గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి | Madhusudhana Chary Elected legislative Council As Governor Quota MLC | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి

Published Tue, Dec 14 2021 12:49 PM | Last Updated on Tue, Dec 14 2021 12:49 PM

Madhusudhana Chary Elected legislative Council As Governor Quota MLC - Sakshi

సాక్షి, హైద‌రాబాద్:తెలంగాణలో గ‌వ‌ర్న‌ర్ కోటా నామినెటేడ్ ఎమ్మెల్సీగా సిరికొండ మ‌ధుసూద‌నాచారి శాన‌స‌మండ‌లికి ప్రాతినిధ్యం వ‌హించ‌నున్నారు. గ‌తంలో గవర్నర్‌ కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి ప‌ద‌వీకాలం ఈ ఏడాది జూన్ 16న ముగిసిన సంగతి తెలిసిందే. అయితే శ్రీనివాస్‌రెడ్డి స్థానంలో మ‌ధుసూద‌నాచారి పేరును ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివ‌ర్గం చేసిన సిఫార‌సును గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ఆమోదిందారు.

మ‌ధుసూద‌నాచారిని శాసన మండ‌లికి నామినేట్ చేశారు. ఈ మేర‌కు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి శశాంక్ గోయ‌ల్ గెజిట్ నోటిఫికేష‌న్ విడుదల చేశారు. మంగళవారం నుంచి మ‌ధుసూద‌నాచారి ప‌ద‌వీకాలం ప్రారంభం కానుంది. ఈ మేర‌కు సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement