్మెల్సీ చక్రవర్తి తన ఎదుగుదలకు గౌతమ్‌రెడ్డి ఎంతో తోడ్పాటు అందించారని గుర్తు చేసుకుని ఎమ్మెల్సీ బల్లి చక్రవర్తి కన్నీటి పర్యంతమయ్యారు. స్నేహశీలి, వినయశీలి, మృదుస్వభావం లాంటి గొప్ప లక్షణాలున్న గౌతమ్‌రెడ్డి మరణం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి తీరని లోటని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం విషాదకరమని ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్ చెప్పారు. మంత్రినన్న దర్పం ఆయనలో ఏనాడూ కానరాలేదని ఎమ్మెల్సీ వి.గోపాలరెడ్డి తెలిపారు. ప్రజలతో ఎలా మెలగాలో ఆయన్ను చూసి నేర్చుకోవాలని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున పరిశ్రమలు, రూ.లక్షల కోట్ల పెట్టుబడులను రప్పించేలా గౌతమ్‌రెడ్డి కృషి చేశారని ఎమ్మెల్సీ మాధవరావు చెప్పారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారి పట్ల కూడా గౌతమ్‌రెడ్డి ఎంతో హుందాగా ఉండేవారని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి తెలిపారు. హుందాతనానికి నిలువెత్తు నిదర్శనం గౌతమ్‌రెడ్డి అని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కొనియాడారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న 2 స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీలు గౌతమ్‌రెడ్డి కృషి ఫలితమేనని ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసులరెడ్డి, వెంకటేశ్వర్లు, వాకాటి నారాయణరెడ్డి, నరసింహారెడ్డి పేర్కొన్నారు. -
నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి ఎన్నికైన నలుగురు సభ్యులు గురువారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్.రమణ (కరీంనగర్), పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్), డాక్టర్ వి.యాదవరెడ్డి (మెదక్)లతో ప్రొటెమ్ చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ తన చాంబర్లో ప్రమాణ స్వీకారం చేయించారు. జాఫ్రీ సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎల్.రమణ ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులతో పాటు వారు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు తరలివచ్చారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు నూతన ఎమ్మెల్సీలను అభినందించారు. నూతన ఎమ్మెల్సీలకు వేముల ప్రశాంత్‌రెడ్డి రూల్స్ బుక్, గుర్తింపు కార్డు అందజేశారు. జాఫ్రీ సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పట్నం మహేందర్‌రెడ్డి మండలిలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక కోటాలో మండలికి ఎన్నికైన మరో ఐదుగురు సభ్యులు దండె విఠల్ (ఆదిలాబాద్), టి.భానుప్రసాద్ (కరీంనగర్), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), శంభీపూర్ రాజు (రంగారెడ్డి), ఎంసీ కోటిరెడ్డి (నల్లగొండ) ఫిబ్రవరి మొదటి వారంలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. జాఫ్రీ సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కసిరెడ్డి. -
మండలి చైర్మన్‌గా మళ్లీ గుత్తా?
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో వివిధ కోటాల్లో ఖాళీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో సభలో సంఖ్యాపరంగా టీఆర్ఎస్ సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించింది. 40 మంది సభ్యులున్న మండలిలో పార్టీ మద్దతుదారులైన ఇద్దరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో కలుపుకొని టీఆర్ఎస్ బలం 36కు చేరింది. గవర్నర్ కోటాలో ఒకరు, ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు, స్థానిక సంస్థల కోటాలో 12 మంది కలుపుకొని మొత్తం 19 మంది టీఆర్ఎస్ సభ్యులు ఇటీవలి కాలంలో మండలికి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మండలిలో ఖాళీగా ఉన్న పదవులను పలువురు సభ్యులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం మండలిలో చైర్మన్, వైస్ చైర్మన్‌తోపాటు చీఫ్ విప్, మరో మూడు విప్ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న సభ్యులూ ఉన్నారు. గత జూన్ మొదటి వారంలో మండలి చైర్మన్‌గా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు ఏకకాలంలో ఎమ్మెల్సీలుగా పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. విప్‌లుగా ఉన్న కర్నె ప్రభాకర్ గత ఏడాది మార్చిలో రిటైర్ కాగా, మరో ఇద్దరు విప్‌లు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, టి.భానుప్రసాద్‌రావు తాజాగా జరిగిన స్థానిక కోటా ఎన్నికల్లో మరోమారు ఎన్నికయ్యారు. వీరి పదవీ కాలం జనవరి 4న ముగియనుండగా, ఎంఎస్ ప్రభాకర్ ఒక్కరే విప్ హోదాలో కొనసాగుతారు. చైర్మన్ స్థానంలో ఉన్న వెన్నవరం భూపాల్‌రెడ్డి పదవీకాలం జనవరి 4న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు ఆశావహులు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సర్వత్రా ఉత్కంఠ: మండలి చైర్మన్‌గా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి మరోమారు మండలికి ఎన్నిక కాగా, గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన సిరికొండ మధుసూదనాచారి కూడా గవర్నర్ కోటాలో మండలిలో అడుగు పెడుతున్నారు. ఏడాదిన్నర కాలం చైర్మన్‌గా పనిచేసిన గుత్తా మరోమారు చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన అనుభవమున్న మధుసూదనాచారి మండలి చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశముందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మధుసూదనాచారికి చైర్మన్ పదవి దక్కితే గుత్తాకు ప్రభుత్వంలో మరింత ప్రాధాన్యత ఉన్న పదవి దక్కే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే కోటాలో మండలిలో అడుగుపెడుతున్న బండా ప్రకాశ్ ముదిరాజ్‌కు కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావిస్తున్నారు. ఒకవేళ సామాజిక సమీకరణాల లెక్కల్లో కేబినెట్లో బెర్త్ దక్కకపోతే మండలి వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశముంది. ఈ పదవుల పంపకాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మండలి కోటాలో కేబినెట్ బెర్త్? ప్రస్తుతం మండలి నుంచి మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ మంత్రిమండలికి ప్రాతినిథ్యం వహిస్తుండగా, మరికొందరు సీనియర్ నేతలు కూడా కేబినెట్లో చోటు ఆశిస్తున్నారు. గతంలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన ఈటల రాజేందర్ స్థానంలో బండా ప్రకాశ్‌కు చోటు దక్కుతుందని భావిస్తుండగా, ఆయనతోపాటు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత ఆశావహుల జాబితాలో ఉన్నారు. మండలిలో ఖాళీగా ఉన్న మూడు విప్ పదవులను ఆశిస్తున్న వారిలో ఇప్పటికే విప్‌లుగా ఉన్న భానుప్రసాద్‌రావు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డితోపాటు తక్కల్లపల్లి రవీందర్రావు, సురభి వాణీదేవి, ఫారూఖ్ హుస్సేన్, గంగాధర్‌గౌడ్ ఉన్నారు. ఇదిలాఉంటే మండలి ప్రొటెమ్ ఛైర్మన్ పదవీకాలం జనవరి 4న ముగుస్తుండటంతో కొత్త చైర్మన్ ఎన్నిక కోసం రెండు రోజులు మండలి ప్రత్యేక సమావేశం నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. -
MLC: వచ్చే ఏడాది 17 ఎమ్మెల్సీలు ఖాళీ.. గెలుచుకునే అవకాశాలు ఇలా..
ముంబై: మహరాష్ట్ర శాసన మండలిలో వచ్చే ఏడాది 17 స్థానాలు ఖాళీ కానున్నాయి. 2016లో ఎన్నికైన 17 మంది ఎమ్మెల్సీల పదవీకాలం వచ్చే ఏడాదితో ముగియనుంది. ఈ 17 మందిలో పదిమంది సభ్యులు శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడిన వారు కాగా, మిగతా ఏడుగురు స్థానిక స్వపరిపాలనా సంస్థల ద్వారా ఎన్నికయ్యారు. వీరి పదవీకాలం ముగియనుండటంతో వచ్చే ఏడాది జరిగే మండలి ఎన్నికల తర్వాత మహరాష్ట్ర శాసన మండలి రాజకీయ ముఖచిత్రం మారిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శాసన సభలో ఆయా పార్టీలకు ఉన్న సభ్యుల సంఖ్య ప్రకారం బీజేపీ నాలుగు ఎమ్మెల్సీలు, శివసేన, ఎన్సీపీలు చెరో రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకునే అవకాశాలుండగా, కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీని గెలుచుకునే అవకాశముంది. ఇలా తొమ్మిది సీట్లు బీజేపీ, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు గెలుచుకున్నా పదవ సీటు కోసం మాత్రం గట్టి పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే స్వతంత్రులు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు పలికితే పదో స్థానం కూడా కాంగ్రెస్ ఖాతాలో పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రకంగా మహా ఆఘాడికి చెందిన ఆరుగురు, బీజేపీకి చెందిన నలుగురు సభ్యులు ఎమ్మెల్సీలుగా గెలిచే అవకాశాలున్నాయి. పదవీ కాలం ముగియనున్న సభ్యుల్లో రామ్‌రాజే నాయిక్ నింబాల్కర్, పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్‌కి మరోసారి అవకాశం ఇస్తారా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి వయస్సు ఎక్కువగా ఉండటం వల్ల మళ్లీ అవకాశం దక్కకపోవచ్చని, వారిద్దరికి ఉన్న రాజకీయ అనుభవాన్ని వినియోగించుకునేందుకు అవకాశం ఇచ్చినా ఇవ్వొచ్చని పలువురు విశ్లేషణలు చేస్తున్నారు. చదవండి: (దారుణ హత్య: తల, మొండెం వేరుచేసి తలతో పారిపోయిన ప్రియుడు) బీజేపీ నుంచి ఎనిమిదిమంది.. పదవీకాలం ముగియనున్న సభ్యుల్లో ఎనిమిది మంది బీజేపీకి చెందిన వారుకాగా, శివసేనకు చెందిన నలుగురు, ఎన్సీపీకి చెందిన ముగ్గురు, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు ఉన్నారు. తన సంఖ్యాబలాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ తీవ్రంగానే ప్రయత్నించవచ్చు. శాసన సభ సభ్యుల ద్వారా బీజేపీకి చెందిన నలుగురు సభ్యులు ఎన్నిక కావొచ్చు. స్థానిక స్వపరిపాలనా సంస్థల నియోజక వర్గాల సంఖ్యాబలం కాగితాలపై కనిపించదు. ఎక్కువ ప్రభావం కలిగిన వ్యక్తులు గెలుస్తారు. గవర్నర్ కోటాలో నియమించే 12 మంది సభ్యుల స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. కొత్త ఏడాదిలో మరో 17 మంది నూతనంగా ఎన్నిక కానున్నారు. దీంతో శాసన మండలి ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చదవండి: (రైల్వే కోచ్ రెస్టారెంట్ సూపర్ సక్సెస్) ఎవరెవరి పదవీ కాలం ముగియనుందంటే.. వచ్చే ఏడాది పదవీ కాలం ముగియనున్న ఎమ్మెల్సీలలో బీజేపీకి చెందిన ప్రవీణ్ దరేకర్, సదాభావు ఖోత్, సుజీర్త్సహ్ ఠాకూర్, వినాయక్ మోరే, ప్రసాద్ లాడ్, రామ్నివాస్ సింగ్, చందూభాయి పటేల్, పరిణయ్ ఫుకే ఉన్నారు. శివసేనకు చెందిన ఎమ్మెల్సీల్లో సుభాశ్ దేశాయ్, దివాకర్ రావ్తే, రవీంద్ర ఫాటక్, దుష్యంత్ చతుర్వేది తదితరుల పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఎన్సీపీ నుంచి సంజయ్ ధౌండ్, రామ్‌రాజే నాయిక్ నింబాల్కర్, అనిల్ భోంస్లేల పదవీ కాలం ముగియనుండగా.. కాంగ్రెస్ నుంచి మోహన్ కదం, అమర్ రాజుర్కర్ల పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనుంది. -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి
సాక్షి, హైదరాబాద్:తెలంగాణలో గవర్నర్ కోటా నామినెటేడ్ ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి శానసమండలికి ప్రాతినిధ్యం వహించనున్నారు. గతంలో గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం ఈ ఏడాది జూన్ 16న ముగిసిన సంగతి తెలిసిందే. అయితే శ్రీనివాస్‌రెడ్డి స్థానంలో మధుసూదనాచారి పేరును ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫారసును గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదిందారు. మధుసూదనాచారిని శాసన మండలికి నామినేట్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మంగళవారం నుంచి మధుసూదనాచారి పదవీకాలం ప్రారంభం కానుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మహ్మద్ రుహుల్లా
సాక్షి, అమరావతి/అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): ఇటీవల హఠాన్మరణం చెందిన ఎమ్మెల్సీ కరీమున్నీసా కుమారుడు మహ్మద్ రుహుల్లాకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఈ విషయాన్ని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసు వద్ద మీడియాకు వెల్లడించారు. వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న రుహుల్లా కుటుంబసభ్యులను పిలిపించుకుని ముఖ్యమంత్రి మాట్లాడారని వెలంపల్లి చెప్పారు. రుహుల్లాకు టికెట్ ఇవ్వాలన్న నిర్ణయం.. ముఖ్యమంత్రికి మైనార్టీలపై ఉన్న ప్రేమను తెలుపుతోందని పేర్కొన్నారు. ఎండీ కరీమున్నీసా, ఎండీ సలీమ్‌ల కుమారుడైన రుహుల్లా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆయన అభిమానిగా రాజకీయాల్లో ఉండేవారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ స్థాపించినప్పటి నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తగా ఉన్న ఆయన ప్రస్తుతం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. -
ఆ దిశగా మరో ముందడుగు.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన మండలి చరిత్రలో మొట్ట మొదటిసారిగా మైనార్టీ మహిళ జకియా ఖానంను డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘సోదరి జకియా ఖానంకు అభినందనలు. అక్క చెల్లెమ్మలకు అండగా నిలిచి.. మహిళా సాధికారత దిశగా ఈ ప్రభుత్వం వేసిన మరో ముందడుగు ఇది’ అని శనివారం ట్వీట్ చేశారు. చదవండి: పెద్ద కష్టమే.. వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన, సాయంపై హామీ -
AP Assembly: ఉభయసభలు నిరవధిక వాయిదా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉభయసభల సమావేశాలను నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ మేరకు శుక్రవారం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు వేర్వేరుగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నెల 18న ప్రారంభమైన శాసనసభ, మండలి సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. మధ్యలో రెండు రోజులు మినహాయించి ఏడు రోజులపాటు జరిగిన సమావేశాల్లో అనేక అంశాలను చర్చించారు. రెండు సభల్లో ఆన్లైన్ టిక్కెట్ల నిర్వహణ కోసం సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు, రాజధాని వికేంద్రీకరణ రద్దు బిల్లు వంటి మొత్తం 26 బిల్లులను ఆమోదించారు. 34.50 గంటలపాటు శాసనసభ సమావేశాలు శాసనసభ సమావేశాలు ఏడు రోజుల్లో మొత్తం 34.50 గంటలపాటు జరిగినట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. చర్చల్లో 96 మంది ప్రసంగించారన్నారు. 41 స్టార్ ప్రశ్నలకు సమాధానం చెప్పారని.. మరో 21 ప్రశ్నలకు సమాధానాలు సభ ముందుంచారని తెలిపారు. ఐదు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగిందన్నారు. కాగా, రాష్ట్ర ద్రవ్య జవాబుదారీ– బడ్జెట్ నిర్వహణ చట్ట సవరణ బిల్లును శాసనసభ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 26 గంటలపాటు శాసనమండలి సమావేశాలు కాగా, వారం రోజుల్లో మొత్తం 26 గంటలపాటు శాసనమండలి సమావేశాలు జరిగాయి. సభ్యులు స్టార్ ప్రశ్నలు 40, స్టార్ ప్రశ్నలు (ఆన్ టేబుల్) 12, అన్‌స్టార్ ప్రశ్నలు 6 అడిగారు. ఐదు ప్రధాన అంశాలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సభ్యులు పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఒక తీర్మానం చేశారు. మండలి సమావేశాల తొలిరోజునే సభ ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ వాకౌట్ చేసింది. రెండో రోజు కూడా సభ ప్రారంభమైన కొద్దిసేపటికే బాయ్‌కాట్ చేసింది. అప్పటి నుంచి టీడీపీ సభ్యులు సమావేశాలకు హాజరు కాలేదు. అసెంబ్లీలో చంద్రబాబు తాను సీఎం అయ్యాకే సభకు వస్తానని ప్రకటించి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని సాకుగా చూపి మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు కూడా సమావేశాలను బహిష్కరించారు. దీన్ని పలువురు అధికార పార్టీ సభ్యులు తప్పుబట్టారు. బిల్లులకు ఉభయ సభల ఆమోదం పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరిస్తూ తీసుకొచ్చిన బిల్లులు శాసనసభ, శాసన మండలి ఆమోదం పొందాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇందుకు సంబంధించి శాసనసభ కార్యదర్శి నుంచి అందిన సమాచారం, చట్టాల రద్దుకు గల కారణాలను, బిల్లుల కాపీలను ఈ అఫిడవిట్‌తో జతచేశామని కోర్టుకు తెలిపింది. వాటిని పరిశీలించి ఈ వ్యవహారంలో తగిన ఉత్తర్వులు జారీచేయాలని కోర్టును కోరింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. గత వారం ఈ వ్యాజ్యాలపై విచారణ జరుగుతున్న సమయంలో పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరిస్తూ బిల్లులు ప్రవేశపెట్టినట్లు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ధర్మాసనం ఈ బిల్లుల కాపీలను, చట్టాల ఉపసంహరణ కారణాలు తదితరాలను మెమో రూపంలో తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి.. ధర్మాసనం ఆదేశించిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై త్రిసభ్య ధర్మాసనం ఈ నెల 29న విచారణ జరపనుంది. -
AP: శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియా
సాక్షి, అమరావతి/రాయచోటి: శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ పదవి తొలిసారి మైనారిటీ మహిళకు దక్కింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమెను స్వయంగా కూర్చీ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జకియా మాట్లాడుతూ.. ఈ గౌరవప్రదమైన స్థానానికి తనను అర్హురాలుగా గుర్తించి మంచి ఉద్దేశంతో పదవి ఇచ్చినందుకు సీఎం జగన్‌కు రుణపడి ఉంటానన్నారు. సీఎం జగన్ మహిళా పక్షపతి మహిళల సంక్షేమ కోసం అనే పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్ మహిళా పక్షపతి అని నిరూపించుకున్నారని ఆమె కొనియాడారు. దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా ఉందన్నారు. ఒక సాధారణ గృహిణిగా ఉన్న తనకు సముచిత స్థానాన్ని కల్పించినందుకు మైనార్టీలందరూ హర్షించారని ఆమె పేర్కొన్నారు. మైనార్టీల సామాజిక, ఆర్టిక, రాజకీయ ఎదుగుదలకు తోడ్పడుతానని ఆమె భరోసా ఇచ్చారు. కాగా వైఎస్సార్ జిల్లా రాయచోటిలో మైనార్టీ వర్గాలకు ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ తన మాట నిలబెట్టుకున్నారు. ఈక్రమంలో రాయచోటికి చెందిన జకియా ఖాన్మ్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మరో అడుగు ముందుకు వేసి ఆమెకు శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. జకియా ఖానమ్ నేపథ్యమిది.. పేరు: మయాన జకియా ఖానమ్ భర్త: దివంగత ఎం.అఫ్జల్ ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంతానం: ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు చదువు: ఇంటర్మీడియెట్ పుట్టిన తేది: జనవరి 01, 1971 స్వస్థలం: రాయచోటి, వైఎస్సార్ జిల్లా రాజకీయ నేపథ్యం: ఎమ్మెల్సీ (ఆగస్టు 20, 2020 నుంచి) -
ఏపీ శాసనమండలి: నూతన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో నూతనంగా ఎన్నికైన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్సీలుగా మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. వైఎస్సార్సీపీ తరపున ఎన్నికైన సభ్యులు చిన్న గోవిందరెడ్డి, ఇషాక్ బాషా, పాలవలస విక్రాంత్ వర్మ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఛైర్మన్ మోషేన్ రాజు ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ్యుల కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న సంగతి తెలిసిందే. చదవండి: బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్.. అసెంబ్లీలో మంత్రి వేణుగోపాలకృష్ణ -
ప్రత్యేక వాదం వచ్చింది అందుకే.. మండలిలో మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి సాధ్యమని.. అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వం ధ్యేయం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఏపీ శాసనమండలిలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును మంగళవారం ఆయన ప్రవేశపెట్టారు. చదవండి: 'మీ పతనం నా కళ్లతో చూడాలనే ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నా' అభివృద్ధి వికేంద్రీకరణ రద్దు బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి జరిగిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. ఒక ప్రాంతమే ఎక్కువగా అభివృద్ధి చెందడంతో ప్రత్యేకవాదం వచ్చిందని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. అందుకే అన్ని రాష్ట్రాలు వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం అమాయకుల నుంచి 33వేల ఎకరాలను సేకరించింది. ఎక్కడా లేనట్లు 7500 చ.కి.మీటర్లలో రాజధానిని కడతామన్నారు. 50వేల ఎకరాల్లో రాజధాని కట్టాలంటే కనీస అవసరాలకే రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతుంది. రాజధాని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. ఒకే చోట అన్ని సంస్థలు పెడితే ఏ ప్రాంతమూ అభివృద్ధి చెందదు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం ఎంతైనా ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. -
ఏపీ శాసన మండలి ఛైర్మన్‌గా మోషేన్‌రాజు
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలి ఛైర్మన్‌గా కొయ్యే మోషేన్‌రాజు బాధ్యతలు స్వీకరించారు. మోషేన్‌రాజును చైర్‌వద్దకు తీసుకొచ్చిన సీఎం వైఎస్ జగన్.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోషేన్‌రాజు నిబద్ధత గల రాజకీయ నాయకుడు అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా మోషేన్‌రాజుకు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. చదవండి: మా అమ్మ, చెల్లెలు, బాబాయ్ గురించి చంద్రబాబే మాట్లాడారు: సీఎం జగన్ వైఎస్సార్ కుటుంబం ఎంతో మంది సామాన్యులను ఉన్నతస్థాయికి తీసుకొచ్చిందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పిస్తున్నారని మోషేన్‌రాజు అన్నారు. దళితుడిని ఉన్నతస్థాయిలో కూర్చొబెట్టిన ఘనత సీఎం జగన్‌దని ఆయన పేర్కొన్నారు. ఈ స్థాయికి వస్తానని అనుకోలేదు. ఎప్పుడూ వైఎస్సార్ కుటుంబంతో ఉండేందుకు ఇష్టపడతానన్నారు. రాజకీయాలకు కులం, డబ్బు అవసరం లేదు. ప్రజల విశ్వాసం ఉంటే చాలని నమ్మిన నాయకుడు వైఎస్ జగన్ అని మోషేన్ రాజు అన్నారు. చదవండి: అసెంబ్లీలో టీడీపీ హైడ్రామా.. కన్నీళ్లు, వాకౌట్ అంటూ పచ్చ మీడియా అతి కొయ్యే మోషేన్ రాజు ప్రస్థానమిది.. జననం: 1965, ఏప్రిల్ 10 తల్లిదండ్రులు: కొయ్యే సుందరరావు, మరియమ్మ స్వగ్రామం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడి విద్యాభ్యాసం: డిగ్రీ గతంలో చేపట్టిన పదవులు ► 1987 నుంచి వరుసగా నాలుగుసార్లు మునిసిపల్ కౌన్సిలర్‌గా, రెండుసార్లు ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. ► ఏపీసీసీ ఎస్సీ, ఎస్టీ సెల్ ప్రత్యేక ఆహ్వానితుడిగా, కాంగ్రెస్ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శిగా, యూత్ కాంగ్రెస్ భీమవరం పట్టణ అ«ధ్యక్షుడిగా వివిధ పదవులు నిర్వహించారు. ► కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఆ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీకి మోషేన్ రాజు సేవలను గుర్తించిన సీఎం జగన్ గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీ చేశారు. -
మండలి చైర్మన్ పదవికి మోషేన్ రాజు నామినేషన్
సాక్షి, అమరావతి/భీమవరం: శాసనమండలి చైర్మన్ పదవి తొలిసారి ఎస్సీలకు దక్కనుంది. ఈ పదవికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్ రాజును ఎంపిక చేశారు. తొలి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎస్సీ వర్గానికి చెందిన కె.నారాయణస్వామిని ఉప ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే అదే వర్గానికి చెందిన మేకతోటి సుచరితను హోంశాఖ మంత్రిగా నియమించారు. రాష్ట్ర చరిత్రలో ఎస్సీ మహిళను హోం మంత్రిని చేయడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. నేడు ఎన్నిక శాసనమండలి చైర్మన్ ఎన్నిక శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు జరగనుంది. ఎమ్మెల్సీగా ఎంఏ షరీఫ్ పదవీకాలం ముగియడంతో మండలి చైర్మన్ పదవి ఖాళీ అయ్యింది. దీంతో మండలి చైర్మన్ ఎన్నికకు గురువారం కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు నోటిఫికేషన్ జారీ చేశారు. చైర్మన్ పదవికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కొయ్యే మోషేన్‌రాజు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ఒక్కటే దాఖలైన నేపథ్యంలో ఆయన మండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. కొయ్యే మోషేన్ రాజు ప్రస్థానమిది.. జననం: 1965, ఏప్రిల్ 10 తల్లిదండ్రులు: కొయ్యే సుందరరావు, మరియమ్మ స్వగ్రామం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడి విద్యాభ్యాసం: డిగ్రీ గతంలో చేపట్టిన పదవులు ► 1987 నుంచి వరుసగా నాలుగుసార్లు మునిసిపల్ కౌన్సిలర్‌గా, రెండుసార్లు ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. ► ఏపీసీసీ ఎస్సీ, ఎస్టీ సెల్ ప్రత్యేక ఆహ్వానితుడిగా, కాంగ్రెస్ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శిగా, యూత్ కాంగ్రెస్ భీమవరం పట్టణ అ«ధ్యక్షుడిగా వివిధ పదవులు నిర్వహించారు. ► కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఆ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 8 పార్టీకి మోషేన్ రాజు సేవలను గుర్తించిన సీఎం జగన్ గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీ చేశారు. వైఎస్సార్సీపీలో కష్టపడ్డవాళ్లకు గుర్తింపు, గౌరవం వైఎస్సార్సీపీలో కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం ఉంటుందనడానికి నన్ను మండలి చైర్మన్‌గా ఎంపిక చేయడమే నిదర్శనం. వైఎస్సార్ కుటుంబాన్ని, సీఎం వైఎస్ జగన్‌ను నమ్ముకున్న వారికి న్యాయం జరుగుతుందనడానికి ఇదే తార్కాణం. సీఎం జగన్ ఎస్సీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. సామాజిక న్యాయాన్ని చాటి చెబుతున్నారు. – కొయ్యే మోషేన్ రాజు చదవండి: టీడీపీని ఎన్టీఆర్ కుటుంబానికి అప్పగించు బాబూ! -
మండలిలో టీడీపీ సైంధవ పాత్ర సాగదు
సాక్షి, అమరావతి: ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని అడ్డుకోవడంలో తెలుగుదేశం పార్టీ శాసన మండలిలో నిర్వహించిన సైంధవ పాత్ర ఇకపై సాగదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 2019 ప్రజా కోర్టులో తిరస్కరణకు గురైన టీడీపీ కక్షతో, కుట్రలతో మండలిలో వారికున్న సాంకేతిక బలాన్ని అడ్డుపెట్టుకుని పాలనను అడుగడుగునా ఆటంకపరిచిందని తెలిపారు. కోర్టులకెక్కి కుట్రలు చేశారని అన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికలు జరగనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్ సీపీ అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు వేశారు. అసెంబ్లీ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో సజ్జల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసన సభలో 152 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో తమ అభ్యర్థుల గెలుపు లాంఛనమేనన్నారు. దీనికి తోడు స్థానిక సంస్థల్లో 80 శాతం మంది తమ సభ్యులే ఉన్నారని, 11 ఎమ్మెల్సీ స్థానాల (స్థానిక సంస్థల)ను కూడా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. వచ్చే నెల నుంచి మండలిలో వైఎస్సార్ సీపీ సభ్యుల సంఖ్య 32కు పెరుగుతుందని సజ్జల చెప్పారు. ఇన్నాళ్లూ అపరిపక్వత, అసంబద్ధతతో టీడీపీ ఆడిన ఆటలకు తెరపడిందన్నారు. జనరంజక పాలనలో తనకు భాగస్వామ్యం కల్పించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ అభ్యర్థి పాలవలస విక్రాంత్ అన్నారు. రాజకీయాల్లో విలువలు కనుమరుగైపోతున్న తరుణంలో సీఎం జగన్ విలువలు, విశ్వసనీయతకు ప్రాణం పోస్తున్నారని కొనియాడారు. మరో ఎమ్మెల్సీ అభ్యర్థి ఇషాక్ బాషా మాట్లాడుతూ టీడీపీ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని మండిపడ్డారు. నంద్యాల ఉపపోరులో మైనార్టీల కష్టాలను కళ్లారా చూసిన జగన్ అప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం తమకు మండలిలో అవకాశం కల్పించారన్నారు. రెండోసారి మండలికి ఎంపిక చేసి మరోసారి ప్రజాజీవితానికి అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ అభ్యర్థి డీసీ గోవిందరెడ్డి అన్నారు. జగన్ సామాజిక న్యాయం తాజాగా ఎన్నిక కాబోయే సభ్యులతో కలిపి మండలిలో 32 మంది వైఎస్సార్సీపీ సభ్యులకు గాను 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండటం సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయానికి అద్దంపడుతోందని తెలిపారు. మండలిలో నలుగురు మైనార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చరిత్రలో కూడా లేదన్నారు. నంద్యాల ఉప పోరులో ఇచ్చిన హామీ ప్రకారం జగన్ మైనార్టీలకు న్యాయం చేశారన్నారు. 2014–19లో 30 మంది టీడీపీ ఎమ్మెల్సీలు ఉంటే అందులో 11 మంది మాత్రమే వెనుకబడిన వర్గాలవారున్నారని తెలిపారు. ఓట్ల కోసమే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ మైనార్టీకి ఎమ్మెల్సీగా టీడీపీ అవకాశం ఇచ్చిందన్నారు. -
మండలిలో పూర్తి మెజార్టీ దిశగా వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తయితే శాసనమండలిలో అధికార వైఎస్సార్సీపీ సంపూర్ణ ఆధిపత్యం సాధిస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. శాసనసభ, స్థానిక సంస్థల్లో రాజకీయ పార్టీల బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే 14 ఎమ్మెల్సీ స్థానాలనూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడం ఖాయం. అప్పుడు మండలిలో వైఎఎస్సార్సీపీ సభ్యుల సంఖ్య 18 నుంచి 32కు పెరుగుతుంది. శాసనసభ తరహాలోనే శాసనమండలిలోనూ వైఎస్సార్సీపీకి తిరుగులేని ఆధిపత్యం లభిస్తుంది. దీనివల్ల ప్రజాభ్యుదయం, రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసేలా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, అమలు చేయడానికి ప్రభుత్వానికి మరింత వెసులుబాటు ఉంటుందని రాజ్యాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. శాసనమండలిలో సంఖ్యాబలాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి రెండున్నరేళ్లుగా సైంధవుడిలా అడ్డుపడుతున్న చంద్రబాబు క్షుద్ర రాజకీయాలకు తెర పడుతుందని పేర్కొంటున్నారు. బిల్లులకు మోకాలడ్డు.. చట్టసభలను ప్రతిపక్ష నేత చంద్రబాబు తన క్షుద్ర రాజకీయాలకు వేదికగా మార్చుకున్నారు. అందరి అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా శాసనసభలో చర్చించి ఆమోదించిన చారిత్రక బిల్లులను శాసనమండలిలో సంఖ్యాబలాన్ని అడ్డుపెట్టుకుని మోకాలడ్డారు. చట్టాలు రూపు సంతరించుకోవడంలో తీవ్ర జాప్యమయ్యేలా చేసి ప్రజాభ్యుదయాన్ని కాలరాయాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో బోధించడం ద్వారా పేద పిల్లలకు బంగారు భవిత అందించడమే లక్ష్యంగా తెచ్చిన బిల్లు నుంచి రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా మూడు రాజధానుల ఏర్పాటు బిల్లు వరకూ శాసనసభ ఆమోదించిన వాటిని మండలిలో సంఖ్యాబలంతో అడ్డుకునేందుకు పన్నిన కుట్రలే అందుకు నిదర్శనం. ఎస్సీలు, ఎస్టీల కోసం వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయడానికి వీలుగా శాసనసభ ఆమోదించిన బిల్లునూ మండలిలో అడ్డుకునే దుస్సాహసానికి ఒడిగట్టారు. పూర్తి ఆధిక్యం దిశగా.. స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన 11 మంది, ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియడంతో శాసన మండలిలో టీడీపీ సంఖ్యాబలం తగ్గింది. ఖాళీ అయిన 14 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. శాసనసభలో వైఎస్సార్సీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. స్థానిక సంస్థలకు సంబంధించి మండల, జిల్లా పరిషత్‌లలో 86 శాతం ఎంపీటీసీ, 98 శాతం జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. నగర, పురపాలక సంస్థల్లో 82.80 శాతం డివిజన్లు, వార్డుల్లో అధికార పార్టీ విజయకేతనం ఎగురవేసింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే అటు శాసనసభ ఇటు స్థానిక సంస్థల్లో వైఎస్సార్సీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికలు జరగనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలు, స్థానిక సంస్థల కోటాలో ఎన్నికలు నిర్వహిస్తున్న 11 ఎమ్మెల్సీ స్థానాలనూ వైఎస్సార్సీపీ దక్కించుకోవడం ఖాయం. శాసనమండలిలో సంపూర్ణ ఆధిక్యం సాధించడం ద్వారా విపక్షం కుట్రలకు అడ్డుకట్ట పడనుంది. -
ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 18న ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. -
కేంద్రం సహాయ నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: దేశానికి ఆర్థిక వనరులైన 4 ముఖ్య రాష్ట్రాల్లో మనది ఒకటని.. అయినా కేంద్రం తెలంగాణకు సహాయ నిరాకరణ చేస్తోందని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. అధికారం ఎవరికీ శాశ్వతంకాదని, రాష్ట్రం మాత్రం శాశ్వతమని గుర్తు పెట్టుకుని ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలివ్వా లని కోరారు. సీఎం ఇంత కష్టపడుతున్నా ప్రతిప క్షాలు అర్థరహిత విమర్శలు చేస్తున్నాయని.. వాటిని పట్టించుకోమన్నారు. అభివృద్ధిని జీర్ణించుకోలేక పాదయాత్ర పేర కువిమర్శలు చేస్తు న్నారని బీజేపీ ఉద్దేశించి పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ రంగాల అభివృద్ధిపై శుక్రవారం శాసన మండలిలో స్వల్పకాలిక చర్చకు కేటీఆర్ సుదీర్ఘ సమాధానమిచ్చారు. 2030 వరకు రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో పురోభివృద్ధితో పరుగులు పెట్టిస్తామని, అప్పటిదాకా ప్రజలు తమనే గెలిపిస్తారనే సంపూర్ణ నమ్మకముందన్నారు. మాటసాయం లేదు.. మూటసాయం లేదు... కేంద్రం నుంచి వచ్చేది ఏమీలేదని, మనమే వారికి ఇస్తున్నామని కేటీఆర్ అన్నారు. ‘కేంద్రం నుంచి మాట సహాయం లేదు. మూట సహాయం’లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మూతపడిన మూడు చక్కెర పరిశ్రమలను ప్రభుత్వమే నడిపించే విషయంపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే నాలుగో పారిశ్రామిక విప్లవానికి తగ్గట్లుగా ప్రణాళికలు, కార్యాచ రణతో ముందుకు వెళ్లాల్సి ఉంద న్నారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ, ఇతర ప్రాంతాల్లో టీహబ్, వీహబ్ వంటివి, ఐటీ టవర్స్ నిర్మించి స్థానిక తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎంఐఎం సభ్యుడు అఫెండీ కోరారు. ఈ చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఆర్ఎస్ సభ్యులు భానుప్రసాద్, పురాణం సతీష్, తేర చిన్నపరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు రేపు నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా స్థానాలకు ఎన్నిక జరపడంపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఆరుగురు సభ్యుల పదవీ కాలం జూన్ 3న ముగిసింది. ఈ ఏడాది మేలో ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా, కోవిడ్ రెండో దశ తీవ్రతతో వాయిదా వేస్తున్నట్లు మే 13న సీఈసీ ప్రకటించింది. ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని సీఈసీ భావిస్తోంది. ప్రభుత్వం నుంచి అందే సమాధానం ఆధారంగా ఎన్నిక నిర్వహణపై సీఈసీ నిర్ణయం తీసుకోనుంది. శుక్రవారం ఎన్నిక నోటిఫికేషన్ వెలువడనుందని సమాచారం. ఎమ్మెల్యే కోటాలో ఆరు స్థానాలు ఖాళీ ఈ ఏడాది జూన్ 3న పదవీ విరమణ చేసిన ఎమ్మెల్సీల్లో మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు. వీరితో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, ఆకుల లలిత పదవీకాల పరిమితి పూర్తి చేసుకున్న వారిలో ఉన్నా రు. వీరితో పాటు గవర్నర్ కోటాలో ఎన్నికైన ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలం కూడా గత నెల 17న ముగిసింది. ప్రస్తుతం శాసనసభలో ఎమ్మెల్యే కోటాలో ఆరు, గవర్నర్ కోటాలో ఒక స్థానం చొప్పున మొత్తం ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. -
బెంగాల్: మండలి ఏర్పాటు తీర్మానానికి శాసనసభ ఆమోదం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ శాసనసభ కీలక తీర్మానం చేసింది. రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు తీర్మానానికి బెంగాల్ శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. శాసన సభ సమావేశంలో భాగంగా మండలి ఏర్పాటు తీర్మానానికి 196 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. 69 మంది ఎమ్మెల్యేలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ఇక బెంగాల్లో 1952లో శాసన మండలిని ఏర్పాటు చేశారు. అయితే 1969లో లెఫ్ట్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేసింది. ఇక ఇటీవల జరిగిన రాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తృణముళ్ కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే.. శాసన మండలి ఏర్పాటు చేస్తామని పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశంలో ఆరు రాష్ట్రాల్లో( బిహార్, యూపీ, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, కర్ణాటక) శాసన మండలి అమలులో ఉంది. ఇక మండలి ఏర్పాటు తీర్మానానికి పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. శాసన మండలి ఏర్పాటు తీర్మానాన్ని ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారీ తీవ్రంగా వ్యతిరేకించారు. దేశంలో 23 రాష్ట్రాల్లో విధాన పరిషత్ లేదని, కొంతమంది టీఎంసీ నాయకులు మండలిలో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అందుకోసమే మండలి ఏర్పాటుకు తీర్మానం చేశారని తెలిపారు. -
వైఎస్సార్సీపీకి మండలిలో పూర్తి మెజార్టీ
సాక్షి, అమరావతి: శాసన మండలిలో టీడీపీ ఆధిపత్యానికి అడ్డుకట్ట పడింది. తాజాగా ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియడంతో టీడీపీ బలం తగ్గిపోయింది. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. ప్రస్తుతం మండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం 21 కాగా టీడీపీ బలం 15కి తగ్గింది. శుక్రవారంతో 8 మంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగియగా వారిలో టీడీపీకి చెందిన ఏడుగురు, వైఎస్సార్సీపీకి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఎమ్మెల్సీలుగా డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్ధా వెంకన్న, పప్పుల చలపతిరావు, గాలి సరస్వతి, ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, బుద్ధా నాగజగదీశ్వరరావుల పదవీకాలం ముగిసింది. గత నెల 24వ తేదీన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ సైతం పదవీ విరమణ చేశారు. వాకాటి నారాయణరెడ్డి బీజేపీలో చేరడం, చదిపిరాల శివనాథ్‌రెడ్డి పార్టీకి దూరం కావడంతో టీడీపీ బలం 15కి తగ్గిపోయింది. బిల్లులను అడ్డుకోవటమే లక్ష్యంగా... సాధారణ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన టీడీపీ మండలిలో ఇటీవల వరకు ఉన్న ఆధిక్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన బిల్లుల్ని అడ్డుకోవడమే లక్ష్యంగా వ్యవహరించింది. పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల బిల్లులకు మోకాలడ్డింది. పేద విద్యార్థులకు ఆంగ్ల మాథ్యమంలో విద్యనందించే బిల్లును సైతం కుట్రతో అడ్డుకుంది. సలహాలివ్వాల్సిన పెద్దల సభను రాజకీయ వేదికగా మార్చుకుని అడ్డంకులు సృష్టించింది. అయితే శాసనమండలిలో ఇప్పుడు వైఎస్సార్సీపీ పూర్తి మెజారిటీ సాధించింది. మరింత పెరగనున్న అధికార పార్టీ బలం.. మండలిలో వైఎస్సార్సీపీ తరఫున 18 మంది (గవర్నర్ నామినేట్ చేసిన నలుగురితో కలిపి) సభ్యులున్నారు. కొద్దిరోజుల క్రితం టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్పలత, స్వతంత్ర ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, టీడీపీకి దూరంగా ఉన్న శివనాథ్‌రెడ్డి కూడా వైఎస్సార్సీపీకి మద్దతు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం అధికార పార్టీ బలం 21కి పెరిగింది. ఇవికాకుండా ఎమ్మెల్యేల కోటాలో మూడు, స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కరోనా కారణంగా ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నిక వాయిదా పడింది. అవి ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీనే గెలుచుకునే పరిస్థితి ఉంది. ఇక మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిని బట్టి చూస్తే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధించడం లాంఛనంగానే కనిపిస్తోంది. ఆ కోటాలోని 11 ఎమ్మెల్సీలూ అధికార పార్టీకే దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మండలిలో ఆధిపత్యంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ రాబోయే రోజుల్లో మరింత బలం పెంచుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. చదవండి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అప్పీల్ -
ఏపీ శాసన మండలి ప్రొటెం స్పీకర్‌గా విఠపు బాలసుబ్రహ్మణ్యం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రొటెం స్పీకర్‌గా విఠపు బాలసుబ్రహ్మణ్యం నియామకం ఖరారైంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోదం తెలిపారు. కాగా, గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు కూడా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన సంగతి విదితమే. దీంతో కొత్తగా లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేష్‌కుమార్ (వైఎస్సార్ కడప), మోషేన్‌రాజు (పశ్చిమ గోదావరి), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి) ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. చదవండి: ‘లోకేష్ బఫూన్‌కు తక్కువ.. జోకర్‌కు ఎక్కువ’ ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ -
ఏపీ శాసనమండలిలో మారనున్న సమీకరణాలు
-
ఏపీ శాసన మండలిలో మారనున్న సమీకరణాలు
సాక్షి, అమరావతి: రేపు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సమీకరణాలు మారనున్నాయి. మండలిలో రేపటి నుంచి ఆధిక్యంలోకి వైఎస్సార్సీపీ రానుంది. రేపు మండలి నుంచి ఏడుగురు టీడీపీ సభ్యులు రిటైర్ కానున్నారు. మండలిలో 22 నుంచి 15కు టీడీపీ బలం పడిపోనుంది. గవర్నర్ కోటాలో తాజాగా నలుగురు వైఎస్సార్సీపీ సభ్యులు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. మండలిలో 17 నుంచి 20కు వైఎస్సార్సీపీ బలం పెరగనుంది. రేపు వైఎస్సార్సీపీ సభ్యుడు ఉమ్మారెడ్డి రిటైర్ కానున్నారు. గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన సంగతి విదితమే. దీంతో కొత్తగా లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేష్‌కుమార్ (వైఎస్సార్ కడప), మోషేన్‌రాజు (పశ్చిమ గోదావరి), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి) ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టనున్నారు. మండలిలో ఖాళీ అయిన స్థానాలకు వివిధ రంగాల్లో అనుభవం ప్రాతిపదికగా ప్రభుత్వం నలుగురు పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: కడప గడపలో తొలిసారి.. బీసీ ఎమ్మెల్సీ ఒక్క ఉపాధ్యాయుడిని కూడా తొలగించం: సీఎం జగన్ -
ప్రొటెం చెర్మన్‌గా వి భూపాల్‌రెడ్డి నియామకం
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి ప్రొటెం చెర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిన భూపాల్ రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు గవర్నర్ తమిళసై ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 4 నుంచి భూపాల్ రెడ్డి ప్రొటెం చెర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా తెలంగాణ శాసన మండలి సభ్యులుగా ఎన్నికై చైర్మన్ పదవిని దక్కించుకున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌ల పదవీకాలం గురువారంతో ముగిసింది. చదవండి: భూముల డిజిటల్ సర్వేపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం -
తెలంగాణ: మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పోస్టులు ఖాళీ
సాక్షి, నల్లగొండ : ఒకేసారి జిల్లాకు చెందిన ఇద్దరు నేతల పదవీ కాలం.. ఒకేరోజు పూర్తవుతోంది. తెలంగాణ శాసన మండలి సభ్యులుగా ఎన్నికై చైర్మన్ పదవిని దక్కించుకున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌ల పదవీకాలం గురువారంతో పూర్తవుతోంది. వాస్తవానికి మండలిలో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తవుతుండగా.. జిల్లాకు చెందిన వారే ఇద్దరున్నారు. ఈ స్థా నాలు ఖాళీ అయ్యేలోపే వీటిని భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. కానీ, కోవిడ్–19 విస్తృత వ్యాప్తి కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. పదవీ కాలం పూర్తి కానున్న చైర్మన్ సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌లో ఎవరికి ³దవి రెన్యువల్ అవుతుందన్న చర్చ ఆసక్తి రేపుతోంది. చైర్మన్‌గా... 21 నెలలు నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి మూడు పర్యాయాలు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన సీనియర్ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి 2019 ఆగస్టు 26వ తేదీన ఎమ్మెల్యే కోటాలో మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. రెండు వారాల తేడాతో ఆయన అదే ఏడాది సెప్టెంబర్ 11వ తేదీన తెలంగాణ శాసన మండలి రెండో చైర్మన్‌గా పీఠం ఎక్కారు. ఈ పదవిలో ఆయన మొత్తంగా ఒక ఏడాది ఎనిమిది నెలల 23రోజులపాటు ఉన్నారు. ఈ సమయంలో రెండు బడ్జెట్ సమావేశాలు, రెండు శీతాకాల సమావేశాలు జరిగాయి. ఎమ్మెల్సీ రెన్యువల్‌పై అనుచరుల ఆశాభావం గుత్తా ఎమ్మెల్సీగా కనీసం నిండా రెండేళ్లు కూడా పదవిలో లేరు. ఆయనకు చైర్మన్ పదవి కట్టబెట్టినా.. కేవలం 21 నెలలే కావడంతో.. మరోసారి ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందన్న ఆశాభావం ఆయన అనుచరవర్గంలో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ అధినేత్రి, అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయడంలో రాష్ట్ర కాంగ్రెస్ నుంచి తీవ్రమైన ఒత్తిడి తెచ్చిన ఆ పార్టీ ఎంపీలో సుఖేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఆ పార్టీ ఎంపీగా పదవీకాలం పూర్తి కాకముందే ఆయన టీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ క్రమంలోనే కొద్ది ఆలస్యంగానైనా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గుత్తాను మండలిలోకి తీసుకున్నారు. అయితే.. ఎమ్మెల్సీలకు ఉండే ఆరేళ్ల పదవీ కాలంలో గుత్తా కనీసం రెండేళ్లు కూడా ఆ పదవిలో లేని కారణంగా మరోసారి అవకాశం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్–19 నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో.. తిరిగి ఎన్నికలు జరిగి.. మరోసారి అవకాశం వచ్చేదాకా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. నేతి విద్యాసాగర్‌ది కూడా.. డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ 2015 జూన్ 4వ తేదీన ఎమ్మెల్సీగా ఎన్నిక కాగా, ఆయన కూడా గురువారం పదవీకాలం పూర్తి చేస్తున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందే ఉమ్మడి రాష్ట్రంలో ఆయన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. తెలంగాణ శాసన మండలి తొలి చైర్మన్ స్వామిగౌడ్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన టీఆర్ఎస్కు సహకరించడంతో స్వామిగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నేతి విద్యాసాగర్ పదవీ కాలం పూర్తి కావడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయనకు మరోసారి అవకాశం కల్పించారు. దీంతో 2015లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై, డిప్యూటీ చైర్మన్‌గా తిరిగి పోస్టు దక్కించుకున్నారు. ► గుత్తా సుఖేందర్‌రెడ్డి 2019 ఆగస్టులో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అదే ఏడాది సెప్టెంబరు 11వ తేదీన చైర్మన్‌గా నియమితులై పదవీ బాధ్యతలు స్వీకరించారు. ► నేతి విద్యాసాగర్ 2015 జూన్ 4న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అంతకుముందే డిప్యూటీ చైర్మన్‌గా పని చేస్తున్నారు. సీఎం కేసీఆర్ మరో సారి ఆయ నకు అవకాశం ఇచ్చారు. చైర్మన్‌గా సంతృప్తికరం తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా పనిచేసింది స్వల్ప కాలమే అయినా.. ఆ 21నెలల్లో నాలుగు సెషన్లను ఎంతో సంతృప్తి కలిగించాయి. రెండుసార్లు బడ్జెట్ సమావేశాలు, మరో రెండుసార్లు శీతాకాల సమావేశాలు జరగగా.. మండలి గౌరవాన్ని, ప్రభుత్వ గౌరవాన్ని కాపాడేలా.. సభను నిర్వహించిన అనుభూతి గొప్పది. – గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి చైర్మన్ గౌరవ ప్రదంగా నడిపించా పెద్దల సభను గౌరవ ప్రదంగా నడిపించా. 2012నుంచి తొమ్మిదేళ్లపాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా సభ్యులందరి సహకారంతో ముందుకు సాగా. సీఎం కేసీఆర్ నాకు ఎమ్మెల్సీగా, డిప్యూటీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. – నేతి విద్యాసాగర్, మండలి డిప్యూటీ చైర్మన్ చదవండి: అయ్యో పాపం; పచ్చని కుటుంబంలో ‘కరోనా’ కల్లోలం -
ఇద్దరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి: శాసనమండలిలో ఇద్దరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. పోతుల సునీత, చల్లా భగీరథరెడ్డిలతో చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ ప్రమాణం చేయించారు. అనంతరం ఇద్దరికీ అభినందనలు తెలిపి, మండలి నియమ నిబంధనలు వివరించారు. వారికి ధ్రువీకరణ పత్రాలు, బుక్‌లెట్స్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరీమున్నీసా, అసెంబ్లీ సహాయ కార్యదర్శి విజయరాజు, తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మండలి చైర్మన్ కాగా, శాసన మండలి ఆవరణలో చైర్మన్ ఎం.ఎ. షరీఫ్ బుధవారం కోవాగ్జిన్ టీకా తీసుకున్నారు. ఆయనతోపాటు అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, పలువురు సహాయ, అసిస్టెంట్ కార్యదర్శులు, ఉద్యోగులు, మార్షల్స్ కోవిడ్ వ్యాక్సిన్‌ను వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు డీఎంహెచ్‌వో యాస్మిన్, గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామింగ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రత్న మన్మోహన్, తదితరులు పాల్గొన్నారు. -
కవితను పరిచయం చేసిన మండలి చైర్మన్
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను గురువారం శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు. 84 పేజీల బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని దాదాపు గంటన్నరలో చదివారు. బడ్జెట్ ప్రసంగం ముగిశాక, స్థానిక సంస్థల నుంచి ఎన్నికై తొలిసారి మండలి సమావేశాలకు హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను.. చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభ్యులకు పరిచయం చేశారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి వేములను, ఎమ్మెల్సీ కవితను పలువురు సభ్యులు అభినందించారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు సి.రామచంద్రయ్య, షేక్ మహమ్మద్ ఇక్బాల్, దువ్వాడ శ్రీనివాస్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథరెడ్డి, కరీమున్నీసాలు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు వారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఆయన చేతుల మీదుగా బీ ఫారం అందుకున్నారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలతో కలిసి మధ్యాహ్నం అసెంబ్లీకి చేరుకున్నారు. అక్కడ ఆర్వో సుబ్బారెడ్డికి వారు తమ నామినేషన్ పత్రాలు అందజేశారు. మే నాటికి మండలిలో వైఎస్సార్సీపీకి ఆధిక్యం వైఎస్సార్సీపీలో కష్టించి పని చేసే వారికి మంచి గుర్తింపు, హోదా లభిస్తుందని ప్రభుత్వ సలహాదారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ అనంతరం ఆయన వారితో కలిసి శాసనమండలి వద్ద మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీలో ఎక్కువగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఉంటుందని, పార్టీ కోసం ముందు నుంచి నిలబడిన వారిని గుర్తించి, సమపాళ్లలో సముచిత స్థానాలు కల్పించటం జరుగుతోందన్నారు. ఇది సీఎం జగన్ నాయకత్వ ప్రతిభకు, సమన్యాయం అందించటంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు ఉదాహరణగా నిలుస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చావు దెబ్బతిన్న తర్వాత కౌన్సిల్లో ఉన్న మందబలాన్ని ఆసరాగా చేసుకొని, సాంకేతిక కారణాలు చూపి రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించే పనులు చేయటాన్ని తెలుగు ప్రజలంతా గమనించారని చెప్పారు. వాటికి కూడా ప్రజలు చరమగీతం పాడారన్నారు. వచ్చే మే నెలలో వైఎస్సార్సీపీకి కౌన్సిల్లో మెజార్టీ వస్తుందన్నారు. ఆ తర్వాత రాష్ట్రాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ తీసుకునే చర్యలకు ఉభయ సభలూ మద్దతు ఇవ్వటం ద్వారా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా ఊపందుకుంటాయని తెలిపారు. బాలయ్య ధ్యాస సినిమాలపైనే : ఇక్బాల్ వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పని చేస్తున్నానని, అడగకుండానే తనకు రెండోసారి ఎమ్మెల్సీగా సీఎం జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లెజెండ్, రూలర్ అనుకుంటూ సినిమాల్లో బిజీగా ఉన్నారని, ప్రజాసేవను గాలికి వదిలేశారని పేర్కొన్నారు. సీఎంకు కృతజ్ఞతలు : సి.రామచంద్రయ్య ఇచ్చిన మాటను ఈ స్థాయిలో నిలబెట్టుకునే సీఎంను తన రాజకీయ జీవితంలో చూడలేదని సీనియర్ రాజకీయ వేత్త, ఎమ్మెల్సీ అభ్యర్థి సి.రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు వ్యవహరించిన తీరుతో విశ్వసనీయత కోల్పోయారని తెలిపారు. టీడీపీకి అభ్యర్థులే దొరకడం లేదని.. చంద్రబాబు, లోకేష్ ఉన్నంత వరకు టీడీపీకి మనుగడ ఉండదని జోస్యం చెప్పారు. అచ్చెన్న ప్రజాద్రోహి : దువ్వాడ శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో టెక్కలిలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తామని ఎమ్మెల్సీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. అచ్చెన్నాయుడు ప్రజా ద్రోహి అని ధ్వజమెత్తారు. తనపై అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలపై అమరావతిలో బహిరంగ చర్చ పెడతానని, ఈ చర్చకు ఆయన రావాలని సవాల్ విసిరారు. సీఎం జగన్‌కు ఎప్పటికీ రుణ పడి ఉంటానని చెప్పారు. మండలిలో ప్రజా సమస్యలు వినిపిస్తాం సీఎం జగన్ ఎంతో నమ్మకంతో తమకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారని అభ్యర్థులు కళ్యాణ్ చక్రవర్తి, భగీరథరెడ్డి, కరీమున్నీసా తెలిపారు. ప్రజా సమస్యలు మండలిలో ప్రస్తావించి, మండలి ప్రతిష్ట పెరిగేలా పని చేస్తామన్నారు. తమకు రాజకీయ భిక్ష పెట్టిన సీఎం జగన్‌కు జన్మజన్మలా రుణపడి ఉంటామన్నారు. -
అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు
సాక్షి, అమరావతి/ఇబ్రహీంపట్నం: రాష్ట్రం నలుమూలల మంగళవారం గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ పతాకాల్ని ఆవిష్కరించారు. శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ తమ్మినేని సీతారాం జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. సామాజిక న్యాయం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా సీఎం వైఎస్ జగన్, ప్రధాని మోదీ విశేష కృషి చేస్తున్నారని చెప్పారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, సహాయ కార్యదర్శులు, ఉద్యోగులు పాల్గొన్నారు. యువత దేశాభివృద్ధికి పునరంకితం కావాలి శాసనమండలి ప్రాంగణంలో మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ జాతీయ జెండాను ఎగురవేశారు. సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులు అందించిన స్ఫూర్తితో యువత దేశాభివృద్ధికి పునరంకితం కావాలన్నారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న శాసనమండలి చైర్మన్ షరీఫ్ అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక ప్రాధాన్యత సచివాలయం మొదటి బ్లాకు వద్ద రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకం ఫలాలు సమాజంలోని ప్రతి వ్యక్తికి సక్రమంగా అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వివిధ పథకాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి సక్రమంగా అమలు చేసేందుకు ప్రతి ప్రభుత్వ అధికారి, ఉద్యోగి మరింత కష్టించి పనిచేయాలని కోరారు. సచివాలయ చీఫ్ సెక్యూరిటీ అధికారి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో పతాకావిష్కరణ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ జాతీయ జెండాను ఎగురవేశారు. జాతిపిత మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. సీఎం అదనపు కార్యదర్శులు కె.ధనుంజయరెడ్డి, జె.మురళీ, సీఎం వోఎస్డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి, చీఫ్ సెక్యూరిటీ అధికారులు పరమేశ్వర్‌రెడ్డి, అమర్లపూడి జోషి పాల్గొన్నారు. విద్యుత్ రంగం బలోపేతం విజయవాడ విద్యుత్ సౌధలో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. ఏటా 50 వేల వ్యవసాయ సర్వీసులను కొత్తగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో.. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోగల రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం వద్ద పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ దేశం కోసం త్యాగాలు చేసిన వారి సేవలను కొనియాడారు. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ హనుమంతరావు, జాయింట్ డైరెక్టర్ ఎస్సీఆర్ పి.ప్రతాప్‌రెడ్డి, మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ మధుసూదనరావు, డిప్యూటీ డైరెక్టర్ సుల్తానా పాల్గొన్నారు. పీసీబీ కార్యాలయంలో.. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కార్యాలయంలో సభ్య కార్యదర్శి వివేక్‌యాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యుత్తమ సేవలే లక్ష్యంగా కొన్ని నియామకాలు చేపట్టనున్నామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో పీసీబీ మూడేళ్లు వరుసగా మొదటి స్థానంలో నిలవడానికి సిబ్బంది ఉత్తమ పనితీరే కారణమని ప్రశంసించారు. చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు శివప్రసాద్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజరు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లో కొలువుల జాతర
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ రాజకీయ నాయకులకు కొలువుల జాతర రానుంది. ఒకవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీకి అధిష్టానం కసరత్తు చేస్తుండగా... మరోవైపు ఏడాది కాలంలో భారీ సంఖ్యలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలు వారిని ఊరిస్తున్నాయి. అధికారిక ‘హోదా’కోసం ఆరాటపడుతున్న వారంతా... ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు.పైగా మెజారిటీ (స్థానిక సంస్థల్లో, ఎమ్మెల్యేల కోటాలో) తమవైపే ఉంది కాబట్టి గెలుపు ఖాయమనే ధీమాలో ఆశలు పెంచేసుకుంటున్నారు. శాసనమండలిలోని మొత్తం 40 మంది సభ్యులకుగాను వచ్చే ఏడాది జనవరి నాలుగో తేదీలోగా సగానికి పైగా ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఈ ఏడాది మార్చి 29 నాటికి పట్టభద్ర ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎన్.రాంచందర్‌రావు పదవీకాలం పూర్తవుతుండటంతో ఇప్పటికే ఎన్నికల సందడి ప్రారంభమైంది. వీరితో పాటు శాసనసభ్యుల కోటా నుంచి మండలికి ఎన్నికైన మరో ఆరుగురు సభ్యుల పదవీకాలం కూడా ఈ ఏడాది జూన్ 3న ముగియనుంది. శాసనసభ్యుల కోటా నుంచి పదవీ విరమణ చేయనున్న ఎమ్మెల్సీల జాబితాలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, ఆకుల లలిత ఉన్నారు. వీరితో పాటు గవర్నర్ కోటాలో ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలపరిమితి కూడా ఈ ఏడాది జూన్ 16న ముగియనుంది. ఈ ఏడాది పదవీ విరమణ చేస్తున్న తొమ్మిది మంది ఎమ్మెల్సీల్లో ఎన్.రామచందర్‌రావు (బీజేపీ) మినహా మిగతా ఎనిమిది మంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. కాగా శాసనమండలికి స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన 14 మందిలో 12 మంది వచ్చే ఏడాది జనవరి 4న పదవీ కాలపరిమితి పూర్తి చేసుకుంటారు. వీరిలో నిజామాబాద్ నుంచి ఎన్నికైన కల్వకుంట్ల కవితతో పాటు పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), టి.భానుప్రసాద్ (కరీంనగర్), పురాణం సతీష్ (ఆదిలాబాద్), నారదాసు లక్ష్మణ్‌రావు (కరీంనగర్), వి.భూపాల్‌రెడ్డి (మెదక్), సుంకరి రాజు (రంగారెడ్డి), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్), కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి (మహబూబ్‌నగర్), బాలసాని లక్ష్మీనారాయణ (ఖమ్మం), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), తేరా చిన్నపరెడ్డి (నల్గొండ) ఉన్నారు. మొత్తంగా వచ్చే ఏడాది జనవరి 4వ తేదీలోగా ఖాళీ అయ్యే 21 శాసనమండలి స్థానాల్లో 20 మంది టీఆర్ఎస్ పార్టీ సభ్యులే ఉన్నారు. మళ్లీ అడుగు పెట్టేదెవరో? పట్టభద్రుల కోటాలో రెండు స్థానాలు ఈ ఏడాది మార్చి 29న ఖాళీ అవుతుండటంతో క్షేత్రస్థాయిలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’పట్టభద్రుల నియోజవకర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా మరోమారు పోటీ చేయడం ఖాయమైంది. మరో పట్టభద్రుల నియోజకవర్గం ‘హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్‌నగర్’నుంచి బీజేపీకి చెందిన రాంచందర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో ఫలితాలు ఎలా వచ్చినా... వచ్చే ఏడాది జనవరిలోగా ఖాళీ అయ్యే మరో 19 శాసనమండలి స్థానాలు తిరిగి టీఆర్ఎస్ ఖాతాలోనే చేరే అవకాశముంది. అటు శాసనసభలో, ఇటు స్థానికసంస్థల్లో టీఆర్ఎస్కు పూర్తిస్థాయిలో బలం ఉండటంతో ఆయా కోటా శాసనమండలి స్థానాలకు జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే తిరిగి ఎన్నికయ్యే అవకాశముంది. అందుకే ఆశావహుల్లో పోటీనెలకొంది. రాష్ట్ర విభజన తర్వాత శాసన మండలిలో మెజారిటీ కోసం టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్, టీడీపీల నుంచి వలసలను ప్రోత్సహించడంతో వివిధ సందర్భాల్లో పలువురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరారు. వీరిలో వి.భూపాల్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, టి.భానుప్రసాద్ తదితరులకు రెండో పర్యాయం కూడా ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. ఈ టర్మ్ ముగిశాక వీరి భవితవ్యం ఏమిటనే ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్ రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మంత్రివర్గంలో చోటు దక్కని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కొనసాగింపుపై ఉత్కంఠ నెలకొంది. ఫరీదుద్దీన్, నేతి విద్యాసాగర్, ఆకుల లలితను మండలికి మళ్లీ నామినేట్ చేసేందుకు ఎంత మేర అవకాశాలున్నాయనే అంశంపై చర్చ జరుగుతోంది. ‘చైర్మన్’గా గుత్తా కొనసాగింపు! గుత్తా సుఖేందర్‌రెడ్డి 2019 ఆగస్టులో శాసనమండలి సభ్యుడిగా ఎన్నిక కాగా, అదే ఏడాది సెప్టెంబర్‌లో మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది జూన్ 3న ఎమ్మెల్సీగా ఆయన పదవీకాలం ముగియనున్న ఈ నేపథ్యంలో మరోమారు గుత్తా సభ్యత్వాన్ని పొడిగించడంతో పాటు మండలి చైర్మన్‌గా కొనసాగించే యోచనలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఆశావహులు ఎందరో... శాసనమండలిలో సగానికి పైగా స్థానాలు రెండు విడతలుగా ఖాళీ అవుతుండటంతో ఔత్సాహికుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలు, సామాజికవర్గాల సమీకరణాల్లో తమకు ఎంత మేర అవకాశముందనే లెక్కలు వేసుకుంటూ... మండలిలో చోటు కోసం ఇప్పటి నుంచే తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యమకాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారితో పాటు వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన నాయకులు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని కేసీఆర్ పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. ఔత్సాహికుల జాబితాలో మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ మాజీ ఎంపీ గుండు సుధారాణి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ విప్ కర్నె ప్రభాకర్ ఉన్నారు. వీరితో పాటు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్రావు, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, క్యామ మల్లేశ్ యాదవ్‌లు ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, బ్రేవరేజెస్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్ తదితరులు కూడా ఆశావహుల జాబితాలో ఉన్నారు. శాసనమండలి కూర్పు ఇలా... స్థానిక సంస్థల కోటాలో ఎన్నికయ్యేవారు 14 శాసనసభ్యుల ఎన్నుకొనేవారు 14 గవర్నర్ కోటాలో నామినేటెడ్ 6 పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి 3 ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుంచి 3 మొత్తం: 40 ప్రస్తుతం ఎవరికెంత బలం... ప్రస్తుతం శాసనమండలిలో ఎంఐఎంకు ఇద్దరు, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉపాధ్యాయుల కోటా నుంచి ఎన్నికైన ముగ్గురు సభ్యుల్లో ఎ.నర్సిరెడ్డి మినహా మిగతా ఇద్దరు టీఆర్ఎస్కు అనుబంధంగా పనిచేస్తున్నారు. దీంతో శాసనమండలిలో 40 మంది సభ్యులకు గాను 35 మందిని టీఆర్ఎస్కు చెందిన వారిగానే పరిగణించొచ్చు. -
ఆ..వేదనే అంతు చూసిందా?
సాక్షి, బెంగళూరు: సొంతూరు చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా సక్కరాయపట్టణ సమీపంలో రెండురోజుల క్రితం కొత్త ఇంటి నిర్మాణానికి పూజ చేశారు. ఇంతలోనే ఏమైందో రైలు పట్టాల వద్ద విగతజీవిగా మారారు. రాష్ట్ర రాజకీయాల్లో సోమవారం అర్ధరాత్రి విషాదఘట్టం సంభవించింది. విధాన పరిషత్ ఉప సభాపతి ఎస్ఎల్ ధర్మేగౌడ (65) సక్కరాయపట్టణ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసి పలువురు మంత్రులు, నేతలు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని తదుపరి కార్యక్రమాలను పర్యవేక్షించారు. జేడీఎస్ నేతగా సౌమ్యుడు, వివాదరహితునిగా పేరున్న ధర్మేగౌడ మరణం నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆనాటి నుంచి మౌనంగా ఈ నెల 15వ తేదీన విధాన పరిషత్‌లో బీజేపీ– జేడీఎస్‌లు ఉమ్మడిగా ఆయనను చైర్మన్‌సీట్లో కూర్చోబెట్టగా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు నానా యాగీ చేసి ధర్మేగౌడను గెంటేయడం తెలిసిందే. ఆనాటి అవమానాన్ని తలుచుకుని ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం. అప్పటి నుంచి బయటకు రావడం తగ్గించారు. నేతల రాజకీయ చదరంగంలో పావుగా మారి, ఈ ఎదురుదెబ్బను దిగమింగలేక తీవ్ర నిర్ణయం తీసుకున్నారని సమాచారం. నువ్వెళ్లిపో అన్నారు: డ్రైవర్ ధర్మేగౌడ కారు డ్రైవర్ మాట్లాడుతూ సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో రైలు పట్టాల వద్దకు తీసుకెళ్లమన్నారన్నారు. ఆ సమయంలో వేరే వారితో ఫోన్లో రైలు వచ్చే సమయాల గురించి అడిగారు, నేను కొందరిని కలవాలి, నువ్వెళ్లిపో అని చెప్పడంతో వెళ్లిపోయాను. ఆయన రైలు కిందపడి ఆత్మహత్యకు చేసుకోవడం బాధాకరం అన్నారు. ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. పిల్లలను బాగా చూసుకో. ఇంట్లో అందరూ బాగుండాలి’ అని డెత్ నోట్లో పేర్కొన్నట్లు బీజేపీ నేత సీటీ రవి మీడియాకు తెలిపారు. సీఎం యడియూరప్ప, జేడీఎస్ అధినేత దేవెగౌడ, కుమారస్వామి తదితరులు ధర్మేగౌడ భౌతికకాయానికి నివాళులరి్పంచారు. మంచి నేతను కోల్పోయాం సాక్షి, బెంగళూరు: విధాన పరిషత్ ఉప సభాపతి ఎస్ఎల్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కన్నీరు పెట్టారు. రాష్ట్రం ఓ మంచి నాయకుడిని కోల్పోయిందన్నారు. ఆయన కల్మషం లేని వ్యక్తి అన్నారు. డెత్‌నోట్ రహస్యం: సీఎం పోలీసులకు లభించిన డెత్ నోట్ వివరాలను బహిరంగ పరచడం సాధ్యం కాదని సీఎం యడియూరప్ప అన్నారు. ధర్మేగౌడ మరణం బాధాకరం అన్నారు. ► ధర్మేగౌడ ఆత్మహత్య బాధాకరమని పరిషత్తు చైర్మన్ ప్రతాప్‌చంద్రశెట్టి అన్నారు. ఆయన మరణవార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వరహెగడే కాగేరి పేర్కొన్నారు. ► శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్ఎల్ ధర్మేగౌడది ఆత్మహత్య కాదని, రాజకీయ హత్య అని మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. ఆయన మరణం వెనుక అసలు నిజాలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ► ఎస్ఎల్ ధర్మేగౌడ ఆత్మహత్య వార్త షాక్‌కు గురి చేసిందని, చాలా చింతిస్తున్నామని మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. మొదట మెగ్గాన్ ఆస్పత్రికి శివమొగ్గ: సంఘటనాస్థలం నుంచి ధర్మేగౌడ మృతదేహాన్ని అంబులెన్స్‌లో శివమొగ్గ నగరంలోని మెగ్గాన్ అస్పత్రికి తరలించారు. వైద్యులు మంగళవారం ఉదయం శవపరీక్ష చేశారు. ఆ సమయంలో కలెక్టర్ కే.బీ.శివకుమార్, ఎస్పీ కాంతరాజు ఉండి భద్రతను పర్యవేక్షించారు. శివమొగ్గ, చిక్కమగళూరు నుంచి పెద్దసంఖ్యలో జనం తరలిరావడంతో ఆస్పత్రి ముందు బారికేడ్లను పెట్టారు. శివమొగ్గలోనే ఉన్న ఎంపీ రాఘవేంద్ర, పలువురు మంత్రులు నివాళులర్పించారు. పల్లె నుంచి పదవులకు వన్నె సాక్షి, బెంగళూరు: విధాన పరిషత్ డిప్యూటీ చైర్మన్ ఎస్ఎల్ ధర్మేగౌడ పంచాయతీ సభ్యుని నుంచి పరిషత్తు వరకు పలు పదవులను అలంకరించారు. చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా సఖరాయపట్టణ సమీపంలోని సరపనహళ్లి గ్రామంలో 1955 డిసెంబరు 16వ తేదీన ధర్మేగౌడ జని్మంచారు. బీలేకళ్లహళ్లి తాలూకా పంచాయతీ సభ్యునిగా 1987లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆయన సతీమణి మమత కాగా, కొడుకు, కూతురు ఉన్నారు. జిల్లాస్థాయిలో పలు పదవులను అధిష్టించారు. రాష్ట్ర మార్కెట్ మహామండలి అధ్యక్షునిగా, రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా, న్యూఢిల్లీ క్రిబ్కో డైరెక్టర్‌గా, నాఫెడ్ సంస్థ డైరెక్టర్‌గా పలు పదవుల్లో పనిచేశారు. బీరూరు నుంచి ఎమ్మెల్యేగా గత 2004లో జేడీఎస్ నుంచి బీరూర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత చిక్కమగళూరులో 2018 ఎన్నికల్లో బీజేపీ నేత సీటీ రవి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వ సమయంలో 2018 జూన్‌లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. -
కర్ణాటక: శాసనమండలిలో రసాభాస
-
కర్ణాటక శాసనమండలిలో రసాభాస
సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసనమండలి సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మండలి డిప్యూటీ చైర్మన్ భోజెగౌడను కుర్చీ నుంచి లాక్కెళ్లారు. ఆయనకు చైర్లో ఉండే అర్హత లేదంటూ మూకుమ్మడిగా కిందకు దింపారు. దీంతో మార్షల్స్ రంగంలోకి దిగారు. గోవధ నిషేధ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ మండలి ఛైర్మన్ కె. ప్రతాపచంద్ర శెట్టిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో అధికార, కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. (చదవండి: ఒవైసీ కీలక నిర్ణయం.. ఆ పార్టీతో జట్టు!) ఈ క్రమంలో ఆయన సభకు వచ్చే ముందు జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్సీ, డిప్యూటీ చైర్మన్ ఎస్ఎల్ ధర్మే గౌడను చైర్మన్ సీటులో కూర్చోబెట్టారు. దీంతో రాజ్యాంగం ప్రకారం ఆయనకు కుర్చీలో ఉండే అర్హత లేదని, తమ పార్టీకి చెందిన చంద్రశేఖర్ పాటిల్‌ను ఆ స్థానంలో కూర్చోబెట్టాలంటూ వాదనకు దిగారు. అనంతరం ధర్మే గౌడను లాగిపడేశారు. ఇంతలో మండలిలోకి వచ్చిన చైర్మన్ ప్రతాపచంద్ర శెట్టి సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఈనెల 7 నుంచి మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. -
అజెండాలో లేని అంశంపై ఎలా చర్చిస్తాం!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ అంశంపై ముందు చర్చ జరపాలా.. అమరావతి రాజధాని అంశంపై చర్చించాలా అన్న దానిపై శుక్రవారం శాసనమండలిలో కొద్దిసేపు ఆసక్తికర చర్చ సాగింది. సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు అమరావతి అంశంపై చర్చకు వాయిదా తీర్మానం ఇవ్వగా.. చైర్మన్ ఎంఏ షరీఫ్ దానిని తిరస్కరించారు. ఆ తర్వాత కూడా దీనిపై చర్చ జరపాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. మంత్రి బొత్స జోక్యం చేసుకుని.. వాళ్లకు అల్లరి చేసి పబ్లిసిటీ పొందాలన్న తపన తప్ప చిత్తశుద్ధి లేదన్నారు. అమరావతి అంశాన్ని అజెండా తయారీ కోసం జరిపిన బీఏసీ సమావేశంలో ఆ పార్టీ సభ్యులు ప్రస్తావన చేయలేదన్నారు. ఆ తర్వాత కూడా అమరావతిపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టడంతో చైర్మన్ షరీఫ్ సభను వాయిదా వేశారు. సభ ప్రారంభం కాగా.. అమరావతిపై చర్చకు టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడు పట్టుబట్టడంతో.. మంత్రి బొత్స మరోసారి జోక్యం చేసుకుని బీఏసీలో ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. పీడీఎఫ్ పక్ష నేత బాల సుబ్రహ్మణ్యం, బీజేపీ పక్ష నేత మాధవ్ కల్పించు కుని బీఏసీలో నిర్ణయించిన అజెండా ప్రకారమే చర్చ జరపాలని సూచించారు. చివరకు 311 కింద ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులపై చర్చ చేపట్టి, ఆ తర్వాత ప్రభుత్వ బిల్లులు, అమరావతిపై స్వల్పకాలిక చర్చ, ఆ తర్వాత పోలవరం, మరో రెండు అంశాలపై చర్చ చేపడతామని చైర్మన్ ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. -
శాసన మండలిలో శాంతిభద్రతలపై చర్చ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న శాసనమండలి సమావేశంలో గురువారం శాంతిభద్రతలపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మండలిలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవస్థీకృతమైన మార్పులు తేవాలని పదేపదే చెబుతూ ఉంటారన్నారని చెప్పారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ భేదాలు చూడని వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అన్నారు. సంక్షేమంతో పాటు సంరక్షణ కూడా ముఖ్యమని భావించే ముఖ్యమంత్రి ఆయన అన్నారు. నెల్లూరు అబ్దుల్ సలాం ఘటన బాధాకరమన్నారు. సలాం ఘటన జరగగానే తమ ప్రభుత్వం వెంటనే స్పందించిందని, ఈ కేసులో ఓ పోలీసు అధికారిని కూడా అరెస్టు చేశారన్నారు. అయితే ఇలాంటి ఘటనలలో పోలీసులను అరెస్ట్ చేసిన సందర్భాలు ఎక్కడా జరగలేదని ఆయన అన్నారు. టీడీపీ హయాంలో అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ముస్లిం యువకులుపై దేశద్రోహం కేసులు పెట్టారని తెలిపారు. తమ ప్రభుత్వం లౌకికవాదానికి కట్టుబడి ఉందని, దళితులు, మైనార్టీలు, మహిళలపైన దాడి జరిగితే తమ ప్రభుత్వం సహించదని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. -
కోవిడ్ నివారణకు త్రిముఖ వ్యూహం ఫలించింది
సాక్షి, అమరావతి: కోవిడ్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన త్రిముఖ వ్యూహం ఫలించిందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు త్రిముఖ వ్యూహమైన ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్తో కరోనాను ఎదుర్కొన్నామన్నారు. శాసన మండలిలో కోవిడ్‌పై జరిగిన చర్చ సందర్భంగా బుధవారం మంత్రి సమాధానమిచ్చారు. దేశంలోనే కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రం అత్యంత పటిష్టమైన చర్యలు తీసుకుందని చెప్పారు. ‘‘కోవిడ్ సమయంలో సీఎం నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి మార్గదర్శకాలిచ్చారు. సమష్టి కృషితో కోవిడ్ నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో ప్రధాని, జాతీయ మీడియా, ఇతర రాష్ట్రాల సీఎంలు మన రాష్ట్రాన్ని ప్రశంసించారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాం. మిలియన్ జనాభాకు దేశంలోనే అత్యధిక పరీక్షలు చేసిన రాష్ట్రంగా ఉన్నాం. పాజిటివ్ కేసులను గుర్తించి చికిత్స అందిస్తేనే రాష్ట్రంలో వైరస్‌ను నియంత్రించగలమనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్లింది. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ రేటు ఆగస్టు నెలలో 17.2 శాతం ఉంటే నవంబర్‌లో 8.63 శాతానికి తగ్గింది. ఇక దేశంలో రికవరీ రేటు 93.68 శాతంగా ఉంటే రాష్ట్రంలో 97.86 శాతంగా ఉంది. మరణాల రేటు దేశంలో 1.46 శాతంగా ఉంటే రాష్ట్రంలో 0.81 శాతంగా ఉంది’’ అని మంత్రి తెలిపారు. ఒక్క ల్యాబ్ లేని పరిస్థితి నుంచి.. మొదట్లో ఒక టెస్ట్ చేయాలంటే శాంపిల్ తీసి పరీక్షకోసం ఇతర రాష్ట్రాలకు పంపాల్సి వచ్చేదని, రాష్ట్రంలో ఒక్క ల్యాబ్ లేని పరిస్థితి నుంచి 8 నెలల్లోనే 150 ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చామని మంత్రి చెప్పారు. పీహెచ్సీ నుంచి టీచింగ్ ఆసుపత్రి వరకు మొత్తం 1,519 శాంపిల్ కలెక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. డాక్టర్లు, వైద్యసిబ్బంది కొరత లేకుండా 22 వేల మందికి పైగా తాత్కాలిక నియామకాలు చేశామని, వీరి జీతాలకోసం రూ.232 కోట్లు విడుదల చేశామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న మరో రూ.200 కోట్లు త్వరలో విడుదల చేస్తామన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం మనదని పేర్కొన్నారు. కరోనా బారిన పడి చికిత్స పొందిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్) పరిధిలోని ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ చేస్తామని తెలిపారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీతోపాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రూ.16 వేల కోట్లతో ప్రతి ఆసుపత్రినీ ఆధునీకరిస్తామని చెప్పారు. -
మంత్రుల్ని రౌడీలంటారా!
సాక్షి, అమరావతి: మంత్రులు వీధి రౌడీల మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బుధవారం శాసన మండలిలో తీవ్ర దుమారం రేపాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీయగా.. ఒక దశలో పరిస్థితి ఇరుపక్షాలు బాహాబాహీ తలపడే స్థాయికి వెళ్లింది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే.. దీపక్‌రెడ్డి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చైర్మన్‌ను కోరుతూ.. మైక్ ఇవ్వకముందే మంత్రులపై వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ ఎమ్మెల్సీలు ఓ చోట చేరగా.. బొత్స సత్యనారాయణ తన స్థానం నుంచి పక్కకు వచ్చారు. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. చైర్మన్ స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకుని ఇలా అయితే సభ ఎలా నడుస్తుందని, సభ్యులు ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని తీవ్ర స్వరంతో ఆదేశించడంతో పరిస్థితి సద్దుమణిగింది. మేం దొడ్డిదారిన రాలేదు : మంత్రి బొత్స అనంతరం ఈ పరిణామాలపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తామేమీ దొడ్డిదారిన రాలేదని, మంత్రులంతా ప్రజల ఓట్లతో ఎన్నుకోబడి వచ్చిన వాళ్లేనని, అలాంటి వారిని వీధి రౌడీలని టీడీపీ ఎమ్మెల్సీలు ఎలా అంటారని నిలదీశారు. టీడీపీ సభ్యులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. ప్రభుత్వం తరఫున మాట్లాడే అవకాశం ఇవ్వరా అని ప్రశ్నించారు. మండలిలో ప్రభుత్వ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. హుందాగా జరగాల్సిన సభలో టీడీపీ ఎమ్మెల్సీలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. మంత్రులు ఈ సభకు రావడాన్నే వారు తప్పు పడుతున్నారని, మంత్రులకు సభకు వచ్చే హక్కు లేదా అని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రులతో పాటు అధికార వైఎస్సార్సీపీ సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, కనీసం తన సీటు అయినా మార్చాలని విజ్ఞప్తి చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలపై రికార్డుల పరిశీలన ఇదిలావుంటే.. మంగళవారం నాటి సభలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీడీపీ ఎమ్మెల్సీ బాబురాజేంద్రప్రసాద్ మధ్య చోటుచేసుకున్న వాగ్వావాదం అంశం బుధవారం సభ ప్రారంభం కాగానే చర్చకు వచ్చింది. మంత్రి వెలంపల్లి తనపై చేసిన వ్యాఖ్యలను బాధించాయని, ఆయనతో క్షమాపణలు చెప్పించాలని బాబురాజేంద్రప్రసాద్ చైర్మన్‌ను కోరగా.. ఆ సమయంలో జరిగిన పరిణామాలన్నింటిపైనా రికార్డులను పరిశీలించాకే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని మంత్రి బొత్స కోరారు. రికార్డులను పరిశీలించాక అవసరమైతే మంత్రిని, రాజేంద్రప్రసాద్‌ను తన చాంబర్‌కు పిలిపించి మాట్లాడతానని, తర్వాత ఆ విషయాలపై సభలో కూడా ప్రస్తావనకు తీసుకురావచ్చని చైర్మన్ సూచించారు. తాను రికార్డులు పరిశీలించే వరకు డిప్యూటీ చైర్మన్ సభను నిర్వహిస్తారని చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. -
మేము ఇక్కడికి దొడ్డిదారిన రాలేదు: బొత్స
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మంత్రి బొత్స సత్యనారాయణను వీధి రౌడీ అంటూ అనుచితవ్యాఖ్యలు చేశారు. మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు జగదీశ్వరరావు, అంగర రామ్మోహన్ మంత్రులపైకి దూసుకెళ్లారు. టీడీపీ సభ్యుల వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందిస్తూ.. మమ్మల్ని వీధి రౌడీలని టీడీపీ సభ్యులు ఎలా అంటారు. మేము ఇక్కడికి దొడ్డిదారిన రాలేదు. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం. ఇలాంటి ప్రవర్తన ఎప్పుడూ చూడలేదు. టీడీపీ సభ్యులు నోటికెంత వస్తే అంత మాట్లాడుతున్నారు. చదవండి: (బాబూ వంద కోట్ల ఫైన్ అప్పుడే మర్చిపోయారా..?) మేము రన్నింగ్ కామెంటరీ చేసే వ్యక్తులం కాదు. ప్రభుత్వం తరపున మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ఇది మంచి పద్దతి కాదు' అంటూ బొత్స హెచ్చరించారు. సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు మాట్లాడుతూ.. ఇది పెద్దల సభ. సభ్యులు హుందాగా వ్యవహరించాలి. టీడీపీ సభ్యులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. టీడీపీ సభ్యులు సభాసంప్రదాయాలు కూడా పాటించడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (ఏపీ అసెంబ్లీ: కీలక బిల్లులు ఆమోదం) -
శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్సీ వీరంగం
సాక్షి, అమరావతి : శాసన మండలిలో మంగళవారం టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వీరంగం సృష్టించారు. పంచాయతీరాజ్ సవరణ చట్టంపై చర్చ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై అసభ్య పదజాలంతో దూషించారు. చూసుకుందాం రా అంటూ హెడ్‌ఫోన్ విసిరేసి మంత్రి వెల్లంపల్లి వైపు దూసుకొచ్చారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు రాజేంద్రప్రసాద్‌ని అడ్డుకున్నారు. కాగా, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తీరును వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. -
రాజధానిని మార్చే అధికారం ఎందుకుండదు?
సాక్షి, అమరావతి: శాసనసభ తీర్మానం ద్వారా అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు... అదే శాసనసభకు రాజధానిని మార్చే అధికారం ఎందుకు ఉండదని హైకోర్టు ప్రశ్నించింది. రాజధానిని నిర్ణయించే విషయంలో కేంద్రానికి, రాష్ట్రానికి అధికారం ఉన్నట్లు పునర్విభజన చట్టం, సీఆర్డీఏ చట్టాల్లో ఎక్కడా చెప్పలేదని హైకోర్టు గుర్తు చేసింది. అలాంటప్పుడు అమరావతిని రాజధానిగా ఎలా నిర్ణయించారని ప్రశ్నించింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల బిల్లులు ఆమోదం పొందే సమయంలో శాసన మండలిలో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన రికార్డులు, వీడియో ఫుటేజీని వెంటనే కోర్టుకు సమర్పించాలని శాసనసభ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. వెంటనే ఆ రికార్డులు ఇస్తామని శానససభ న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు హైకోర్టుకు నివేదించారు. అయితే బ్లూ కాపీ (అసెంబ్లీ రికార్డులు నిర్వహించే బుక్)ని మాత్రం స్పీకర్ అనుమతి తీసుకున్న తరువాతే ఇవ్వగలమని నివేదించారు. ప్రస్తుతం స్పీకర్ రాష్ట్రంలో లేరని, ఆయన వచ్చిన తరువాత తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇందుకు హైకోర్టు అంగీకరించింది. (అమరావతిలో అణగారిన వర్గాలకు చోటులేదా?) ఆ చట్టాల్లో అలా ఎక్కడుంది? పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పలు వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన అంబటి సుధాకర్‌రావు వాదనలు వినిపిస్తూ ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం అమరావతిని రాజధానిగా నిర్ణయించారని, ఇప్పుడు రాజధానిని మార్చాలంటే పునర్విభజన చట్టానికి సవరణ చేయాల్సిందేనన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు వల్ల రైతులకిచ్చిన హామీలను ఉల్లంఘించినట్లవుతుందన్నారు. మరో న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ పునర్విభజన చట్టం అమల్లో ఉన్నంత కాలం హైకోర్టును మార్చడానికి వీల్లేదన్నారు. హైకోర్టును మార్చేందుకు చట్టం చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, రాజధానిని నిర్ణయించే విషయంలో కేంద్రానికి, రాష్ట్రానికి అధికారం ఉందని పునర్విభజన చట్టం, సీఆర్డీఏ చట్టాల్లో ఎక్కడా చెప్పలేదని గుర్తు చేసింది. అలాంటప్పుడు అమరావతిని రాజధానిగా ఎలా నిర్ణయించారని ప్రశ్నించింది. శానససభలో తీర్మానం చేయడం ద్వారా అమరావతిని రాజధానిగా నిర్ణయించారని ఇంద్రనీల్ పేర్కొనగా.. మరి రాజధానిని నిర్ణయించడానికి శాసనసభకు అధికారం ఉన్నప్పుడు, దానిని మార్చే అధికారం కూడా శాసనసభకు ఉంటుంది కదా? అని ధర్మాసనం సందేహం వ్యక్తం చేస్తూ తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. ‘ధర్మ’సందేహం! 1. రాజధానిని నిర్ణయించే అధికారం అసెంబ్లీకి ఉన్నప్పుడు మార్చే అధికారం కూడా అసెంబ్లీకి ఉంటుంది కదా..? 2. అమరావతిని రాజధానిగా చేయాలని ఏపీ పునర్విభజన చట్టంలో ఎక్కడా చెప్పలేదు. అలాంటప్పుడు ఎలా నిర్ణయించారు? 3. పిటిషన్లు దాఖలు చేసి విచారణకు హాజరు కాకపోవడం ఏమిటి? వాదనలు వినిపించని కేసులను విచారణ జాబితా నుంచి తొలగిస్తున్నాం. – హైకోర్టు ధర్మాసనం విచారణ జాబితా నుంచి ఆ కేసుల తొలగింపు.. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో కొందరి వాదనలు ముగిసిన తరువాత, మిగతావారు వాదనలు వినిపించేందుకు ప్రత్యక్షంగా తమ ముందు హాజరు కాకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేసులను వరుసగా పిలిచి, ఏ కేసులో సంబంధిత న్యాయవాది వాదనలు వినిపించేందుకు రాలేదో వాటిని విచారణ జాబితా నుంచి తొలగించింది. కొందరి తరపు న్యాయవాదుల అభ్యర్థన మేరకు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
ఊర్మిళ ఆశలు అడియాశలేనా..?
సాక్షి, ముంబై : చట్టసభలోకి అడుగుపెట్టాలనుకుంటున్న రంగీలా ఫేమ్ ఊర్మిళా మటోండ్కర్ ఆశలు అడియాశలు అయ్యేలానే కనిపిస్తున్నాయి. అధికార శివసేన నుంచి శాసనమండలికి నామినేట్ చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాష్ ఆఘాడీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే మూడు పార్టీల నేతలు ఓ అంచనాకు సైతం వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. (చట్టసభలోకి బాలీవుడ్ బ్యూటీ.!) గవర్నర్ నామినేటెడ్ సభ్యుల కోటాలోంచి బాలీవుడ్ నటి ఉర్మిళా మాతోండ్కర్ను విధాన పరిషత్‌కు పంపడం ఖాయమని తేలడంతో శివసేన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై నిరసన వ్యక్తంచేస్తున్నారు. గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల ద్వారా రాజకీయాల్లో అరంగేట్రం చేసిన ఉర్మిళ కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తరువాత ఆమె కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుని బయటపడ్డారు. ఇప్పుడు శివసేన అధిష్టానం ఆమెను ఏకంగా విధాన పరిషత్‌కు పంపించనున్నట్లు తెలియడంతో కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. గత అనేక సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్న వారిని పక్కన బెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని నేరుగా మండలికి పంపడంపై సరైంది కాదని చర్చించుకుంటున్నారు. బయట నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తే మేం ఇలాగే పార్టీలో ఉండిపోవాలా..? అని కొందరు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా,శివసేన ఇచ్చిన ఆఫర్‌ను ఊర్మిళా మాతోండ్కర్ ఆమోదించినట్లు తెలిసింది. అయితే కార్యకర్తల అభిప్రాయాలను శివసేన పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది వేచిచూడాలి. -
మండలి రికార్డులు మా ముందుంచండి
సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలకు సంబంధించి శాసన మండలిలో జరిగిన చర్చ తాలూకు రికార్డులను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని శానససభ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. అమరావతిలో నిర్మాణాలపై ఇప్పటివరకు చేసిన ఖర్చు లెక్కలను తేల్చేందుకు ప్రతివాదిగా చేర్చిన అకౌంటెంట్ జనరల్‌కు తాజాగా నోటీసులు జారీ చేసింది. కావాలనుకుంటే దీనిపై కౌంటర్ దాఖలు చేయవచ్చని సూచించింది. మరోవైపు మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన చట్టాలను కొట్టివేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని, ఈ వ్యాజ్యాల్లో తమ వాదనలు కూడా వినాలంటూ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన పలువురు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లపై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణను అంశాలవారీగా న్యాయస్థానం ప్రారంభించింది. సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు శాసన మండలిలో చర్చకు సంబంధించిన రికార్డులు, సీసీటీవీ ఫుటేజీని కోర్టు ముందుంచాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది మాట్లాడుతూ రికార్డులను ఎలా తారుమారు (మ్యానిపులేట్) చేస్తారో తనకు తెలుసని, అందుకే ఫుటేజీ సమర్పణకు ఆదేశాలు కోరుతున్నామని వ్యాఖ్యానించడంపై అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. గౌరవ సభ్యులను ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. శాసనసభ, శాసనమండలి గౌరవాన్ని తగ్గించేలా పిటిషనర్ తరఫు న్యాయవాది అనుచితంగా వ్యాఖ్యానించడం సరికాదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈ సమయంలో సీజే జోక్యం చేసుకుని ఇరుపక్షాలకు సర్ది చెప్పారు. ఏం కావాలన్నా కోర్టు ముందుంచుతాం రికార్డులు, ఫైళ్లు ఏవి కావాలన్నా కోర్టు ముందుంచుతామని, అందులో ఎలాంటి రహస్యాలు లేవని ఏజీ పేర్కొన్నారు. అయితే శాసనసభ రికార్డుల విషయంలో స్పందించాల్సింది స్పీకరేనని, అందువల్ల సభ తరఫు న్యాయవాది స్పందన కోరాలని సూచించారు. శానససభ తరఫు న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావును పిలిచిన ధర్మాసనం.. ఆయన నుంచి స్పందన లేకపోవడంతో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలకు సంబంధించి మండలిలో చర్చ రికార్డులను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. మండలి రద్దుకు రాజధానికి సంబంధం లేదు అనంతరం శాసనమండలి రద్దు వ్యాజ్యం విచారణకు రాగా.. రాజధానికి, మండలి రద్దుకు సంబంధం లేదన్న ధర్మాసనం ఆ వ్యాజ్యాన్ని ప్రస్తుత కేసుల విచారణ జాబితా నుంచి తొలగించింది. జీఎన్‌రావు, బోస్టన్ కమిటీలపై దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం కమిటీల నివేదిక సమర్పణ పూర్తైనందున అందులో ఇప్పుడు ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంది. మా వాదనలు వినండి.. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ న్యాయవాది దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లో న్యాయవాది వీఆర్‌రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ పాలనా రాష్ట్రం కోసం రాయలసీమ ఎన్నో త్యాగాలు చేసిందని, తమ వాదనలు వినాలని కోరారు. ఉత్తరాంధ్ర నుంచి న్యాయవాది పీసా జయరాం దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లో న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ ఉత్తరాంధ్ర ఎంతో వెనుకబడిందని, కేవలం ఒక ప్రాంత అభివృద్ధి కోసమే అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. -
రూ.10,095 కోట్లకేంద్ర నిధులు పెండింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి హక్కుగా, గ్రాంట్‌గా కేంద్రం నుంచి రావాల్సిన రూ.10,095 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇవే కాకుండా జీఎస్టీ కింద రూ.6,016 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.2,812 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.817 కోట్లు, ఇంకా మరిన్ని నిధులు రాలేదన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకున్నా, ప్రభుత్వానికి ఆదాయం లేకున్నా గత 5 నెలల్లో రూ.55,638 కోట్లు వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేసినట్టు వెల్లడించారు. శాసనమండలిలో ఆర్థికశాఖకు సంబంధించిన మూడు బిల్లులపై వేర్వేరు సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఆయన ఆయా అంశాలు ప్రస్తావించారు. షరతులు ఒప్పుకోం.. తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్లుపై హరీశ్ మాట్లాడుతూ అప్పు కోసం కేంద్రం విధించే షరతులకు అంగీకరించబోమని స్పష్టం చేశారు. ‘మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నాం. గోడౌన్లు కట్టుకుని, ఉచిత కరెంటు అందించి రైతును సంపన్న వర్గాలుగా మార్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఇలాంటి సమయంలో కేంద్రం రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా షరతులు పెట్టింది. వీటిని అమలు చేసేది లేదు. వ్యవసాయ పంపుసెట్లు వాడే చోట మీటర్లు పెట్టాలని అప్పుడే అప్పు ఇస్తామని మెలిక పెట్టింది. ఇలాంటివి సరికాదని ప్రధానికి, ఆర్థిక మంత్రికి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఎఫ్ఆర్బీఎం పెంపునకు కేంద్రం అనుమతిచ్చినా.. రాష్ట్రానికి నష్టం జరిగే షరతులకు తలొగ్గేది లేదని సీఎం చెప్పారు. అప్పులను చూసే ముందు.. రాష్ట్ర అప్పులు, ఆదాయాన్ని కలిపి చూడాలి. మన రాష్ట్ర జీఎస్డీపీ పెరుగుదల 2014కు ముందు రూ.4 లక్షల 52 వేల కోట్లయితే ఈనాడు రూ.11 లక్షల 5 వేల 349 కోట్లు. ప్రస్తుత సవరణ ద్వారా వివిధ కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇస్తుంది. గతంలో కార్పొరేషన్లకు రాష్ట్ర ఆదాయంలో 90 శాతం వరకు గ్యారంటీ ఇచ్చే అవకాశముంది. దాన్ని 200 శాతానికి పెంచడం జరుగుతుంది. కరోనా కంటే ముందు మన దేశ జీడీపీ క్రమేపీ గత 8 క్వార్టర్లు తగ్గుతూ వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో మైనస్ 24 శాతానికి తగ్గింది. ఈ పరిస్థితుల్లోనూ మన రాష్ట్రం మాత్రం డబుల్ డిజిట్ ఉంది. ఫెర్టిలైజర్స్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి రూ.లక్షా 85 వేల కోట్లు తెస్తే ఆ డబ్బు రాయితీల కోసం ఖర్చు చేశారు. కాళేశ్వరం మీద డబ్బులు ఖర్చు చేయడం ద్వారా లక్ష కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చయింది’అని మంత్రి వ్యాఖ్యానించారు. -
మనిషి జీవనశైలి దాని చుట్టే తిరిగింది
-
హైదరాబాద్ శివారులో భూముల ధరలు కోట్లకు చేరింది
-
‘గవర్నర్ కోటా’ కసరత్తు షురూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా స్థానాల భర్తీపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. వచ్చే నెల ఏడో తేదీన రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభానికి ముందు జరిగే కేబినెట్ సమావేశంలోగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలనే యోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం. కేబినెట్ భేటీలో అభ్యర్థుల జాబితాపై స్పష్టత ఇచ్చి గవర్నర్ ఆమోదానికి పంపే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గవర్నర్ కోటాలో ఒకేసారి మూడు స్థానాలకు నామినేట్ చేసే అవకాశం ఉండటంతో అభ్యర్థిత్వం ఆశిస్తున్న నేతల సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తోంది. మండలిలో నాలుగు స్థానాలు ఖాళీ నలభై మంది సభ్యులున్న శాసన మండలిలో నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి ఎన్నికల షెడ్యూలు ప్రకటించగా, మాజీ ఎంపీ కవిత టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కోవిడ్ మూలంగా ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. శాసన మండలిలో గవర్నర్ కోటా సభ్యుల సంఖ్య ఆరు కాగా, ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గతంలో గవర్నర్ కోటాలో శాసన మండలికి ఎన్నికైన రాములు నాయక్ 2018లో కాంగ్రెస్‌లో చేరడంతో టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. రాములు నాయక్ పదవీ కాలం ఈ ఏడాది మార్చిలో, నాయిని నర్సింహారెడ్డి పదవీ కాలం కూడా ఈ ఏడాది జూన్ 19న, కర్నె ప్రభాకర్ పదవీ కాలం ఈ ఆగస్టు 18న ముగిసింది. పరిశీలనలో దేశపతి, వాణీదేవి? సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, బ్రూవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, పార్టీ నేతలు తక్కళ్లపల్లి రవీందర్రావు తదితరులు తమకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. అయితే తాజాగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణీదేవి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరిని శాసనమండలికి గవర్నర్ కోటాలో నామినేట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. కర్నెకు పక్కా.. నాయినికి అవకాశం? గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై హోం మంత్రిగా పనిచేసిన నాయిని నర్సింహారెడ్డి మరో మారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 18న పదవీ కాలం పూర్తి చేసుకున్న ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్‌కు మరోమారు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. నాయినికి అవకాశం దక్కనిపక్షంలో ఆయన అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మంత్రి చామకూర మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయన అభ్యర్థిత్వం తెరమీదకు వచ్చినట్లు సమాచారం. -
ఎమ్మెల్చీ పదవికి రాజీనామా చేసిన డిప్యూటీ సీఎం
-
పిల్లి సుభాష్, మోపిదేవి రాజీనామా ఆమోదం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరి రాజీనామాలను అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు బుధవారం ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆదే విధంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయని నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణ విజయం సాధించి పెద్దల సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరు మండలి సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఈ మేరకు మండలి చైర్మన్‌కు బుధవారం తమ రాజీనామా లేఖను పంపించగా ఆయన ఆమోదించారు. రాజ్యసభ ఎన్నికల్లో వీరిద్దరితో పాటు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని ఎన్నికైన విషయం తెలిసిందే. -
శాసనసభ నిర్ణయమే అంతిమం: స్పీకర్
సాక్షి, రాజమండ్రి: టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పూలే విగ్రహానికి స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీ మార్గాని భరత్ రామ్ పూలమాలలు వేసి నివాళర్పించారు. అనంతరం స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు బీసీ నేతలకు పార్లమెంట్ పదవులు ఇచ్చి గౌరవించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శాసన మండలిలో టీడీపీ తీరును ఆయన ఎండగట్టారు. మండలిలో నిర్ణయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, శాసనసభ నిర్ణయమే అంతిమం అని తెలిపారు. (వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: తమ్మినేని) ద్రవ్య వినిమయ బిల్లును కూడా అడ్డుకున్నారని స్పీకర్ ధ్వజమెత్తారు. అంతిమ నిర్ణయాలు ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులతో ఏర్పాటైన శాసనసభలోనే జరుగుతాయని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. (అందుకే వర్ల రామయ్యను బరిలోకి..) -
పాలన స్తంభనే టీడీపీ లక్ష్యం
సాక్షి, అమరావతి: శాసన మండలిలో బుధవారం తెలుగుదేశం సభ్యులు వ్యవహరించిన తీరుపై మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్ యాదవ్, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు జీతాలు కూడా అందనివ్వకుండా పరిపాలనను స్తంభింపజేయాలన్న ఉద్దేశంతోనే టీడీపీ విధ్వంసం సృష్టించిందని వారు ఆరోపించారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ ప్రోద్బలంతో ఈ దాడులు జరిగాయని ఆరోపించారు. బిల్లులు అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్సీలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని వారన్నారు. వీరు గురువారం మీడియాతో వేర్వేరుగా మాట్లాడారు. వారేమన్నారంటే.. దుష్ట సంప్రదాయానికి టీడీపీ శ్రీకారం : బొత్స ► సభలో సంఖ్యాబలం ఉందని కీలకమైన బిల్లులను అడ్డుకోవడం ద్వారా టీడీపీ దుష్ట సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ► దీనిని అడ్డుకోవాల్సిన డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీ అజెండాను అమలుచేయడం దారుణం. ► టీడీపీ సభ్యులను మా వాళ్లు అని ఆయన సంబోధించడం ద్వారా ఆ స్థానం విలువను దిగజార్చారు. ► ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకోవడం ద్వారా ఉద్యోగులకు టీడీపీ జీవితకాలం దూరమవుతుంది. ► చంద్రబాబు తన తనయుడు లోకేశ్‌తో సభలో ఫొటోలు తీయిస్తూ రెచ్చగొట్టించారు. ► లోకేశ్‌కు న్యూసెన్స్ చేయడమే తెలుసు. ఇతనితోపాటు ఇతర సభ్యుల తీరుపై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తాం. ► సభలోని దృశ్యాలను ఇవ్వాల్సిందిగా చైర్మన్‌కు లేఖ రాశాం. తప్పు నిరూపిస్తే రాజీనామా చేస్తా : అనిల్ ► శాసన మండలిలో నేను జిప్ విప్పానంటూ లోకేశ్, అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, బాబు రాజేంద్రప్రసాద్ దుష్ప్రచారం చేస్తున్నారు. ► నేను తప్పు చేసినట్లు తేలితే రాజీనామా చేస్తా.. లేకపోతే మీరు రాజీనామాకు సిద్ధమా!? ► సభలో ఫొటోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని చెప్పిన మంత్రి వెలంపల్లిపై లోకేశ్ దాడిచేశాడు. ► అర్ధరాత్రి వరకు సమావేశాలు జరిగిన సందర్భాలున్నాయి. అయినా మండలిని నిరవధిక వాయిదా వేసి వెళ్లిపోయారు. ► మండలిలో ఎక్కడ బూతులు మాట్లాడామో టీడీపీ నిరూపించాలి. సభలో వారే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దాడిచేసిన వారిపై చర్యలు : గడికోట ► రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ప్రతి బిల్లునూ టీడీపీ శాసన మండలిలో అడ్డుకుంటోంది. ► సభా సంప్రదాయాలను ఆ పార్టీ ఉల్లంఘిస్తోంది. ► మంత్రి వెలంపల్లి మీద దాడిచేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. ► శాసన మండలిలో లోకేశ్ ఫొటోలు తీయడం.. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు, డిప్యూటీ చైర్మన్‌కు స్లిప్పులు పంపడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. ► డిప్యూటీ చైర్మన్‌ను యనమల సభలో నియంత్రించారు. ► మండలిలో టీడీపీ సభ్యులు అప్రజాస్వామికంగా వ్యవహరించి, చరిత్రహీనులుగా మిగిలిపోయారని.. లోకేశ్‌ను ప్రజలు క్షమించరని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. సీబీఎన్ స్కూల్ ప్రిన్పిపాల్ యనమల: కన్నబాబు ► టీడీపీ వారికి నారా చంద్రబాబు నాయుడు (సీబీఎన్) అనే స్కూల్ ఉంది. ఆ స్కూల్‌కు ప్రిన్సిపాల్ యనమల. ► ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకున్నారు. టీడీపీ రాష్ట్రం కోసం కాకుండా కేవలం అమరావతి కోసం పని చేస్తోంది. వీరికి గవర్నర్ ప్రసంగం వినే ఓపిక కూడా లేదు. లోకేశ్ ఫోన్లో ఫోటోలు తీస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు ఫొటోలు తీస్తున్నారని ప్రశ్నిస్తే దాడి చేస్తారా? ► వెలంపల్లి పై దాడి చేసి... కనీసం విచారణ వ్యక్తం చేయడం లేదు. టీడీపీ వాళ్లు వీడియోలు అడుగుతున్నారు.. లోకేశ్ తీసిన వీడియోలున్నాయిగా. ముందు ఆ వీడియోలు బయట పెట్టాలని ప్రశ్నిస్తే పొంతన లేకుండా అబద్ధాలు చెబుతున్నారు. -
కుట్రతోనే ద్రవ్య బిల్లుకు మోకాలడ్డు
సాక్షి, అమరావతి: శాసన మండలిలో టీడీపీ సభ్యులు కుట్రపూరితంగానే ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అగ్రహం వ్యక్తంచేశారు. స్వయం ప్రకటిత మేధావి, అసెంబ్లీ రూల్స్ బుక్ తానే తయారుచేసినట్లు ఫీలయ్యే యనమల రామకృష్ణుడు.. బిల్లులను మండలిలో అడ్డుకుని తీరుతామని ముందే చెప్పారన్నారు. చంద్రబాబు తీరు అసెంబ్లీలో ఒక రకంగా, మండలిలో ఒక రకంగా ఉందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ► సంఖ్యాబలం ఉందని మండలిలో టీడీపీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది. ► నారా లోకేశ్ చౌదరి ప్రోత్సాహంతోనే టీడీపీ సభ్యులు దీపక్‌రెడ్డి, బీద రవిచంద్ర తనపై, మంత్రులు కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్‌పై గూండాల్లా దాడి చేశారు. ► ఫొటోలు తీయొద్దని చెప్పినందుకు లోకేశ్ దాడికి తెగబడ్డారు. ► ప్రజా కోర్టులో చంద్రబాబు ఎప్పటికీ దోషిగా మిగిలిపోతారు. ► గతంలో చైర్మన్ విచక్షణాధికారం అని చెప్పి రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించారు. ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ కూడా అదే రీతిలో ప్రవర్తించారు. ► చైర్మన్ సీట్లో కూర్చొన్న వ్యక్తి టీడీపీ సభ్యులను ఉద్దేశించి ‘మా వాళ్లు’ అని సంబోధించడం ఎంతవరకు సమంజసం? ► తనను ఓడించిన ప్రజల మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే యనమల నిన్న సభలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ► చైనా సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన తెలుగు వ్యక్తి కల్నల్ సంతోష్‌బాబుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, వైఎస్సార్సీపీ తరఫున నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. లోకేశ్ డైరెక్షన్లోనే దాడి చంద్రబాబు, లోకేశ్ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నందుకే చంద్రబాబు తనయుడు లోకే‹శ్ నాయుడు తనపై కక్షగట్టి ప్రవర్తిస్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. తిరుమలలో అన్యమత ప్రార్థనలు అంటూ దుష్ప్రచారం చేసిన లోకేశ్‌కు దమ్ముంటే వాటిని నిరూపించాలని ఆనాడు సవాల్ విసిరానని.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కౌన్సిల్ వేదికగా లోకేశ్ దాడులు చేయించారని వెలంపల్లి అన్నారు. ఆర్యవైశ్యుడినని.. మాటల్లో చెప్పలేని విధంగా తనపై దాడి చేశారని గురువారం ఆయన ‘సాక్షి’తో అన్నారు. ల్యాండ్ మాఫియా గూండా దీపక్‌రెడ్డి వెల్‌లోకి వచ్చి మంత్రులను బయటకు నెట్టేయాలంటూ మాట్లాడారని తెలిపారు. రూల్స్‌కు విరుద్ధంగా లోకేశ్ సెల్ఫోన్లో ఫొటోలు తీయడం.. వీడియో రికార్డింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకే నాపై టీడీపీ నేతలు దాడిచేశారని.. ఇదంతా మీడియా వారు లాంజ్‌లో నుంచి చూశారని మంత్రి వివరించారు. లోకేశ్, దీపక్‌రెడ్డి, బీద రవిచంద్ర మీద డిప్యూటీ చైర్మన్ చర్యలు తీసుకోవాలని వెలంపల్లి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సమన్వయంతో ఉండాలని సీఎం వైఎస్ జగన్ చెప్పారు కాబట్టే సమన్వయంతో ఉంటున్నామని ఆయన అన్నారు. -
కుట్రకు టీడీపీ పక్కా ప్లాన్: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: శాసన మండలిలో టీడీపీ సభ్యులు దౌర్జన్యంగా వ్యవహరించారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆయన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై టీడీపీ నేతలు అనవసర ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. సంఖ్యాబలం ఉందని టీడీపీ సభ్యులు ప్రతి దాన్ని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ‘‘మా సభ్యులంటూ డిప్యూటీ చైర్మన్ అనటంలో అర్థమేమిటని’ మంత్రి బొత్స ప్రశ్నించారు. డిప్యూటీ ఛైర్మన్ మాటలను ఆయన ఖండించారు. (నాపై దాడికి లోకేష్ ప్రోద్బలమే కారణం) టీడీపీ సభ్యులు పక్కా ప్లాన్‌తోనే మండలిలో ప్రవేశించారని మంత్రి తెలిపారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటే ఇదేనా అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. సభలో ఫోటోలు, వీడియోలు తీయొద్దంటే లోకేష్ వినిపించుకోలేదన్నారు. ‘‘టీడీపీ ఎమ్మెల్సీలు ఏం సాధిద్దామని అనుకుంటున్నారు. పదే పదే సభలో ఉద్రిక్తతలు సృష్టిస్తే ఏమనాలి. రేపటి కాలానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు’’ అంటూ మంత్రి బొత్స దుయ్యబట్టారు. (బిల్లులు అడ్డుకోవడానికే టీడీపీ కుట్ర: అనిల్) -
టీడీపీ ఇష్టానుసారంగా వ్యవహరించింది..
సాక్షి, అమరావతి: శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు ఇష్టానుసారం వ్యవహరించారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ద్రవ్యవినిమయ బిల్లును అడ్డుకోవడం వల్ల ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ ఎమ్మెల్సీలు చేయి చేసుకున్నారన్నారు. మండలిలో లోకేష్ ఫోటోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ యనమల రామకృష్ణుడు చెప్పినట్టు మండలి చైర్మన్ సభ నడిపారని నిబంధనలు ఉల్లంఘించిన టీడీపీ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
బిల్లులు అడ్డుకోవడానికే టీడీపీ కుట్ర: అనిల్
సాక్షి, అమరావతి: టీడీపీ చౌకబారు రాజకీయాలు చేస్తోందని నీటి పారుదలశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మండలిలో నిన్న జరిగిన ఘటనలు దారుణమన్నారు. మండలిలో మేం ఏమైనా చేస్తామంటూ యనమల రామకృష్ణుడు మాట్లాడారని, రూల్ 90 నోటీసు ఒక రోజు ముందివ్వాలని చెప్పినా వినలేదని తెలిపారు. సంఖ్యా బలం ఉందని ప్రభుత్వ బిల్లులను అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర చేసిందని ధ్వజమెత్తారు. (గడ్డంపై చర్చ: టీడీపీ ఎమ్మెల్సీకి మంత్రి కౌంటర్) మండలిలో నారా లోకేష్‌ను వీడియోలు తీయొద్దని చైర్మన్ కూడా చెప్పారని, వీడియోలు తీయొద్దని చెబితే మంత్రి వెల్లంపల్లిపై దాడి చేశారని నిప్పులు చెరిగారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని టీడీపీ యత్నించిందన్నారు.అర్ధరాత్రి వరకు సమావేశాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని, అయినా మండలిని నిరవధిక వాయిదా వేసి వెళ్ళిపోయారని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. (నాపై దాడికి లోకేష్ ప్రోద్బలమే కారణం) సంప్రదాయం ప్రకారం ద్రవ్య వినిమయ బిల్లు చివరిలో ఆమోదిస్తారని.. కానీ టీడీపీ విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. బిల్లులు ఆమోదంపై మిగతా పార్టీల అభిప్రాయం తీసుకోమన్న డిప్యూటీ చైర్మన్ తీసుకోలేదన్నారు. ద్రవ్య వినియమ బిల్లు ఆమోదం పొందకుండా కుట్రలు చేశారని దుయ్యబట్టారు. మండలిలో ఎక్కడ బూతులు మాట్లాడమో టీడీపీ నిరూపించాలన్నారు. సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది టీడీపీ సభ్యులేనన్నారు. ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకొని టీడీపీ సభ్యులు చరిత్రలో నిలిచిపోయారని ధ్వజమెత్తారు. తాను సభలో జిప్ విప్పానంటూ లోకేష్, అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, బాబు రాజేంద్రప్రసాద్ విష ప్రచారం చేస్తున్నారని మంత్రి అనిల్ నిప్పులు చెరిగారు. మహిళ ఎమ్మెల్సీల ముందు తాను అసభ్యకరంగా ప్రవర్తించానని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఛైర్మన్ దగ్గరకు వెళ్లి వీడియోలు బయట పెట్టమని అడుగుదామని, తాను తప్పు చేసినట్లు తేలితే రాజీనామా చేస్తానని, లేకపోతే మీరు రాజీనామాకు సిద్ధమా అంటూ టీడీపీ ఎమ్మెల్సీలకు మంత్రి అనిల్ సవాల్ విసిరారు. -
నాపై దాడికి లోకేష్ ప్రోద్బలమే కారణం
సాక్షి, అమరావతి : శాసన మండలిలో లోకేష్ వ్యవహరించిన తీరు చూసి సిగ్గేస్తోందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బుధవారం నిబంధనలకు విరుద్ధంగా మండలిలో నారా లోకేష్ ఫొటోలు తీశారని, శాసనమండలి ఛైర్మన్ స్వయంగా చెప్పినా లోకేష్ వినలేదని అన్నారు. ఫొటోలు తియోద్దన్న తనపై టీడీపీ ఎమ్మెల్సీలు దాడి చేశారని చెప్పారు. తనతో పాటు మంత్రులు కన్నబాబు, గౌతమ్ రెడ్డిలపై కూడా దాడికి పాల్పడ్డారని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై దాడికి నారా లోకేష్ ప్రోద్బలమే కారణమన్నారు. టీడీపీ సభ్యులు మండలిలో గుండాలుగా, రౌడీలుగా వ్యవహరించారన్నారు. టీడీపీ సభ్యల తీరుతో మండలికి వెళ్లాలంటేనే బాధేస్తోందని పేర్కొన్నారు. ( ‘ఆయనకు టీడీపీ క్షమాపణ చెప్పాలి’ ) తమపై దాడికి పాల్పడ్డ బీద రవి చంద్రయాదవ్, దీపక్ రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్సీలపై ఛైర్మన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఫొటోలు తీసిన లోకేష్‌పైనా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలచేత తిరస్కరించబడిన లోకేష్.. మండలిలో వీడియోలు రికార్డు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ఛైర్మన్‌ను కోరతామన్నారు. ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లు ఒక పార్టీకి కొమ్ముకాసే విధంగా వ్యవహరించరాదని అన్నారు. ప్రజలకు మేలు జరగకూడదనే.. ప్రజలకు మేలు జరగకూడదన్న ఉద్దేశ్యంతోనే టీడీపీ ఎమ్మెల్సీలు బిల్లులు అడ్డుకున్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు చర్చించని టీడీపీ.. మండలిలో మాత్రం బిల్లులను అడ్డుకుంటున్నారు. మండలిలో అంగబలం ఉంది.. సంగతి చూస్తామంటున్నట్టు టీడీపీ వ్యవహరించింది. మండలి ఛైర్మన్ గతంలో రూల్సుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఛైర్మన్ స్థానంలో కూర్చుని డిప్యూటీ ఛైర్మన్ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారు. గన్ మెన్లను తొలగించారంటూ డిప్యూటీ ఛైర్మన్ చైరులో కూర్చొని కామెంట్లు చేయడం సరి కాదు. చైరులో కూర్చున్న డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం టీడీపీ వాళ్లని మా వాళ్లని సంబోధిస్తున్నారు. రూల్ 90 కింద చర్చకు అడ్మిట్ చేయకుండానే యనమల మాట్లాడేశారు. తాను చర్చకు అనుమతించ లేదని మండలి ఛైర్మన్ కూడా స్పష్టంగా చెప్పారు. డిమాండ్ల మీద మంత్రులే సమాధానం చెప్పాలి కాబట్టి మండలికి వెళ్లాం. బిల్లులను కొన్నాళ్ల పాటు ఆపి శునకానందం పొందగలరు తప్ప.. లాభం ఏముంటుంది..?. ప్రజల కోసం మేం భరిస్తున్నాం.. మేం తిరగబడితే తట్టుకోలేరు. బిల్లు అడ్డుకుంటామని యనమల ముందే చెప్పారు శాసనమండలిలో బిల్లులు అడ్డుకుంటామని యనమల ముందే చెప్పారు. చంద్రబాబు వ్యవహార శైలి శాసనసభలో ఒక రకంగా, మండలిలో ఒక రకంగా ఉంటుంది. అసెంబ్లీలో చంద్రబాబు ఎందుకు చర్చకు రావడం లేదు?. సంఖ్యా బలం ఉందని మాత్రమే మండలిలో టీడీపీ అడ్డుకుంటోంది. మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించారు. మండలిలో డిప్యూటీ ఛైర్మన్ వ్యాఖ్యలు ఆక్షేపణీయం. ఛైర్మన్ స్థానంలో ఉన్నప్పుడు రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాలి. దొడ్డిదారిన యనమల తెచ్చిన రూల్ 90 నోటీసును చర్చకు అనుమతించారు. యనమల ప్రజల్లో గెలిచిన వ్యక్తి కాదు.. దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యారు. తెలంగాణలో అరెస్టైన నేతలు మాకు నీతులు చెప్తున్నారు. వీర సైనికుడు సంతోష్ త్యాగాన్ని దేశం మరవదు.. లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ త్యాగాన్ని దేశం మరవదు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్ గొప్ప వ్యక్తి. శాసనసభ కూడా సంతోష్‌కు ఘనంగా నివాళులు అర్పించింది. సంతోష్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. -
‘మా మౌనాన్ని చేతకానితనంగా చూడొద్దు ’
సాక్షి, విజయవాడ : శాసనమండలిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ నేతల దాడిని వైఎస్సార్సీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతల దాడిని ఖండిస్తూ గుణదలలోని అతని నివాసం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్లు, డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. పెద్దల సభలో టీడీపీ సభ్యులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లిపై దాడికి పాల్పడిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీగా అర్హత లేని టీడీపీ సభ్యులు మండలిలో ఉన్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన బిల్లులను మండలికి పంపితే వాటిని అడ్డుకోవడం హేయమైన చర్య అని అవినాష్ పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలని చూస్తుంటే.. టీడీపీ నేతలు వ్యవస్థలను, కోర్టులను అట్టుపెట్టుకొని అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దాడిని టీడీపీ నాయకులు హీరోయిజంగా చెప్పుకుంటున్నారని, ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య మరొకటి లేదన్నారు. వైఎస్సార్సీపీ నేతల మౌనాన్ని చేతకానితనంగా చూడొద్దని హెచ్చరించారు. దాడి చేనినవారిపై చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్‌కు రిప్రజెంటేషన్ ఇస్తామన్నారు. రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాలని కుట్రలు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని దేవినేని అవినాష్ హెచ్చరించారు. బిల్లులను అడ్డుకోవడం దురదృష్టకరం : బొప్పన భవకుమార్ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన బిల్లులు పాస్ కాకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ అన్నారు. పెద్దల సభలో రౌజీయిజం చేయడం టీడీపీ పార్టీ నిరంకుశ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. శాసనమండలిలో మంత్రిపై దాడి చేయడం దేశ చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. టీడీపీ సభ్యులు రౌడీలు, గుండాలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విధ్వంశాలు చేస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చూస్తూ ఉరుకోదని హెచ్చరించారు. -
‘టీడీపీ ఎమ్మెల్సీలు క్షమాపణ చెప్పాలి’
సాక్షి, గుంటూరు : శాసనమండలిలో టీడీపీ నేతలు తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ విమర్శించారు. ద్రవ్యబిల్లును పెట్టనీయకుండా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పేదల కోసం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను టీడీపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లిపై దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. (చదవండి : మండలిలో మరోసారి దుష్ట సంప్రదాయం!) మంత్రి వెల్లంపల్లికి టీడీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు ద్రవ్యబిల్లు ప్రాధాన్యత తెలియదా అని ప్రశ్నించారు. సభ్యులు ఎక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో రౌడీయిజానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చాంబర్లో కూర్చొని సభ్యులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు మారకుంటే టీడీపీ భూస్థాపితం కాకతప్పదని ఎమ్మెల్యే గిరిధర్ వ్యాఖ్యానించారు. -
రాష్ట్రానికి భారీ పెట్టుబడులొచ్చాయ్!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. బుధవారం శాసన మండలిలో బడ్జెట్‌పై చర్చ అనంతరం సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. భారీగా పెట్టుబడులు రావడం వల్ల పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు తెలిపారు. బుగ్గన ఇంకా ఏమన్నారంటే.. ► ఈ బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి సమన్యాయం కల్పించాం. విభజన సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన రెవెన్యూ గ్రాంట్లు రావడం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాం. ► భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి గత ప్రభుత్వం జీఎమ్మార్‌కు 2,700 ఎకరాలను కేటాయించింది. ఇప్పుడు 2,200 ఎకరాల్లోనే విమానాశ్రయ నిర్మాణానికి ఆ సంస్థ అంగీకరించింది. తాజా ఒప్పందం ప్రకారం ప్రభుత్వానికి 500 ఎకరాలు మిగిలింది. ► రాష్ట్రంలో 15 చోట్ల టూరిజం అభివృద్ధి పనులు చేపట్టనున్నాం. నూతన పథకాలకు రూ.20 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. ► నవంబర్‌లో కరోనా వైరస్ పీక్ స్టేజ్ (గరిష్ట దశ)కు చేరుకుంటుందని వైద్య నిపుణుల అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తామని అడిగితే చెప్పలేని పరిస్థితి దాపురించింది. ► కరోనా వేళ సభ నడపటానికే ఇబ్బందికర పరిస్థితులుంటే ప్రతిపక్ష సభ్యులు బడ్జెట్ అంశాలు కాకుండా ఏవేవో మాట్లాడుతూ సమయం వృథా చేస్తున్నారు. శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ, పీడీఎఫ్, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్సీలు మాట్లాడారు. సభ్యులు ఏమన్నారంటే.. ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయని బడ్జెట్ అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలన కొనసాగింది. ఈ బడ్జెట్లోనూ ఏ ఒక్క వర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా కేటాయింపులు చేశారు. అధికారం చేపట్టిన ఏడాదిలోపే 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపారు. – జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ సభ్యుడు తేడా కనిపిస్తోంది బడ్జెట్ అంచనాలకు, వాస్తవ పరిస్థితులకు చాలా తేడా కనిపిస్తోంది. – దీపక్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ ఎక్కువ నిధులు రాబట్టాలి బడ్జెట్ ప్రతిపాదనలకు, వాస్తవానికి పొంతన లేదు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులను రాబట్టాల్సిన అవసరం ఉంది. ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు పేదలకు ఊరట కలిగిస్తాయి. పేదలను శాశ్వతంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలను కూడా కొనసాగించాలి. – లక్ష్మణరావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ మా పార్టీ సమర్థిస్తోంది ఏడాది పాలనలో 3.58 కోట్ల ప్రజలకు ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను చేరువ చేసింది. ఈ బడ్జెట్లోనూ సంక్షేమ పథకాలకు చేసిన కేటాయింపులను మా పార్టీ సమర్ధిస్తోంది. రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలను బడ్జెట్లో ఎక్కడా పొందుపరచలేదు. -
అప్రజాస్వామికం.. అమానుషం
సాక్షి, అమరావతి: శాసనమండలిలో టీడీపీ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే.. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అప్రజాస్వామికంగా వ్యవహరించి సభ నడిపారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు కురసాల కన్నబాబు, ఆదిమూలం సురేష్, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. యనమల రామకృష్ణుడు తన తెలివితేటలతో సభను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం సభ నడపమని వేడుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలి నిరవధిక వాయిదా అనంతరం వారంతా మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి బోస్ ఏమన్నారంటే.. ► రూల్–90 ప్రకారం ఏదైనా అంశంపై చర్చ చేపట్టాలంటే ఒకరోజు ముందే నోటీసు ఇవ్వాలి. చైర్మన్, సభా నాయకుడితో మాట్లాడి పరిగణనలోకి తీసుకోవాలి. ఇవేమీ పట్టించుకోకుండా చైర్మన్ రూల్–90ని పరిగణనలోకి తీసుకున్నారు. ► ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదిస్తే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేం. ► ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టాలన్న ఆలోచనతోనే టీడీపీ వ్యవహరించింది. ఉన్నత లక్ష్యాల కోసం ఏర్పడ్డ పెద్దల సభను అప్రతిష్ట పాల్జేశారు. టీడీపీకి రాజకీయమే ప్రాధాన్యత. రాష్ట్ర ప్రజల బాగోగులు అవసరం లేదు. ► ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ చేతులు జోడించి వేడుకున్నా పట్టించుకోలేదు. 33వేల ఎకరాల్లో వ్యాపారం చేసుకోవడం కోసమే ప్రభుత్వ బిల్లులను అడ్డుకున్నారు. ► యనమల రామకృష్ణుడిది పైశాచిక ఆనందం. టీడీపీ సభ్యులు వారి మాట వినకపోతే విధ్వంసం సృష్టిస్తామని బెదిరిస్తున్నారు. సభా సంప్రదాయాలు, నిబంధనలు వారికి అవసరం లేదు. శాసన మండలి సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. చిత్రంలో మంత్రులు, వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు చరిత్రలో దుర్దినం : మంత్రి కన్నబాబు ► టీడీపీ సభ్యులు సభా నిబంధనల్ని ఉల్లంఘించారు. మెజార్టీ ఉందని ఇష్టానుసారం వ్యవహరించారు. చరిత్రలో ఇది దుర్దినం. ► మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఫొటోలు తీయొద్దని చెప్పినందుకు లోకేష్ దాడికి దిగారు. సభలో ఫొటోలు తీసి లోకేష్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ► దీనిపై కచ్చితంగా సభా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. లోకేష్ విధానం సరికాదని చైర్మన్ కూడా చెప్పారు. ► మండలి నిరవధిక వాయిదా వెనుక యనమల ప్లాన్ ఉంది. మెజార్టీ ఉందని సభను అడ్డుకుంటున్నారు. ► డిప్యూటీ చైర్మన్ తీరు ఆక్షేపణీయం. టీడీపీకి తప్ప ఏ ఇతర పార్టీ సభ్యులకు అవకాశం ఇవ్వలేదు. ► మూడ్ ఆఫ్ ద ఫ్లోర్ తీసుకోవాలని నాలుగు గంటలు కోరాం. బీజేపీ, పీడీఎఫ్, ఇతర సభ్యుల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోలేదు. దాడికి దిగారు: మంత్రి ఆదిమూలపు ► టీడీపీ సభ్యులు సభ నియమ, నిబంధనల్ని తుంగలో తొక్కారు. మంత్రులపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. ► పాస్ చేయాల్సిన బిల్లులను అడ్డుకున్నారు. సంక్షేమ కార్యక్రమాల్ని టీడీపీ అడ్డుకుంటోంది. వాయిదా వేయడం శోచనీయం: చీఫ్ విప్ ఉమ్మారెడ్డి ► శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ నిర్ణయాలు అప్రజాస్వామికంగా ఉన్నాయి. టీడీపీ సభ్యులు కుట్రతోనే వచ్చారు. ► కీలక బిల్లులు ఆమోదించకుండానే సభను వాయిదా వేయడం శోచనీయం. టీడీపీ సభ్యులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి అవకాశం ఇవ్వలేదు. సభను విచ్ఛిన్నం చేయడానికి టీడీపీ ప్రయత్నించింది. గత సమావేశాల్లో మాదిరిగానే చైర్మన్ వ్యవహరించారు. ఇపుడు ఏం జరగనుంది? ద్రవ్య వినిమయ బిల్లు ► ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించకుండా మండలిలో అడ్డుకోవడంవల్ల మహా అయితే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ఇతర చెల్లింపులు ఒకటి రెండు రోజులు ఆలస్యం కావడం మినహా ఎలాంటి సమస్య ఉండబోదని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. ► శాసనసభ ఆమోదించిన ఆర్థిక బిల్లులను మండలి 14 రోజులు జాప్యం చేయగలదు తప్ప అంతకుమించి ఎలాంటి అధికారం లేదు. ► ‘ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ ఈనెల 17న ఆమోదించింది. ఇక 14 రోజులు అంటే ఈ నెలాఖరుతో గడిచిపోతాయి. వచ్చే నెల ఒకటి లేదా రెండో తేదీ నుంచి యథా ప్రకారం చెల్లింపులు చేయవచ్చు’ అని నిపుణులు తెలిపారు. సీఆర్డీఏ రద్దు.. వికేంద్రీకరణ ► ఆర్థికేతర బిల్లులను రెండోసారి మండలిలో అడ్డుకోవడంవల్ల నెల రోజులు అవి చట్టరూపం దాల్చ కుండా ఆగిపోతాయి. నెల రోజుల్లో మండలి ఆమోదించినా, తిరస్కరించినా రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 ప్రకారం ఆ బిల్లులు ఆమోదం పొందినట్లే. ► ఏదైనా బిల్లును శాసనసభ ఆమోదించి మండలికి పంపితే అది మూడు నెలలు మాత్రమే దానిని ఆపగలదు. మూడు నెలల్లో తిరస్కరించినా, వెనక్కు పంపినా మళ్లీ అసెంబ్లీ ఆమోదించి పంపవచ్చు. ఇలా వచ్చిన బిల్లును మండలి నెల రోజుల్లోగా ఆమోదించి పంపాలి. ఒకవేళ ఆమోదించకపోయినా తిప్పి పంపకపోయినా ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం పొందినట్లేనని ఆర్టికల్ 197 స్పష్టంగా చెబుతోంది. ► పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు, విద్యా హక్కు చట్ట సవరణ బిల్లులను అసెంబ్లీ ఆమోదించి మండలికి పంపించి మూడు నెలలు దాటిపోయింది. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఆమోదించి మండలికి పంపింది. వీటిని మండలిలో చర్చకు రాకుండా అడ్డుకున్నంత మాత్రాన ఒరిగేదేమీలేదని,అవి ఆమోదం పొందినట్లేనని న్యాయ నిపుణులంటున్నారు. -
మండలిలో గూండాగిరి
సాక్షి, అమరావతి: శాసనమండలిలో తనకున్న సంఖ్యా బలాన్ని చూసుకుని బుధవారం టీడీపీ దౌర్జన్యకాండకు దిగింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రజాస్వామ్య విలువలను మంటగలిపింది. అసెంబ్లీలో ఆమోదం పొంది వచ్చిన బిల్లుల్ని ప్రభుత్వం బుధవారం మండలిలో ప్రవేశపెట్టే క్రమంలో టీడీపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. సాక్షాత్తు రాష్ట్ర మంత్రిపై నిండు సభలో టీడీపీ ఎమ్మెల్సీలు కాళ్లతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. అడ్డుకున్న పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్సీలపైనా దౌర్జన్యం చేసి తోసివేశారు. టీడీపీ ఎమ్మెల్సీల దాదా గిరితో సభలో అరగంట సేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. నినాదాలు ► ద్రవ్య వినిమయ బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల్లో ఏది మొదట తీసుకోవాలనే విషయంపై వివాదం ఏర్పడి సభ మూడు గంటలపాటు స్తంభించింది. ఏ నిర్ణయం తీసుకోకుండా ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ► చైర్మన్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. ఏమీ జరక్కుండానే తమకు అనుకూలంగా జరిగినట్లు బల్లలు చరిచి అధికార పక్ష సభ్యులను రెచ్చగొట్టారు. ► ఈ దశలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌తో పలువురు ఎమ్మెల్సీలు గొడవకు దిగారు. చివరికి ఆయనపై ఒక్కసారిగా దాడి చేశారు. ► బీద రవిచంద్ర వెలంపల్లిని కాళ్లతో తన్నగా, మంతెన సత్యనారాయణరాజు ఆయన మెడ పట్టుకుని తోసివేశారు. మరో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వచ్చి వారిని ఆపి, మంత్రిని పక్కకు తీసుకువచ్చారు. ► ఆ తర్వాత కూడా బీద రవిచంద్ర మంత్రిపైకి దూసుకువచ్చి మళ్లీ దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈలోపు మిగిలిన మంత్రులు వచ్చి అడ్డుకున్నారు. ఫొటోలు, వీడియోలు తీసిన లోకేష్ ► నారా లోకేష్ ఫొటోలు, వీడియోలు తీయడమే ఈ గొడవకు కారణమైంది. డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంతో మంత్రులు నిబంధనల గురించి పోడియం ఎదుట నిలబడి మాట్లాడుతుండగా లోకేష్ వెనుక నుంచి ఫొటోలు, వీడియో తీశారు. మధ్యాహ్నం నుంచి సభ జరుగుతున్నంత సేపు ఆయన తన ఫోన్‌తో ఫొటోలు, వీడియోలు తీయడమే పనిగా పెట్టుకున్నారు. ► ఈ క్రమంలో ఎందుకు ఫొటోలు తీస్తున్నారని వెలంపల్లి ప్రశ్నించడంతో బీద రవిచంద్ర, మంతెన సత్యనారాయణ రాజు ఆయనపై దాడి చేశారు. దాడి సమయంలోనూ లోకేష్ ఫొటోలు తీస్తూనే ఉన్నారు. చైర్మన్ స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ ఫొటోలు తీయొద్దని పదేపదే లోకేష్‌ను కోరినా ఆయన పట్టించుకోలేదు. ► మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్‌లు లోకేష్ ఫోన్లో తీసిన ఫొటోలు, వీడియోలు తొలగించాలని డిప్యూటీ చైర్మన్‌ను అడుగుతున్నప్పటికీ, ఆయన వెనుక నుంచి ఇంకా ఫొటోలు తీస్తూనే ఉన్నారు. ► ఇలా ఫొటోలు తీసి మంత్రులు, అధికారపక్ష సభ్యుల్ని రెచ్చగొట్టి, ఘర్షణకు కారణమైన లోకేష్.. చివర్లో గొడవ మరింత పెద్దదైన సమయంలో మెల్లగా బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సభ అదుపులో లేదు కాబట్టి నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ ప్రకటించి వెళ్లిపోయారు. సంప్రదాయాన్ని ఎందుకు పాటించాలి? ► బిల్లులపై ఓటింగ్ పెట్టాలని యనమల డిమాండ్ చేయగా, ఇవి కరోనా సమయంలో అత్యవసరంగా పెట్టిన అసెంబ్లీ సమావేశాలని.. ప్రభుత్వ బిజినెస్ కోసమే జరుగుతున్నాయని మంత్రి బుగ్గన అన్నారు. ► మధ్యలో ద్రవ్య వినిమయ బిల్లు పెడితేనే సహకరిస్తామని, లేకపోతే తాను వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఇచ్చిన రూలు 90 నోటీసు తీసుకోవాలని యనమల కోరారు. ► బుగ్గన దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అజెండా ప్రకారం సభ నడపకుండా ఆరు బిల్లుల్ని పెండింగ్‌లో పెట్టడం సరికాదన్నారు. శాసన మండలి ఉన్నది ప్రభుత్వం పని చేయకుండా ఉండేందుకా అని ప్రశ్నించారు. ఎటూ తేలక సభ స్తంభించడంతో డిప్యూటీ ఛైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. ► అనంతరం మళ్లీ ఇదే వివాదం నెలకొంది. డిప్యూటీ చైర్మన్ మాట్లాడుతూ ఏకాభిప్రాయం రానప్పుడు తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ద్రవ్య వినిమయ బిల్లు చివర్లో పెట్టాలనే సంప్రదాయం పాటించాల్సిన అవసరం లేదని, ఈ సభలోనే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడతానని తెలిపారు. ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం తీసుకోండి ► మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుంటూ.. సభ మూడ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని, మిగిలిన పార్టీ ఫ్లోర్ లీడర్ల అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రతి చిన్న విషయానికి కీచులాటకు దిగడం సరికాదని, ఫ్లోర్ లీడర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కోరారు. ► సభలో మిగిలిన పక్షాల అభిప్రాయాలు ఎందుకు తీసుకోరని, కేవలం టీడీపీ అభిప్రాయమే ఎందుకు తీసుకుంటారని బుగ్గన ప్రశ్నించారు. ► ఒక దశలో తనకు ఈ ప్రభుత్వం ఎస్కార్టు తీసివేసిందని డిప్యూటీ చైర్మన్ చెప్పగా, టీడీపీ హయాంలో తాను ప్రతిపక్ష నేతగా ఎన్నికైనా.. నెల రోజులు ధృవీకరించకుండా ఇంకెవరైనా వైఎస్సార్సీపీ సభ్యులు టీడీపీలోకి వస్తే తనకు ఆ అవకాశం లేకుండా చేయాలని చూసిన విషయాన్ని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా రూలు 90 తీసుకున్న యనమల ► చర్చ జరుగుతుండగానే రూలు 90పై తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ.. టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుపై అభ్యంతరం చెప్పారు. ఆ రెండు బిల్లులపై రూలు 90 ప్రకారం తాను చెప్పిన విషయాలు రికార్డుల్లోకి వెళ్లిపోయాయని తెలిపారు. ► అసలు చైర్మన్ అనుమతివ్వకుండా ప్రతిపక్ష నేత ఎలా దాన్ని పెడతారని బుగ్గన ప్రశ్నించగా డిప్యూటీ చైర్మన్ అది రికార్డుల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. ► అసలు రూలు 90 తీసుకోవడానికే లేదని, దాన్ని ఒకరోజు ముందు ఇవ్వాలని, కానీ ఈరోజే ఇచ్చారని, అలాగే సభా నాయకుడు, శాసనసభా వ్యవహారాల మంత్రిని సంప్రదించిన తర్వాతే ఆ నోటీసుపై నిర్ణయం తీసుకోవాలని రూలు 94 చెబుతోందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నిబంధనావళిని చదివి వినిపించారు. అసలు రూలు 90ని ఎలా అడ్మిట్ చేశారు? ► ప్రతిపక్ష నేత చెప్పిన విషయాలను రికార్డుల్లోంచి తొలగించాలని బుగ్గన, బొత్స, పిల్లి సుభాష్‌చంద్రబోస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు కోరారు. ► ‘ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు రూల్ బుక్‌ను వల్లెవేస్తారు కానీ పాటించరు. టీడీపీ ఇచ్చిన రూలు 90 నోటీసును చైర్మన్ ఎలా అనుమతిస్తారు? దానిపై ఎలా హక్కు ఉంటుంది? చైర్మన్ అనుమతించాడు కాబట్టి మేం దాన్ని సభలో పెట్టేస్తామంటే కుదరదు. విచక్షణాధికారం ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్లు వినియోగించకూడదు. రూలు 90ని అనుమతించేటప్పుడు సభా నాయకుడిని సంప్రదించాలనే రూలు 94ని రద్దు చేయడానికి చైర్మన్ ఎవరు? ప్రతిపక్ష నేత యనమల సభను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారు. శాసన మండలి టీడీపీ కార్యాలయం కాదు. అక్కడ చేసినట్లు ఇక్కడ చేస్తే కుదరదు. రూలు 94 బతికుందో.. చచ్చిపోయిందో చెప్పాలి. రూల్సు అమలు చేయనప్పుడు ఈ పుస్తకాలు ఎందుకు?’ అని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ► రూలు 90 తీసుకున్నాం కాబట్టి మిగిలిన బిల్లులు పెట్టాలని డిప్యూటీ చైర్మన్ కోరగా, మీ అనుమతి లేకుండా చెప్పిన విషయాలను రికార్డుల్లోంచి తొలగించాకే ఆ బిల్లులు పెడతామని బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. సభ ఉన్నది ప్రభుత్వ బిజినెస్ జరగాడానికా, లేక ఎక్కడి నుంచో తెచ్చిన రూలు 90 కోసమా అని డిప్యూటీ చైర్మన్‌ను ప్రశ్నించారు. ఏ సభలో అయినా ప్రభుత్వ బిజినెస్‌కు టాప్ ప్రయారిటీ ఉంటుందని చెప్పారు. ► మంత్రులు, అధికార పక్ష సభ్యులు దీనిపై ఎంత అడిగినా డిప్యూటీ చైర్మన్ వినకుండా టీడీపీ పక్షం చెప్పిందే వినడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ► ఈ పరిస్థితుల్లో టీడీపీ సభ్యులు గొడవ పెట్టుకుని అధికారపక్షంపై దాడికి దిగారు. అదే సమయంలో యనమల సూచన మేరకు డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ద్రవ్య వినిమయ బిల్లు సహా ఆరు బిల్లులు ఆమోదం పొందకుండా నిలిచిపోయాయి. మండలిలో టీడీపీ శకునిపాత్ర ► శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ మరోసారి శకునిపాత్ర పోషించింది. చైర్మన్ స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్‌పై ఒత్తిడి తెచ్చి అసెంబ్లీ ఆమోదించిన ఆరు బిల్లులకు అడ్డుపడి చివరికి అవి ఆమోదం పొందకుండా చేసింది. తెలుగుదేశం పార్టీ రాజకీయంతో బడ్జెట్ సమావేశాల్లో అతి కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందలేదు. ► వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులతోపాటు మరో మూడు బిల్లుల్ని ముందు ప్రవేశపెడతామని, చివర్లో ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు. కానీ యనమల.. ముందు ద్రవ్య వినిమయ బిల్లు పెట్టాలని పట్టుబట్టారు. ► ఎంతో అనుభవం ఉందని చెప్పే యనమల.. ఎప్పుడైనా ద్రవ్య వినిమయ బిల్లును చివర కాకుండా ముందు ప్రవేశపెట్టిన దాఖలా ఉందా? ఉంటే చూపాలని మంత్రి బుగ్గన కోరారు. ద్రవ్య వినిమయ బిల్లు తర్వాత ఇక ఏ బిజినెస్ జరగదని, అదే సంప్రదాయమన్నారు. -
లోకేశ్‌పై చర్యలు తీసుకోవాలి : కన్నబాబు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలి చరిత్రలో ఇదొక దురుద్దినం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మండలి వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్సీలు మంత్రులపై దాడికి దిగారని తెలిపారు. టీడీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన చేస్తుంటే సరికాదని చెప్పినట్టు వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సభలో ఫొటోలు తీస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ సభ్యులు దాడి చేశారని చెప్పారు. (చదవండి : మంత్రి వెల్లంపల్లిపై టీడీపీ ఎమ్మెల్సీల దాడి) ప్రజాసంక్షేమం, ప్రజా ప్రయోజనం జరగనివ్వమని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చెప్తున్నారని తెలిపారు. డిప్యూటీ చైర్మన్ తీరు ఆక్షేపణీయంగా ఉందని అన్నారు. మూడ్ ఆఫ్ ద ఫ్లోర్ తీసుకోవాలని నాలుగు గంటలుగా కోరిన పట్టించుకోలేదని చెప్పారు. బీజేపీ, పీడీఎఫ్, ఇతర సభ్యుల అభిప్రాయాలను కూడా ఆయన పరిగణలోకి తీసుకోరా అని ప్రశ్నించారు. లోకేశ్ సభలో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారని.. ఇది సభను చులకన చేయడమేనని విమర్శించారు. లోకేశ్ సభ్యుల హక్కులను కాలరాశారని మండిపడ్డారు. లోకేష్ తీరుపై సభ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై దాడి చేసిన టీడీపీ సభ్యులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. మండలి నిరవధిక వాయిదా వెనక యనమల ప్లాన్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మండలి సాక్షిగా మంత్రిపై దాడి
సాక్షి, అమరావతి: శాసన మండలిలో తెలుగుదేశం సభ్యులు బుధవారం గందరగోళం సృష్టించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులపై దాడికి తెగబడ్డారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై చేయి చేసుకుని అమర్యాదగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(2020-21) సమావేశాల్లో భాగంగా రెండో రోజు శాసనమండలి సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో టీడీపీ నేతలు హడావుడి చేశారు. ఇక టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ నిబంధనలకు విరుద్ధంగా మండలిలో సభ్యుల ఫొటోలు తీస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు. (చదవండి : ‘పెద్దల సభను అప్రతిష్టపాలు చేశారు’) ఈ క్రమంలో లోకేష్ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేసిన డిప్యూటీ చైర్మన్.. ఫొటోలు తీయొద్దని ఆదేశించినా ఆయన పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన మంత్రులు.. లోకేష్ తీరు సరికాదంటూ మండిపడ్డారు. ఇంతలో మంత్రుల దగ్గరికి చేరుకున్న టీడీపీ సభ్యులు ఒక్కసారిగా వారిపై దాడికి తెగబడ్డారు. మంతెన సత్యనారాయణరాజు, బీద రవిచంద్ర.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ని కాళ్లతో తన్ని, చేయి చేసుకుని ఆయనను అవమానించారు. ఇదిలా ఉండగా.. కీలక బిల్లులు ఆమోదించకుండానే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ నిర్ణయాలు అప్రజాస్వామికంగా ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. -
‘ఇలాంటి వాటిని సీఎం జగన్ సహించరు’
సాక్షి, అమరావతి : నేతల్లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లాలని శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత వివాదాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివేదిక తెప్పించుకున్నారన్నారు. శాసన మండలి వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకరిపై మరొకరు నేతలు చేసుకుంటున్న విమర్శలపై పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుందన్నారు. ఇలాంటి వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహించరని స్పష్టం చేశారు. పార్టీ నేతలు క్రమశిక్షణ ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని ఉమ్మారెడ్డి హెచ్చరించారు. (శాసన మండలిలో టీడీపీ హడావుడి) ఇబ్బందులు ఉంటే పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని, హద్దు మీరితే ఎలాంటి చర్యలకైన వెనకాడమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినట్లు వెల్లడించారు. నాయకులు ఒకరిపై మరొకరు సవాల్ విసురుకోవడం మానుకోవాలని హితవు పలికారు. నరసాపురంలో జరిగిన సంఘటనపై సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. తప్పెవరిది అనే దానిపై అధిష్టానం నివేదిక తెప్పించుకుంటుందని, పార్టీ అనుమతి లేనిదే ఎవరూ మీడియా సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. నేతలకు ఇబ్బంది ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని, ఎమ్మెల్యేలు ఎంపీలకే కాదు అందరికి ఇదే వర్తిస్తుందని తెలిపారు. సీఎం జగన్ సమయం ఇవ్వడం లేదనేది అవాస్తవమని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొట్టిపారేశారు. (ఎన్ఆర్సీపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం) ఎంపీ వ్యవహారం అందరూ చూశారు: ప్రసాదరాజు ఎమ్మెల్యేలను పందులు గుంపుగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు పోల్చడం సరికాదని నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరుష పదజాలంతో పార్టీకి నష్టం జరిగేలా ప్రవర్తించారని, ఇబ్బంది ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఎంపీ వ్యవహారాన్ని అందరూ చూశారని, ధైర్యం ఉంటే ఆయనే రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. పార్టీ లేకపోతే రఘురామ కృష్ణంరాజు గడ్డి పరకతో సమానమన్నారు. (‘ఎంతమందికి చికిత్స అయినా ప్రభుత్వం సిద్ధం’) -
‘పెద్దల సభను అప్రతిష్టపాలు చేశారు’
సాక్షి, అమరావతి: యనమల రామకృష్ణుడు తన తెలివితేటలతో సభను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం సభ నడపమని వేడుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలి నిరవధిక వాయిదా అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘రూల్ 90 ప్రకారం ఏదైనా అంశంపై చర్చ చేపట్టాలంటే ఒక రోజు ముందుగానే నోటీసు ఇవ్వాలి. ఛైర్మన్, సభా నాయకుడితో మాట్లాడి పరిగణలోకి తీసుకోవాలి. ఇవేమీ పట్టించుకోకుండా ఛైర్మన్ రూల్ 90ని పరిగణలోకి తీసుకున్నారు. ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదిస్తే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేం. ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టాలన్న ఆలోచనతోనే టీడీపీ వ్యవహరించింది. ఉన్నత లక్ష్యాల కోసం ఏర్పడ్డ పెద్దల సభను అప్రతిష్టపాలు చేశారు. టీడీపీకి రాజకీయమే ప్రాధాన్యత. రాష్ట్ర ప్రజల బాగోగులు అవసరం లేదు. ఆర్ధిక మంత్రి చేతులు జోడించి వేడుకున్నా పట్టించుకోలేదు. 33వేల ఎకరాల్లో వ్యాపారం చేసుకోవడం కోసమే ప్రభుత్వ బిల్లులను అడ్డుకున్నారు. టీడీపీ సభ్యులు కుట్రతోనే సభకు వచ్చారు’అని సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. మంత్రిపై దాడి చేశారు: కన్నబాబు టీడీపీ ఎమ్మెల్సీలు మంత్రిపై దాడికి దిగారని మంత్రి కన్నబాబు ఆరోపించారు. టీడీపీ సభ్యులు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేస్తుంటే సరికాదని చెప్పినందుకు మంత్రి వెల్లంపల్లిపై దాడి చేశారని అన్నారు. శాసన మండలి చరిత్రలో ఇదొక దురుద్దినం మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. సభలో లోకేష్ ఫోటోలు తీస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిపై దాడి చేసిన టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. వాయిదా వేయడం శోచనీయం శాసనమండలి చైర్మన్ నిర్ణయాలు అప్రజాస్వామికంగా ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. మండలి నిరవధికంగా వాయిదా పడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కీలక బిల్లులు ఆమోదించకుండానే సభను వాయిదా వేయడం శోచనీయమని వ్యాఖ్యానించారు. ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదానికి అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ చెప్పినట్టుగా సభ జరగాలని చూశారని ఆరోపించారు. సభను విచ్ఛిన్నం చేయడానికి టీడీపీ ప్రయత్నించిందన్నారు. గత సెషన్లో మాదిరిగానే చైర్మన్ వ్యవహరించారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. మండలిలో టీడీపీ హడావుడి బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో అంతకుముందు టీడీపీ నేతలు శాసన మండలిలో మరోసారి హడావుడి చేశారు. దీంతో అక్కడ ప్రతిష్టంభన నెలకొంది. బిల్లుల ఆమోదంపై మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మంత్రుల మధ్య వాగ్వాదం నడిచింది. తొలుత ద్రవ్య వినిమయ బిల్లు పూర్తి చేద్దామని మండలి డిప్యూటీ చైర్మన్ చెప్పగా.. మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. సీఆర్డీయే రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను ముందుగా చేపట్టాలని మంత్రి కోరారు. దీంతో ద్రవ్యవినిమయ బిల్లు రాజ్యాంగ ఆబ్లిగేషన్ అని యనమల రామకృష్ణుడు అడ్డుతగిలారు. అది అయ్యాక మిగిలిన బిల్లులపై ఆలోచిద్దామని చెప్పారు. యనమల వ్యాఖ్యలపై మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లు చివరిగా చేపట్టడం సంప్రదాయం అని బుగ్గన స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడైనా ద్రవ్య వినిమయ బిల్లు తర్వాత వేరే బిల్లులు చేపట్టారా..? అని నిలదీశారు. దీంతో డిప్యూటీ చైర్మన్ 15 నిమిషాలు మండలిని వాయిదా వేశారు. (చదవండి: ఎన్ఆర్సీపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం) -
‘చంద్రబాబు ఆ ఆరోపణలను ఎందుకు ఖండించలేదు’?
సాక్షి, అమరావతి: ఆర్టీసీ బస్సుల కొనుగోలు స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కామ్‌లకు సంబంధించిన అవినీతిని బయటకు తీస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం రెండో రోజు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అవినీతి పరులపై విచారణ చేయకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారు. ప్రభుత్వం అవినీతి జరిగిందని నిర్ధారించిందని తెలిపారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వ హయాంలో అవినీతి జరగలేదని ఎందుకు ఖండించలేదని బొత్స నిలదీశారు. ఇతర రాష్ట్రాల్లో వాహనాలు కొనుగోలు చేయలేదని చెప్పండి అని సవాల్ విసిరారు. అప్పుడే తొందరపడితే ఎలా... ముందుంది ముసళ్ల పండుగ అని టీడీపీని ఉద్దేశించి బొత్స వ్యాఖ్యానించారు. ('దొంగలా తాళాలు వేసుకొని ఉంటే అరెస్ట్ చేయరా') -
గడ్డంపై చర్చ: టీడీపీ ఎమ్మెల్సీకి మంత్రి కౌంటర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(2020-21) సమావేశాల్లో భాగంగా రెండో రోజు శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మంత్రుల గడ్డాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీకి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తాము గడ్డాలు పెంచితే రౌడీలు అంటున్నారని, గడ్డం పెంచితే రౌడీలేనా అని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నించారు. శాసనమండలి ఛైర్మన్‌కు, చంద్రబాబుకు కూడా గడ్డం ఉందని పేర్కొన్న మంత్రి వాళ్లు కూడా రౌడీలేనా అని కౌంటర్ అటాక్ చేశారు. అంతేకాకుండా పురాణాలను పరిశీలిస్తే మునులు, రుషులు గడ్డాలు పెంచారని, వాళ్లను కూడా రౌడీలు అంటారా అని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. (అభివృద్ధి.. సంక్షేమంతో నవశకం) శాసనమండలి చైర్మెన్ అధ్యక్షతన బుధవారం రోజు 12 నిమిషాలు ఆలస్యంగా సభ ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే.. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు శాసనమండలి సంతాపం తెలిపింది. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఈ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. కల్నల్ మృతిపై మండలి రెండు నిమిషాలు మౌనం పాటించింది. (జనతా పద్దు.. కొత్త పొద్దు) -
'దొంగలా తాళాలు వేసుకొని ఉంటే అరెస్ట్ చేయరా'
సాక్షి, అమరావతి : ఏపీ బడ్జెట్ రెండో రోజు శాసనమండలి సమావేశాల్లో భాగంగా టీడీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీటుగా సమాధానమిచ్చారు. అచ్చెనాయుడు అరెస్టును నిరసిస్తూ టీడీపీ సభ్యులు క్రికెట్ బెట్టింగ్ అంశాన్నిలేవనెత్తారు. దీనిపై అనిల్ స్పందిస్తూ..' చట్టం అనేది అందరికి సమానమే... రూ. 150 కోట్లకు పైగా అవినీతి జరిగింది.. బీసీ అయితే అరెస్ట్ చేయకుడదా.. 300 మంది పోలీసులతో అచ్చెనాయుడును అరెస్ట్ చేయడానికి వెళ్లారని టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అచ్చెనాయుడు దొంగ లాగా ఇంట్లో దాక్కుని తాళాలు వేసుకుంటే పోలీసులే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది.(ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభం) కాపు ఉద్యమ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ముద్రగడ ఇంటికి మూడువేల మందిని పంపి భయానక వాతావరణం సృష్టించారు. అంతేగాక ఉద్యమానికి సంఘీభావం ప్రకటించేందుకు వచ్చిన మహిళలపై అమానుషంగా దాడులు చేశారు. నాపై గత ప్రభుత్వం క్రికెట్ బెట్టింగ్ విషయంలో నోటీసులు ఇచ్చిన మాట నిజమే. కానీ నేను ధైర్యంగా విచారణకు హాజరయ్యాను. ఈ వ్యవహారంలో నాకు క్లీన్చిట్ లభించింది. ఆ సమయంలో నోటీసులు ఇచ్చి నా ఇమేజ్ డామేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు' అంటూ పేర్కొన్నారు. -
కల్నల్ సంతోష్ మృతికి ఏపీ మండలి సంతాపం
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలి సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. శాసనమండలి చైర్మెన్ అధ్యక్షతన బుధవారం రోజు 12 నిమిషాలు ఆలస్యంగా సభ ప్రారంభమైంది. సమావేశాలు మొదలు కాగానే సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులు మండలి ముందుకు వచ్చినట్లు మండలి ఛైర్మన్ షరీఫ్ తెలిపారు. మొదట బడ్జెట్‌పై చర్చ మొదలుపెట్టి.. ఆ తర్వాత బిల్లులపై చర్చ చేపడదామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు శాసనమండలి సంతాపం తెలిపింది. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఈ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. కల్నల్ మృతిపై మండలి రెండు నిమిషాలు మౌనం పాటించింది. -
మండలి చైర్మన్ వైఖరిపై సీఎస్‌కు ఫిర్యాదు
-
‘బొండా ఉమాను జైల్లో వేయమంటారా’
సాక్షి, అమరావతి: అసెంబ్లీ కార్యదర్శిపై శాసన మండలి చైర్మన్ కక్ష సాధింపు దోరణితో వ్యవహరిస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. అసెంబ్లీ సెక్రటరీ నిబంధనల ప్రకారం నడుచుకున్నారని తెలిపారు. ఆయన్ను బెదిరించడం, మానసిక ఒత్తిడి చెయ్యడం సమంజసం కాదని హితవు పలికారు. కొన్ని పత్రికలు, పార్టీలు అసెంబ్లీ సెక్రటరీని బెదిరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మండలి చైర్మన్ తీరుపై సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్టు ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి తెలిపారు. (చదవండి : సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అసాధ్యం : అసెంబ్లీ కార్యదర్శి) ‘మేమంతా అసెంబ్లీ సెక్రటరీకి మద్దతుగా ఉంటాం. అవసరమైతే గవర్నర్‌ను కూడా కలుస్తాం. సెలెక్ట్ కమిటీని రూల్స్‌కి విరుద్ధంగా వేస్తున్నానని చైర్మన్ గారే చెప్పారు .మోషన్ ఇవ్వకుండా, ఓటింగ్ జరగలేదు. మరి ఎలా సెలెక్ట్ కమిటీ వేస్తారు. అందుకే అసెంబ్లీ సెక్రటరీ ఆమోదించలేదు. ఏ అధికారయినా రూల్ ప్రకారమే పని చేయాలి. మేమందరం నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తాం. అధికారుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం. రూల్స్ లేవు ఏమీ లేవని యనమల, బొండా ఉమా మాట్లాడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మిమ్మల్ని జైల్లో వేయమంటారా. అలా చేస్తే ఎవరైనా సమర్థిస్తారా’అని వెంకట్రామిరెడి పేర్కొన్నారు. (చదవండి : లేని సెలెక్ట్ కమిటీకి పేర్లు పంపడమేంటి?) -
ఏపీ: సెలెక్ట్ కమిటీకి నో
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వం శాసనమండలిలో ప్రతిపాదించిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని మండలి కార్యాలయం తోసిపుచ్చింది. సెలెక్ట్ కమిటీని నియమించాలని చైర్మన్ ఎంఏ షరీఫ్ పంపిన ఫైలును లెజిస్లేచర్ కార్యదర్శి (ఇన్చార్జి) పి.బాలకృష్ణమాచార్య వెనక్కు పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 154వ నిబంధన కింద సెలెక్ట్ కమిటీ వేయడం చెల్లదని ఆయన ఫైలుపై రాసి పంపినట్లు సమాచారం. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, బచ్చుల అర్జునుడు, నాగ జగదీష్, అశోక్‌బాబు లెజిస్లేచర్ కార్యదర్శిని కలిసి సెలెక్ట్ కమిటీకి నోటిఫికేషన్‌ను జారీ చేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. చైర్మన్ ఆదేశాలను పాటించాల్సిందేనని మండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు కూడా కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఉంది కనుకే కమిటీ నియామకం సాధ్యం కాదని కార్యదర్శి వారికి వివరించినట్లు తెలిసింది. ఉమ్మారెడ్డి అభ్యంతరం సెలెక్ట్ కమిటీ నియామకానికి తన నిర్ణయానుసారం నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా చైర్మన్ షరీఫ్ లెజిస్లేచర్ కార్యదర్శికి ఆదేశాలివ్వడాన్ని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. సెలెక్ట్ కమిటీ సభ్యులను వారి అనుమతి లేకుండానే షరీఫ్ ప్రకటించడం పట్ల కూడా ఆయన అభ్యంతరం తెలిపారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు నిబంధనలు ఉన్నాయని, వాటిని పాటించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సభ్యులను నియమించరాదని కొద్ది రోజుల క్రితం లేఖ రాశారు. అందులో ఆయన నిబంధనలను ఉటంకిస్తూ.. సెలెక్ట్ కమిటీకి పంపాలనే నిర్ణయంపై మండలిలో ఓటింగ్ తీసుకోలేదని, సభ్యులను నియమించేటప్పుడు వారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, వారు అంగీకరిస్తేనే ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. సెలెక్ట్ కమిటీలో ఉండటానికి సంబంధిత సభ్యులు సమ్మతిని తెలపడానికి కనీసం రెండు మూడు రోజుల సమయం ఇవ్వాలని తేల్చిచెప్పారు. ఇదే విధంగా అభ్యంతరం తెలుపుతూ మండలి సభా నాయకుడైన మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా లేఖ రాశారు. మండలి తనకు అధికారం ఇచ్చింది కాబట్టి సెలెక్ట్ కమిటీ వేస్తానంటే కుదరదని, దానికి సాంకేతికంగా ఓటింగ్ జరిగి ఆమోద ముద్ర పడాలని పేర్కొన్నారు. కాగా.. సెలెక్ట్ కమిటీ, మరో కమిటీలో సభ్యులుగా ఉండటానికి నిరాకరిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు వెన్నపూస గోపాల్‌రెడ్డి, మహ్మద్ ఇక్బాల్‌లు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కార్యదర్శి సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని ఫైలును వెనక్కి పంపారని సమాచారం. మండలి చైర్మన్ నిర్ణయంతో వివాదం పాలనా వికేంద్రీకరణ బిల్లును జనవరి 21న అసెంబ్లీ ఆమోదించి అదే రోజు శాసనమండలికి పంపింది. 22న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణలు ఈ బిల్లును మండలిలో ప్రతిపాదించారు. నిబంధనల ప్రకారం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ప్రతిపక్షం ఆ బిల్లును మండలి పరిశీలనకు తీసుకోవడానికి ముందే నోటీసులు ఇవ్వాలి. అయితే అలా జరగకపోగా, రెండు రోజుల సుదీర్ఘ వివాదానంతరం 23వ తేదీ చైర్మన్.. తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తూ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు చెప్పి సమావేశాలను వాయిదా వేయడంతో వివాదం తలెత్తడం తెలిసిందే. (చదవండి: మూడు రాజధానులతోనే మేలు) -
ప్రభుత్వానికీ విచక్షణాధికారం
సాక్షి, అమరావతి: శాసన మండలి ఛైర్మన్‌కు విచక్షణాధికారం ఉంటే ప్రభుత్వానికి కూడా ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు నిబంధనలు ఉంటాయని, వాటికి విరుద్ధంగా ఎలా చెబితే అలా అధికారులు చేయలేరని అన్నారు. అసెంబ్లీ సెక్రటరీపై ఒత్తిడి తేవాల్సిన అవసరం మంత్రులకు లేదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే అసెంబ్లీ సెక్రటరీ వ్యవహరిస్తారని తెలిపారు. రూల్ ప్రకారం వెళ్లాలని అధికార పక్షం కోరితే, ప్రతిపక్షం మాత్రం రూల్‌కు విరుద్ధంగా వెళ్లాలని చెప్పడం మండలి చరిత్రలో చోటుచేసుకున్న ఆశ్చర్యకర పరిణామమని బొత్స అన్నారు. ఆ విషయం కేంద్రం ఎప్పుడో చెప్పింది రాజధాని వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని కేంద్రం ఎప్పుడో చెప్పిందని బొత్స గుర్తు చేశారు. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వచ్చే ఏడాది నుంచి ‘వైఎస్సార్ చేయూత’ పథకం అమలు చేస్తామని చెప్పారు. అర్హులైన ఆయా వర్గాల పేద మహిళలకు నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్ సర్కారు అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేసిందని తెలిపారు. చంద్రబాబు నిరూపించాలి రాష్ట్రంలో 7 లక్షల పెన్షన్లు తొలగించారని ఆరోపిస్తున్న చంద్రబాబు ఆ విషయం నిరూపించగలరా? అని బొత్స సవాల్ విసిరారు. ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబు మారడం లేదని ఎద్దేవా చేశారు. లబ్ధిదారులు ఏ విధంగా సంతోషంగా ఉన్నారో మీడియా, సోషల్ మీడియా ద్వారా చూస్తున్నామని చెప్పారు. చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో కూడా పారదర్శకంగా పెన్షన్లు ఇచ్చామని గుర్తుచేశారు. -
ఎగువ సభ ఎవరికోసం?
శాసనమండలి నిర్మాణాన్ని, దాని చారిత్రక నేపథ్యాన్ని, ఆశయాలను, అధికారాలను పరిశీలిస్తే అది అసలు అవసరమా అన్న సందేహం ఎవరికైనా కలుగక మానదు. గత ముప్పది సంవత్సరాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే అనేక ఉద్యమాలు, కొత్త సామాజిక శక్తులను తెరపైకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా దళిత ఉద్యమాలు స్త్రీవాద, రైతుకూలీ, వెనుకబడిన కులాల పోరాటాలు రాజకీయ ప్రాతినిధ్యం కోరుతున్నాయి. నిర్మాణపరంగా ప్రస్తుతమున్న శాసనమండలి వీరికి ప్రాతినిధ్యం కల్పించలేదు. ప్రస్తుతమున్న కౌన్సిల్ ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు, స్థానిక సంస్థలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తుంది. షెడ్యూల్డు కులాలు, తెగలవారికి శాసనసభ, లోక్‌సభలలో సముచిత ప్రాతినిధ్యం కల్పించే నిమిత్తం వారికి రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు కల్పించారు. శాసనమండలి విషయంలో అలాంటి రిజర్వేషన్లు ఏవీ లేకపోవడంతో వారికి ఎగువసభలో సముచిత ప్రాతినిధ్యం లభించుటలేదు. మొదటి నుండి ఎగువ సభ ఉన్నత వర్గాలవారికి మాత్రమే అందు బాటులో ఉంది తప్ప దళితులకు, బలహీనవర్గాలకు, మహిళలకు కాదన్నది చారిత్రక సత్యం. రాజ్యాంగం ప్రకారం ఎగువసభ సమాజంలోని వైవిధ్యతకు ప్రాతినిధ్యం కల్పించడానికి ఉద్దేశించింది. మరి ఈ ఆశయం ఏ మేరకు నెరవేరుతున్నట్లు అన్నది ప్రశ్న. ఈ ఆశయం నెరవేరా లంటే చరిత్రలో సుదీర్ఘకాలంపాటు అణచి వేతకు, దోపిడీకి గురైన ఎస్.సి, ఎస్.టి, వెనుకబడిన కులాలు మరియు మహిళలకు రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు కల్పించి వారికి మండలిలో స్థానం కల్పించాల్సివుంది. గత 70 సంవత్సరాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఆ దిశలో ఎప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టిన ఉదంతాలులేవు. అలాంటప్పుడు దాని కొనసాగింపు ఎవరికోసం, ఎందుకోసం? అన్నది ప్రశ్న. ఎగువసభల ఏర్పాటు విషయంలో ఉన్న చారిత్రక నేపథ్యాలలో ఒకటి అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఈ సభలను ఏర్పాటుచేసి అందులో సమాజంలో మేధావులుగా గుర్తింపబడ్డ పట్టభద్రులు, ఉపాధ్యాయులతోపాటు సాహిత్యం, కళలు, శాస్త్ర, సాంకేతిక రంగాలు, సాంఘికసేవ మొదలైన రాజకీయేతర రంగాలలో నిష్ణాతులైనవారికి ఇందులో ప్రాతినిధ్యం కలి్పస్తే జాతికి వారి సేవలు ఉపయోగపడతా యని. రాష్ట్ర గవర్నర్ ద్వారా నామనిర్దేశ పద్ధ తిలో భర్తీ అయ్యేవారిలో నిష్ణాతులైన అర్హులకు ఏనాడుకూడా అవకాశం లభించలేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీచేయాలనుకునే అభ్యర్థి పట్టభద్రుడే కానవసరం లేదు. అదేవిధంగా ఉపాధ్యాయుల నియోజకవర్గంలో పోటీచేయాలనుకునే అభ్యర్థి ఉపాధ్యాయుడే కానవసరంలేదు. పోటీకి అందరూ అర్హులే. పోటీకి అర్హులే కానీ వారికి ఓటు హక్కుమాత్రం ఉండదు. ఒక వ్యక్తికి ఓటు హక్కులేకుండా పోటీచేసే హక్కు ఎలా లభిస్తుందో అర్థంకాదు. శాసన నిర్మాణంలో మండలి పాత్ర కేవలం సలహాలివ్వడానికే పరిమితం. ఆ సలహాలను శాసనసభ గౌర వించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. శాసనమండలి తాను ఆమోదించని బిల్లులను చట్టం కాకుండా కేవలం నాలుగు నెలలే జాప్యం చేయగలదు. ఏ బిల్లుకైనా శాసనమండలి ప్రతిపా దించే సవరణలకు సలహాపూర్వకమైన విలువ మాత్రమే ఉంటుంది. ఆర్థిక బిల్లుల విషయంలో ఈ మాత్రం స్వేచ్ఛ, అధికారం కూడా శాసన మండలికి లేదు. అంతేగాక రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేందుకు కౌన్సిల్ సభ్యులకు కనీసం ఓటుహక్కు కూడా ఉండదు. అలాంటప్పుడు ఎగువ సభ కొనసాగింపు అవసరమా? అన్న సందేహం ఎవరికైనా కలుగక మానదు. గత 70 సంవత్సరాలలో వివిధ రాష్ట్రాలలో ఉనికిలోవున్న ఎగువసభల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే అవి క్రమంగా ఏ విధంగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా పరిణామం చెందినవో మనకు అర్థం అవుతుంది. ఏ అధికారాలు లేని ఈ ఎగువసభల నిర్వహణకు ప్రజాధనం పెద్దమొత్తంలో దురి్వనియోగం అవుతుంది. క్రమంగా దిగజారుతున్న కౌన్సిల్ ప్రమాణాలను మరియు అది పనిచేస్తున్న తీరుతెన్నులను పరిశీలించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాసనసభ ఆ రాష్ట్రంలోని ఎగువసభ రద్దు విషయంలో తీసుకున్న నిర్ణయం సహేతుకమేకాదు. ముమ్మాటికీ హర్షణీయం.! ప్రొ.జి.లక్ష్మణ్ వ్యాసకర్త ప్రొఫెసర్, ఓయూ మొబైల్ : 98491 36104 -
కౌన్సిల్ అవసరమా?
మన రాష్ట్రంలో విధాన పరిషత్తు (లెజిస్లేటివ్ కౌన్సిల్) భవితవ్యంపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతున్నది. విధాన పరి షత్తు స్వభావ స్వరూపాలను ఈ సందర్భంలో చర్చించుకొనడం అవసరం. విధాన పరిషత్తుల చట్టం ద్వారా 1958 జూలై మొదటి తేదీ నుండి మన రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటు చేయబడింది. మనకు జూలై 1958లో కౌన్సిల్ ఏర్పడింది. అంతకు ముందు లేదు. కర్నూలు రాజధానిగా అవతరించిన ప్రత్యేక ఆంధ్రరాష్ట్రంలో కూడా లేదు. శాసనమండలికి వాస్తవంలో ఏవిధమైన అధికారాలు లేవు. శాసనసభ అంగీకరించిన బిల్లుకు శాసనమండలి సవరణలు చేసినా, తిరస్కరించినా, లేక పరిషత్తుకు సమర్పిం చబడిన తేదీ నుండి ఆ బిల్లు ఆమోదింపబడకనే మూడు మాసాలు దాటిపోయినా తిరిగి శాసనసభ దానిని పరిశీలించి మార్పులు చేర్పులతో లేదా యధాతధంగా తిరిగి ఆ బిల్లును రెండవసారి పాస్ చేసి మళ్ళీ పరిషత్తుకు పంపడం జరుగుతుంది. అప్పుడు ఆ బిల్లును పరిషత్తు త్రోసిపుచ్చినా, లేక ఆ బిల్లు పాస్ చేయకుండా ఒక మాసం పాటు అలాగే మిగిలిపోయినా శాసనసభ అంగీకరించని సవరణలతో పరిషత్తు దానిని పాస్ చేసినా శాసనసభ రెండవమారు బిల్లును ఏ రూపంలో పాస్ చేసిందో అదే రూపంలో శాసనమండలిలో కూడా పాస్ చేయబడినట్లు భావించబడుతుందని రాజ్యాంగంలోని 197వ అనుచ్ఛేదము చెబుతున్నది. అయితే ద్రవ్య సంబంధమైన బిల్లుల విషయంలో ఇంతమాత్రం ప్రాముఖ్యత కూడా శాసనమండలికి లేదు. విధాన పరిషత్తు సభ్యుల జీతభత్యాలకు అమితమైన వ్యయం తప్పదు. నెల జీతం రూ. 600, నియోజకవర్గం అలవెన్సు 300, ఫోనుకు వంద రూపాయలు. సభ్యుల దంపతులకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం. మొదటి తరగతికి ఒకటిన్నర రెట్లు ప్రయాణ భత్యం. రోజుకు రూ.45 దినభత్యం. సంవత్సరానికి మూడువేల రూపాయలు కిమ్మత్తు చేసే రైల్వే కూపనులు, వైద్య సౌకర్యం, ప్రభుత్వ అతిథి గృహాలలో వసతుల వంటి సౌకర్యాలనేకం. ఎం.ఎల్.ఎ. హాస్టళ్ళలో వీరికి జాగా చూపవలసిందే. రైల్వే కూపనులకు మారుగా నెలకు రూ.300 రొక్కంగా ఇవ్వమంటున్నారీ మధ్య. ఇవికాక, శాసనమండలి సమావేశాల ఏర్పాటుకు, ప్రసంగాలను అచ్చు వేయడానికి, సిబ్బందికి, ఇతరత్రా మరింత వ్యయం. ఇంకా శాసనమండలికొక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఉంటారు. వారికి కారు, ఫోను, సిబ్బంది వంటి సదుపాయాల కోసం మరొక మోపెడు ఖర్చులు. రాష్ట్ర ప్రజానీకం అసలు ఆశయాలు, అభీ ష్టాలు నెరవేర్చాలనే మహదాశయంతో నందమూరి నాయకత్వాన ‘తెలుగుదేశం’ విశేష జనాదరణతో అధికారంలోనికొచ్చింది. అయితే ప్రస్తుతం శాసనమండలిలో ప్రభుత్వ పక్షానికి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టే సభ్యుడు కూడా లేడు. ఉమా వెంకట్రామిరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి జి. జగన్నాథరావు ఖాళీ చేసే స్ధానాలు త్వరలో అధికార పక్షానికి రాగలవు. పెద్దఎత్తున పార్టీ మార్పిడులు జరగకపోతే ప్రస్తుత ప్రభుత్వం చేపట్టనున్న అభ్యుదయ పథకాలన్నిం టికి శాసనమండలి పెద్ద ప్రతిబంధకంగా తయారయ్యే అవకాశం లేకపోలేదు. పార్టీ మార్పిడులను ఎంతమాత్రం ప్రోత్సహించని వజ్రసంకల్పుడు ముఖ్యమంత్రి నందమూరి. అటువంటప్పుడు ఈ యిబ్బందిని అధిగమించడానికి శాసనమండలిని రద్దు గావించడం వినా మార్గాంతరం లేదు. కొత్త మంత్రివర్గంలో అధిక శాతం యువకులు, కొత్తవారు, అనుభవం లేనివారు, కల్మశం అంతకన్నా లేనివారు. ఇక శాసనమండలిలో మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామిరెడ్డితో సహా పెక్కుమంది మాజీలు ఉన్నారు. వారికి పాలనా రంగంలోని లొసుగులన్నీ కరతలామలకం. తమ వాగ్ధాటితో, కొంటె ప్రశ్నలతో యువకులైన మంత్రులను వీరు ఇబ్బంది పెట్టే అవకాశం లేక పోలేదు.అందువల్ల ఏ కోణం నుండి చూసినా శాసనమండలి రద్దు అనేది అత్యంత అభిలషణీయం. కొత్త ప్రభుత్వానికి దీనివల్ల వెసులుబాటు ఎక్కువవడమే కాక ప్రజాధనం పన్ను చెల్లించే పేదవాని ధనం దుబారా కాకుండా కొంతవరకైనా నివారణకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ చర్యకు జనాదరణ మిక్కుటంగా లభిస్తుందనడంలో సందేహం లేదు. (నాటి ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేయ డంపై అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేసిన విస్పష్ట ప్రకటనపై స్పందిస్తూ వ్యాసకర్త 19–01–1983న ఒక పత్రికలో రాసిన వ్యాసానికి సంక్షిప్త రూపం) డా. యలమంచిలి శివాజి వ్యాసకర్త రాజ్యసభ మాజీ ఎంపీ మొబైల్ : 98663 76735 -
ఏకగ్రీవ తీర్మానం
-
మండలి రద్దుపై లెఫ్ట్ యూ టర్న్!
సాక్షి, అమరావతి: పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో గవర్నర్లు, శాసన మండలి వంటివి దండగమారి వ్యవస్థలుగా అభివర్ణించిన కమ్యూనిస్టు పార్టీలు ప్రస్తుతం యూ టర్న్ తీసుకున్నాయి. ఈ రెండు వ్యవస్థలు ఆరో వేలు లాంటివని, వీటివల్ల ప్రజాధనం వృథా కావడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదని గతంలో వాదించిన లెఫ్ట్ పార్టీలు ప్రస్తుతం అందుకు భిన్నమైన గళం వినిపిస్తుండడం గమనార్హం. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసన మండలి రద్దు ప్రతిపాదన చేసినప్పుడు అందుకు మద్దతు తెలిపిన కమ్యూనిస్టులు ఇప్పుడు స్వరం మార్చారు. విధానాలు మారిపోతాయా? రాష్ట్రంలో శాసన మండలి రద్దు ఆలోచనే అప్రజాస్వామికమని సీపీఎం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే వ్యవస్థలనే రద్దు చేస్తారా? అని సీపీఐ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఆయా పార్టీల్లోని సీనియర్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకత్వాలు మారినప్పుడల్లా కమ్యూనిస్టు విధానాలు మారిపోతాయా? అని నిలదీస్తున్నారు. ఎన్టీ రామారావు హయాంలో శాసన మండలి రద్దు తీర్మానాన్ని తాము సమర్థించామని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన సీనియర్ కమ్యూనిస్టు నేత ఒకరు గుర్తుచేశారు. ప్రస్తుతం 6 రాష్ట్రాల్లోనే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండళ్లు ఉన్నాయి. ఇటీవలి వరకు జమ్మూకశ్మీర్లోనూ మండలి ఉండేది. రాష్ట్ర హోదా రద్దయి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడిన తర్వాత అక్కడ కూడా శాసన మండలి రద్దయ్యింది. అస్సాం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒకప్పుడు ఉండేవి. తర్వాత అవి రద్దయ్యాయి. శాసన మండళ్లు వద్దని చెబుతున్న కమ్యూనిస్టు పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో కౌన్సిల్‌ను రద్దు చేస్తామనే ప్రతిపాదన వచ్చీ రాకమునుపే అన్యాయం, అప్రజాస్వామికం అనడం దేనికి సంకేతమని సీనియర్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీ ఎమ్మెల్సీల్లో ఆందోళన.. అంతర్మథనం
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన రాజకీయ ప్రయోజనాల కోసం తమను మోసగిస్తున్నారని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసేలా నిర్ణయాలు తీసుకోవడంపై వారు మండిపడుతున్నారు. శాసనమండలి రద్దును కేంద్రం ఒప్పుకోదంటూ వ్యూహాత్మకంగా మాట్లాడుతూ, తమను పక్కదారి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు ఎమ్మెల్సీలు రహస్యంగా సమావేశమై వారి రాజకీయ భవిష్యత్‌పై రెండ్రోజులుగా చర్చిస్తున్నారు. చంద్రబాబు వల్లే ఈ పరిస్థితి పార్టీ కోసం త్యాగాలు చేస్తే అండగా ఉంటానని బాబు చెప్పే మాటలన్నీ గండం గట్టెక్కేవరకేనని, ఆ తర్వాత పార్టీలో తమను ఎవరూ పట్టించుకోరనే అంశంపై ఎమ్మెల్సీలు తీవ్ర సమాలోచనలు జరుపుతున్నారు. ‘పార్టీ అధినేత తీరుతో సమస్య మరింత జటిలమవుతోంది.. పార్టీకి కనుచూపు మేరలో భవిష్యత్తు కనిపించడం లేదు.. ఐదేళ్లలో రాజధానిని కనీసం పునాదులు కూడా దాటించలేని పరిస్థితే ఇప్పుడు దీనికి కారణమైంది.. జనం నమ్మే పరిస్థితే లేదు.. ఐదేళ్లూ ఏమీ చేయకుండా ఇప్పుడు రాజధాని తరలిస్తున్నారని గగ్గోలు పెట్టడాన్ని విజయవాడ ప్రజలు కూడా పట్టించుకోకపోవడం పరిస్థితికి అద్దంపడుతోంది’ అని టీడీపీ ఎమ్మెల్సీ ఒకరు గురువారం విజయవాడలోని ఓ హోటలో జరిగిన అంతర్గత సమావేశంలో ఇతర నేతలతో గట్టిగా వాదనకు దిగినట్టు తెలిసింది. ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమల అభివృద్ధికి మనం వ్యతిరేకమనే సందేశం వెళ్లిపోయిందని.. కేవలం 29 గ్రామాల పార్టీగా మాత్రమే నిలిచిందని ఆ సమావేశంలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారని విశ్వసనీయ సమాచారం. రెండ్రోజులుగా హైదరాబాద్, విజయవాడలో పలువురు ఎమ్మెల్సీలు రహస్యంగా సమావేశమై ఏం చేయాలన్న అంశంపై మల్లగుల్లాలు పడ్డారు. ఇప్పటికే భారీ వ్యతిరేకత మూటగట్టుకున్నాం చైర్మన్‌ను అడ్డుపెట్టుకుని శాసన మండలిని చంద్రబాబు అగౌరవపర్చారని, మండలి ప్రతిష్టను దిగజార్చారంటూ మండలిలో టీడీపీకి వ్యతిరేకంగా ఓటేసి, టీడీపీని వీడిన ఎమ్మెల్సీ పోతుల సునీత ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లను ఏర్పాటుచేసే బిల్లును వెనక్కి పంపడంతో ఆయా వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నామని, పేద ప్రజలు కోరుతున్న ఇంగ్లీష్ మీడియం బిల్లును తిప్పి పంపి అప్రతిష్ట పాలయ్యామని, ప్రజలకు మేలు చేసే చట్టాలను అడ్డుకుని ఏం సాధించామని ఆమె ప్రశ్నించారు. మూడు రాజధానులను రాష్ట్రమంతా స్వాగతిస్తున్నారని, ప్రజల్లో దానిపై సానుకూలత వ్యక్తమవుతుంటే.. అందుకు సంబంధించిన బిల్లుల్ని అడ్డుకోవడం ద్వారా ప్రజల్లో మరింత వ్యతిరేకతను కొనితెచ్చుకున్నామని ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్సీ ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. మండలి చైర్మన్ తాను తప్పు చేస్తున్నానంటూనే.. పార్టీకి అనుకూలంగా రెండు బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకుని చట్టసభల ఔన్నత్యాన్నే భ్రష్టుపట్టించారని, రాజకీయం కోసం టీడీపీ ఏ స్థాయికైనా దిగజారుతుందనే సంకేతం ప్రజల్లోకి వెళ్లిపోయిందని రాయలసీమకు చెందిన ఒక ఎమ్మెల్సీ ఆవేదనగా చెప్పారు. ప్రభుత్వం చేసే మంచి పనులను రాజకీయ స్వలాభం కోసం వ్యతిరేకించి, ప్రతిదాన్ని తెగేవరకూ లాగి.. మండలి రద్దు వరకూ తీసుకొచ్చిన చంద్రబాబు తమ భవిష్యత్తును అంధకారం చేస్తున్నారని ఆ ఎమ్మెల్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బాబు హామీలన్నీ మభ్యపెట్టేందుకే మండలిని రద్దు చేసే అధికారం సీఎంకు లేదని, రద్దుకు తీర్మానం చేసినా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదని, ఒకవేళ రద్దయినా మళ్లీ తాను అధికారంలోకి వచ్చాక పునరుద్ధరిస్తానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండలి రద్దు అధికారం సీఎంకు లేకపోతే ఇక ఎవరికి ఉంటుందని, గతంలో ఎన్టీఆర్ మండలిని రద్దు చేశారు కదా! అనే వాదన ఆ పార్టీ ఎమ్మెల్సీలే గుర్తుచేస్తున్నారు. మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రం ఆమోదించదని, తాను ఇప్పటికే బీజేపీ అగ్ర నాయకులతో టచ్‌లో ఉండి మాట్లాడుతున్నానంటూ చంద్రబాబు.. తమను నమ్మించడానికి నానాపాట్లు పడుతున్నారని ఆ పార్టీకి చెందిన ఓ నేత చెప్పారు. ‘మండలిలో చైర్మన్ వైఖరిని బీజేపీ తీవ్రంగా తప్పు పట్టింది. అలాంటప్పుడు బాబు చెప్పే మాటలను ఎంతవరకు నమ్మాలి? ఇది మనల్ని మభ్యపెట్టడానికి కాదా?’ అని ఓ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. కేంద్రానికి ప్రస్తుతం తమ పార్టీతో అవసరం లేదని, వారికి అవసరమయ్యే బలం తమకు లేదని కృష్ణా జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీ అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు దేశమంతా తిరిగి మోదీ, అమిత్‌షాను తిట్టి, వారిని ఓడించేందుకు కాంగ్రెస్‌తో చేతులు కలిపి.. దేశ రాజకీయాల్లో విశ్వసనీయత లేని వ్యక్తిగా ముద్రపడిన చంద్రబాబు వైఖరిని ఢిల్లీలో కమలనాథులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ‘పార్టీకి మిగతా ప్రాంతాల్లో నష్టం జరుగుతోందని స్పష్టంగా తెలిసినా, అమరావతిలో ఆయన ఆస్తులు, బినామీల భూముల కోసమే ఇదంతా చేస్తుంటే.. దానికి మనం బలికావాలా?’ అని రహస్య సమావేశంలో పలువురు ఎమ్మెల్సీల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నడిచినట్లు తెలుస్తోంది. బిల్లు అడ్డుకునే అవసరం కేంద్రానికి లేదు.. ‘ఒక రాష్ట అసెంబ్లీ ఒక తీర్మానం చేసి పంపితే, సాధారణంగా కేంద్ర ప్రభుత్వాలు దానిని అంగీకరిస్తాయి. మండలి కొనసాగినా, రద్దయినా బీజేపీకి ప్రయోజనం పెద్దగా ఉండదు. అలాంటిది బలమైన ప్రాంతీయ పార్టీ అధినేతకు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా.. మండలి రద్దును వ్యతిరేకించడం వల్ల పెద్దగా రాజకీయ ప్రయోజనం ఉండదని తెలిసీ ఎందుకు అడ్డుకుంటారు?’ అనే చర్చ టీడీపీ శ్రేణుల్లో బలంగా సాగుతోంది. ‘వైఎస్ జగన్ అంటే ఏమిటో పదేళ్లుగా ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు.. ఇన్నాళ్లూ బాబు ఏం చేశారో జనం చూశారు. ఇలాంటి పరిస్థితిలో ఎవరి విశ్వసనీయత ఏంటనేది మొన్నటి ఎన్నికల్లోనే స్పష్టంగా తేల్చారు’ అని ఓ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. అవసరానికి వాడుకుని వదిలేసే చంద్రబాబు.. ఒక మాటిస్తే దానిపై నిలబడే వ్యక్తిగా జగన్మోహన్రెడ్డి.. వీరిద్దరిలో ఎవరి వ్యక్తిత్వం ఏంటనేది బీజేపీపాటు ఇతర జాతీయ పార్టీల అధినేతలందరికీ తెలుసనే చర్చ సాగుతోంది. 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలతో దేశంలోనే బలమైన నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి అవసరం బీజేపీకి ఉందనే విషయం కొందరు టీడీపీ ఎమ్మెల్సీల మధ్య చర్చకు వచ్చింది. రాజ్యసభలో వైఎస్సార్సీపీకి ఇప్పటికే రెండు స్థానాలుండగా త్వరలో జరిగే ఎన్నికల్లో వచ్చే నాలుగు స్థానాలతో వారి సంఖ్య ఆరుకు పెరగనుంది. ఈ నేపథ్యంలో జగన్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఎందుకు వ్యవహరిస్తుందనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. శాసనమండలి రద్దు అనేది కేంద్రానికి ఏమాత్రం సంబంధం లేని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని.. ఇలాంటి సాధారణ విషయాలపై కేంద్రం బలమైన రాష్ట్ర ప్రభుత్వంతో విభేదం తెచ్చుకునే పరిస్థితి ఏమాత్రం ఉండదని చెబుతున్నారు. ఏ కోణంలో చూసినా తమ అధినేతను మోదీ, అమిత్‌షా పట్టించుకునే అవకాశం లేదని, చంద్రబాబు చెప్పే మాటలన్నీ భయంతో ఉన్న తమను నిలబెట్టుకునేందుకేననే అభిప్రాయాన్ని పలువురు టీడీపీ ఎమ్మెల్సీలు వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ అధికారమా.. ! బాబు మాటలన్నీ అబద్ధాలే వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని బట్టి.. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే మాటమీద నిలబడతారని, ఈ విషయం ఇప్పటికే పలు అంశాల్లో స్పష్టమైందని టీడీపీ నేతలే అంటున్నారు. మండలి రద్దు చేసినా, మళ్లీ తాను వచ్చాక పునరుద్ధరిస్తాననే చంద్రబాబు మాటల్ని విని నవ్వొస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్సీలు వ్యాఖ్యానిస్తున్నారు. శాసనమండలి అవసరమే లేదని, దానివల్ల సమయం, ప్రజాధనం వృథా అని 2004లో చెప్పిన తమ అధినేత ఇప్పుడు శాసన మండలిని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకోవడం, మండలి పరిణామాల నేపథ్యంలో అది ఇంకా పెరగడం, మరోవైపు పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా చెల్లాచెదురై, ఎమ్మెల్యేలను కూడా నిలుపుకోలేని పరిస్థితుల్లో ఉన్న తరుణంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడమనేది కలనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. జగన్మోహన్రెడ్డి గేట్లు తెరిస్తే ఈ పాటికే ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీకి క్యూకట్టే వారని, తమ అధినేతకు ప్రతిపక్ష హోదా ఎప్పుడో పోయేదని ఉత్తరాంధ్రకు చెందిన ఒక ఎమ్మెల్సీ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబును నమ్ముకుని మునిగిపోయే పరిస్థితి తెచ్చుకున్నామని ఆందోళన చెందుతున్నారు. టీడీపీ ఎమ్మెల్సీల పదవీకాలం.. మండలి ఛైర్మన్‌గా ఉన్న ఎంఏ షరీఫ్ సహా 15 మంది టీడీపీ ఎమ్మెల్సీల పదవీకాలం 2021 మార్చి నుంచి జూన్ మధ్య ముగుస్తుంది. లోకేష్ సహా 12 మందికి 2023 మార్చి నుంచి జులై వరకూ పదవీకాలం ఉంది. మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న యనమల రామకృష్ణుడుతోపాటు మరో ముగ్గురికి 2025 మార్చి వరకూ పదవీకాలం ఉంది. మండలి రద్దయితే వీరందరి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. -
ఏపీలో మిన్నంటిన నిరసనలు..
విశాఖ జిల్లా: మూడు రాజధానులపై టీడీపీ వైఖరికి నిరసనగా ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో చింతపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామాల నుంచి భారీ సంఖ్యలో గిరిజనులు తరలివచ్చారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చంద్రబాబు దిష్టిబొమ్మను వైఎస్సార్సీపీ కార్యకర్తలు, గిరిజనులు దహనం చేశారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని..ఎన్ని అవరోధాలు సృష్టించినా విశాఖ,కర్నూలు, అమరావతి కేంద్రాలుగా పాలన తథ్యమన్నారు. విశాఖ నగరంలో: వికేంద్రీకరణపై చంద్రబాబు తీరుకు నిరసనగా విశాఖ నగరంలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. మద్దిలపాలెం వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమయింది. ఈ నిరసన ర్యాలీలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, కన్వీనర్లు మళ్ల విజయప్రసాద్, అక్కరమాని విజయనిర్మల పాల్గొన్నారు. గుంటూరు: వికేంద్రీకరణపై చంద్రబాబు తీరు పట్ల వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేతలు మండిపడ్డారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మతో విద్యార్థులు శవయాత్ర చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతపురం: వికేంద్రీకరణ బిల్లుపై టీడీపీ వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం భారీ ర్యాలీ నిర్వహించింది. తాడిపత్రి యల్లనూరు కూడలిలో చంద్రబాబు దిష్టిబొమ్మను విద్యార్థి విభాగం నేతలు దహనం చేశారు. చంద్రబాబు, టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రాభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి: తన స్వార్థ ప్రయోజనాలు కోసం రాష్ట్రాభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల గ్రౌండ్లో మూడు రాజధానులు కావాలంటూ విద్యార్థులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, గోకరాజు నరసింహరాజు, రామరాజు పాల్గొన్నారు. నల్లజర్లలో: మూడు రాజధానులపై చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ నల్లజర్లలో రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన యువజన విభాగంనేతలు..ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి కారుమంచి రమేష్, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. తణుకులో: చంద్రబాబు వైఖరికి నిరసనగా తణుకు నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో దళిత సంఘాలు, ప్రజలు భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సుమారు 45 అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. నిడదవోలులో మహిళా కళాశాల విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నచంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన విద్యార్థులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిత్తూరు: వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుంటున్న చంద్రబాబుపై కుప్పం ద్రవిడ యూనివర్శిటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వైఖరికి నిరసనగా ఆయన దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. -
‘మోసానికి రాజు చంద్రబాబు.. సేనాధిపతి యనమల’
సాక్షి, తాడేపల్లి: మోసానికి రాజు చంద్రబాబు అయితే.. సేనాధిపతి యనమల రామకృష్ణుడని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. శనివారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి యనమల అంటూ నిప్పులు చెరిగారు. మోసాలు, కుట్రలు చేసిన ఆయన ఇప్పుడు నీతి వాక్యాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారనే భ్రమలో యనమల ఉన్నారని దుయ్యబట్టారు. మంత్రులు తాగి వచ్చారని యనమల వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. దావోస్ వెళ్ళి చంద్రబాబు,యనమల ఏమి సాధించుకొచ్చారని మంత్రి అనిల్ ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో విహార యాత్రలు చేశారని.. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను చూసి చంద్రబాబు, యనమల ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. అతితక్కువ కాలంలోనే ‘బెస్ట్ పెర్ఫార్మింగ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే నాలుగవ స్థానంలో నిలిచారన్నారు. అవినీతిలో చంద్రబాబు దేశంలో మొదటి స్థానంలో నిలిచారన్నారు. ‘మండలిలో ఏదో సాధించినట్లు తండ్రి కొడుకులు సన్మానాలు చేయించుకుంటున్నారు. మండలి రద్దు చేస్తే శాసనసభ ఎందుకని యనమల అంటున్నారు. గతంలో ప్రజా మద్దతు లేని మండలి అవసరం లేదని ఎన్టీఆర్ అన్నారు. 2004లో కౌన్సిల్ వల్ల ప్రజాధనం వృధా అని చంద్రబాబు విమర్శలు చేశారని’ అనిల్ గుర్తుచేశారు. రాష్ట్రాభివృద్ధికి టీడీపీ సహకరించక పోయినా పర్వాలేదని.. కానీ అడ్డుకుంటే సహించబోమని హెచ్చరించారు. ఎమ్మెల్సీలను కొనుగోలు చేశారంటూ యనమల ఆరోపణలను మంత్రి అనిల్ తిప్పికొట్టారు. గతంలో వైస్రాయ్ హోటల్ లో జరిగిందేమిటో యనమల సమాధానం చెప్పాలన్నారు