
మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు తీవ్ర నిరాశను కలిగించాయి : వరుదు కళ్యాణి
👉పెట్టుబడి సాయం 20 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు
👉ఇప్పుడు కేంద్రం సాయంతో కలిపి 20 వేలు ఇస్తామంటున్నారు
👉మండలి సాక్షిగా రైతుకి వెన్నుపోటు పొడిచారు
👉ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసింది
👉అన్నమో రామచంద్రా అనే పరిస్థితికి రైతును తీసుకొచ్చారు
👉జగన్ మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయం పండుగలా సాగింది
👉కూటమి పాలనలో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది
అచ్చెన్నాయుడు మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు : బొత్స
👉2016లో రుణమాఫీకి బాండ్ ఇచ్చారు
👉రుణమాఫీ చేయకుండా 2019 వరకూ ఏం చేశారు
👉మిర్చి ఒక్క టన్నైనా 11,700 రూపాయలకి కొన్నారా
👉గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలని కోరుతున్నాం
60% శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారు: బొత్స
👉గత ప్రభుత్వంలో రైతులను సకాలంలో ఆదుకున్నాం
👉విపత్తు వస్తే సీజన్ ముగిసేలోపు పరిహారం అందించాం
👉విత్తనాలు...ఎరువులు రైతుల వద్దకే తీసుకెళ్లి అందించాం
👉మా ప్రభుత్వంలో అనుసరించిన వ్యవసాయ విధానాలను నీతిఆయోగ్ కూడా ప్రశంసించింది
👉మేం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేశాం
👉వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చేనాటికి సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ చెల్లించాల్సిన బకాయిలు 5286 కోట్లు
👉వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకుంటే రైతుల పేరుతో డబ్బులు తీసుకున్నారనడం కరెక్ట్ కాదు
👉ఇలా మాట్లాడటం రైతులను అవమానపరచడమే
మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ అభ్యంతరం
👉తప్పు జరిగితే విచారణ జరిపించుకోవడం ఆయా ప్రభుత్వాల విధానం
👉తాడేపల్లి ప్యాలెస్‌లో రికార్డులు తగలబెట్టేశారనడం సరికాదు
👉రికార్డుల నుంచి మంత్రి వ్యాఖ్యలు తొలగించాలి
👉ఆధారాలుంటే రుజువుచేయండి
👉బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదు
👉తగలబెట్టినట్లు ఆధారాలుంటే కేసు ఫైల్స్‌లో ఎంక్వైరీ బైండింగ్స్‌లో చేర్చుకోండి
బుడమేరు వరద సాయంపై మండలిలో చర్చ
👉వరద బాధితుల్లో అనేకమందికి ఇంకా పరిహారం అందలేదు: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్
👉వరద సహాయం విషయంలో ప్రభుత్వం విఫలమైంది
👉ఆపరేషన్ బుడమేరు అన్నారు.. ఇప్పటివరకు ఏం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి
👉బుడమేరు గేట్లను ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రుహుల్లా
👉వరదల తర్వాత బుడమేరును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు
👉ఇప్పటికీ అనేకమంది బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు
👉ఒక ఇంటికి పరిహారం ఇచ్చి 10 ఇళ్లకు ఇచ్చినట్లు రాసుకున్నారు
👉అందరికీ సాయం అందిందని చెప్పడం పచ్చి అబద్ధం
👉కూటమి ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు: బొత్స సత్యనారాయణ
👉వైఎస్ జగన్ ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించాం
👉నేనే అందుకు బాధ్యత తీసుకున్నా
👉కూటమి సర్కార్ సాయం అందించడంలో విఫలమైంది
👉ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు
👉అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించాం
ఏపీ శాసనమండలిలో ఉచిత ఇసుకపై వాడివేడిగా చర్చ
👉కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక ధర పెరిగింది: బొత్స సత్యనారాయణ
👉విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇసుక ధర తగ్గలేదు
👉ప్రభుత్వం చెప్పినట్లు ఇసుక ఇవ్వడం లేదు
👉గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఎంతకిస్తున్నారో వెరిఫై చేయాలి
👉కూటమి నేతలు చెప్పే లెక్కలు తప్పుగా ఉన్నాయి.
👉కూటమి నేతలు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు
👉ఉచిత ఇసుక, ఇసుక అక్రమ అమ్మకాలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల స్టాక్‌ను కొత్త ప్రభుత్వానికి అప్పగించిందని.. దానిలో ఎంత స్టాక్ రికార్డెడ్‌గా జమ చేశారు?. ఎంత ఆదాయం వచ్చిందని ప్రశ్నించారు. రీచ్‌లలో ట్రాక్టర్ల నుంచి లారీల్లోకి ఇసుక వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొత్తం మెషినరీల ద్వారానే ఇసుకను తీసి లారీలకు లోడు చేస్తున్నారు. రాత్రి, పగలూ తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది’’ అని తోట త్రిమూర్తులు మండిపడ్డారు.

👉‘‘ఒక్కొక్క లారీకి సుమారు 11 నుంచి 12 వేల వరకు వసూలు చేస్తున్నారు. గత ప్రభుత్వం అప్పగించిన ఇసుకకు, చెబుతున్న లెక్కలకు తేడాలు ఉన్నాయి. మెషినరీల ద్వారా ఇసుకను మొత్తం తోడేస్తున్నారు. గత 2016లో తెచ్చిన పాలసీనే ఇప్పుడు కూడా ఉంది. పేద ప్రజలకు ఇసుక అందే పరిస్థితి లేదని తోట త్రిమూర్తులు ధ్వజమెత్తారు.
👉శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో లారీ ఇసుక ఎంతకు దొరికేది?.. ఈ రోజు ఎంతకు దొరుకుతుందంటూ కూటమి సర్కార్‌ని నిలదీశారు. ఉచిత ఇసుక అంటే టన్నుకు కనీసం 400 రూపాయలు తగ్గాలి. సామాన్యులకు ఉచిత ఇసుక అందే పరిస్థితి లేదని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment