
సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతిలో మహిళలది విశిష్ట స్థానమని, వారికి మన సమాజంలో ఇస్తున్న గౌరవం, స్వేచ్ఛ మరింత పెరగాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం శాసనసభలోని తన చాంబర్‌లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు ధనసరి సీతక్క, బానోతు హరిప్రియ, పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, కల్వకుంట్ల కవితలను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర కీలకమన్నారు. వారి భాగస్వామ్యం ఉన్న కుటుంబాలే అందులో రాణిస్తాయని వెల్లడించారు.