తెలంగాణ కౌన్సిల్ చైర్మన్ పదవికి కాంగ్రెస్ పోటీ! | congress party to issue whip to its members in legislative council in telangana | Sakshi

తెలంగాణ కౌన్సిల్ చైర్మన్ పదవికి కాంగ్రెస్ పోటీ!

Published Sat, Jun 28 2014 12:44 PM | Last Updated on Tue, Mar 19 2019 5:47 PM

congress party to issue whip to its members in legislative council in telangana

హైదరాబాద్: హైదరాబాద్: తెలంగాణ కౌన్సిల్ చైర్మన్ పదవికి పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ శాసన మండలి చైర్మన్ పదవి ఎంపికపై సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీల సమావేశం నిర్వహించనున్నారు. చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేయనున్నట్టు మీడియాకు వెల్లడించారు.
 

టీఆర్ఎస్ పార్టీని చైర్మన్ ఎన్నికలో ధీటుగా ఎదుర్కొనేందుకు మైనార్టీ, ఎస్సీ ఎమ్మెల్సీల్లో ఒకరిని చైర్మన్ అభ్యర్థిగా పోటీ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. పలువురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో చేరడంతో చైర్మన్ ఎంపిక వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకున్నట్టు పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement