బడ్జెట్‌పై శాసనసభలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
ఎక్సైజ్ ఆదాయం రూ.7 వేల కోట్లు ఎలా పెరుగుతుందని నిలదీత
కావాలంటే మా పథకాల పేర్లు మార్చుకోండి.. కానీ ఆపొద్దని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: మద్యం అమ్మకాలపై, బెల్ట్ షాపులపై రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు అదే మద్యంతో అధిక రాబడి కోసం ప్రయతి్నస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. అసెంబ్లీలో శనివారం బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తూ ఆయన మాట్లా డారు. మద్యం అమ్మకాల ద్వారా రూ. 7 వేల కోట్లకుపైగా అధికంగా రాబడిని బడ్జెట్‌లో చూపారని నిలదీశారు. ‘బీర్లపై డ్యూటీని రూ. 2,760 కోట్ల నుంచి రూ. 3,500 కోట్లకు పెంచారు.
సుంకాన్ని రూ. 11,031 కోట్ల నుంచి 15,500 కోట్లకు పెంచి బీర్లు, లిక్కర్ ధరలు భారీగా పెంచబోతున్నట్లు స్పష్టం చేశారు. గతే డాది కంటే మద్యం అమ్మకాల కింద వ్యాట్ రూపంలో రూ.2 వేల కోట్లు వస్తుందంటున్నారు. ఊరికో బెల్ట్ షాప్ ఉందని గతంలో భట్టి అన్నా రు. మీరు ప్రతిపాదించిన దాన్నిబట్టి గల్లీకో బెల్ట్ షాప్ పెడతారా? మద్యాన్ని నియంత్రించి బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పి ఇప్పుడు రూ. 7 వేల కోట్లకుపైగా అదనపు ఆదాయాన్ని ఎలా పెంచుకుంటారో చెప్పండి?’ అని హరీశ్ ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ హయాంలో అప్పు రూ. 3,85,340 కోట్లే
బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పు రూ. 3,85,340 కోట్లు మాత్రమేనని హరీశ్‌రావు అన్నారు. ‘బీఆర్‌ఎస్ ప్రభుత్వం 6,71,757 కోట్లు అప్పు చేసిందని పదేపదే చెబుతున్నారు. కోవిడ్ సమయంలో కేంద్రం 2020–21 ఆర్థిక సంవత్సరానికి జీఎస్డీపీలో 1.75% అధికంగా అప్పులు చేసే వెసులుబాటు కల్పించింది. గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలను ఆదుకోకుండా అప్పులు తీసుకొనే స్థితికి నెట్టింది. కేంద్రం నిర్ణయాలు, కోవిడ్ వల్ల తెలంగాణ అనివార్యంగా రూ. 41,159 కోట్ల అప్పు తీసుకోవల్సిన పరిస్థితి వచి్చంది. అవన్నీ తీసేస్తే రూ. 3,85,340 కోట్లుగా అప్పు తేలుతుంది’ అని హరీశ్‌రావు చెప్పారు.
వైఎస్సార్ పథకాలను కొనసాగించాం...
‘అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 అనే మంచి పథకాలని పేర్లు కూడా మార్చకుండా కొనసాగిస్తామని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే సభలో చెప్పారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను కేసీఆర్ సభలో పొగిడి కొనసాగించారు. కానీ మీరు అలాంటి హుందాతనాన్ని ప్రదర్శించకుండా కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకాలు రద్దు చేయడంతో పేద గర్భిణులపై ఎంతో ప్రభావం చూపుతుంది. మీకు భేషజాలు ఉంటే పథకాల పేర్లు మార్చుకోండి. కానీ దయచేసి పథకాలు ఆపకండి. ఆరోగ్యశ్రీకి గతేడాదితో పోలిస్తే బడ్జెట్‌ను కుదించారు’ అని హరీశ్ విమర్శించారు.
గన్‌పార్క్ వద్దకు వెళ్లి కరెంటు వస్తుందా లేదా ప్రజలను అడుగుదాం?
‘బీఆర్‌ఎస్ పాలనలో అన్ని రంగాలకు 24 గంటలు కరెంట్ ఇచ్చాం. పది నిమిషాలు టీ బ్రేక్ ఇస్తే గన్‌పార్క్ దగ్గర రోడ్డు మీదికి వెళ్దాం. నాతోపాటు డిప్యూటీ సీఎం భట్టిని రమ్మనండి. మా పాలనలో కరెంట్ బాగుందా? ఇప్పుడు బాగుందా? అని ప్రజల్ని అడుగుదాం’ అని హరీశ్‌రావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment