Assembly budget sessions
-
నేటి నుంచి అసెంబ్లీ
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజల కళ్లుగప్పటం... రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై ఎవరూ ప్రశ్నించకుండా రెడ్‌బుక్ అమలుతో దృష్టి మళ్లింపు రాజకీయాలే లక్ష్యంగా సాగుతున్న సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు సోమవారం శాసనసభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. నేటి ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం చాంబర్లో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసన సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అదే సమయానికి శాసన మండలిలో గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తి అయిన అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెడతారు. మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను చదువుతారు.సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్నట్లుగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు రూ.3 వేలు చొప్పున భృతి, స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు, రైతన్నలకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం, ప్రతి మహిళకు (19–59 ఏళ్ల వయసు) నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం లాంటి వాగ్దానాలను నెరవేర్చకుండా మభ్యపెడుతున్న కూటమి సర్కారు అసెంబ్లీ సమావేశాలను సైతం డైవర్షన్ రాజకీయాలకే వినియోగించుకోవాలని ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై యథేచ్ఛగా జరుగుతున్న అఘాయిత్యాలు, లైంగిక దాడులు, హత్యలు, శాంతి భద్రతల వైఫల్యం నుంచి దృష్టి మళ్లించేందుకు.. ఇప్పుడే కొత్తగా సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినట్లు, వాటిపైనే చర్చించాలనే వైఖరితో ప్రభుత్వం ఉందనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పలుచోట్ల మైనర్ బాలికలు అత్యాచారాలు, హత్యలకు గురి కావడం నుంచి దృష్టి మళ్లించడమే లక్ష్యంగా సోషల్ మీడియా పోస్టులపై ప్రభుత్వ పెద్దలు ఇటీవల గగ్గోలు పెడుతున్నారు. ఇదే అంశాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించాలని సన్నద్ధమైనట్లు సమాచారం. మరోపక్క సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బడ్జెట్ సమావేశాల్లో గత సర్కారుపై ఆరోపణలు, నిందలు మోపేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్ హామీ కింద యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లేదంటే నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి పార్టీలు హామీలిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దీనిపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సూపర్ సిక్స్ హామీ కింద స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. దీని గురించి కూడా సర్కారు నోరు విప్పడం లేదు. ఏటా రైతన్నలకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని ఇస్తామన్నారు. ప్రతి మహిళకు (19–59 ఏళ్ల వరకు) నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయాన్ని ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లూ వీటి అమలు గురించి ప్రస్తావించకుండా డైవర్షన్ రాజకీయాలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్లో ఈ పధకాలకు కేటాయింపులు ఉంటాయో లేదో నేడు తేలనుంది. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా మరో నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుండటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది.శాసన సభ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు బందోబస్తు ఏర్పాట్లపై డీజీపీ ద్వారకా తిరుమల రావు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్‌తో ఆదివారం సమీక్షించారు. -
సీఎం మందబలంతో సభను తప్పుదోవ పట్టించారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కారు మందబలంతో శాసనసభను తప్పుదోవ పట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా సభను వాయిదా వేసుకుని పారిపోయిందని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మీడియా పాయింట్ వద్ద హరీశ్ మాట్లా డారు. ‘‘కేంద్ర ప్రభుత్వం గతంలో ఉదయ్ పథకం ద్వారా రాష్ట్రం మీద బలవంతంగా రూ.9 వేల కోట్ల భారాన్ని రుద్దింది.ఇదే విషయాన్ని నేను సభలో చెప్తే.. సీఎం మాత్రం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. 2017 నాటి నోట్లోని అంశాలను చదివి వినిపించారు. అందులో వ్యవసాయ బోరుబావుల వద్ద ఉన్న మీటర్లకు బదులు స్మార్ట్ మీటర్లు పెట్టాలనే అంశం తప్ప.. కొత్తగా మీటర్లు పెట్టాలనే ప్రస్తావన లేదు.కానీ 2021 జూన్‌లో ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి 0.5% అదనపు అప్పు తీసుకునే రాష్ట్రాలు మీటర్లు పెట్టాలని కేంద్రం నిబంధన పెట్టింది. దానికి మేం ఒప్పుకోలేదు. రైతుల ప్రయోజనాల కోసం రూ.30వేల కోట్లు వదులు కున్నాం. సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రను అమలు చేస్తున్నారేమోనని అను మానంగా ఉంది’’ అని హరీశ్ పేర్కొన్నారు. -
గల్లీకో బెల్ట్ షాప్ పెడతారా?
సాక్షి, హైదరాబాద్: మద్యం అమ్మకాలపై, బెల్ట్ షాపులపై రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు అదే మద్యంతో అధిక రాబడి కోసం ప్రయతి్నస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. అసెంబ్లీలో శనివారం బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తూ ఆయన మాట్లా డారు. మద్యం అమ్మకాల ద్వారా రూ. 7 వేల కోట్లకుపైగా అధికంగా రాబడిని బడ్జెట్లో చూపారని నిలదీశారు. ‘బీర్లపై డ్యూటీని రూ. 2,760 కోట్ల నుంచి రూ. 3,500 కోట్లకు పెంచారు.సుంకాన్ని రూ. 11,031 కోట్ల నుంచి 15,500 కోట్లకు పెంచి బీర్లు, లిక్కర్ ధరలు భారీగా పెంచబోతున్నట్లు స్పష్టం చేశారు. గతే డాది కంటే మద్యం అమ్మకాల కింద వ్యాట్ రూపంలో రూ.2 వేల కోట్లు వస్తుందంటున్నారు. ఊరికో బెల్ట్ షాప్ ఉందని గతంలో భట్టి అన్నా రు. మీరు ప్రతిపాదించిన దాన్నిబట్టి గల్లీకో బెల్ట్ షాప్ పెడతారా? మద్యాన్ని నియంత్రించి బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పి ఇప్పుడు రూ. 7 వేల కోట్లకుపైగా అదనపు ఆదాయాన్ని ఎలా పెంచుకుంటారో చెప్పండి?’ అని హరీశ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో అప్పు రూ. 3,85,340 కోట్లే బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు రూ. 3,85,340 కోట్లు మాత్రమేనని హరీశ్‌రావు అన్నారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం 6,71,757 కోట్లు అప్పు చేసిందని పదేపదే చెబుతున్నారు. కోవిడ్ సమయంలో కేంద్రం 2020–21 ఆర్థిక సంవత్సరానికి జీఎస్డీపీలో 1.75% అధికంగా అప్పులు చేసే వెసులుబాటు కల్పించింది. గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలను ఆదుకోకుండా అప్పులు తీసుకొనే స్థితికి నెట్టింది. కేంద్రం నిర్ణయాలు, కోవిడ్ వల్ల తెలంగాణ అనివార్యంగా రూ. 41,159 కోట్ల అప్పు తీసుకోవల్సిన పరిస్థితి వచి్చంది. అవన్నీ తీసేస్తే రూ. 3,85,340 కోట్లుగా అప్పు తేలుతుంది’ అని హరీశ్‌రావు చెప్పారు. వైఎస్సార్ పథకాలను కొనసాగించాం... ‘అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 అనే మంచి పథకాలని పేర్లు కూడా మార్చకుండా కొనసాగిస్తామని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే సభలో చెప్పారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను కేసీఆర్ సభలో పొగిడి కొనసాగించారు. కానీ మీరు అలాంటి హుందాతనాన్ని ప్రదర్శించకుండా కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకాలు రద్దు చేయడంతో పేద గర్భిణులపై ఎంతో ప్రభావం చూపుతుంది. మీకు భేషజాలు ఉంటే పథకాల పేర్లు మార్చుకోండి. కానీ దయచేసి పథకాలు ఆపకండి. ఆరోగ్యశ్రీకి గతేడాదితో పోలిస్తే బడ్జెట్‌ను కుదించారు’ అని హరీశ్ విమర్శించారు. గన్‌పార్క్ వద్దకు వెళ్లి కరెంటు వస్తుందా లేదా ప్రజలను అడుగుదాం? ‘బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలకు 24 గంటలు కరెంట్ ఇచ్చాం. పది నిమిషాలు టీ బ్రేక్ ఇస్తే గన్‌పార్క్ దగ్గర రోడ్డు మీదికి వెళ్దాం. నాతోపాటు డిప్యూటీ సీఎం భట్టిని రమ్మనండి. మా పాలనలో కరెంట్ బాగుందా? ఇప్పుడు బాగుందా? అని ప్రజల్ని అడుగుదాం’ అని హరీశ్‌రావు అన్నారు. -
రేవంత్ రెడ్డికి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
-
తెలంగాణ భవన్‌కు గులాబీ బాస్
సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఆయనపాల్గొననున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్‌కు కేటీఆర్ చేరుకోగా, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకుంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.రైతు రుణమాఫీ, నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రశ్నించాలని కేసీఆర్ సూచించనున్నారు. ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, ఇటీవల జరుగుతున్న పరిణామాలపై కూడా గులాబీ బాస్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది.కాగా, తెలంగాణ రాష్ట్ర శాసనసభ మూడో విడత సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 31 వరకు సమావేశాలు జరగనున్నాయి. మధ్యలో ఆదివారం 28వ తేదీన సభకు సెలవు ప్రకటించింది. 25వ తేదీన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 31వ తేదీన ద్రవ్యవినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలుపనుంది. -
TG: రేపు అసెంబ్లీకి కేసీఆర్ !
సాక్షి,హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవనున్నారు. మంగళవారం(జులై 23)నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్షనేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి హాజరవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలంగాణలో గతేడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. కాగా, మంగళవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికి మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన నేపథ్యంలో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లడతారనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో బీఆర్ఎస్ లేవనెత్తనున్న అంశాలు ఇవే..నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలుజాబ్ కేలండర్ విడుదల కోరుతూ ఉద్యమించిన ఉద్యోగార్ధులపై ప్రభుత్వ దమనకాండరాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యంచేనేత కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిఆరు గ్యారంటీల అమలు ..శాసన సభలో చట్టబద్దతరైతు రుణ మాఫీ అమల్లో ఆంక్షలు-నష్టపోతున్న రైతాంగంపంటలకు మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వ వైఫల్యంరైతుభరోసా చెల్లింపులో జాప్యం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులుగ్రామాలు ,పట్టణాలకు నిధుల విడుదలలో అలసత్వం -పారిశుధ్య నిర్వహణ సరిగా లేక కుంటు పడుతున్న ప్రజారోగ్యంఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిల విడుదలలో జాప్యం ఫలితంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు -
Updates: సభలో తీర్మానం పెట్టింది మేమే: సీఎం రేవంత్‌రెడ్డి
-
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
Telangana Assembly Budget Session.. అప్డేట్స్.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా కేసీఆర్ తెలంగాణకు తీరని నష్టం చేశారు: ఉత్తమ్ పదేళ్లలో ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేశారు రేపు కాళేశ్వరం సందర్శనకు అందరినీ ఆహ్వానిస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్ చిట్‌చాట్ ఉత్తమ్ పవర్ ప్రజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్‌లోనే ఉంది. ఉత్తమ్ తెలుగులో మాట్లాడకుండా.. ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు ఉత్తమ్ మాటలు మాకేం అర్థం కావడం లేదు.. ప్రజలకు ఏం అర్థమవుతుంది. ఆనాడు పదవులు కోసం పెదవులు మూసుకుంది: హరీష్‌రావు ప్రాజెక్టులు అప్పగిస్తామని కేంద్రానికి చెప్పి వచ్చి ఇక్కడ తంటాడు పడుతున్నారు పోతిరెడ్డిపాడుపై పేగులు తెగేదాకి కొట్లాడింది మేం అపోహలు సృష్టించి సభను తప్పుదోవ పట్టించొద్దు రాష్ట్రానికి కృష్ణా జలాల కంటే ఎక్కువ మరేముంది: మల్లు భట్టి విక్రమార్క కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్సర్కార్ అనేక తప్పులు చేసింది గత సర్కారు తప్పులను సరిచేయడానికి ఉత్తమ్ నానా తంటాలు పడుతున్నారు కేసీఆర్‌పై రేవంత్ సీరియస్ కేసీఆర్ సభకు రావాలి. పదేళ్ల పాలనలో జరిగిన పాపాలకు కేసీఆరే కారణం. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే మాటలకు విలువ లేదు. కేసీఆర్ సభకు వస్తే ఎంతసేపైనా చర్చిస్తాం. కృష్ణా జలాలపై చర్చకు కేసీఆర్ ఎందుకు రాలేదు?. కేసీఆర్ సభ రాకుండా ఫాంహౌస్‌లో దాక్కున్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ అవమానిస్తున్నారు. పద్మారావు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు. పద్మారావును ప్రతిపక్ష నేతను చేయాలి. హరీష్ కామెంట్స్.. కాంగ్రెస్ ప్రాజెక్ట్‌లను అప్పగించేందుకు ఒప్పుకుంది. సీఎం రేవంత్ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. రేవంత్ కొడంగల్‌లో ఓడిపోయి మల్కాజ్‌గిరికి ఎందుకొచ్చారు?. వాస్తవాలు చెప్తుంటే కాంగ్రెస్‌కు మింగుడుపడటం లేదు. అధికారులను బద్నాం చేసుకుంటూ ఎన్ని రోజులు తప్పించుకుంటారు. ►తెలంగాణ శాసన మండలి ఈనెల 14కు వాయిదా ఉత్తమ్ కామెంట్స్.. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ అబద్దాలు చెబుతోంది. ప్రాజెక్ట్‌లు అప్పజెప్పడంలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. హరీష్‌రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ హరీష్ రావు కోమటిరెడ్డి కామెంట్స్.. దక్షిణ తెలంగాణను నాశనం చేశారు. నల్లగొండవాసులకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. నల్లగొండ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి కేసీఆర్ నల్లగొండకు రావాలి. హరీష్‌రావు కామెంట్స్.. నల్లగొండలో సభ పెట్టినందునే ప్రభుత్వం తీర్మానం పెట్టింది. ఇది బీఆర్ఎస్ విజయం మాకు ప్రజెంటేషన్ అవకాశం ఎందుకు ఇవ్వలేదు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు అభ్యంతరం కోమటిరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్ శాసనసభలో కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు విఫలమైంది. కృష్ణా జలాలు తెలంగాణకు ప్రధాన ఆధారం. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా కృష్ణా జలాలు తరలించే ప్రసక్తే లేదు. కృష్ణా ప్రాజెక్ట్‌లను కేంద్రానికి అప్పజెప్పే ప్రసక్తే లేదు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కృష్ణా జలాల్లో అన్యాయం జరిగింది. నదీ జలాల పంపకాల్లో అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాం. తెలంగాణ వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని అందరూ ఆశించారు. కానీ, బీఆర్ఎస్ వచ్చాన కృష్ణా జలాల్లో మరింత అన్యాయం జరిగింది. ఉమ్మడి రాష్ట్రం కంటే.. ప్రత్యేక రాష్ట్రంలోనే ఎక్కువ అన్యాయం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1200 టీఎంసీలు డైవర్ట్ అయ్యాయి. ఇన్ ఫ్లో తగ్గింది.. డైవర్షన్ పెరిగింది. కృష్ణా జలాలపై గత ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేదు. ఏపీ ప్రభుత్వం అదనపు నీటని తరలిస్తున్నా మౌనంగా ఉన్నారు. పాలమూరు-రంగారెడ్డికి రూ.27500 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదు. 811 టీఎంసీల్లో కేవలం 299 టీంసీలే క్లేయిమ్ చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 50 శాతం కావాలని మాట్లాడుతున్నారు. అంతా చేసి నల్లగొండలో సభ పెడితే ఏం లాభం. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీరియస్ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రధాన చర్చ మిగులు గోదావరి జలాలపై.. కృష్ణా జలాలపై కాదు. ఏపీ సీఎం జగన్ కృష్ణా జలాలపై మాట్లాడలేదు.. గోదావరి జలాలపై మాట్లాడారు. దీన్ని కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంచేస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ షాకింగ్ కామెంట్స్ కేసీఆర్ సభను పార్టీలకు అతీతంగా బహిష్కరించాలి. కేఆర్ఎంబీపై సంతకం పెట్టి కేంద్రానికి అప్పగించింది కేసీఆరే. రాజకీయాల నుంచి కేసీఆర్ రిటైర్మెంట్ తీసుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగం చేసిన రాష్ట్రాన్ని మేము గాడిలో పెడుతున్నాం. నల్లగొండ జిల్లాకు కేసీఆర్, జగదీష్ రెడ్డి తీరని అన్యాయం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో నేడు వాడీవేడీ చర్చ కృష్ణా జలాలు, కాళేశ్వరంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. అసెంబ్లీలో రెండు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు. సభలో సభ్యులకు ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్ అయితే, సభలో తమకూ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలన్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ విజ్ఞప్తిని తిరస్కరించిన స్పీకర్ ఇక, ప్రజెంటేషన్ కాపీలను ఎమ్మెల్యేలకు ఇవ్వనున్నారు. ►చివరి రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం ►విద్యుత్, ఫారెస్ట్ కార్పొరేషన్ వార్షిక రిపోర్టును కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. ►అలాగే, దివంగత నేతలు మచిందర్ రావు, నర్సారెడ్డి, రాజమల్లుకు సంతాపం తెలపనుంది. ►బడ్జెట్‌పైచర్చ-సమాధానం ఇవ్వనున్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ►అలాగే ఇరిగేషన్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ►మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్టుపై సభలో ప్రకటన చేయనుంది. ►ఇక, టొబాకో అండ్ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ►2023-24 సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్‌పెండేచర్‌పై ప్రకటన ►మరోవైపు కృష్ణా జలాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్య మాటల యుద్ధం నడుస్తోంది. ►కృష్ణా జలాలు, కాళేశ్వరంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. -
గ్రూప్-1పై అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, అందుకే ఆ పాలనను ప్రజలు తిరస్కరించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం రేవంత్ అసెంబ్లీలో మాట్లాడారు. ‘బీఆర్ఎస్కు ప్రజలు ప్రధాన ప్రతిపక్ష బాధ్యత అప్పగించారు. అయినా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకపోవడం దురదృష్టకరం. ఆయన అసెంబ్లీకి వచ్చి మా ప్రభుత్వానికి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 9వ తేదీ మా ప్రభుత్వం రెండు నెలలు పూర్తి చేసుకుంది. ఈ రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ పరిమితి పది లక్షలకు పెంపు హామీలు అమలు చేశాం. ప్రతిపక్షం సహకరించకపోయినా ప్రజాపాలన అందిస్తూ ముందుకెళ్తాం. గవర్నర్ ప్రసంగంలో ముఖ్యమైన విషయాలను పొందుపరిచాం. అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మమ్మల్ని విమర్శిస్తూనే ఉన్నారు. వాళ్ల నాయకున్ని మెప్పించడానికి మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రజలు తెలంగాణ ఉద్యమ కాలంలో టీజీ అని బండ్ల మీద రాసుకోవడంతో పాటు గుండెల మీద పచ్చబొట్లు పొడిపించుకున్నారు. కానీ అప్పటి పాలకులు టీజీకి బదులు టీఆర్ఎస్ వచ్చేలా టీఎస్ అని పెట్టుకున్నారు. దానిని మార్చాం. రాజరిక పోకడలున్న అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయించాం’ అని రేవంత్ తెలిపారు. త్వరలోనే గ్రూప్ 1.. వయోపరిమితి 46 ఏళ్లు ‘ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలకు ఆందోళన అవసరం లేదు. మేము ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాల కల్పన ఉంటుంది. వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి త్వరలోనే గ్రూప్-1 నిర్వహిస్తాం. కొన్ని నిబంధనల వల్ల టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యమైంది. తొందరలోనే పోలీస్ శాఖలో 15వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యూనివర్సిటీల వీసీల నియామకం కోసం సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నన్ను కలిస్తే సొంత మనుషులనే వాళ్లు అనుమానిస్తున్నారు. సీఎంగా అందరినీ కలవడం వాళ్ళ సమస్యలను పరిష్కరించడం నా భాధ్యత. బీఆర్ఎస్ అవలంబించిన పద్ధతిలో నేను చెయ్యను. గతపు ఆనవాళ్లు సమూలంగా ప్రక్షాళన చేసే భాధ్యత నాది. కాళోజీ కళాక్షేత్రం తొమ్మిదేళ్లుగా పూర్తి చెయ్యలేదు గత ప్రభుత్వం’ అని రేవంత్ విమర్శించారు. గతంలో ఒకరిది అగ్గిపెట్టె డ్రామా.. ఇప్పుడొకరిది ఆటో డ్రామా ‘తెలంగాణ గీతాన్ని కేబినెట్ ఆమోదం తెలిపితే మెచ్చుకోకపోగా విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో రైతు బంధు పైసలు 9 నెలల పాటు పడ్డాయి. ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు వేశాం. ఆటో కార్మికుల పక్షాన ఒకరు ఆటోలో డ్రామాలు వేశారు. గతంలో ఒకరు అగ్గిపెట్టె డ్రామాలు ఆడితే...మొన్న ఆటో డ్రామా మరొకరు వేశారు. వాళ్ళ ఇండ్లలో నాలుగైదు ఉద్యోగాలు ఉన్నాయి...కారుణ్య నియామకాలు మాత్రం చేపట్టలేదు’ అని రేవంత్ బీఆర్ఎస్కు చురకలంటించారు. ఇదీ చదవండి.. ధర్మపురి అర్వింద్‌కు షాక్.. సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ -
4 కోట్ల మంది మా కుటుంబ సభ్యులే.. కేసీఆర్ మా పెద్ద
దేశమంటే అదానీ, ప్రధాని మాత్రమే కాదు. 140 కోట్ల మంది ప్రజలు. ఒకరు అమ్మేవారు, మరొకరు కొనేవారు. సీబీఐ, ఐటీ, ఈడీలను వేటకుక్కల్లా వాడిన నీతి బాహ్య సర్కార్ బీజేపీది. తెలంగాణపై పగబట్టినట్టు సవతి తల్లి ప్రేమ చూపుతూ కేంద్రం ఆర్థిక పరమైన ఆంక్షలతో కుంగదీసే ప్రయత్నం చేస్తోంది. ఐటీఐఆర్‌ను రద్దు చేశాక కాకతీయ టెక్స్టైల్ పార్కు తదితరాలకు ఉత్తుత్తి మాటలే తప్ప ఇప్పటిదాకా ఇచ్చింది గుండుసున్నా. నా మాటలకు కట్టుబడి ఉన్నా. – కేటీఆర్ ఇది వసుదైక కుటుంబం...’’అని మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. కేసీఆర్ జై తెలంగాణ అనడం లేదంటూ ఇటీవల కొందరు మాట్లాడుతున్నారని.. అసలు కేసీఆర్ జైతెలంగాణ అనకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. తెలంగాణతో కేసీఆర్‌కు ఉన్న పేగు బంధాన్ని తెంపే దమ్ము ధైర్యం ఎవరికీ లేవని స్పష్టం చేశారు. గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై శనివారం శాసనసభలో వాడివేడీగా చర్చ జరిగింది. దీనికి సీఎం కేసీఆర్ తరఫున కేటీఆర్ సమాధానమిచ్చారు. చర్చలో బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, ఇతర బీజేపీ నేతలపై విమర్శలు చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రగతిని వివరించారు. కేటీఆర్ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పదేళ్లు కూడా దాటని పసిగుడ్డు తెలంగాణ.. ఇప్పుడు దేశానికే టార్చ్‌బేరర్. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సూచిక. దేశానికి కాంతిరేఖ. పల్లె కన్నీరు పెడుతోందంటూ పాడుకున్న తెలంగాణ పల్లెలు ఇప్పుడు నవ చరిత్రకు నాంది పలుకుతున్నాయని కీర్తించుకునేలా పరిస్థితులు ఉన్నాయి. దేశంలో ఉత్తమ పంచాయతీలుగా 20 గ్రామాలు నిలిస్తే అందులో 19 తెలంగాణవి కావడమే దీనికి నిదర్శనం. వ్యవసాయ ఉత్పత్తుల్లో 26వ స్థానం నుంచి ఇప్పుడు పంజాబ్, హరియాణా తర్వాత దేశంలోనే మూడో స్థానానికి తెలంగాణ ఎగబాకిందని నాబార్డు నివేదికే చెప్తోంది. 2015లో 68.17 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తయితే.. ఇప్పుడు 2.02 కోట్ల టన్నులు వస్తోంది. ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రతిపక్షాలకు ఈ గణాంకాలు కనిపించటం లేదా? కొందరివి పసలేని విమర్శలు ప్రభుత్వ పథకాలు గొప్పగా ఉన్నా కొందరు వాటిపై పసలేని విమర్శలు చేస్తున్నారు. రైతుబంధును ఐక్యరాజ్యసమితి కూడా కీర్తిస్తే.. బడా వ్యక్తులకు దోచిపెడుతున్నారంటూ ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో పదెకరాలకు మించి భూమి ఉన్న వారి సంఖ్య కేవలం 3.1 శాతమే. రైతుబీమా కూడా పేద రైతు కుటుంబాలకు అండగా నిలుస్తోంది. రాష్ట్రంలో రైతు సంక్షేమం ఇలా ఉంటే మూడు వ్యవసాయ నల్ల చట్టాలు తెచ్చి రైతాంగం నడ్డి విరిచేందుకు కేంద్రం ప్రయత్నించింది. వాటిని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన 700 మంది రైతుల ప్రాణాలు తీశారు. ఇలాంటి ప్రధాని ప్రపంచంలో ఎక్కడా ఉండరు. ఎల్ఐసీ వంటి సంస్థను దోస్త్‌కు దోచిపెట్టి క్రోనీ క్యాపిటలిజంను పెంచి పోషించారు. ప్రధాని కొందరు కార్పొరేట్ వ్యక్తుల మేలు కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ సీఎం కేసీఆర్ ప్రతి నిర్ణయం వెనుక మానవీయ కోణం ఉంది. కాళేశ్వరానికి ఖర్చు తప్పా..? కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచం పొగుడుతోంది. డిస్కవరీ చానల్ ప్రత్యేక ప్రోగ్రామ్ రూపొందించి ప్రపంచం ముందుంచటం మనకు గర్వకారణం. కానీ అందులో అవి నీతి అంటూ ప్రతిపక్షాలు పసలేని విమర్శలు చేస్తున్నాయి. ముంబై–అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలుకు లక్ష కోట్లను ప్రధాని ఖర్చు పెట్చొచ్చు. కానీ 45 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే గొప్ప ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు పెడితే తప్పా? రివర్స్ పంపింగ్‌కు కాళేశ్వరం కేరాఫ్‌గా నిలిస్తే.. పచ్చటి పంటలతో కళకళలాడుతూ ఇప్పుడు పాలమూరు రివర్స్ మైగ్రేషన్‌కు చిరునామాగా నిలుస్తోంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘జోడో’ అంటూ పక్క నుంచి వెళ్లిపోం మునుగోడు ఎన్నికప్పుడు వంద మంది ఎమ్మెల్యేలను బరిలో దింపారన్న విమర్శలకు కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘అవి ఎన్నికలు.. కచ్చితంగా పోరాడుతాం. ఎంత మందితోనైనా ప్రచారం చేయిస్తాం. జోడో యాత్ర అని నడుస్తూ ఎన్నిక జరిగే ప్రాంతం పక్కనుంచి వెళ్లిపోయే రకం కాదు..’’ అని పరోక్షంగా రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్రపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్‌ది రాజకీయ యాత్ర కాదని.. వైషమ్యాలు పెంచి దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నం జరుగుతున్న సమయంలో.. దేశాన్ని ఒక్కటి చేసే భారత్‌జోడో యాత్ర అని స్పష్టం చేశారు. దీనిపై కేటీఆర్ వివరణ ఇస్తూ.. తాను మునుగోడు ఎన్నికను దృష్టిలో పెట్టుకుని మాట్లాడలేదని, ఎన్నికలు జరుగుతున్నప్పుడు గుజరాత్లో జోడోయాత్ర చేయకుండా పక్క నుంచి వెళ్లిపోవటాన్ని ప్రస్తావించానని చెప్పారు. ఇక ఈటల రాజేందర్ టీఆర్ఎస్లో బాగానే ఉండేవారని, బీజేపీలో చేరాక అసంబద్ధ విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. రెండున్నర గంటలు.. లెక్కలు, విమర్శలు.. మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో దాదాపు రెండున్నర గంటల పాటు మాట్లాడారు. పలు గణాంకాలను వివరిస్తూ, ఆయా అంశాలకు సంబంధించిన పత్రికల క్లిప్పింగ్‌లు, ఇతర పత్రాలను చూపిస్తూ ప్రసంగించారు. శుక్రవారం నాటి గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా కేంద్రంపై విమర్శలు లేకపోగా.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై కేటీఆర్ సమాధానం మాత్రం కేంద్రం తీరును విమర్శిస్తూనే సాగింది. కేటీఆర్ గత ఎనిమిదిన్నరేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. తెలంగాణ రాక ముందు ఉన్న పరిస్థితులతో బేరీజు వేసి విశ్లేషించారు. కాంగ్రెస్ పాలనను ఉటంకిస్తూ కొన్ని విమర్శలు చేసినా.. కేటీఆర్ ప్రసంగం ఆసాంతం బీజేపీ, మోదీ ప్రభుత్వమే లక్ష్యంగా సాగింది. దేశానికి గుజరాత్ మోడల్ అంటూ చేసిన ప్రచారం పూర్తి డొల్లేనని విమర్శిస్తూ.. బీజేపీ పాలిత గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో కరెంటు, రైతుల సమస్యలపై అక్కడి బీజేపీ ఎమ్మెల్యేల స్టేట్మెంట్లు, అక్కడి పత్రికల క్లిప్పింగులను ప్రదర్శించారు. మోటార్లకు మీటర్ల బిగింపు గురించి ప్రస్తావిస్తూ.. ఈ అంశంలో కేంద్రం రాసిన లేఖ ప్రతిని చూపారు. ప్రధాని మాటలన్నీ డొల్లే.. ప్రధాని మోదీ ఊదరగొట్టే మాటల్లో డొల్లతనమే తప్ప ఫలితాలు అంతంతే. కేసీఆర్ నేతృత్వంలో సాగుతున్నది ‘డబుల్ ఇంపాక్ట్ సర్కార్’. మోదీ డబుల్ ఇంజన్‌తో ఏమాత్రం పొంతన ఉండదు. సబ్కా సాథ్, సబ్కా వికాస్ అని గొప్పలు చెప్తున్నవారు చెప్పేవన్నీ ‘సబ్ బక్వాస్’. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంలా సాగుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో అందించే కళ్లద్దాలు మేడిన్ తెలంగాణ. ఈ నిజాలు ప్రతిపక్షాల కళ్లకు కనిపించడం లేదు. వారి కోసం అసెంబ్లీలో కంటి వెలుగు శిబిరం పెట్టించాలి. ప్రజాసంక్షేమం విషయంలో కేసీఆర్‌కు కులమతాలతో సంబంధం లేదు. ఆయనకు పేదరికమే గీటురాయి. దళిత బంధు లబ్ధిదారులతో సభ రాష్ట్రంలో దళిత బంధు పథకంతో ఎంత సంపద ఒనగూరిందో లెక్కలు తీసే బాధ్యతను సెస్‌కు అప్పగించాం. త్వరలో ఆ వివరాలు వస్తాయి. పథకం ప్రారంభించి త్వరలో రెండేళ్లు అవనున్న సందర్భంగా.. దాన్ని ప్రారంభించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దళిత బంధు లబ్ధిదారులతో భారీ సభ నిర్వహిస్తాం. జాతీయ స్థాయి ప్రముఖులు దీనికి హాజరవుతారు. రియల్ లీడర్‌గా తెలంగాణ చాక్లెట్ నుంచి రాకెట్ వరకు, ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ వరకు, యాప్స్ నుంచి మ్యాప్స్ వరకు ఉత్పత్తి, అభివృద్ధి చేస్తూ తెలంగాణ రాష్ట్రం రియల్ లీడర్‌గా ఎదిగింది. వరల్డ్ గ్రీన్ సిటీగా, హరితహారం ద్వారా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ప్రయత్నం చేయడంవంటి తెలంగాణ విజయాలను ‘మన్‌కీబాత్’లో ప్రస్తావించేందుకు కూడా ప్రధాని మోదీకి నోరు రాలేదు -
ఆయన బయట ఉండి ఎమ్మెల్యేలను రెచ్చగొట్టారు: అంబటి రాంబాబు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్టాడారు. ఈ సందర్బంగా ఆయన.. ‘‘బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా జరిగాయి. గతంలో కరోనా వలన అనుకున్నట్లుగా జరగలేదు. ఈసారి 12 రోజులు అనేక అంశాలపై చర్చ చేసి, నిర్ణయాలు తీసుకున్నాం. అయితే, ప్రధాన ప్రతిపక్షం రెండు సభల్లోనూ దారుణంగా ప్రవర్తించింది. వారి తీరు రాజకీయ నాయకులు, ప్రజలు సిగ్గు పడేలా ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి సభకి రానని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. మరి వాళ్ల అబ్బాయి ఎందుకు వస్తున్నాడు? ఆ పార్టీ సభ్యులు ఎందుకు వస్తున్నట్టు? ఏంటి ఈ ద్వంద్వ వైఖరి? తొలురోజే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఆరోజు నుంచి చివరి వరకు వారి డైలాగు ఒక్కటే.. అదే జంగారెడ్డిగూడెం మరణాల వ్యవహారం. మద్యం పాలసీ మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతుంటే అడ్డుకోవాలని చూశారు. వాస్తవానికి జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలే తప్ప మరేమీ లేదు. సహజ మరణాలను సారా మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు బయట ఉండి వారి పార్టీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టారు. అందుకే వారు విజిల్స్ తెచ్చి సభని ఎగతాళి చేశారు. ఆ మరోసటి రోజు చిడతలు తెచ్చి వాయించారు. ఈరోజు మంగళ సూత్రాలు తెచ్చారు. మంగళగిరిలో ఓడిపోయాక లోకేశ్‌కి బుర్ర పోయింది. జనం అతన్ని దగ్గరకు రానీయొద్దు. సభలో అనేక అంశాలపై చర్చ జరిగింది. పెగాసెస్, పోలవరం సహా అనేక అంశాలపై చర్చ జరిగింది. కానీ, ప్రతిపక్ష నేతలు సభలో కాకుండా వాళ్ల పచ్చ మీడియాలో మాట్లాడుతారు. అసహనంతో ఉన్న చంద్రబాబు.. వ్యవస్థలను అగౌరపరిచేలా చేశారు’’ అని వ్యాఖ్యలు చేశారు. -
టీడీపీ సభ్యుల ఓవరాక్షన్.. మండలి చైర్మన్‌పై ప్లకార్డులు విసిరి..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ సభ్యుల తీరు మారడం లేదు. 12వ రోజు సమావేశాల్లో భాగంగా శాసన మండలిలోనూ టీడీపీ సభ్యులు ఓవరాక్షన్ చేశారు. మండలిలో సభా కార్యకలాపాలను ఆటంకపరిచారు. విజిల్స్ వేస్తూ, చిడతలు వాయిస్తూ టీడీపీ మండలి సభ్యులు దిగజారి ప్రవర్థించారు. ఈ సందర్భంగా వారి తీరుపై చైర్మన్ మోషెన్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సభలో ఇలాంటివి చేయడం మంచిది కాదు. సభకు చిడతలు, విజిల్స్ ఎందుకు తెచ్చారు. సభలో చిడతలు వాయించడం ఏంటి..?. సభా గౌరవాన్ని కాపాడే బాధ్యత మీ మీద లేదా?. భజన చేయడం మంచి పద్ధతి కాదు. వెల్‌లోకి వచ్చి మాట్లాడే హక్కు మీకు లేదు. మీ సీట్లలో మీరు కూర్చొని మాట్లాడండి. టీడీపీ సభ్యులు కావాలనే గొడవ చేస్తున్నారు.. సభా సమయాన్ని వృద్దా చేయొద్దని మొదటి రోజు నుంచి చెబుతున్నా’ అని అన్నారు. వారు ఎంతకూ తీరు మార్చుకోకపోవడంతో టీడీపీ సభ్యులను ఈ ఒక్కరోజు చైర్మన్ సస్పెండ్ చేశారు. దీంతో టీడీపీ సభ్యుడు దీపక్ రెడ్డి పోడియం పైకి ఎక్కడానికి దూసుకెళ్లారు. దీంతో ఆయనను మార్షల్స్ అడ్డుకున్నారు. సస్పెండ్ చేస్తే ఈ దౌర్జన్యం ఏంటి అని చైర్మన్ మోషెన్ రాజు టీడీపీ సభ్యులను ప్రశ్నించారు. ఈ క్రమంలో మోషెన్ రాజుపై ప్లకార్డులు విసిరి టీడీపీ సభ్యులు బయటకు వెళ్లారు. సస్పెండైన వారిలో అర్జునుడు, అశోక్ బాబు, దీపక్ రెడ్డి, ప్రభాకర్, రామ్మోహన్, రామారావు, రవీంద్రనాథ్ ఉన్నారు. ఇది చదవండి: ఆర్ఆర్ఆర్ సినిమా భయం.. థియేటర్లో ఇనుప కంచెలు -
AP Budget 2021: 2 లక్షల 29 వేల కోట్లతో సంక్షేమ బడ్జెట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఒకరోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంచనా రూ.2,29,779.27 కోట్లుగా తెలిపారు. ఈ బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు రూ.28,237 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు బడ్జెట్లో వెచ్చించారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టున్నారు. సభ ప్రారంభం కాగానే పలువురు మాజీ ఎమ్మెల్యేల మృతిపట్ల అసెంబ్లీ సంతాపం తెలిపింది. బడ్జెట్ కేటాయింపులు ఇలా.. బీసీ ఉప ప్రణాళిక: రూ.28,237 కోట్లు ఎస్సీ ఉప ప్రణాళిక: రూ.17,403 కోట్లు ఎస్టీ ఉప ప్రణాళిక: రూ.6,131 కోట్లు కాపు సంక్షేమం: రూ.3,306 కోట్లు ఈబీసీ సంక్షేమం: రూ.5,478 కోట్లు బ్రాహ్మణ సంక్షేమం: రూ.359 కోట్లు మైనార్టీ యాక్షన్ ప్లాన్: రూ.1,756 కోట్లు చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు మహిళల అభివృద్ధి: రూ.47,283.21 కోట్లు వ్యవసాయ పథకాలు: రూ.11,210 కోట్లు విద్యా పథకాలు: రూ.24,624 కోట్లు వైద్యం, ఆరోగ్యం: రూ.13,830 కోట్లు వైఎస్సార్ పింఛన్ కానుక: రూ.17 వేల కోట్లు వైఎస్సార్ రైతు భరోసా: రూ.3,845 కోట్లు జగనన్న విద్యా దీవెన: రూ.2,500 కోట్లు జగనన్న వసతి దీవెన: రూ.2,223.15 కోట్లు వైఎస్సార్-పీఎం ఫసల్ బీమా: రూ.1802 కోట్లు డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులు: రూ.865 కోట్లు పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలు: రూ.247 కోట్లు రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు: రూ.500 కోట్లు వైఎస్సార్ కాపు నేస్తం: రూ.500 కోట్లు వైఎస్సార్ జగనన్న చేదోడు: రూ.300 కోట్లు వైఎస్సార్ వాహన మిత్ర: రూ.285 కోట్లు వైఎస్సార్ నేతన్న నేస్తం: రూ.190 కోట్లు వైఎస్సార్ మత్స్యకార భరోసా: రూ.120 కోట్లు మత్స్యకారులకు డీజిల్ రాయితీ: రూ.50 కోట్లు అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు: రూ.200 కోట్లు రైతులకు నష్ట పరిహారం: రూ.20 కోట్లు లా నేస్తం: రూ.16.64 కోట్లు ఈబీసీ నేస్తం: రూ.500 కోట్లు వైఎస్సార్ ఆసరా: రూ.6,337 కోట్లు అమ్మఒడి: రూ.6,107 కోట్లు వైఎస్సార్ చేయూత: రూ.4,455 కోట్లు రైతు పథకాలు: రూ.11,210.80 కోట్లు -
రేపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం
-
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: మొహం చాటేసిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత చంద్రబాబు మొహం చాటేశారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు హాజరుకాకూడదని టీడీఎల్పీలో నిర్ణయించినట్లు తెలిసింది. కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌కే పరిమితం కావాలనే యోచనలో చంద్రబాబు, లోకేష్ ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ వేదికగా టీడీపీ అవినీతి, అన్యాయాలను ప్రభుత్వం నిలదీస్తుందనే ఆందోళనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. రఘురామకృష్ణరాజు వ్యవహారంపై సభలో అధికారపక్షం నిలదీస్తుందని బాబు ఆందోళన చెందుతున్నారట. ఎన్440కే వైరస్ విష ప్రచారంపై సమాధానం చెప్పాల్సి వస్తుందనే భావనలో చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది. 20న అసెంబ్లీ, మండలి సమావేశాలు పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు 20వ తేదీన అసెంబ్లీతో పాటు శాసన మండలి సమావేశం కానుంది. ఆ రోజు ఉదయం 9 గంటలకు రెండు చోట్లా సమావేశం ప్రారంభమవుతుంది. కోవిడ్–19 ఉధృతి, వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఈ సమావేశాలను ఒక రోజుకే పరిమితం చేయాలా? లేదా మరి కొన్ని రోజులు నిర్వహించాలా అనే విషయంపై శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. చదవండి: పారని టీడీపీ పాచిక అసలు కుట్ర బయటపడకుండా పక్కదోవ పట్టించేందుకే?! -
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ 2021
-
సీఎం కుర్చీ నుంచి నన్నెవరూ దింపలేరు
బెంగళూరు: తనను ముఖ్యమంత్రి పదవి నుంచి ఎవరూ దింపలేరని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా మద్దతు తనకు ఉన్నంతవరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. సీఎం మార్పుపై కర్నాటకలో సాగుతున్న ప్రచారంపై శనివారం యడియూరప్ప స్పందించారు. కొందరు నేతలు పగటి కలలు కంటూ కర్ణాటకలో తనను సీఎం పదవి నుంచి తప్పిస్తారని రోజూ ప్రకటనలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఈ విషయంపై యడియూరప్ప పై వ్యాఖ్యలు చేశారు. ఉగాది తర్వాత ఏప్రిల్ 13వ తేదీన కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ ఇటీవల ప్రకటన చేశాడు. ఆయనతోపాటు మరికొందరు నాయకులు ఇలాంటి ప్రకటనలు చేస్తుండడంతో యడియూరప్ప అసెంబ్లీ వేదికగా వారికి జవాబిచ్చారు. అమిత్ షా తన వెన్నంటి ఉన్నంత వరకూ తాను న్యాయ పోరాటాలన్నింటినీ దీటుగా ఎదుర్కొని బయటకువస్తానని ధీమా వ్యక్తం చేశారు. వంద కేసులైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ప్రధానమంత్రి మోదీ, అమిత్ షాలకు తనపై విశ్వాసం ఉందని, తనను ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. కర్నాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప సవాళ్లతో సహవాసం చేస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి అసంతృప్తులు బయటకు వస్తున్నారు. 2019 జూలైలో యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో పార్టీలోని సీనియర్ నాయకులు సీఎం మార్పుపై ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నాటకలో సీఎం మార్పిడిపై రోజుకో ప్రకటన వస్తోంది. -
బెంగాల్ అసెంబ్లీలో ‘జై శ్రీరాం’..!
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో రోజురోజుకు పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాజకీయంగానే కాకుండా శాసనపరంగా కూడా ఆ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా శుక్రవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సంప్రదాయానికి భిన్నంగా సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం లేకుండానే మొదలయ్యాయి. దీనికి తోడు ఆర్థిక మంత్రి కాకుండా ముఖ్యమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది తీవ్ర వివాదాస్పదమైంది. దీన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయడం పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. సాధారణంగా బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు గవర్నర్ ప్రసంగం ఉండాలి. కానీ గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖర్‌ను ఆహ్వానించకపోవడం.. ఆర్థిక మంత్రి అమిత్ మిత్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నాడని చెప్పి సీఎం స్థాయిలో మమత బడ్జెట్ ప్రసంగం చేశారు. దీదీ చర్యపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. గవర్నర్ ప్రసంగం ఏది, ఆర్థిక మంత్రి ఎక్కడ, మీరెందుకు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని చెప్పి నిరసనకు దిగారు. అవేవి పట్టించుకోకుండా మమత బడ్జెట్ ప్రవేశపెట్టడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తూ సమావేశాలను బహిష్కరించారు. ప్రజాస్వామ్యం వ్యవస్థలో చట్టాలు చేసే కీలకమైన శాసనసభలో మతపరమైన నినాదాలు చేయడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. బీజేపీ ఎమ్మెల్యేల తీరును ఖండించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే రానుండడంతో రూ.2.99 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మమత సర్కారు ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూనే రాష్ట్రంలో టీఎంసీ అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధిని ముఖ్యమంత్రి మమత వివరించారు. -
ఎన్ని రోజులైనా రెడీ..
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై బీఏసీలో టీడీపీ డ్రామాలాడింది. వర్చువల్ సమావేశాలు నిర్వహించాలంటూ ఆచరణ సాధ్యంకాని ప్రతిపాదన చేసి చివరికి వెనక్కి తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో అందరి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శాసనసభ సమావేశాలు క్లుప్తంగా రెండు రోజులు మాత్రమే నిర్వహించడానికి వీలవుతుందని బీఏసీలో అధికారపక్షం ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే టీడీపీ తరఫున హాజరైన నిమ్మల రామానాయుడు 15 రోజులు జరపాలంటూ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ ప్రమాదం ఉన్న తరుణంలో రెండు రోజులకు మించి సభ నిర్వహించడం మంచిది కాదని తాము భావిస్తున్నామని ఒక వేళ టీడీపీ కనుక డిమాండ్ చేస్తే 40 కాదు, 50 రోజులైనా, ఎన్ని రోజులైనా అసెంబ్లీ నిర్వహణకు సిద్ధమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారని తెలిసింది. తాము ఈ ఏడాది కాలంలో ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపట్టామని, 3.98 కోట్ల మందికి రూ. 42 వేల కోట్లు వివిధ పథకాల ద్వారా నేరుగా నగదును బదిలీ చేశామని, అసెంబ్లీ ఎక్కువ రోజులు జరిగితే ప్రభుత్వం తరఫున తాము ఇవన్నీ చెప్పుకోవడానికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికీ వీలవుతుందని సీఎం అన్నారు. అయినా సరే తాము రెండు రోజులే చాలని భావిస్తున్నామన్నారు. ‘టీడీపీ కోరితే ఎన్ని రోజులైనా నిర్వహిస్తాం. కానీ వర్చువల్ అసెంబ్లీ మాత్రం సాధ్యం కాదు, దీనిపై పార్లమెంటే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అక్కడి నుంచి ఏం మార్గదర్శకాలు ఉంటాయో కూడా తెలియదు..’ అని సీఎం చెప్పినట్లు తెలిసింది. ఈ సమయంలో అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు వర్చువల్ అసెంబ్లీ నిర్వహణకు సౌకర్యాలు లేవని తెలిపారు. దాంతో రామానాయుడు ఏమీ మాట్లాడకుండా వెనక్కి తగ్గారు. మంత్రి కన్నబాబు జోక్యం చేసుకుంటూ టీడీపీ నేత జూమ్‌లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇక్కడా అలాగే జరగాలంటే కుదురుతుందా అని ఛలోక్తి విసిరారు. కాగా బయట మీడియాతో మాట్లాడిన రామానాయుడు.. తాము 15 రోజులు సమావేశాలు నిర్వహించాలంటే అధికారపక్షం అంగీకరించలేదని అన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలి కూడా రెండు రోజులే.... శాసనమండలి చైర్మన్ ఎం.ఏ.షరీఫ్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో కూడా మండలిని రెండు రోజుల పాటు నిర్వహించాలని ఖరారు చేశారు. ఎక్కువ రోజులు నిర్వహించాలని టీడీపీ ఇక్కడ కూడా కోరింది. బీజేపీ కూడా మరిన్ని రోజులు సమావేశం నిర్వహించాలని కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వివరించారు. -
విద్యుత్ సమస్యలు పూర్తిగా పరిష్కరించాం
-
'కుంతియా, ఆజాద్‌ల ఆరోపణలు అసత్యం'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి విషయంలో ప్రభుత్వంపై, పోలీసులపై కాంగ్రెస్ నేతలు కుంతియా, ఆజాద్‌లు చేసిన ఆరోపణలు అసత్యమని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. గోపన్‌పల్లి భూ ఆక్రమణలు కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ రెడ్డి కావాలనే అరెస్టు అయి జైలుకు వెళ్లాడని తెలిపారు. ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా డ్రోన్లను ఎగిరేయడం చట్ట విరుద్ధం అన్నారు. చట్టాలు తెలిసిన వారు ఇలాంటి పనులు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారన్నారు. ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు శోచనీయమని, ప్రతిపక్షాలు పసలేని పక్షాలుగా తయారయ్యాయని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తున్నప్పటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. 'అభివృద్ధి జరగలేదంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలను అచ్చంపేట నియోజకవర్గానికి ఆహ్వానిస్తున్నా. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కాంగ్రెస్ పార్టీనే కారణం. అసెంబ్లీలో ఒక నిర్మణాత్మకమైన చర్చకు తావివ్వాలని ప్రతిపక్షాలను నేను ఈ సందర్భంగా కోరుతున్నా' అంటూ బాలరాజు మీడియాకు వెల్లడించారు. -
14 నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను సెప్టెంబర్ 14న శాసనసభలో ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది డిసెంబర్లో వరుసగా రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 14న అసెంబ్లీ సమావేశాల తొలిరోజున శాసనసభలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం అనంతరం సభను వాయిదా వేస్తారు. తిరిగి సోమవారం 16న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు వారం రోజులపాటు కొనసాగి సెప్టెంబర్ 21న ముగిసే అవకాశం ఉంది. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందడం ఆలస్యమయ్యే పక్షంలో మరో రెండు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఉగాండా పర్యటనకు స్పీకర్ శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత ఉగాండా రాజధాని కంపాలాలో జరిగే కామన్వెల్త్ దేశాల 64వ పార్లమెంటరీ స్పీకర్ల సదస్సుకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెళ్లనున్నారు. 53 కామన్వెల్త్ దేశాల పార్లమెంటరీ స్పీకర్లు పాల్గొనే ఈ సదస్సు సెప్టెంబర్ 21 నుంచి 29 వరకు జరగనుంది. సదస్సులో భాగంగా 25, 26 తేదీల్లో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్ల సమావేశంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. స్పీకర్ పర్యటనకు సంబంధించిన షెడ్యూలు ఖరారైనా, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లు ఇంకా కొలిక్కిరావడం లేదు. సెప్టెంబర్ 23వ తేదీలోగా అసెంబ్లీ సమావేశాలు పూర్తికాని పక్షంలో స్పీకర్ ఉగాండా పర్యటన రద్దయ్యే అవకాశం కూడా లేకపోలేదని సమాచారం. -
సున్నా వడ్డీకి చంద్రబాబు ఎగనామం
సాక్షి, అమరావతి : ‘సున్నా వడ్డీ రుణాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం రైతులు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను పూర్తిగా దగా చేసింది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రైతులకు సున్నా వడ్డీ రుణాల కోసం రూ.11,595 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం రూ.630 కోట్లు మాత్రమే ఇచ్చింది. అంటే కేవలం 5 శాతం మాత్రమే ఇచ్చి తామేదో 100 శాతం ఇచ్చామన్నట్లుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాల కోసం రూ.3,036 కోట్లు చెల్లించాల్సి ఉండగా పూర్తిగా ఎగ్గొట్టింది. వ్యవసాయ రుణాల మాఫీ కోసం రూ.87,612 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకుంది. చంద్రబాబు నిర్వాకంతో రైతులు, అక్క చెల్లెమ్మలు పూర్తిగా నష్టపోయారు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఉదయం టీడీపీ సభ్యులు సున్నా వడ్డీ పథకంపై చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ అంశంపై గురువారమే చర్చ ముగిసినందున దానిపై ఇక చర్చించేది లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ రైతులకు సంబంధించిన విషయంలో వాస్తవాలు ప్రజలకు తెలియాల్సి ఉన్నందున ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. టీడీపీ సభ్యులు చెప్పాల్సిన విషయాలు చెప్పాక తాము పూర్తి ఆధారాలతో సహా సమాధానం చెప్పి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామంటూ చర్చకు అనుమతివ్వాలని కోరారు. ఇందుకు స్పీకర్ అనుమతించగానే ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, రామానాయుడు తదితరులు సున్నా వడ్డీ పథకంపై సూటిగా స్పందించకుండా కేవలం ప్రభుత్వంపై విమర్శలకే ప్రాధాన్యమిచ్చారు. సున్నా వడ్డీ పథకాన్ని తాము పూర్తిగా అమలు చేయలేదని చంద్రబాబు చెప్పిన గణాంకాలే వెల్లడించాయి. అనంతరం ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాధానమిస్తూ చంద్రబాబు ప్రభుత్వ తీరును ఆధారాలతో సహా ఎండగట్టారు. తన ప్రసంగానికి టీడీపీ సభ్యులు పలుమార్లు అడ్డుపడినప్పటికీ సున్నా వడ్డీ పథకం గత ఐదేళ్లలో అమలైన తీరును గణాంకాలతో సహా వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ఇలా సాగింది. బాబు గొప్పలు చెప్పుకుంటున్నారు ‘సున్నా వడ్డీ పథకాన్ని గొప్పగా అమలు చేసినట్లు.. అందుకు జాతీయ స్థాయిలో ప్రశంసలొచ్చినట్లు చంద్రబాబు చెబుతున్నారు. దానికి తోడు ఆయనకు ఎల్లో మీడియాలో ప్రాతినిధ్యం ఉంది. ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా తానా అంటే వాళ్లు తందానా అంటారు. కానీ వాస్తవాలు ఏమిటో ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి. ఇవి టీడీపీ ప్రభుత్వ హయాంలో తయారు చేసిన రికార్డులే. (చేతిలో డాక్యుమెంట్ చూపిస్తూ) దీని ప్రకారం 2014–15లో రైతులకు ఇచ్చిన మొత్తం పంట రుణాలు రూ.29,658 కోట్లు. సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయాలంటే ప్రభుత్వం రూ.1,186 కోట్లు ఇవ్వాలి. ఆ మొత్తాన్ని ఇస్తేనే బ్యాంకులు సున్నావడ్డీ రుణాలను ఇస్తాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.44.31 కోట్లు మాత్రమే. 2015–16కు గాను రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.57,085 కోట్లు. సున్నా వడ్డీ పథకం కోసం ప్రభుత్వం చెల్లించాల్సింది రూ.2,283 కోట్లు. కానీ ఈ పెద్దమనిషి ఇచ్చింది కేవలం రూ.31 కోట్లు మాత్రమే. 2016–17లో రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.58,840 కోట్లు కాగా, సున్నా వడ్డీ పథకం కోసం ప్రభుత్వం చెల్లించాల్సింది రూ.2,354 కోట్లు. కానీ చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.249 కోట్లు మాత్రమే ఇచ్చింది. 2017–18, 2018–19లో సున్నా వడ్డీ పథకానికి నిధులు ఇవ్వలేదని చంద్రబాబే నిన్న (గురువారం) విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు. కానీ నేను రికార్డులు పరిశీలించి చూడగా, ఆయన కేవలం కొంత ఇచ్చినట్లు తెలిసింది. ఆ లెక్కలూ చెబుతాను. 2017–18లో రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.67,568 కోట్లు. సున్నా వడ్డీ పథకం కోసం ప్రభుత్వం చెల్లించాల్సింది రూ.2,703 కోట్లు కాగా, ఇచ్చింది కేవలం రూ.182 కోట్లే. 2018–19లో రైతులకు ఇచ్చిన పంట రుణాలు రూ.76,721 కోట్లు. సున్నా వడ్డీ పథకం కోసం ప్రభుత్వం చెల్లించాల్సింది రూ.3,069 కోట్లు కాగా, ప్రభుత్వం ఇచ్చింది రూ.122 కోట్లు మాత్రమే. అంటే ఐదేళ్లలో సున్నా వడ్డీ పథకం కోసం ప్రభుత్వం చెల్లించాల్సింది రూ.11,595 కోట్లు కాగా, చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.630 కోట్లే. ఆ మాత్రం ఇచ్చి తామేదో సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా అమలు చేశామని, రైతులు సంతోషంగా కేరింతలు కొడుతున్నారని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. రూ.లక్ష అప్పునకు రూ.5 వేలు ఇస్తే సరిపోతుందా? సున్నా వడ్డీ పథకం కోసం చంద్రబాబు ప్రభుత్వం కేవలం 5 శాతం మాత్రమే చెల్లించింది. కానీ తామేదో సున్నా వడ్డీ పథకాన్ని వంద శాతం కచ్చితంగా అమలు చేశామన్నట్లుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆయన తీరు ఎలా ఉందంటే.. ఉదాహరణనకు మన నారాయణస్వామి అన్న రూ.లక్ష అప్పు తీసుకుని.. తర్వాత రూ.5 వేలు చెల్లించేసి.. అప్పు పూర్తిగా తీరిపోయింది.. ఇక నేనుబాకీ లేను.. అంటే కుదురుతుందా? కానీ చంద్రబాబు తీరు మాత్రం అలానే ఉంది. పైగా చంద్రబాబు బుకాయిస్తూ సభను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. దమ్మిడీ ఇవ్వలేదంటే... మామూలుగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు దమ్మిడీ ఇవ్వలేదు అంటాం. రూపాయి ఇవ్వలేదు అంటాం. దమ్మిడీ ఇవ్వలేదంటే దానర్థం దమ్మిడీ అని కాదు. లక్ష రూపాయలు ఇవ్వాల్సిన చోట నేను 2 రూపాయలు ఇచ్చాను.. అది దమ్మిడీ కంటే ఎక్కువే కదా.. కాబట్టి నేను ఇచ్చేశాను అని చెప్పినట్లు ఉంది చంద్రబాబు తీరు. 5 శాతం చెల్లించేసి 95 శాతం ఎగ్గొట్టేస్తే సరిపోతుందా? పైగా దీనికి తామేదో సున్నావడ్డీ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేశామని చెప్పుకుంటున్న అధ్వాన్నపు పరిస్థితుల్లో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. చేసిన పనికి వాళ్లు సిగ్గుతో తలదించుకోవాలి. రుణమాఫీ విషయంలోనూ అసత్యాలు వ్యవసాయ రుణాల మాఫీ విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతోంది. 2014 మార్చి 13న నిర్వహించిన 184వ ఎస్ఎల్బీసీ (స్టేట్ లెవల్ బ్యాంకర్ల కమిటీ) సమావేశం ప్రకారం రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు. కానీ చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో వ్యవసాయ రుణాల మాఫీ కోసం ఇచ్చింది కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే. అయినా సరే చంద్రబాబు నిస్సిగ్గుగా తన 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే (2019 టీడీపీ మేనిఫెస్టోను చదువుతూ) ఎన్నికల హామీలన్నీ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేశాం. మేనిఫెస్టోలోని అంశాలన్నీ అమలు చేశాం. చెప్పినవే కాదు చెప్పనివి కూడా చేశాం.. అని రాశారు. ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారు. ఈ పథకం ఉన్నట్టా.. లేనట్టా? సున్నా వడ్డీ రుణాల విషయంలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలను చంద్రబాబు ప్రభుత్వం మోసగించింది. 2016 నుంచి సున్నా వడ్డీ పథకం అమలు పూర్తిగా సున్నా. ఆగస్టు 2016 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకం కోసం రూ.2,303 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆగస్టు 2016 నాటికి పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకం కోసం చెల్లించాల్సిన రూ.733 కోట్లు కూడా ఇవ్వలేదు. అంటే మొత్తంగా డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం కోసం రూ.3,036 కోట్లు చెల్లించకుండా మోసం చేశారు. ఇలా రైతులు, అక్కచెల్లెమ్మలకు చెల్లించాల్సిన మొత్తం పూర్తిగా ఎగ్గొట్టేస్తే ఆ పథకం ఉన్నట్టా.. లేనట్టా? అందుకే అక్కడ కూర్చోబెట్టారు వ్యవసాయ రుణాలు మాఫీ చేయలేదు. రైతులకు సున్నా వడ్డీ రుణాలు రూ.11,595 కోట్లతోపాటు పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు రూ.3,036 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టారు. కానీ ఇక్కడకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తూ అసత్యాలు చెబుతున్నారు. ప్రజలు దీన్ని గమనించారు కాబట్టే వారిని అక్కడ కూర్చోబెట్టారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇప్పుడు ఉన్న 23 మంది ఎమ్మెల్యేలు కాస్త వచ్చే ఎన్నికలనాటికి 13కు తగ్గిపోతారు. లక్ష రూపాయలు ఇవ్వాల్సిన చోట ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మేము అంటే 2 రూపాయలు ఇచ్చాం కాబట్టి రుణం తీరిపోయిందని చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇన్ని అబద్ధాలు చెబుతూ నిర్మొహమాటంగా, నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే మీరు రాజీనామా చేసి పోవాలా? ఇక్కడే కూర్చోవాలా? ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. టీడీపీకి ఎక్కడా చిత్తశుద్ధి లేదు. రైతులు, మహిళలకు మేలు చేయాలన్న ఆరాటం లేదు. ఎంతసేపూ రాజకీయాలు ఎలా చేయాలి? దేన్ని వక్రీకరించాలి? ఎలా ట్విస్టు చేయాలి? అన్నదే తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య సభ జరుగుతోందంటే బాధనిపిస్తోంది. -
టీడీపీ ప్రశ్నకు ఆర్థిక మంత్రి బుగ్గన వివరణ
సాక్షి, అమరావతి: రైతులకు సున్నా వడ్డీ వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వందకోట్లను కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ప్రశ్నను లేవనెత్తడంతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వారికి వివరణ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ‘మా ప్రభుత్వం వైఎస్సార్ పేరుతో రైతులకు వడ్డీలేని రుణాల పథకాన్ని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుత బడ్జెట్లో ఈ పథకానికి రూ.100 కోట్లు కేటాయించింది. దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ డబ్బు ఎలా సరిపోతుందన్న ప్రశ్నను లేవనెత్తింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుతం జులై నెల రెండో వారంలో ఉన్నాం. ఇటీవలే ఎస్ఎల్బీసీ సమావేశంలో రూ.87 వేల కోట్లు మేరకు పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించాం. ఈ రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు వచ్చే ఏడాది నుంచి అంటే.. ఏప్రిల్ 1, 2020తో ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి, వచ్చే బడ్జెట్లో సున్నావడ్డీ రుణాలకు కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి వడ్డీలేని రుణాలకు కట్టాలి కాబట్టి కేటాయింపులు భారీగా పెరగబోతున్న విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరముంది’ అంటూ ఆర్థిక మంత్రి వివరించారు. చదవండి: అసెంబ్లీలో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన బుగ్గన చదవండి: రైతులపై వరాలు కురిపించిన ఏపీ బడ్జెట్ చదవండి: వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు -
రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది