legislature
-
నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నేడు బీఆర్ఎస్ శాసనసభా పక్ష భేటీ జరగనుంది. ఎర్రవల్లి నివాసంలో ఆదివారం ఉదయం 10.30కు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కొందరు ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు. సుమారు వారం రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు, ఏడాదిలో రేవంత్ ప్రభుత్వ పాలన వైఫల్యాలతో పాటు ప్రజా సమస్యలను ప్రస్తావించాలని బీఆర్ఎస్ భావిస్తోంది.మరోవైపు సోమవారం బీఏసీ సమావేశంలో ప్రతిపాదించే ఎజెండా ఆధారంగా తమ వ్యూహానికి పదును పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కాగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది, లేనిదీ ఆదివారం జరిగే భేటీలో స్పష్టత వచ్చే అవకాశముంది. గత ప్రభుత్వం చేసిన పలు చట్టాలకు ప్రస్తుత ప్రభుత్వం సవరణలు తీసుకువస్తోంది. అలాగే విద్యుత్ కొనుగోలు అంశంపై విచారణ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు అధికార పార్టీ సన్నద్ధమవుతోంది.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వం ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తే వాటిని తిప్పికొట్టేందుకు అనుసరించే వ్యూహంపైనా ఈ భేటీలో కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. కేవలం అసెంబ్లీ సమావేశాల కోణంలోనే కాకుండా జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, బీఆర్ఎస్ ప్రతిస్పందించాల్సిన తీరుపై కేసీఆర్ సూచనలు చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జిషీట్ నేడుసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫ ల్యాలపై ఆదివారం ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ చార్జిషీట్ విడుదల చేయనుంది. మాజీ మంత్రి హరీశ్ రావు, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు, బీ ఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యక్రమంలో పాల్గొంటారు. ‘నమ్మించారు.. నట్టేట ముంచారు. ఏడాది కాంగ్రెస్ పాలన చూస్తే.. వంచనే తప్ప ఏ వర్గానికి జరిగిన మేలు లేదు.. అన్ని వర్గాలను విజయవంతంగా రోడ్డెక్కించారు’..అని బీఆర్ఎస్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. -
రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై రోజుకు 48 అఘాయిత్యాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై అత్యాచారాలు, హత్యలు , దాడులకు సంబంధించి రోజుకు సగటున 48 కేసులు నమోదవుతున్నాయి. ఈ లెక్కన కూటమి ప్రభుత్వం వచ్చిన జూన్ నుంచి అక్టోబర్ నెలల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 7,393 కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వమే స్వయంగా శాసనసభలో వెల్లడించిన లెక్కలివి. శాసనసభలో వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా ప్రభుత్వం అధికారికంగా ఈ వివరాలు వెల్లడించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటినుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మితిమీరిపోయాయి. నిత్యం లైంగికవేధింపులు, హత్యాచారం, హత్య ఘటనలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలే లైంగికవేధింపులు, అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు సైతం వెలుగు చూశాయి. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయకుండా నిందితుల పక్షానే నిలబడుతున్న ఘటనలు అనేకం. కొన్ని సందర్భాల్లో బాధితులు రాజీ పడాలంటూ బెదిరింపులకు సైతం దిగుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణే లేకుండాపోయింది. ఆ ఆరోపణలను ప్రభుత్వం వెల్లడించిన లెక్కలు బలపరుస్తున్నాయి. బయటకిరాని కేసులు మరెన్నో ఉన్నాయన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి.జూన్ నుంచి రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరిగిన అఘాయిత్యాల్లో కొన్ని.. » సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ ముస్లిం బాలికను అపహరించి హత్యకు పాల్పడ్డారు. నాలుగు రోజుల తరువాత బాలిక ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఆ చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనలో చిన్నారి అదృశ్యమైన రోజే తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, ఆ బాలికను రక్షించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. విచారణ సరిగా చేయకపోవడంతో బాలిక ప్రాణాలే పోయాయి. సమీపంలోని అనుమానిత ప్రాంతాల్లో వెదకడంలోనూ పోలీసులు విఫలమయ్యారు. » ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు జాన్ 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. » అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ జూలైలో ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఐషర్ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడితో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ కుటుంబం ఆందోళన చేయడంతో ఎనిమిది రోజుల తర్వాత ఆగస్టు 2న పోలీసులు కేసు నమోదు చేశారు. » శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తోటపాలెంలో ఓ యువతిని టీడీపీ నేత లైంగికంగా వేధించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె జూన్ 14న మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దాంతో పోలీసులు జూన్ 16న కేసు నమోదు చేశారు. »కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని బాత్ రూమ్‌లలో రహస్య కెమెరాలతో విద్యా ర్థి నుల వీడియోలు తీసిన ఘటనతో యావత్ రాష్ట్రం హడలెత్తిపోయింది. వందలాది విద్యా ర్థి నులు అర్ధరాత్రి ఆందోళనకు దిగడం సంచలనం సృష్టించింది. అంతటి తీవ్రమైన ఉదంతాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసేసింది. » నంద్యాల జిల్లా ముచ్చిమర్రులో ఓ చిన్నారిని అపహరించుకునిపోయి అత్యాచారం చేసి హత్య చేసినా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. నేటికీ ఆ చిన్నారి మృతదేహం ఆచూకిని పోలీసులు కనిపెట్టలేకపోయారు. » సీఎం బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం పరిధిలో కామాంధులు అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. -
ఏయ్.. తోలు తీస్తా కొడకల్లారా.. బయట కూడా తిరగనివ్వ
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో శుక్రవారం ఎమ్మెల్యే దానం నాగేందర్ సంయమనం కోల్పోయారు. బీఆర్ఎస్ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో మైక్ ఆన్‌లో ఉండడంతో శాసనసభ ప్రత్యక్ష ప్రసారంలో వెళ్లడం, సభలో వినిపించడంతో గందరగోళానికి దారితీసింది. అసలు ఏం జరిగిందంటే.. హైదరాబాద్‌లో సుస్థిర అభివృద్ధి అంశంపై స్పీకర్ లఘు చర్చను ప్రారంభించి దానం నాగేందర్‌కు మైక్ ఇచ్చారు. నాగేందర్ మాట్లాడటం ప్రారంభించగానే.. ఆయన వైపు తిరిగి ‘నువ్వు ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావు’అంటూ బీఆర్ఎస్ సభ్యులు గట్టిగా నిలదీశారు. నాగేందర్ ఇవేమీ పట్టించుకోకుండా మాట్లాడుతుండగా, వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పదేపదే ప్రశ్నించటంతో నాగేందర్ తీవ్ర అసహనానికి గురయ్యారు.ఆ క్రమంలోనే సహనం కోల్పోయి.. ‘నన్ను ఏయ్ అంటారా’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు మళ్లీ నాగేందర్‌ను ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావంటూ నిలదీయటంతో.‘ఏయ్ మూసుకో రా..నీయమ్మ.. తోలు తీస్తా కొడుకా ఒక్కొక్కరిది.. నీ యమ్మ బయట కూడా తిరగనీయరా. ఏం అనుకుంటున్నార్రా మీరు...తోలు తీస్తా...బయట కూడా తిరగనియ్య.. రారా.’అంటూ మాట్లాడటంతో సభ్యులంతా విస్తుపోయారు. వెంటనే మేల్కొన్న కాంగ్రెస్ సభ్యులు నాగేందర్ వద్దకు వచ్చి మైక్ ఆన్‌లో ఉందని, అలా మాట్లాడొద్దని సూచించారు. ఇంతలో కొందరు బీఆర్ఎస్ సభ్యులు నాగేందర్ వైపు దూసుకొచ్చి తమను బూతులు తిడతావా అంటూ నిలదీశారు. రండిరా చూసుకుందాం.. అంటూ నాగేందర్ కూడా వారితో బాహాబాహికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ సభ్యులు ఆయన్ను నిలువరించారు. అటువైపు బీఆర్ఎస్ సభ్యులను వారి పార్టీ, కాంగ్రెస్ సభ్యులు కొందరు ఆపి వెనక్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత దానం తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా సభలోనే ఏవో కాగితాలు చదువుతూ ఉండిపోయారు. ఖండించిన అక్బరుద్దీన్ సభ వెలుపల ఉన్న మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ వెంటనే సభలోకి వచి్చ. దానిపై స్పందించారు. సీనియర్ సభ్యుడైన దానం నాగేందర్ సభలో అన్‌పార్లమెంటరీ పదాలు వాడడం ఏమాత్రం సబబు కాదని, సభకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశా>రు. బీఆర్ఎస్ సభ్యులు కూడా అన్‌పార్లమెంటరీ పదాలు వాడుతూ తనను మాట్లాడనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఆ సందర్భంలో తాను ఆగ్రహం వ్యక్తం చేశానని, కావాలని అలాంటి పదాలు ఉచ్ఛరించలేదని, దానిపై ఎవరికైనా బాధ కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నానని దానం పేర్కొన్నారు.ఆ వ్యాఖ్యలను పరిశీలించి రికార్డుల్లో నుంచి తొలగించే విషయమై నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ పేర్కొన్నారు. అయి తే, తాను మాట్లాడింది హైదరాబాద్ నగర మాండలికంలో భాగమేనంటూ దానం నాగేందర్ పేర్కొనటం కొసమెరుపు. మాట్లా డేందుకు మైక్ ఇవ్వాలని స్పీకర్‌ను బీఆర్ఎస్ సభ్యులు అడగ్గా ఆయన ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. -
నైపుణ్య శిక్షణకు స్కిల్స్ వర్సిటీ
సాక్షి, హైదరాబాద్: వృత్తి నైపుణ్యాలు లేకపోవడంతో ఉద్యోగాలు రాక దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నైపుణ్యం లేక గల్ఫ్ దేశాలకు వెళ్లడం వల్ల కష్టాలపాలు అవుతున్నా రన్నారు. ఈ నేపథ్యంలో వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో వర్సిటీకి ఈ పేరు పెట్టామని చెప్పారు.లక్షలాదిమంది యువతకు ఉపాధి కల్పించడమే ఈ వర్సిటీ లక్ష్యమని పేర్కొన్నారు. నైపుణ్య యూనివర్సిటీలో మొత్తం 17 కోర్సులుంటాయని, తొలి ఏడాది ఆరు కోర్సులతో ప్రారంభిస్తున్నామని, 2 వేల మందికి ప్రవేశాలు కల్పిస్తామని వివరించారు. గురువారం శాసనసభలో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ’ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. తర్వాత జరిగిన చర్చలో సీఎంతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. 57 ఎకరాల్లో పీపీపీ పద్ధతిలో..‘ముచ్చర్లలో 57 ఎకరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి అక్కడ తరగతులు ప్రారంభిస్తాం. అప్పటివరకు సమయం వృథా కాకుండా ఈ ఏడాదే గచ్చిబౌలి ప్రాంతంలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీలో ఆరు కోర్సులు ప్రారంభిస్తాం.స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్, ఇ–కామర్స్ అండ్ లాజిస్టిక్స్, స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్.. ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, స్కూల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్, స్కూల్ ఆఫ్ రిటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ గేమింగ్ అండ్ కామిక్స్ కోర్సులు ప్రారంభిస్తాం. పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులకు ఆయా పరిశ్రమల ప్రతినిధులే శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ఉద్యోగాలు కూడా కల్పిస్తారు.ఈ మేరకు దేశంలోని ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. రెడ్డీస్ ల్యాబ్స్ ఫార్మాస్యూ టికల్ వైపు, బ్యాంకింగ్ విషయంలో ఎస్బీఐ, కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్‌లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, రిటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్కు సంబంధించి రిటైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వీఎఫ్ఎక్స్ అసోసియేషన్ వారు ముందుకొచ్చారు..’ అని సీఎం వివరించారు. ఏడాదికి రూ.50 వేలు ఫీజు‘ఏడాదికి రూ.50 వేలు నామమాత్రపు ఫీజుతో శిక్షణ అందిస్తాం. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తాం. హాస్టల్ వసతి కల్పిస్తాం. భవిష్యత్తులో జిల్లాల్లోనూ వర్సిటీ పరిధిలో కాలేజీలు ఏర్పాటు చేస్తాం. యూనివర్సిటీలో 3 నెలల నుంచి 6 నెలలు శిక్షణ ఇచ్చి సర్టిపికెట్లు ఇస్తారు.అలాగే రెండు మూడేళ్ల డిప్లొమా కోర్సులు కూడా అందిస్తాం. డిగ్రీ పట్టాలు కూడా ఇస్తారు. తర్వాత వాళ్లు పీజీ, పీహెచ్డీ కూడా చేసుకోవచ్చు. యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో ప్రముఖ వ్యాపారవేత్తను చైర్మన్‌గా, చాన్స్‌లర్‌గా, ప్రసిద్ధిగాంచిన వారిని వైస్ చాన్స్లర్లుగా నియమించాలని భావిస్తున్నాం. స్కిల్స్ యూనివర్సిటీపై ప్రధాన ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ వచ్చి సూచనలు ఇస్తే సంతోషించేవాళ్లం. కానీ ఆయన సభకు రాలేదు.అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. వచ్చిన వారు వాకౌట్ చేసి వెళ్లిపోయారు..’ అని రేవంత్ విమర్శించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాందీ, రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌లు దేశ పురోభివృద్ధికి చేసిన కృషిని ముఖ్యమంత్రి వివరించారు. నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హైటెక్ సిటీకి పునాదులు వేశారని, ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలకు ప్రస్తుతం మనవారే సీఈవోలుగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థులు, పాఠశాలల విద్యార్థులు సైతం డ్రగ్స్, గంజాయికి బానిసలవుతున్నారని, వారిని వాటి నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. వర్గీకరణపై నిర్ణయానికి ప్రత్యేకంగా అసెంబ్లీప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసి రిజర్వేషన్ల వర్గీకరణపై నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ అన్నారు. వర్గీకరణ కోసం తరాలకు తరాలు నిరీక్షించాయని చెప్పారు. వారికీరోజు శుభదినమని పేర్కొన్నారు. దళిత బిడ్డలు ఓట్లేస్తేనే మా అక్కలు గెలిచారన్నారు. సెట్విన్, ఐటీఐలను మూసేస్తారా: ఒవైసీ‘స్కిల్స్ వర్సిటీ రావడం వల్ల ఇప్పటికే ఉన్న సెట్విన్, ఐటీఐ, యూత్ సర్వీసెస్ వంటి వాటికి ఇబ్బందులు రావా..? వాటిని మూసేస్తారా?’ అని మజ్లిస్ పక్ష నేత అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. తాము స్కిల్స్ యూనివర్సిటీకి వ్యతిరేకం కాదని, కానీ ఇప్పటికే ఉన్న వాటి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వర్సిటీ సెలెక్ట్ కమిటీలో మైనారిటీలకు కూడా అవకాశం ఉండాలన్నారు. కాగా సీఎం బదులిస్తూ.. ఐటీఐ, సెట్విన్ వంటి వాటిని మూసివేయబోమని చెప్పారు.జిల్లాలకు విస్తరించాలినైపుణ్య విశ్వవిద్యాలయ సేవలను జిల్లా కేంద్రాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సూచించారు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే నైపుణ్య శిక్షణ కార్యకలాపాలు సాగుతున్నాయని తెలిపారు. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు నిదర్శనమని కాంగ్రెస్ సభ్యుడు యెన్నం శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ వర్సిటీకి గవర్నర్ వైస్ చాన్స్‌లర్‌గా ఉండేలా చూడాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ కోరారు.నైపుణ్య అంతరాన్ని తగ్గించేందుకే: శ్రీధర్‌బాబు విద్య, ఉపాధి మధ్య ఉన్న నైపుణ్య అంతరాన్ని భర్తీ చేయడానికి స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచి, ఉపాధిలో అంతర్జాతీయంగా పోటీ పడేలా చేయడమే దీని ముఖ్యోద్దేశమన్నారు. దేశంలోని పలు యూనివర్సిటీల ఏర్పాటును అధ్యయనం చేసిన తర్వాతే బిల్లును రూపొందించినట్లు తెలిపారు. జర్మనీ, దక్షిణ కొరియా, చైనా, సింగపూర్ వంటి దేశాలు తమ విద్యా వ్యవస్థతో వృత్తి విద్యలను ఎలా అనుసంధానం చేశాయో పరిశీలించినట్టు చెప్పారు. చట్టబద్ధంగా రిజర్వేషన్లు: డిప్యూటీ సీఎం భట్టియూనివర్సిటీ బిల్లుపై చర్చకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బదులిస్తూ.. సభ్యులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. చట్టబద్ధంగా ఉన్న రిజర్వేషన్లన్నింటినీ అమలు చేస్తామన్నారు. గతంలో ప్రారంభించిన ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు అమలు చేయటం లేదని, కానీ ఇందులో మాత్రం చట్టప్రకారం అన్నింటినీ అమలు చేస్తామని, గవర్నింగ్ బాడీలో కూడా అనుసరిస్తామని తెలిపారు. మేస్త్రీ లాంటి సాధారణ కోర్సులు కూడా వర్సిటీలో ఉంటాయన్నారు.వాయిదా తీర్మానాల తిరస్కరణసాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా దేవాలయ భూ ముల కబ్జా, పురాతన దేవాలయాల నిరాదరణపై బీజేపీ సభ్యుడు హరీశ్‌బాబు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తిరస్కరించారు. అలాగే టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటం, ఆర్టీసీలో కార్మిక సంఘాల పునరుద్ధరణ, 2017 ఆర్టీసీ వేతన సవరణకు సంబంధించిన బాండ్ల బకాయిల చెల్లింపులపై కూనంనేని సాంబశివరావు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను కూడా తిరస్కరించినట్టు స్పీకర్ ప్రకటించారు. -
బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్యే ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: ‘మహిళలను అవమానపరిచిన ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి.. నహీ చలేగా నహీ చలేగా..తానాషాహి నహీ చలేగా..’అన్న బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు, నిరసనల మధ్య తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లు 2024–25కు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. సభలో గందరగోళం నేపథ్యంలో కీలకమైన ఈ బిల్లుపై బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులకు మాట్లాడే అవకాశం లభించలేదు. ఈ పరిస్థితుల్లోనే ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టగానే కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ ఆమోదం తెలిపారు. అనంతరం ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపినట్లు సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. దద్దరిల్లిన సభ ‘వెనకాల ఉండే అక్కలు..ఇక్కడ ముంచి అక్కడ తేలిన్రు. ఆ అక్కల మాటలు విన్నారనుకో.. జూబ్లీ బస్టాండ్‌లో కూర్చోవాల్సి వస్తది..’అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల అరుపులు, కేకలు, నినాదాలతో సభ అట్టుడుకింది. ఈ నేపథ్యంలో మధ్యా హ్నం 1.20 గంటలప్పుడు వాయిదా పడిన అసెంబ్లీ తిరిగి 3.30 గంటలకు ప్రారంభమైంది. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడాల్సిందిగా బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు.అయితే తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి సీటు నుంచి లేచి నిలుచున్నా రు. సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి కూడా ఆమెకు మద్దతుగా లేచి నిలుచున్నారు. స్పీకర్ అంగీకరించకుండా ఏలేటిని మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కౌశిక్‌రెడ్డి, వివేకానంద, మల్లారెడ్డి, మా గంటి గోపీనాథ్, డాక్టర్ సంజయ్, కాలేరు వెంకటేశ్ తదితరు లు ఆందోళనకు దిగారు.అయినా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడడం ప్రారంభించడంతో.. సబిత, సునీత, లక్ష్మి పోడియం వద్దకు వెళ్లి తమకు అవకాశం ఇవ్వాలని సభాపతిని కోరారు. కేటీఆర్, ఇతర సభ్యులు తమ సీట్ల నుంచి లేచి నిలబడి సబితకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మహేశ్వర్‌రెడ్డి మాట్లాడిన తర్వాత సబితా ఇంద్రారెడ్డికి అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పినా, బీఆర్ఎస్ సభ్యులు వినిపించుకోలేదు. సబితకు అవకాశం ఇవ్వాలి: అక్బర్ ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కల్పించుకుని సబితా ఇంద్రారెడ్డి పేరు తీసుకుని సీఎం మాట్లాడారు కాబట్టి, సమాధానం చెప్పే హక్కు ఆమెకు ఉంటుందని అన్నారు. సబితకు స్పీకర్ అవకాశం ఇవ్వడమే సబబని చెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎవరి పేరును ప్రస్తావించలేదని అన్నారు. సీఎం సభలో ఎవరి పేరూ ఎత్తకుండా చేసిన వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి సమాధానమిచ్చారని, దానిపై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారని, ఆ అంశం ముగిసిందని స్పష్టం చేశారు. మహేశ్వర్‌రెడ్డి మాట్లాడకపోతే కాంగ్రెస్ సభ్యుడు గడ్డం వివేక్ (చెన్నూరు)కు మైక్ ఇవ్వాలని సూచించడంతో వివేక్‌కు స్పీకర్ అవకాశం ఇచ్చారు.వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలువివేక్ మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన తీవ్రమైంది. కేటీఆర్‌తో సహా బీఆర్ఎస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ‘ముఖ్యమంత్రి అహంకార వైఖరి నశించాలి’, ‘సీఎం డౌన్‌డౌన్’, తదితర నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అయినా వివేక్ తన ప్రసంగాన్ని కొసాగించారు. కేటీఆర్, సబిత తదితరులు వివేక్‌ను ప్రసంగం ఆపమని కోరినా ఆయన పట్టించుకోలేదు. దీంతో సబిత, సునీత, కోవా లక్ష్మి ఎమ్మెల్యేల సీట్ల దగ్గర కింద కూర్చొని నిరసన తెలిపారు. మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్ దగ్గర ఆందోళన కొనసాగించారు.ఈ పరిస్థితుల్లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్.. మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబుల వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను ఉద్దేశించి స్పీకర్.. ‘మీరు చాలా జంటిల్‌మ్యాన్, ఇలా వ్యవహరించడం తగదు. ద్రవ్య వినిమయ బిల్లు ఇంపార్టెంట్ అని మీరే చెప్పారు. ఈ బిజినెస్ మంచిది కాదు..’అని వ్యాఖ్యానించారు. అయినా బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు ఆగలేదు. చప్పట్లు కొడుతూ సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో మంత్రి సీతక్క మైక్ తీసుకొని ‘సీఎం ఎవరినీ ఏమీ అనలేదు. మీరు గతంలో మహిళ అని చూడకుండా గవర్నర్‌ను కూడా అవమానించారు.నన్ను అసెంబ్లీలో నాలెడ్జ్ లేదని అవమానించారు. చప్పట్లు కొడుతూ రోడ్ల మీద ఆడుతున్నారా? అసెంబ్లీలోనా? ’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గొడవ జరుగుతుండగానే ఆర్థిక మంత్రికి.. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం కోరాల్సిందిగా స్పీకర్ సూచించడం, భట్టి బిల్లును ప్రవేశపెట్టడం, బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించడం వెంట వెంటనే జరిగిపోయాయి. అనంతరం స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించగా.. సభ వాయిదా పడడానికి ముందు సీఎం సభలోకి ప్రవేశించారు. -
సీఎం అబద్ధాలకు అంతేలేదు
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో పాలక పక్షం ఆత్మరక్షణలో పడినప్పుడల్లా సీఎం రేవంత్‌రెడ్డి సభా నాయకుడిగా ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని అబద్ధాలతో చర్చలను పక్కదారి పట్టిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఆదర్శంగా ఉండాల్సిన సభా నాయకుడు ప్రతి అసెంబ్లీ సమావేశాల్లోనూ అబద్ధాలు మాట్లాడుతున్నారని, వరుస అబద్ధాలతో సభ ఔన్నత్యాన్ని తగ్గిస్తున్నారని విమర్శించారు. సీఎం సభను తప్పుదోవ పట్టిస్తున్న తీరుపై ఇప్పటికే వాయిదా తీర్మానం ఇచ్చామని, సభా హక్కుల ఉల్లంఘన నోటీసు కూడా ఇస్తామని తెలిపారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. అన్నీ అబద్ధాలే‘ప్రస్తుత అసెంబ్లీ తొలి సమావేశంలో మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నేరుగా నీటిని లిఫ్ట్ చేయడం సాధ్యం కాదని రిటైర్డు ఇంజనీర్లు చెప్పిన అంశంపై రేవంత్ సభను తప్పుదోవ పట్టించారు. ప్రస్తుత సమావేశాల్లో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు అంశంలో తమకు అనుకూలంగా ఉన్న వాక్యాన్ని మాత్రమే చదివి అందులోని కొన్ని పదాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ మంత్రులపై రేవంత్‌రెడ్డి అసత్యాలు చెప్తున్నారు.పులిచింతల ప్రాజెక్టు విషయంలో నాటి కాంగ్రెస్ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పెదవులు మూసుకున్నారు. పోతిరెడ్డిపాడు, పులిచింతల ప్రాజెక్టులపై కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా 2005లో ఆరుగురు బీఆర్ఎస్ మంత్రులు రాజీనామా చేశారు. ఎల్ఆర్ఎస్ కింద ఎలాంటి రుసుము లేకుండా క్రమబద్ధీకరణ చేయాలని కోర్టుకు వెళ్లిన కోమటిరెడ్డి.. ఇప్పుడు డబ్బులు వసూలు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనపై ద్వంద్వ విధానంతో వ్యవహరిస్తున్నారు..’అని హరీశ్‌రావు విమర్శించారు. 18 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు గుండు సున్నా‘బీఆర్ఎస్ పని అయిపోయిందని అధికార పక్షం అంటోంది. కానీ దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలు సహా 18 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఒక్క ఎంపీ సీటూ దక్కలేదు. 1984 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏనాడూ సొంత బలంతో కేంద్రంలో అధికారంలోకి రాలేదు. 28 పారీ్టలతో ఏర్పడిన ఇండియా కూటమిలో కాంగ్రెస్‌కు వచ్చింది 22 శాతం ఓట్లు, 99 సీట్లు మాత్రమే. తెలంగాణలో రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ను ఓడించింది బీఆర్ఎస్ పారీ్టయే..’అని మాజీమంత్రి గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో పెదవులు మూసుకున్న రేవంత్ ‘తెలంగాణ ఉద్యమ సమయంలో పదవుల కోసం రేవంత్‌రెడ్డి పెదవులు మూసుకున్నారు. ఉద్యమంలో భాగంగా మేం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తే.. రేవంత్ కనీసం రాజీనామా పత్రం జిరాక్స్ కాగితం కూడా ఇవ్వలేదు. ఉద్యమకారుల బలిదానానికి ఇలాంటి నేతలే కారణం. ఉద్యమకారులపైకి రైఫిల్‌తో వెళ్లిన రేవంత్.. ఇప్పుడు తనకు తాను తెలంగాణ చాంపియన్‌గా చెప్పుకుంటున్నారు. కేసీఆర్ తెచి్చన తెలంగాణ వల్లే రేవంత్ సీఎం అయ్యారు. దివంగత మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి తనకు తాను జాతీయవాదిగా చెప్పుకున్నారు. రేవంత్‌ను ఆయన పురుగులా చూసేవారు. తాను జీవించి ఉన్న కాలంలో ఎన్నడూ రేవంత్‌ను కనీసం దగ్గరకు కూడా రానివ్వలేదు..’అని హరీశ్ అన్నారు. -
దొంగతనాలు చేసినోడివి.. సంచులు మోసి జైలుకెళ్లినోడివి..!
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డిలకు.. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి మధ్య మాట ల యుద్ధం జరిగింది. పరస్పర విమర్శలు, ఆరోపణలతో సభ వేడెక్కింది. కిరాయి హత్యలు, దొంగతనాలు, జైలుకు వెళ్లడాల నుంచి రాజీనామాల సవాళ్ల దాకా వెళ్లింది. సోమవారం సభలో విద్యుత్ పద్దుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డి ఆవేశంగా మాట్లాడారు. మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని జగదీశ్‌రెడ్డిని ఉద్దేశిస్తూ..‘‘ఆయనలో ఉక్రోషం చూస్తుంటే.. చర్లపల్లి జైలులో ఉన్నట్టుగా ఉంది’’అని వ్యాఖ్యానించారు.దీనికి జగదీశ్‌రెడ్డి కౌంటర్ ఇస్తూ.. ‘‘చర్లపల్లి జైలు జీవితం ఆయనకు (రేవంత్‌కు) అనుభవం. కాబట్టే మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ తాను అక్కడికే వెళతానని భావి స్తున్నారేమో! నాకైతే ఉద్యమకాలంలో చంచల్‌గూడకు వెళ్లి న జైలు జీవితం గుర్తుకొస్తోంది. సీఎంకు మాత్రం చర్లపల్లి జైలులో గడిపినదే గుర్తుకొస్తోంది’’అని కామెంట్ చేశారు. మిల్లులో దొంగతనం చేస్తే ఏం చేశారో తెలుసు! జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. ‘‘సూర్యాపేట బియ్యం మిల్లులో దొంగతనం చేస్తే మిల్లర్లు ఎవరిని పట్టుకుని చెట్టుకు కట్టేశారో.. నిక్కరేసుకున్న పిల్లాడ్ని అడిగినా చెప్తాడు..’’అని వ్యాఖ్యానించారు. మంత్రి వెంకట్‌రెడ్డి మరిన్ని వివరాలు చెప్తారన్నారు. వెంటనే మంత్రి వెంకట్‌రెడ్డి లేచి జగదీశ్‌రెడ్డిని ఉద్దేశిస్తూ.. ‘‘ఈయన గ్రామానికి చెందిన సమితి మాజీ అధ్యక్షుడు మదన్‌మోహన్‌రెడ్డి హత్య కేసులో ఏ–2 నిందితుడు. భిక్షం అనే వ్యక్తి హత్య కేసులో ఈయన, వాళ్ల నాన్న ఏ–6, ఏ–7 నిందితులు.రామిరెడ్డి హత్య కేసులో ఏ–3 నిందితుడు. ఆ సమయంలో నల్గొండ జిల్లా నుంచి బహిష్కరించారు కూడా. ఇక మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్ పెట్రోల్ బంక్‌లో జరిగిన దొంగతనం కేసులోనూ ఉన్నారు. మద్య నిషేధం సమయంలో కర్ణాటక నుంచి దొంగతనంగా మ ద్యం తెప్పించినందుకు మిర్యాలగూడ పోలీసుస్టేషన్లో ఇ ప్పటికీ కేసు ఉంది. దొంగతనాలు, కిరాయి హత్యలు తప్ప ఉద్యమాలు చేశాడా?’’అంటూ ఆరోపణలు గుప్పించారు. నిరూపించు.. లేకుంటే ముక్కు నేలకు రాయి! కోమటిరెడ్డి వ్యాఖ్యలతో విపక్ష బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహంగా సీట్ల నుంచి లేచి నిరసన వ్యక్తం చేశారు. ఈ దశలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఆయన (కోమటిరెడ్డి) మాటలను రికార్డుల నుంచి తొలగించాలి. లేదా ఆరోపణలకు ఆధారాలు చూపించాలి. అలా చూపిస్తే.. ఇదే సభలో ముక్కు నేలకు రాస్తా. రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటా.రుజువు చేయకపోతే కోమటిరెడ్డితోపాటు సీఎం కూడా ముక్కునేలకు రాసి రాజీనామా చేయాలి’’అని సవాల్ విసిరారు. దీనితోపాటు ‘‘చెత్తగాళ్ల మాటలు.. చెత్త మాటలు.. వాటిని రికార్డుల నుంచి తొలగించండి. నాపై వారు చేసిన ఆరోపణలపై సభా కమిటీ వేయండి..’’అని స్పీకర్‌ను కోరారు. తనపై రాజకీయ కక్షతో పెట్టిన ఆ హత్యకేసులను కోర్టు ఎప్పుడో కొట్టివేసిందని వివరించారు. కోర్టు చుట్టూ తిరిగినది నిరూపిస్తా.. వెంటనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోక్యం చేసుకుని.. ‘‘జగదీశ్‌రెడ్డి హత్య కేసులో కోర్టు చుట్టూ 16 ఏళ్లు తిరిగారని నిరూపిస్తా. నేను అన్నది నిరూపించకపోతే ఇదే సభలో మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నల్గొండ ఎస్పీ, కోర్టు నుంచి రికార్డులు తెప్పించండి’’అని పేర్కొన్నారు. ఈ సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ జోక్యం చేసుకుని.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ట్రెజరీ బెంచ్ నుంచి అలాంటి వ్యాఖ్యలు వస్తాయని, సబ్జెక్టుపై మాట్లాడాలని జగదీశ్‌రెడ్డికి సూచించారు.జగదీశ్‌రెడ్డి బదులిస్తూ.. ‘‘స్పీకర్ ఇలా వ్యాఖ్యానించడం సరికాదు. నేనెక్కడా విషయాన్ని పక్కదారి పట్టించలేదు. సీఎం, కోమటిరెడ్డిలే సంబంధం లేని అంశాలను ప్రస్తావించారు’’అని పేర్కొన్నారు. దీనిపై సభావ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం చెప్పారు. సభ్యులను అవమానించేలా మాట్లాడిన జగదీశ్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంచులు మోసి జైలుకెళ్లింది మీరేనంటూ.. కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని జగదీశ్‌రెడ్డి పదేపదే కోరడంతో స్పీకర్ స్పందించారు. రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌ను ఉద్దేశించి జగదీశ్‌రెడ్డి విమర్శలు చేశారు. ‘‘మా నేత కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడే. మీలాగా సంచులు మోసే చంద్రుడు కాదు. సంచులు మోసి జైలుకు పోయింది మీరే’’అని వ్యాఖ్యానించారు. దీనిపై అధికారపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం లేవనెత్తారు. ఈ దశలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. తర్వాత జగదీశ్‌రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు.జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపుశాసనసభలో సీఎం, ఇతరులను ఉద్దేశించి బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డి చేసిన పలు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. తర్వాత తాను మాట్లాడుతానంటూ బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్‌రావు అనుమతి కోరగా.. స్పీకర్ తిరస్కరించారు. దీనితో బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులు స్పీకర్ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేయగా.. స్పీకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా మర్యాదలు కాపాడాలని కోరారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు తమ కురీ్చల వద్దకు వెళ్లారు. -
సీఎం మందబలంతో సభను తప్పుదోవ పట్టించారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కారు మందబలంతో శాసనసభను తప్పుదోవ పట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా సభను వాయిదా వేసుకుని పారిపోయిందని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మీడియా పాయింట్ వద్ద హరీశ్ మాట్లా డారు. ‘‘కేంద్ర ప్రభుత్వం గతంలో ఉదయ్ పథకం ద్వారా రాష్ట్రం మీద బలవంతంగా రూ.9 వేల కోట్ల భారాన్ని రుద్దింది.ఇదే విషయాన్ని నేను సభలో చెప్తే.. సీఎం మాత్రం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. 2017 నాటి నోట్లోని అంశాలను చదివి వినిపించారు. అందులో వ్యవసాయ బోరుబావుల వద్ద ఉన్న మీటర్లకు బదులు స్మార్ట్ మీటర్లు పెట్టాలనే అంశం తప్ప.. కొత్తగా మీటర్లు పెట్టాలనే ప్రస్తావన లేదు.కానీ 2021 జూన్‌లో ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి 0.5% అదనపు అప్పు తీసుకునే రాష్ట్రాలు మీటర్లు పెట్టాలని కేంద్రం నిబంధన పెట్టింది. దానికి మేం ఒప్పుకోలేదు. రైతుల ప్రయోజనాల కోసం రూ.30వేల కోట్లు వదులు కున్నాం. సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రను అమలు చేస్తున్నారేమోనని అను మానంగా ఉంది’’ అని హరీశ్ పేర్కొన్నారు. -
గల్లీకో బెల్ట్ షాప్ పెడతారా?
సాక్షి, హైదరాబాద్: మద్యం అమ్మకాలపై, బెల్ట్ షాపులపై రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు అదే మద్యంతో అధిక రాబడి కోసం ప్రయతి్నస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. అసెంబ్లీలో శనివారం బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తూ ఆయన మాట్లా డారు. మద్యం అమ్మకాల ద్వారా రూ. 7 వేల కోట్లకుపైగా అధికంగా రాబడిని బడ్జెట్లో చూపారని నిలదీశారు. ‘బీర్లపై డ్యూటీని రూ. 2,760 కోట్ల నుంచి రూ. 3,500 కోట్లకు పెంచారు.సుంకాన్ని రూ. 11,031 కోట్ల నుంచి 15,500 కోట్లకు పెంచి బీర్లు, లిక్కర్ ధరలు భారీగా పెంచబోతున్నట్లు స్పష్టం చేశారు. గతే డాది కంటే మద్యం అమ్మకాల కింద వ్యాట్ రూపంలో రూ.2 వేల కోట్లు వస్తుందంటున్నారు. ఊరికో బెల్ట్ షాప్ ఉందని గతంలో భట్టి అన్నా రు. మీరు ప్రతిపాదించిన దాన్నిబట్టి గల్లీకో బెల్ట్ షాప్ పెడతారా? మద్యాన్ని నియంత్రించి బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పి ఇప్పుడు రూ. 7 వేల కోట్లకుపైగా అదనపు ఆదాయాన్ని ఎలా పెంచుకుంటారో చెప్పండి?’ అని హరీశ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో అప్పు రూ. 3,85,340 కోట్లే బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు రూ. 3,85,340 కోట్లు మాత్రమేనని హరీశ్‌రావు అన్నారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం 6,71,757 కోట్లు అప్పు చేసిందని పదేపదే చెబుతున్నారు. కోవిడ్ సమయంలో కేంద్రం 2020–21 ఆర్థిక సంవత్సరానికి జీఎస్డీపీలో 1.75% అధికంగా అప్పులు చేసే వెసులుబాటు కల్పించింది. గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలను ఆదుకోకుండా అప్పులు తీసుకొనే స్థితికి నెట్టింది. కేంద్రం నిర్ణయాలు, కోవిడ్ వల్ల తెలంగాణ అనివార్యంగా రూ. 41,159 కోట్ల అప్పు తీసుకోవల్సిన పరిస్థితి వచి్చంది. అవన్నీ తీసేస్తే రూ. 3,85,340 కోట్లుగా అప్పు తేలుతుంది’ అని హరీశ్‌రావు చెప్పారు. వైఎస్సార్ పథకాలను కొనసాగించాం... ‘అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 అనే మంచి పథకాలని పేర్లు కూడా మార్చకుండా కొనసాగిస్తామని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే సభలో చెప్పారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను కేసీఆర్ సభలో పొగిడి కొనసాగించారు. కానీ మీరు అలాంటి హుందాతనాన్ని ప్రదర్శించకుండా కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకాలు రద్దు చేయడంతో పేద గర్భిణులపై ఎంతో ప్రభావం చూపుతుంది. మీకు భేషజాలు ఉంటే పథకాల పేర్లు మార్చుకోండి. కానీ దయచేసి పథకాలు ఆపకండి. ఆరోగ్యశ్రీకి గతేడాదితో పోలిస్తే బడ్జెట్‌ను కుదించారు’ అని హరీశ్ విమర్శించారు. గన్‌పార్క్ వద్దకు వెళ్లి కరెంటు వస్తుందా లేదా ప్రజలను అడుగుదాం? ‘బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలకు 24 గంటలు కరెంట్ ఇచ్చాం. పది నిమిషాలు టీ బ్రేక్ ఇస్తే గన్‌పార్క్ దగ్గర రోడ్డు మీదికి వెళ్దాం. నాతోపాటు డిప్యూటీ సీఎం భట్టిని రమ్మనండి. మా పాలనలో కరెంట్ బాగుందా? ఇప్పుడు బాగుందా? అని ప్రజల్ని అడుగుదాం’ అని హరీశ్‌రావు అన్నారు. -
కొలువుదీరిన కొత్త సభ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త శాసన సభ కొలువుదీరింది. 16వ శాసన సభ సమావేశాలు శుక్రవారం ఉదయం 9:46 గంటలకు ప్రారంభం అయ్యాయి. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో తొలి రోజు శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. శనివారం అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. తొలిరోజే ప్రభుత్వం సభా సంప్రదాయాలను తుంగలో తొక్కింది. వాస్తవంగా సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతిపక్ష నేతకు అవకాశం కల్పించాలి. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలి. అయితే, ప్రతిపక్ష నేతకు సముచిత గౌరవం ఇవ్వకుండా మంత్రులందరూ ప్రమాణం చేసిన తర్వాత చివర్లో ప్రమాణం చేయించింది. తద్వారా మున్ముందు ప్రతిపక్షం పట్ల తన వైఖరి ఏ విధంగా ఉండబోతోందో మొదటిరోజే స్పష్టంగా తెలియజెప్పింది. సీట్ల సంఖ్య ఎలా ఉన్నా 40 శాతం ఓట్లతో అత్యంత బలమైన పార్టీగా వైఎస్సార్సీపీ ఉంది.ఆ పార్టీకి ఉన్న ప్రజా బలాన్ని కూడా ప్రభుత్వం విస్మరించింది. 2019లో కొత్త అసెంబ్లీ కొలువుదీరినప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పటి విపక్ష నేత చంద్రబాబును సముచితంగా గౌరవించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుతో ప్రమాణం చేయించింది. ఆ తర్వాతే ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, మిగిలిన సభ్యులు ప్రమాణం చేశారు. ప్రతిపక్ష నేతకు గౌరవం ఇవ్వాలనే సదుద్దేశంతో అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చంద్రబాబు చేత సీఎం తర్వాత ప్రమాణం చేయించి గౌరవించింది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదనే సాకుతో టీడీపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మంత్రులందరి తర్వాత ప్రమాణం చేయించి సభా సంప్రదాయాలను కాలరాసింది. నిజానికి ప్రతిపక్ష హోదాకు 10 శాతం సభ్యులు ఉండాలనే నిబంధనం ఏ చట్టంలోనూ లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లోక్‌సభ తొలి స్పీకర్ మౌలంకర్ సభలో ఇచ్చిన రూలింగ్‌ను కొన్ని రాజకీయ పార్టీలు అవసరార్ధం వాడుకుంటున్నాయి. కానీ చాలా రాష్ట్రాలలో అధికారపార్టీలు మాజీ ముఖ్యమంత్రులకు, ప్రతిపక్ష నేతలకు సముచిత గౌరవం ఇస్తూ సత్సాంప్రదాయాలను పాటిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం అలాంటి వాటిని తుంగలో తొక్కింది. 2019లో టీడీపీకి వచ్చిన ఎమ్మెల్యే సీట్లు 23 మాత్రమే. అప్పట్లో ఆ పార్టీకి ఇప్పుడు వైఎస్సార్సీపీకి వచ్చిన ఓట్లకన్నా తక్కువ ఓట్లే వచ్చాయి. గెలిచిన 23 మంది సభ్యుల్లోనూ ఐదుగురు టీడీపీని వీడి బయటకు వెళ్లిపోయారు. మిగిలిన కొద్ది మందిలో ఇంకొందరు ఆ పార్టీని వీడేలా చేసి, చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనుకుంటే అప్పటి ప్రభుత్వానికి పెద్ద కష్టం కాదు. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఆ ఆలోచన లేకపోవడంతో టీడీపీ సభ్యుల జోలికి వెళ్లకుండా చంద్రబాబుకు అప్పటి ప్రభుత్వం ప్రతిపక్ష నేత గౌరవం ఇచ్చింది. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా సభా సాంప్రదాయాలను పక్కనపెట్టి మాజీ ముఖ్యమంత్రిని అవమానపరిచేలా వ్యవహరించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్షరక్రమంలో సభ్యుల ప్రమాణం శాసన సభ ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత సీఎం చంద్రబాబునాయుడు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ తర్వాత మంత్రులు అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం సభలోని సభ్యులందరికీ వైఎస్ జగన్ అభివాదం చేశారు. ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలతో, అనంతరం అక్షర క్రమంలో మిగిలిన ఎమ్మెల్యేలందరితో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ సహా వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన 11 మంది, జనసేనకు చెందిన 21 మంది, బీజేపీకి చెందిన 8 మంది, టీడీపీకి చెందిన 131 మంది ఎమ్మెల్యేలు మొత్తం 171 మంది ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఏడుగురు సభ్యులు ఆంగ్లంలో, మిగిలిన వారందరూ తెలుగులో ప్రమాణం చేశారు.టీడీపీకి చెందిన ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు, కాకినాడ ఎమ్మెల్యే వి. వెంకటేశ్వరరావు (కొండబాబు) వ్యక్తిగత కారణాలతో ప్రమాణస్వీకారం చేయలేదు. వీరితో ప్రొటెం స్పీకర్ శనివారం ప్రమాణం చేయిస్తారని తెలిసింది. తొలి రోజు శాసన సభ సమావేశం మొత్తం ప్రమాణ స్వీకారాలతోనే నడిచింది. అనంతరం సభను శనివారానికి ప్రొటెం స్పీకర్ వాయిదా వేశారు. అసెంబ్లీ మెట్లకు నమస్కరించిన సీఎం చంద్రబాబు శాసన సభ సమావేశాలకు వచ్చిన సీఎం చంద్రబాబు ముందుగా అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద మెట్లకు దండం పెట్టి లోనికి వెళ్లారు. ఆయన ముఖ్యమంత్రి ఛాంబర్లో అడుగు పెట్టే ముందు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. అంతకుముందు ఉండవల్లిలోని తన నివాసం అసెంబ్లీకి వస్తూ వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విష్ణుకుమార్ రాజు తొలి రోజు శాసన సభ సమావేశాల్లో బీజేపీకి చెందిన విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మాజీ సీఎం వైఎస్ జగన్ సభలోకి ప్రవేశించిన వెంటనే ఆయన దగ్గరకు విష్ణుకుమార్ రాజు వెళ్లి నమస్కారం చేశారు. కొద్దిసేపు ఆయనతో సంభాషించారు. అనంతరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల వద్ద చాలా సేపు కూర్చుని వారితో ముచ్చటించారు. -
ఫ్యాను గాలి వీచింది
సాక్షి, అమరావతి: రాష్ట్రమంతా ఫ్యాను గాలి ఉధృతంగా వీచిందని, ఓటర్లలో అధిక శాతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని, ఆ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ప్రముఖ సెఫాలజిస్టులు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లతో అత్యధిక శాసన సభ, లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని తేల్చి చెప్పారు. ‘సాక్షి’ టీవీ సోమవారం రాత్రి నిర్వహించిన చర్చలో ప్రముఖ సెఫాలజిస్టులు ‘ఆరా’ మస్తాన్, ‘ఆత్మసాక్షి’ మూర్తి, ‘రేస్’ కిషోర్, ‘ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్’ ఇంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సానుకూల ఓటుతో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వస్తోందని వారంతా స్పష్టం చేశారు.సీఎం జగన్ పాజిటివ్ ప్రచారానికి ప్రజలు సానుకూలంగా స్పందించారుగత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 142కు పైగా శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పాం. అదే ఫలితాలు వచ్చాయి. 18 రాష్ట్రాల్లో మేం నిర్వహించిన సర్వేలు నిజమయ్యాయి. సైకో పోవాలి.. సైకిల్ రావాలి, ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే నినాదాలతో టీడీపీ నెగెటివ్ ప్రచారం చేసి సెల్ఫ్ గోల్ చేసుకుంది.టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తును ప్రజలు అవకాశవాద పొత్తుగా భావించారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పి ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడంలో టీడీపీ కూటమి విఫలమైంది. ఐదేళ్లు సంక్షేమ పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు మంచి చేసిన సీఎం వైఎస్ జగన్.. మళ్లీ అధికారంలోకి వస్తే మరింత మంచి చేస్తానంటూ చేసిన పాజిటివ్ ప్రచారం పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారు. నేను సర్వేలో చెప్పిన 126 స్థానాలకంటే అధిక స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయం. – ‘ఆత్మసాక్షి’ మూర్తివైఎస్సార్సీపీకి 120 సీట్లకంటే ఎక్కువే వస్తాయి..సంక్షేమం అభివృద్ధి పథకాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచికి కృతజ్ఞ్ఞతలు చెబుతూ ప్రజలు వైఎస్సార్సీపీకి ఓట్లు వేసినట్లు మా సర్వేలో వెల్లడైంది. టీడీపీ కూటమి మొదటి నుంచి నెగెటివ్ ప్రచారానికే పరిమితమైంది. మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో కూడా టీడీపీ కూటమి విఫలమైంది. ఇది కూటమిని తీవ్రంగా దెబ్బతీసింది. సానుకూల ఓటుతో వైఎస్సార్సీపీ 120 స్థానాల కంటే అధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయం. – రేస్ కిశోర్గ్రామీణ, పట్టణ ప్రాంతాలూ వైఎస్సార్సీపీ వైపేముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపు నిలబడ్డారు. నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి ఆధునికీకరించి, ఇంగ్లిష్ మీడియంలో పిల్లలకు చదువులు చెప్పడం అగ్రవర్ణాలనూ ఆకట్టుకుంది.సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు సీఎం జగన్ లబ్ధి చేస్తుంటే.. రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చుతున్నారంటూ టీడీపీ, ఇతర విపక్షాలు విమర్శించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకూ పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా ప్రజలు వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపారు. వైఎస్సార్సీపీ 120 స్థానాలకంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి రావడం తథ్యం. – ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఇంద్ర నీల్నేను చెప్పిన 104 స్థానాల కంటే వైఎస్సార్సీపీకి అధికంగా వస్తాయిగత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లపాటు అధికారంలో ఉంది. ఈసారి కూడా అంతే స్థాయి ఓట్లతో మళ్లీ ఘనవిజయం సాధించి, అధికారంలోకి రాబోతోందన్నది మా సర్వేలో వెల్లడైంది. సీఎం వైఎస్ జగన్ గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి గుమ్మం వద్దకే అందించడం గ్రామీణ ప్రాంతాల ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. వారిపై పెను ప్రభావం చూపింది. అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించడం వైఎస్సార్సీపీకి సానుకూలంగా మారింది. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సాధికారత సాధించిన మహిళలు 56 శాతం వైఎస్సార్సీపీకి మద్దతుగా ఓట్లు వేశారు.టీడీపీ కూటమితో పోల్చితే వైఎస్సార్సీపీకి మహిళలు 13 నుంచి 14 శాతం అధికంగా ఓట్లు వేశారు. మహిళల ఓటింగ్ శాతం పెరగడం వైఎస్సార్సీపీకి సానుకూలంగా మారింది. వృద్ధాప్య పెన్షన్‌ను నాలుగు దశల్లో రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచి ఇవ్వడం, ఇంటి వద్దకే రేషన్ అందించడం ద్వారా వృద్ధులకు సీఎం జగన్ జీవనభద్రత కల్పించారు. ఇది వైఎస్సార్సీపీకి సానుకూలంగా మారింది. ఎన్నికల్లో సీఎం జగన్ తాను చేసింది చెప్పి, అధికారంలోకి వస్తే తాను ఏం చేస్తానో చెబుతూ పాజిటివ్ ప్రచారం చేస్తే.. చంద్రబాబు నెగెటివ్ ప్రచారాన్ని చేశారు.ఇది టీడీపీ కూటమికి ప్రతిబంధకంగా మారింది. సీఎం జగన్ అమలు చేసిన సామాజిక న్యాయం వైఎస్సార్సీపీకి అనుకూలంగా మారింది. నేను చెప్పిన 104 స్థానాలకంటే అత్యధిక స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయం. ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్‌ను సబ్ కాంట్రాక్టుకు ఇచ్చిన సంస్థకు రాజకీయ నేపథ్యం ఉండటం వల్ల అది శాస్త్రీయంగా చేయలేదు. దాని గురించి ఇంతకన్నా చెప్పను. – ‘ఆరా’ మస్తాన్ -
శాసనసభలో సెల్ఫోన్లు వాడొద్దు
సాక్షి, హైదరాబాద్: శాసనస సభ స్పీకర్ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నుంచి సభలో సభ్యులెవరూ సెల్ఫోన్లు, ట్యాబ్‌లు, ఇతర ఎల్రక్టానిక్ గ్యాడ్జెట్స్‌ను వినియోగించకూడదని రూలింగ్ ఇచ్చారు. వాటిని ఉపయోగించి వీడియోలు ప్రదర్శించకూడదని ఆదేశించారు. ‘కృష్ణా నది మీద నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంబీకి అప్పగించే అంశం’మీద సభలో ఇటీవల జరిగిన చర్చ సందర్భంగా అధికార–ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగిన విషయం తెలిసిందే. కేఆర్ఎంబీకి తాము ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత అప్పగించటం లేదని ప్రభుత్వం స్పష్టం చేసిన సమయంలో, ఆ నిర్ణయానికి భిన్నమైన అభిప్రాయాన్ని వెల్లడించిన అప్పటి నీటి పారుదల శాఖ ఈఎన్సీ (ప్రస్తుతం మాజీ) మురళీధర్‌రావు పేర్కొన్నట్టుగా ఉన్న వీడియోను ఫోన్ ద్వారా ప్రదర్శించారు. ఇది ప్రభుత్వాన్ని కొంత ఇ రుకున పెట్టింది. ఈ నేపథ్యంలో సభలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వినియోగంపై గురువారం స్పీకర్ నిర్ణ యం వెల్లడించటం విశేషం. స్పీక ర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా సభలో వాటిని వినియోగించవద్దని స్పష్టం చేశారు. మీడియా పాయింట్ వద్ద కూడా ఇక సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మీదట బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారు మీడియాతో మాట్లాడేందుకు సభ ఆవరణలోని మీడియా పాయింట్ వద్దకు వస్తుండగా భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. సభ జరుగుతున్న తరుణంలో మీడియా పాయింట్ వద్ద మీడియా సమావేశానికి అనుమతి లేదంటూ వారు పేర్కొనడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ బీఆర్ఎస్ సభ్యులు నేలమీద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సభ ప్రారంభం అవుతూనే స్పీకర్ ప్రసాద్‌కుమార్ కీలక ప్రకటన చేశారు. సభ జరుగుతున్న తరుణంలో సభా ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశానికి అనుమతి లేదని, టీ, లంచ్ విరామ సమయాల్లో, సభ వాయిదా పడ్డ తర్వాత యధావిధిగా మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడవచ్చని పేర్కొన్నారు. -
ఆటోవాలాల పొట్టగొడతారా?
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంశం శుక్రవారం శాసనసభలో అధికార కాంగ్రెస్– ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాదోపవాదాలకు కారణమైంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం ఉదయం చర్చ ప్రారంభమైంది. చర్చను కాంగ్రెస్ సభ్యుడు వేముల వీరేశం ప్రారంభించిన అనంతరం యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఈ ఇద్దరూ బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ప్రసంగించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తరుణంలో బీఆర్ఎస్ పక్షాన పల్లా రాజేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలతో దుమారం మొదలైంది. ప్రజా పాలన అంటూ ఘనంగా చెప్పుకొని చివరకు 30 మోసాలు, 60 అబద్ధాలు అన్నట్టుగా గవర్నర్ ప్రసంగం సాగిందని ఆయన విమర్శించారు. ప్రజాభవన్‌లో మంత్రుల జాడెక్కడ.. ఆరు నిమిషాలు కూడా లేని సీఎం ప్రజాభవన్‌లో స్వయంగా తానే విన్నపాలు వింటానని ముఖ్యమంత్రి పేర్కొన్నా ఇప్పటివరకు ఆరు నిమిషాలకు మించి ఉండలేకపోయారని పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. మంత్రులు ఉంటామన్నా వారి జాడ కూడా లేదని, ఉన్నతాధికారులు వస్తారని చెప్పినా వారూ కనిపించటం లేదని, చివరకు డేటా ఎంట్రీ ఆపరేటర్లు మాత్రమే విన్నపాలు నమోదు చేసుకుంటున్నారన్నారు. కొద్ది రోజుల్లో డ్రాప్ బాక్సులు పెట్టి అభ్యర్థనలను వాటిల్లో వేయమనేలా ఉన్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ, ఫలితాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చాలినన్ని బస్సులు లేకుండా మహిళా ప్రయాణికులకు ఇబ్బందులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదనీ, చాలినన్ని బస్సులు, ట్రిప్పులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ పథకంతో ఆటోవాలాలు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇప్పటికే 21 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వారి కుటుంబాలకు రూ.20 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో మంత్రి శ్రీధర్‌బాబు కలగజేసుకుని, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణపథకాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంటే స్పష్టం చేయాలని ప్రశ్నించారు. పేద ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని, దీనికి బడ్జెట్లో నిధులు ప్రతిపాదిస్తామని పునరుద్ఘాటించారు. తాము మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వ్యతిరేకించటం లేదని, బస్సుల సంఖ్య పెంచాలనీ, ఆటోడ్రైవర్లకు ప్రతినెలా రూ.10 వేలు చొప్పున సాయం అందించాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బెంజికార్లు దిగని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఆటోడ్రైవర్లను రెచ్చగొడుతున్నారు: కాంగ్రెస్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ అమలు చేయాలని బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలగజేసుకుని, ఆర్టీసీ ఉద్యోగులను నాటి ప్రభుత్వం పట్టించుకోకుండా వారిని గాలికొదిలేసిందని, ఇప్పుడేమో ఆటోడ్రైవర్లను ఆత్మహత్యలవైపు పురిగొల్పుతున్నారని ఆరోపించారు. బెంజ్ కార్లు దిగని ఈ ఫ్యూడల్స్ ఇప్పుడు ఆటోల్లో ప్రయాణిస్తూ వారిని అవమానిస్తున్నారని విమర్శించారు. తమ బంధువైన రిటైర్డ్ ఆర్టీసీ ఈడీని ఆర్టీసీ ఎండీగా నాలుగేళ్లు కొనసాగించి సంస్థను భ్రషు్టపట్టించిన చరిత్ర గత ప్రభుత్వానిదని ఆరోపించారు. పేద మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండటాన్ని గత పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని, ఆటోడ్రైవర్లను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంటున్నారని మరో మంత్రి సీతక్క విమర్శించారు. కవితపై ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఆరోపణలు.. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, యాదాద్రి అభివృద్ధి పేరిట యాడాను ఏర్పాటు చేసి వందల కోట్ల నిధులను దుర్వీనియోగం చేశారని, సగం నిధులు ఎమ్మెల్సీ కవిత, నాటి మంత్రి జగదీశ్‌రెడ్డికి ముట్టాయని ఆరోపించా రు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి వచ్చారు. వారిపై స్పీకర్ ఆగ్ర హం వ్యక్తం చేయటంతో తిరిగి తమ స్థానాల వద్దకు చేరుకున్నారు. సభలో లేని వారి గురించి సభ్యుడు మాట్లాడిన అభ్యంతరకర మాటల్ని రికార్డుల నుంచి తొలగించాలని బీఆర్ఎస్ సభ్యుడు ప్రశాంతరెడ్డి కోరగా, పరిశీలించి నిర్ణ యం తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు. -
ప్రతిపక్షాల ప్రవర్తన బాధించింది
సాక్షి, అమరావతి: శాసనసభలో ప్రతిపక్షాల ప్రవర్తన తనను బాధించిందని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదనను వ్యక్తంచేశారు. ప్రస్తుతం జరుగుతున్న 15వ అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రతిపక్షాల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని మాట్లాడారు. గురువారం సభను నిరవధికంగా వాయిదా వేసే ముందు సభ్యులతో తన ఆవేదనను పంచుకున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో మంత్రి పదవులను నిర్వహించానని, కానీ రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని ఐదేళ్లపాటు నిర్వర్తించడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా తన విధులను కర్తవ్యదీక్షతో నిర్వర్తించానని, అన్ని పార్టీల సభ్యులకు మాట్లాడటానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ముఖ్యంగా తొలిసారి సభకు వచ్చిన ఎమ్మెల్యేలు, మహిళా సభ్యులను మాట్లాడించడానికి ప్రోత్సహించినట్లు తమ్మినేని చెప్పారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ద్వారా సభ్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి కృషి చేశానన్నారు. తాను స్పీకర్‌గా ఉన్న సమయంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధికరణ బిల్లు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు బిల్లు, మహిళా రక్షణకు ఉద్దేశించిన దిశ బిల్లు వంటి అనేక కీలక బిల్లులు ఆమోదం పొందడం ఆనందంగా ఉందని తెలిపారు. కానీ, అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు తమ పరిధిని దాటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా, ప్రతిష్టాత్మక వ్యవస్థకు మచ్చతెచ్చే విధంగా ప్రవర్తించారన్నారు. సభలో భిన్న వాదనలు ముఖ్యమని, అయితే పరిధి దాటి స్పీకర్ పోడియం మీదకు వచ్చి కాగితాలు, ఫైళ్లు విసిరారని, ఇది తనకు జరిగిన అవమానం కాదని, గౌరవ ప్రదమైన స్పీకర్ స్థాయిని, శాసనసభ స్థాయిని తగ్గించడమేనని తమ్మినేని అన్నారు. సభను హుందాతనంగా నడపడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డిప్యూటీ స్పీకర్లుగా వ్యవహరించిన కోన రఘుపతి, కోలగట్ల వీరభద్రస్వామి, స్పీకర్ కార్యాలయ సిబ్బందికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 15వ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులపాటు 10 గంటల రెండు నిమిషాలు జరిగాయని, ఇందులో 9 బిల్లులను ఆమోదించగా, 20మంది సభ్యులు మాట్లాడినట్లు తెలిపారు. ఫిబ్రవరి 8 నాటికి సభలో వైఎస్సార్సీపీకి 151 మంది, టీడీపీకి 22 మంది, జనసేనకు ఒకరు చొప్పున సభ్యులు ఉన్నారని, ఒక స్థానం ఖాళీగా ఉందని స్పీకర్ వెల్లడిస్తూ సభను నిరవధికంగా వాయిదా వేశారు. -
ఆ అప్పులు.. అంటగట్టినవే..
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులపై దుష్ట చతుష్టయం చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని అసెంబ్లీ సాక్షిగా ‘కాగ్’ నివేదిక కుండబద్ధలు కొట్టింది. రాష్ట్ర అప్పులు రూ.పది లక్షల కోట్లకు చేరాయంటూ ఎల్లో మీడియాతో పాటు టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని నివేదిక స్పష్టం చేసింది. 2022–23 అకౌంట్స్‌పై కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం గురువారం శాసనసభకు సమర్పించింది. కార్పొరేషన్ల అప్పులను దాచేస్తున్నారని, కాగ్‌కు కూడా చెప్పడం లేదంటూ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారంలో వీసమెత్తు నిజం లేదని కాగ్ అకౌంట్స్ నివేదిక వెల్లడించింది. 2022–23 నాటికి బడ్జెట్లో చేసిన అప్పులు, బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలు, మార్కెట్ రుణాలు, వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు కోసం ఆర్థిక సంస్ధల నుంచి గ్యారెంటీ ఇచ్చి తీసుకున్న అప్పుల పూర్తి వివరాలను కాగ్ స్పష్టంగా వెల్లడించింది. ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ) నిబంధనలు, లక్ష్యాలను ప్రభుత్వం పక్కాగా పాటిస్తోందని స్పష్టం చేసింది. 2022–23లో ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు, ద్రవ్య, రెవెన్యూ లోటు ఉన్నాయని కాగ్ నివేదిక పేర్కొంది. బడ్జెట్ బయట అప్పులను సైతం ఎటువంటి దాపరికం లేకుండా కాగ్ అకౌంట్స్‌లో స్పష్టం చేసింది. 2018–19 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.2,57,612 కోట్లుగా ఉన్నాయని కాగ్ పేర్కొంది (2019 మే నాటికి టీడీపీ సర్కారు సొంత ప్రచారం కోసం మరో రూ.14 వేల కోట్లు అప్పు చేసింది). ఆ రూ.14 వేల అప్పులను మినహాయించి చూసినా సరే 2022–23 నాటికి బడ్జెట్లో చేసిన అప్పులు రూ.4,23,942 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1,66,330 కోట్లు మాత్రమేనని, టీడీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా రుణాలు తీసుకుని రాష్ట్రాన్ని అప్పుల కుంపట్లోకి నెట్టిందని కాగ్ అకౌంట్స్ నివేదిక స్పష్టం చేస్తోంది. 2022–23 నాటికి బడ్జెట్లో అప్పులతో పాటు బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు, ఆర్థిక సంస్థలు, కంపెనీల ద్వారా గ్యారెంటీ ఇచ్చి తీసుకున్న అప్పులు మొత్తం కలిపి రూ.5,62,817 కోట్లు మాత్రమేనని కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు వెల్లడించినా ఎల్లో మీడియా, టీడీపీ నేతలు అనధికార అప్పులంటూ దుష్ప్రచారానికి తెగబడుతున్నారు. -
8 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ రెండో సెషన్ సమావేశా లు ఈ నెల 8వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం నోటిఫికేష న్ జారీ చేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల ను 8వ తేదీ నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్ర భుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తొలిరోజు గవర్నర్ తమిళిసై ఉభయసభల ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. -
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లతోపాటు మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ వంటివన్నీ అమలు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజే మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఆరు గ్యారంటీలకు ఆమోదం తెలిపామని.. వాటికి చట్టబద్ధత కల్పించే కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. శనివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో రేవంత్ మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలోని వైఫల్యాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. రేవంత్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఓటమి తర్వాతైనా బీఆర్ఎస్లో మార్పు వస్తుందని ఆశించాం. శాసనసభలో గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న ఇతరులకు అవకాశం ఇస్తారనుకున్నాం. కానీ ఇప్పుడు కూడా ఆ కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నారు. ‘మా పారీ్ట.. మా ఇష్టం’అనేది ఎక్కువకాలం చెల్లదు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతాం, కడుగుతామని శ్రీశ్రీ అన్నారు. నిరంకుశత్వం ఎక్కువకాలం ఉండదు. మేం ప్రగతిభవన్ గడీలను బద్దలుకొట్టాక ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు రావడాన్ని బీఆర్ఎస్ నేతలు సహించలేకపోతున్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రగతిభవన్‌కు వస్తే అనుమతి లేదని హోంగార్డే వెనక్కి పంపారు. నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సీఎంను కలిసేందుకు ప్రగతిభవన్‌కు వెళ్తే.. అనుమతి లేదని పోలీసులు వెనక్కి పంపిన చరిత్రను తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. ప్రజాయుద్ధనౌక గద్దర్‌ను కూడా ప్రగతిభవన్‌లోకి ప్రవేశం లేదని వెనక్కి పంపారు. మంత్రులు కూడా సీఎంను కలిసే అవకాశం లేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడా ఇనుప కంచెలను పగలగొట్టి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. ప్రజలకు స్వేచ్ఛ కల్పించాం. ఎవరైనా స్వేచ్ఛగా వచ్చి తమ సమస్యలు చెబితే వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పదేళ్లలో 8 వేల మంది రైతుల ఆత్మహత్యలు రైతుల ఆదాయంలో తెలంగాణ దేశంలో 25వ స్థానంలో ఉంది. గత పదేళ్లలో తెలంగాణలో 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్సీఆర్బీ నివేదికలోనే వెల్లడైంది. 2018 నుంచి ఇప్పటివరకు 18–60 ఏళ్లమధ్య వయసున్న 1,12,965 మంది రైతులు చనిపోతే.. వారికి రైతుబీమా కింద పరిహారం ఇచ్చారు. చనిపోయాక ఇవ్వడమా రైతు ప్రభుత్వమంటే? అదే పంటల బీమా పథకం పెట్టి ఉంటే రైతుల ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదు. కేసీఆర్ వరి వేస్తే ఉరే అని చెప్పి.. తన ఫామ్‌హౌజ్‌లో మాత్రం 150 ఎకరాల్లో వరి పండించి, ఆ వడ్లను క్వింటాల్ రూ.4,250 లెక్కన అమ్ముకున్నారు. అదే రైతులకు మాత్రం రూ.1,400 లెక్కనే ఇచ్చారు. దీనిపై విచారణకు సిద్ధమా? పాలమూరు ప్రజలు గెలిపించకపోయి ఉంటే.. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ అనేది పచ్చి అబద్ధం. యూటీలు, పలు రాష్ట్రాల తరువాత తెలంగాణ 10వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో కోటి ఎకరాలకు కాల్వల ద్వారా నీరిస్తే.. 2014లో 19 లక్షలున్న పంపుసెట్ల సంఖ్య ఇప్పుడు 29లక్షలకు ఎందుకు చేరింది? రాష్ట్రంలో పాలమూరు, చేవెళ్ల ప్రాంతాలపై ఎందుకు వివక్ష కొనసాగింది? పాలమూరులో వలసలు ఆగలేదు. ఆర్డీఎస్ ప్రాజెక్టు ఇంకా పూర్తికాలేదు. కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు ఎంపీగా గెలిపించకపోయి ఉంటే రాజకీయ భవిష్యత్తు ఏమై ఉండేది? ప్రాణహిత–చేవెళ్ల పథకాన్ని రద్దుచేసి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు. మిడ్ మానేరు నిర్వాసితులు పరిహారం కోసం ఇప్పటికీ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. మిడ్‌మానేరు ఆర్ అండ్ ఆర్ పునరావాసంలో ఎంపీ సంతోష్‌కుమార్‌కు, ఆయన సోదరికి 250 గ జాల చొప్పున ఇళ్లస్థలాలు వ చ్చాయి. ఇసుక దోపిడీని ప్రశ్నించిన నేరెళ్ల ప్రజలను కే సులు పెట్టి హింసించారు. దళితులను లాకప్‌లలో పెట్టి, కరెంట్ షాక్ ఇచ్చి హింసించారు. బీఆర్ఎస్ సభ్యులెవరినీ సభ నుంచి బయటికి పంపించం. వారిని ఇక్కడే కూర్చోబె ట్టి కఠోర నిజాలు వినిపిస్తాం. వారికి ఇదే శిక్ష. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే.. గవర్నర్ ప్రసంగం వింటుంటే సిగ్గుపడ్డామని కేటీఆర్ అన్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు పదో తరగతి పరీక్షలు సరిగా నిర్వహించలేదు. ఇంటర్ పరీక్షలు సరిగా దిద్దక 25మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమయ్యారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టలేక ప్రశ్నపత్రాలు అమ్ముకున్నవాళ్లు సిగ్గుతో తలదించుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడ (సీఎం స్థానంలో) కూర్చోవాలనుకుంటే కేటీఆర్‌కు నిరాశ ఎదురైంది. పదవి దక్కలేదనే నిరాశతోనే ఆయన అక్కసు వెళ్లగక్కుతున్నారు. సోనియాగాంధీ దయ వల్లే తెలంగాణ వచ్చిందని గతంలో కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో అంగీకరించారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మేనిఫెస్టోలా ఉందని కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ విధానాలనే గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారు. అందులో తప్పులేదు. ఆరు గ్యారంటీలతోపాటు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని మేం చెప్తున్నాం..’’అని రేవంత్ చెప్పారు. ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాం మేం నియంతృత్వం, నిర్బంధ పోకడకు వెళ్లం. గతంలో అసెంబ్లీలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ నిరసన తెలిపితే వారి శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసిన చరిత్రను ప్రజలు మర్చిపోలేదు. గతంలో అమరవీరుల కుటుంబీకులను ఎప్పుడైనా ప్రగతిభవన్‌కు పిలిచి బుక్కెడు బువ్వ పెట్టి గౌరవించారా? ఉద్యమంలో బిడ్డలను కోల్పోయిన కుటుంబాలను ఆదుకున్నారా? పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయలేదు. తెలంగాణ కోసం ఉద్యోగం వదులుకున్న డీఎస్పీ నళినికి ఎందుకు న్యాయం చేయలేదు? కేసీఆర్ తన కుటుంబంలోని కుమారుడు, కుమార్తె, బంధువులకు మాత్రం మంత్రి పదవులు ఇచ్చారు. ఉద్యమ పార్టీ అని చెప్పుకొనే బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నాచౌక్‌ను ఎత్తివేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మేం ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాం. కావాలనుకుంటే కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ధర్నాచౌక్‌లో ఆమరణ నిరాహార దీక్షలు, ధర్నాలు చేసుకోవచ్చు. శాసనసభ 20వ తేదీకి వాయిదా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసనసభ శనివారం ఆమోదించింది. తర్వాత శాసనసభను ఈనెల 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. డ్రగ్స్ విషయంలో ఎవరినీ ఉపేక్షించం ‘‘బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారింది. డ్రగ్స్ ఘటనపై సిట్ వేయాలని నేనే పోరాటం చేశాను. డ్రగ్స్ కోరల్లో చిక్కుకున్న పంజాబ్ మాదిరే మన రాష్ట్రాన్ని తయారు చేశారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన టీఎస్ న్యాబ్ కాగితాలకే పరిమితమైంది. డ్రగ్స్ నివారణకు 319 మంది సిబ్బంది కావాలంటే ఇవ్వలేదు. న్యాబ్ రూ.29 కోట్ల నిధులు కోరితే ఇవ్వలేదు. మా ప్రభుత్వం డ్రగ్స్‌ను అరికట్టేందుకు పటిష్ట ప్రణాళికతో వెళ్తుంది. డ్రగ్స్ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు. కఠినంగా శిక్షిస్తాం. రాష్ట్ర సరిహద్దుల్లోకి డ్రగ్స్, గంజాయి వస్తే ఊరుకోం. ప్రతిపక్షాలు సహకరించాలని కోరుతున్నా. మేం పాలకులం కాదు.. సేవకులం. నాలుగున్నర కోట్ల ప్రజలకు సేవ చేసేందుకే ఇక్కడికి వచ్చాం.’’ -
శాసనసభ పాత భవనం పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి, సెంట్రల్ హాల్ ఒకే భవన సముదాయంలో ఉండేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం జూబ్లీ హాలులో ఉన్న శాసనమండలిని, పాత భవనంలోకి మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. జూబ్లీహాలును మళ్లీ పునరుద్ధరించి, శాసనసభ, శాసన మండలి, సెంట్రల్ హాలును పాత పద్ధతిలో ఏర్పాటు చేయటంతో పాటు, ఆ ప్రాంగణాన్ని సుందరీకరించటం ద్వారా నగరంలో ఒక ప్రధాన పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆర్అండ్ బీ అధికారులతో కలిసి శాసనసభ ప్రాంగణాన్ని పరిశీలించి మార్పుచేర్పులపై చర్చించనున్నారు. సీఎంతో భేటీ అనంతరం రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాలుగు రోజుల్లోనే ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవటం విశేషం. సెంట్రల్ హాల్‌గా ఏపీ అసెంబ్లీ భవనం గతంలో శాసనసభ, శాసనమండలి ఒకే భవనంలో కొనసాగేవి. ఆ భవనం పాతబడటంతో ప్రస్తుత శాసనసభ కొనసాగుతున్న భవనాన్ని నిర్మించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే భవనం కొనసాగింది. పాత భవనంలో శాసనమండలిని నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత పాత భవనంలోని హాలును ఏపీకి కేటాయించారు. అక్కడ శాసనసభ, శాసనమండలి నిర్వహించాల్సి రావటంతో, తెలంగాణ శాసనమండలిని జూబ్లీహాలులోకి మార్చారు. ఇప్పుడు పాత భవనాన్ని పూర్తిగా పునరుద్ధరించనుండటంతో, జూబ్లీ హాలులోని శాసనమండలిని తిరిగి పాత మండలి భవనంలోకే మారుస్తారు. ఏపీకి కేటాయించిన శాసనసభ భవనాన్ని స్వా«దీనం చేసుకుని దాన్ని సెంట్రల్ హాల్‌గా మారుస్తారు. ఇక కొత్త భవనం వెలుపల ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల శాసనసభా పక్ష కార్యాలయాలు, మీడియా సెంటర్ ఉన్న భవనాన్ని తొలగించాలని నిర్ణయించారు. ఆయా కార్యాలయాలను పాత భవనంలో ఏర్పాటు చేస్తారు. భవనం కూల్చిన ప్రాంతంలో పచ్చిక బయళ్లు ఏర్పాటు చేసి పబ్లిక్ గార్డెన్తో అనుసంధానించాలని యోచిస్తున్నారు. గతంలో పబ్లిక్ గార్డెన్‌కు ఎంతో ప్రజాదరణ ఉండేది. సాయంత్రం వేళ ఎంతోమంది సందర్శించి సేద తీరేవారు. తాజాగా మళ్లీ దానికి పర్యాటక కళ తేవాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. మహాత్ముడి విగ్రహం ప్రాంతంలో.. శాసనసభ ముందుభాగంలో గతంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహం రోడ్డుపైకి అంతగా కనిపించటం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రోడ్డుమీద కంచెను ఏర్పాటు చేయటం కూడా దీనికి కారణమైంది. ఇప్పుడు ఆ కంచెను తొలగించి, వీలైతే గాంధీ విగ్రహాన్ని కాస్త ఎత్తు మీదకు మార్చి, ఆ ప్రదేశాన్ని మరింతగా సుందరీకరించి రోడ్డు మీదుగా వెళ్లేవారిని ఆకట్టుకునేలా చేయాలని నిర్ణయించారు. గతంలో జూబ్లీ హాలు ప్రాంగణం సభలు, సందడిగా ఉండేది. శాసనమండలిగా మారిన తర్వాత కళ తప్పింది. ఇప్పుడు దాన్ని మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయించారు. కొత్త భవనం నిర్మించే యోచన లేనట్టే..? కొత్త సచివాలయం తరహాలో శాసనసభకు కూడా కొత్త భవనాన్ని నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సచివాలయ భవనానికి పునాది వేసిన రోజునే, ఎర్రమంజిల్ ప్యాలెస్ ప్రాంగణంలో శాసనసభ సముదాయానికి కూడా పునాది వే శారు. కానీ వారసత్వ కట్టడంగా నిలిచిన ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కూల్చాలన్న నిర్ణయంపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ అంశం కోర్టు పరిధిలోకి కూడా వెళ్లింది. దీంతో నాటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పాత భవనాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించటంతో, ఇక వేరే ప్రాంతంలో నిర్మాణానికి తెరపడినట్టేనని అంటున్నారు. -
కొలువుదీరిన మూడో శాసనసభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ శనివారం కొలువుదీరింది. ఉదయం 11.00 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు ప్రమాణం చేశారు. అనంతరం మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసిన తరువాత అక్షర క్రమంలో సభలోని సభ్యులతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 61 మంది, బీఆర్ఎస్ నుంచి 32 మంది, ఎంఐఎం నుంచి ఆరుగురు, సీపీఐ నుంచి గెలిచిన ఒక్కరు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడాన్ని నిరసిస్తూ బీజేపీకి చెందిన 8 మంది సభ్యులు సభకు హాజరు కాలేదు. కాలు జారి పడిన కారణంగా శస్త్ర చికిత్స చేయించుకొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయనకు సహాయకారిగా ఉన్న మాజీ మంత్రి కె. తారక రామారావు సహా ఏడుగురు బీఆర్ఎస్ సభ్యులు, వ్యక్తిగత కారణాలతో ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ప్రమాణం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీరే.. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, దామోదర రాజ నర్సింహ, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, చిట్టెం పర్ణికా రెడ్డి, మట్టా రాగమయి, పద్మావతి రెడ్డి, యశస్విని రెడ్డి, ఆది శ్రీనివాస్, ఆదినారాయణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అనిరుధ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, బాలు నాయక్ నేనావత్, చిక్కుడు వంశీకృష్ణ, చింతకుంట విజయ రమణారావు, దొంతి మాధవరెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, గడ్డం వినోద్, గండ్ర సత్యనారాయణ రావు, జి. మధుసూదన్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, రామ్‌చందర్ నాయక్, కేఆర్ నాగరాజు, కే శంకరయ్య, కసిరెడ్డి నారాయణరెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కోరం కనకయ్య, కె.రాజేశ్‌రెడ్డి, కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, కుందూరు జయవీర్‌రెడ్డి, తోట లక్ష్మీకాంతారావు, కె. మదన్ మోహన్ రావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మల్ రెడ్డి రంగారెడ్డి, మందుల సామ్యేల్, మేడిపల్లి సత్యం, తుడి మేఘారెడ్డి, మురళీ నాయక్ భుక్యా, మైనంపల్లి రోహిత్, నాయిని రాజేందర్‌రెడ్డి, పి. సుదర్శన్‌రెడ్డి, పటోళ్ల సంజీవ్ రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ మాలోత్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, రేకులపల్లి భూపతి రెడ్డి, టి. రామ్మోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వెడ్మ బొజ్జు, వేముల వీరేశం, గడ్డం వివేక్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి 32 మంది కోవా లక్ష్మి, లాస్య నందిత, పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్, అరికెపూడి గాంధీ, బండారి లక్ష్మారెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, చింతా ప్రభాకర్, దానం నాగేందర్, దేవిరెడ్డి సు«దీర్ రెడ్డి, గంగుల కమలాకర్, గూడెం మహిపాల్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, కేపీ వివేకానంద, కాలే యాదయ్య, కాలేరు వెంకటేశ్, కల్వకుంట్ల సంజయ్, మాణిక్ రావు, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, మర్రి రాజశేఖర్ రెడ్డి, ముఠా గోపాల్, వేముల ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, టి. ప్రకాశ్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, తెల్లం వెంకట్రావ్, హరీశ్‌రావు, విజయుడు. ఎంఐఎం నుంచి అందరూ ఎంఐఎం నుంచి అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, జాఫర్ హుస్సేన్, కౌసర్ మెయినుద్దీన్, జుల్ఫీకర్ అలీ, మహ్మద్ మాజీద్ హుస్సేన్, మహ్మద్ మోబిన్ ప్రమాణం చేయగా, ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన అక్బరుద్దీన్ ఒవైసీ అంతకు ముందే గవర్నర్ సమక్షంలో ప్రమాణం చేశారు. సీఐపీ నుంచి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గైర్హాజరైన సభ్యులు ఎవరంటే కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ నుంచి రాజాసింగ్ , ఏలేటి మహేశ్వర్ రెడ్డి, హరీశ్‌బాబు, కె. వెంకట రమణా రెడ్డి, పాయల్ శంకర్, రామారావు పవార్, పైడి రాకేశ్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గైర్హాజరయ్యారు. -
ఒకే రోజు రూ.78 కోట్ల జప్తు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు గురువారం రికార్డు స్థాయిలో రూ.78.03 కోట్లు విలువ చేసే నగదు, మద్యం, ఇతర వస్తువులను జప్తు చేశారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో జప్తు చేసిన నగదు, ఇతర వస్తువుల మొత్తం విలువ రూ.243.76 కోట్లకు పెరిగిపోయింది. కాగా, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ.87.92 కోట్లు. ఒక్క రోజు 6వేల లీటర్ల మద్యం జప్తు తాజాగా రూ.1.21 కోట్లు విలువ చేసే 6132 లీటర్ల మద్యం జప్తు చేశారు. దీంతో ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం మద్యం 65,223 లీటర్లు కాగా, దీని విలువ రూ.10.21 కోట్లు. గురువారం రూ.16.77లక్షలు విలువ చేసే 103.165 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న గంజాయి 2950 కిలోలకు పెరిగింది. దీని విలువ రూ.7.72 కోట్లు. ఇప్పటి వరకు మరో రూ.7.72 కోట్లు విలువ చేసే ఇతర మత్తు పదార్థాలను జప్తు చేశారు. గురువారం రూ.57.67 కోట్లు విలువ చేసే బంగారం, వెండి, ఇతర వస్తువులు పట్టుకున్నారు. 83కిలోల బంగారం పట్టివేత అందులో 83.046 కిలోల బంగారం, 212 కిలోల వెండి, 112.195 క్యారట్ల వజ్రాలు, 5.35 గ్రాముల ప్లాటినం ఉంది. దీంతో ఇప్పటి వరకు పట్టుబడిన బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువుల విలువ రూ.120.40 కోట్లకు ఎగబాకింది. ఇందులో 181 కిలోల బంగారం, 693కిలోల వెండి, 154.45 క్యారెట్ల వజ్రాలున్నాయి. గురువారం రూ.8.84 కోట్లు విలువ చేసే ల్యాప్‌టాప్‌లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామగ్రి తదితర వస్తువులను పట్టుకున్నారు. దీంతో ఇప్పటి వరకు పట్టుబడిన ఇలాంటి వస్తువుల విలువ రూ.17.84 కోట్లకు చేరింది. హైవేపై రూ.750 కోట్ల నగదు కలకలం అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా సరిహద్దులోని 44వ జాతీయ రహదారిపై ఏకంగా రూ.750 కోట్ల నగదు పట్టుబడినట్లు సామాజిక మాధ్యమాల్లో గురువారం వైరల్ అయింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు. ’’రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు కేరళ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి హైదరాబాద్ యూబీఐకి నగదును బదిలీ చేస్తున్నట్టు మంగళవారం రాత్రి సమాచారం వచ్చింది. ఈ మేరకు జిల్లా నుంచి ఆర్డీఓ, లీడ్ బ్యాంక్ మేనేజర్, డీఎస్పీ అధికారులు విచారణ చేసేందుకు స్పాట్‌కు వెళ్లి, నగదుకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఆ తర్వాత పోలీస్ ఎస్కార్ట్‌తో నగదును హైదరాబాద్‌లోని యూబీఐకి చేరినట్లు నిర్ధారణ చేసుకున్నాము’’’ అని క్రాంతి ఆ ప్రకటనలో వివరించారు. అయితే ఎంత మేరకు నగదు ఉందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. -
ఆర్టీసీ విలీనం బిల్లు ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అంశం మరోసారి గందరగోళంగా మారుతోంది. ఆగమేఘాల మీద శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఏమైందో స్పష్టత లేకపోవటం కార్మికుల్లో ఆందోళనకు, అయోమయానికి కారణమవుతోంది. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలపడంలో జాప్యం జరిగినప్పుడు ఆర్టీసీ కార్మికులు ఏకంగా రెండు గంటలపాటు బస్సులు దిగ్బంధం చేసి రాజ్‌భవన్‌ను ముట్టడించారు. ఆ సమయంలో పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ మరుసటి రోజు హైదరాబాద్ వచ్చిమరీ ఆమోదం తెలిపారు. అంత వేగంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో.. ఇక బిల్లు ఆమోదం, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనానికి వీలుగా కమిటీ ఏర్పాటు కావటం, మార్గదర్శకాలు రూపొందటం, విలీన ప్రక్రియ పూర్తి కావటం కూడా అంతే వేగంగా జరుగుతుందని భావించారు. కానీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి సరిగ్గా నెల గడిచింది. గత నెల ఆరో తేదీన శాసనసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అది గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు చేరింది. అయితే కొన్ని సందేహాల నివృత్తి కోసం దానిని న్యాయశాఖ కార్యదర్శికి పంపినట్టు తర్వాత గవర్నర్ ప్రకటించారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. 183 మంది ఉద్యోగులకుటుంబాలకు నిరాశ గత నెలలో పదవీ విరమణ పొందిన 183 మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు నెలాఖరు వరకు ఉత్కంఠగా ఎదురుచూసి నిరాశ చెందాల్సి వచ్చింది. ఇప్పుడు మరో 200 కుటుంబాలు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. న్యాయశాఖ కార్య దర్శి కార్యాలయానికి వచ్చిన బిల్లు అప్పటినుంచి తెలంగాణ సచివాలయంలోనే ఉండిపోయిందంటూ కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. దీనిపై రాజ్‌భవన్ వర్గా లను ‘సాక్షి’వివరణ కోరగా, ఆర్టీసీ బిల్లు ఇంకా రాజ్‌భవన్‌కు చేరుకోలేదని పేర్కొన్నాయి. వేరే 3 బిల్లులు మాత్రం వచ్చాయని వివరించాయి. ఆ రెండు వేతన సవరణలు చేయాలి: కార్మిక సంఘాలు బిల్లును తిరిగి రాజ్‌భవన్‌కు పంపటంలో జాప్యం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు, ఇప్పుడు మరో అంశంపై పట్టుపడుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు 2017, 2021 వేతన సవరణలు పెండింగులో ఉన్నందున, వాటిని క్లియర్ చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని పేర్కొంటున్నాయి. విలీన ప్రక్రియ లోపే ఆ రెండు వేతన సవరణలు చేస్తే, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను కొంత ఉన్నత స్థాయిలో స్థిరీకరించేందుకు వీలుంటుందని, లేకుంటే తక్కువ వేతన స్థాయిలోనే ఫిక్స్ అవుతాయని, ఇది కార్మికులను తీవ్రంగా నష్టపరుస్తుందని వివరిస్తున్నాయి. ఆయా అంశాలపై మరోసారి ఆందోళనకు సిద్ధమని అంటున్నాయి. ఇప్పుడు ఏ కార్యాలయాన్నిముట్టడించాలి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం తెలియజేయడంలో జాప్యం జరిగిందంటూ రాజ్‌భవన్‌ను ముట్టడించేలా చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వమే జాప్యం చేస్తోంది. ఇప్పుడు ఏ కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడించాలి. బిల్లును ఇప్పటికీ రాజ్భవవన్కు పంపకుంటే వెంటనే పంపాలి. ఈలోపు కార్మికులకు బకాయి ఉన్న వేతన సవరణలు చేయాలి. – అశ్వత్థామరెడ్డి, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వెంటనే రాజ్‌భవన్‌కు పంపాలి ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ సంతకం కోసం వెంటనే రాజ్‌భవన్‌కు పంపాలి. జాప్యం చేయకుండా రెండు వేతన సవరణలు జరిపి, సీసీఎస్ బకాయిలు చెల్లించి, ఆ తర్వాత విలీన ప్రక్రియ పూర్తి చేయాలి. – రాజిరెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ -
అసెంబ్లీ సమావేశాలకు తెర
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజుల పాటు కొనసాగిన తెలంగాణ శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు ఆదివారం ముగిశాయి. తెలంగాణ రెండో శాసనసభ (2018–23)కు ఇవే చివరి విడత సమావేశాలు కావడంతో సభ్యులు భారంగా వీడ్కోలు పలికారు. చివరి రోజు సమావేశంలో ‘ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల సేవల విలీనం’బిల్లు తీవ్ర ఉత్కంఠ నడుమ సభ ముందుకు వచ్చి ఆమోదం పొందింది. ఆదివారం ఉదయం ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా జీరో అవర్‌తో ప్రారంభమైన సభ ఆ తర్వాత ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం – స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతి’అనే అంశంపై జరిగిన లఘు చర్చకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు 2.30 గంటల పాటు సవివరంగా సమాధానం ఇచ్చారు. అనంతరం మూడు ప్రభుత్వ బిల్లుల ఆమోదం, గద్దర్‌కు సంతాపం ప్రకటించిన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఉభయ సభలు హుందాగా సాగాయి: వేముల అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రజాస్వామ్య బద్ధంగా, సభ్యుల సస్పెన్షన్లు లేకుండా సాఫీగా జరిగాయని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. దేశంలోనే నంబర్‌వన్ అనే రీతిలో నడిపాం: పోచారం 2019 జనవరి 18న శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తాను అందరి సహకారంతో దేశంలోనే నంబర్ వన్ అనే రీతిలో సభను నడిపానని పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగులను ప్రభుత్వ సేవల్లోకి తీసుకోవడం) బిల్లు 2023 శానసభ ఆమోదించడం పట్ల స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్‌కు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ అసెంబ్లీలోని వారి చాంబర్లలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. సురవరం ప్రతాపరెడ్డిపై వెలువరించిన ‘ససురవరం–తెలంగాణం’ మూడు సంకలనాలను శాసనసభలో సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అందజేశారు. 4 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో శాసనసభ 26.45 గంటలు, శాసన మండలి 23.10 గంటల పాటు సమావేశమైంది. -
నన్ను ఎమ్మెల్యేగా గుర్తించండి: జలగం
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం శాసనసభ్యుడిగా తనను గుర్తించాలని కోరుతూ జలగం వెంకట్రావు బుధవారం అసెంబ్లీ కార్యదర్శితో పాటు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని కలిశారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చి న హైకోర్టు, ఆయనపై పోటీ చేసిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా గుర్తించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులను కలసి కోర్టు తీర్పు కాపీని అందజేశారు. సాయంత్రం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌తో కూడా సమావేశమై కోర్టు తీర్పు కాపీతో పాటు తన విజ్ఞాపన అందజేశారు. కాగా, కోర్టు తీర్పును పరిశీలించి, నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత సమాచారం ఇస్తామని అసెంబ్లీ కార్యదర్శి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పినట్లు జలగం వెంకట్రావు ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ అంశంపై తాను అసెంబ్లీ స్పీకర్‌తో ఫోన్లో మాట్లాడానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేస్తా.. అసెంబ్లీ కార్యదర్శిని కలిసేందుకు వచ్చి న జలగం వెంకట్రావు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి తనను ఎమ్మెల్యేగా పరిగణించాలంటూ హైకోర్టు తీర్పునిచ్చి న విషయాన్ని ఆయన వివరించారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పనిచేస్తానన్నారు. గతంలో ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఏం చేశానో ప్రజలకు తెలుసని, ఎన్నికల షెడ్యూలుకు మరో మూడు నెలల సమయం ఉన్నందున ప్రజలకు మరింత మేలు చేస్తానని వెంకట్రావు పేర్కొన్నారు. -
పార్లమెంటుకు వదిలేయండి
న్యూఢిల్లీ: ‘‘స్వలింగ వివాహాల అంశం అత్యంత సంక్లిష్టమైనది. సమాజంపై ఇది పెను ప్రభావం చూపుతుంది’’ అని కేంద్ర ప్రభు త్వం పేర్కొంది. కాబట్టి దీన్ని పూర్తిగా పార్లమెంటు పరిశీలనకు వదిలేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టును కోరింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదనలు బుధవారం ఐదో రోజూ కొనసాగాయి. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు కొనసాగించారు. వివాహమంటే ఏమిటి, ఎవరి మధ్య జరుగుతుందన్న కీలకాంశాలపై నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరన్నదే కీలక ప్రశ్న అని ఆయనన్నారు. ‘‘నిజానికి పార్లమెంటుకు స్థాయికి కూడా ఇదెంతో విస్తృతమైన కసరత్తు. స్వలింగ వివాహాలపై తీసుకోబోయే నిర్ణయం పలు చట్టాలకు సంబంధించి ఏకంగా 160 నిబంధనలను ప్రభావితం చేస్తుంది. దీనిపై కసరత్తు చేసేందుకు కావాల్సిన వనరులు న్యాయవ్యవస్థ వద్ద లేవు. పెళ్లి ఒక సామాజిక, చట్టపరమైన వ్యవస్థ. దానికి గుర్తింపు పూర్తిగా శాసనవ్యవస్థ విధాన నిర్ణయాల పరిధిలోని అంశం. ఆ అధికారాన్ని న్యాయవ్యవస్థ లాక్కోజాలదు’’ అన్నారు. తన వాదనకు మద్దతుగా అబార్షన్‌కు రాజ్యాంగపరమైన హక్కు కల్పించేందుకు నిరాకరిస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించారు. దీన్ని ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. ‘‘మీ వాదనను అర్థం చేసుకున్నాం. న్యాయమూర్తులు చట్టాలు చేయరనేది అందరికీ తెలిసిన విషయమే. మహిళల హక్కుల పరిరక్షణలో అమెరికా కంటే భారత్ ఎంతో ముందుకు వెళ్లింది. కనుక అక్కడి తీర్పులను ప్రస్తావించొద్దు’’ అని సీజేఐ స్పష్టం చేశారు. -
టీడీపీ హయాంలో భూ కబ్జాలపై విచారణ జరపాలి
సాక్షి, అమరావతి: శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చివరి రోజు శుక్రవారం ‘జీరో’అవర్ సుదీర్ఘంగా సాగింది. రెండున్నర గంటలకు పైగా 46 మంది శాసన సభ్యులు వారి నియోజకవర్గాల సమస్యలపై మాట్లాడారు. జీరో అవర్‌ను ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి నడిపించారు. తెలుగుదేశం పార్టీ పాలనలో జరిగిన భూకబ్జాలపై విచారణ జరపాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేశ్ వారి పర్యటనల్లో అధికార పక్ష నాయకులపై భూ కబ్జా ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. టీడీపీ హయాం నుంచి ఎంత ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందో సమగ్ర విచారణ చేయించాలి కోరారు. దీనిపై ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి స్పందిస్తూ.. ‘నేను ఇప్పు డు చైర్లో కూర్చున్నా. లేకుంటే శాసన సభ్యుడినే కదా. రెండు నెలల కిందట చంద్రబాబు విజయనగరంలో నాపైనా ఆరోపణలు చేశారు. ఏ భూములైతే ఆక్రమించానని ఆరోపిస్తున్నారో.. ఆ భూముల్లో చంద్రబాబు కూర్చుని ఆందోళన చేస్తే ప్రజలకు బాగా అర్థమవుతుందని చెప్పాను. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఆరోపణలపై విచారణకు ఆదేశించమని ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమణల నుంచి వి డిపించి అర్హులైన పేదలకు ఇవ్వాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను త్వరితంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. లోకేశ్ కబ్జా ఆరోపణలపై విచారణ చేయించాలి: ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పీలేరులో టీడీపీ నేత లోకేశ్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. రూ.250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తాను, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ఆక్రమించుకున్నామని లోకేశ్ ఆరోపించారన్నారు. గతంలో తమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైంది, 2014–19 మధ్య ఎంత భూమి మింగేశారు, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చి న తర్వాత ఎంత కబ్జాకు గురైందో సీఐడీ, విజిలెన్స్ ద్వారా విచారణ జరిపించి వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోరారు. తాను ఏనాడూ ప్రభుత్వ భూముల విషయంలో జోక్యం చేసుకోలేదని చెప్పారు. పేజ్‌కు భూ కేటాయింపులపై వాస్తవాలు నిగ్గు తేల్చాలి టీడీపీ ప్రభుత్వంలో లోకేశ్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండగా పేజ్ ఇండస్ట్రీకి 28 ఎకరాలు కారు చౌకగా ఎకరం రూ.10 లక్షలకు కేటాయించడంపై విచారణ జరపాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. అక్కడ ఎకరం రూ.4 కోట్లు ఉంటుందని, రూ.110 కోట్ల విలువైన స్థలాన్ని రూ.2.80 కోట్లకే రిజిస్టర్ చేశారని చెప్పారు. మూడేళ్ల తర్వాత భూమిని విక్రయించుకోవచ్చని జీవో కూడా ఇచ్చారన్నారు. 2016లో భూమి ఇస్తే 2019 వరకు ఆసంస్థ కార్యకలాపాలు ప్రారంభించలేదన్నారు. దీనిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరారు. టీడీపీ హయాంలో రామగిరిలో రూ.1000 కోట్ల విలువైన గ్రానైట్‌ను ఎటువంటి రాయల్టీలు చెల్లించకుండా తరలించారని అన్నారు. ఆన్లైన్ విధానంలో భూ యాజమాన్య మార్పులు చేసే వెసులుబాటుతో అనంతపురం రూరల్, రాప్తాడు నియోజకవర్గంలో వందల కోట్లు విలువ చేసే భూముల్లో బినామీల పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారని, ఇలాంటి దోపిడీల్లో ప్రభుత్వం వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోరారు. బుడగ జంగాలకు కుల ధ్రువీకరణ చేపట్టాలి సరైన గుర్తింపు లేని బుడగ జంగాలకు కుల ధ్రువీకరణ చేపట్టి ప్రభుత్వ పథకాలు అందించాలని కొందరు సభ్యులు కోరారు. దీనిపై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ఇది రాష్ట్ర పరిధిలోని అంశం కాదని.. కేంద్ర కేబినెట్ ఆమోదంతో పార్లమెంట్ చట్ట సవరణ ద్వారా చేయాల్సి ఉంటుందన్నారు. బుడగ జంగాలు ఏ వర్గంలోకి వెళ్లాలనుకుంటున్నారో సంబంధిత కమిషన్‌కు విజ్ఞప్తి చేయాలని సూచించారు. -
AP: అసెంబ్లీలో చివరి రోజూ అదే తీరు
సాక్షి, అమరావతి: శాసనసభ బడ్జెట్ సమావేశాల చివరిరోజూ తెలుగుదేశం పార్టీ తన అరాచక బుద్ధిని ప్రదర్శించింది. స్పీకర్ తమ్మినేని సీతారామ్ లక్ష్యంగా ఆ పార్టీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ప్రశ్నోత్తరాలు మొదలవగానే వాయిదా తీర్మానానికి టీడీపీ పట్టుపట్టింది. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని స్పీకర్ వారించడంతో టీడీపీ సభ్యులు రెచ్చిపోయారు. తమను దగ్గరుండి కొట్టించడంతో పాటు.. ఎమ్మెల్యేపైనే స్పీకర్ దాడి చేశారంటూ ఆరోపించారు. చివరకు రెడ్‌లైన్ దాటి, సస్పెండై సభ నుంచి వెళ్లిపోయారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవగా, ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. ‘ఆయుష్మాన్ భారత్’పై టీడీపీ సభ్యులే అడిగిన ప్రశ్నలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని బదులిస్తుండగా వినకుండా తమ స్థానాల నుంచే రన్నింగ్ కామెంట్రీ మొదలుపెట్టారు. జీవో నంబర్1ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను వినిపించేందుకు టీడీపీ సభ్యులకు స్పీకర్ మైక్ ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా తమ వాయిదా తీర్మానం తీసుకోవాలంటూ భీషి్మంచారు. 9.09గంటలకు వెల్‌లోని రెడ్‌లైన్ వరకు వచ్చి స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను సంప్రదించకుండా రెడ్‌లైన్ ఎలా పెడతారని శాసనసభ కార్యదర్శిని టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రెడ్‌లైన్ దాటి సభాపతి పోడియంపైకి దూసుకెళ్లారు. సభా సంప్రదాయాలకు విఘాతం కలిగిస్తున్నారంటూ టీడీపీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సభలో ఇచ్చిన రూలింగ్ ప్రకారం రెడ్ లైన్ దాటినందుకు టీడీపీ సభ్యులు కె.అచ్చెన్నాయుడు, డోలా బాలవీరాంజనేయస్వామి, గద్దె రామ్మోహన్రావు, గొట్టిపాటి రవి, ఏలూరు సాంబశివరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పీజీవీఆర్ నాయుడు (గణబాబు), గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మంతెన రామరాజు, నిమ్మకాయల చినరాజప్ప ఒక రోజు సభ నుంచి ఆటోమేటిక్‌గా సస్పెండ్ అయినట్టు ప్రకటించారు. బయటకు వెళ్లేందుకు టీడీపీ సభ్యులు నిరాకరించడంతో మార్షల్స్‌ను రప్పించారు. అయితే 9.22 గంటలకు నవ్వుకుంటూ.. బయటకు వెళ్లిపోయారు. బయటకు వెళ్తూ అచ్చెన్నాయుడు శాసనసభను సంతాప సభతో పోల్చారు. -
అప్పటిదాకా పోటీచేయను
శ్రీనగర్: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ తొలగించిన ఆర్టికల్ 370ను పునరుద్ధరించేదాకా తాను శాసనసభ సమరంలో అడుగుపెట్టబోనని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పష్టంచేశారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం అయిన మెహబూబా బుధవారం పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ రద్దయిన ఆర్టికల్‌ను పునరుద్ధరించే వరకు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగను. ఇది సరైన నిర్ణయం కాదని నాకూ తెలుసు. కానీ ఇది భావోద్వేగంతో తీసుకున్న కఠిన నిర్ణయం. ఎన్నికైన ప్రభుత్వం ఉంటే తమ రహస్య ఎజెండా కార్యరూపం దాల్చదనే భయంతోనే బీజేపీ ప్రభుత్వం ఆ ఆర్టికల్‌ను తొలగించింది. ‘ఆర్టికల్‌ను రద్దుచేసి కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించామని కేంద్రం చెబుతోంది. అసెంబ్లీ ఎన్నికల కంటే పంచాయితీ ఎన్నికలే ప్రజాస్వామ్యానికి అసలైన గీటురాయి అన్నపుడు ప్రధాని, హోం మంత్రి వంటి వేరే పదవులు ఎందుకు ? వాళ్లు ఏం చేస్తున్నట్లు ?. కశ్మీర్ ప్రజలను బలహీనపరచి తమ ముందు సాగిలపడేలా చేయాలని కేంద్రం కుట్ర పన్నింది’ అని ఆరోపించారు. -
నాలుగేళ్లుగా.. నిలకడగా!
సాక్షి, అమరావతి: గత పాలకుల తప్పులను సరిదిద్దుతూ ఆర్భాటాలకు తావు లేకుండా అన్ని రంగాల్లో సుస్థిరాభివృద్ధి నమోదుతో ముందుకు సాగుతున్నట్లు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. సుస్థిరాభివృద్ధి కోసం వ్యవసాయం, విద్య, వైద్యం, సామాజిక భద్రత రంగాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ప్రభుత్వ నిర్వాకాలతో కొండలా పేరుకుపోయిన బిల్లులను చెల్లిస్తూనే కోవిడ్ సంక్షోభంలో కూడా ఆర్థిక వ్యవస్థను వేగంగా గాడిలో పెట్టామన్నారు. శుక్రవారం శాసనసభలో 2023 – 24 వార్షిక బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి బుగ్గన సమాధానమిస్తూ మాట్లాడారు. ♦ 2019 – 20లో 5.7 శాతం వృద్ధితో రూ.9.25 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్డీపీ 2022 – 23లో 16.22 శాతం వృద్ధితో రూ.13.17 లక్షల కోట్లకు చేరుకుంది. నాలుగేళ్ల పాలనలో రెండేళ్లు కోవిడ్ లాంటి సంక్షోభం ఎదురైనా ప్రభుత్వం తీసుకున్న సమర్థ నిర్ణయాలతో వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగం వేగంగా కోలుకున్నాయి. ♦ ఆర్థికంగా బలమైన దేశాలు కూడా సంక్షోభ సమయంలో వ్యవస్థలోకి నగదును పంపిణీ చేస్తాయి. అదే తరహాలో 2022 – 23లో అదనంగా రూ.1.83 లక్షల కోట్ల సంపదను సృష్టించగలిగాం. అప్పుల కోసం కాకుండా గత సర్కారు తప్పులను సరిదిద్దడానికే 30 దఫాలకుపైగా ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. ♦ రాష్ట్ర జీవనాడి పోలవరం ఆలస్యం కావడానికి ముమ్మాటికీ టీడీపీనే కారణం. పోలవరం పునరావాస సాయంపై సరైన స్పష్టత లేకుండా ఒప్పందం కుదుర్చుకుంది. అలాంటి తప్పులను ఈ ప్రభుత్వం సరిదిద్దుతోంది. ♦ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రైతులకు అడుగడుగునా ప్రభుత్వం తోడుగా నిలవడంతో రాష్ట్రంలో సాగు వ్యయం 21 శాతం తగ్గడమే కాకుండా రాబడి 23 శాతం పెరిగింది. విద్య, వైద్య రంగాల్లో చేపట్టిన విప్లవాత్మక మార్పులు రానున్న కాలంలో మంచి ఫలితాలను అందిస్తాయి. ♦ గత ప్రభుత్వం కంటే ఇప్పుడు అప్పులు తక్కువగానే చేసినా విపక్షం, వాటి అనుబంధ మీడియా తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయి. రాష్ట్ర విభజన నాటికి రూ.1.14 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పులు గత ప్రభుత్వ హయాంలో ఏటా సగటున 19 శాతం వృద్ధితో రూ.2.72 లక్షల కోట్లకు ఎగబాకాయి. ఇప్పుడు నాలుగేళ్ల కాలంలో అప్పులు రూ.2.72 లక్షల కోట్ల నుంచి 13.5 శాతం వృద్ధితో రూ.4.5 లక్షల కోట్లకు చేరాయి. టీడీపీ సర్కారు కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువ స్థాయిలో అప్పులు చేసింది. ♦ ఉచిత సేవలకు కాలం చెల్లిందని, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలని తాను స్వయంగా రాసుకున్న మనసులో మాట పుస్తకంలో పేర్కొన్న చంద్రబాబు ఇప్పుడు అన్నీ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేయడం విడ్డూరం. 60 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు అవినీతిపరులని, కాంట్రాక్టు విధానంలోనే ఉద్యోగాలివ్వాలని, ప్రాజెక్టులు అనవసరమని, పేదలకు ఇళ్లు ఇవ్వడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, స్థానిక సంస్థలకు నిధులివ్వాల్సిన అవసరం లేదని పుస్తకంలో రాసుకున్న చంద్రబాబు ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. -
చర్చలో రభస
సాక్షి, అమరావతి: బడ్జెట్ సమావేశాల సందర్భంగా నాలుగో రోజూ సభలో రభసను విపక్షం కొనసాగించింది. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారామ్ బడ్జెట్‌పై చర్చ చేపట్టారు. పార్టీ ల సంఖ్యాబలాన్ని అనుసరించి సభ్యులకు సమయం కేటాయిస్తానని సభ ప్రారంభంలోనే ప్రకటించారు. దీని ప్రకారం టీడీపీ సభ్యులకు 17 నిమిషాలు ఇస్తున్నట్లు పేర్కొంటూ చర్చలో తొలుత మాట్లాడే అవకాశం ఇచ్చారు. టీడీపీ నుంచి ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ బడ్జెట్ గణాంకాలు అంకెల గారడీ అని, ప్రభుత్వం హామీలను విస్మరించిందని చెప్పారు. ఫ్యాన్సీ నెంబర్‌పై 2,79,279పై ఉన్న దృష్టి ప్రజా సమస్యలపై లేదంటూ బడ్జెట్‌ను విమర్శించారు. ఈ సమయంలో సీఎం ఆస్తులంటూ ఆరోపణలు చేస్తుండడంతో అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అప్పటికే నిర్ణీత సమయం మించిపోవడం, వ్యక్తిగత విమర్శలు కొనసాగించడంతో ప్రసంగాన్ని త్వరగా ముగించాలని స్పీకర్ సూచించారు. బడ్జెట్‌పై చర్చించకుండా తప్పుదోవ పట్టించే యత్నాలు సరికాదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సూచించారు. అప్పటికే టీడీపీకి ఇచ్చిన నిర్ణీత సమయం దాటిపోయి 25 నిమిషాలు మాట్లాడడంతో అధికార పార్టీ నుంచి చర్చలో పాల్గొనేందుకు కోన రఘుపతికి స్పీకర్ అవకాశమిచ్చారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని తమకు సమయం సరిపోలేదంటూ నినాదాలు చేస్తూ చర్చకు ఆటంకం కల్పించారు. డోల బాలవీరాంజనేయులు, వెలగపూడి రామకృష్ణ, ఆదిరెడ్డి భవానీ తదితరులు సభాపతి కుర్చీ వద్దకు చేరుకుని స్పీకర్ డౌన్‌డౌన్... అంటూ నినాదాలు చేశారు. విపక్ష సభ్యులు తమ సీట్ల వద్దకు వెళ్లాలని స్పీకర్ పదేపదే కోరినా మైక్ ఇవ్వాలని పట్టుబట్టారు. భోజనం సమయం కావడంతో టీడీపీ సభ్యులు సభ నుంచి సస్పెండై బయటకు వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో ఉన్నారని ఆర్థిక మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. అనంతరం సభ ఆమోదంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడంతో నినాదాలు చేస్తూ నిష్క్రమించారు. -
అబద్ధాలు అచ్చేసిన రామోజీని సభకు పిలిచి విచారించాలి
సాక్షి, అమరావతి: చట్ట సభను, రాజ్యాంగ వ్యవస్థను, గవర్నర్‌ను కించపరిచేలా అబద్ధాలను ఈనాడులో అచ్చేసి రామోజీరావు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని, ఆయన్ను సభకు పిలిచి విచారించి, కఠిన చర్యలు తీసుకోవాలని శాసనసభలో అధికారపక్షం డిమాండ్ చేసింది. సీఎం రాకకోసం గవర్నర్ వేచి ఉండాలా అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నట్టు ప్రస్తావిస్తూ ఈనాడు రాసిన తప్పుడు కథనంపై బుధవారం శాసనసభ అట్టుడికింది. గవర్నర్‌ను కించపరుస్తూ ఈనాడు అచ్చేసిన కథనంపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టి కేశవ్ తప్పు మాట్లాడారా.. రామోజీ తప్పు రాశారా.. అనే విషయం తేల్చాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ సభ్యులు పట్టుబట్టారు. ఈనాడు వార్త క్లిప్పింగ్‌లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించిన సభ్యులు.. ఎల్లో మీడియాను ఏకిపారేశారు. అలాంటి వ్యాఖ్యలు తాను చేయలేదని దమ్ముంటే నిరూపించాలని పయ్యావుల కేశవ్ అనడంపై అధికారపక్ష సభ్యులు మండిపడ్డారు. సభకు దమ్ము ధైర్యం అని సవాలు చేయవద్దని, కేశవ్ తప్పు మాట్లాడినా, ఈనాడు తప్పు రాసినా ప్రివిలేజ్ కమిటీ విచారణలో నిర్ధారణ అయితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ చర్చకు అడుగడుగునా టీడీపీ సభ్యులు అడ్డుతగలడంతో సభ దృష్టికి వాస్తవాలు తెచ్చేందుకు తొలిరోజున గవర్నర్‌కు స్వాగతం పలికిన వీడియోను ప్రదర్శించి సభ్యులకు వాస్తవాలు చూపించారు. అయినప్పటికీ పయ్యావుల కేశవ్ పదే పదే వాదనకు దిగడంతో గవర్నర్ విషయంలో ఆయన చేసిన కామెంట్ల వీడియో సైతం సభలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, అధికారపార్టీ నేతలు మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థను అవమానించడమే: మంత్రి బుగ్గన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు స్వాగతం పలకడంలో ప్రొటోకాల్ పాటించలేదంటూ అబద్ధపు రాతలు రాయడం రాజ్యాంగ వ్యవస్థను అవమానించడమే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా వెళ్లి గవర్నర్‌కు ఘనస్వాగతం పలికి సభలోకి తీసుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఉదయం 9.45 గంటలకు అసెంబ్లీకి వచ్చారు. 9.53కు గవర్నర్ వచ్చారు. గవర్నర్‌ను రిసీవ్ చేసుకున్న సీఎం 10.02 గంటలకు స్పీకర్ చాంబర్‌కు తీసుకొచ్చారు. గవర్నర్‌కు గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన అభ్యర్థన మేరకు కొంత సేపు ఆగి ఆయన రెడీ అయిన తర్వాత గౌరవ సభలోకి తీసుకొచ్చాం. ప్రభుత్వ పనితీరు, విజన్‌ను గవర్నర్ చదివితే.. ఆ ప్రసంగాన్ని సైతం టీడీపీ సభ్యులు చాలా హేళన చేశారు. తప్పుడు వార్తలతో గౌరవ సభను, గవర్నర్‌ను అవమానిస్తూ కథనాలు రాసిన ఈనాడుపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్‌ను కోరుతున్నా. చంద్రబాబు, ఎల్లో మీడియా తోడుదొంగలు: మాజీ మంత్రి కన్నబాబు టీడీపీకి విషపుత్రికలుగా ఎల్లో మీడియా రోజురోజుకు దిగజారిపోతోంది. చంద్రబాబు, ఎల్లోమీడియా తోడుదొంగలుగా కలిసి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ రాష్ట్రంలో భయానక పరిస్థితులు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారు. ఎల్లో మీడియా వక్రీకరణపై అసెంబ్లీలో చర్చ జరపాలి. టీడీపీ, ఎల్లోమీడియా అబద్ధాలు ప్రచారం చేస్తూ, రాజ్యాంగ వ్యవస్థలను కించపరిచేలా వ్యవహరిస్తున్నాయి. విలువలులేని టీడీపీ: మంత్రి నాగార్జున ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై గౌరవం ఉంటే గవర్నర్ ప్రసంగం కాగితాలను చించివేసి టీడీపీ సభ్యులు మధ్యలోనే వెళ్లిపోయేవారు కాదు. విలువలు, విశ్వసనీయత లేని రాజకీయం చేస్తున్న టీడీపీ సభ్యులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. సభా హక్కుల ఉల్లంఘన విషయంలో రామోజీరావుపై చర్యలు తీసుకోవాలి. చర్చ జరగాల్సిందే: మంత్రి అంబటి సభలో చర్చ జరగకపోతే ఈనాడు రాసిందే నిజమని ప్రజలు అనుకుంటారు. ప్రజలకు వాస్తవాలను ఈ సభ ద్వారా తెలియచేయాలి. టీడీపీ సభ్యులు సభా సంప్రదాయాలను మర్చిపోతున్నారు. సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ సభలో దమ్ము ఉందా అంటూ మాట్లాడటం శోచనీయం. మాకు దమ్ముంది కాబట్టే 151 స్థానాలు ఇచ్చారు. మిమ్మల్ని ప్రజలు దుమ్ముదుమ్ముగా ఓడించారు. మళీŠల్ మిమ్మల్ని ఓడించడం ఖాయం. స్పీకర్‌ను దమ్ముందా అంటూ మాట్లాడిన వారికి సభలో ఉండే అర్హత లేదు. దమ్ము లేకనే బాబు పారిపోయాడు: మంత్రి జోగి రమేశ్ చంద్రబాబుకు చాదస్తం పెరిగిపోయింది. ఆ పార్టీ సభ్యుడు పయ్యావుల కేశవ్‌కు పైత్యం పుట్టుకొచ్చింది. దమ్ములేకనే మీ నాయకుడు చంద్రబాబు సభ నుంచి పారిపోయాడు. బయట చంద్రబాబు, సభలో టీడీపీ సభ్యులు అసత్యాలతో ప్రభుత్వంపైన, సీఎంపైన బురద జల్లుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థను కించపరిచినట్టు అంగీకరిస్తే కేశవ్‌ను, లేకుంటే ఈనాడులో అసత్యాలు ప్రచురించినందుకు రామోజీరావును సభకు పిలిపించి మోకాళ్లపై నిలబెట్టాలి. రాష్ట్రానికి శని ఎల్లో మీడియా: మంత్రి దాడిశెట్టి రాజా రాష్ట్రానికి ఎల్లో మీడియా శనిలా పట్టుకుంది. పూర్తి అసత్యాలతో కూడిన పేపర్లు నిత్యం ప్రభుత్వంపై విషం చిమ్ముతూనే ఉన్నాయి. అటువంటి సంస్థలను కచ్చితంగా శిక్షించాలి. రాజ్యాంగ వ్యవస్థను అవమానించేలా ఈనాడులో రాతలు రాసిన రామోజీరావును తీసుకొచ్చి సభలో నిలబెట్టాలి. బీసీలంటే బాబుకు అలుసు: మంత్రి అప్పలరాజు ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి స్పీకర్‌గా అవకాశం కల్పిస్తే ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు సభలో ఉండి కూడా మిమ్మల్ని(స్పీకర్) చైర్లో కూర్చోబెట్టడానికి రాలేదు. ఇప్పుడు ఆ పార్టీ సభ్యుడు దమ్ముందా అంటూ చైర్ పట్ల దురుసు ప్రవర్తన కూడా బీసీలను కించపరిచేలా ఉంది. రాజ్యాంగ వ్యవస్థలు, ప్రభుత్వం, సీఎంను అవమానించేలా మాట్లాడిన కేశవ్‌ను ప్రివిలేజ్ కమిటీ ద్వారా విచారించి కఠినంగా శిక్షించాలి. కేశవ్ ప్రవర్తనను సభ ఖండిస్తోంది: మంత్రి చెల్లుబోయిన వేణు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దురుసు ప్రవర్తనను సభ మొత్తం ఖండిస్తోంది. సభా వ్యవహారాల్లో అధికార పక్షం సమన్వయం పాటిస్తూ, ప్రజలకు మేలు చేసే అంశాలను ప్రస్తావిస్తుంటే ప్రతిపక్షం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. సభా మర్యాదకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిందే: మంత్రి బొత్స రాజ్యాంగ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరించడం దారుణం. ఇటువంటి తప్పు కేశవ్ చేసినా, ఈనాడు పేపర్ చేసినా చర్యలు తీసుకోవాల్సిందే. -
ప్రపంచంలోనే తొలిసారిగా ‘రైట్ టూ రిపేర్’ యాక్ట్
వినియోగదారుల హక్కులకు కాపాడేందుకు నడుం బిగించింది న్యూయార్క్ చట్టసభ. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో ఎంతో కాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపే దిశగా తొలిసారిగా అడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఫెయిర్ రిపేర్ యాక్ట్‌ను అమలు కోసం చట్టాన్ని సిద్ధం చేసింది. డిజిటల్ ఎలక్ట్రానిక్ వస్తువులకు ఏ చిన్న సమస్య వచ్చినా తిరిగి మాన్యుఫ్యాక్చరర్ సూచించి చోటే రిపేర్ చేయించుకోవాల్సి వస్తోంది. బయట చేయిస్తే వారంటీ, గ్యారంటీలు లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సార్లు రిపేర్ ఎలా చేయాలో కూడా తెలియని పరిస్థితి ఎదురవుతోంది. దీంతో వినియోగదారులు అనివార్యంగా తయారీదారు మీదే ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి అనేక సమస్యలకు చెక్ పెట్టే దిశగా న్యూయార్క్ చట్టసభ నడుం బిగించింది. న్యూయార్క్ చట్టసభ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై డిజిటల్ ఎలక్ట్రానిక్స్ తయారీదారులు ఏదైనా ప్రొడక్టును మార్కెట్లోకి తెచ్చినప్పుడు అందులో తలెత్తే సమస్యలు వాటికి పరిష్కారాలను కూడా సూచించాల్సి ఉంటుంది. కొనుగోలుదారులు రిపేర్ల కోసం తయారీదారులతో పాటు స్థానికంగా ఉండే రిపేర్ షాప్‌లను కూడా ఆశ్రయించవచ్చు. సాధ్యమైతే అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా వాళ్లే పరిష్కారం వెతుక్కొవచ్చు. అంతేకాదు రిపేరుకు అవసరమైన విడి భాగాలు, ఇతర టూల్స్ అమ్మకంపై తయారీదారులు విధించిన ఆంక్షలు కూడా తొలగిపోతాయి. చదవండి: అమెజాన్‌కి గుడ్‌బై చెప్పిన డేవ్‌క్లార్క్.. వీడిన 23 ఏళ్ల బంధం.. -
భారతీయ మహిళలది విశిష్ట స్థానం: నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతిలో మహిళలది విశిష్ట స్థానమని, వారికి మన సమాజంలో ఇస్తున్న గౌరవం, స్వేచ్ఛ మరింత పెరగాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం శాసనసభలోని తన చాంబర్లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు ధనసరి సీతక్క, బానోతు హరిప్రియ, పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, కల్వకుంట్ల కవితలను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర కీలకమన్నారు. వారి భాగస్వామ్యం ఉన్న కుటుంబాలే అందులో రాణిస్తాయని వెల్లడించారు. -
ఇక శివారులో శిబిరాలు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎన్నిక కోసం ముందు జాగ్రత్తగా టీఆర్ఎస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు వెళ్లిన ఓటర్లు, హైదరాబాద్ శివారులో జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన శిబిరాలకు చేరుకుంటున్నారు. బుధవారం రాత్రికల్లా వీరంతా తమ శిబిరాలకు చేరుకుంటారు. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు వీటిని పర్యవేక్షిస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధ, గురువారాల్లో జిల్లాల వారీగా ఓటర్లతో ఏర్పాటు చేసే సమావేశాల్లో పాల్గొని పోలింగ్‌పై అవగాహన కల్పించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేస్తారు. బృందాలుగా పోలింగ్ కేంద్రాలకు.. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఈ నెల 10న పోలింగ్ జరిగే ఆరు స్థానిక కోటా స్థానాలకు సంబంధించిన ఓటర్లను బృందాలుగా సంబంధిత జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తారు. మెదక్, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులు, నల్లగొండ, ఆదిలాబాద్‌తో పాటు కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండటంతో టీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా పోలింగ్ జరిగేలా జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలు ఉండటంతో ఏ ఒక్క స్థానం చేజారకుండా చూసేందుకు ఇక్కడి ఓటర్లను బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు తరలించిన విషయం తెలిసిందే. సుమారు వారం రోజులుగా ఈ క్యాంపు లో ఉన్న ఓటర్లు.. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో మంగళవారం తిరుమల దర్శనం అనంతరం హైదరాబాద్‌కు తిరుగుముఖం పట్టారు. బుధవారం ఉదయం శామీర్‌పేటలోని తమ బసకు చేరుకున్న అనంతరం ఓటర్లుగా ఉన్న పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ అవుతారు. మెదక్ జిల్లాకు చెందిన ఓటర్లను ఢిల్లీలోని శిబిరానికి తరలించగా, వారు ఆగ్రా, జైపూర్ పర్యటన ముగిం చుకుని బుధవారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. గోవా శిబిరంలో ఉన్న ఖమ్మం జిల్లా ఓటర్లు కూడా మంత్రి పువ్వాడ అజయ్ నేతృత్వంలో బృందాలుగా బుధవారం ఉదయానికి హైదరాబాద్‌కు చేరుకుంటారు. నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లా కు చెందిన ఓటర్లతో టీఆర్ఎస్ పార్టీ క్యాంపులు ఏర్పాటు చేయనప్పటికీ, వారిని కూడా బుధవారం హైదరాబాద్‌కు తరలించాలని సంబంధిత జిల్లా మంత్రులకు ఆదేశాలు వెళ్లాయి. -
నిజామాబాద్ నుంచి పోటీకే కవిత మొగ్గు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో టీఆర్ఎస్ స్వల్ప మార్పులు చేసింది. స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉండగా, టీఆర్ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థులకు ఆదివారం పార్టీ తరపున సమాచారం అందించారు. నిజామాబాద్ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోటీకి ఆసక్తి చూపకుంటే మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితకు అవకాశం ఇవ్వాలని తొలుత భావించారు. అయితే, కవిత మరోమారు సిట్టింగ్ స్థానం నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో లలితకు అవకాశం దక్కలేదు. కవిత మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటలకు నిజామాబాద్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు కవిత వెంట నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు. మహబూబ్‌నగర్ రెండో స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డికి బదులుగా గాయకుడు సాయిచంద్‌కు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారు. శాసనమండలిలో కాంగ్రెస్ శాసనసభా పక్షం విలీనం సందర్భంగా టీఆర్ఎస్లో చేరిన దామోదర్‌రెడ్డికి మళ్లీ అవకాశమిస్తామని అప్పట్లో కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తనకు మరోమారు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని దామోదర్‌రెడ్డి పట్టుబట్టారు. దీంతో చివరి నిమిషంలో ఆయనకు మరోమారు అవకాశం దక్కింది. జాబితాలో మార్పులతో చివరి నిమిషంలో సాయిచంద్‌కు టీఆర్ఎస్ అభ్యర్థిత్వం చేజారింది. పలువురి నామినేషన్లు టీఆర్ఎస్ తరపున స్థానిక సంస్థల కోటాలో పోటీ చేసే 12 మందిలో పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు (రంగారెడ్డి), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), తాతా మధు (ఖమ్మం), డాక్టర్ యాదవరెడ్డి (మెదక్) సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగియనుండటంతో మిగతా అభ్యర్థులు భానుప్రసాద్‌రావు, ఎల్.రమణ (కరీంనగర్), దండె విఠల్ (ఆదిలాబాద్), కల్వకుంట్ల కవిత (నిజామాబాద్), ఎంసీ కోటిరెడ్డి (నల్లగొండ), కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి (మహబూబ్‌నగర్) చివరిరోజు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. -
వక్ఫ్ ఆక్రమణలపై సీబీసీఐడీ విచారణ చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లో వక్ఫ్‌బోర్డు ఆస్తులు కబ్జాదారుల పాలవుతు న్నాయని, వీటిపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం స్పందించక పోవడం బాధాకరమని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 78 వేల ఎకరాల్లో వక్ఫ్ బోర్డు ఆస్తులున్నాయని, వీటిలో 50 శాతానికిపైగా ఆక్రమణలకు గురైనట్లు తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం జీరో అవర్‌లో అక్బరుద్దీన్ మాట్లాడారు. పల్లెల పేర్ల మార్పుపై రగడ ! పల్లెసీమలకు వందల ఏళ్లుగా ఉన్న పేర్లను యథాతథంగా కొనసాగించాలని, మార్చాల్సిన అవసరం లేదని ఎంఐఎంఎల్పీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. గ్రామాల పేర్ల మార్పు ప్రక్రియ ను సులభతరం చేస్తే హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి వంటి పేర్లు సైతం మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టిన తెలంగాణ పంచాయతీరాజ్ సవరణబిల్లు –2021ను ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ప్రశాంత తెలంగాణలో ఈ ప్రతిపాదనలతో సమస్యలు వస్తాయని కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క అన్నారు. -
చట్టసభల్లో కోర్టుల జోక్యం సరికాదు
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో చట్టసభల అధికారం వాటికే ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. అసెంబ్లీ అధికారాలు అసెంబ్లీకే ఉండాలని, ఈ విషయంలో కోర్టుల జోక్యం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.సంపత్‌కుమార్‌ల అసెంబ్లీ బహిష్కరణ అంశంపై కోర్టు తీర్పుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల వేతన సవరణపై పీఆర్సీ మధ్యంతర నివేదిక ఇంకా రాలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ప్రతిపాదించిన జోనల్ వ్యవస్థకు త్వరలోనే ఆమోదం వస్తుందని, నాలుగైదు రోజుల్లో నిర్ణయం రావొచ్చని చెప్పారు. దీనికోసమే పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపివేశామన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. గ్రూపుల వారీగా బీసీ లెక్కలు గ్రామపంచాయతీ ఎన్నికల వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. బీసీ జనాభాను గ్రూపుల వారీగా చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. మన రాష్ట్రంలో 1.30 లక్షల గ్రామపంచాయతీ వార్డులు ఉన్నాయి. బీసీల్లో ఐదు గ్రూపుల వారీగా వివరాలను సేకరించాలి. కులాల వారీగా లెక్కలు ఉంటేనే ఇది చేయగలం. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఉన్న లెక్కలు ఉన్నా.. కులాల వారీగా ఉంటేనే గ్రూపుల వారీగా కచ్చితంగా ఇవ్వగలం. నీతి ఆయోగ్‌లో పారదర్శకత లేదు నీతి ఆయోగ్ అంటే ఏదో నీతితో ఉండే పేరు కాదు. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. పేరులో ట్రాన్స్ఫార్మింగ్ అని ఉంది గానీ అందులో పారదర్శకత లేదు. నీతి ఆయోగ్ పేరు కింద ఉండే కొటేషనల్లో సమాఖ్య స్ఫూర్తి అని ఉంటుంది. కానీ చేతల్లో ఇది కనిపించడ లేదు. ప్రజాస్వామ్యంలో అధికారాల బదిలీ జరగాలి. కానీ దీనికి విరుద్ధంగా ఇంకా కేంద్రీకృతంగా మారుతోంది. రాష్ట్రాలను మున్సిపాలిటీలుగా మారుస్తున్నారు. నీతి ఆయోగ్ గత సమావేశంలో నేను ఇదే విషయాన్ని మొహం మీదే చెప్పా. అందరు సీఎంలు అభినందించారు. రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు, పథకాలు ఉండాలి. ఆరోగ్య సమస్యల విషయంలో తెలంగాణలో ఉండే రోగాలు వేరు, కోస్తా తీరంలో వచ్చే రోగాలు వేరు. కేరళలో వంద శాతం అక్షరాస్యత ఉంది. అయితే వయోజనుల విద్య కోసమని రెండు శాతం నిధులను తీసుకుంటున్నట్లు ఆ రాష్ట్ర సీఎం చెప్పారు. ఇలా చేయాల్సిన అవసరం ఎందుకు? అలాగే వ్యవసాయ విధానాలు ప్రాంతాలకు అనుగుణంగా ఉండాలి. స్థానిక పరిస్థితులకు తగినట్లుగా విధానాలు ఉండాలి. ఆర్థికవేత్తలుగా చెప్పుకునే కొందరు పంటకు కనీస మద్దతు ధరల విషయం వచ్చేసరికి ద్రవ్యోల్బణం అని, ఇంకోటని చెబుతారు. ఇలాంటి వారు చెప్పేవి వాస్తవాలు కాదు. ఒకేసారి రుణ మాఫీ సాధ్యం కాదు ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్ వారు ఆపద మొక్కుల తరహాలో హామీలిస్తున్నారు. ఒకేసారి రెండు లక్షల రుణ మాఫీ అని ప్రకటిస్తున్నారు. ఇది సాధ్యం కాదు. పంజాబ్‌లో హామీ ఇచ్చారు. ఇప్పుడు సాధ్యం కాదని చెబుతున్నారు. కర్ణాటకలో సీఎం కుమారస్వామి నన్నే అడిగారు. మన రాష్ట్రంలో చేసిన విధానం చెప్పా. ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10,500 కోట్ల ఆదాయం వస్తుంది. రెండు లక్షల రుణ మాఫీ ఒకేసారి చేయాలంటే ఏడాదిపాటు ఎలాంటి ఇతర ఖర్చులు చేయవద్దు. కాంగ్రెస్ నేతల హామీలు ఎలా సాధ్యమో ప్రజలకు వివరించాలి. ఆసరా పింఛన్లు, ఉద్యోగుల వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, రేషన్ బియ్యం ఏది ఆపేస్తారో చెప్పాలి. అయినా రెండు లక్షల రుణ మాఫీ అని రాహుల్‌గాంధీ గత ఎన్నికల్లోనూ ప్రకటించారు. ప్రజలు నమ్మలేదు. నిరుద్యోగభృతి అని చెబుతున్నారు. హామీ ఇవ్వడం కాదు ఎలా అమలు చేస్తామో స్పష్టత ఇవ్వాలి. ఎవరు నిరుద్యోగి అనేది వివరించాలి. ఎక్కడి నుంచి నిధులు తెస్తారో చెప్పాలి. ఏపీలో మహిళా స్వయం సహాయ సంఘాల రుణాలను మాఫీ చేస్తామని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారు. ఇదే హామీ ఇక్కడ చేద్దామని మా పార్టీ నేతలు నాపై ఒత్తిడి తెచ్చారు. సాధ్యం కాదని వద్దని చెప్పా. కాంగ్రెస్ అధికారంలోకి రాదు కాబట్టి ఆ పార్టీ నేతలు ఏదైనా చెబుతారు. మన పథకాలే ఉత్తమం: కాంగ్రెస్ కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వీటికి రెండు మూడు నెలల ముందు కొన్ని పథకాలను ప్రారంభించింది. అభయహస్తం, బంగారుతల్లి ఇలాంటివే. ఎప్పుడో 30 ఏళ్ల తర్వాత ప్రయోజనం కలిగే పథకాలివి. వీటిని అమలు చేయలేమని అసెంబ్లీలోనే నేను స్పష్టంగా చెప్పా. పేద కుటుంబాలకు చెందిన ఆడ పిల్లల పెళ్లిళ్లకు తక్షణ అవసరాలు తీరేలా పథకాలు అమలు చేస్తున్నాం. కేంద్రం ప్రకటించిన ఆయుష్మాన్‌భవలో ఎందుకు చేరడంలేదని ప్రధాని అడిగారు. అంతకంటే మంచిగా అమలు చేస్తున్నామని చెప్పాం. మనం అమలు చేస్తున్న పథకం సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకుంటామని కేంద్రం అడిగింది. మన ప్రభుత్వ పేరును చేర్చాలని చెప్పాం. పేరు పెడతారో లేదో చూడాలి. కేంద్రం ప్రకటించిన బీమా పథకం కంటే మనది ఉత్తమమైనది. రాష్ట్రంలోని రైతు బీమా పథక ంలో ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఏదీ ఒకరోజులో జరగదు కొందరు ఇదేనా బంగారు తెలంగాణ అని మాట్లాడుతున్నారు. ఏదీ ఒకరోజులో జరగదు. హైదరాబాద్‌ను మహానగరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. రూ.50 వేల కోట్లతో ప్రణాళిక రూపొందించాం. మొక్కను పెడితే కొన్ని ఏళ్లకు చెట్టవుతుంది. ఒకేరోజులో పెరిగితే అది చెట్టు కాదు. బ్రహ్మ రాక్షసి అవుతుంది. వాస్తవాలు పట్టించుకోకుండా ఏది పడితే అది మాట్లాడవద్దు. సింగపూర్ ఒక్కరోజులో నిర్మాణం కాలేదు. -
ప్రైవేటు వర్సిటీల బిల్లుకు సభ ఓకే
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును బుధవారం శాసనసభ ఆమోదించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలను నీరుగార్చడానికే ఈ బిల్లు తెస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వర్సిటీల్లో బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయకుండా తాత్సారం చేస్తూ ఇప్పుడు ప్రైవేట్ బాట పడుతున్నారని నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ, టీడీపీ, సీపీఎం వాకౌట్ చేశాయి. అయితే ప్రైవేటు వర్సిటీల విషయంలో ఎలాంటి ఆందోళన, అపోహలూ అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రభుత్వ వర్సిటీలను కాపాడుకుంటూనే ప్రైవేటుకు అనుమతిస్తున్నామన్నారు. వచ్చే జూన్, జూలై నాటికి వర్సిటీల్లో 1,061 అధ్యాపక ఖాళీలను భర్తీ చేస్తామని, వాటిని బలోపేతం చేస్తామని వెల్లడించారు. బిల్లుపై ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, కె.లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, సున్నం రాజయ్య, జలగం వెంకట్రావు లేవనెత్తిన అంశాలకు ఆయన బదులిచ్చారు. తెలంగాణ విద్యార్థులకు కూడా ప్రైవేట్ రంగంలో నాణ్యమైన విద్య అందించే ఉద్దేశంతోనే బిల్లు తెచ్చామన్నారు. ‘‘రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్న ప్రభుత్వం వర్సిటీలను బలహీనపరిచే చర్యలు చేపట్టదు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వరంగంలో విద్యాభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. గత ప్రభుత్వం వర్సిటీలిచ్చినా నిధులివ్వలేదు. పోస్టులు మంజూరు చేయలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే నిధులిస్తోంది. పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతోంది’’అని చెప్పారు. ఉస్మానియా వర్సిటీపై ఎందుకంత కోపమని కె.లక్ష్మణ్ అనడాన్ని కడియం తప్పుబట్టారు. ‘‘రాష్ట్ర బీజేపీ నేతల ఆలోచనలు గ్రేటర్ హైదరాబాద్‌ను దాటడం లేదు. వారిది జాతీయ పార్టీ అని మరుస్తున్నారు. ప్రైవేటు వర్సిటీలకు ప్రభుత్వ భూమి ఇవ్వడం లేదు. మైనారిటీల కోసం వాటిలో ప్రత్యేకంగా చేపట్టాల్సిన చర్యలపై సభ్యులతో చర్చించి నిబంధనల్లో పొందుపరుస్తాం. అలాగే కార్పస్ ఫండ్ అంశాన్ని కూడా. ఏ రాష్ట్రంలోనూ లేనట్టుగా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రైవేటు యూనివర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించే నిబంధన పెట్టాం’’అన్నారు. సామాజిక రిజర్వేషన్లు లేవంటూ వాకౌట్.. సామాజిక రిజర్వేషన్లను బిల్లులో పొందుపరచలేదంటూ కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, సున్నం రాజయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ప్రైవేటు వ్యాపారానికి బిల్లు అవకాశం కల్పించేలా ఉంది. దీంతో రాష్ట్రంలోని వర్సిటీలు పూర్తిగా దెబ్బతింటాయి. బిల్లులో రాష్ట్ర విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇవ్వాలని ఉందే తప్ప, సామాజిక రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ ప్రస్తావన లేదు. మంత్రి స్పష్టతా ఇవ్వలేదు. వర్సిటీలను బలోపేతం చేయాలన్న ఆలోచన ఉంటే నాలుగేళ్లుగా చేయలేదేం? ఉస్మానియా, కాకతీయ వర్సిటీల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేటు వర్సిటీల్లో అన్ని కోర్సులకు అనుమతిస్తే మిగతావి ఏం కావాలి?’’అని ప్రశ్నించారు. బిల్లును ఉపసంహరించాలని సీపీఎం, సెలెక్ట్ కమిటీకి పంపి మార్పుచేర్పులు చేయాలని బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. వారి వాకౌట్ అనంతరం బిల్లును సభ ఆమోదించింది. -
సంక్షోభంలో న్యాయ వ్యవస్థ
శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య మన రాజ్యాంగం సున్నితమైన సమతౌల్యం ఉండేటట్టు చేస్తుంది. ఇందులో ఏదీ ఒకదానిని ఒకటి అధిగమించకుండా చూస్తుంది. పార్లమెంట్ చట్టాలను రూపొందిస్తుంది. కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేస్తుంది. న్యాయ వ్యవస్థ ఆ చట్టాలను విశ్లేషిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వ విధానంలోని మంత్రిమండలి విధానాన్ని మనం స్వీకరించాం. అధికారాల విభజన, న్యాయ సమీక్ష వ్యవస్థను అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. రాజ్యాంగ నాలుగో భాగంలో పొందుపరిచిన ఆదేశిక సూత్రాల ఆలోచన ఐరిష్ రాజ్యాంగం నుంచి తెచ్చుకున్నాం. వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించిన తరువాత, మన దేశ సామాజిక, మత పరిస్థితులను; అవిద్య, దారిద్య్రం వంటి అంశాలకు అన్వయించుకుంటూ మన రాజ్యాంగ నిర్మాతలు ఒక విస్తృత రాజ్యాంగాన్ని అందించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ సభ సలహాదారు బీఎన్ రావు, ముసాయిదా సంఘం అధ్యక్షుడు, భారతజాతి రాజ్యాంగ పితగా గౌరవించే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ల సేవలను స్మరించుకోవాలి. న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని పరిరక్షించేందుకుగాను న్యాయమూర్తుల నియామకం గురించి రాజ్యాంగ పరిషత్‌లో కొన్ని అభిప్రాయాలు వ్యక్తమైన సంగతి ఆసక్తికరంగా ఉంటుంది. ఉన్నత న్యాయస్థానాలలో జరిగే నియామకాలు భారత ప్రధాన న్యాయమూర్తి సమ్మతితో జరగాలన్నది అందులో ఒకటి. కానీ దీనిని డాక్టర్ అంబేడ్కర్ చాలా గట్టిగా నిరాకరించారు. ప్రధాన న్యాయమూర్తి చాలా సమర్థుడైన వ్యక్తేనని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నప్పటికీ, ఆయనకు కూడా మనుషులందరికీ ఉండే భావాలే ఉంటాయని అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు. భారత ప్రధాన న్యాయమూర్తి నియామకాన్ని మూడింట రెండువంతుల సభ్యుల అంగీకారం ద్వారా ఖరారు చేసే అధికారాన్ని పార్లమెంట్‌కు కట్టబెట్టాలంటూ మరొక ప్రతిపాదన కూడా వచ్చింది. దీనిని కూడా అంబేడ్కర్ నిరాకరించారు. రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ కారణాలు ఆ అధికారాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని అంబేడ్కర్ విశ్లేషించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి తొలగింపు విధానం గురించి ఆర్టికల్ 124(4) వివరిస్తుంది. దీనినే అభిశంసన అని పిలుస్తారు. ఇందుకు పార్లమెంట్ ఉభయ సభలలో మూడింట రెండువంతులకు తగ్గకుండా సభ్యుల మద్దతు ఉండాలి. అలాగే ఓటింగ్ తప్పనిసరి. అనుచిత ప్రవర్తన, అసమర్థత కారణాలుగా వారిని తొలగించడానికి అవకాశం ఉంది. హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆ రాష్ట్ర గవర్నర్, న్యాయమూర్తిని నియమిస్తున్న ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రతించిన తరువాత రాష్ట్రపతి చేపడతారు. హైకోర్టు న్యాయమూర్తి తొలగింపు విధానం కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే తీరులోనే ఉంటుంది. దీనిని గురించి ఆర్టికల్ 217(1) వివరిస్తుంది. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల తొలగింపు కోసం 1968లో పార్లమెంట్ న్యాయమూర్తుల దర్యాప్తు చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం పరిధిలో 1969లో వారి తొలగింపు విధివిధానాలను రూపొందించింది. వందమంది లోక్‌సభ సభ్యులు, లేదా 50 మంది రాజ్యసభ సభ్యులు స్పీకర్ లేదా చైర్మన్ల వద్ద తొలగింపు కోసం తీర్మానాన్ని ప్రతిపాదించవచ్చు. పరిశీలన తరువాత ఆ తీర్మానాన్ని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఆ తీర్మానాన్ని కనుక అనుమతిస్తే ఈ అంశాన్ని ముగ్గురు సభ్యులతో కూడిన ఒక సంఘానికి నివేదిస్తారు. ఇందులో ఒక సభ్యుడిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల నుంచి ఎంపిక చేస్తారు. ఒకరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నుంచి ఎంపిక చేస్తారు. రాజ్యాంగ నిపుణుడని స్పీకర్ లేదా చైర్మన్ భావించిన వ్యక్తిని మూడో సభ్యునిగా ఎంపిక చేస్తారు. ఈ సంఘం దర్యాప్తు పూర్తి చేసి, నివేదిక సమర్పించిన తరువాత సదరు న్యాయమూర్తి దోషి అని తేలితే అప్పుడు తొలగింపు తీర్మానాన్ని పరిగణనలోనికి తీసుకుంటారు. అయితే ఈ పద్ధతి పూర్తిగా నిష్ఫలమైనదని గతానుభవం రుజువు చేసింది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత రెండు సందర్భాలలో మాత్రమే న్యాయమూర్తులను అభిశంసించాలని కోరడం జరిగింది. వారు– సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. రామస్వామి, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమిత్రా చటర్జీ. ఇందులో జస్టిస్ రామస్వామి మీద ప్రవేశపెట్టిన తొలగింపు తీర్మానం వీగిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఓటింగ్‌కు గైర్హాజరు కావడమే ఇందుకు కారణం. ఇక లోక్‌సభ ఓటింగ్‌కు చేపట్టడానికి ముందే జస్టిస్ సౌమిత్రా చటర్జీ పదవికి రాజీనామా చేశారు. కేశవానందభారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం (ఏఐఆర్ 1973 ఎస్సీ 1461) కేసులో స్వతంత్ర న్యాయవ్యవస్థ రాజ్యాంగ మౌలిక లక్షణాలలో ఒకటని 13 మంది సభ్యుల ధర్మాసనం తేల్చి చెప్పింది. న్యాయమూర్తుల నియామకంలో ప్రతిభ కాకుండా మిగిలిన అంశాలు నిర్వహించిన పాత్ర అప్రాధాన్యమైనదని చెప్పలేం. కొన్ని కేసులలో రాజకీయ ప్రమేయం, ప్రాంతీయ, మతపరమైన మనోభావాలు ప్రధానంగా ప్రభావం చూపాయి. ప్రఖ్యాత భారత రాజ్యాంగ వ్యాఖ్యాత గ్రన్విల్లే ఆస్టిన్ కూడా నియామకాలలో పైకి చెప్పని ఉద్దేశాలు ఉన్నాయనే చెప్పారు. కోర్టులలో కేసులు పేరుకు పోవడానికి కారణం తృప్తికరంగా లేని న్యాయమూర్తుల నియామకం కారణమని ఎంసీ సెతల్వాడ్ నాయకత్వంలోని మొదటి లా కమిషన్, భారత మాజీ అటార్నీ జనరల్ అభిప్రాయం. ఇలాంటి లోపాలు ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థ ఒడిదుడుకులకు లోను కాలేదు. కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య వైరుధ్యం పొడసూపినా, లేదా కార్యనిర్వాహక శాఖలోనే అంతర్గత విభేదాలు వచ్చినప్పటికీ వివాదాలు బయటకి పొక్కలేదు. ఇలాంటి చిన్న చిన్న విభేదాలను ఆ విధానం తనలోనే దాచేసుకుంది. న్యాయమూర్తుల నియామకం విధానం 1950 నుంచి 1993 వరకు తృప్తికరంగానే సాగింది. ఈ కాలంలో భారత ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయానికి ఆమోదం లభించని సందర్భాలు ఏడు కనిపిస్తాయి. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1993 (4) ఎస్సీసీ 441) కేసులో జస్టిస్ ఏ ఎం అహ్మదీ ఇచ్చిన మైనారిటీ తీర్పులో ఇందుకు సంబంధించిన గణాంకాలు కనిపిస్తాయి. ఈ కేసునే సెకెండ్ జడ్జస్ కేసు అని పేర్కొంటూ ఉంటారు. జస్టిస్ జేఎస్ వర్మ వివరించిన మేరకు, ఈ తీర్పు ప్రకారం మెజారిటీ విశ్లేషించినదేమిటంటే, న్యాయమూర్తిగా నియమించడానికి సిఫారసు చేయదలిచిన వ్యక్తులలో ప్రతికూల లక్షణాలు ఉంటే వాటిని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లడమనే పాత్రకు మాత్రమే కార్యనిర్వాహక వ్యవస్థ పరిమితం కావాలి. దీనితో కార్యనిర్వాహక వ్యవస్థ పాత్ర నిష్ఫలమైంది. కొలీజియం న్యాయమూర్తుల నియామకంలో చట్టబద్ధమైన అధికారం కలిగిన సంస్థ అయింది. కొలీజియం సిఫారసులను కొట్టివేసే అధికారం ఏ కోర్టుకు లేదు. కోలీజియం సిఫారసుల మేరకు నియామకాలు జరపడానికే న్యాయ సమీక్షకు ఉన్న అధికారం పరిమితమైంది. న్యాయమూర్తుల నియామకంలో మంత్రి మండలి రాష్ట్రపతికి సలహా ఇవ్వడం కూడా లాంఛనంగా మారింది. కొలీజియం సిఫారసులను కార్యనిర్వాహక వ్యవస్థ రాష్ట్రపతికి తెలియ చేస్తే ఆయన నియామకాలు చేపడతారు. ఇందులో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే సెకెండ్ జడ్జస్ కేసులో మెజారిటీ తీర్పును రచించిన జస్టిస్ జేఎస్ వర్మ తరువాత తన అభిప్రాయం మార్చుకున్నారు. న్యాయమూర్తుల నియామకాలను జాతీయ జ్యుడీషియల్ కమిషన్ చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఉప రాష్ట్రపతి/ప్రధాని/ భారత ప్రధాన న్యాయమూర్తి తదితరులు ఇందులో సభ్యులుగా ఉండాలని ఆయన చెప్పారు. అసలు ఎలాంటి న్యాయమూర్తులు దేశానికి కావాలి? రాజ్యాంగ పరిషత్‌లో ప్రసంగించినప్పుడు నెహ్రూ, ఆ న్యాయమూర్తులు అత్యంత విజ్ఞానవంతులు కావాలని అభిప్రాయపడ్డారు. ప్రతి ప్రజాస్వామిక దేశంలోను పాలన పాలించేవారి అనుమతితో సాగుతుంది. అమెరికాలో న్యాయమూర్తుల నియామకానికి సెనేట్ ఆమోదం అనివార్యం. కానీ ఇక్కడ కార్యనిర్వాహక వ్యవస్థ పూర్తిగా దూరంగా ఉండిపోయింది. దీనితో జవాబుదారీ తనం గురించిన ప్రశ్న తలెత్తింది. పార్లమెంట్ చేసిన నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ చట్టం, 2014 దీని ఫలితమే. దీనిని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు వ్యతిరేకించారు. న్యాయమూర్తుల నియామకంలో న్యాయవ్యవస్థదే పై చేయి అన్న సంగతి సెకెండ్ జడ్జస్ కేసుతోనే నిర్ధారణ అయిందని నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్, జస్టిస్ గోయెల్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ మెజారిటీ తీర్పులో పునరుద్ఘాటించారు. కొలీజియం పని విధానాన్ని మెరుగు పరచడానికి తీసుకోవలసిన చర్యల గురించి ఆలోచించవలసిందని కోరుతూ 16–12–2015న రాజ్యాంగ ధర్మాసనం ఒక ఆదేశాన్ని జారీ చేసింది. సీనియర్ న్యాయవాదులు, న్యాయ నిపుణుల సలహాలను కూడా కోరారు. ఈ సలహాలను గ్రంథస్థం చేయడానికి ఒక సంఘాన్ని కూడా నియమించారు. న్యాయమూర్తుల నియామకంలో కొలీజియం ఈ వాస్తవాలను పరిగణనలోనికి తీసుకోవాలని భావించారు. అవి– అర్హత ప్రమాణం, నియామక విధానంలో పారదర్శకత, సరైన విధాన అవగాహన నిర్వహణకు ఒక సచివాలయం ఏర్పాటు. అయితే కొలీజియం వ్యవహార సరళి, ఉన్నత న్యాయస్థానాలలో న్యాయమూర్తుల నియామకం గురించి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ కొలీజియం సభ్యుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జె. చలమేశ్వర్ భారత ప్రధాన న్యాయమూర్తికి సెప్టెంబర్, 2016లో ఒక లేఖ రాశారు. దేశంలో సాగుతున్న పాలన, శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య రాజ్యాంగం నిర్దేశించిన సున్నిత సమతౌల్యం మీద అది చూపుతున్న ప్రభావం గురించి కొన్ని సంక్లిష్ట ప్రశ్నలను ఆ లేఖ లేవనెత్తింది. పత్రికలలో వెలుగు చూసిన మేరకు ఆ లేఖలో ఆయన కొలీజియం పద్ధతి పారదర్శకంగా లేదని పేర్కొన్నారు. అయితే ఆ న్యాయమూర్తి లేవనెత్తిన అంశాలను పరిష్కరించారో లేదో మాత్రం తెలియదు. కొలీజియం వ్యవహారాలేవీ ప్రజలకు తెలియవు. ఆఖరికి కొలీజియంలో సభ్యులు కాని ఉన్నత న్యాయమూర్తులకు కూడా అక్కడ జరిగిన చర్చల వివరాలు తెలియవు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తులు, కొలీజియంలో కూడా సభ్యులు అయిన జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు 12–1–2018న విలేకరుల సమావేశంలో గళం విప్పడం దేశంలో సంచలనమైంది. ఈ నలుగురిలో సీనియర్ చలమేశ్వర్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇందులో జస్టిస్ గొగొయ్ తరువాత భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలు ఉన్నవారు. ఆ నలుగురు రెండు మాసాల క్రితం ప్రధాన న్యాయమూర్తికి ఉమ్మడిగా రాసిన లేఖ ప్రతిని కూడా విలేకరులకు అందించారు. కొలీజియం వ్యవస్థలోని దోషాల గురించి ఆ లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి సహేతుకత లేకుండా కేసులను ధర్మాసనాలకు కేటాయిస్తున్న తీరును గురించే వారు ప్రధానంగా లేఖలో ఆరోపణలు చేశారు. ఆ తరువాత కూడా కొన్ని పరిణామాలు జరిగాయి. సీపీఐ నాయకుడు డి. రాజా వెళ్లి చలమేశ్వర్‌ను ఆయన నివాసంలో కలుసుకోవడం గురించి కొన్ని పత్రికలు విమర్శించాయి. ఆ తరువాత అసలు న్యాయవ్యవస్థను అపఖ్యాతి పాలు చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయంటూ ఆరెస్సెస్ కార్యకర్త ఒకరు పత్రికా ప్రకటన ఇచ్చారు. ఇంకా సీపీఎం నాయకుడు యేచూరి ఉన్నత న్యాయస్థానంలో పనితీరు దిగజారడం, న్యాయమూర్తుల మధ్య విభేదాల గురించి గళమెత్తడంతో అసలు ప్రధాన న్యాయమూర్తి మీద అభిశంసన తీసుకురావడానికి సంకేతమనే అనుమానాలు కలిగించింది. (27–1–2018న హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ మేధావుల ఫోరమ్ సభలో చదివిన ఉపన్యాసం) జస్టిస్ ఎం.ఎన్. రావ్ వ్యాసకర్త హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి -
కాంగ్రెస్‌కు వ్యూహమే లేదు: హరీశ్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాల చర్చల్లో పాల్గొనడానికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు ఎలాంటి వ్యూహం లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజా సమస్యలపై చర్చను వదిలేసి రాజకీయ వేదికగా అసెంబ్లీని వాడుకోవాలని చూస్తోందన్నారు. బుధవారం ఆయన మీడియాతో ముచ్చటించారు. ఎజెండా లేకుండా, ఏ అంశానికి ప్రాధాన్యం ఉందో తెలుసుకోలేకపోతోందన్నారు. లేవనెత్తకూడని అంశాలను లేవనెత్తి తామే ఇరుక్కుని ఇబ్బంది పడుతున్నారన్నారు. లోతుగా అధ్యయనం చేయకుండా సభకు వస్తున్న ప్రధాన ప్రతిపక్షం విమర్శల పాలవుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యుల రొటేషన్: తలసాని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సమావేశాలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. సభలో చర్చ జరిగే సమయంలో కాంగ్రెస్ సభ్యులంతా ఉండడం లేదన్నారు. రొటేషన్ పద్ధతిలో నలుగురు చొప్పున సభకు వస్తున్నారని పేర్కొన్నారు. -
ఏడాది చివరికల్లా మెట్రో పరుగులు!
సబర్మతి ఫ్రంట్ మాదిరిగా మూసీ సుందరీకరణ: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మెట్రో రైలు ఈ ఏడాది చివరిలోగా పరుగులు పెడుతుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. బుధవారం శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు 29 కిలోమీటర్లు, నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వరకు 27 కిలోమీటర్ల మెట్రో మార్గం డిసెంబర్ ఆఖరుకల్లా అందుబాటులోకి రానుందని చెప్పారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ‘స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డీపీ)’తో పాటు నాలుగు ప్రాంతాల్లో స్కైవేలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో రూ.వెయ్యి కోట్లు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. హైదరాబాద్ జలమండలికి కూడా అదే స్థాయిలో రూ.1,420 కోట్లు కేటాయించామన్నారు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను నియంత్రించడానికి, సంబంధిత కేసులను వేగంగా పరిష్కరించడానికి బిల్డింగ్ ట్రిబ్యునల్‌ను త్వరలోనే ఏర్పాటు చేయ బోతున్నామని మంత్రి వెల్లడించారు. జీహెచ్ఎంసీతో పాటు అన్ని పట్టణాల్లోనూ పైసా లంచం ఇవ్వకుండా ప్రజలు గృహ నిర్మాణ అనుమతులు పొందేలా చర్యలు చేపట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. -
విభిన్న ప్రతిభావంతుల సమస్యలపై చట్టసభల్లో చర్చ
– ఒకరోజు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సూచనలు తీసుకుంటాం – శాసనమండలి చైర్మన్ చక్రపాణియాదవ్ కర్నూలు(అర్బన్): విభిన్న ప్రతిభావంతుల సామాజిక, ఆర్థిక పరిపుష్టికి సంబంధించి ప్రత్యేక అజెండాను రూపొందించి శాసనసభ, శాసనమండలిలో ఒక రోజు సంపూర్ణ చర్చ జరిగేందుకు కృషి చేస్తామని శాసనమండలి చైర్మన్ డా.ఏ చక్రపాణియాదవ్ అన్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సూచనలు, సలహాలు స్వీకరించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రయోజన పూర్వకమైన ఉత్తర్వులను తీసుకువస్తామన్నారు. శనివారం ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్థానిక అంబేడ్కర్‌భవన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రపాణియాదవ్ మాట్లాడుతూ వికలాంగుల్లో ఎనలేని శక్తి సామర్థ్యాలు దాగి ఉంటాయని, వాటిని వెలికితీసేందుకు కృషి చేయాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు వారికి అండగా మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్ మాట్లాడుతూ జిల్లాలో 55 వేల మందికి వికలాంగ పింఛన్లు ఇస్తున్నామని, ఏ కుటుంబంలోనైనా 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఉంటే ఆయా కుటుంబాలకు అంత్యోదయ కార్డులు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇందుకు సంబంధించి గుర్తింపు ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఈ నెలలో జరగనున్న సదరం క్యాంపులో దివ్యాంగులు దరఖాస్తులు అందించి తగిన సర్టిఫికెట్లు పొంది పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కర్నూలులో సెన్సరీ పార్కు ఏర్పాటుకు రూ. 5 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. అనంతరం వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, వివాహ ప్రోత్సాహకాలు అందించారు. కార్యక్రమంలో జేసీ–2 ఎస్ రామస్వామి, ఉపాధ్యాయులు పుష్పరాజ్, ఉద్యోగ సంఘాల ప్రతినిధి కృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో విభిన్న ప్రతిభావంతులు హాజరయ్యారు. -
మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు
♦ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం ♦ మద్దతు ప్రకటించిన విపక్షాలు ♦ మహిళలకూ కోటా కావాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి ♦ అంగీకరించిన ముఖ్యమంత్రి.. అప్పటికప్పుడు బిల్లుకు సవరణ సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఇక రిజర్వేషన్ విధానం అమలు కానుంది. పాలకమండళ్ల నియామకం విషయంలో రిజర్వేషన్లకు అవకాశం కల్పించేలా చట్టసవరణ చేస్తూ ప్రతిపాదించిన బిల్లుకు మంగళవారం శాసనసభ ఆమోదముద్ర వేసింది. దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి విధానం మరెక్కడా లేదని ప్రభుత్వం పేర్కొనగా, ఈ బిల్లుకు అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. దీంతో సభ ఏకగ్రీవంగా దీనికి ఆమోదం తెలిపింది. కేవలం కులాలవారీగా రిజర్వేషన్లను బిల్లులో పొందుపరచగా, అందులో మహిళలకూ రిజర్వేషన్ ద్వారా చోటు కల్పించాలన్న కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి సూచనను సభ పరిగణనలోకి తీసుకుంది. దాన్ని బిల్లులో పొందుపరచాల్సిందిగా సభా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సూచించడంతో అప్పటికప్పుడు సవరణ చేసి ఆమోదించడం విశేషం. విపక్షాలు చేసే ఇలాంటి మంచి సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని, ఇదేవిధంగా బంగారు తెలంగాణకు అంతా కలసి కృషి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం డాక్టర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, రాజీవ్‌గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లుల ఆమోదం అయిన వెంటనే మంత్రి హరీశ్‌రావు మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా లేనట్టుగా మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం విషయంలో సామాజిక న్యాయం పాటించేలా రిజర్వేషన్ విధానం అమలు చేయటాన్ని స్వాగతిస్తున్నట్టు కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి పేర్కొన్నారు. అయితే కులపరమైన రిజర్వేషన్లతో సరిపుచ్చకుండా లింగభేదాన్ని కూడా అందులో చేరిస్తే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. దానికి వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ‘చిన్నారెడ్డి మంచి సూచన చేశారు. మహిళలకు ప్రాధాన్యం అవసరం. 33 శాతం కోటాను వారికి కేటాయించేలా మార్చి బిల్లుకు ఆమోదం తెలిపితే బాగుంటుంది’ అంటూ స్పీకర్‌ను కోరారు. ఆయన సూచన మేరకు సిబ్బంది అప్పటికప్పుడు బిల్లుకు సవరణ చేశారు. గుజరాత్లో అమలులో ఉన్నట్టు రైతులే పాలకమండలిని ఎన్నుకునే విధానం అందుబాటులోకి తేవాలని చిన్నారెడ్డి సూచించారు. ముందుగా రిజర్వేషన్ల ప్రకారం కొత్త కమిటీలు వేసి మార్కెట్లను పటిష్ట పరచిన తర్వాత దాన్ని పరిశీలిద్దామని ముఖ్యమంత్రి సభ దృష్టికి తెచ్చారు. మహిళల కోటా ప్రకటించటం పట్ల అధికార పక్ష సభ్యురాలు సురేఖ హర్షం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లలో మైనారిటీలను కూడా చేర్చాలని దేశం సభ్యుడు సండ్ర సూచించగా, ఆ విషయం బిల్లులో ఉందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మహిళలకూ మార్కెట్ కమిటీలో చోటు కల్పించేలా రిజర్వేషన్ అమలు చేయాలని తాము ప్రతిపాదిద్దామనుకున్న తరుణంలో స్వయంగా ముఖ్యమంత్రే స్పందిం చటం సంతోషంగా ఉందని బీజేపీ సభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. ఇది మంచి నిర్ణయమని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడు పాయం వెంకటేశ్వర్లు, సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్, మజ్లిస్ సభ్యుడు జాఫర్ హుస్సేన్‌లు పేర్కొన్నారు. మార్కెట్‌యార్డులలో ఆన్లైన్ విధానం: హరీశ్‌రావు లోపభూయిష్టంగా ఉన్న మార్కెట్‌యార్డులను పటిష్టపరిచి అక్రమాలకు తావులేకుండా ఆన్లైన్ విధానాన్ని ప్రారంభిస్తున్నామని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రయోగాత్మకంగా గడ్డిఅన్నారం, బోయిన్పల్లి మార్కెట్లలో ప్రవేశపెడితే వాటి ఆదాయం పెరిగిందని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడించారు. రూ. 1,024 కోట్లతో కొత్తగా గోడౌన్లు నిర్మిస్తున్నామని, త్వరలో కొన్ని మార్కెట్లలో కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తామని వెల్లడించారు. సీఎంకు మహిళా ఎమ్మెల్యేల కృతజ్ఞతలు మహిళల సంక్షేమానికి పాటు పడడంతో పాటు వారికి సముచిత గౌరవం దక్కేవిధంగా మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించినందుకు టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లకు సంబంధించి సభలో బిల్లు పాసయిన అనంతరం టీ విరామ సమయంలో డిప్యూటీ స్పీకర్పద్మా దేవేందర్‌రెడ్డి, వి.సునీత, కొండా సురేఖ, బొడిగె శోభ, కోవా లక్ష్మి, అజ్మీరా రేఖా నాయక్ తదితరులు సీఎం చాంబర్లో కేసీఆర్‌ను కలిశారు. సీఎం నిర్ణయాలు తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో పెంచే విధంగా ఉన్నాయని వారన్నారు. -
చట్టసభలపై ప్రజలకు నమ్మకం పోతోంది
లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహజన్ గాంధీనగర్: చట్టసభలపట్ల దేశ ప్రజలకు నమ్మకం పోతోందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో జరిగిన 78వ ఆలిండియా ప్రిసైండింగ్ ఆఫీసర్ల సమావేశంలో శుక్రవారం ఆమె మాట్లాడారు. ప్రజాధనం వృథా తప్ప చట్టసభల్లో నిర్ధిష్టంగా ఏమీ జరగడంలేదని ప్రజలు భావిస్తున్నారని, దీంతో వాటిపట్ల నమ్మకం సడలుతోందని, పార్లమెంటును స్తంభించే సందర్భాలు పెరుగుతుండడం బాధాకరమని పేర్కొన్నారు. చట్టసభల్లో చర్చ అర్థవంతంగా సాగేవిధంగా స్పీకర్లు కృషి చేయాలని, తమఅధికారాలను ఉపయోగించాలని సూచించారు. -
మూజువాణి ఓటుతో అంగీకారం !
- కర్ణాటక మున్సిపల్ యాక్ట్ సవరణల ముసాయిదాకు సభ ఆమోదం - విపక్షాల ఆందోళనల మధ్యనే బిల్లుకు అంగీకారం - ముసాయిదా బిల్లును చించేసి వ్యతిరేకతను తెలియజేసిన విపక్షాలు సాక్షి, బెంగళూరు: బీబీఎంపీని మూడు విభాగాలుగా విభజించేందుకు అనువుగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కర్ణాటక మున్సిపల్ యాక్ట్ సవరణల ముసాయిదా బిల్లుకు శాసనసభలో మూజువాణి ఓటుతో అంగీకారం లభించింది. విపక్షాల తీవ్ర ఆందోళనల మధ్యనే ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసనను వ్యక్తం చేశాయి. ముసాయిదా బిల్లు ప్రతులను చించివేసిన బీజేపీ, జేడీఎస్ పార్టీల నేతలు స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేయక తప్పలేదు. అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం.... కర్ణాటక మున్సిపల్ యాక్ట్ సవరణల ముసాయిదా బిల్లు ఆమోదానికి గాను సోమవారం ఏర్పాటైన ప్రత్యేక శాసనసభ సమావేశం అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధానికి వేదికైంది. కర్ణాటక మున్సిపల్ యాక్ట్ సవరణల ముసాయిదా బిల్లును ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తరఫున రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర ఈ ముసాయిదా బిల్లును విధానసభలో ప్రవేశపెట్టారు. బెంగళూరు అభివృద్ధి కోసమంటూ ప్రత్యేక చట్టాలేవీ ఇప్పటి వరకు లేవని టి.బి.జయచంద్ర పేర్కొన్నారు. అందుకే ఇప్పటికే ఎన్నోసార్లు హైకోర్టుతో రాష్ట్ర ప్రభుత్వానికి ‘అక్షింతలు’ కూడా పడ్డాయని, అంతేకాక అంతర్జాతీయ స్థాయిలో ‘చెత్త నగరం’గా బెంగళూరు నగరం అపఖ్యాతిని మూటగట్టుకుందని అన్నా రు. అందుకే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం బీ.ఎస్ పాటిల్‌తో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ ఇచ్చిన మధ్యం తర నివేదిక మేరకు బీబీఎంపీని విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలి పారు. పాలికె పునఃరచన జరిగే వరకు బీబీఎంపీ పరిధిలోని నియామకాలు, పథకాలు, పన్నుల వసూళ్లు, ఆస్తిహక్కు ఇవన్నీ రాష్ట్ర ప్ర భుత్వ ఆధీనంలోనే ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం బీబీఎంపీలో ఉన్న ఉద్యోగులు, అధికారులు విభజన అనంతరం మహానగర పాలికెలో కొనసాగుతారని, ఇతర విషయా లు కొత్త పాలికె ఏర్పాటు అనంతరం చర్చించనున్నట్లు చెప్పారు. అయితే విపక్షాలు మాత్రం రాష్ట్ర ప్ర భుత్వ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డాయి. కేవ లం తమ అధికార దాహం కోసమే బీబీఎంపీని విభజించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని విపక్షాలు మండిపడ్డాయి. ఈ సందర్భంగా జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి మాట్లాడుతూ. కాంగ్రె స్ ప్రభుత్వం కేవలం తన ప్రయోజనాల కోసమే హడావుడిగా ఈ బిల్లును ప్రవేశపెట్టిందని విమర్శించారు. ‘అసలు బీబీఎంపీని ఎన్ని విభాగాలుగా విభజించాలనుకున్నారు? ఒక వేళ బీబీ ఎంపీని విభజిస్తే నగరంలోని చెత్త సమస్యను ఎవరికి అప్పగిస్తారు? డ్రెయినేజీ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు?’ అని ప్రభుత్వాన్ని ప్ర శ్నించారు. బీబీఎంపీని విభజిస్తే భవిష్యత్తులో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వ స్తుందని పేర్కొన్నారు. కేవలం తమ ప్రభుత్వ పరిధిలోనే బెంగళూరు అభివృద్ధి జరిగిందని కుమారస్వామి తెలిపారు. అనంతరం బీజేపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్.అశోక్ మాట్లాడుతూ....బెంగళూరు అఖండంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. బీబీఎంపీలో అవినీతి చో టు చేసుకొని ఉంటే ఈ విషయంపై విచారణ జరిపి, బాధ్యులను శిక్షిం చాలి తప్పితే బీబీఎంపీనే విభజించాలనడం ఎంత వరకు సమంజసమని అన్నారు. బీబీఎంపీ విభజనకు సంబంధించి ఏర్పాటు చేసిన బి.ఎస్.పాటిల్ నేతృత్వంలోని కమిటీ తుది నివేదికను ఇచ్చే వరకు ప్రభుత్వం వేచి చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా, సోమవారం రాత్రి విధానసభలో ఆమోదం పొందిన బిల్లు విధానపరిషత్‌కు చేరింది.ఇక బీబీఎంపీ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లులోని ముఖ్యాంశాలు.... - మరోసారి బెంగళూరు మహానగర పాలికె ఏర్పాటు - బృహత్ బెంగళూరులోని బృహత్ పదం రద్దు - బీబీఎంపీని మూడు విభాగాలుగా చేసే ఉద్దేశం - ప్రస్తుతం బీబీఎంపీలో ఉన్న 12 స్థాయీ సమితిలను రద్దు చేయడం, ఇంతకు ముందు బెంగళూరు మహానగర పాలికెలో ఉన్న విధంగా 4 సమితిల ఏర్పాటు - విభజన పూర్తయ్యే వరకు పాలనాధికారి ఆధ్వర్యంలోనే బీబీఎంపీ కార్యక్రమాలు -
నగరంలో చొరబాటు తగునా?
- గోరంట్ల తీరుపై టీడీపీ, బీజేపీల్లో నిరసన - రూరల్ నుంచి గెలిచాక సిటీలో ఆధిపత్యమేమిటంటున్న నేతలు సాక్షి, రాజమండ్రి : శాసనసభలో రాజమండ్రి నుంచి చాలా కాలం ప్రాతినిధ్యం వహించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. అనంతరం ఇక్కడి నుంచి వలస వెళ్లాల్సి వచ్చినా నగరంపై పెత్తనం తనదేనంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుంచి గెలిచినా నగరాధిపత్యం తనదేననడం అటు తెలుగుదేశంలోని నగర నాయకులకు, ఇటు సిటీ నియోజకవర్గంలో గెలుపు జెండా ఎగరేసిన మిత్రపక్షమైన బీజేపీ నేతలకు కొరుకుడు పడడం లేదు. రూరల్ ఎమ్మెల్యే అయినా సిటీలోనూ తనదే హవా అనడాన్ని వారు నిరసిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం తన నియోజక వర్గంలో తొలిసారిగా గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అదేరోజు సాయంత్రం రాజమండ్రి సిటీలోని తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేసి కార్పొరేటర్లను రప్పించుకున్నారు. ‘ఇక నుంచి ఇక్కడ, అక్కడ అంతా నా ఇష్టం. కాదంటే మీకే నష్టం’ అంటూ పరోక్షంగా హెచ్చరించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ సమావేశంలోనూ గోరంట్ల చేసిన వ్యాఖ్యలు వివాదాలకు తెరలేపేవిగా ఉన్నాయి. సిటీ ఎవడబ్బ సొత్తు కాదని, తాను పార్టీలో సీనియర్ గనుక అంటూ, అక్కడా ఇక్కడా తానే పర్యవేక్షిస్తానని స్వపక్షమైన టీడీపీలోని ప్రత్యర్థివర్గానికి, మిత్రపక్షమైన బీజేపీకి సవాలు విసిరినట్టు వ్యాఖ్యానించారు. గోరంట్ల తీరుతో బీజేపీ నేతలు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. గతంలోనూ అధికారిక కార్యక్రమాల్లో కూడా సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణకు పోటీగా గోరంట్ల పాల్గొనడాన్ని వారు నిరసించారు. ఈ నేపథ్యంలో గోరంట్ల తాజా వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో, ఆకుల వర్గీయుల్లో అసంతృప్తికి ఆజ్యం పోశాయి. ఇప్పటికే ‘మీ పార్టీ పరంగా మీరేమైనా చేసుకోండి. అధికారిక కార్యక్రమాల్లో మాత్రం హద్దులు గుర్తించండి’ అంటున్న బీజేపీ నేతలు గోరంట్ల కర్రపెత్తనంపై కన్నెర్ర చేస్తున్నారు. ‘బాబు’ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు : గన్ని కాగా రాజమండ్రి టీడీపీలో గోరంట్లతో చిరకాలంగా ఉప్పునిప్పులా ఉంటున్న మరో సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి గన్ని కృష్ణ.. రూరల్‌కు వెళ్లినా నగరం తన కనుసన్నల్లోనే ఉండాలన్న ఆయన వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సిటీలో ఇతర నేతలను ఎదగకుండా చేసేందుకే గోరంట్ల ఇటువంటి ధోరణి అవలంబిస్తున్నారని గన్ని వర్గీయులు ఆరోపిస్తున్నారు. సమావేశాల్లో సిటీ, రూరల్ నియోజక వర్గాల అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావించడం, తాను సీనియర్ నాయకుడినని, రెండు చోట్లా మాట్లాడే హక్కు తనకే ఉందని చెప్పుకోవడం అభ్యంతరకరమంటున్నారు. గోరంట్ల ‘నేనొక్కడినే’ అన్నట్టు.. కార్పొరేటర్లు, ఇతర నేతల వద్ద వ్యాఖ్యానించడం పట్ల గన్ని ఆగ్రహంగా ఉన్నారు. గోరంట్ల తీరుపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. శాసనమండలిలో ప్రభుత్వ విప్ చైతన్యరాజు శుక్రవారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి హాజరైన గన్ని కొందరు నేతలు ముందు టిక్కెట్ ఇవ్వలేదని, తర్వాత మంత్రి పదవి ఇవ్వలేదని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడినే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి గోరంట్ల హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. -
ఎన్కౌంటర్ చేయండి
అత్యాచారం ఘటనపై తీవ్రంగా స్పందించిన శాసనసభ దోషులను కఠినంగా శిక్షించాలని సభ్యుల డిమాండ్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని ఫ్రేజర్ టౌన్లో ఓ పీజీ విద్యార్థినిపై జరిగిన సామూహిక లైంగిక దాడి పట్ల బుధవారం శాసన సభ తీవ్రంగా స్పందించింది. దోషులను పట్టుకుని కఠిన శిక్ష పడేట్లు చూడాలని పార్టీల రహితంగా సభ్యులందరూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారిని పట్టుకుని కాల్చేయాలనే వాదనలు కూడా వినిపించాయి. సభ్య సమాజం తల దించుకునేలా ఉన్న ఈ సంఘటనకు కారకులైన వారు, ఎవరైనా సరే ఉపేక్షించ వద్దని సూచించారు. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఉప నాయకుడు, మాజీ హోం మంత్రి ఆర్. అశోక్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇతర బీజేపీ సభ్యులు కేజీ. బోపయ్య, విశ్వేశ్వర హెగ్డే కాగేరి, సీటీ. రవి, సునీల్ కుమార్, గోవింద కారజోళ ప్రభృతులు ఆయనకు మద్దతుగా నిలిచారు. అశోక్ మాట్లాడుతూ బెంగళూరు అపాయకరమైన నగరమనే అర్థం ధ్వనించే శీర్షికలతో పత్రికల్లో ఈ సంఘటన గురించి ప్రస్తావించారని తెలిపారు. యువతి ఇంటి ఎదుటే ఆమెను అపహరించుకుని పోవడం దారుణమైన విషయమని, ఇది సిగ్గుతో తల వంచుకునే అంశమని అన్నారు. పత్రికల్లో వచ్చే వార్తలను ప్రజలు విశ్వసిస్తారు కనుక ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. తాను హోం మంత్రిగా ఉన్నప్పుడు జ్ఞాన భారతిలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుందని గుర్తు చేస్తూ, నిందితులను గూండా చట్టం కింద అరెస్టు చేసినందున, ఇప్పటికీ వారు బయటకు రాలేక పోయారని తెలిపారు. కనుక ఈ సంఘటనలోనూ లైంగిక దాడికి పాల్పడిన వారిపై గూండా చట్టం కింద కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న స్పీకర్ కాగోడు తిమ్మప్ప కొందరు పోలీసు అధికారులు సంవత్సరాల తరబడి ఒకే చోట తిష్ట వేసుకుని కూర్చుని ఉన్నారని ఆరోపించారు. అలాంటి వారిని మొదట బదిలీ చేయాలని సూచించారు. లైంగిక దాడుల్లో పాల్గొంటున్న కొందరికి ‘గాడ్ ఫాదర్లు’ ఉన్నారని, అయినప్పటికీ అలాంటి వారిని ఉపేక్షించవద్దని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్వీ. దేశ్‌పాండే సమాధానమిస్తూ, తప్పు చేసిన వారు ఎవరైనా సరే, కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దర్యాప్తు సజావుగా సాగేలా చూస్తామని, ఈ సంఘటనను సీఎం, హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలను చేపడతామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ సభ్యుడు రమేశ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి గూండాలను ఎన్కౌంటర్ చేయాలని, రెండు, మూడు తలలు తెగి పడితే ఇలాంటి సంఘటనలు నిలిచి పోతాయని సూచించారు. రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల మెడల్లో గొలుసు దొంగతనాలు ఎక్కువైన సందర్భంలో అప్పటి హోం మంత్రి రాచయ్య ఎన్కౌంటర్లకు ఆదేశించారని గుర్తు చేశారు. ఇద్దరు, ముగ్గురు దొంగలు మరణించిన తర్వాత ఆ సంఘటనలు నిలిచిపోయాయని తెలిపారు. అప్పట్లో మంత్రి వర్గ సమావేశంలో ఓ మంత్రి ఎన్కౌంటర్లపై వ్యతిరేకత వ్యక్తం చేసినప్పుడు ‘నువ్వు కూడా ఎన్‌కౌంటరై పోతావు’ అని రాచయ్య హెచ్చరించారని గుర్తు చేస్తూ, ఇప్పుడు కూడా హోం మంత్రి అదే విధమైన పట్టుదలను ప్రదర్శించి, దోషులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ఎన్కౌంటర్ చేయండి స్పీకర్ ఈ దశలో మాట్లాడుతూ ప్రస్తుతం పోలీసు శాఖ అంటేనే ‘క్యాష్ అండ్ కాస్ట్’గా మారిపోయిందని విమర్శించారు. గూండాలను అంతమొందించడానికి రేపటి నుంచే ఎన్కౌంటర్లను ప్రారంభించండని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఆ యువతిపై జరిగిన దౌర్జన్యం నా బిడ్డపై జరిగి ఉంటే ఆ బాధ... చెప్పలేము అంటూ వాపోయారు. బీజేపీ మహిళా సభ్యురాలు శశికళ జొల్లే తదితరులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. -
నవశకం
- శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన ‘పశ్చిమ’ ఎమ్మెల్యేలు - ఇక జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తామని వెల్లడి - స్థానిక సంస్థల విజేతల పదవీ స్వీకారానికి మార్గం సుమగం - గాడిన పడనున్న పాలన సాక్షి, ఏలూరు : నవశకం మొదలైంది. కొత్త రా ష్ట్రంలో కొత్త పాలకవర్గం కొలువుదీరింది. జిల్లాకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర అసెంబ్లీ హాల్లో గురువారం ప్రమా ణ స్వీకారం చేశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు(బీజేపీ), చింతలపూడి ఎమ్మెల్యే, స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత, ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు (బుజ్జి), దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్, గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు, పోలవ రం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఉండి ఎమ్మెల్యే కలవపూడి శివ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై వెంటనే దృష్టి సారించనున్నట్టు వీరంతా ముక్తకంఠంతో చెప్పారు. ఇక వీళ్ల వంతు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మునిసిపల్ చైర్మన్లు, నగర మేయర్ పదవీ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుమగమైంది. వీరంతా బాధ్యతలు చేపడితే ఎన్నో ఏళ్లుగా కుంటుపడిన జిల్లా అభివృద్ధి గాడిన పడుతుందని ప్రజలు ఆశపడుతున్నారు. 2010 సెప్టెంబర్‌తో పాలకవర్గం గడువు ముగిసిన ఏలూరు నగరపాలక, నిడదవోలు, కొవ్వూ రు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం పురపాలక సంఘాలు, కొత్తగా ఏర్పడిన జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకి మార్చి 30న ఎన్నికలు జరిగాయి. జిల్లాలోని 865 ఎంపీటీసీ, 46 జెడ్పీటీసీ స్థానాలకు రెండు విడతలుగా ఏప్రిల్ 6, 11 తేదీల్లో పోలింగ్ నిర్వహించారు. మే 12న పురపాలక, 13న పరిషత్ ఫలితాలు వెలువడ్డాయి. నెలలు గడుస్తున్నా పాలకవర్గాలు పగ్గాలు చేపట్టలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గెలిచిన అభ్యర్థులు పదవులు చేపట్టకుండా నెలల తరబడి ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. స్థానిక సంస్థలు దాదాపు మూడేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉండిపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు విడుదల కాలేదు. ఈ పరిస్థితుల్లో పాలన గాడినపడే రోజు కోసం ప్రజలు, పదవి చేపట్టే సమయం కోసం గెలిచిన అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. మునిసిపల్, నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 2న చేపట్టి ఫలితాలను ప్రకటించారు. 7న మేయర్, డెప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక చేపట్టాలని మందుగా నిర్ణయించారు. మునిసిపల్ కౌన్సిల్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరి ఓటు అత్యంత కీలకం అవుతుంది. గత శాసనసభ రద్దు కావడంతో కొత్త సభ్యులు వస్తే తప్ప మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో పాలకవర్గాలు కొలువుదీరే అవకాశం లేకుండా పోరుుంది. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయడంతో స్థానిక సంస్థలకు పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టేందుకు మార్గం ఏర్పడింది. గాడిన పడనున్న పాలన పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాలకు సైతం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. మూడేళ్లుగా మండలాలకు నిధులు విడుదలకాకపోవడంతో గ్రామాల్లో అనేక సమస్యలు తిష్టవేశాయి. పాలకవర్గం ఏర్పడితే జనాభా ప్రాతిపదికన ప్రతి మండలానికి సాధారణ నిధులు రూ.40 లక్షల వరకూ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆరు నెలలకు ఒకసారి ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో 75శాతం వాటా, రాష్ట్ర ప్రభుత్వ పన్నుల్లో 25 శాతం వాటా నిధులను గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించుకోవచ్చు. ఇదిలావుండగా ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించే అవకాశం ఏర్పడింది. శాసనసభ సమావేశాలు ముగియగానే జిల్లాకు రానున్న ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్షలు జరపనున్నారు. ముందుగా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించనున్నారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జిల్లాకు రావాల్సిన నిధులు త్వరితగతిన తీసుకురావాలని భావిస్తున్నారు. -
శాసనసభలో ప్రభుత్వం ప్రకటన ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు
- ఇతర మైనారిటీలకు వర్తింపు : - మంత్రి ఫౌజియాఖాన్ వెల్లడి ముంబై: ముస్లింలతోపాటు రాష్ట్రంలోని మైనారిటీలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం శాసనసభలో బుధవారం ప్రకటించింది. బాషాపరమైన మైనారిటీ విద్యాసంస్థలను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనిసభ అభిప్రాయపడింది. మైనారిటీలకు విద్యా అవకాశాల కల్పనపై ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై చర్చ సందర్భంగా స్పీకర్ దిలీప్ వల్సేపాటిల్పై సూచన చేశారు. దీనికి ఇతర సభ్యులంతా మద్దతు పలికారు. ‘మతపరమైన మైనారిటీలేగాక భాషాపరమైన మైనారిటీలూ ఎందరో ఉన్నారు. వీరిలో చాలా మంది సంపన్నులు. సొంతగా విద్యాసంస్థలూ ఉన్నా, పేద, అణగారినవర్గాల వారికి అడ్మిషన్లు ఇవ్వడం లేదు’ అని స్పీకర్ అన్నారు. సభలో విపక్ష నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే ఈ అభిప్రాయాన్ని సమర్థించారు. పేదలకు అడ్మిషన్లు నిరాకరించే విద్యాసంస్థలను వదిలిపెట్టకూడదని స్పష్టీకరించారు. పరిశ్రమలశాఖ మంత్రి నారాయణ్ రాణే స్పందిస్తూ భాషాపర మైనారిటీల అడ్మిషన్లపై కేబినెట్ సమావేశంలో చర్చించి, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. సావధాన తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ పటేల్ మాట్లడుతూ ముస్లింలకు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి ఫౌజియా ఖాన్ దీనిపై వివరణ ఇస్తూ త్వరలోనే రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మైనారిటీ విద్యాసంస్థల్లో బోధన, సదుపాయాలను మెరుగుపర్చాలని పటేల్ కోరారు. ఈ ప్రతిపాదనపై చర్చ నడుస్తోందని ఫౌజియా అన్నారు. అంతేగాక ముస్లింలతో పాటు సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలూ మైనారిటీలేనని ఆమె వివరణ ఇచ్చారు. మైనారిటీల సంక్షేమ నిధి పెంపు మైనారిటీల సంక్షేమ కోసం కేటాయించిన నిధులను రూ.362 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయింపులపై సభలో బుధవారం చర్చ నడిచినప్పుడు, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ ప్రకటన చేశారు. ఫిబ్రవరిలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్లో రూ.280 కోట్లు, ఇటీవలి బడ్జెట్లో రూ.82 కోట్లు కేటాయించామన్నారు. దీనిని ఈ ఏడాది రూ.500 కోట్లకు పెంచుతామన్నారు. మహిళల భద్రతపై రాజీ లేదు : పాటిల్ మహిళల భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా వైర్లెస్ కార్ల సేవలను వినియోగించుకుంటామని హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ సభలో బుధవారం ప్రకటించారు. వీటిని కేవలం మహిళల రక్షణ కోసమే ఉపయోగిస్తారని చెప్పారు. శాఖలకు బడ్జెట్ కేటాయింపులపై సభలో నడిచిన చర్చలో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు. దళితులు, మైనారిటీలు, మహిళలు, వయోధికులు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. హోంశాఖకు బడ్జెట్ కేటాయింపులు రూ.13,342 కోట్లు కాగా, వాటిలో రూ.150 కోట్లు సీసీటీవీల ప్రాజెక్టుకు, రూ.440 కోట్లు పోలీసుశాఖ ఆధునీకరణకు కేటాయిస్తామని పాటిల్ ప్రకటించారు.